‘‘మీ మూడు స్వరూపాలు సదా స్మృతిలో ఉండాలి - 1. సంగమయుగి బ్రాహ్మణ్ 2. బ్రాహ్మణ్ నుండి ఫరిశ్తా మరియు 3. ఫరిశ్తా నుండి దేవత’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క మూడు రూపాలను చూస్తున్నారు. అన్నింటికన్నా శ్రేష్ఠమైన స్వరూపము బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ నుండి ఫరిశ్తా మరియు ఫరిశ్తా నుండి దేవత. బ్రాహ్మణ స్వరూపము, ఫరిశ్తా స్వరూపము మరియు దేవతా స్వరూపము. బ్రాహ్మణ స్వరూపము యొక్క విశేషత అనేది సర్వశక్తులతో కూడిన సంపన్న స్వరూపానికి చెందినది ఎందుకంటే బ్రాహ్మణ్ అనగా మాయాజీత్. కనుక సర్వ శక్తి సంపన్నంగా అవ్వడమే మాయాజీత్గా అవ్వడము. మొదటి స్వరూపము బ్రాహ్మణ్. బ్రాహ్మణ స్వరూపము యొక్క విశేషత అయిన సర్వ శక్తులు ధారణ అయ్యాయా అని స్వయాన్ని చూసుకోండి? సర్వ శక్తులూ ఉన్నాయా లేక కొన్ని-కొన్ని శక్తులే ఉన్నాయా? ఒకవేళ ఒక్క శక్తి బలహీనంగా ఉన్నా లేక తక్కువగా ఉన్నా బ్రాహ్మణ స్వరూపానికి బదులుగా పదే-పదే క్షత్రియులుగా అనగా యుద్ధము చేసేవారిగా అయిపోతారు. క్షత్రియుల కర్తవ్యము యుద్ధము చెయ్యటము మరియు బ్రాహ్మణుల కర్తవ్యము సదా మరియు సహజంగా మయాజీతులుగా అవ్వడము. బ్రాహ్మణ్ అనగా విజయీ, సదా సర్వ శక్తులతో అనగా సర్వ శస్త్రాలతో సంపన్నులు. క్షత్రియులు అనగా ఒక్కోసారి విజయీ మరియు ఒక్కోసారి ఓడిపోయేవారు ఎందుకంటే వారు శక్తులు లభించినా కూడా ధారణ చేయలేకపోతారు, అందుకే సమయము మరియు పరిస్థితి అనుసారంగా సదా విజయీగా అవ్వలేకపోతారు. బ్రాహ్మణ స్వరూపము అనగా సదా కిరీటము, సింహాసనము మరియు తిలకధారి. విశ్వ కళ్యాణ బాధ్యత యొక్క కిరీటధారి, సదా స్వతహా స్మృతి యొక్క తిలకధారి, సదా తండ్రి హృదయ సింహాసనాధికారి. క్షత్రియులు ఏకరసంగా, అచలంగా, స్థిరంగా లేని కారణంగా ఒక్కోసారి అచలంగా మరియు ఒక్కోసారి అలజడిగా ఉంటారు, ఒక్కోసారి అధికారులుగా మరియు ఒక్కోసారి తండ్రి నుండి శక్తిని యాచించే రాయల్ బికారులుగా ఉంటారు. బ్రాహ్మణ్ అనగా సదా అలౌకిక ఆనందము కల జీవితంలో ఉండేవారు, సదా ఆత్మిక స్వభావము మరియు ముఖము కలవారు. క్షత్రియులు అనగా ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉంటారు. కనుక నేను ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కోసారి బ్రాహ్మణులుగా, ఒక్కోసారి క్షత్రియులుగా ఉంటారా లేక సదా బ్రాహ్మణ జీవితపు విశేషతలతో సంపన్నంగా ఉంటారా? లక్ష్యమేమో బ్రాహ్మణ జీవితము కానీ ఒక్కోసారి బ్రాహ్మణులు, ఒక్కోసారి క్షత్రియులు అనేటువంటి లక్షణాలైతే లేవు కదా? లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉన్నాయా లేక వ్యత్యాసము ఉందా? మాటలు మరియు కర్మలు సమానంగా ఉన్నాయా లేక వ్యత్యాసము ఉందా? అందరూ బ్రహ్మాకుమార్-కుమారీలు అనే పిలువబడతారు కదా? లేక క్షత్రియులుగా పిలువబడతారా? చంద్రవంశీయులుగా పిలువబడడము కూడా ఇష్టపడరు కదా? ఎవరైనా, మీరు చంద్రవంశీయులు అని అంటే ఇష్టమనిపిస్తుందా? ఇష్టమనిపించదు. మరి కర్మలు ఎలా ఉన్నాయి? ఏ సమయంలోనైతే యుద్ధము చేస్తూ ఉంటారో, ఆ సమయంలోని మీ ఫోటోను తీసుకోండి. ఫోటో తీసుకోవాలి అన్న కోరిక చాలా ఉంటుంది కదా? మరి మీ ఫోటో తీసుకోవటము వస్తుందా లేక ఇతరుల ఫోటో తియ్యటము వస్తుందా? కనుక నేను ఎవరిని అని మీ ఫోటో తీసుకోండి. ఒకవేళ ఫోటో కూడా ఎవరిదైనా మంచిగా రాకపోతే ఇష్టపడరు కదా? కనుక మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు, ఎప్పుడెప్పుడు బ్రాహ్మణులకు బదులుగా క్షత్రియులుగా అవుతున్నారు - ఇది చెక్ చేసుకోండి మరియు చెక్ చేసుకుని ఛేంజ్ చేసుకోండి. కేవలము చెక్ చేసుకోవటము మాత్రమే కాదు. ఛేంజ్ చేసుకోవడము కోసమే చెక్ చేసుకోవటము జరుగుతుంది. మరి అందరి వద్ద పరివర్తనా శక్తి ఉందా? లేక ఎవరి వద్దనైనా లేదా? అందరి వద్దా ఉంది అన్నదైతే చాలా సంతోషించాల్సిన విషయము. ఇప్పుడు సమయానికి దానిని ఉపయోగించడం వస్తుందా లేక ఒక్కోసారి ఉపయోగపడదా? ఎందుకంటే శక్తి ఉంది అంటే అది సమయానికి ఉపయోగపడాలి. శత్రువు లేనే లేనప్పుడు నా వద్ద శస్త్రాలు చాలా గొప్పవున్నాయి మరియు శత్రువు వచ్చినప్పుడు శస్త్రాలు ఉపయోగపడనే ఉపయోగపడవు, అటువంటివారిని శక్తిశాలి అంటారా? నా వద్ద శక్తి ఉందా అని కేవలం ఇది మాత్రమే చెక్ చేసుకోకండి కానీ కర్మలలో సమయం అనుసారంగా ఏ శక్తి కావాలో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించడం వస్తుందా? లేకపోతే శత్రువు