‘‘సత్యతకు పునాది పవిత్రత మరియు దాని గుర్తు - నడవడిక మరియు ముఖంలో దివ్యత’’
ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన గురువు తమ నలువైపులా ఉన్న సత్యత యొక్క శక్తి స్వరూపులైన పిల్లలను చూస్తున్నారు. సత్యతకు పునాది పవిత్రత. సత్యతకు ప్రాక్టికల్ ఋజువు ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. ప్రపంచములో కూడా అనేకమంది ఆత్మలు తమను తాము సత్యవాదులము అని చెప్పుకుంటారు లేక భావిస్తారు కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారంగానే ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండదు. మరి మీ అందరి పునాది ఏమిటి? పవిత్రత. కనుక పవిత్రత ఆధారముగా సత్యత యొక్క స్వరూపము స్వతహాగా మరియు సహజంగా సదా ఉంటుంది. సత్యం మాట్లాడటము, సత్యం చేయటము - కేవలం దీనిని మాత్రమే సత్యత అని అనరు. కానీ అన్నింటికన్నా మొదటి సత్యము, దేని ఆధారంగానైతే మీకు పవిత్రతా శక్తి మరియు సత్యతా శక్తి వచ్చిందో, ఆ మొదటి విషయము - మీ సత్య స్వరూపాన్ని తెలుసుకున్నారు, నేను ఆత్మను - ఈ సత్య స్వరూపం గురించి ఇంతకుముందు తెలియదు. మొదటి సత్యము - మీ స్వరూపాన్ని తెలుసుకున్నారు. నేను ఫలానా, నేను ఫలానా అని దేహం పరంగా అంటే అది సత్య స్వరూపమా? సత్య స్వరూపము ఏమిటంటే - మొదట స్వ స్వరూపాన్ని మరియు తర్వాత తండ్రి యొక్క సత్య పరిచయాన్ని తెలుసుకున్నారు. మీ సత్య స్వరూపాన్ని మరియు తండ్రి యొక్క సత్య పరిచయాన్ని బాగా తెలుసుకున్నారా? మూడవ విషయము - ఈ సృష్టి చక్రాన్ని కూడా సత్య స్వరూపములో తెలుసుకున్నారు. ఈ చక్రం ఏమిటి మరియు ఇందులో నా పాత్ర ఏమిటి! మరి మీ పాత్రను చాలా చక్కగా మరియు స్పష్టంగా తెలుసుకున్నారా? మీ పాత్ర మంచిగా ఉంది కదా? అన్నింటికంటే మంచి పాత్ర సంగమయుగానిది అని అంటారు. కానీ మీ దేవాత్మ పాత్ర కూడా విశ్వంలో మొత్తం చక్రంలో ఉన్న ఆత్మలు అందరికన్నా శ్రేష్ఠమైనది. ధర్మాత్మలు, మహానాత్మలు కూడా పాత్రను అభినయిస్తారు కానీ వారు ఆత్మ మరియు శరీరం, రెండింటి పరంగా పవిత్రంగా ఉండరు. కానీ దేవాత్మలైన మీరు శరీరం మరియు ఆత్మ, రెండింటి పరంగా పవిత్రంగా ఉంటారు, మొత్తం కల్పంలో ఇతర ఏ ఆత్మా ఈ విధంగా లేదు. కనుక పవిత్రతా పునాది మీది తప్ప ఇతర ఏ ఆత్మది శ్రేష్ఠంగా లేదు. మీకు దేవాత్మ పాత్ర గుర్తుందా? పాండవులకు గుర్తుందా? దేవాత్మ యొక్క పవిత్రత సహజ రూపంలో ఉండేది. మహానాత్మలు, ఆత్మలను పవిత్రంగా తయారుచేస్తారు కానీ అది చాలా పురుషార్థంతో జరుగుతుంది, సహజంగా కాదు. పవిత్రత అనేది సహజంగానూ ఉండదు, స్వభావం పరంగానూ ఉండదు. కానీ మీ విషయంలో అర్థకల్పం పవిత్రతా జీవితము సహజంగానూ ఉంటుంది మరియు స్వభావంగా కూడా ఉంటుంది. అక్కడ ఏ పురుషార్థమూ ఉండదు. ఇక్కడి పురుషార్థం అక్కడ సహజమైపోతుంది ఎందుకంటే అక్కడ అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండవు, అసలు అపవిత్రత అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు, అందుకే