‘‘అనంతమైన సేవకు సాధనము - ఆత్మిక పర్సనాలిటీ ద్వారా దృష్టితో తృప్తి పరచటము’’
ఈరోజు బాప్‌దాదా అనేక కల్పాలుగా మిలనము చేసుకుంటున్న తమ ప్రియమైన, సికీలధే పిల్లలతో మళ్ళీ మిలనం జరుపుకునేందుకు వచ్చారు. అవ్యక్త మిలనాన్ని అయితే ఎల్లప్పుడూ జరుపుకుంటూనే ఉంటారు, కానీ అవ్యక్తునితో వ్యక్త రూపములో మిలనము జరుపుకునేందుకు పిల్లలందరూ భారత్ మరియు విదేశాల నుండి మళ్ళీ తమ ఇంటికి చేరుకున్నారు. నలువైపులా పిల్లలు తమ-తమ స్థానాలలో కూడా మిలనము జరుపుకుంటున్నారు అన్నది బాప్‌దాదా చూస్తున్నారు. ఈ మిలనము ఆత్మిక అలౌకిక మిలనము. ఈ మిలనము బాప్‌దాదా మరియు పిల్లల స్నేహము యొక్క సాకార స్వరూపము.
ఈరోజు బాప్‌దాదా తమ పిల్లల యొక్క ఆత్మిక పర్సనాలిటీని చూస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి ఆత్మిక పర్సనాలిటీ ఎంత శ్రేష్ఠమైనది. ఇటువంటి ఆత్మిక పర్సనాలిటీ మొత్తము కల్పములో మరెవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు ఉన్నతోన్నతుడైన తండ్రి. మీకు కూడా మీ ఆత్మిక పర్సనాలిటీ గురించి తెలుసు కదా? అన్నింటికన్నా అతి పెద్ద పర్సనాలిటీ - స్వప్నము మరియు సంకల్పములో కూడా సంపూర్ణ పవిత్రతా పర్సనాలిటీ. నంబరువారుగా ఉన్నారు, అయినా కానీ విశ్వములోని సర్వాత్మల కంటే శ్రేష్ఠమైనవారు. కావున బాప్‌దాదా ప్రతి ఒక్కరి మస్తకములో పర్సనాలిటీ యొక్క మెరుపును చూస్తున్నారు. పవిత్రతతోపాటు అందరి ముఖము మరియు నడవడికలో ఆత్మికత యొక్క పర్సనాలిటీ కూడా ఉంది. వేరే ఏ పర్సనాలిటీ ఉంటుంది? ఎవరైతే ఖజానాలతో సంపన్నంగా ఉంటారో, వారి పర్సనాలిటీ కూడా ఉంటుంది కానీ ఎంత గొప్ప-గొప్ప సంపన్న ఆత్మలైనా సరే, మీ ముందు ఆ సంపన్న ఆత్మలు కూడా అసలు ఏమీ కాదు ఎందుకంటే వారు కూడా అవినాశీ సుఖ-శాంతుల ఖజానాలలో ఖాళీగా ఉన్నారు. మీ వద్ద ఏ సంపద అయితే ఉందో దాని ముందు ఎంత కోట్లాధిపతులైనా సరే, వారు తండ్రి నుండి సుఖ-శాంతులను యాచించేవారే కానీ మీరు సదా అవినాశీ ఖజానాలతో నిండుగా ఉంటారు. ఆ ఖజానాలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు, కానీ మీ ఖజానాను ఎవ్వరూ దోచుకోలేరు, అలాగే ఏ ఆత్మా మీ ఖజానాను కదిలించలేదు. అది తరగనిది, అఖండమైనది. పిల్లలైన మీరు ఇటువంటి పర్సనాలిటీ కలవారు. అందరికంటే ఉన్నతోన్నతమైన పర్సనాలిటీ కలవారు కూడా ఆత్మల ద్వారా, వినాశీ ధనం ద్వారా, వినాశీ ఉద్యోగం ద్వారా పర్సనాలిటీ కలవారిగా తయారవుతారు లేదా అలా పిలువబడతారు. కానీ మిమ్మల్ని ఉన్నతోన్నతుడైన పరమాత్మ శ్రేష్ఠ పర్సనాలిటీ కలవారిగా తయారుచేసారు. మరి మీ ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నషా ఉంటుందా? ఉంటుందంటే చేతులు ఊపండి.
