‘‘నూతన సంవత్సరాన్ని శుభ భావనా గుణ స్వరూప సంవత్సరం రూపంలో జరుపుకోండి’’
ఈరోజు నవయుగ రచయిత అయిన బాప్‌దాదా తమ నవయుగ రాజ్యాధికారీ పిల్లలను చూస్తున్నారు. నూతన సంవత్సరాన్ని చూసి తమ నవయుగము గుర్తుకొస్తుంది! నవ యుగము ముందు ఈ నూతన సంవత్సరము ఏమంత పెద్ద విషయము కాదు. ఆ నవయుగములో ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రకృతి అన్నీ కొత్తగా ఉంటాయి. నూతన సంవత్సరము ప్రారంభమైనప్పుడు పాత వస్తువులు లేక వ్యక్తుల యొక్క పాత స్వభావము, సంస్కారము, నడవడికలో కొన్ని కొత్తవిగా ఉంటాయి, కొన్ని పాతవిగా ఉంటాయి. కానీ మీ నవయుగములో పాతవాటి యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. వ్యక్తులు కూడా కొత్తగా అనగా సతోప్రధానంగా ఉంటారు మరియు ప్రకృతి కూడా సతోప్రధానంగా అనగా కొత్తగా ఉంటుంది. ప్రకృతిలో కూడా ఇప్పటిలా పాతదనము ఉండదు. కనుక నవయుగ అభినందనలతోపాటు నూతన సంవత్సరానికి కూడా అభినందనలు.
ఈరోజు విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస-ఉత్సాహాలతో, చాలా-చాలా సంతోషంతో అందరూ చేరుకున్నారు. కనుక బాప్‌దాదా కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా నవయుగానికి మరియు నూతన సంవత్సరానికి డబల్ అభినందనలను ఇస్తారు. మీ అందరికీ కూడా డబల్ స్మృతి ఉందా లేక సింగల్ స్మృతి ఉందా? మీ నవయుగము మీ నయనాల ఎదురుగా బుద్ధిలో స్పష్టంగా ఉంది కదా? ఎలా అయితే రేపటి నుండి నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది అని అంటారో, అలాగే రేపు నవయుగము తప్పకుండా వచ్చేదే ఉంది అని ఇంత స్పష్టంగా అంటారా? నషా ఉందా? అందరూ నవయుగ రాజ్యాధికారులేనా? అందరూ రాజులుగా అవుతారంటే, మరి ప్రజలను తయారుచేసుకున్నారా? మీరందరూ రాజులు, కానీ ఎవరిపై రాజ్యము చేస్తారు? మీపై మీరు రాజ్యం చేస్తారా! బాప్‌దాదా నవయుగము మరియు నూతన సంవత్సరము, రెండింటినీ చూస్తున్నారు. రేపటి విషయమే కదా, అది కూడా రేపటి విషయమే, ఇది కూడా రేపటి విషయమే. ఇప్పుడిక నవయుగము వస్తుంది కదా! మరి మీ నవయుగ డ్రెస్ (శరీరము) ఎదురుగా కనిపిస్తుందా? పాత డ్రెస్‌ను వదులుతారు మరియు కొత్త డ్రెస్‌ను ధరిస్తారు. ఆ డ్రెస్ చాలా మంచిగా, మెరుస్తూ, సుందరంగా ఉంది కదా! ఇప్పుడు చూడండి, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపము ఉంటుంది. కొందరి ముక్కు వంకరగా ఉంటుంది, కొందరి కళ్ళు వంకరగా ఉంటాయి, కొందరి పెదవులు ఏదోలా ఉంటాయి కానీ నవయుగములో అయితే అన్నీ నంబర్‌వన్‌గా ఉంటాయి, ప్రతి కర్మేంద్రియము ఏక్యురేట్గా ఉంటుంది. మరి అటువంటి డ్రెస్ మీ ఎదురుగా మేకుకు తగిలించి ఉంది కదా! కేవలము దానిని ధరించాలి, అంతే. మీ డ్రెస్ చాలా మంచిగా, ఇష్టమైనదిగా ఉందా? చూస్తున్నారు కదా?
బాప్‌దాదా ఎప్పుడూ పిల్లలు ప్రతి ఒక్కరినీ చూస్తున్నప్పుడు ఏం చూస్తారు? ఒకటేమో, ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న మణిని అనగా శ్రేష్ఠ ఆత్మను చూస్తారు, దానితో పాటు పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యానికి చెందిన శ్రేష్ఠ రేఖను చూస్తారు. ప్రతి ఒక్కరి భాగ్యము ఎంత శ్రేష్ఠంగా ఉంది! అందరి భాగ్యము శ్రేష్ఠంగా ఉంది కదా! లేక కొందరిది మధ్యమంగా కూడా ఉందా? అందరూ మొదటి నంబర్‌లోకి వచ్చేవారే కదా? రెండు, మూడు నంబరులోకి వచ్చేవారా? మంచిది, ప్రపంచములోనివారు మీ నోట్లో గులాబ్ అని అంటారు, కానీ బాప్‌దాదా మీ నోట్లో గులాబ్ జామూన్ అని అంటారు. గులాబ్ జామూన్ అందరికీ ఇష్టమనిపిస్తుంది కదా? గులాబ్ జామూన్ లేక మరేదైనా స్వీట్‌ను తినేందుకే బాప్‌దాదా ప్రతి గురువారము భోగ్ పద్ధతిని పెట్టారు. భోగ్‌ను స్వయం కూడా తింటారు మరియు బాప్‌దాదాకు కూడా స్వీకారము చేయిస్తారు. ఇంట్లో చేసుకున్నా, చేసుకోకపోయినా కానీ గురువారమైతే స్వీట్ లభిస్తుంది కదా. అంతేకాక ఎప్పుడైనా ఏదైనా సంతోషకరమైన ఉత్సవం ఉంటే నోటిని తీపి చేయిస్తారు. తియ్యని నోరు అంటే తియ్యని ముఖము. నోటిని తీపి చేసుకోవటమైతే అందరూ చేసుకుంటారు కానీ మీ అందరిది నోరు కూడా తియ్యనిది మరియు ముఖము కూడా తియ్యనిది, లేక కాస్త-కాస్త చేదుగా కూడా ఉంటాయా? ఒకవేళ ఒక గీతమాత్రంగా అయినా చేదుతనము ఉన్నట్లయితే, ఈరోజు ఈ సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతోపాటుగా ఈ కొద్దిపాటి చేదుతనానికి కూడా వీడ్కోలు ఇచ్చేయండి. వీడ్కోలు ఇవ్వటము వస్తుందా లేక అది దగ్గర ఉంచుకోవటము మంచిగా అనిపిస్తుందా? లేకపోతే వీడ్కోలు ఇచ్చి మళ్ళీ పిలిచేస్తారా? మేమైతే వదలాలనుకుంటాము కానీ మాయ వదలదు అని అంటారా! మేము వదిలేసాము కానీ మాయ వచ్చేసింది అని ఇలా అయితే అనరు కదా? అక్కడకు వెళ్ళి మళ్ళీ ఇలాంటి ఉత్తరాలు వ్రాస్తారా? వీడ్కోలు అంటే సదాకాలానికి వీడ్కోలు. వీడ్కోలు ఇవ్వటము అంటే అర్థము - మళ్ళీ ఎప్పటికీ దానిని రానివ్వకుండా ఉండటమా లేక అప్పుడప్పుడు వచ్చినా ఫర్వాలేదా? ఎందుకంటే పాత సంస్కారాలు చాలా మందికి మంచిగా అనిపిస్తాయి. రేపటి నుండి ఇలా జరగదు అని ఈరోజు అంటారు, మళ్ళీ ఎల్లుండి పరవశులైపోతారు. మరి దానిని వీడ్కోలు అని అనము కదా. కనుక వీడ్కోలును ఇవ్వటము కూడా నేర్చుకోండి. సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటమైతే మామూలు విషయమే కానీ మీరందరూ అంశము, వంశము సహితంగా మాయకు వీడ్కోలు ఇవ్వాలి. అంశమాత్రంగా కూడా ఉండకూడదు. చాలా మంది పిల్లలు - 75 శాతమైతే మార్పు వచ్చింది, ఇంకా కూడా వస్తుంది అని అంటారు. కానీ మాయ చాలా త్వరగా అంశము నుండి వంశాన్ని ఉత్పన్నం చేస్తుంది. 25 శాతము అంశమాత్రము ఉన్నా కూడా అది 25 నుండి 50కి చాలా త్వరగా చేరుకోగలదు, అందుకే అంశము సహితంగా సమాప్తము చెయ్యాలి. మరి నూతన సంవత్సరములో ఏం చేస్తారు? పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతోపాటు మాయ అంశానికి కూడా వీడ్కోలు ఇవ్వండి. వీడ్కోలుతోపాటు అభినందనలను కూడా ఇస్తారు కదా! రేపు అందరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నూతన సంవత్సర అభినందనలను, శుభాకాంక్షలను చెప్పుకుంటారు కదా. కనుక వీడ్కోలు ఇవ్వండి మరియు వీడ్కోలుతోపాటు స్వయానికి కూడా మరియు ఇతరులకు కూడా సదా ఫరిశ్తా స్వరూపము యొక్క అభినందనలను ఇవ్వండి. మీరు ఉన్నదే ఫరిశ్తాలుగా. పై నుండి కిందకు వచ్చారు, మీ కార్యాన్ని చేసారు మరియు ఎగిరిపోయారు. ఫరిశ్తాలు ఇదే చేస్తారు కదా! ఎగిరే కళకు గుర్తుగా రెక్కలను చూపించారు. అవి ఏవో కృత్రిమమైన రెక్కలు కావు. ఫరిశ్తాలకు ఈ రెక్కలనేదైతే చూపిస్తారో వాటి అర్థము - ఫరిశ్తా అనగా ఎగిరే కళ కలవారు. కనుక ఫరిశ్తా స్వరూపము విషయములో అభినందనలను స్వయానికి కూడా ఇచ్చుకోండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి. సదా ఫరిశ్తా స్వరూపపు స్మృతిలో కూడా ఉండండి మరియు ఇతరులను కూడా ఆ స్వరూపములోనే చూడండి. ఫలానావారు, ఫలానావారు... అని ఇలా అనుకోకూడదు, వారు ఫరిశ్తా. ఈ ఫరిశ్తా సందేశం ఇవ్వడానికి నిమిత్తముగా ఉన్నారు. అర్థమైందా? కనుక అందరికీ ఫరిశ్తా స్వరూపము యొక్క అభినందనలను ఇవ్వండి. ఎవరు ఎలా ఉన్నా కానీ దృష్టి ద్వారా సృష్టి మారగలదు. దృష్టి ద్వారా సృష్టి మారగలిగినప్పుడు మరి బ్రాహ్మణులు మారలేరా? మీ దృష్టి-స్మృతి ప్రతి ఆత్మనూ మార్చేస్తుంది.
బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లల విషయంలో నవ్వు వస్తుంది. మీపై మీకు కూడా నవ్వు వస్తుందా? ఒకవైపేమో మేము విశ్వ పరివర్తకులము, విశ్వ కళ్యాణకారులము... అని అంటారు, కానీ మళ్ళీ విశ్వ పరివర్తకులు వచ్చి - ఇది మార్చటము నా వల్ల కాదు అని అంటారు! ఆత్మిక సంభాషణలో ఒక్కోసారి స్వయము గురించి కూడా ఇలా అంటారు - ఇది చెయ్యకూడదు అని అనుకుంటాము, అయినా కూడా చేసేస్తాము... మరి విశ్వ పరివర్తకులు అయి ఉండి స్వయము గురించి - నేను అనుకుంటాను కానీ చెయ్యలేకపోతున్నాను అని అంటే వారి టైటిల్ ఏమి ఉండాలి? వారిని విశ్వ పరివర్తకులు అని అనాలా లేక బలహీనులు అని అనాలా? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడవుతుందో తెలియదు... అని పాటను వినిపిస్తారు కదా. ఈ పాటను బాప్‌దాదా వింటారు కదా! విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారులు అని అన్నప్పుడు ఏ ఆత్మనైనా మార్చలేరా? స్వయాన్ని మార్చుకోలేరా? ఒకవేళ స్వ పరివర్తకులే కానప్పుడు విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు?
బాప్‌దాదా అంటారు, ఈ సంవత్సరము విశేషంగా స్వయముతో దృఢ ప్రతిజ్ఞను చేసుకోండి. ప్రతిజ్ఞకు కల అర్థమే శరీరము పోయినాగానీ చేసిన ప్రతిజ్ఞ పోకూడదు అని. మరి ప్రతిజ్ఞ చేసేందుకు అంత ధైర్యము ఉందా? చేస్తారా? భయపడరు కదా? కావున స్వయముతో ఈ ప్రతిజ్ఞనే చేసుకోండి - ‘‘ఎప్పుడూ ఎవరి బలహీనతలను లేక లోపాలను చూడము. ఎవరి బలహీనతలను, లోపాలను వినము, వాటి గురించి మాట్లాడము.’’ వినము, మాట్లాడము, చూడము. అప్పుడు ఈ సంవత్సరము ఎటువంటిదవుతుంది? ఈ సంవత్సరము ‘‘శుభ భావనా గుణ స్వరూప సంవత్సరము’’గా అవుతుంది. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెడతాము కదా. అందరూ ఈ ప్రతిజ్ఞను చేసినట్లయితే ఈ సంవత్సరము - శుభ భావనా గుణ స్వరూప సంవత్సరముగా అవుతుంది. సమ్మతమేనా? మళ్ళీ అక్కడకు వెళ్ళిన తరువాత మారిపోకండి! అక్కడకు వెళ్ళి ఏమంటారు - మధువనములోనైతే వాయుమండలము బాగుంది కదా, ఇక్కడైతే వాయుమండలము యొక్క సాంగత్యము ఉంది కదా! పరివర్తకులు ఎవరి సాంగత్యములోకి రారు, ఎవరి ప్రభావములోకి రారు. ఒకవేళ పరివర్తకులే ప్రభావములోకి వచ్చినట్లయితే ఇక పరివర్తన ఏం చేస్తారు? కనుక ఈ సంవత్సరాన్ని గుణ మూర్త, శుభ భావనా సంవత్సరము రూపంలో జరుపుకోండి. ఎవరి అశుభమైన విషయాన్ని అయినా మీరు శుభంగా మార్చి మీ వద్దకు స్వీకరించండి. అశుభాన్ని చూస్తున్నా కూడా మీరు శుభ దృష్టితో చూడండి. ప్రకృతినే మార్చగలిగినప్పుడు మనుష్యాత్మలను మార్చలేరా? అందులోనూ వీరు బ్రాహ్మణ ఆత్మలు, వీరిని మార్చలేరా? ఎప్పుడైతే అందరి పట్ల శుభ భావన ఉంటుందో అప్పుడు ‘కారణము’ అన్న పదము సమాప్తమై ‘నివారణ’ అన్న మాటే కనిపిస్తుంది. ఈ కారణం వల్ల ఇదైంది, ఈ కారణం వల్ల జరిగింది... అని ఇలా అనకూడదు, కారణాన్ని నివారణలోకి పరివర్తన చెయ్యండి. ధైర్యముందా? అచ్ఛా! బాప్‌దాదా టి.వి. పెట్టినప్పుడు చాలా మజా వస్తుంది. ఈ కలియుగ టి.వి. చూడరు. బ్రాహ్మణుల టి.వి.ని చూస్తారు. మీరు ఆ టి.వి.ని చూడవద్దు. అలా చేయవద్దు. పిల్లల ఆటను చూసినప్పుడు చాలా మజా వస్తుంది. మిక్కీ మౌస్ ఆటను ఆడుతారు కదా! కొద్ది సమయము కొరకు ఒకరు సింహంగా అయితే, ఒకరు కుక్కగా అవుతారు. క్రోధం చేసే సమయంలో మీరు ఎవరు? ఏ సమయంలోనైతే ఎవరితోనైనా వాదిస్తారో, ఎవరిపైనైనా దాడి చేస్తూ ఉంటారో, నిరూపించుకుంటూ ఉంటారో, ఆ సమయములో మీరు ఎవరు? మిక్కీ మౌస్గానే అవుతారు కదా. మరి ఈ సంవత్సరము మిక్కీ మౌస్‌గా అవ్వవద్దు. ఫరిశ్తాగా అవ్వండి. మిక్కీ మౌస్ ఆటలు చాలానే ఆడారు. ఈ సంవత్సరము ఎంతో శక్తిశాలీ సంవత్సరంగా జరుపుకోవాలి ఎందుకంటే సమయమైతే సమీపంగా వస్తుంది కూడా మరియు తీసుకురావాలి కూడా. డ్రామానుసారంగా వచ్చేదే ఉంది కానీ తీసుకొచ్చేది ఎవరు? మీరే కదా?
ఈ సంవత్సరము రెండో విశేషత ఏం చూపిస్తారు? నూతన సంవత్సరములో ఒకటైతే అభినందనలను ఇస్తారు మరియు రెండవది, కానుకను ఇస్తారు. కనుక ఈ నూతన సంవత్సరములో - ఎల్లప్పుడు ప్రతి ఒక్కరికీ, ఎవరు, ఎప్పుడు సంబంధ-సంపర్కములోకి వచ్చినా, వారు బ్రాహ్మణ పరివారములోనివారైనా లేక ఇతరులైనా గానీ, వారందరికీ - ఒకటేమో మధురమైన మాటలు అనే కానుకను ఇవ్వండి, స్నేహపూర్వక మాటలనే కానుకను ఇవ్వండి, రెండవది, ఎల్లప్పుడు ఏదో ఒక గుణము లేక శక్తి అనే కానుకను ఇవ్వండి. ఈ కానుకను క్షణములో కూడా ఇవ్వగలరు. సమయమే లభించలేదు అని, తీసుకునేవారికీ సమయము లేదు, ఇచ్చేవారికీ సమయము లేదు అని ఇలా అనడానికి వీల్లేదు. ఒకవేళ మీకు శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనల వృత్తి ఉన్నట్లయితే క్షణకాలపు సంకల్పము ద్వారా, దృష్టి ద్వారా, మీ హృదయపూర్వకమైన చిరునవ్వు ద్వారా క్షణములోనైనా ఎవరికైనా ఎంతో ఇవ్వగలరు. ఎవరు వచ్చినా గానీ వారికి కానుకను ఇవ్వాలి, వారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మరి అన్ని కానుకలు మీ వద్ద ఉన్నాయా? లేకపోతే రెండు రోజులు ఇచ్చేటప్పటికి సమాప్తమైపోతాయా? అందరి స్టాక్ నిండుగా ఉందా? లేక ఎవరి స్టాక్ అయినా కాస్త తక్కువైపోయిందా? ఎవరి వద్దనైతే తక్కువగా ఉందో వారు చేతులెత్తండి. నింపుతాము. ఎవరి వద్దనైతే తక్కువగా ఉందో వారు చీటీ వ్రాసి జనక్కు (జానకి దాదీకి) ఇవ్వండి, వారు క్లాస్ చేస్తారు. తక్కువగా అయితే ఉండకూడదు కదా! దాత పిల్లలు అయి ఉండి వారికే తక్కువగా ఉన్నట్లయితే మంచిది కాదు కదా! అందుకే నిండుగా అయ్యి వెళ్ళండి. లోపాన్ని తీసుకుని వెళ్ళవద్దు. సంవత్సరముతోపాటు లోపాలకు కూడా వీడ్కోలు ఇచ్చి వెళ్ళండి. కేవలము రేపు ఒక్క రోజే కానుకలు ఇవ్వటము కాదు. అలా కాదు. మొత్తము సంవత్సరమంతా అందరికీ కానుకలు పంచుతూ వెళ్ళండి. ఎవ్వరూ కానుక లేకుండా వెళ్ళకూడదు, అప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు వారికి కాస్త ప్రేమతో కానుకను ఇచ్చినట్లయితే వారు ఎంతగా సంతోషపడతారు! ఇచ్చిన వస్తువును చూడరు కానీ కానుకను అనగా స్నేహ స్వరూపాన్ని చూస్తారు. ఎవరూ ఇచ్చిన కానుకతో సంపన్నులైపోరు కానీ స్నేహముతో సంపన్నులవుతారు. కనుక స్నేహాన్ని ఇవ్వండి మరియు స్నేహాన్ని తీసుకోండి. ఒకవేళ ఎవరైనా మీకు స్నేహాన్ని ఇవ్వకపోయినా, మీరు వారి నుండి తీసుకోండి. తీసుకోవటము వస్తుందా లేక ఎలా తీసుకోవాలి అని సిగ్గు పడతారా? ఇలా తీసుకుంటే ఏమీ ఫర్వాలేదు. వారు మీపై కోపగించినా, మీరు దానిని స్నేహ రూపములో తీసుకోండి. మీరు విశ్వ పరివర్తకులు కదా. మరి విశ్వ పరివర్తకులు ఎవరి నెగెటివ్‌ను అయినా పాజిటివ్‌లోకి మార్చలేరా! కనుక ఈ సంవత్సరము సదా స్నేహాన్ని ఇవ్వండి మరియు స్నేహాన్ని తీసుకోండి. ఎవ్వరూ ఇవ్వనేలేదు, ఏం చెయ్యాలి... అని ఇలా అనకండి. వారు ఇచ్చినా, ఇవ్వకపోయినా మీరు తీసుకోండి. ఏదో ఒకటి ఇస్తారు కదా, నెగెటివ్ అయినా ఇస్తారు లేక పాజిటివ్ అయినా ఇస్తారు, ఏదో ఒకటైతే ఇస్తారు కదా! కానీ ఓ విశ్వ పరివర్తకులారా, మీరు నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చెయ్యండి. ఈ సంవత్సరము ఏం చెయ్యాలో అర్థమైందా! అచ్ఛా. డబల్ విదేశీయులు ఏం చేస్తారు? కానుకను ఇస్తారా? దాతలుగా అయ్యారా? వాహ్, దాతాతనానికి అభినందనలు.