దాడి చేసిన తరువాత శక్తి గుర్తొస్తుందా? కనుక బ్రాహ్మణ జీవితపు విశేషతలను చెక్ చేసుకోండి. బ్రాహ్మణ్ నుండి ఫరిశ్తాగా అవుతారు, క్షత్రియ నుండి ఫరిశ్తాగా కాదు. రెండవ స్వరూపము ఫరిశ్తా. అందరూ ఫరిశ్తాగా అవ్వాల్సిందే కదా? లేక ఫరిశ్తాగా అవ్వడము కష్టమా? సహజమా లేక కష్టమా? లేక ఒక్కోసారి కష్టము, ఒక్కోసారి సహజమా? ఫరిశ్తా అనగా డబల్ లైట్ అని ఫరిశ్తా స్వరూపపు విశేషత గురించి అందరికీ తెలుసు కూడా కదా. మరి డబల్ లైట్‌గా ఉన్నారా? లేక ఒక్కోసారి బరువు ఎత్తాలని మనసుకు అనిపించి ఎత్తేస్తారా? లేక ఎత్తాలని అనుకోరు కానీ మాయ తలపై తట్ట పెట్టేస్తుందా? మాయ తన ఆర్టిఫిషియల్ టెంపరరీ శక్తిని ఎలా చూపిస్తుందంటే దాని వలన - ఎవరైనా బరువు ఎత్తాలని అనుకోకపోయినా కానీ బలవంతాన ఎత్తుతారు ఎందుకంటే బలహీనులు సదా పరాధీనులుగా ఉంటారు. మరి మాయ కూడా పరాధీనులుగా చేసేస్తుంది. అధికారీతనాన్ని మర్చిపోతారు మరియు ఆధీనులుగా అయిపోతారు. ఆ సమయములో భాష ఎలా ఉంటుంది? అనుకోలేదు కానీ ‘ఏమో తెలియదు’... ప్రతి విషయంలో ‘ఏమో తెలియదు’, ‘ఏమో తెలియదు’ అని అంటూ ఉంటారు. అధికారి అనగా సదా స్వతంత్రులు మరియు ఆధీనులు అనగా సదా పరవశులు. అయితే పరవశులు ఎప్పుడూ ఆనందకరమైన జీవితంలో ఉండలేరు. బ్రాహ్మణ్ అనగా ఆనందకరమైన జీవితము. ఒకవేళ ఏ సమయంలోనైనా ఇదేమిటి, ఇదెలా, ఇలానే జరుగుతుందా ఏమిటి... అని ఆనందపడటానికి బదులుగా తికమక చెందినట్లయితే అది ఆనందము కాదు, అది తికమకపడే జీవితము. ఒకవేళ ఏ సమయంలోనైనా ఆనందంలో లోటును అనుభవం చేసినట్లయితే మళ్ళీ ఈ మొదటి పాఠాన్ని గుర్తు చేసుకోండి - నేను ఎవరిని? కేవలం ఆత్మను అని కాదు, కానీ నేను ఎటువంటి ఆత్మను? దీనికి ఎన్ని సమాధానాలు వస్తాయి? పెద్ద లిస్ట్ ఉంది కదా! ప్రతి రోజూ మురళిలో ‘నేను ఎవరిని’ అన్నదాని గురించి రకరకాల పాఠాలను చదువుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు.
కనుక ఫరిశ్తా అనగా డబల్ లైట్. లైట్ అనగా తేలికదనము. తేలికదనము అంటే అర్థము కేవలం పరిస్థితి వచ్చిన సమయంలో తేలికగా ఉండటము కాదు కానీ మొత్తం రోజంతటిలో స్వభావము, సంస్కారాలు, సంబంధ-సంపర్కాలలో లైట్‌గా ఉన్నారా? మామూలుగా బాగానే ఉండవచ్చు కానీ స్వభావ-సంస్కారాలలో కూడా ఒకవేళ తేలికదనము లేకపోతే ఫరిశ్తా అంటారా? తేలికదనానికి గుర్తు ఏమిటంటే - తేలికైన వస్తువు అందరికీ ప్రియమనిపిస్తుంది. ఏదైనా బరువైన వస్తువును మీకు ఇచ్చినట్లయితే ఇష్టపడతారా? అదే తేలికైన మంచి వస్తువును ఇచ్చినట్లయితే ఇష్టపడతారు కదా? కనుక ఎవరైతే స్వభావ-సంస్కారాలు, సంబంధ-సంపర్కాలలో తేలికగా ఉంటారో వారి గుర్తు ఏమిటంటే - వారు సర్వులకు ప్రియంగా మరియు అతీతంగా ఉంటారు ఎందుకంటే వారిది బ్రాహ్మణ స్వభావము, వేరే స్వభావము కాదు. బ్రాహ్మణ్ అనగా అందరి మనసుకు ఇష్టమైన స్వభావ-సంస్కారాలు మరియు సంబంధ-సంపర్కాలు కలవారు. మెజారిటీ 95 శాతం మందికి మనసుకు ఇష్టమైనవారిగా తప్పకుండా ఉండాలి, ఈ మాత్రం రిజల్టు తప్పకుండా ఉండాలి. ఇప్పటికీ 5 శాతం మార్జిన్ ఇస్తున్నాము, ఇది చివరి వరకు కాదు కానీ ప్రస్తుతానికి ఇస్తున్నాము. 95 శాతం అందరికీ ఇష్టమైనవారిగా ఉండాలి అనగా అందరితో తేలికగా ఉండాలి మరియు ఆ తేలికదనము మాటలు, కర్మలు మరియు వృత్తి ద్వారా అనుభవమవ్వాలి. నేనైతే తేలికగానే ఉన్నాను కానీ ఇతరులు నన్ను అర్థం చేసుకోరు, గుర్తించరు అని అనడం కాదు. ఒకవేళ వారు గుర్తించకపోతే, మీరు మీ విల్ పవర్ ద్వారా వారు గుర్తించేలా చేయండి. మీ కర్మలు, వృత్తి వారిని పరివర్తన చెయ్యాలి. ఇక్కడ పరివర్తన చేయడానికి సహనశక్తి యొక్క అవసరం ఉంటుంది. ఫరిశ్తా అనగా పాత దేహము మరియు పాత ప్రపంచంతో సంబంధం లేనివారు. ఇది అందరికీ గుర్తుంది కదా? లేక ఇప్పటికీ అది మిగిలి ఉందా? పాత దేహం పట్ల మోహం ఉందా? దేహ సంబంధాల నుండి తేలికగా అయ్యారా లేక అవ్వలేదా? పెదనాన్న, చిన్నాన్న, మామయ్య - వీరి నుండి అతీతంగా అయిపోయారు కదా? లేక ఇప్పటికీ ఆ సంబంధాలు ఉన్నాయా? అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారా? ప్రియంగా ఉంటారు కానీ అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వడము - ఇందులో పొరపాటు జరుగుతుంది. ఇది మిస్ అవుతుంది. అయితే అతీతంగా అవ్వడము సహజమనిపిస్తుంది లేదా ప్రియంగా అవ్వడము సహజమనిపిస్తుంది. కానీ ఈ దేహపు సంబంధాలు పెదనాన్న, చిన్నాన్న, మామయ్య - వీటి నుండి అతీతంగా అవ్వడము ఎంతైనా