బాప్‌దాదాకు ఇంతటి శ్రేష్ఠ పర్సనాలిటీ కల పిల్లలను చూస్తుంటే ఎంత సంతోషమనిపిస్తుంది! మీకు కూడా అనిపిస్తుందా? బాప్‌దాదా పిల్లల యొక్క ఇటువంటి శ్రేష్ఠతను చూసి ఏ పాటను పాడుతారు, తెలుసా? మీరు కూడా పాడుతారు, తండ్రి కూడా పాడుతారు. తండ్రి పాట వినిపిస్తుందా లేక టేప్ రికార్డరులోని పాట వినిపిస్తుందా? బాప్‌దాదా యొక్క టేప్ రికార్డర్ అతీతంగా ఉంటుంది కదా, అది ఆటోమేటిక్‌గా నడుస్తుంది. దానిని నడిపించేందుకు ప్రత్యేకించి శ్రమించాల్సిన అవసరం ఉండదు. అంతేకాక మనసులోని పాటను మనసున్నవారే వినగలరు. కేవలము చెవులున్నవారు కాదు, మనసున్నవారు వినగలరు. మరి అందరూ మనసున్నవారు కదా? దిల్వాలా మందిరంలో మీ చిత్రము ఉంది కదా? అందరూ తమ చిత్రాన్ని చూసుకున్నారా? బాప్‌దాదా అయితే సదా పిల్లల యొక్క చిత్రాన్ని మరియు చరిత్రను చూస్తూ ఉంటారు. ఈరోజు పర్సనాలిటీని చూసారు. సదా ఈ పర్సనాలిటీ స్మృతిలో ఇమర్జ్ అయి ఉండాలి. ఉండనే ఉంది కదా అని కాదు. అది ఉంది, కానీ కనిపించాలి, అనుభవములోకి రావాలి. సదా ఇటువంటి పర్సనాలిటీలో ఉండేవారి గుర్తులు ఏముంటాయి? ఏ గుర్తుల ద్వారా వీరు తమ పర్సనాలిటీలో ఉన్నారు అన్నది అర్థమవుతుంది? ఒకవేళ ఈ ఆత్మిక పర్సనాలిటీ ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే వారి నయనాలు, వారి ముఖము, నడవడిక, సంకల్పాలు మరియు సంబంధాలు అన్నీ ప్రసన్నతతో కూడినవిగా ఉంటాయి. సదా ప్రసన్నచిత్తులు. ప్రశ్నచిత్తులు కాదు, ప్రసన్నచిత్తులు. ఒకవేళ ప్రశ్నచిత్తులుగా ఉన్నట్లయితే నడవడిక కూడా పర్సనాలిటీకి చెందినదిగా ఉండదు, ముఖంపై కూడా ప్రసన్నతతో కూడిన మెరుపు ఉండదు. ఏం జరిగినా సరే, పర్సనాలిటీ కలవారి ప్రసన్నత దాగి ఉండదు, అది మర్జ్ అవ్వలేదు. ఎవరు ఎంతటి టెన్షన్ లో ఉన్నా, అశాంతిగా ఉన్నా సరే, ప్రసన్నచిత్త ఆత్మ వారిని తమ ప్రసన్నతతో కూడిన దృష్టితో ప్రసన్నం చేస్తారు. ‘‘దృష్టితో తృప్తి పరిచేవారు’’ అన్న తండ్రి గాయనము ఏదైతే ఉందో, అది కేవలము తండ్రిది మాత్రమే కాదు, మీది కూడా ఇదే గాయనము. అంతేకాక ఇప్పుడు సమయమనుసారంగా ఎంతగా సమయం సమీపంగా వస్తూ ఉందో, అంతగానే దృష్టితో తృప్తి పరిచే సేవ చేసే సమయం వస్తుంది. 7 రోజుల కోర్స్ జరుగదు, ఒక్క దృష్టితో ప్రసన్నచిత్తులుగా అయిపోతారు. వారి మనసులోని ఆశ మీ ద్వారా పూర్తి అయిపోతుంది. మరి అందరూ ఏమనుకుంటున్నారు? ఆది సేవా రత్నాలు ఏమనుకుంటున్నారు? ఇటువంటి సేవను చెయ్యగలరు కదా?
ఇప్పుడు చూడండి, మీరందరూ 40 సంవత్సరాలు సేవ చేసారు లేదా ఇంకా ఎక్కువ కూడా చేసి ఉండవచ్చు. కొందరిది ఒకటి రెండు సంవత్సరాలు తక్కువై ఉండవచ్చు కూడా, కొందరిది ఎక్కువై ఉండవచ్చు. ఇప్పుడు మీరు మీ సహచరులకు ఈ సేవను నేర్పించారు మరియు నిమిత్తంగా కూడా చేసారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ సేవనైతే వారు కూడా చేస్తున్నారు. మీరు ఆది రత్నాలు కావున అతీతమైన మరియు ప్రియమైన సేవను చేస్తారు కదా? ఇప్పుడిక దృష్టి ద్వారా ఎంతమందిని తృప్తి పరిచారు అన్న ఉత్సవాన్ని జరుపుతాము. 9 లక్షల మందిలో ఎంతమందిని తయారుచేసారు? మున్ముందు అయితే 33 కోట్లకు కూడా చేరుకోవాలి, 9 లక్షలంటే వారి ముందు అసలేమీ కాదు. బీజాన్ని అయితే ఇక్కడే వెయ్యాలి కదా? మరి ఆది సేవా రత్నాలు ఇప్పుడు ఇంకే అద్భుతాన్ని చూపిస్తారో చూస్తాము. ఈ అద్భుతాన్ని అయితే చూపించారు, సేవాకేంద్రాలను తెరిచారు, మంచి-మంచి ప్రోగ్రాములను చేసారు, అందుకైతే పదమాల రెట్లు అభినందనలు. రెండు రకాల పిల్లలు ఉన్నారు - స్థాపనకు నిమిత్తులైన పిల్లలు మొదటివారు మరియు మీరు విశేషంగా సేవ యొక్క ఆదిలోని పిల్లలు. వీరు (దాదీలు) స్థాపనలో వేర్లు వంటివారు మరియు మీరందరూ (సేవ యొక్క ఆది రత్నాలు) మొట్టమొదట కాండము వంటివారు. కాండము గట్టిగా ఉంటుంది కదా. కాండముపైనే మొత్తమంతా ఆధారపడి ఉంటుంది. కాండము నుండే అన్ని శాఖలు వెలువడుతాయి. వేర్లలోని వారైతే సూక్ష్మంగా శక్తినిస్తారు కానీ ప్రాక్టికల్‌గా ఉండేది, కనిపించేది కాండము. దాదీలు ఇప్పుడు గుప్తమైపోయారు, వారు సకాష్ ఇస్తారు. ప్రాక్టికల్‌గా స్టేజిపైకి వచ్చేందుకు మీరు నిమిత్తులు అయ్యారు. (సన్మాన సమారోహానికి వచ్చిన పెద్ద అక్కయ్యలందరి చేత బాప్‌దాదా చేతులు ఎత్తించారు) అందుకే బాప్‌దాదా పని ఇస్తున్నారు. సమారోహాన్ని అయితే చాలా బాగా జరుపుకున్నారు కదా. బాప్‌దాదా అంతా చూసారు. అలంకరించబడి ఉన్న మూర్తులను చూసారు. ఆ సమయములో మీకు కూడా - మేము చైతన్య మూర్తులము అని ఇదే ఆత్మిక అనుభవము కలిగింది. అలంకరించబడి ఉన్న మూర్తులు మందిరాల నుండి శాంతివనానికి చేరుకున్నట్లుగా అనిపించింది.