బాప్‌దాదా ప్రతిరోజూ పిల్లలలోని ఒక విషయాన్ని చూస్తారు. ఏ విషయము? ఈ ‘నేను’ మరియు ‘నాది’ అనేవి వ్యాకులపరుస్తాయి. ఒక్కోసారి ‘నాది’ అనేది వస్తుంది, ఒక్కోసారి ‘నేను’ అనేది వస్తుంది. ఇవి మధ్య-మధ్యలో వ్యాకులపరుస్తాయి. సంవత్సరము పరివర్తన అవుతున్నప్పుడు ఈ ‘నేను’ మరియు ‘నాది’ అనేవాటిని కూడా పరివర్తన చెయ్యండి. ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించండి కానీ నేను ఎవరిని? ఒరిజినల్‌గా ‘నేను’ అని దేనిని అంటారు? శరీరాన్నా లేక ఆత్మనా? నేను ఆత్మను. కనుక ఎప్పుడు ‘నేను’ అనే పదాన్ని ఉపయోగించినా ‘నేను’ అనే పదం యొక్క అసలైన స్వరూపాన్ని, అసలైన అర్థాన్ని ఎందుకు స్మృతిలో ఉంచుకోరు? మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు ‘నేను’ అనే మాటను ఉపయోగిస్తారు? ఉపయోగించాల్సి వస్తుంది కదా. ‘నాది’ అనేదానిని కూడా చాలా సార్లు ఉపయోగిస్తారు మరియు ‘నేను’ అనేదానిని కూడా చాలా సార్లు ఉపయోగిస్తారు. కనుక ఎన్ని సార్లు అయితే ‘నేను’ అనే పదాన్ని ఉపయోగిస్తారో, అన్ని సార్లూ ఒకవేళ వాస్తవిక అర్థముతో ‘నేను’ అన్నదానిని స్మృతిలోకి తీసుకొచ్చినట్లయితే ‘నేను’ అనేది మోసం చేస్తుందా లేక ఎగిరేలా చేస్తుందా? కనుక ఎప్పుడు ‘నేను’ అనే మాటను ఉపయోగించినా గానీ ఆ సమయములో - నేను ఆత్మను అనే ఆలోచించండి ఎందుకంటే ‘నేను’ మరియు ‘నాది’ అనే పదాలను ఉపయోగించకుండా ఉండలేరు కూడా. మాట్లాడవలసే వస్తుంది మరియు అలవాటు కూడా. ‘నేను’, ‘నాది’ అనేవి పక్కా సంస్కారముగా అయిపోయాయి. కనుక ఏ సమయములోనైతే ‘నేను’ అన్న పదాన్ని ఉపయోగిస్తారో ఆ సమయములో - నేను ఎవరిని అని ఆలోచించండి. నేను శరీరాన్ని అయితే కానే కాదు కదా. నేను శరీరము అని అనుకున్నప్పుడే దేహాభిమానము వస్తుంది. శరీరము నాది అని అంటారు కదా? లేక నేను శరీరము అని అంటారా? ఎప్పుడైనా పొరపాటుగానైనా నేను శరీరము అని అంటారా? నేను శరీరాన్ని అని పొరపాటున కూడా అనరు కదా. కనుక ‘నేను’ అనే పదము ఇంకా ఎక్కువగా స్మృతిని మరియు సమర్థతను కలిగించే పదము, అంతేకానీ పడేసేది కాదు. కనుక పరివర్తన చెయ్యండి. విశ్వ పరివర్తకులు పక్కాగా ఉన్నారు కదా? చూసుకోండి, కచ్చాగా అవ్వకండి. కనుక ‘నేను’ అనే పదాన్ని కూడా అర్థముతో పరివర్తన చెయ్యండి. ‘నేను’ అన్న పదాన్ని ఎప్పుడు ఉపయోగించినా, ఆ స్వరూపములో స్థితులవ్వండి మరియు ‘నాది’ అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు అన్నింటికన్నా ముందు నా వారు ఎవరు? మొత్తము రోజంతటిలో చాలా వాటిని నావి-నావి అన్నట్లుగా తయారు చేసుకుంటారు! నా స్వభావము, నా సంస్కారము, ఇది నా వస్తువు, నా పరివారము, నా సెంటరు, నా జిజ్ఞాసువులు, నా సేవ, నా సేవను వీరెందుకు చేసారు? ఇలా అంటారు కదా? ఆటనైతే ఆడుతారు కదా. కనుక ‘నాది’ అన్న మాటను మాట్లాడినప్పుడు ‘నాది’ అని అనటంతోనే నా వారు ఎవరు అన్నదానిని ముందుగా గుర్తు చేసుకోండి. ముందు ‘నా బాబా’ అన్నదానిని గుర్తు చెయ్యండి. తర్వాత నావి అన్న వేరేవాటిని గుర్తు చెయ్యండి. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ దేహాభిమానము లేక పతనము అనేవి రావు. కనుక ‘నేను’ మరియు ‘నాది’ అనే ఈ రెండు మాటలను ఆ వృత్తితో, ఆ దృష్టితో, ఆ అర్థముతో చూడండి మరియు మాట్లాడండి. ‘నాది’ అన్న పదము నోటి నుండి రావటంతోనే ముందుగా ‘నా బాబా’ అన్నది గుర్తుకు రావాలి. ఆ తర్వాత మిగతా ‘నా’ అన్నవి గుర్తుకు రావాలి. ఎక్కడ బాబా ఉంటారో అక్కడ దేహ అభిమానము లేక క్రింద పడటము అన్నది ఉండవు. కనుక ‘నేను’ మరియు ‘నాది’ అన్న ఈ రెండు పదాలను ఆ దృష్టితో, ఆ వృత్తితో మరియు ఆ అర్థంతో చూడండి మరియు మాట్లాడండి. అప్పుడు నిరంతర యోగులుగా అయిపోతారు కదా! ఎందుకంటే ప్రతి గంటలో ‘నేను’ మరియు ‘నాది’ అనే పదాలను ఉపయోగిస్తారు. కార్య-వ్యవహారాలలో కూడా ఉపయోగించాల్సి వస్తుంది కదా! కనుక ఎన్ని సార్లు ఈ పదాన్ని రిపీట్ చేసినా, నోటితో మాట్లాడినా లేక మనసులో ఆలోచించినా - ‘నేను మరియు నాది’ అన్నవాటి అర్థాన్ని పరివర్తన చెయ్యండి.
హద్దు నుండి అనంతములోకి వెళ్ళాలి కదా. అనంతమైన సృష్టి యొక్క పరివర్తక ఆత్మలైనప్పుడు హద్దులోకి ఎందుకు వెళ్తారు? కేవలము భారత్ యొక్క పరివర్తకులే కాదు కదా? డబల్ విదేశీయులు కేవలం ఫారెన్ యొక్క పరివర్తకులే కాదు కదా? మీరు విశ్వ పరివర్తకులు. విశ్వము అనగా బేహద్ (అనంతము). మీరు విశ్వ పరివర్తకులు - ఇది పక్కాగా గుర్తుంది కదా? అప్పుడు ఆటోమేటిక్‌గా నిరంతర యోగులుగా సహజంగా అవుతారు. శ్రమించాల్సిన అవసరము ఉండదు ఎందుకంటే భావము మరియు భావన మారిపోతాయి. నేను ఆత్మను అని భావించినప్పుడు ప్రతి కర్మ మరియు మాటలో భావము మరియు భావన మారిపోతాయి. ఎందుకంటే భావము మరియు భావనలే మోసగిస్తాయి కూడా, సుఖాన్ని కూడా ఇస్తాయి. మరి ఈ పరివర్తనను తీసుకు వస్తారు కదా? తర్వాత మళ్ళీ ఏమి చేయను, ఎలా చేయను అని అనరు కదా...? ఓ.కే అన్న ఉత్తరమే వస్తుందా లేక ఇది జరిగింది, ఇలా జరిగింది అని వ్రాస్తారా...? ఇలా జరిగింది, జరిగింది అని అయితే రాయరు కదా? బాప్‌దాదా వద్ద పిల్లలందరి ఉత్తరాల ఫైలు ఉంది. మొదటి నుండి ఏమేమి ఉత్కరాలు రాసారు అని ఒక్కోసారి చూస్తుంటాము, అదంతా కూడా టేప్ రికార్డు ఉంది.
కాబట్టి కొత్త సంవత్సరం అంటే నవీనత తీసుకురావడం. నవీనత అందరికీ ప్రియంగా అనిపిస్తుంది కదా? పాత వస్తువును షోలో ఉంచడానికి ఇష్టపడతారు కానీ యూజ్ చేయడానికి కాదు. యూజ్ చేయడానికి అయితే కొత్తదే ఆలోచిస్తారు. కాబట్టి ప్రతి విషయంలోనూ నవీనత ఉండాలి, సంకల్పం కూడా కొత్తగా ఉండాలి. రమణీకతతో పురుషార్థం చేయండి. ఎప్పుడైనా కొందరు పిల్లలు ఎంత హఠంతో పురుషార్థం చేస్తారంటే బాప్‌దాదాకు చూసి జాలి వేస్తుంది. చాలా యుద్ధం చేస్తారు. అవసరం లేదు కానీ చేస్తారు, ఎందుకు? తమ బలహీనత కారణంగా. కాబట్టి శ్రమపడే పురుషార్థం చేయకండి. పురుషార్థం కూడా ఆనందంగా, మజాతో చేయండి. చేయాల్సింది కూడా ఏముంది? గుర్తు అయితే ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు, ఇది ఏమైనా కొత్త విషయమా? ఒక ఘడియ అయినా గుర్తు లేకుండా ఉంటారా ఏమిటి? ఎవరో ఒకరు గుర్తుకు వస్తూనే ఉంటారు. విషయమైనా గుర్తుకు రావచ్చు, ఏ వ్యక్తి అయినా గుర్తుకు రావచ్చు, ఏ వస్తువైనా గుర్తుకు రావచ్చు కానీ గుర్తు అయితే ఉంటుంది కదా. గుర్తు లేకుండా ఉంటుందా ఏమిటి? ఎవరినో ఒకరిని గుర్తు చేయాల్సిందే. అలాంటప్పుడు అవసరమైన విషయాన్ని గుర్తు చేయండి. గుర్తు చేయడం ఎవరికి రాదు? గుర్తు చేయడం రానివారు ఎవరైనా ఉన్నారా? చిన్న కుమారీలకు గుర్తు చేయడం వచ్చా? బాగుంది. మరి గుర్తు చేయాల్సిందే అయినప్పుడు దేనివల్లనైతే లాభం ఉందో, ప్రాప్తి ఉందో దానిని ఎందుకు చేయకూడదు, దేనివల్లనైతే నష్టం ఉందో దానిని ఎందుకు చేయాలి? గుర్తు కూడా చేస్తారు, మళ్ళీ ఇబ్బంది కూడా పడతారు. ఎందుకు గుర్తు వచ్చింది, గుర్తు రాకూడదు.... అని మిమ్మల్ని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటారు? కేవలం, నా బాబా. నాది అనే అనేక హద్దు భావనలను ఒక్క ‘నా బాబా’లో ఇముడ్చేయండి. బొమ్మలు ఉంటాయి కదా, ఒకదానిలో ఒకటి, ఒకదానిలో ఒకటి ఉంటాయి కదా! ఒకటి తెరిస్తే ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి తెరిస్తే ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఒక్క ‘నా బాబా’లో అంతా ఇముడ్చుకోండి. లోపల బంద్ చేసేయండి. కానీ ఒకటేమో నోటితో ‘నా బాబా’ అని చెప్పడం, ఇంకొకటేమో హృదయానికి హత్తుకునేలా ‘నా బాబా’ అనుకోవడం. ఎవరైతే హృదయపూర్వకంగా ‘నాది’ అని అనుకుంటారో వారు ఎన్నటికీ మరచిపోరు. చూడండి, సంబంధాలలో కూడా దగ్గరి కుటుంబంలోని వారు శరీరం వదిలినా, జ్ఞానం లేకపోతే ఎంత నాది-నాది అంటారు. వారి వస్తువును చూస్తారు, వారి చిత్రాన్ని చూస్తారు, నాది-నాది అంటూ ఇబ్బందిపడతారు. కాబట్టి వెళ్ళిపోయినవారిని కూడా గుర్తు చేస్తారు. వెళ్ళిపోయినవారు తిరిగి రారని తెలిసినా నాది కాబట్టి గుర్తు వస్తుంది. మరి హృదయపూర్వకంగా ‘నా బాబా’ అని అనుకున్నప్పుడు దీనికంటే పెద్ద విషయం ఇంకేముంది? కాబట్టి మీరు సాధారణంగా మాట్లాడే