సహజమే. సహజమేనా లేక స్వప్నంలోకి, సంకల్పంలోకి కొద్ది-కొద్దిగా వస్తాయా? బ్రాహ్మణ పరివారంలో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు చిన్నాన్న, పెదనాన్న, మామయ్యలు గుర్తుకొస్తారా? పరిస్థితుల సమయంలో చాలామంది ఆత్మలకు బ్రాహ్మణ పరివారానికి బదులుగా లౌకిక సంబంధాలు త్వరగా గుర్తుకొస్తాయి అన్నది బాప్‌దాదా చూసారు. పరిస్థితి అనేది పక్కన పెట్టినవాటిని ఒక ఆధారంగా అనుభవమయ్యేలా చేస్తుంది. మీరు మరజీవాగా అయ్యారు, అయినా గత జన్మలోని సంబంధాలైన పెదనాన్న, చిన్నాన్న, తల్లి, తండ్రి గుర్తున్నారా? స్వప్నాలలో కూడా వస్తూ ఉంటారా? కావున సంబంధాలు, జన్మ మారిపోయాయి కదా. కనుక ఫరిశ్తా అనగా పాతవాటితో సంబంధం లేకుండా ఉండటము, ఈ నిర్వచనమే చెప్తూ ఉంటారు కదా? మరి మళ్ళీ సమయానికి ఎక్కడి నుండి బయటకొస్తున్నాయి? తెగిపోయిన సంబంధము జోడించబడుతుందా? చనిపోయినవారి నుండి మళ్ళీ బ్రతికున్నవారిగా అవుతారా? ఫరిశ్తా అనగా పాతదానితో సంబంధం లేకుండా ఉండటము, అంతా క్రొత్తగా ఉండడము. బాప్‌దాదా చూసారు - ఫరిశ్తాగా అవ్వటంలో ఆటంకము ఏదైతే వస్తుందో దానికి కారణమైన మొదటి మెట్టు దేహ భానాన్ని వదలాలి, రెండవ మెట్టు ఇంకా సూక్ష్మమైనది, అదేమిటంటే దేహాభిమానాన్ని వదలాలి. దేహ భానము మరియు దేహాభిమానము. దేహ భానము ఎంతైనా మామూలు విషయమే కానీ ఎంతగా జ్ఞాన స్వరూప ఆత్మగా, యోగ స్వరూప ఆత్మగా అవుతారో అంతగా దేహాభిమానం ఆటంకము వేస్తుంది. అభిమానము అనేది అనేక రకాలుగా వస్తుంది - తమ బుద్ధి యొక్క అభిమానము, తమ శ్రేష్ఠ సంస్కారాల అభిమానము, తమ మంచి స్వభావము యొక్క అభిమానము, తమ విశేషతల అభిమానము, తమలోని ఏదైనా విశేష కళను గురించిన అభిమానము, తమ సేవా సఫలత యొక్క అభిమానము. ఈ సూక్ష్మ అభిమానము దేహ భానము కన్నా కూడా చాలా సూక్ష్మమైనది. అభిమానం వచ్చేందుకు ద్వారమైతే తెలుసు కదా? మైపన్, మేరాపన్ (నేను, నాది అన్న భావన) ఇవి అభిమానము వచ్చేందుకు ద్వారాలు. కనుక ఫరిశ్తా అంటే కేవలం దేహ భానము మరియు దేహ ఆకర్షణ నుండి దూరమవ్వటము లేక దేహం యొక్క స్థూల సంబంధాల నుండి దూరమవ్వటము అని అర్థము కాదు, ఫరిశ్తా అనగా దేహానికి చెందిన సూక్ష్మ అభిమానము యొక్క సంబంధము నుండి కూడా అతీతమవ్వటము. అభిమానానికి గుర్తు ఏమిటంటే - ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ అవమానాన్ని కూడా త్వరగా ఫీల్ అవుతారు. ఎక్కడైతే అభిమానము ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ కూడా చాలా త్వరగా వస్తుంది ఎందుకంటే ‘నేను’ మరియు ‘నాది’ అనే తలుపులు తెరిచి ఉంటాయి. ఫరిశ్తా యొక్క యథార్థ స్వరూపము - దేహ భానము మరియు దేహ సంబంధాల నుండి, దేహ-అభిమానము నుండి అతీతంగా ఉండటము. ఒకవేళ ఏదైనా గుణము లేక శక్తి ఉంటే దాతను ఎందుకు మర్చిపోతారు? రెండవ విషయము, దీని నుండి సహజంగా అతీతంగా అయ్యేందుకు మార్గము లేక విధి చాలా సహజమైనది, అది ఒకే పదము. ఒక్క పదంలో ఎంతటి శక్తి ఉందంటే దాని ద్వారా దేహ-అభిమానము మరియు దేహ-భానము సదా కాలం కొరకు సమాప్తమైపోతాయి. ఆ ఒక్క పదము ఏమిటి? కరన్-కరావనహార్ (చేసేవారు-చేయించేవారు) అయిన తండ్రి చేయిస్తున్నారు. ‘చేసేవారు-చేయించేవారు’ అన్న పదము భానాన్ని మరియు అభిమానాన్ని, ఈ రెండింటినీ తొలగించివేస్తుంది. ఒకే ఒక్క పదాన్ని గుర్తుంచుకోవటమైతే సహజం కదా? మిగిలిన పాయింట్లు అన్నింటినీ మర్చిపోయినా ఫర్వాలేదు, నిజానికి మర్చిపోకూడదు కానీ ఒకవేళ మర్చిపోయినా కూడా ఒక్క పదాన్ని అయితే గుర్తు చేసుకోగలరు కదా? చేసేవారు-చేయించేవారు బాబా. కనుక చూడండి, ఫరిశ్తా జీవితం యొక్క అనుభవము ఎంత సహజంగా అవుతుంది! బ్రహ్మాబాబా ఏ ఆధారంగా ఫరిశ్తాగా అయ్యారు? సదా చేసేవారు-చేయించేవారి స్మృతితో సమర్థంగా అయ్యి ఫరిశ్తాగా అయ్యారు. తండ్రిని ఫాలో చేయాలి కదా? లేక మాయను ఫాలో చేయాలా? అప్పుడప్పుడు మాయ కూడా తల్లిగా, తండ్రిగా అవుతుంది, చాలా మంచి పాలనను మరియు ప్రాప్తిని చేయిస్తుంది. కానీ అవన్నీ మోసం చేసే ప్రాప్తులు. మొదట ప్రాప్తి, ఆ తర్వాత మోసము. పరిశీలించే శక్తి అయితే ఉంది కదా? అది మాయనా లేక బాబానా అన్నదానిని సరైన సమయంలో పరిశీలించాలి. మోసపోయిన తరువాత పరిశీలించటము, అదేమీ తెలివి కాదు. మోసపోయిన తర్వాత అయితే అందరూ అర్థం చేసుకుంటారు కానీ జ్ఞాన స్వరూప ఆత్మ ముందుగానే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారు. కనుక ఫరిశ్తా అని ఎవరిని అంటారో అర్థమైందా?