ఇప్పుడు వేగవంతమైన సేవను ప్రారంభించాలని బాప్‌దాదా పిల్లల నుండి కోరుకుంటున్నారు. ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, అది చాలా బాగా జరిగింది. ఇప్పుడు సమయమనుసారంగా ఇతరులకు వాణి సేవ అవకాశాన్ని ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైక్‌గా తయారుచెయ్యండి, మీరు మైట్ (శక్తి) గా అయ్యి సకాష్ను ఇవ్వండి. అప్పుడు మీ సకాష్ మరియు వారి వాణి, ఇవి డబల్ పని చేస్తాయి. అప్పుడే 9 లక్షల మంది సహజంగా తయారవుతారు. ఇప్పుడు మీరందరూ, ఫంక్షన్లో కూర్చున్నవారైనా లేక ఇతర మహారథులైనా, ఇప్పుడు మహారథుల సేవ ఏమిటంటే - సర్వులకు సకాష్ ఇవ్వటము. అనంతమైన సేవ యొక్క మైదానములోకి రావటము. బాబా అవ్యక్త వతనములో, ఒకే స్థానములో కూర్చుని విశ్వములో నలువైపులా ఉన్న పిల్లల పాలనను చెయ్యగలరు అన్నప్పుడు, అలా చేస్తున్నారు అన్నప్పుడు, మరి మీరు ఒకే స్థానములో కూర్చుని తండ్రి సమానంగా అనంతమైన సేవను చెయ్యలేరా? ఆది రత్నాలు అనగా తండ్రిని అనుసరించేవారు. అనంతములో సకాష్ను ఇవ్వండి. కొంతమంది పిల్లలు తమలో తాము కూడా ప్రశ్నించుకుంటారు మరియు పరస్పరంలో కూడా ప్రశ్నించుకుంటారు - అనంతమైన వైరాగ్యం ఎలా వస్తుంది? అది కనిపించదు, కానీ అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా పెట్టుకున్నట్లయితే అనంతమైన వైరాగ్యము స్వతహాగానే వస్తుంది ఎందుకంటే ఈ సకాష్ను ఇచ్చే సేవను నిరంతరము చెయ్యగలరు, ఇందులో ఆరోగ్యము విషయము, సమయము విషయము - అన్నీ సహజమైపోతాయి. రాత్రింబవళ్ళు ఈ అనంతమైన సేవలో నిమగ్నమవ్వగలరు. బ్రహ్మాబాబాను చూసారు కదా, రాత్రివేళలో కూడా కళ్లు తెరవటంతోనే అనంతమైన సకాష్ను ఇచ్చే సేవ జరుగుతూ ఉండేది. కనుక ఈ అనంతమైన సేవ ఎంత బిజీగా చేస్తుందంటే దాని ద్వారా అనంతమైన వైరాగ్యము స్వతహాగానే మనసులో నుండి వస్తుంది. అది ప్రోగ్రామ్‌తో రాదు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి... అని ప్లాన్లు అయితే తయారుచేస్తారు. కానీ అనంతమైన సేవలో బిజీగా ఉండటము - ఇది అన్నింటికంటే సహజ సాధనము ఎందుకంటే ఎప్పుడైతే అనంతమునకు సకాష్ ఇస్తారో, అప్పుడు దగ్గరి వారు ఆటోమేటిక్‌గా సకాష్ తీసుకుంటూ ఉంటారు. ఈ అనంతమైన సకాష్ను ఇవ్వటముతో వాయుమండలము ఆటోమేటిక్‌గా తయారవుతుంది. ఇన్ని సెంటర్ల బాధ్యత ఉంది లేక జోన్ బాధ్యత ఉంది అని ఇప్పుడు ఇలా ఆలోచించకండి! మీరందరూ రాష్ట్రానికి రాజుగా అవ్వాలా లేక విశ్వానికా? ఎలా అవ్వాలి? విశ్వానికి కదా? ఆది రత్నాలు కనుక విశ్వానికి సకాష్ ఇచ్చేవారిగా అవ్వండి. ఒకవేళ 20 సెంటర్లు, 30 సెంటర్లు లేక 200, 250 సెంటర్లు లేక జోన్, ఇవి బుద్ధిలో ఉన్నట్లయితే ఇది కూడా కాండము యొక్క పని కాదు. ఈ పనిని కొమ్మలు, రెమ్మలుగా ఉన్నవారు కూడా చెయ్యగలరు. మీరైతే కాండము వంటివారు. కాండము నుండి అందరికీ సకాష్ చేరుకుంటుంది. అనంతమైన వైరాగ్యము రావాలి అని మీరందరూ కూడా ఆలోచిస్తారు, ఇది చాలా మంచిది. ఇప్పుడు వినాశనమైపోతుంది కానీ 9 లక్షల మందిని కూడా తయారుచెయ్యలేదు. మరి సత్యయుగ ఆదిలో వచ్చే సంఖ్యే తయారుకానప్పుడు, వినాశనమైపోతే సత్యయుగములోకి ఎవరు వస్తారు? ఆ 2, 3 వేల మందిపై రాజ్యం చేస్తారా? 4, 5 లక్షల మందిపై రాజ్యం చేస్తారా? అందుకే ఇప్పుడు అనంతమైన సేవ యొక్క పాత్రను ప్రారంభించండి. పాండవులు ఏమంటారు? అనంతమైన సేవను చేస్తారు కదా? పాండవులు సిద్ధంగా ఉన్నారా? అనంతములోకి వెళ్ళటముతో ఇప్పుడు ఈ హద్దులోని విషయాలు వాటంతటవే తొలగిపోతాయి. అంతేకానీ వీటి నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తే ఇవి తొలగిపోవు. అనంతమైన సకాష్తో పరివర్తన అవ్వటమనేది వేగవంతమైన సేవ యొక్క రిజల్టు.