మీ పవిత్రత యొక్క ప్రాక్టికల్ స్వరూపము దేవతా స్వరూపము అనగా దివ్యతతో కూడినది. ఈ సమయంలో ప్రపంచంలోనివారు ఎంతగా తమను తాము సత్యవాదులుగా భావించినా కానీ స్వ స్వరూపం యొక్క సత్యత గురించే తెలియదు, తండ్రి యొక్క సత్య పరిచయం గురించే తెలియదు, కావున వారిని సంపూర్ణ సత్య స్వరూపులు అని అనరు. మీలో కూడా ఎప్పుడైతే స్వయం యొక్క మరియు తండ్రి యొక్క సత్య స్వరూపం స్మృతిలో ఉంటుందో, అప్పుడే సత్యతా శక్తి సదా ఉంటుంది, అప్పుడు స్వతహాగానే మీ ప్రతి సంకల్పం కూడా సత్యంగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక్కోసారి మర్చిపోతారు కూడా, దేహాభిమానంలోకి వచ్చేస్తారు, కావున సంకల్పాలు సదా సత్యతా శక్తితో కూడినవిగా మరియు పవిత్రతా శక్తితో కూడినవిగా ఉండటం లేదు. సదా ఉంటాయా లేక వ్యర్థం కూడా ఉంటుందా? మరి వ్యర్థాన్ని సత్యము అంటారా? అబద్ధము చెప్పలేదు అన్నప్పుడు మరి అది సత్యం ఎందుకు కాదు? ఒకవేళ ఎవరైనా - నేనెప్పుడూ అబద్ధం చెప్పను, సదా సత్యమే చెప్తాను అని అనుకున్నా, సత్యతకు గుర్తు ఏమిటంటే - సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ-సంపర్కాలు అన్నింటిలోనూ దివ్యత అనుభవం అవ్వాలి. సత్యమే మాట్లాడుతున్నారు కానీ దివ్యత లేదు. మీరు చూస్తూ ఉంటారు కదా - చాలామంది, పదే-పదే నేను సత్యమే మాట్లాడుతాను, నేను సత్యమే మాట్లాడుతాను అని అంటూ ఉంటారు. మీరు సదా సత్యంగానే ఉన్నా కానీ మాటలలో, కర్మలలో ఒకవేళ దివ్యత లేకపోతే ఇతరులకు మీ సత్యము, సత్యముగా అనిపించదు. వీరు తమను తాము నిరూపించుకుంటున్నారు అని అనుకుంటారే కానీ ఇది సత్యము అని వారికి అర్థం కాదు. సత్యాన్ని ఋజువు చేయటానికి నిరూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సత్యాన్ని మొండితనంతో ఋజువు చేస్తే, అది దివ్యతగా కనిపించదు. ఇది సాధారణత, ఈ విధంగా ప్రపంచంలో కూడా చేస్తూ ఉంటారు. బాప్‌దాదా సత్యత యొక్క గుర్తు గురించి ఒక స్లోగన్‌లో చెప్తూ ఉంటారు, సాకారుని ద్వారా కూడా విన్నారు, ఎవరైతే సత్యంగా ఉంటారో వారెలా కనిపిస్తారు! సత్యమైనవారు నాట్యం చేస్తూ ఉంటారు, సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. మొండితనంతో నిరూపించినప్పుడు మీరు మీ ముఖాన్ని లేక ఇతరుల ముఖాన్ని గమనించినట్లయితే, అది సంతోషంగా ఉండదు. కొంచెం ఆలోచిస్తున్నట్లుగా మరియు కొంచెం ఉదాసీనంగా ఉంటుంది. నాట్యం చేస్తున్నట్లుగా ఉండదు. సత్యమున్న చోట మనసు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది, సత్యమైనవారు సంతోషంలో నాట్యం చేస్తారు. ఆ సంతోషంలో జీవితంలోని పగలు అయినా లేక రాత్రి అయినా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ సత్యంలో కొద్దిగా అసత్యం కలిసినా, ఆ సమయంలోని జీవితం అంత మంచిగా అనిపించదు. కావున సత్యత యొక్క అర్థమేమిటంటే - సత్య స్వరూపంలో స్థితులై సంకల్పాలు, మాటలు, కర్మలు చెయ్యటము.