దాన్నే ఎగురుతున్న కళ యొక్క సాధనంగా చేసుకోండి - నేను మరియు నాది. పురుషార్థం కూడా రమణీకంగా చేయండి. చాలామంది స్మృతిలో కూర్చుని ‘‘నేను జ్యోతి బిందువు, నేను జ్యోతి బిందువు’’ అని ఆలోచిస్తారు, జ్యోతి నిలవదు, శరీరం మర్చిపోరు. జ్యోతి బిందువే కానీ ఏ జ్యోతి బిందువు! ప్రతిరోజూ మీ కొత్త కొత్త టైటిల్స్‌ను గుర్తు తెచ్చుకోండి, జ్యోతి బిందువులో కూడా ఎవరు? రోజూ సర్వ ప్రాప్తులలో నుండి ఏదో ఒక ప్రాప్తిని గుర్తు చేసుకోండి. ప్రాప్తుల లిస్ట్ అయితే బుద్ధిలో ఉంది కదా? లేకపోతే, గుర్తుకు రాకపోతే మీ టీచర్ నుండి లిస్ట్ తీసుకోండి, టీచర్ వద్ద కూడా లేకపోతే మధుబన్ నుండి తీసుకోండి. కాబట్టి రోజూ ఒక కొత్త టైటిల్‌ను మారుస్తూ ఉండండి. ఈరోజు నూరే రతన్ అయితే రేపు మస్తక మణి.... ఎంత బాగుంటుంది. మరియు ప్రతిరోజూ వెరైటీ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి - బాబా ఏమి ఇచ్చారు, ఏమి లభించింది! కాబట్టి అవినాశి ప్రాప్తి ఎదురుగా ఉన్నప్పుడు ప్రాప్తితో సంతోషం కలుగుతుంది కదా? ఉదాహరణకు ఎవరికైనా చాలా నొప్పుగా ఉండి, ఒక కోటి రూపాయలు లాటరీలో వచ్చాయనే ప్రాప్తి వార్త వస్తే ఆ నొప్పి గుర్తుంటుందా లేక లాటరీ గుర్తుకొస్తుందా? కాబట్టి ప్రాప్తి అనేది దుఃఖాన్ని, ఇబ్బందిని మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి రోజూ కొత్త ప్రాప్తి పాయింట్‌ను గుర్తుంచుకోండి. మీ టైటిల్స్ గుర్తుంచుకోండి. టైటిల్ యొక్క సీట్‌పై సెట్ అయి కూర్చోండి. చిన్న పిల్లలలాగా ఘడియ ఘడియ కిందకు రాకండి. చిన్న పిల్లవాడిని కుర్చీలో కూర్చోబెడితే కిందకు వచ్చేస్తాడు. మనస్సు కూడా అల్లరిది, కాబట్టి ఎంత సీట్‌పై కూర్చోబెట్టినా కిందకు వచ్చేస్తుంది. కాబట్టి మీ టైటిల్ యొక్క నషా సీట్‌పై మంచిగా సెట్ అవ్వడం వచ్చు కదా? ప్లేన్‌లో కూడా చూడండి ఎవరూ కిందపడకుండా బెల్ట్ కట్టేస్తారు. మరి దృఢ సంకల్పం అనే బెల్ట్ అందరి దగ్గరా ఉందా! ఎప్పుడైతే కొద్దిగా అలజడిలోకి వస్తున్నట్లుగా అనిపిస్తే అప్పుడు బెల్ట్ కట్టేసుకోండి.
కాబట్టి ఈ సంవత్సరం నవీనత ఏమిటంటే ఎవరిది కూడా నెగిటివ్ సమాచారము రాకూడదు. సరేనా? హా జీ నా, లేదా నా జీ నా? ఇప్పుడు మీ ఈ సౌండ్ కూడా టేప్‌లో రికార్డ్ అవుతోంది. మీరందరూ కూడా కోరుకుంటున్నారు, కేవలం బాబా మాత్రమే కోరుకోవడం లేదు, మీరందరూ కూడా, ఇప్పుడు వెంటనే ఫరిశ్తాలుగా అయిపోవాలి అని కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు కదా? (అందరూ హా జీ అని చెప్పారు) ‘హా’ చాలా బాగా చెబుతారు. ‘హా’ అని విని బాబా కూడా సంతోషిస్తారు. కానీ ఎలాంటి ఎలాంటి ఉత్తరాలు వస్తాయంటే, వేస్ట్ పేపర్ బాక్స్‌లో వేసేవిగా ఉంటాయి, చదవడానికి కూడా మనస్కరించని అలాంటి ఉత్తరాలు కూడా వస్తాయి. లిఫాఫా (కవర్) చూసే అర్థమైపోతుంది - ఇది అలాంటిదే ఏదో సమాచారమని. మంచివి కూడా వస్తాయి. ప్రేమవి కూడా వస్తాయి, ఉల్లాసానివి వస్తాయి, సంతోషానివి వస్తాయి కానీ అనవసరమైనవి కూడా వస్తాయి. వేస్ట్ మనీ, వేస్ట్ టైమ్ - తమది కూడా, ఇతరులది కూడా. మీ సేవాకేంద్రంలో అలాంటి ఉత్తరాలు రాసేవారు ఉంటే వారిని కూడా పరివర్తన చేయండి. మరి ఈ సంవత్సరం ఏ సంవత్సరంగా ఉంటుంది? ఆనందం (మౌజ్) యొక్క సంవత్సరం. ఫరిశ్తా స్వరూపము, ఫరిశ్తాల ప్రపంచంలో ఉండేవారు. ఎటు చూసినా ఫరిశ్తాయే ఫరిశ్తా! ఒక ఫరిశ్తా ఎగురుతోంది, ఒక ఫరిశ్తా సందేశాన్ని ఇస్తోంది, ఒక ఫరిశ్తా కింద ధరణిపైకి వచ్చి కర్మేంద్రియాలతో కర్మలు చేస్తోంది - ఇలాగే కనిపించాలి. సృష్టి మారిపోవాలి. ఎటు చూసినా ఫరిశ్తాల ప్రపంచం. దృష్టి పరివర్తన, వృత్తి పరివర్తన. అచ్ఛా!
సేవ ఏమి చేస్తారు? ఈ సంవత్సరంలో ఏమైనా విశేష సేవ కూడా చేస్తారా? ఏమి చేస్తారు? మేళా చేస్తారా, ప్రదర్శనీలు చేస్తారా, కాన్ఫరెన్స్‌లు చేస్తారా? ఇవైతే చేస్తూనే ఉంటారు. నవీనత ఏమి తీసుకొస్తారు? బాప్‌దాదా యొక్క ఒక సంకల్పాన్ని పిల్లలు ఇంకా పూర్తి చేయలేదు. బాప్‌దాదా పదే పదే సూచన ఇస్తున్నారు - ‘వర్తమాన సమయంలో క్వాంటిటీనైతే పెంచుతూ వెళ్తున్నారు కానీ క్వాలిటీ అంటే వారసులు పెరగాలి, లిస్ట్లోనైతే వచ్చేస్తుంది - ఇంతమంది పెరిగారు అని, ప్రైజ్ కూడా తీసుకున్నారు కదా’. బాప్‌దాదా విన్నారు - వెండి గ్లాస్ కూడా గిఫ్ట్‌గా తీసుకున్నారు అని. అదీ మంచి విషయమే. ఎందుకంటే రాజధానిలో అన్ని రకాలవారు కావాలి. కానీ ఇప్పుడు చాలా సమయం నుండి వారసుల క్వాలిటీ చాలా తక్కువగా వెలువడుతోంది. సంబంధ-సంపర్కంలోకి వచ్చేవారు పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతోంది. అదీ డ్రామా అనుసారంగా జరగాల్సిందే, అవసరమే కానీ ఇది మిస్ అవుతోంది. ఇప్పుడు వారసుల క్వాలిటీని ప్రత్యక్షం చేయండి. క్వాంటిటీని చూసి బాప్‌దాదా కూడా సంతోషిస్తున్నారు, కానీ దాంతో పాటు దీని పైన కూడా అండర్లైన్ చేయండి. మరియు రెండో విషయం, ఇప్పుడు జ్ఞాన సరోవర్ కూడా తయారైపోవాల్సి ఉంది మరియు దీనిని విశేషంగా తయారుచేసినదే సంపర్కంలో ఉన్నవారిని వారసులుగా తయారుచేయడానికి! బాప్‌దాదా మునుపు కూడా చెప్పారు - జ్ఞాన సరోవర్ - ఇది సేవ వృద్ధి యొక్క గని! మరి సేవ యొక్క స్థానము తయారవుతూనే ఉంది, అవ్వాల్సిందే, అయ్యే ఉంది కాబట్టి సేవ కూడా చేస్తారు కదా? లేక కేవలం చూసి ‘చాలా బాగా తయారైంది, చాలా బాగా తయారైంది’ అని సంతోషిస్తారా? కాబట్టి ఒక పెద్ద విశాలమైన ప్రోగ్రామ్ చేయండి - ఏదైనా విశేష స్థానాన్ని తయారుచేసినప్పుడు, విశేష స్థానపు సెరిమనీలో వేర్వేరు దేశాల వారందరూ నీళ్ళు వేస్తారు లేదా మట్టి వేస్తారు. మరి మీరు నీళ్ళు లేదా మట్టి అయితే వేయించరు కానీ మొత్తం విశ్వంలో ఒక్క రాష్ట్రం కూడా ఖాళీగా ఉండకూడదు, అన్ని వైపుల నుండి రావాలి - విదేశమైనా, దేశంలో ఉన్న విభిన్నమైన స్టేట్స్ అయినా, వాటి నుండి ఒక్కొక్కరు తప్పకుండా రావాలి. మరి దీనినే ఇంటర్నేషనల్ అంటారు కదా? లేదా ఇద్దరు-నలుగురు లండన్ నుండి వచ్చేసారు, అమెరికా నుండి వచ్చేసారు అంటే ఇంటర్నేషనల్ అయిపోతుందా ఏమిటి? కాబట్టి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ చేయండి. ఇప్పుడు డబల్ స్థానం అయిపోయింది కదా. లేకపోతే ‘స్థానం కావాలి, అది కావాలి, సాల్వేషన్ కావాలి’ అని ఆలోచిస్తారు. మరి ఇప్పుడు జ్ఞాన సరోవర్ స్థానం కూడా లభించింది. అందుకని ఈ సంవత్సరంలో అలాంటిది - దేశం, విదేశం రెండూ కలిసి, రెండింటి సలహాతో, రెండింటి ప్లాన్‌తో, రెండింటి ‘హా జీ’తో, రెండింటి సమానత్వంతో ఒక ప్రోగ్రామ్ చేయండి. విదేశాల వారు కూడా ‘హా, మాకు తగినట్లు ఉంది’ అనాలి, దేశం వారు కూడా ‘మాకు తగినట్లు ఉంది’ అనాలి. విదేశాల విధి, దేశం యొక్క విధి - రెండు విధులనూ సమ్మేళనం చేసి, ఒకరినొకరు ముందుంచి, దేశం విదేశాన్ని ముందుంచాలి, విదేశం దేశాన్ని ముందుంచాలి, మరియు ఎంత మంచి ప్రోగ్రామ్ చేయాలంటే ఏ ఒక్క దేశం కూడా వంచితులైపోకూడదు. విదేశాల వారు చెప్పండి, సాధ్యమేనా? జరగాల్సిందే కదా! దేశం వారు చెప్పండి, చేయాలా? మంచిది, వీరు (దాదీ) సంకల్పం అయితే ఉంది. దాదీకి సంకల్పాలు చాలా వస్తాయి, సేవ యొక్క మంచి సంకల్పాలు నిద్రపోనివ్వవు. మంచిది. శుభ సంకల్పాల వల్ల నిద్ర యొక్క బలహీనత ప్రభావం పడదు. మామూలుగా నిద్ర లేచిపోతే బలహీనత లేదా లోటు అనిపిస్తుంది. కాబట్టి మంచిది, అందరి మట్టిని తీసుకురాకండి కానీ అందరి ఆలోచనల మట్టిని పోగుచేయండి. ప్రపంచం వారైతే ‘మట్టి, మట్టి’ చేసేస్తారు కదా, మట్టి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ అందరి ఆలోచనలు నలువైపులా విశ్వంలో శబ్దాన్ని వ్యాపింపజేస్తాయి. ఏ దేశం మాత్రం ఎందుకు వంచితమవ్వాలి? మరియు ఒకరైనా వచ్చారంటే తమ దేశంలో తమ న్యూస్ పేపర్లో వేస్తారు కదా. కాబట్టి ప్రతి ఒక్క విశ్వం యొక్క నాలుగు మూలల సేవ కూడా అయిపోతుంది. కానీ బాప్‌దాదా ఈ సంవత్సరం దేశ-విదేశాల విధి కలగలసిన ప్రోగ్రామ్‌ను కోరుకుంటున్నారు. విదేశాల వారు కూడా వెనుకడుగు వేయకూడదు, దేశం వారు కూడా వెనుకడుగు వేయకూడదు. ఆలోచనలను కూడా కలపాలి కదా. ఒకరితో ఒకరు ‘ముందు మీరు’ అని అనుకోండి. మంచిగా జరగడం సాధ్యమే కదా!