నాజూకు పరిస్థితులలో నిమిత్తంగా అయిన ఆత్మలు సేవకు ప్రత్యక్ష ఋజువును చూపించారు అని బాప్‌దాదాకు తెలుసు. కానీ మీ అందరి పునాదికి లేక క్షణములో పరివర్తనకు మూల అనుభవము ఏమిటంటే - బ్రహ్మాబాబాను చూసారు మరియు బ్రాహ్మణులుగా అయిపోయారు. సేవా వరదానము లభించింది మరియు సేవలో నిమగ్నమైపోయారు. బాప్‌దాదా అందరి అనుభవాలను కూడా విన్నారు. మంచి అనుభవాలను వినిపించారు. కనుక మీ అనుభవము ఎలా అయితే ఉందో, బ్రహ్మాబాబాను చూసారు, ఇక ఆలోచించవలసిన అవసరమే లేకుండా అయిపోయింది. సహనం చేస్తున్నాము అని సహనము చేస్తున్న అనుభవము కూడా కలగలేదు. పెద్ద విషయంగా అనిపించలేదు. అలా ఇప్పుడు ప్రతి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను చూడాలి మరియు ఆ ఆత్మలో (బ్రాహ్మణునిలో) బ్రహ్మా బాబాను చూడాలి. ఇదే సేవకు వేగవంతమైన సాధనము. మీకు ఏమైనా బ్రహ్మా బాబా కోర్స్ చెప్పారా? కోర్స్ అయితే తరువాత తీసుకున్నారు. కానీ వారిని చూసారు మరియు వారికి చెందినవారిగా అయిపోయారు. ఏ విధంగా బ్రహ్మా బాబాలో తండ్రి ఇమిడి ఉన్నారు కావున కష్టమనిపించలేదో, అలా మీరందరూ కూడా బాప్‌దాదాను స్వయంలో ఇముడ్చుకుంటూ దృష్టితో తృప్తి పరచండి. ఇది మీ అందరి అనుభవము. మీరు అనుభవీలు. చూసారు మరియు బలిహారమైపోయారు. ఇప్పుడైతే ఆలోచిస్తారు, ట్రైనింగ్ తీసుకుంటారు, అప్పుడు ట్రయల్ కోసం వస్తారు, మళ్లీ వారిలో కొందరు వెళ్ళిపోతారు, కొందరు ఉంటారు. మీరు ఇంత శ్రమపడ్డారా? ట్రైనింగ్ తీసుకున్నారా? ట్రయల్‌లో ఉన్నారా? కేవలం అలా వచ్చారు మరియు మైమరచిపోయారు. ఇటువంటి సేవను ఒక్క బ్రహ్మాబాబా చేసినప్పుడు మీరు ఇంతమంది బ్రాహ్మణ ఆత్మలు చెయ్యలేరా? మీ పర్సనాలిటీ, వారిని మీవారిగా చెయ్యాలి. బ్రహ్మా బాబాకు కూడా పర్సనాలిటీ ఉండేది కదా. ముఖము పరంగానైనా, గుణము పరంగానైనా పర్సనాలిటీ ఉండేది, అందుకే ఆకర్షితం అయ్యారు. కనుక ఫాలో ఫాదర్ చెయ్యండి. బాబా మిమ్మల్ని ఆదిలో నిమిత్తం చేసారు, మరి ఎవరైతే ఆదికి చెందినవారో, సేవకు నిమిత్తులో మరియు స్థాపనకు పునాది అయినవారో, వారు అంతిమము వరకు సేవలో ఉండాల్సిందే. ఆరోగ్యం కారణంగా శరీరంతో తిరగలేకపోతారు కానీ మనసుతోనైతే తిరగగలరు కదా? ఇందులోనైతే ఖర్చు కూడా లేదు, వీసా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, పరుగులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పడుకుని కూడా చెయ్యవచ్చు. ఏమంటారు? ఇప్పుడు అటువంటి ప్లాన్ ఏదైనా తయారుచెయ్యండి. కొత్త పాఠాన్ని ప్రారంభించండి. ఇప్పుడు ఒక ఫంక్షన్‌ను అయితే జరుపుకున్నారు కదా. చేసిన సేవకు ప్రత్యక్ష ఫలం లభించింది. ఇప్పుడు కొత్త సేవను చెయ్యండి. అచ్ఛా.