మూడవది ఫరిశ్తా నుండి దేవత. దేవతగా ఇప్పుడు అవ్వాలా లేక భవిష్యత్తులో అవుతారా? దేవత అనగా సర్వ గుణాలతో అలంకరించబడి ఉండటము. ఈ దివ్య గుణాలు అనేవి సంగమయుగ దేవతా జీవితం యొక్క అలంకారాలు. ఈ సమయంలో దివ్య గుణాలతో అలంకరించబడి ఉంటారు కావుననే భవిష్యత్తులో స్థూల అలంకారాలతో అలంకరించబడి ఉంటారు. కనుక దేవత అనగా దివ్య గుణాలతో అలంకరించబడి ఉండటము, మరియు రెండవది దేవత అనగా ఇచ్చేవారు. తీసుకునేవారు కారు, కానీ ఇచ్చేవారు. మరి మాస్టర్ దాతలేనా? లేక ఒక్కోసారి తీసుకునేవారిగా, ఒక్కోసారి ఇచ్చేవారిగా ఉంటారా? దివ్య గుణాలతో కూడిన అలంకారాలు సదా ఉంటాయా లేక ఒకసారి ఒక అలంకారాన్ని మర్చిపోతున్నారు మరియు మరోసారి మరో అలంకారాన్ని మర్చిపోతున్నారా, ఇది చెక్ చేసుకోండి. సంపూర్ణ సర్వ గుణ సంపన్నము... ఇదే దేవతా జీవితానికి గుర్తు. ఈ గుణాలే ఆభరణాలు. కనుక బ్రాహ్మణ స్వరూపపు సర్వ శక్తులు, ఫరిశ్తా స్వరూపపు డబల్ లైట్ స్థితి మరియు దేవతా స్వరూపానికి చెందిన దాతాతనము యొక్క గుర్తులు మరియు దివ్య గుణాల సంపన్నులుగా అయ్యారా అన్నదానిని చూసుకోండి. మూడు స్వరూపాలను అనుభవం చేస్తారా? ఏ విధంగానైతే బాబాతో ఉన్న మూడు సంబంధాలు తండ్రి, శిక్షకుడు, సద్గురువు అన్నవి సదా గుర్తుంటాయో, అలాగే ఈ మూడు స్వరూపాలను సదా గుర్తుంచుకోండి. అర్థమైందా? అలా తయారవ్వాల్సింది మీరేనా లేక మరెవరైనా వచ్చేది ఉందా? మీరే అలా తయారవ్వాలి కదా? ఈ రోజు బ్రాహ్మణ్, రేపు ఫరిశ్తా మరియు ఆ తరువాత దేవత. మీ ఫరిశ్తా స్వరూపాన్ని జ్ఞానమనే దర్పణంలో చూసుకోండి. ఫరిశ్తాలు సదా ఎగురుతూ ఉంటారు మరియు సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఫరిశ్తా వస్తుంది, సందేశం ఇస్తుంది మరియు ఎగిరిపోతుంది... మరి ఆ ఫరిశ్తాలు ఎవరు? మీరే కదా? మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము మరియు మేమే అలా ఉంటాము అని నషాతో చెప్పండి. పక్కా కదా? వీరినే నిశ్చయబుద్ధి విజయీ అని అంటాము. మీరు క్షత్రియులా లేక విజయులా? ఎవరో కొందరు క్షత్రియులుగా అవుతారు కదా? అలా వేరేవారు అవుతారా! మరి మీరు బ్రాహ్మణులు. నడుస్తూ-నడుస్తూ అప్పుడప్పుడు క్షత్రియులుగా అవ్వకండి. ఒకవేళ పదే-పదే క్షత్రియులుగా అవుతూ ఉంటే, యుద్ధము చేస్తూ ఉంటే, ఆ యుద్ధ సంస్కారాలను తీసుకువెళ్ళేవారు ఎక్కడికి చేరుకుంటారు? చంద్రవంశములోకా లేక సూర్యవంశములోకా? మరి చంద్రవంశీయులుగా అవ్వటమైతే ఇష్టం లేదు కదా, లేక ఒక్కోసారి అలా అయినా కూడా ఫర్వాలేదా? మరి అందరూ ఎవరు? బ్రాహ్మణులేనా? పక్కా బ్రాహ్మణులా లేక కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉన్నారా? శక్తులు పక్కాగా ఉన్నారా? పాండవులు పక్కాగా ఉన్నారా? ఒకవేళ పక్కాగా ఉన్నట్లయితే సదా శుభ సమాచారముల ఉత్తరాలు రావాలి. మాయ వచ్చేసింది, ఇదైపోయింది, ఏమైందో, ఎలా అయ్యిందో తెలియదు - ఇది సంకల్పంలో కూడా ఉండకూడదు. తండ్రి అయితే ఇది స్వప్నమాత్రంగా కూడా ఉండకూడదు అని అంటారు. స్వప్నంలో కూడా ఎందుకు, ఏమిటి అనేవి ఉండకూడదు, ఇంత పక్కాగా ఉన్నారా? శక్తులు మహా పక్కాగా ఉన్నారా? పాండవులు పక్కాగా ఉంటే మేము మహా పక్కాగా ఉన్నాము అని శక్తులు చెప్పండి ఎందుకంటే శక్తులనే నిమిత్తంగా చేసాము. మరి నిమిత్తమైనవారే కచ్చా-పక్కాగా ఉన్నట్లయితే ఇక ఇతరుల పరిస్థితి ఏమిటి! పాండవులు బ్యాక్ బోన్ (వెన్నెముక). బ్యాక్ బోన్‌గా అవ్వడము మంచిగా అనిపిస్తుంది కదా? లేక ఎదుర్కోవటము మంచిగా అనిపిస్తుందా? బ్యాక్ బోన్‌గా అవ్వడము మంచిది, చాలా సురక్షితంగా ఉంటారు, లేదంటే దెబ్బలు తింటారు. అచ్ఛా!