ఈ రోజుల్లో సత్యమైనవారు బ్రతకడం కష్టము, అసత్యం చెప్పాల్సే ఉంటుంది అని ఈనాటి ప్రపంచంవారు స్పష్టంగా అంటూ ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో, కొన్ని పరిస్థితులలో బ్రాహ్మణాత్మలు కూడా నోటితో అనరు కానీ - అక్కడక్కడా చతురతతో నడవాల్సే వస్తుంది అని లోలోపల అనుకుంటారు. దానిని అసత్యము అనరు కానీ చతురత అంటారు. మరి చతురత అంటే ఏమిటి? ఇలా చేయాల్సే వస్తుంది అని అంటారు. బయటివారు స్పష్టంగా అంటారు మరియు బ్రాహ్మణులు రాయల్ భాషలో అంటారు. మళ్ళీ నా భావము ఇది కాదు, నాకు అటువంటి భావనా లేదు, అటువంటి భావమూ లేదు కానీ చేయాల్సే వస్తుంది, నడవాల్సే వస్తుంది అని అంటారు. కానీ బ్రహ్మా బాబాను చూసారు, వారు సాకారంలోనే ఉండేవారు కదా. నిరాకారుని గురించైతే మీరు కూడా అనుకుంటారు - శివబాబా అయితే నిరాకారుడు, పైన హాయిగా కూర్చున్నారు, కిందకు వస్తే అసలేమిటో అర్థమవుతుంది! కానీ బ్రహ్మా బాబా అయితే సాకార స్వరూపంలో మీ అందరితోనే ఉండేవారు, విద్యార్థిగా కూడా ఉండేవారు, అంతేకాక సత్యత మరియు పవిత్రతల విషయంలో ఎంత అపోజిషన్ జరిగింది కానీ చతురతతో నడుచుకున్నారా? పవిత్రంగా ఉండాల్సిందేనని మీరు డైరెక్టుగా చెప్పకండి, కొద్దికొద్దిగా ఉండండి అని చెప్పండి అంటూ ఇతరులు ఎన్ని సలహాలు ఇచ్చారు. కానీ బ్రహ్మా బాబా భయపడ్డారా? సత్యతా శక్తిని ధారణ చేయడంలో సహన శక్తి యొక్క అవసరం కూడా ఉంది. సహనం చేయాల్సి ఉంటుంది, వంగాల్సి ఉంటుంది, ఓటమిని స్వీకరించాల్సి ఉంటుంది కానీ అది ఓటమి కాదు, ఆ సమయానికి ఓటమిలా అనిపిస్తుంది కానీ అది సదాకాలిక విజయము.
సత్యతా శక్తితో ఈరోజు డైమండ్ జూబిలీని జరుపుకుంటున్నారు. ఒకవేళ పవిత్రత మరియు సత్యత లేనట్లయితే ఈ రోజు మీ ముఖాలలో, నడవడికలో వచ్చేవారికి ఏదైతే దివ్యత అనుభవం అవుతుందో, అది అనుభవం అవ్వదు. వారు పాదచారులు అయినా సరే, నంబరువారుగా అయితే ఉన్నారు కదా. మహారథులు కూడా ఉన్నారు, పేరుకే మహారథులు కాదు, సత్యమైన మహారథులు అనగా సత్యత యొక్క శక్తితో నడిచే మహారథులు. ఎవరైతే పరిస్థితిని చూసి సత్యత నుండి కొద్దిగానైనా పక్కకు తప్పుకుంటారో, ఏమంటారంటే - వేరే ఏమీ చేయలేదు కానీ ఒకటి-రెండు మాటలు అలా మాట్లాడేసాము, మనస్ఫూర్తిగా మాట్లాడలేదు కానీ బయటకు కొద్దిగా అలా మాట్లాడేసాము - ఇది సంపూర్ణ సత్యత కాదు. సత్యత వెనుక ఒకవేళ సహనం చేయాల్సి వచ్చినా కానీ అది సహనం చేయటం కాదు. బయటకు మేము సహనం చేస్తున్నాము అన్నట్లు అనిపిస్తుంది కానీ మీ ఖాతాలో అది సహనశక్తి రూపంలో జమ అవుతుంది. లేదంటే ఏమి జరుగుతుందంటే, ఒకవేళ ఎవరైనా సహనం చేయటంలో కొద్దిగా బలహీనమైనా సరే, వారు అసత్యము యొక్క ఆధారాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సమయానికి - ఆధారం లభించింది, అంతా బాగైపోయింది అని అనిపిస్తుంది కానీ వారి ఖాతాలో సహన శక్తి జమ అవ్వదు. అప్పుడు - మేము చాలా బాగా నడుస్తున్నాము, మాకు నడుచుకునే విషయంలో చతురత వచ్చింది అని బయటకు అనుకుంటారు కానీ తమ ఖాతాను చూసుకున్నట్లయితే, జమ ఖాతా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చతురతతో నడవకండి. ఇతరులను చూసి కాపీ కూడా చేస్తారు. వీరు ఇలా నడుస్తున్నారు కదా, వీరికి చాలా మంచి పేరు వచ్చింది, వీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, కానీ మేము సత్యంగా నడుస్తున్నాము కదా కావున మేము వెనుక-వెనుకే ఉండిపోయాము. అది వెనుక ఉండిపోవటం కాదు, అది ముందుకు వెళ్ళటము. బాబా దృష్టిలో ముందుకు వెళ్తున్నారు మరియు ఇతరుల దృష్టిలో వెనుక ఉన్నట్లు కనిపించినా కానీ మీకు పని ఎవరితో ఉంది! బాబాతోనా లేక ఆత్మలతోనా? (బాబాతో) బాబా హృదయంలో ముందుకు వెళ్ళటము అనగా మొత్తం కల్పం యొక్క ప్రారబ్ధంలో ముందుకు వెళ్ళటము. ఒకవేళ ఇక్కడ ముందుకు వెళ్ళటంలో ఆత్మలను కాపీ చేస్తే ఆ సమయానికి మీకు పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, భాషణ చేసేవారి లిస్టులోకి వస్తారు, సెంటర్ సంభాళించేవారి లిస్టులోకి వస్తారు కానీ పూర్తి కల్పం యొక్క ప్రారబ్ధం తయారవ్వదు. దీనినే బాప్‌దాదా ఏమంటారంటే - శ్రమ చేసారు, బీజం వేసారు, వృక్షాన్ని పెద్దది చేసారు, ఫలం కూడా వచ్చింది, కానీ పచ్చి ఫలాన్ని తినేసారు, అంటే సదా కొరకు ప్రారబ్ధం యొక్క ఫలం సమాప్తమైపోతుంది. అందుకే అల్పకాలికమైన పేరు-ప్రతిష్ఠలు, గౌరవం కోసం కాపీ చేయకండి. ఇక్కడ పేరు లేకపోవచ్చు కానీ బాబా హృదయంలో మీ పేరు ముందు నంబరులో ఉంది, అందుకే డైమండ్గా అవ్వాలంటే ఇవన్నీ చెకింగ్ చేసుకోండి. కొద్దిగా కూడా రాయల్ రూపంలోని మచ్చ డైమండ్‌లో దాగి అయితే లేదు కదా? కనుక సత్యతా శక్తితో దివ్యతను ధారణ చేయండి. ఏమి సహనం చేయాల్సి వచ్చినా కానీ భయపడకండి, సత్యమనేది సమయమనుసారంగా దానంతటదే ఋజువవుతుంది. సత్యము యొక్క నావ ఊగుతుంది కానీ మునగదు అని అంటారు కదా, కావున చివరికి ఒడ్డుకైతే చేరుకుంటుంది కదా. నిర్భయులుగా అవ్వండి. ఒకవేళ ఎక్కడైనా ఎదుర్కోవలసి వస్తే బ్రహ్మా బాబా జీవితాన్ని ఎదురుగా పెట్టుకోండి. బ్రహ్మా బాబా ఎదురుగా ప్రపంచంలోని పరిస్థితులైతే ఎలాగూ ఉన్నాయి, కానీ వాటితోపాటు రకరకాల పిల్లల యొక్క పరిస్థితులు కూడా ఉండేవి. కానీ సంగఠనలో ఉంటూ కూడా, బాధ్యతలు ఉంటూ కూడా సత్యతా శక్తితో విజయులుగా అయ్యారు. పిల్లల గొడవలు బ్రహ్మా బాబా చూడలేదా? బ్రహ్మా బాబా ఎదురుగా కూడా వెరైటీ సంస్కారాలు కల ఆత్మలు ఉండేవారు, కానీ ఇన్ని పరిస్థితులు ఉంటూ కూడా సత్యత యొక్క స్వ స్థితి వారిని సంపూర్ణంగా తయారుచేసింది.