బాప్‌దాదా కేవలం ఎదురుగా ఉన్నవారికే చెప్పటం లేదు, పిల్లలందరికీ చెప్తున్నారు. విదేశాలలో ఎవరైతే వింటున్నారో, వారికి కూడా చెప్తున్నారు. ఎక్కడ వింటున్నా సరే, శాంతివన్లో వింటున్నా, పైన పాండవ భవన్లోనైనా, విదేశాలలోనైనా, ఎక్కడ ఉన్నా సరే, అందరికీ బాప్‌దాదా చెప్తున్నారు. ఇప్పుడు అనంతమైన సేవాధారిగా అవ్వండి. సమయాన్ని అనంతమైన సేవలో పెట్టండి. అనంతమైన సేవలో సమయాన్ని పెట్టడం ద్వారా సమస్య సహజంగానే పారిపోతుంది ఎందుకంటే అజ్ఞానీ ఆత్మలైనా లేక బ్రాహ్మణ ఆత్మలైనా కానీ ఒకవేళ సమస్యలో సమయాన్ని వెచ్చిస్తే లేక ఇతరుల సమయాన్ని తీసుకుంటే దాని ద్వారా వారు బలహీన ఆత్మలు, వారిలో శక్తి లేదు అన్నది నిరూపణ అవుతుంది. ఎవరిలోనైతే శక్తి లేదో, కుంటివారిగా ఉన్నారో, వారిని మీరు పరిగెత్తండి అని చెప్తే వారు పరుగెడతారా లేక పడిపోతారా? కనుక సమస్యకు వశమైన ఆత్మలు, వారు బ్రాహ్మణులైనా సరే, ఒకవేళ బలహీనులుగా ఉంటే, శక్తి లేకపోతే, వారు ఎక్కడి నుండి శక్తిని తెచ్చుకుంటారు? తండ్రి నుండి డైరెక్ట్‌గా శక్తిని తీసుకోలేరు ఎందుకంటే వారు బలహీన ఆత్మ, మరి అప్పుడేం చేస్తారు? బలహీన ఆత్మకు ఇతరులెవరిదైనా రక్తాన్ని ఇచ్చి శక్తిని అందిస్తారు, ఏదైనా శక్తిశాలీ ఇంజెక్షన్‌ను ఇచ్చి శక్తిని అందిస్తారు, మరి మీ అందరిలో శక్తులు ఉన్నాయి కనుక శక్తుల సహయోగాన్ని ఇవ్వండి, గుణాల సహయోగాన్ని ఇవ్వండి. వారిలో అసలు లేనే లేవు, మీలో ఉన్నవి ఇవ్వండి. దాతగా అవ్వండి అని ఇంతకుముందు కూడా చెప్పాము కదా. వారు అసమర్థులు, వారికి సమర్థతను ఇవ్వండి. గుణాలు మరియు శక్తుల సహయోగాన్ని ఇచ్చినట్లయితే మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలనేవి లిఫ్ట్ కంటే కూడా వేగవంతమైన రాకెట్ వంటివి. మీరు పురుషార్థం చెయ్యటానికి సమయం కూడా ఇవ్వవలసిన అవసరం ఉండదు, ఆశీర్వాదాలనే రాకెట్లో ఎగురుతూ వెళ్ళిపోతారు. పురుషార్థపు శ్రమకు బదులు సంగమయుగపు ప్రారబ్ధాన్ని అనుభవము చేస్తారు. ఆశీర్వాదాలు తీసుకోవటాన్ని నేర్చుకోండి మరియు నేర్పించండి. మీ సహజ అటెన్షన్ మరియు ఆశీర్వాదాలు ఉండాలి. అటెన్షన్లో టెన్షన్ మిక్స్ అవ్వకూడదు, సహజంగా ఉండాలి. జ్ఞానమనే దర్పణం ఎల్లప్పుడూ మీ ఎదురుగా ఉండనే ఉంటుంది. అందులో స్వతహాగా సహజంగా మీ చిత్రము కనిపిస్తూనే ఉంటుంది, అందుకే పర్సనాలిటీ యొక్క గుర్తు ప్రసన్నచిత్తము అని చెప్పాము. ఇది ఎందుకు, ఏమిటి, ఎలా - ఈ ఎ, ఎ అన్న భాషను సమాప్తము చెయ్యండి. ఆశీర్వాదాలను తీసుకోవటము మరియు ఇవ్వటము నేర్చుకోండి. ప్రసన్నంగా ఉండటము మరియు ప్రసన్నం చెయ్యటము - ఇదే ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు ఆశీర్వాదాలను తీసుకోవటము. ఎవరు ఎలా ఉన్నా సరే మీ మనసు నుండి ప్రతి ఆత్మ పట్ల అన్నివేళలా - వీరి కళ్యాణము కూడా జరగాలి, వీరి బుద్ధి కూడా శాంతిగా ఉండాలి అన్న ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. వీరు ఇటువంటివారు, వారు అటువంటివారు అని అనుకోకూడదు. అందరూ మంచివారు. ఇది సాధ్యమేనా? ఆశీర్వాదాలను ఇవ్వటం వస్తుందా? తీసుకోవటమైతే వస్తుంది, ఇవ్వటం కూడా వస్తుందా? ఇవ్వకపోతే ఎలా తీసుకుంటారు? ఇవ్వండి మరియు తీసుకోండి. వీరు చెయ్యాలి అని అనుకోకూడదు, నేను చేస్తాను. బ్రహ్మా బాబా స్లోగన్ ఒకటి ఉండేది, బ్రహ్మాబాబా పదే-పదే దానిని గుర్తు చేయించేవారు - ఏ కర్మను నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. ఇతరులు చేస్తే నేను చేస్తాను... ఈ స్లోగన్ ఉండకూడదు. నేను ఏది చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు. లేదంటే స్లోగన్‌ను మార్చేయండి. జగదంబ తల్లి యొక్క విశేషమైన