అందరూ తమ స్వీట్ హోమ్‌కు చేరుకున్నారు. వెళ్ళాలి, వెళ్ళాలి అనే సంకల్పం ఉండేది, ఇప్పుడు ఏ సంకల్పం ఉంది? ఇప్పుడు కూడా వెళ్ళాలి కదా? సేవ కోసం వెళ్తున్నారు, అందుకే చాలా సంతోషంగా వెళ్తారు. సేవకు వెళ్తారా లేక దుకాణానికి వెళ్తారా, ఇంటికి వెళ్తారా, ఆఫీసుకు వెళ్తారా? ఆఫీస్ అయినా లేక ఇల్లు అయినా, అన్నీ సేవా స్థానాలే. సేవాధారులకు ప్రతి చోటా సేవ ఉంటుంది, కనుక మధుబన్కు రండి మరియు ఉల్లాస-ఉత్సాహాల ఖజానాను నింపుకోండి మరియు తిరిగి సేవకు వెళ్ళండి. చాలా సంతోషంగా వెళ్తారు కదా? లేక తప్పదు కదా అని వెళ్తారా? సేవ అనగా సంతోషము. లెక్కాచారాలు ఉన్నాయి, అందుకే అప్పులు తీర్చుకోవడానికి వెళ్తున్నాము అని అనుకోకూడదు. బాధ్యతలు నిర్వర్తించడం కోసం వెళ్తున్నారు. ఇంట్లో కొంగలు చాలా ఉన్నాయి. ఒకవేళ కొంగలు లేకపోతే జ్ఞానము ఎవరికి ఇస్తారు? హంసలను హంసలుగా తయారుచేస్తారా? కొంగలనే హంసలుగా తయారుచేస్తారు కదా? మరి ఏం గుర్తు పెట్టుకుంటారు? బ్రాహ్మణ్ నుండి ఫరిశ్తా, ఫరిశ్తా నుండి దేవత. ఇది పక్కాగా ఉంటుంది కదా? లేకపోతే ట్రైన్లో వెళ్తూ-వెళ్తూ ఒకటి మర్చిపోతారా? మీ-మీ స్థానాలకు వెళ్తూ-వెళ్తూ ఇక ఒకటే మిగిలి ఉంటుందా, ఇలా అయితే జరగదు కదా? అచ్ఛా!
అందరూ హాయిగా ఉన్నారు కదా? డబల్ విదేశీయులు అయినా ఖటారాజులు (మంచాలు ఉన్నవారు) మరియు భారత్వాసులు పటారాజా (నేలపై పడుకునేవారు). నేలపై పడుకోవడం సహజంగానే అనిపిస్తోంది కదా? మంచాలు ఏమీ గుర్తుకు రావడం లేదు కదా? అవును, అందరికీ మంచాలు లభించే సమయం కూడా ఒకటి వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? మొత్తం ఆబూను మనదిగా చేసుకున్నప్పుడు! ఈ సంఘటన యొక్క సుఖం మంచాలు మరియు డన్లప్ పరుపుల కంటే చాలా ఎక్కువైనది. ఇక్కడ కూడా సుఖంగా నిద్ర వస్తోంది కదా? జ్ఞానామృతం తాగుతూ-తాగుతూ నిద్రపోతారు, కాబట్టి ఎంత మంచిగా నిద్రపోతారు! జ్ఞానామృతం తాగడం మరియు బ్రహ్మా భోజనం తినడం. అందరికీ తయారైన భోజనం లభిస్తోంది. అందరూ సంతోషంగా ఉన్నారు. అదృష్టవంతులు కూడా, సంతోష స్వభావం ఉన్నవారు కూడా! లేక ఎప్పుడైనా సీరియస్, ఎప్పుడైనా సంతోష స్వభావమా? ఎప్పుడూ ముఖంలో తేడా రాకూడదు. క్రోధం లేదా కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రగా-పసుపుగా అయిపోతుంది కదా? సదా ముఖం హర్షిత ముఖంగా ఉండాలి. దీనినే సంతోష స్వభావంతో ఉండటం అని అంటాము. అచ్ఛా, అందరూ బాబాను ఎంతగా గుర్తుచేస్తున్నారో మరియు హృదయం నుండి ప్రేమిస్తున్నారో, బాబా అందరినీ మీకంటే పదమారెట్లు ఎక్కువగా గుర్తుచేస్తున్నారు మరియు ప్రేమిస్తున్నారు. రోజంతా బాబా ఏమి చేస్తారు అని బాబాను అడుగుతారు. బాబా ఏమి చెబుతారు, రోజంతా పిల్లలనే గుర్తుచేస్తుంటాము, ఇంకేమి పని ఉంది? అంటారు. ఈ నషా ఉంది కదా? ప్రపంచం వారు బాబాను గుర్తుచేస్తారు మరియు బాబా మిమ్మల్ని గుర్తుచేస్తారు. అచ్ఛా!
గుజరాత్:- గుజరాత్‌కు ఎవరెడీ (ఎప్పుడూ సిద్ధంగా) ఉండటానికి, 'జీ హా' (అలాగే) అనడానికి వరదానము లభించింది. గుజరాత్లో రెండు ప్రత్యేకతల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి మరియు ముందు కూడా చూపిస్తూ ఉండాలి. ఆ రెండు గుర్తులు మరియు రెండు ప్రత్యేకతలు ఏవి? సంతుష్టత మరియు ప్రసన్నత. సంతుష్టత ఉన్నప్పుడే ప్రసన్నత కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రత్యేకతలు విశేషమైనవి మరియు సదా ఉంటాయి. అర్థమైందా? గుజరాత్ వారు ఎప్పుడూ అసంతృప్తిగా ఉండరు, ఇతరులను అసంతృప్తి పరచరు. రెండు ప్రత్యేకతల కారణంగా సదా ఎగురుతూ ఉంటారు. గుజరాత్‌ను విశేషంగా బ్రహ్మా బాబా తమ సంకల్పంతో స్థాపన చేశారు. మరియు జన్మించగానే సదా సహయోగులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అర్థమైందా! సహయోగం యొక్క వేలు సదా ఉండనే ఉంది. చూడండి, ఏ ప్రోగ్రామ్ జరిగినా, సీజన్ జరిగినా బ్రహ్మా భోజనంలో గుజరాత్ మాతలను గుర్తుచేస్తారు కదా! ఎవరైనా ఎంత రొట్టెలు చేసినా గుజరాత్‌లాగా చేయలేరు అంటారు, ఇది ప్రత్యేకత. కాబట్టి ప్రతి కార్యంలో ఎవరెడీగా ఉండేవారు. అచ్ఛా!