కాబట్టి జ్ఞాన సరోవర్‌లో ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే విశ్వంలో ఎక్కడైనా సరే అలాంటి సేవా సమాచారము ఏ స్థానానిది కూడా ఉండకూడదు. యు.ఎన్. (U.N.) అయినా లేదా దానికంటే పెద్ద స్థానమైనా సరే, దానికంటే పెద్దదిగా అయిపోవాలి. దీనిలో అందరి తనువు కూడా పడింది, మనస్సు కూడా పడింది మరియు చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు అందరి ధనము కూడా పడింది. కాబట్టి ఎలాగైతే అందరి సహయోగం యొక్క వేలు పడిందో, అలాగే సేవలో కూడా అందరి సహయోగం యొక్క వేలు పడాల్సిందే. ప్లాన్స్ ఇస్తూ ఉండండి, కానీ ప్లాన్ తయారుచేసే సమయంలో, ఇచ్చే సమయంలో యజమానిగా (మాలిక్‌గా) అయి ఇవ్వండి మరియు ఫైనల్ మెజారిటీ చేసినప్పుడు బాలునిగా (బాలక్గా) అయిపోండి. బాలుడు ఏమి చేస్తాడు? 'హా జీ' అంటాడు, మరియు యజమాని ఏమి చెబుతాడు? ‘లేదు, ఇలా చేయండి’ అని. కాబట్టి బాలుడు మరియు యజమాని. ప్లాన్ ఇవ్వడం మంచిదే, కానీ ‘ఈ ప్లాన్ జరగాల్సిందే’ అని ఆలోచించకూడదు. ఏది జరిగితే అది మంచిది. పక్కకు తప్పుకోకండి, ప్లాన్ ఇవ్వండి కానీ బాలునిగానూ అవ్వండి, యజమానిగానూ అవ్వండి. తయారుచేసే సమయంలో యజమాని మరియు ఫైనల్ అయ్యే సమయంలో బాలుడు. బాలుడు మరియు యజమానిగా అవ్వడం వచ్చా లేక కేవలం యజమానిగా అవ్వడమే వచ్చా? ఎందుకంటే అందరూ తెలివైనవారైపోయారు కదా! యజమానిగా త్వరగా అయిపోతారు. ఇప్పుడు అర్థమైందా, కొత్త సంవత్సరంలో ఏమి చేయాలో? సేవ కూడా చేయాలి మరియు సేవ కంటే ముందు స్వయం పరివర్తకులు. రెండూ కావాలి కదా!
కాబట్టి కొత్త సంవత్సరం జరుపుకున్నారు. జరుపుకోవడం అంటే అవ్వడం మరియు తయారుచేయడం. ఇదే జరుపుకోవడం అంటే, అంతేకానీ కేవలం డాన్స్ చేసేస్తే జరుపుకున్నట్లు కాదు. అదీ చేయండి, డాన్స్ కూడా బాప్‌దాదాకు బాగా నచ్చుతుంది. కానీ మనస్సు యొక్క డాన్స్ కూడా చేయండి. బాప్‌దాదా అన్ని పాటలూ వింటారు, డాన్స్ కూడా చూస్తారు, ఏ ప్రోగ్రామ్‌నూ మిస్ చేయరు. ఎందుకు? చూడండి, మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మొదట పాటలో బాబాను స్మృతి చేస్తారు కదా? బాబాను స్మృతి చేసినప్పుడు రాక తప్పదు, చూడక తప్పదు. మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు బాప్‌దాదాకు కూడా బాగా అనిపిస్తుంది. అచ్ఛా!
హాస్టల్ కుమారీలతో:- హాస్టల్ కుమారీలను చూస్తే ఆది స్థాపన సమయం గుర్తుకు వస్తుంది. మొదట ఇలాగే కదా హాస్టల్ తెరిచారు. మొదట బ్రహ్మా బాబా హాస్టల్ లేదా గురుకులం లేదా బోర్డింగ్ తెరిచినప్పుడు ఫౌండేషన్లు వెలువడ్డారు. ఈరోజు యజ్ఞంలో ఎవరైతే నిమిత్త ఫౌండేషన్లు ఉన్నారో, వారందరూ బోర్డింగ్ వారే కదా! టీచర్‌గా ఉన్నా, స్టూడెంట్‌గా ఉన్నా కానీ ఆది స్థాపన వారే కదా. కాబట్టి ఎక్కడ హాస్టల్ ఉన్నా అక్కడ నుండి అలాంటి ఫౌండేషన్లు తయారవ్వాలి. అర్థమైందా? కేవలం కాలేజ్-స్కూల్లో చదువుకున్నారు, సెంటర్‌ను సంభాళించారు... అని కాదు, అంత పెద్ద కార్యము చేయాల్సి ఉంది. మంచిది, సాధనము బాగుంది.
డబల్ విదేశీయులు
యు.కె., యూరోప్:- యు.కె. మరియు యూరోప్ వారు ఇద్దరూ కలిసి చేతులు ఎత్తండి. సెకనులో చూడండి, చేతులు కిందకు దించేశారు. మనస్సు యొక్క డ్రిల్ కూడా సెకనులో ఇలాగే ఉందా? అప్పుడే ఎగురుతున్న కళ, అప్పుడే కర్మయోగి. చేతుల ఎక్సర్సైజ్ మంచిగా ఉంది, మనస్సు యొక్క ఎక్సర్సైజ్ కూడా ఇలాగే ఉందా? మరి యు.కె. లేదా యూరోప్ యొక్క ప్రత్యేకత ఏమిటి? యు.కె. అనేది విదేశ సేవా వృక్షానికి బీజం. మరి బీజం యొక్క ప్రత్యేకత ఏమిటి? బీజానికి నీరు పోస్తే మొత్తం చెట్టు ఆకు-ఆకుకూ నీరు చేరుతుంది. కాబట్టి ఈరోజు కూడా విదేశ వృక్ష సేవ యొక్క ఫౌండేషన్‌కు యు.కె. నిమిత్తంగా ఉంది, విదేశాలలోని అన్ని దేశాలకు పాలన అనే నీరు ఎక్కడి నుండి లభిస్తోంది? యు.కె. నుండి కదా! కాబట్టి యు.కె. తమ బీజం యొక్క కార్యాన్ని బాగా చేస్తోంది. అలా అని కేవలం ఒకరు మాత్రమే కాదు, అందరూ సహయోగులు. మీరందరూ కూడా యు.కె. వారు లేదా యూరోప్ వారు సహయోగులే కదా? దాదీలకు సహాయం ఇస్తున్నారా? లేక, దాదీ పని దాదీకే తెలుసు అని అంటున్నారా? అలా అనడం లేదు కదా! భుజాలు మంచిగా లభించాయి కదా! కాబట్టి బాప్‌దాదా బీజాన్ని సదా శక్తిశాలిగా చూసి హర్షిస్తారు. మరియు రెండో యు.కె. లేదా యూరోప్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే సేవలో తనువు-మనస్సు-ధనము మూడింటిలోనూ ఎవరెడీగా ఉన్నారు. ఏ కార్యమైనా సాధారణంగా ఆలోచిస్తే ‘ఎలా జరుగుతుంది’ అని అనిపిస్తుంది, కానీ యు.కె. యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏ కార్యమైనా దృఢ సంకల్పము మరియు సహయోగం యొక్క వేలితో సహజమైపోతుంది. సహజమైపోతుంది కదా! మ్యూజియం తయారవ్వడానికి ముందే చేసేవారు తయారై ఉన్నారు కదా! కాబట్టి దీనిని విశేషత అని అంటాము. సర్వుల సహయోగం యొక్క వేలు శక్తిశాలిగా ఉంది. ఎవరైనా, హా, చేసేయండి, చేసేయండి, చేసేయండి అని ధైర్యము ఇచ్చినా, ఆ ధైర్యము కూడా సహయోగం యొక్క వేలే. కానీ రిజల్ట్‌లో చూడబడింది - తనువు-మనస్సు-ధనము మూడింటిలోనూ సదా హా జీ చేసేవారే కానీ ఆలోచించేవారు కారు. అందుకని ప్రతి కార్యమూ సహజమైపోతుంది. ఒకవేళ ఆలోచించేవారు అయితే గనుక ఆ సూక్ష్మ వైబ్రేషన్, ఆ వేలు తగ్గిపోతుంది. కాబట్టి సర్వుల వేలితో సఫలత లభిస్తుంది. కొద్దిగా అయినా, ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని ఆలోచించేవారు ఉంటే, సంగఠన యొక్క స్నేహపు వేలు లేకపోవడం కారణంగా సఫలతలో లోటు వస్తుంది. అందుకని యు.కె. లేదా యూరోప్ వారికి మరియు సర్వ విదేశాల సహయోగి ఆత్మలకు కార్యంలో ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు! అర్థమైందా!