స్లోగన్ ఏమిటంటే - ఏది జరుగుతున్నా సరే, అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు. వారు నడిపిస్తున్నారు, మనము నిమిత్తులుగా అయ్యి నడుస్తున్నాము... కనుక ఈ రెండు స్లోగన్లను సదా గుర్తుంచుకోండి, ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఇమర్జ్ అయ్యే ఉంది, విన్నాము, గుర్తు అయితే ఉంటుంది... అని అనటం కాదు. అది కర్మలలో కనిపించాలి. మరి ఏం చేస్తారు? ఆశీర్వాదాలను తీసుకుంటారు మరియు ఆశీర్వాదాలను ఇస్తారా లేక వీరు ఇలా, వారు అలా అని నిందించటము, ఫీల్ అవ్వటం చేస్తారా? అలా చెయ్యకూడదు. వారికి ఆశీర్వాదాలను ఇవ్వండి. వారు బలహీనంగా ఉన్నారు, వశీభూతమై ఉన్నారు. భాషను మరియు సంకల్పాలను మార్చండి. వీరు మారాలి అన్నది సంకల్పమాత్రంగా కూడా ఉండకూడదు. నేను మారాలి. ఇతర విషయాలలోనైతే ‘నేను, నేను’ అన్నది వస్తుంది కానీ ఏ విషయంలోనైతే ‘నేను’ అన్నది రావాలో, ఆ విషయంలో - ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అంటారు, ఇదేమిటి? మంచి పని జరిగితే ‘నేను’ అని అంటారు. ఏదైనా ఇలాంటలాంటి పని జరిగితే ‘వీళ్ళు చేసారు, వాళ్ళు అన్నారు’ అని అంటారు. తారుమారైపోయింది కదా. ఎవరు ఏం చేసినా సరే, నేను ఏం చెయ్యాలి, నేను ఏం ఆలోచించాలి, నేను ఏం మాట్లాడాలి, ఇందులో నేను అన్న భావనను తీసుకురండి. దేహాభిమానముతో కూడిన ‘నేను’ కాదు, సేవాభావనతో కూడిన ‘నేను’. కనుక ఇటువంటి శ్రేష్ఠ వైబ్రేషన్లనే వ్యాపింపజెయ్యండి. ఇప్పుడు వాణి తక్కువ పని చేస్తుంది, మనసు యొక్క సహయోగము, మనసు యొక్క వైబ్రేషన్లు చాలా త్వరగా పని చెయ్యగలవు. మరి ఇది వీలవుతుందా?
ఒకవేళ వీలవుతుంది అంటే, మరి శుభకార్యంలో ఆలస్యం ఎందుకు? ఇప్పటి నుండే చేయగలరా? పాండవులు చెప్పండి. తర్వాత అక్కడికి వెళ్లి మారిపోకండి. అక్కడికి వెళ్లాక - బాప్‌దాదా అయితే అలా చెబుతారు, కానీ సాకారంలో మేమే ఉన్నాము కదా. బాప్‌దాదాకు ఇక్కడ ఏమి జరుగుతుందో ఏమి తెలుసు! అని అనకండి. మాతలు ఏమంటారు? బాప్‌దాదా పిల్లలను సంభాళించడము చేస్తేనే తెలుస్తుంది అని అనుకుంటారా? బాప్‌దాదా మిమ్మల్ని పెద్దవారిని సంభాళించారు, చిన్నవారు పెద్ద విషయమా! కాబట్టి అక్కడికి వెళ్లాక మారిపోకండి. మీకు ఒక పాట ఉంది కదా - ప్రపంచం మారిపోయినా మేము మారము. ఈ పాట దృఢంగా ఉందా? నిజమేనా? నిజమైతే చేతులు ఎత్తండి. అప్పుడు మీ 21వ శతాబ్దపు కాన్ఫరెన్స్ ప్రాక్టికల్‌గా అవుతుంది. సరేనా! ప్రాక్టికల్‌లో సృష్టికి నమూనాను చూపించండి. ఇది జరుగుతుంది, జరుగుతుంది, కాదు - ఇది జరిగిపోయింది. ఏమి జరిగిపోయింది? ఒకవేళ మీరు గ్లానిని లేదా డిస్టర్బెన్స్‌ను సహించినా, లోపల పెట్టుకున్నా, మీ ఆ సహనం, లోపల ఇముడ్చుకోవడం మీకు మీ రాజధానిని నిశ్చయం చేస్తుంది. మీకు ఏమి నష్టం జరిగింది? లాభమే జరిగింది. చూడటానికి విషయం చాలా కష్టంగా, చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ మీరు సహించి, ఇముడ్చుకుంటే, మీ ముద్ర పడిపోయింది, మీ రాజధాని సిద్ధమైపోయింది. అయితే లాభమా, నష్టమా?
ఇప్పుడు ఈ సీజన్లో బాప్‌దాదా నలు వైపులా ఇటువంటి స్వరూపాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రతి సీజన్లో అదే విషయాలు వినడం బాగుండదు. అదే కథలు, కథలు, కథలు... కాబట్టి బాప్‌దాదా కూడా పిల్లలను అడుగుతున్నారు - చివరకు ఈ విషయాలు ఇంకా ఎప్పటి వరకు? లేకపోతే ఒక సమయం చెప్పండి - ఇంకో సంవత్సరం కావాలి, ఇంకో రెండు సంవత్సరాలు కావాలి. దీనికీ ఒక తేదీ నిర్ణయించండి. కార్యక్రమాల తేదీలు అయితే త్వరగా నిర్ణయించేశారు. అందరి కార్యక్రమాల తేదీలు నిర్ణయించారు. మరి ఈ కార్యక్రమానికి తేదీ ఏది?