ఈస్టర్న్:- ఈస్టర్న్ యొక్క సూర్యుడు ఉదయించాడు. ఈస్టర్న్ జోన్ వారు సదా తమను మరియు ఇతరులను పూజ్య ఆత్మగా తయారుచేయడానికి ప్రేరణనిచ్చేవారు. ఎందుకంటే ఈస్టర్న్‌లో పూజలు చాలా జరుగుతాయి. కాబట్టి పూజారులు చాలామంది ఉన్నారు. మరి పూజారులను పూజ్యులుగా తయారుచేసే ఈ సేవా ఛాన్స్ ఈస్టర్న్ జోన్‌కు చాలా ఉంది. ఎవరైతే ఎక్కువగా పూజారి నుండి పూజ్యులుగా తయారుచేస్తారో, వారి పూజ చాలా జన్మలు మరియు చాలా విధిపూర్వకంగా జరుగుతుంది. కాబట్టి ఈస్టర్న్ వారు పూజ్యులుగా తయారుచేసే కారణంగా అనేక జన్మలు చాలా పెద్ద పూజ్య ఆత్మలుగా అయ్యేవారు. ఈ సేవే చేస్తున్నారు కదా? పూజారి నుండి పూజ్యులుగా అవుతున్నారా లేక కేవలం దర్శనం చేసుకునేవారిగా అవుతున్నారా? ఏమి జరుగుతోంది? కాబట్టి ఈస్టర్న్ జోన్‌కు పూజ్యులుగా తయారుచేసే విశేష వరదానము కూడా లభించింది మరియు ఛాన్స్ కూడా లభించింది. కాబట్టి ‘మేము పూజ్య ఆత్మలము మరియు ఇతరులను కూడా పూజ్యులుగా తయారుచేయడానికి నిమిత్తులము’ అనే నషా ఉందా? అర్థమైందా? ఈస్టర్న్ జోన్ ప్రత్యేకత ఏమిటంటే - బ్రహ్మా బాబా యొక్క ప్రత్యక్షతా భూమి. కాబట్టి ఆ భూమికి కూడా వరదానము ఉంది. ఈస్టర్న్ జోన్లోనే బ్రహ్మా బాబా యొక్క ప్రత్యక్షత జరిగింది. మరి ఎంత శ్రేష్ఠమైన భూమి! భూమి కూడా శ్రేష్ఠమైనది, సేవ కూడా శ్రేష్ఠమైనది మరియు సేవాధారులు కూడా సదా శ్రేష్ఠమైనవారు. అచ్ఛా - (అందరూ బాగా చప్పట్లు కొట్టారు) ఇలాగే సదా సంతోషంలో చప్పట్లు కొడుతూ ఉండండి. సంతోషం యొక్క చప్పట్లు ఏవి? సంతోషం యొక్క చప్పట్లు కొట్టడం వచ్చా? ఈ చప్పట్లు అయితే స్థూలమైనవి. సంతోషం యొక్క చప్పట్లు ఏవి? సంతోషం యొక్క చప్పట్లు అంటే చిరునవ్వు చిందించడం. ఇక్కడ కొట్టండి, అభ్యంతరం లేదు కానీ అక్కడికి వెళ్ళి సదా సంతోషం యొక్క చప్పట్లు కొడుతూ ఉండండి. అందరూ అలాగే చేయండి. మీ సంతోషం మరియు చిరునవ్వు ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని చూసేవారు కూడా చప్పట్లు కొట్టడం ప్రారంభించాలి.
బొంబాయి, పూనా:- పూనా మరియు బొంబాయి సదా ఫికర్ (చింత) నుండి విముక్తులుగా ఉండేవారు. బొంబాయి కూడా నిశ్చింత చక్రవర్తుల స్థానం మరియు పూనా కూడా నిశ్చింత చక్రవర్తుల స్థానం. మరి అందరూ నిశ్చింతగా ఉన్నారా? లేక కొద్దిగా చింత ఉందా? స్వయంగా నిశ్చింత చక్రవర్తులు మరియు ఇతరుల చింతను కూడా తుడిచివేసేవారు. అందరినీ నిశ్చింత చక్రవర్తులుగా తయారుచేసేవారు. మరి రాజ్యాన్ని ఇవ్వడంలో తెలివైనవారే కదా! పేదవారిని చక్రవర్తులుగా తయారుచేయడం వచ్చా? నిశ్చింత చక్రవర్తులుగా తయారుచేసేవారు మరియు స్వయంగా కూడా సదా నిశ్చితంగా ఉండేవారు, ఇదే సంగమయుగ శ్రేష్ఠ ఆత్మల యొక్క ప్రత్యేకత - నిశ్చింత చక్రవర్తులు! మరి చక్రవర్తులుగా ఉన్నారా లేక ఎప్పుడైనా ప్రజలుగా కూడా అయిపోతున్నారా? సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు. పూనా వారు ఎన్ని సేవా స్థానాలు తయారుచేశారు? (22) మరి గీతా పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? (300) కాబట్టి చూడండి, సేవలో తెలివైనవారే కదా! మరియు బొంబాయిలో సేవా కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? (36) గీతా పాఠశాలలు? అవి లెక్కలేనన్ని! మంచిది, ఎలాగూ నలువైపులా సేవలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి, కానీ సేవ యొక్క దీవెనల ద్వారా స్వయం యొక్క ఎగురుతున్న కళ మరియు సర్వుల యొక్క ఎగురుతున్న కళ - అలాంటి స్పీడ్‌ను తీవ్రతరం చేస్తూ వెళ్ళండి. అందుకనే బాప్‌దాదా సేవపై సదా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా సంతోషంగా ఉన్నారు కదా? ఇంకా 9 లక్షల మంది పూర్తి అవ్వలేదు. ఇప్పుడు అది చేయాల్సి ఉంది, కానీ అయినా చేస్తున్నారు, కాబట్టి చేస్తున్నదానిపై బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. కానీ ఇంకా చేసేందుకు మార్జిన్ ఉంది, సమాప్తం అవ్వలేదు. ఇప్పుడు ఎంతమంది తయారయ్యారు? (3 లక్షల మంది) ఇంకా డబల్ మిగిలి ఉంది. ఇప్పుడు ఒక శాతం తయారైంది, రెండు శాతం మిగిలి ఉంది. కాబట్టి, 9 లక్షల హారాన్ని (నౌలఖా హారాన్ని) బాబాకు ఎవరు తొడిగిస్తారు అన్నది చూద్దాము. ఎవరు తయారుచేస్తారు? అచ్ఛా!
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్:- కర్ణాటకలో మెజారిటీ స్నేహి ఆత్మలు చాలామంది ఉన్నారు, బాబాకు స్నేహితులు మెజారిటీ ఉన్నారు. కాబట్టి స్నేహము అనేది సహజ స్మృతికి సాధనం. మరి స్వయంగా స్నేహిగా ఉండేవారు ఇతరులను కూడా సహజంగా స్నేహిగా తయారుచేస్తారు. కాబట్టి కర్ణాటకకు విశేషంగా ఈ వరదానము ఉంది లేదా ప్రత్యేకత ఉంది. కాబట్టి స్నేహము ఉంది మరియు స్నేహము కారణంగా వృద్ధి కూడా ఉంది. ఇప్పుడు స్నేహాన్ని ప్రాక్టికల్‌లో తీసుకొస్తున్నారు, ఇంకా ఎక్కువ స్నేహ శక్తి ద్వారా ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి స్నేహము కారణంగా బాబాను మరచిపోవడం తక్కువే, కానీ మరచిపోతే చాలా మరచిపోతారు. ఎందుకు? ఎప్పుడైనా మరచిపోయే సమాచారాలు కూడా వస్తాయి. కానీ స్నేహము అనే ప్రత్యేకతను ఎప్పుడూ వదలకుండా ఉండాలి. ఇది డ్రామానుసారంగా కర్ణాటకకు లభించిన ప్రత్యేకత, దీనిని యూజ్ చేస్తున్నారు కూడా, ఇంకా ముందుకు అండర్లైన్ చేస్తూ వెళ్ళాలి. ఇలా తయారై ఉన్నారా? అచ్ఛా!