ఆస్ట్రేలియా:- బాప్‌దాదా ఆస్ట్రేలియా పేరు విన్నప్పుడు, పేరు వినగానే ఆస్ట్రేలియా యొక్క బాల్య సమయం చాలా గుర్తుకు వస్తుంది. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వారు చేతులు ఎత్తండి. ఆస్ట్రేలియాలో చాలా మంచి మంచి రత్నాలు వెలువడ్డారు. ఆస్ట్రేలియా యొక్క ఈ విశేషత ఏముందంటే - యు.కె.లో అయినా మిక్స్ ఉన్నారు, భారత్వాసులు ఉన్నారు, విదేశీయులు కూడా ఉన్నారు, మిక్స్ క్లాస్ ఉంది, కానీ ఆస్ట్రేలియా సేవ విదేశీయుల సంఖ్యను చాలా పెంచింది. మరియు క్లాస్ యొక్క శోభ, విదేశీ ఆత్మల క్లాస్ యొక్క శోభ అన్నింటికంటే నంబర్‌వన్ ఆస్ట్రేలియాదే ఉంది. కొందరు కొద్దిగా అటు ఇటు వెళ్తూ ఉంటారు, చక్కర్లు కొడతారు కానీ ఫౌండేషన్‌కు నిమిత్తమయ్యారు. మరియు వెళ్ళేవారు కూడా ఎక్కడికి వెళ్తారు? రావలసిందే కదా! కేవలం చక్కర్లు కొట్టడానికి వెళ్తారు. మళ్ళీ చక్రం పూర్తయినప్పుడు ‘బాబా, నేను మీవాడినే, మీవాడిగానే ఉంటాను’ అని అంటారు. ఆస్ట్రేలియా యొక్క విశేషత ఏమిటంటే అక్కడ ప్లానింగ్ బుద్ధి చాలా బాగుంది. సేవ యొక్క ప్లాన్స్ తయారుచేయడంలో మరియు సేవలో సహయోగం ఇవ్వడంలో, పెద్ద పెద్ద ఇన్వెన్షన్లను ప్రాక్టికల్లోకి తీసుకురావడంలో ప్లేన్ బుద్ధిగానూ ఉన్నారు, సహయోగిగానూ ఉన్నారు. ప్లేన్ బుద్ధిగా అయి ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకురావడంలో కొద్దిగా కేవలం అండర్లైన్ చేయండి. అర్థమైందా? కొద్దిగా అండర్లైన్ చేయాల్సి ఉంది - ప్లానింగ్‌తో పాటు ప్లేన్ బుద్ధి. ప్లేన్ బుద్ధిగా అయి ప్లాన్ తయారుచేసినప్పుడు ప్లాన్‌లో సర్వ శక్తులు నిండిపోతాయి మరియు ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత కూడా నిర్విఘ్నంగా 100% ఉంటుంది. కాబట్టి ఆస్ట్రేలియా యొక్క మంచి మంచి రత్నాలు బాప్‌దాదా దృష్టిలో సదా ఉంటారు. సఫలత స్వరూపులుగానూ ఉన్నారు, సేవలో ముందుకు వెళ్లేవారిగానూ ఉన్నారు, నడిపించేవారుగానూ ఉన్నారు. కాబట్టి ఆస్ట్రేలియా యొక్క విశేషత కూడా తక్కువేమీ కాదు. ఆస్ట్రేలియాను బాప్‌దాదా సదా ముందుకు వెళ్లేవారి దృష్టితో చూస్తారు. మరియు మూడో విశేషత ఏమిటంటే పాండవులు మరియు శక్తులు ఇద్దరూ కూడా సెంటర్లు తెరవడానికి నిమిత్తంగా ఉన్నారు. పాండవులు కూడా శక్తులకు తక్కువేమీ కారు. పాండవులు కూడా నిమిత్తంగా అవ్వడంలో మంచి సహయోగులు. అక్కడికి వెళ్తే ఏమి చూస్తారు? ఇది పాండవుల సెంటర్, అది శక్తుల సెంటర్ మరియు ఇద్దరిదీ కలసి రేస్ నడుస్తోంది. అర్థమైందా? ఆస్ట్రేలియా వారు తమ విశేషతలను విన్నారా? అచ్ఛా!
సౌత్ ఏషియా:- ఏషియా యొక్క విశేషత కూడా ఉంది. ప్రతి స్థానానికి విశేషత ఉంది. ఏషియా భారత్‌కు సమీపంలో ఉంది. కాబట్టి ఏషియా యొక్క శబ్దం భారత్‌లోకి త్వరగా చేరుకుంటుంది. భారత్ యొక్క కుంభకర్ణుడిని లేపడంలో ఏషియా సహజంగా కార్యం చేయగలదు. ఎలాగైతే యు.కె., యూరోప్, అమెరికాలో క్రిస్టియన్లు ఎక్కువగా వెలువడ్డారో, అలాగే ఏషియాలో బౌద్ధ ధర్మం వారు ఎక్కువగా వెలువడ్డారు. వారు క్రిస్టియన్లు, వీరు బౌద్ధులు. కాబట్టి చూడండి, వేరే ధర్మం యొక్క విస్తరణ ఏషియాలో ఎక్కువగా ఉంది. ఎలాగైనా బౌద్ధ ధర్మాన్ని భారత్‌తో ఎక్కువగా కనెక్ట్ చేస్తారు. కాబట్టి ఏషియా యొక్క విశేషత ఇంకా ఏముందంటే ఒకే ఏషియాలో ఆఫీషియల్ ప్రెసిడెంట్ సంపర్కంలో ఉన్నారు. మలేషియా ప్రెసిడెంట్, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ హోమ్లీగా ఉన్నారు కదా మరియు సంఖ్య కూడా బాగుంది. ఎలాగైనా ప్రతి స్థానంలోనూ సంఖ్య వృద్ధిని పొందుతోంది. అందరూ మంచి ఉల్లాస-ఉత్సాహాలతో పెరుగుతున్నారు. ఇప్పుడు కేవలం ఏషియా ఏమి చేయాలంటే అక్కడ ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో, వారిని భారత్ వరకు చేర్చాలి. ఇంకా భారత్ వరకు చేర్చలేదు. ఈ ఎడిషన్ చేయాల్సి ఉంది. ఎవరైతే విశేష సేవకు నిమిత్తంగా ఉన్నారో, వారందరూ కలిసి సంపర్కంలో ఉన్నవారందరినీ సమీపంలోకి తీసుకురండి. దేశం ఎంత సమీపంలో ఉందో, శబ్దాన్ని కూడా అంత సమీపంలోకి తీసుకురండి. మరియు శబ్దాన్ని త్వరగా చేర్చగలిగేలా ఉండాలి. కాబట్టి ఇప్పుడు త్వరత్వరగా భారత్ వరకు శబ్దాన్ని చేర్చండి. ఇంకా భారత్ వరకు చేరలేదు. అచ్ఛా!
మారిషస్:- మారిషస్ విశేషతే ఏమిటంటే మారిషస్ స్టూడెంట్లు మంచి ఏకరసంగా నడిచేవారు. కొద్దిగా అటు ఇటు అవుతుంది, అది పెద్ద విషయం కాదు. కానీ మెజారిటీ చూడబడుతుంది - మారిషస్ స్టూడెంట్లు ఎక్కువ అలజడిలోకి రారు. కాబట్టి మారిషస్ విశేషత - ఒకటేమో అలజడి తక్కువగా ఉంది, అచలంగా ఎక్కువగా ఉన్నారు మరియు రెండోది సహయోగులుగా సహజంగా అయిపోతారు, ఐ.పి. అయినా, వి.ఐ.పి. అయినా కానీ సహయోగం ఇవ్వడంలో మంచి నిమిత్తంగా అయిపోతారు. ఐ.పి. లేదా వి.ఐ.పి. సేవలో శ్రమ పట్టదు. ఈజీ ధరణి. గందరగోళం ఉండే ధరణి కాదు. శ్రమ తీసుకునే ధరణి కాదు. అందుకే మారిషస్ కూడా భారత్‌కు చాలా సమీపంలో ఉంది. మారిషస్ వారు భారత్ యొక్క ఫిలాసఫీని కూడా నమ్ముతారు. అందుకని మారిషస్ శబ్దం కూడా భారత్‌లో త్వరగా చేరగలదు. ప్రత్యక్షత చేయడంలో మొదట ఎవరి జెండా చేరుకుంటుంది? మారిషస్దా లేదా ఏషియాదా? మారిషస్ది మొదట చేరుతుందా? ఏషియా వారు కూడా పరిగెత్తి పరిగెత్తి ఫ్లాగ్ తీసుకువస్తారు మరియు మారిషస్ వారు కూడా తీసుకువస్తారు. అంతా విదేశం వైపు నుండి ప్రత్యక్షత జెండా భారత్‌లోకి వస్తుంది. కాబట్టి మంచిది, మారిషస్ వారికి కూడా సహజ సఫలత ఉంది. ఇది విశేష ధరణికి మరియు బ్రాహ్మణ సేవాధారులకు లభించిన వరదానము.
ఆఫ్రికా:- ఆఫ్రికా విశేషత ఏమిటంటే ఈ దేశాలు సదా భయం గుప్పెట్లో ఉండే దేశాలు, భయంలో నిర్భయంగా ఉండడం - ఇది ఆఫ్రికా వారి విశేషత. బాప్‌దాదా సదా పిల్లి పిల్లల కథను గుర్తు చేసుకుంటారు, నలువైపులా ఉన్న నిప్పుల మధ్యలో పిల్లి పిల్లలు సురక్షితంగా ఉన్నాయి. కాబట్టి ఆఫ్రికా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరైతే బాబా పిల్లలు ఉన్నారో వారు ధైర్యము మరియు నిర్భయతలో చాలా మంచి ఎ-వన్‌గా ఉన్నారు. వారిది అద్భుతం. ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే కానీ సేవను వదలరు. పక్కాగా ఉన్నారు. కాబట్టి బాప్‌దాదా వారి నిర్భయతను మరియు ధైర్యాన్ని చూసి సదా ఛత్రఛాయను ఇస్తారు మరియు అభినందనలు కూడా ఇస్తారు - అద్భుతమైన పిల్లలు అని. ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ పరిస్థితిలో స్వ-స్థితి యొక్క ఋజువును ఇచ్చేవారు. అందుకని వచ్చేవారిలో కూడా ధైర్యాన్ని నింపుతూ ఉంటారు. నిమిత్తంగా ఉన్నవారే అలజడిలోకి వస్తే వచ్చేవారు కూడా అలజడిలోకి వచ్చేస్తారు మరియు ఈ దేశం వంచితమైపోతుంది. కానీ పిల్లలది అద్భుతం, అచలంగా ఉండి ధైర్యాన్ని ఉంచారు. సదా ముందుకు వెళ్తూ ఉంటారు మరియు సేవాకేంద్రాలు తెరుస్తూ వెళ్తున్నారు, ప్రజలు పారిపోతూ ఉంటారు మరియు వీరు తెరుస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఇది విశేషత. బాబా విశ్వకళ్యాణకారి అని ఏదైతే పేరు ఉందో, నల్లగా ఉన్నా లేదా తెల్లగా ఉన్నా కానీ నల్లవారిని కూడా తెల్లగా తయారుచేయడం - ఇది కూడా విశేషమైన సేవ. విశ్వకళ్యాణంలో వీరు కూడా ఉండాలి కదా. వీరు లేకపోతే విశ్వకళ్యాణం అని అనలేరు కదా. సౌత్ ఆఫ్రికా కూడా చూడండి, సేవ యొక్క ఉల్లాసం కారణంగా స్వతంత్రమైపోయింది కదా. కాబట్టి ఇది ధైర్యం యొక్క అద్భుతం. సౌత్ ఆఫ్రికాలో కూడా సేవ యొక్క ఛాన్స్ ఇప్పుడు సహజంగా లభించింది కదా. మరి ఇది ఎవరు ధైర్యం ఉంచారు? పిల్లలు ధైర్యం ఉంచారు మరియు స్వతంత్రంగా అయ్యారు. మీ సేవ దేశాన్ని స్వతంత్రం చేసింది. కాబట్టి ఆఫ్రికా రిజల్ట్ మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నదిగా ఉంది. అన్నింటికంటే ధైర్యంలో నంబర్‌వన్. అర్థమైందా? ఆఫ్రికా వారు ధైర్యవంతులా? భయపడడం లేదు కదా? మంచిది, ఋజువు ఇచ్చేవారు. మరి ఋజువు ఇచ్చేవారిని బాప్‌దాదా సుపుత్రులు అంటారు. ఎవరైతే సుపుత్రులు ఉంటారో వారు ఋజువు ఇస్తారు. కాబట్టి మంచిగా పెరుగుతోంది మరియు పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? శ్రీలంక కూడా చిన్నది కానీ అద్భుతం చేస్తోంది.