మరి మీరందరూ ఎలా తయారవ్వాలి? చతురత అయితే లేదు కదా! చాలా బాగా మాట్లాడుతారు - నేనేమీ చేయలేదు, కాస్త చతురతతోనైతే నడవాల్సే వస్తుంది కదా. కానీ ఎప్పటివరకు? కావున సహన శక్తిని ధారణ చేసి అసత్యతను ఎదుర్కోండి, ప్రభావంలోకి రాకండి. చాలామంది ఏమనుకుంటారంటే - మేము మహారథులలో కూడా ఈ విధంగా చూసాము కదా, మరి మహారథులనే ఫాలో చేయాలి కదా, ఇప్పుడు బ్రహ్మా బాబా అయితే ఎదురుగా లేరు, మహారథులే ఉన్నారు కావున వారినే ఫాలో చేసాము. కానీ ఒకవేళ మహారథి కూడా మిక్స్ చేస్తే, చతురతతో నడిస్తే, ఆ సమయంలో ఆ మహారథి, మహారథి కాదు. ఆ సమయంలో గ్రహచారంలో ఉన్నారు, మహారథిగా లేరు. అందుకే బాబా ఏ స్లోగన్ ఇచ్చారు - ఫాలో ఫాదర్ చేయమన్నారా లేక సిస్టర్ బ్రదర్నా? కావున సాకార కర్మలలో బ్రహ్మా బాబాను ఎదురుగా పెట్టుకోండి, ఫాలో చేయండి మరియు అశరీరిగా అవ్వటంలో నిరాకార తండ్రిని ఫాలో చేయండి. మంచి-మంచి పిల్లలైనా కానీ వారు కూడా ఫాలో ఫాదర్యే చేస్తారు. మరి మీరు ఏం చేయాలి? ఫాలో ఫాదర్. పక్కాయేనా లేక కొద్ది-కొద్దిగా లాభం వస్తే ప్రస్తుతం తీసేసుకుందాము, భవిష్యత్తులో చూసుకోవచ్చులే అంటారా? చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు - సత్యయుగములో తక్కువ పదవి పొందినా కానీ సుఖంగా అయితే ఉంటాము, దుఃఖమైతే ఉండనే ఉండదు, అన్ని ప్రాప్తులైతే ఉంటాయి, ప్రజలకు కూడా అప్రాప్తి అనేది ఉండదు, కావున ఇప్పుడైతే ఆనందంగా ఉందాము, తర్వాత విషయం తర్వాత చూద్దాము. కానీ ఈ అల్పకాలికమైన ఆనందము అనేది శిక్షలకు పాత్రులుగా చేస్తుంది. మరి అది సమ్మతమేనా, శిక్షలు అనుభవిస్తారా! ఆ ఆనందాన్ని కూడా అనుభవిస్తారా? వద్దు!
కనుక మూడు విషయాలను గుర్తుంచుకోండి - పవిత్రత, సత్యత మరియు దివ్యత. సాధారణ మాటలు ఉండకూడదు, సాధారణ సంకల్పాలు ఉండకూడదు, సాధారణ కర్మలు ఉండకూడదు, దివ్యత ఉండాలి. దివ్యత అంటే అర్థమే దివ్య గుణాల ద్వారా కర్మలు చెయ్యటము, సంకల్పాలు చెయ్యటము, అదే దివ్యత. పాప కర్మ అంటే ఏమిటి అని మనుష్యులు అడుగుతారు కదా. అప్పుడు మీరు ఏమంటారు - ఏ వికారానికైనా వశమై కర్మ చెయ్యటమంటే అది పాపము. ఇలాగే అర్థం చేయిస్తారు కదా! కనుక దివ్యత అనగా దివ్య గుణాల ఆధారంగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు చెయ్యటము. మరి సత్యత యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారా! (డ్రిల్)
ఒక్క క్షణంలో స్వయాన్ని అశరీరిగా చేసుకోగలరా? ఎందుకు? నేను అశరీరి ఆత్మను అన్న సంకల్పము చేయడానికి ఎంత సమయము పట్టింది? క్షణం పట్టింది కదా! కనుక క్షణంలో అశరీరి, అతీతము మరియు బాబాకు ప్రియము - ఈ డ్రిల్‌ను మొత్తం రోజంతటిలో మధ్యమధ్యలో చేస్తూ ఉండండి. చేయటమైతే వస్తుంది కదా? మరి ఇప్పుడు ఒక్క క్షణంలో అందరూ అంతా మర్చిపోయి పూర్తిగా అశరీరిగా అయిపోండి. (బాప్‌దాదా 5 నిమిషాలు డ్రిల్ చేయించారు) అచ్ఛా.