ఈరోజు తర్వాత కర్ణాటక నుండి స్నేహము తప్ప వేరే ఏ సమాచారము రాదు అని టీచర్లు భావిస్తున్నారా? టీచర్లలో ధైర్యం ఉందా? ‘హా’ అని చెప్పండి లేదా ‘నా’ అని చెప్పండి. అచ్ఛా, అలాంటి గ్యారెంటీ ఉందా? ‘ఈ ప్రత్యేకతను ప్రాక్టికల్‌లో తీసుకురావాల్సిందే’ అని భావించేవారు చేతులెత్తండి. ఇప్పుడు చూద్దాం, ఇలాంటి ఉత్తరాలు ఏవీ రాకూడదు. సరేనా? మంజూరేనా? మంచిది, స్నేహితులు అయితే చాలామంది ఉన్నారు. దృష్టికే అంత స్నేహితులు, భాష అర్థం కాకపోయినా స్నేహము చాలా ఉంది. కాబట్టి బాప్‌దాదా స్నేహాన్ని చూసి సంతోషిస్తున్నారు. కానీ సంపూర్ణంగా అయితే అవ్వాలి కదా! కాబట్టి స్నేహి ఆత్మల మధ్య కొద్దిగా కూడా అంతరాయం రాకూడదు. అందుకని కర్ణాటక సదా ఈ స్నేహము యొక్క నాటకం చేసి చూపించాలి. అయినా బాప్‌దాదా చూస్తున్నారు - వృద్ధి చేయడంలో కూడా తెలివైనవారు. కానీ సదా స్నేహిగా ఉండటం మరియు స్నేహిగా తయారుచేయడం, స్నేహము యొక్క నాటకమే ఆడటం. అర్థమైందా?
అచ్ఛా - ఆంధ్రా వారు ఏమి అద్భుతాన్ని చేస్తారు? సేవలో, స్వ-ఉన్నతిలో నంబర్‌వన్. అంతేనా? నంబర్‌వన్ అవ్వాలి. అచ్ఛా!
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చారు, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చారు. కాబట్టి మొదట డబల్ విదేశీయులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! ఎందుకంటే నలువైపుల నుండి కార్డులు మరియు ఉత్తరాలు కూడా చాలా వచ్చాయి కదా. బాప్‌దాదా వద్దకు పోస్ట్ కంటే ముందే చేరుకుంటాయి. మీరు ఎయిర్‌మెయిల్ ద్వారా పంపుతారు కదా, కానీ బాప్‌దాదా వద్దకు ఎయిర్ఫ్లై ద్వారా చేరుకుంటాయి. విదేశాలలో కూడా సేవ మరియు స్వ-పురుషార్థం యొక్క అల చాలా బాగుంది మరియు మెజారిటీ అందరిలో ఈ ఉల్లాసం చాలా బాగుంది. విశ్వంలో బాబా యొక్క ప్రత్యక్షతా జెండాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగరవేయాలి అనే ఒకే తపన రాత్రింబవళ్ళు ఉంది. ఎందుకంటే విదేశీయుల డ్యూటీ భారత్‌ను నిద్రలేపడం. కాబట్టి ఎత్తైన జెండాను ఎగురవేసినప్పుడే కదా అందరి దృష్టి వెళ్తుంది. కానీ బాప్‌దాదా డబల్ విదేశీయులను ‘అద్భుతం చేసేవారు’ అని కూడా అంటారు. మరి ఏ కమాల్ చేశారు? దూరాన్ని సమీపంగా అనుభవం చేసే అద్భుతం చేశారు! దేశం ఎంత దూరంగా ఉందో, హృదయానికి అంత సమీపంలో ఉన్నారు. నలువైపుల నుండి వచ్చారు. బాప్‌దాదా డబల్ విదేశీయులందరికీ విశేషమైన ప్రత్యేకత అనే వరదానము ఇస్తున్నారు - ‘సదా హృదయ సింహాసనాసీనులు’! బాబా హృదయంలో మీరు ఉన్నారు, మీ హృదయంలో బాబా ఉన్నారు. రష్యా వారు కూడా అద్భుతం చేస్తున్నారు కదా! ముందుకు వెళ్తూనే ఉన్నారు. రష్యా వారికి అన్నింటికంటే ఎక్కువగా ఏ విషయంపై విశేషమైన సంతోషం ఉంది? రష్యా వారికి విశేషమైన సంతోషం ఈ విషయంపై ఉంది - ఏదైతే స్వాతంత్ర్యం కావాలనే ప్రియమైన కోరిక ఉండేదో, ఆ స్వాతంత్ర్యం లభించింది. అర్థమైందా? దేశం పరంగా, ఆత్మ యొక్క బంధనం పరంగా చాలా పరతంత్రంగా ఉన్నారు, ఇప్పుడు స్వతంత్రంగా అయ్యారు. స్వతంత్రంగానే ఉన్నారు కదా! కాబట్టి స్వాతంత్ర్యం యొక్క జెండా రష్యాలో ఎగురుతోంది. శివబాబా జెండాతో పాటు అన్ని స్థానాలలో స్వాతంత్ర్యం యొక్క జెండా కూడా ఎగురుతోంది. మరియు ఎంత సంతోషిస్తున్నారు! పరతంత్రత యొక్క అన్ని బంధనాల నుండి ముక్తులైపోయారు మరియు ఎంత సహజంగా సర్వ ప్రాప్తులను పొందేశారు! సర్వ ప్రాప్తులు అయిపోయాయి కదా! (హాజీ) మంచిది, ధైర్యం కూడా బాగుంది. డబల్ విదేశీయులు తమను నడిపించుకునే ధైర్యం మరియు ఇతరులను కూడా నడిపించే ధైర్యం బాగా ఉంచుకుంటారు. ఈ ధైర్యం కారణంగానే విదేశాలలో సేవలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి విశేషంగా ధైర్యం మరియు సహాయం - ఈ రెండింటికీ పాత్రులైన ఆత్మలు. చూడండి, లండన్ వారు కూడా ధైర్యం చేసి మ్యూజియం తీసుకున్నారు కదా! తాళంచెవి లభించింది కదా! స్వర్గం యొక్క తాళంచెవి కంటే ముందే సేవ యొక్క తాళంచెవి లభించింది. మంచి అద్భుతాన్ని చేశారు! ‘అసలు ఈ రాజయోగులు ఎవరు? వీరు గుప్తంగా ఏమి చేస్తున్నారు?’ అని అందరి దృష్టి వెళ్తోంది. ఆస్ట్రేలియా లేదా ఏవైతే విభిన్న దేశాల నుండి వచ్చారో, ఆ పిల్లలందరికీ బాప్‌దాదా విశేషమైన క్రిస్మస్ కానుక ఇస్తున్నారు - ‘‘సదా దిల్ ఖుష్ (హృదయానికి సంతోషాన్నిచ్చే) మిఠాయి తింటూ ఉండండి, తినిపిస్తూ ఉండండి’’ అని. స్వర్గం యొక్క రాజ్యాధికారం అనే కానుక అయితే అందరికీ లభించింది కదా! అందరి చేతిలో కొత్త ప్రపంచం, స్వర్గం అనే గోళం ఉంది కదా? ఉత్తరాలు మరియు కార్డులు పంపడంలో ఫాస్ట్ స్పీడ్ ఉన్నవారు. ‘తమ జ్ఞాపకం యొక్క రుజువును లేదా గుర్తును పంపడంలో తెలివైనవారు’ అని బాప్‌దాదా భావిస్తున్నారు. సరేనా? ఆనందంలో ఉండే వారే కదా? అన్ని స్థానాల ప్రియమైన, గారాల ఆత్మలను బాప్‌దాదా విశేషంగా సమ్ముఖంలో చూస్తున్నారు మరియు సదా సమీపంలో ఉండే ప్రత్యేకతతో ముందుకు వెళ్తూ ఉంటారు. అర్థమైందా? అచ్ఛా!