అందరూ ఎంతో ప్రేమతో దూరదూరాల నుండి వచ్చారు. బాప్‌దాదా విదేశాలను కూడా చూస్తున్నారు. అక్కడ సమయాలు వేరుగా ఉన్నప్పటికీ ఎంతో ప్రేమతో సమయం కేటాయించి వింటున్నారు. (విదేశాలలో 200 ప్రాంతాలలో శాటిలైట్ ద్వారా మురళిని వింటున్నారు.) చూడండి, ఇది కూడా వేగవంతమైన గతి కదా. ఇక్కడి ధ్వని విదేశాలలోని 200 ప్రాంతాలకు చేరుతోంది. ఇది కూడా ధ్వని యొక్క వేగవంతమైన గతి కదా. ఇదీ ఒక ఇన్వెన్షన్ కదా. మరి మీరు సైలెన్స్ శక్తి యొక్క గతిని వేగవంతం చేయలేరా? సైన్స్ భారతదేశం యొక్క ధ్వనిని విదేశాలకు చేర్చింది. మరి మీరు మీ హృదయపు శుభ భావనలను ఆత్మలకు చేర్చలేరా? చేర్చగలరు కదా! లేదంటే సైన్స్ ముందుకు వెళ్లిపోతుంది, సైలెన్స్ శక్తి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అందుకే సైలెన్స్ శక్తిని ప్రత్యక్షం చేయండి. అది అందరిలో ఉంది. నా వద్ద సైలెన్స్ శక్తి లేదు అని చెప్పగల ఒక్క బ్రాహ్మణ ఆత్మ లేదు. అందరిలో ఉంది. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? ఇంతమంది బ్రాహ్మణుల సకాష్ ఏమి చేయలేదు? అందరిలో సైలెన్స్ శక్తి ఉందా? ఇప్పుడు ఒక్క నిమిషంలో అందరూ తమ సైలెన్స్ శక్తిని ఇమర్జ్ చేసుకోండి. పూర్తి సైలెన్స్‌ను మనసు ద్వారా, తనువు ద్వారా ఇమర్జ్ చేసుకోండి (బాప్‌దాదా డెడ్ సైలెన్స్ (పూర్తి నిశ్శబ్దము) యొక్క డ్రిల్‌ను చేయించారు) అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు, సదా ఆత్మిక పర్సనాలిటీ యొక్క నషాలో ఉండే ఆత్మలకు, సదా అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకునే నిమిత్త విశ్వ కళ్యాణకారీ ఆత్మలకు, సదా బ్రహ్మా బాబా మరియు జగదంబ యొక్క స్లోగన్లను సాకారములోకి తీసుకువచ్చేవారికి, ఉన్నతోన్నతమైన దృష్టితో తృప్తి పరిచే సేవలో సదా ఉండేవారికి, తండ్రి సమానులైన ఆత్మలకు బాప్‌దాదా మరియు జగదంబ తల్లి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలు మరియు పెద్ద అన్నయ్యలతో:- అందరి హృదయపు ఉల్లాస-ఉత్సాహాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు హృదయపు ఉల్లాస-ఉత్సాహాలను ఇమర్జ్ చేసుకోండి. సంకల్పాలు చాలా మంచి-మంచిగా చేస్తారు. కానీ అవి ప్రాక్టికల్లోకి రావాలంటే, ఇముడ్చుకునే శక్తి మరియు కళ్యాణ భావనను ఇమర్జ్ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే సంకల్పాలు సాకారంలోకి వస్తాయి. ఈ విషయాలన్నీ సముద్రంలోని అలల వంటివి. అలలను ఏమి చూడాలి! అవి ఇప్పుడే లేస్తాయి, ఇప్పుడే మర్జ్ అయిపోతాయి. కానీ సముద్రముకు ఉన్న ఇముడ్చుకునే శక్తి, సైలెన్స్ పవర్ యొక్క శక్తి రత్నాలను తయారుచేస్తుంది. మంచిది. ఇప్పుడు మీ సకాష్ అవసరం. బలహీనులకు బలం ఇవ్వండి. మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహకారం ఇవ్వడంలో ఉపయోగించండి. అప్పుడు మీ పురుషార్థం స్వతహాగానే జమ అవుతూ ఉంటుంది. ఇతరులకు సహకారం ఇవ్వడం అంటే, స్వయంగా జమ చేసుకోవడం. ఇప్పుడు ఇటువంటి అలను వ్యాపింపజేయండి - ఇవ్వాలి, ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. సాల్వేషన్ తీసుకోవడం కాదు, సాల్వేషన్ ఇవ్వాలి. ఇవ్వడంలోనే తీసుకోవడం ఇమిడి ఉంది. సరేనా! ఫౌండేషన్ అయితే దృఢంగానే ఉంది. బాప్‌దాదా యొక్క సకాష్ అయితే ఉంది. ఇప్పుడు మీ ఆత్మల సకాష్ అవసరం. బాబా నుండి డైరెక్ట్‌గా అంత శక్తిని తీసుకునే ధైర్యము బలహీన ఆత్మలకు లేదు. బాబా అయితే ఇస్తున్నారు, కానీ వారు తీసుకోలేకపోతున్నారు. వారికి మీ సహకారం కావాలి. ఒక పాఠం మాత్రమే దృఢం చేసుకోండి - ఈరోజు ఎంతమంది ఆత్మలకు నిస్వార్థ సహకారం ఇచ్చారు? మీరు ఇవ్వడం ప్రారంభిస్తారు, ఇస్తూనే ఉన్నారు, కానీ ఇంకా అండర్లైన్ చేయండి. అప్పుడు అందరి వద్దకు ఆ అల వ్యాపిస్తుంది.