నలువైపులా ఉన్న పవిత్రతా పునాదిని సదా దృఢంగా ఉంచుకునే పిల్లలకు, సదా సత్యతా శక్తితో విశ్వములో కూడా సత్యయుగాన్ని అనగా సత్యతా శక్తితో నిండిన వైబ్రేషన్లను వ్యాపింపజేసేవారికి, సదా ప్రతి సమయము మనసు-వాణి-కర్మలు, మూడింటిలోనూ దివ్యతను ధారణ చేసేవారికి, సదా ఫాలో ఫాదర్ చేసే సహజమైన అభ్యాసము కల ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ డ్రిల్‌ను రోజంతటిలో ఎన్ని ఎక్కువ సార్లు చేయగలిగితే అన్ని సార్లు చేస్తూ ఉండండి. ఒక్క నిమిషమైనా చేయండి. మూడు నిమిషాలు, రెండు నిమిషాలు సమయం లేకపోయినా కానీ ఒక్క నిమిషమైనా, అర నిమిషమైనా ఈ అభ్యాసాన్ని చేసినట్లయితే చివరి సమయంలో అశరీరిగా అవ్వటంలో చాలా సహాయము లభిస్తుంది. అవ్వగలరా? ఇప్పుడు అందరూ అశరీరిగా అయ్యారా లేక యుద్ధములో శ్రమ చేస్తూ-చేస్తూ సమయం పూర్తి అయిపోయిందా? క్షణంలో అలా అవ్వగలరా! చాలా పని ఉన్నా సరే అవ్వగలరా? కష్టం కాదా? యు.ఎన్.లో చాలా పరుగులు పెడుతూ ఉన్నప్పుడు అశరీరిగా అయ్యేందుకు ప్రయత్నం చేస్తే అవుతుందా? ఒకవేళ ఈ అభ్యాసాన్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నట్లయితే శరీర భానంలోకి రావటము ఎంత సహజమో, ఇది కూడా అంత సహజమవుతుంది. శరీర భానంలోకి రావటానికి కష్టపడతారా? నేను ఫలానాను, అని అనుకోవటానికి కష్టపడతారా? అది సహజము. కావున ఇది కూడా సహజమైపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అవ్వండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరములోకి రండి. మంచి పని అయితే రండి, ఈ శరీరము యొక్క ఆధారము తీసుకోండి కానీ ఆధారాన్ని తీసుకునేది ఆత్మనైన నేను అన్నది మర్చిపోకండి. చేసేవాడిని కాను, చేయించేవాడిని. ఏ విధంగా ఇతరులతో పని చేయిస్తారు కదా, ఆ సమయంలో స్వయాన్ని వేరుగా భావిస్తారు కదా! అదే విధంగా శరీరంతో పని చేయిస్తూ కూడా చేయించే నేను వేరు, ఈ అభ్యాసం చేసినట్లయితే ఎప్పుడూ దేహాభిమాన విషయాలలో కింద-మీద అవ్వరు. అర్థమైందా.
డబల్ విదేశీయులు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు కదా! ఉన్నారు కూడా మంచివారు, అటెన్షన్ కూడా మంచిగా ఉంది. సేవలో కూడా ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి. ఇంకా పెరుగుతూనే ఉంటాయి.