నలువైపులా ఉన్న బ్రాహ్మణ్ సో ఫరిశ్తా, ఫరిశ్తా సో దేవత, మూడు స్వరూపాల స్మృతి స్వరూపులైన ఆత్మలందరికీ, సదా ‘చేసేవారు-చేయించేవారు’ యొక్క స్మృతితో స్వయాన్ని డబల్ లైట్‌గా తయారుచేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా దేవత అనగా దాతగా అయ్యి ఇచ్చేవారికి, సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు, సదా వరదానాలను కర్మలలోకి తీసుకొచ్చే కర్మయోగీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(దాదీలు అందరూ బాప్‌దాదా సమ్ముఖంలో స్టేజ్‌పైన నిలబడి ఉన్నారు)
దాదీ జానకీతో:- మంచిది, ఎగరడంలో తెలివైనవారిగా అయ్యారు. జీవన దానము లభించింది. ఎంతగా సేవ చేస్తూ ఉంటారో అంతగా జీవిత ఆరోగ్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అందరి దీవెనలు ఆరోగ్యవంతంగా చేసేస్తాయి. బాబా సహాయం ఎలాగూ ఉంది, కానీ దీవెనలు యవ్వనంగా మార్చేస్తున్నాయి. ఎవరికైనా దీవెనలు లభించినప్పుడు, లేదా ఏదైనా సంతోషం, శాంతి ప్రాప్తి లభించినప్పుడు నోటి నుండి, హృదయం నుండి ఈ దీవెనలే వస్తాయి - మా ఆయుష్షు కూడా మీకు లభించుగాక! అని. కార్డులలో కూడా ఏమి పంపుతారు? మా ఆయుష్షు మీకు లభించాలి అని పంపుతారు. మరి మీరు ఒక చక్రంలో వేలాదిమందికి సేవ చేస్తున్నారు, కాబట్టి వెయ్యి రెట్లు దీవెనలు లభించేస్తున్నాయి. మంచిది, అందరూ తమ తమ సేవను బాగా చేసుకుంటున్నారు.
అందరికీ దాదీలపై శుభ మోహము ఉంది కదా? సాధారణ మోహము అయితే లేదు కదా. దుఃఖాన్ని ఇచ్చే మోహము కాదు, సుఖాన్ని ఇచ్చేది. కానీ ఎంత మోహమో, అంతే నిర్మోహీ. అతీతంగా మరియు ప్రియంగా కూడా. అంతే కదా? లేక కేవలం ప్రియంగానే ఉన్నారా, అతీతంగా లేదా? అతీతంగా మరియు ప్రియంగా - రెండింటి బ్యాలెన్స్ ఉంచుకునేవారు. ఇది కూడా డ్రామాలో ఆది నుండి విశేష ఆత్మలకు నిమిత్తంగా అయ్యే పాత్ర. పాలన కూడా చాలా తీసుకున్నారు. ఎంతగా అయితే మీరు డైరెక్ట్ బాబా నుండి పాలన తీసుకున్నారో, అంతగా వీరు తీసుకోలేదు. కాబట్టి ఎంత పాలన తీసుకున్నారో అంతగా పాలన చేసే పాత్ర కూడా లభించింది. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? అందరి ఆయుష్షు వెయ్యి సంవత్సరాలు అయిపోవుగాక! వెయ్యి సంవత్సరాలా! ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదా? పాత ప్రపంచంలోనే ఉండాలా?
మంచిది, ఈ మ్యూజియం కూడా అద్భుతం చేస్తుంది. ఇది దృఢత్వానికి ప్రత్యక్ష స్వరూపం. కాబట్టి సఫలత కోసం దృఢత్వము అనేది అసంభవాన్ని కూడా సంభవంగా మార్చేస్తుంది. ధైర్యం ఉన్నవారు. కాబట్టి విశేషంగా నిమిత్తంగా అయిన వారందరికీ విశేషమైన ప్రియస్మృతులు. ఇది కూడా సేవకు మంచి సాధనం, ఎవరో ఒకరు నిమిత్తంగా అయి తమ భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. ఇచ్చేవారు ముందే డ్రామాలో నిర్ణయించబడి ఉన్నారు. అచ్ఛా.
చంద్రమణి దాదీతో:- వీరు కూడా చక్రం వేసి వచ్చారు. చక్రవర్తి రాజా అని పేరు పక్కా అయిపోయింది కదా. మంచిది, సేవ భవిష్యత్తును ప్రత్యక్షం చేస్తోంది. ఫలానా ఫలానా వారు ఉన్నారు అని పేర్లు చెప్పము కదా, కానీ సేవే స్వయాన్ని ప్రత్యక్షం చేస్తోంది. ఎంతమంది చక్రవర్తి రాజులు తయారవుతున్నారు? ఒకసారి చుట్టి వస్తే సేవలో అనేక ఆత్మలు సంతుష్టమవుతారు, కాబట్టి ఆ చక్రంలో చక్రవర్తి రాజు యొక్క వరదానము ఉంటుంది. ఎంతమంది ఆత్మలు సంతుష్టమవుతున్నారు? చాలామంది అవుతున్నారు. ఆయుష్షు ఎంత పెరుగుతూ ఉంటుందో, అంత ఎక్కువ చుట్టి వస్తారు.
దాదీజీతో:- ఇప్పుడు మేళా గురించి ఆలోచిస్తున్నారు. ఢిల్లీ మరియు బొంబాయి వారు కూడా కూర్చుని ఉన్నారు కదా. అద్భుతం చేసి తీరుతారు. ఢిల్లీ మరియు బొంబాయి నిమిత్తంగానే ఉన్నారు. స్థాపనకు కూడా నిమిత్తులు, ప్రత్యక్షతకు కూడా నిమిత్తులు. అలాగే విదేశాలలో లండన్ - స్థాపనకు కూడా నిమిత్తం, ప్రత్యక్షం చేయడానికి కూడా నిమిత్తం. అచ్ఛా!
*** ఓంశాంతి ***