జాపాన్:- జాపాన్‌లో సేవ యొక్క శ్రమ ఉంది కానీ శ్రమకు భయపడేవారు కారు. కొన్ని కొన్ని ధరణిలు శ్రమ ఉన్నవిగా ఉంటాయి. కాబట్టి జాపాన్‌లో శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది కానీ ఫౌండేషన్లు పక్కాగా అయ్యాయి కదా. మరి ఫౌండేషన్‌లో శ్రమ పడుతుంది, ఇప్పుడు ఫౌండేషన్లు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు సహజంగా అవ్వాలి. సేవ యొక్క ఫౌండేషన్‌కు ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారు బాప్‌దాదాకు సదా ఎదురుగా ఉంటారు. కాబట్టి జాపాన్ కూడా మంచి ప్రోగ్రెస్ చేస్తోంది. అచ్ఛా!
అమెరికా:- అమెరికా యొక్క విశేషత ఏమిటంటే అమెరికాలో విస్తరణ చాలా బాగా చేశారు. అమెరికాలోని నలువైపులా మంచి మంచి సేవాస్థానాలు తెరిచారు, నడుస్తున్నాయి. కాబట్టి అమెరికా విస్తరణ బాగా చేసింది. మూలమూలన శబ్దాన్ని వ్యాపింపజేశారు. ఏరియా ప్రకారం చూస్తే అన్నింటికంటే ఎక్కువగా సేవాకేంద్రాలను మంచి ధైర్యంతో తెరుస్తున్నారు మరియు తెరుస్తూనే ఉంటారు. కాబట్టి ఎలాగైతే అమెరికా దేశం యొక్క విస్తరణ ఉందో, అలాగే సేవ యొక్క విస్తరణ కూడా బాగా చేశారు. మరియు ప్రతి స్థానంలోనూ బాబా పిల్లలు వెలువడుతూనే ఉంటారు. ఎక్కడైనా కొద్దిగా ఉన్నా, ఎక్కడైనా ఎక్కువగా ఉన్నా అది వేరే విషయం, కానీ శబ్దమైతే చేరుకుంది కదా. మరియు అమెరికా యొక్క రెండో విశేషత - బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, దానిని ప్రసిద్ధం చేయడానికి యు.ఎన్. ద్వారా అమెరికానే నిమిత్తంగా ఉంది కదా. కాబట్టి అమెరికా, విశ్వవిద్యాలయాన్ని, కార్యాన్ని సహజంగా ప్రత్యక్షం చేయడానికి నిమిత్తంగా అయి ఉంది. మరియు ఎవరు విన్నా అందరూ ఆశ్చర్యపోతారు - బ్రహ్మాకుమారీలు యు.ఎన్. వరకు చేరుకున్నారా! అని. కాబట్టి ఇది కూడా విశేషమైన సేవకు సాధనము. మరియు సాధనంగా తయారుచేయడానికి నిమిత్తము అమెరికానే. కాబట్టి అమెరికా విస్తరణ నలువైపులా పేరు వ్యాపింపజేయడంలో బాగా ముందుకు వెళ్తోంది. అచ్ఛా!
రష్యా:- మన చిత్రాలలో కూడా రష్యా మరియు అమెరికాలను విశేషంగా చూపించారు. ఒక పిల్లి పాపం బలహీనమైపోయింది. కానీ రష్యా వారు, సేవ యొక్క ఏ భాగమైతే మిగిలి ఉందో ఆ భాగాన్ని పూర్తి చేశారు. మరియు వీరిది ఎంత ధైర్యమంటే ఎకానమీ డౌన్ అయినప్పటికీ వీరు స్వయంగా డౌన్ అవ్వరు. ధైర్యం తగ్గదు. అయినా చూడండి, ఇంత పెద్ద గ్రూప్ చేరుకుంటుంది. సమాచారం వింటే ‘చాలా కష్టం, చాలా కష్టం’ అని అంటారు, మళ్ళీ గ్రూప్ కూడా చేరుకుంటుంది. దీనినే ‘సచ్ఛీ దిల్ పర్ సాహబ్ రాజీ’ (సత్యమైన హృదయముపై సాహెబ్ రాజీ అవుతారు) అని అంటారు. ఎక్కడో ఒక చోట నుండి చేరుకునే ధైర్యాన్ని బాగా ఉంచుకుంటారు. సంఖ్యలో వెనుకడుగు వేయరు. ఇంకా సంఖ్య లభిస్తే వచ్చేస్తారు. కాబట్టి ఎకానమీతో పాటు ఏక్నామీ (ఒక్క బాబా స్మృతి)లో కూడా తెలివైనవారు. ఎకానమీని లెక్కచేయరు కానీ ఏక్నామీగా అవ్వడంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మంచిది, బాప్‌దాదా పేరును ప్రఖ్యాతి చేయడంలో సహయోగులుగా ఉన్నారు, స్నేహీలుగా ఉన్నారు మరియు సదా ముందుకు వెళ్తూనే ఉంటారు.
భారత్:- మంచిది, భారత్ అయితే మొదట ఉంది, విదేశాల వారు భారత్‌లోకి కదా వచ్చారు. కానీ భారత్వాసులు. భారత్వాసులా లేక విదేశీయులా? అసలైనవారైతే భారత్వాసులే కదా? మీరైతే సేవ కొరకు వెళ్ళారు. ఒరిజినల్ ఆత్మ యొక్క సంస్కారాలు ఏవి? విదేశానివా లేక భారత్‌వా లేక విదేశం కల్చర్ వేరా? మునుపు చాలా అనేవారు, మునుపు విదేశీయుల నుండి ఈ కంప్లైంట్ వచ్చేది - ‘విదేశం యొక్క కల్చర్ వేరు, భారత్ యొక్క కల్చర్ వేరు’ అని. ఇప్పుడు పరివర్తన అయిపోయింది. ఇప్పుడు అలాంటి కంప్లైంట్ ఎవరో ఒకరిది అరుదుగా వస్తుంది. ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు సంస్కారాలు ఇమర్జ్ అయిపోయాయి, లేక భారత్ కల్చర్ కష్టంగా అనిపిస్తోందా? కష్టంగా అయితే అనిపించడం లేదు కదా? కాబట్టి భారత్ వారి విశేషత ఏమిటంటే సదా డబల్ విదేశీయుల ఆతిథ్యం చేయడం. వచ్చేవారిని, వెళ్ళేవారిని కూడా అతిథి అని అంటారు. నిజానికి చూస్తే యజమానులే కానీ వస్తున్నారు మరియు వెళ్తున్నారు, ఆ రకంగా చూస్తే అతిథులు కూడా. బాప్‌దాదా కూడా అతిథిగా అయి వస్తారు. కాబట్టి బాప్‌దాదా కూడా భారత్‌కు అతిథి అయ్యారు కదా! విదేశానికి అతిథిగా అయ్యారా? అవ్వలేదు. భారత్‌కే అతిథిగా అయ్యారు. కాబట్టి భారత్ యొక్క విశేషత ఏమిటంటే భగవంతుడు కూడా భారత్‌లోనే అతిథిగా అయి వస్తారు మరియు మీ అందరికీ రాజ్యభాగ్యాన్ని కూడా భారత్ వారే ఇస్తారు కదా. భారత్‌లో మహల్ కడతారా లేక విదేశంలోనా? ఎక్కడ మహల్ కడతారు? భారత్‌లోనే కడతారు కదా? కాబట్టి చూడండి, భారత్ ఎంత విశాల హృదయము ఉన్నదో! భగవంతుడిని కూడా అతిథిగా చేసుకోగలిగినవారు ఎంత గొప్పవారయ్యారు! కాబట్టి భారత్ యొక్క విశేషత ఏమిటంటే ఒకటేమో అందరికీ విశాల హృదయంతో ఆతిథ్యం ఇస్తారు, రెండోది భారత్ స్థాపనకు నిమిత్తంగా ఉంది. భారత్ యొక్క సోదరీమణులు విదేశ సేవకు వెళ్ళకపోతే మీరు ఎలా వచ్చేవారు? విదేశాల సేవకు భారత్ యొక్క సోదరీమణులు నిమిత్తంగా అయ్యారు కదా. కాబట్టి భారత్ స్థాపనకు నిమిత్తంగా ఉంది. మరియు భారతే మీ అందరినీ రాజ్యానికి సహచరులుగా చేయడానికి నిమిత్తంగా ఉంది. మొదట మీకు మహల్ ఇస్తారు, మొదట మిమ్మల్ని ఉంచుతారు. భారత్ ఉదార హృదయము ఉన్నది, ‘ముందు మీరు’ అని అనేవారు. ‘నేను-నేను’ అని అనేవారు కారు. భారత్ సదా దానపుణ్యాలు చేయడంలో తెలివైనది. కాబట్టి ఇతరులను ముందుకు నడిపించడం అనేది పుణ్యము. అచ్ఛా!