డబల్ విదేశీయులను అడుగుతున్నాము, ఈ సంవత్సరం చేసిన సేవలో, మీకు లభించిన ప్రాజెక్టులో అందరూ సంతృప్తిగా ఉన్నారా? అందరూ ప్రోగ్రామ్ చేశారు కదా! మరి సంతృప్తిగా ఉన్నారా? ఉన్నారా లేక లేదా? ఏ సేవ చేసినా, జిజ్ఞాసువులు కోర్సుకు వచ్చినా రాకపోయినా, మీరు స్వయంగా మీతో సంతృప్తిగా ఉండండి. నేను సంతృప్తిగా ఉంటే, ఈరోజు కాకపోయినా రేపు ఈ సందేశం పనిచేస్తుంది, పనిచేయాల్సిందే అనే నిశ్చయం ఉంచండి. ఇందులో కొంచెం కూడా నిరాశ చెందవద్దు. ఖర్చు చేశాము... ప్రోగ్రామ్ కూడా చేశాము... కానీ ఎవరూ రాలేదు, స్టూడెంట్లు పెరగలేదు - ఎలాంటి నష్టం లేదు, మీరు చేశారు కదా! మీ లెక్కలో జమ అయిపోయింది మరియు వారికి కూడా సందేశం లభించింది. సమయం వచ్చినప్పుడు అందరూ రావాల్సిందే, అందుకే చేస్తూ ఉండండి. చాలా ఖర్చు అయింది అని ఆలోచించవద్దు. మీరు స్వయం సంతృప్తిగా ఉంటే ఖర్చు సఫలమైనట్లే. ఏమిటిలా జరిగింది అని గాభరా పడకండి. కొంతమంది పిల్లలు ఇలా అంటారు, నా యోగం సరిగ్గా లేదు, అందుకే ఇలా జరిగింది. ఎవరివైపు యోగం ఉంది? ఇంకెవరైనా ఉన్నారా, వారితో యోగం ఉందా? యోగం ఉంది మరియు ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని సీజన్ ఫలాలు ఉంటాయి, కొన్ని ప్రతి సీజన్లో వచ్చే ఫలాలు ఉంటాయి. వారు రాలేదంటే వారు సీజన్ ఫలం అని అనుకోండి, వారి సీజన్లో వస్తారు. నిరాశ చెందవద్దు. ఎందుకంటే శ్రీమతాన్ని పాటించారు కదా! శ్రీమతం ప్రకారం కార్యం చేశారు. అందుకే శ్రీమతాన్ని పాటించడం కూడా ఒక సఫలత. ముందుకు సాగుతూ ఉండండి, చేస్తూ ఉండండి. తరువాత వారే పశ్చాత్తాపంతో మీ పాదాలపై పడతారు, మీరు చెప్పారు, మేము వినలేదు అని. ఇక్కడే మీరు దేవీలుగా అవుతారు. మీ పాదాలపై పడతారు, అప్పుడు మాత్రమే భక్తిలో కూడా పాదాలపై పడతారు కదా! మీరు ఎంత మంచిగా మా కళ్యాణం చేశారు అని అందరూ మీ పాదాలపై పడే సమయం కూడా రావాల్సిందే.
ఇప్పుడు ఐ.పి.లను కూడా చాలా మంచివారిని తీసుకొస్తున్నారు. బాప్‌దాదా వద్దకు ఫలితం వస్తూనే ఉంటుంది. చాలా మంచి వి.ఐ.పి.లు, ఐ.పి.లను కూడా తీసుకొచ్చారు, అది కూడా సఫలతే. తరువాత పిల్లల ప్రోగ్రామ్ కూడా చేశారు కదా! పిల్లల్లో విదేశాలకు చెందినవారు ఎంతమంది? (100) వందమంది విదేశాలకు చెందినవారు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మహిళల ప్రోగ్రామ్ చేస్తున్నారు. దానికి కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ముందుకు సాగుతున్నారు కదా! ముందుగా ఐ.పి.లను తీసుకురండి అని చెప్పినప్పుడు, విదేశాల నుండి చాలా కష్టం, చాలా కష్టం అని ఈ జయంతి చెప్పేది. ఇప్పుడు ఏమంటోంది? సహజం. ఇంకా ఇది డైమండ్ జూబిలీ కదా! చూడండి, భారతదేశంలో జరిగిన ప్రోగ్రామ్‌లు కూడా ఎక్కువగా అన్ని చోట్ల చాలా సఫలమయ్యాయి. ఎందుకంటే డైమండ్ జూబిలీ కారణంగా అందరూ దీపం వెలిగించడానికి రావాలి అనే విధిని ఉంచారు కదా! అప్పుడు వారు మాకు ఏదో ఒక పొజిషన్ లభించింది అని భావిస్తారు. సాధారణంగా వినడానికి రండి అంటే రారు. కాబట్టి డైమండ్ జూబిలీ విధి కారణంగా ఇప్పుడు ఐ.పి.లు మంచి సంపర్కంలోకి వచ్చారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఎందుకంటే వారు అజ్ఞానులు కదా! కేవలం వినడానికి వెళ్లాలి అంటే దేహాభిమానం వస్తుంది. ఏదైనా చేయాలి అంటే ఏదో ఒక పొజిషన్ ఉంది అని భావిస్తారు. కాబట్టి ఎవరికేమి కావాలో అది ఇచ్చారు, మీ పని అయిపోయింది. ఇప్పుడు దీపం వెలిగించడంలో నిజానికి ఏముంది? కానీ వారు సంతోషిస్తారు. మనకు గౌరవం ఇచ్చారు అని భావిస్తారు. అందుకే దేశ-విదేశాలలో చేస్తున్న డైమండ్ జూబిలీ సేవ సఫలమయింది మరియు సఫలత ఉంటూ ఉంటుంది. అచ్ఛా.