భోపాల్ అన్నయ్యతో:- శాంతివన్ ఎంత పెద్దదిగా అయిపోయింది! ఇప్పుడు మొత్తం భారతదేశంలోని సేవాకేంద్రాల కంటే, పాండవ్ భవన్ కంటే, జ్ఞాన సరోవర్ కంటే, నాలుగు వైపులా శాంతివన్ పెద్దదిగా అయిపోయింది. కాబట్టి పెద్ద హృదయం. మంచిగా ఉంది. శ్రమ కూడా మంచిగా చేస్తున్నారు.
ఇప్పుడు యు.పి. వారి టర్న్ కదా. యు.పి. వారు చేతులు ఎత్తండి. సేవలో ఉన్నవారు నిలబడండి. చాలా మంచిది. సేవకు ప్రత్యక్ష ఫలం సంతోషం. మరి సంతోషంగా ఉందా? ఈ ప్రత్యక్ష ఫలం అవినాశిగా ఉండాలి. అందరూ సేవకు మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అందుకే బాప్‌దాదా అంటున్నారు - సాక్ష్యం ఇచ్చే సపుత్ర పిల్లలు. మరి ఎంతమంది నుండి ఆశీర్వాదాలు పొందారు? హృదయపూర్వకంగా సేవ చేయడం అంటే ఆశీర్వాదాల ద్వారం తెరుచుకోవడం. కాబట్టి సేవ చేశారు అంటే ఆశీర్వాదాలు పొందారు. అలా ఆశీర్వాదాలను జమ చేసుకుంటూ ఉండండి. అచ్ఛా.
ఆది రత్నాలు కూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. మధుబన్వారు కూడా సేవలో మంచి పాత్రను పోషిస్తున్నారు. మధుబన్వారు అంటే ఎల్లప్పుడూ బాప్‌దాదాతో కూడి ఉన్న అనుభూతిని సహజంగా చేసుకునేవారు. మధుబన్ అంటే మధుబన్ యొక్క బాబా. కాబట్టి మధుబన్వారు ఎల్లప్పుడూ బాబాతోనే ఉంటారు. సేవ కోసం బాప్‌దాదా ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడి సేవను బాప్‌దాదా ఎల్లప్పుడూ చూస్తుంటారు. ప్రతి సేవాకేంద్రం యొక్క సేవా రికార్డు బాప్‌దాదా వద్ద ఉంటుంది. మధుబన్ది వేరు, విదేశాలది వేరు, భారతదేశానిది వేరు. బాప్‌దాదా అయితే గీతా పాఠశాలలను కూడా చూస్తారు. మీరు అయితే రెండు, నాలుగు, ఐదు చోట్లకు మాత్రమే వెళ్తారు. బాప్‌దాదా అయితే గీతా పాఠశాలలకూ చక్కర్లు కొడతారు. అచ్ఛా, గీతా పాఠశాలవారు లేచి నిలబడండి. అభినందనలు. మూడు అడుగులు ఇచ్చి మూడు లోకాల యజమానులయ్యారు. తెలివైనవారు కదా. ఇచ్చింది మూడు అడుగులు, తీసుకుంది మూడు లోకాలు. బాప్‌దాదా మీ గీతా పాఠశాలలకు, క్లాసులకు కూడా వస్తుంటారు. దాదీలకు సమయం దొరకదు కదా, అందుకే బాప్‌దాదా తిరిగి వస్తారు. అందుకే అవ్యక్తంగా అయ్యారు కదా. (దాదీజీతో) మీ పని కూడా ఇప్పుడు అవ్యక్త రూపంలో బాప్దాదానే చేస్తున్నారు.
బాప్‌దాదా అన్నింటినీ నోట్ చేస్తారు. గీతా పాఠశాలవారు, క్లాసులు నిర్వహించే వారు ఏ విధితో నడుస్తున్నారు, ఏ విధితో నిద్రపోతున్నారు, ఏ విధితో తింటున్నారు, త్రాగుతున్నారు - అన్నింటినీ నోట్ చేస్తారు. ఎక్కడెక్కడ సరిగా లేదో కూడా చూస్తారు. గీతా పాఠశాల అయినా, ఎక్కడ సేవ చేస్తున్నా, ఆ స్థలం విధిపూర్వకంగా, శుభ్రంగా, మర్యాదాపూర్వకంగా ఉండాలి. అలాగే దినచర్య కూడా బ్రాహ్మణ జీవిత నియమాలకు అనుగుణంగా ఉండాలి. ఊరికే అలా నడిపించేయకండి, ఫర్వాలేదు అనుకోకండి. బాప్‌దాదా ఎక్కువగా చెప్పరు. కొంచెం కష్టంగా అనిపిస్తుందని అర్థం చేసుకొని కొన్ని విషయాలను వదిలేస్తారు. వదలకూడదు, అయినప్పటికీ వదిలేస్తారు. ఎవరు చూస్తారులే అని ఎప్పుడూ అనుకోకండి. అయినప్పటికీ ధైర్యము ఉంచి, ప్రవృత్తిలో ఉంటూ సేవకు నిమిత్తులుగా అవుతున్నారు. అది చూసి బాప్‌దాదాకు సంతోషం కలుగుతుంది. ఇక పరిశీలించుకోవడం మీ పని. బాబా చెప్పరు, అది మీ పని. ఒకవేళ బాబా లేదా దాదీలు చెబితే నాలుగు నాలుగు పేజీల ఉత్తరాలు వస్తాయి - ఇలా ఉంది, అలా ఉంది... అని. అందుకే బాప్‌దాదా చెప్పరు. కేవలం సూచన ఇస్తారు - మర్యాదాపూర్వకంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, మార్చుకోండి. అచ్ఛా. అందరూ ఒకరి కంటే మరొకరికి ప్రియమైనవారే. ముందు వరుసలో కూర్చున్నవారే ప్రియమైనవారు అని కాదు. మీరు వారికంటే కూడా మరింత ప్రియమైనవారే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