(విదేశాల నుండి సింధీ సోదరసోదరీల గ్రూప్ వచ్చింది) సింధీ గ్రూప్ చేతులు ఎత్తండి. వీరు బ్రహ్మా బాబా దేశపు సహచరులు. కాబట్టి సమీప సహచరులు. కాకపోతే రావడం కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. కానీ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ - అంతే కదా? వెనుకబడి ఉండేవారు కారు. స్నేహము మరియు సహయోగంలో సింధీ గ్రూప్ మొదటి నంబర్ వెళ్తుంది. కాకపోతే ఒక విషయం యాడ్ (చేర్చాల్సి) చేయాల్సి ఉంది. మూడు పదాలు ఉన్నాయి - ఒకటి సహయోగం, రెండోది స్నేహం, మూడోది శక్తి. మరి స్నేహము మరియు సహయోగంలో అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు శక్తి రూపంలో కొద్దిగా ఇంకా ముందుకు వెళ్ళాలి. శక్తి రూపంగా అవుతారు కదా, అప్పుడు రాజధానిలో కూడా నంబర్ తీసుకుంటారు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని స్నేహపు దృష్టితో చూస్తున్నారు - వీరు దేశపు సహచరులు, బాబా దేశపు సహచరులు అని. ఇప్పుడు శక్తి రూపంగా అవ్వడం ద్వారా మిగతా సింధీలను సహజంగా నిద్రలేపుతారు. ఇప్పుడు స్నేహ రూపపు అనుభవాన్నయితే వినిపిస్తున్నారు. శక్తి రూపపు అనుభవాన్ని వినిపించండి - ఇంత శక్తి వచ్చింది, ధారణ యొక్క శక్తి, నడిచే శక్తి అని. ఇప్పుడు దీనిని యాడ్ చేయాల్సి ఉంది. ఇకపోతే బాప్‌దాదాకు నచ్చింది. బాగున్నారు. మంచిది. ఒక్కొక్కరు కనీసం ఎంతమందిని నిద్రలేపుతారు? ఒక దీపము ఎన్ని దీపమాలలను తయారుచేస్తుంది? (లక్షలు!) వాహ్! మంచి ధైర్యము ఉంచారు! వెయ్యి కూడా కాదు, లక్ష. నోట్లో గులాబ్ జామున్! మంచిది, మరియు ఇది తప్పకుండా జరుగుతుంది - ఒకరు వస్తే అనేకుల వాయుమండలం మారుతుంది. రావడం ఆలస్యం చేసినప్పటికీ వాయుమండలమైతే మారుతుంది కదా. వాయుమండలం మారుతోంది కదా? ఇప్పుడు అందరూ, బాగుంది బాగుంది అని చెప్పడం మొదలుపెట్టారు. మంచిగా అవ్వడానికి ధైర్యం లేదు కానీ ‘బాగుంది’ అనుకుంటున్నారు, ఇక్కడి వరకు అయితే చేరుకున్నారు కదా? మొదటి అడుగు అయితే పడింది కదా, ధరణి అయితే తయారైంది కదా. ఇప్పుడు ఇంకా విత్తనాలు వేసి ఫలాలు తీయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వాయుమండలం మారుతూ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మునుపు రావడానికి ఇష్టపడేవారు కారు, ఇప్పుడు రావాలని అనుకుంటున్నారు కానీ ఇక్కడ నుండి వద్దని చెబుతున్నారు. తేడా అయితే వచ్చింది కదా. మీరు వస్తున్నారు, వినిపిస్తున్నారు, కాబట్టి ఇతరులు కూడా ‘మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి’ అని అంటున్నారు కదా. కాబట్టి తేడా వచ్చింది కదా. ఇప్పుడు మాల తయారుచేసి రండి. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు మాల తయారుచేసి వస్తారా లేక కంకణం తయారుచేసి వస్తారా? (మాల) మాల తయారుచేసి వస్తారు. మంచిది, హిమ్మతే బచ్చే మదదే బాప్ (పిల్లల ధైర్యానికి బాబా సహాయం). సదా సహయోగిగా ఉంటారు బాబా. కేవలం ధైర్యం యొక్క ఒక అడుగు ముందుకు వేయండి, బాబా వెయ్యి అడుగులు ముందుకు వేయడానికి బంధించబడి ఉన్నారు. బాబాను కూడా బంధించేవారే కదా. స్నేహపు తాడుతో బంధించడంలో తెలివైనవారు. అచ్ఛా! బాబాకు స్వచ్ఛమైన హృదయము ఉన్నవారు ప్రియంగా అనిపిస్తారు, మరియు బాబా మీకు ప్రియంగా అనిపిస్తారు - అంతేనా? మంత్రమేమీ వేయలేదు కదా. ఈ మంత్రం లాభం కలిగించేది, నష్టం కలిగించేది కాదు. మరి మంచిగా ఈ మంత్రం మీపై పని చేస్తుందా? కొద్దిగా పని చేసి, అక్కడికి వెళ్ళాక దిగిపోవడం లేదు కదా. మంత్రం అంటే పరివర్తన. కాబట్టి పరివర్తన అయిపోయింది కదా. ఈ మంత్రంతో సంతోషంగా ఉన్నారు కదా, భయపడడం లేదు కదా?
అందరూ ‘ఛారిటీ బిగిన్స్ ఎట్ హోమ్’ (దాతృత్వం ఇంట్లోనే మొదలవుతుంది) అని నిరూపించేవారుగా అయ్యారు. లేకపోతే వీరు సేవ చేస్తున్నప్పుడు అందరూ అడుగుతారు - ‘సింధీ ప్రజలు ఎందుకు రారు?’ అని. అప్పుడు మీరు ‘వస్తున్నారు కదా’ అని అంటారు, కాబట్టి సహయోగులుగా అయిపోయారు కదా. టూ లేట్ (చాలా ఆలస్యం) లో రాలేదు, లేట్ (ఆలస్యం) లో వచ్చారు. అయినా లక్కీ (అదృష్టవంతులు). (అందరూ నవ్వుతున్నారు) మంచిది, ఏడవడం లేదు కదా. ప్రజలైతే ఏడిపిస్తారు, మీరైతే నవ్విస్తున్నారు, కాబట్టి మంచిదే కదా. ఏడ్చేవారిని కూడా నవ్వించేయండి. ఫర్వా లేదు, నవ్వనివ్వండి. మళ్ళీ ఈ నవ్వేవారే మీకు నమస్కారం చేయబోతున్నారు. ఈరోజు నవ్వుతున్నారు, రేపు నమస్కారం చేస్తారు. అచ్ఛా!
దుబాయ్:- మంచిది, గుప్త సేవాధారులు. అన్నోన్ బట్ వెరీ వెల్ నోన్ (తెలియనివారే కానీ చాలా బాగా తెలిసినవారు). రాజ్యం పరంగా గుప్త రూపంలో సేవ చేస్తున్నారు మరియు అవినాశి రత్నాలు. ఎంతటి అలజడి అయినా కానీ అవినాశి రత్నాలు కావడం కారణంగా నిశ్చలంగా ఉన్నారు. గుప్తంలో కూడా ముందుకు వెళ్తున్నారు. దుబాయ్ వారు పక్కాగా ఉన్నారు కదా! చలించేవారైతే కారు కదా? కాబట్టి మంచి ధైర్యము ఉంచుకునేవారు. అందుకే బాప్‌దాదా యొక్క స్పెషల్ సహాయం మరియు అభినందనలు. అచ్ఛా!
కొత్త సంవత్సరం జరుపుకున్నారా లేక 12 గంటలకు జరుపుకుంటారా? మీకైతే ప్రతి ఘడియా కొత్తదే కదా లేక 12 గంటలకు కొత్తది అవుతుందా? ప్రతి ఘడియా కొత్తదే, ప్రతి సెకను కొత్త రోజే. ఎప్పుడు జరుపుకున్నా మీ కొరకు కొత్త సంవత్సరమే. యుగమే కొత్తది అయినప్పుడు నవయుగాన్ని స్థాపన చేసేవారికి అంతా కొత్తదేనా లేక 12 గంటలకు కొత్తది అవుతుందా? మీ కొరకు క్రొత్తదే కదా. ఎందుకంటే మీరు కొత్తగా అయిపోయారు కదా! వారైతే గంట మోగిస్తారు. ఇప్పుడు 12 గంటలు అయింది, మోగించేయండి, దీనిలో ఏముంది? అచ్ఛా!
నలువైపుల కల నవయుగ రాజ్యాధికారీ శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తనకు నిమిత్తమైన విశేష ఆత్మలకు, సదా పురుషార్థములో నవీనతను, శ్రేష్ఠతను తీసుకువచ్చే సర్వ స్నేహీ ఆత్మలకు, సదా తండ్రి పేరును ప్రత్యక్షము చేసే సుపుత్రులైన ఆత్మలకు, సదా ‘నాది’ మరియు ‘నేను’ను యథార్థ భావము మరియు అర్థములోకి తీసుకువచ్చే సహజయోగీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- మీ సంకల్పాలు పూర్తవుతున్నాయి కదా! మంచిది, ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి టచింగ్ జరుగుతుంది. బ్రహ్మా బాబాతో సమానంగా ఉన్నారు. బ్రహ్మా బాబాకు నిద్ర వచ్చేదా ఏమిటి? కాబట్టి నిమిత్తంగా అయ్యేవారికి నిమిత్తంగా కావడం కారణంగా సంకల్పాలు మంచివి వస్తూనే ఉంటాయి. మంచిది, మీ సహయోగులు కూడా మంచి మంచివారు ఉన్నారు. ఆది రత్నాల గ్రూప్ బాగుంది. ఫౌండేషన్లు ఎవరైతే ఉన్నారో, ఫౌండేషన్ యొక్క స్తంభాలు ఒకవేళ బలంగా ఉంటే, ఎవరు ఎంత కదిలించినప్పటికీ, పిల్లర్లు పక్కాగా ఉంటే అంతా సహజమవుతుంది. (దాదీలతో) మీరు నిమిత్త పిల్లర్ల గ్రూప్‌ను చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. బలమైన పిల్లర్లు కదా? కదిలిపోయేవారే కారు. ఎవరు ఎంత పిల్లర్‌ను కదిలించినప్పటికీ అవినాశిగా ఉన్నారు. మంచిది, భారత్ మరియు విదేశం - రెండూ సేవాస్థానాలు మరియు సేవలో రేస్ చేస్తున్నాయి. అడ్వాన్స్ అభినందనలు. ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి విశేషమైన ప్రియస్మృతులు ఇవ్వండి. మంచిది. ఏమి జరగలేకపోతుంది! ఏమి అనుకుంటే అది చేయగలరు. (మీరు ఏది అనుకుంటే అది చేయించగలరు) మరియు పిల్లలు నిమిత్తంగా అవ్వగలరు. మంచివారు, నలువైపుల ఉన్నవారు, దేశమైనా, విదేశమైనా కానీ సహయోగులు చాలా మంచివారు ఉన్నారు. మరియు సమయానికి సహయోగిగా అవ్వడం కారణంగా, ఎవరైతే సమయానికి సహయోగిగా ఉంటారో వారికి ఒకటికి పదమారెట్ల ఫలం లభిస్తుంది. స్థానము తన సాధనాన్ని తీసుకువస్తుంది. జ్ఞాన సరోవర్ చూసి అనుకుంటున్నారు కదా - ఇంత ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని, కానీ సహజంగా పెరుగుతూ వెళ్తుంది, జరుగుతూ వెళ్తుంది. ప్రాక్టికల్‌గా బ్రాహ్మణులందరి వేలు ఉల్లాస-ఉత్సాహాలతో పడుతోంది, అందుకే సహజంగా జరుగుతోంది. ఖర్చు కూడా బాగా అవుతోంది మరియు సహయోగం కూడా బాగా లభిస్తోంది, లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ముందుకు కూడా సహయోగం ఇవ్వాలా లేక ఇల్లు కట్టేసారు, అంతేనా? (ఇప్పుడు దాదీ మేళా చేయాలి) మేళా అయితే దీని ముందు ఏమీ కాదు. అదైతే సహజమైనది. ఇది కోట్ల విషయం, అది లక్షల విషయం. తేడా ఉంది కదా! మంచిది, ఏ కార్యమైతే జరిగిపోతుందో మరియు ఎంత త్వరగా జరిగిపోతుందో అంత మంచిది.
(రాత్రి 12 గంటల వరకు సోదరసోదరీలు బాగా పాటలు పాడారు, ఆ తర్వాత బాప్‌దాదా అందరి పిల్లలకు కొత్త సంవత్సరానికి (1995) అభినందనలు చెప్పారు)
నలువైపులా ఉన్న పిల్లలందరికీ కొత్త సంవత్సరానికి పదమ పదమ పదమ రెట్ల అభినందనలు. ఈ కొత్త సంవత్సరంలో ఇదే దృఢ సంకల్పం చేయండి - సదా సంతోషంగా ఉంటాము మరియు అందరికీ దిల్ ఖుష్ మిఠాయిని పంచుతాము అని. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషం వెళ్ళకూడదు. ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చే విషయాలు మాట్లాడినా కానీ, మేము సదా సుఖాన్ని ఇస్తాము, సుఖాన్ని తీసుకుంటాము - ఈ దృఢ ప్రతిజ్ఞతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారా? మరి పాత విషయాలకు, పాత ప్రపంచం యొక్క విషయాలకు వీడ్కోలు ఇచ్చారా? మళ్ళీ వెనక్కి తీసుకోరు కదా? కాబట్టి సదా వీడ్కోలు యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