మహిళలు ఎంతమంది వస్తున్నారు? (180) వారికి నిమిత్తంగా ఎవరెవరు ఉన్నారు? సేవ బాగా అనిపిస్తుంది కదా! అలసిపోవడం లేదు కదా?
టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు అలసిపోతారా? అప్పుడప్పుడు కొంచెం అలసిపోయేవారైతే చేతులు ఎత్తరు. టీచర్లలో ఎప్పుడూ అలసిపోని వారు చేతులు ఎత్తండి. పాండవులు చేతులు ఎత్తుతున్నారు, అక్కయ్యలు ఎత్తలేదు కాబట్టి పాండవులు పాస్ అయ్యారు. అభినందనలు. అలసిపోవద్దు. ఎప్పుడైనా అలసట అనిపిస్తే, ఎక్కడికైనా వెళ్లి డాన్స్ చేయడం ప్రారంభించండి. బాత్రూమ్లో అయినా. ఎందుకంటే దీనివల్ల మూడ్ మారిపోతుంది. మనసులోని సంతోషంలో నాట్యం చేయండి. అది చేయలేకపోతే స్థూలంగా పాట పెట్టుకొని నాట్యం చేయండి. విదేశాలలో డాన్స్ అయితే అందరికీ వస్తుంది. డాన్స్ చేయడంలో తెలివైనవారు. ఫరిశ్తా డాన్స్ అయితే వస్తుంది. అచ్ఛా.
(శీల్ దాదీ మరియు రామీ అక్కయ్య బాప్‌దాదా వద్దకు వచ్చి ఆలింగనం చేసుకున్నారు) మీ ఇల్లు అయిన మధుబన్కు చేరుకున్నారు కదా! సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటున్నారు మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. చాలా మంచిగా ధైర్యంతో లెక్కాచారాన్ని తీర్చుకున్నారు. ధైర్యం మంచిగా ఉంది. డైమండ్ జూబిలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! (రామీతో) బాగున్నారా?
(మధుబన్కు చెందిన ప్రఫుల్ అన్నయ్య యాక్సిడెంట్లో శరీరాన్ని విడిచిపెట్టారు) బచ్చా మంచివాడు మరియు సేవలో ఉల్లాస-ఉత్సాహాలతో కూడా ఉన్నాడు. కానీ లెక్కాచారం తీరే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం ఏర్పడుతుంది. ఇతడు స్వతహాగా మంచివాడు.
(బాబా పిల్లలకు సహాయం చేస్తారు కదా, ఆ సమయంలో ఎందుకు చేయలేదు?) అతని లెక్కాచారం అదే డ్రైవర్‌తో, అదే స్థలంలో ఉంది. విధిని తప్పించలేము. (డాక్టర్లు రక్షించడానికి చాలా ప్రయత్నించారు) అందరి ప్రేమ కూడా ఉంది. మరణ తేదీ వాయిదా పడదు. భగవంతుడు కూడా మార్చలేడు.
జ్ఞాన సరోవర్‌లో స్పార్క్ మీటింగ్ (రిసెర్చ్) కోసం వచ్చిన సోదరసోదరీలతో:-
అందరూ రిసెర్చ్ చేయడానికి కలిసి వచ్చారు. మంచిది. ఎంతగా అంతర్ముఖత అనే గదిలో కూర్చొని రిసెర్చ్ చేస్తారో, అంతగా అత్యుత్తమ టచింగ్‌లు వస్తాయి. ఆ టచింగ్ ద్వారా అనేక ఆత్మలకు ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి మంచిది. చేస్తూ ఉండండి. కానీ ప్రయోగం మరియు యోగం రెండింటిలో బ్యాలెన్స్ ఉంచుకొని ముందుకు సాగండి. మిగతా అన్నీ మంచిగానే ఉన్నాయి. ఎంత మననం చేస్తారో, అంత వెన్న బయటకు వస్తుంది. కాబట్టి అందరిలో శక్తిని నింపే ఏదో ఒక మంచి వెన్నను తప్పకుండా వెలికితీస్తారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
