Search for a command to run...
31 Dec 2000
‘‘పొదుపు ఖాతాను జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి’’
31 December 2000 · తెలుగు
ఈరోజు నవ యుగ రచయిత తమ నవ యుగ అధికారీ పిల్లలను చూస్తున్నారు. ఈరోజు పాత యుగములో సాధారణమైనవారు మరియు రేపు కొత్త యుగములో రాజ్య అధికారీ పూజ్యులు. ఈరోజు మరియు రేపు యొక్క ఆట ఇది. ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు! అనన్యులైన జ్ఞానీ ఆత్మలైన పిల్లలెవరైతే ఉన్నారో, వారి ఎదురుగా రాబోయే రేపు కూడా ఈరోజు ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటుంది. మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కానీ బాప్‌దాదా కొత్త యుగాన్ని చూస్తున్నారు. కొత్త సంవత్సరములోనైతే ప్రతి ఒక్కరూ తమ-తమ కొత్త ప్లాన్లు తయారుచేసుకునే ఉంటారు. ఈరోజు పాత సంవత్సరము యొక్క సమాప్తి, సమాప్తిలో మొత్తము సంవత్సరము యొక్క రిజల్టును చూడటం జరుగుతుంది. కనుక ఈరోజు బాప్‌దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి సంవత్సరము యొక్క రిజల్టును చూసారు. బాప్‌దాదాకు చూడటానికి సమయమైతే పట్టదు. కనుక ఈరోజు విశేషంగా పిల్లలందరి జమ ఖాతాను చూసారు. పురుషార్థమునైతే పిల్లలందరూ చేసారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేసారు, సంబంధ-సంపర్కములో కూడా లౌకిక మరియు అలౌకిక పరివారాన్ని చూసుకున్నారు, కానీ ఈ మూడు విషయాలలోనూ జమ ఖాతా ఎంత అయ్యింది?
ఈరోజు వతనములో బాప్‌దాదా జగదంబ తల్లిని ఇమర్జ్ చేసారు. (దగ్గు వచ్చింది) ఈరోజు వాయిద్యం(శరీరము) కొంచెం పాడైంది, అయినా కానీ మ్రోగించాలి కదా. బాప్‌దాదా మరియు మమ్మా కలిసి అందరి పొదుపు ఖాతాను చూసారు. పొదుపు చేసి ఎంత జమ చేసారు! మరి ఏం చూసాము? అందరూ నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు కానీ ఎంత జమ ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది. అప్పుడు జగదంబ తల్లి ప్రశ్న అడిగారు - స్మృతి సబ్జెక్టులో చాలామంది పిల్లలది లక్ష్యము కూడా మంచిగా ఉంది, పురుషార్థము కూడా మంచిగా ఉంది, మరి జమ ఖాతా ఎంతగా ఉండాలో అంత లేకుండా తక్కువగా ఎందుకు ఉంది? ఇలా ఆత్మిక సంభాషణ జరిగిన తరువాత ఫలితము ఏం వచ్చిందంటే యోగాభ్యాసమైతే చేస్తున్నారు కానీ యోగ స్థితి యొక్క పర్సెంటేజ్ సాధారణంగా ఉన్న కారణంగా జమ ఖాతా కూడా సాధారణంగానే ఉంది. యోగము యొక్క లక్ష్యము మంచిగా ఉంది కానీ యోగము యొక్క రిజల్టు ఏమిటంటే - యోగయుక్తమైన మరియు యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక. ఇందులో లోపం ఉన్న కారణంగా యోగము చేసే సమయములో యోగములో మంచిగా ఉంటున్నారు కానీ యోగీ అంటే యోగము యొక్క ప్రభావము జీవితములో ఉండాలి. అందుకే జమ ఖాతా కొన్ని-కొన్ని సమయాలలోనే జమ అవుతుంది కానీ మొత్తము సమయము జమ అవ్వటం లేదు. నడుస్తూ-నడుస్తూ స్మృతి యొక్క పర్సెంటేజ్ సాధారణమైపోతుంది. అందులో చాలా తక్కువ జమ ఖాతా తయారవుతుంది.
రెండవది - సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలానే చేస్తారు, రాత్రింబవళ్ళు బిజీగా కూడా ఉంటారు. ప్లాన్లు కూడా చాలా మంచి-మంచివి తయారుచేస్తారు మరియు సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అయినా కానీ మెజారిటీ యొక్క జమ ఖాతా తక్కువగా ఎందుకు ఉంది? ఆత్మిక సంభాషణలో ఏం తేలిందంటే సేవనైతే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీ పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు, మరి కారణమేమిటి? కారణం ఏం తేలిందంటే, సేవ యొక్క బలము కూడా లభిస్తుంది, ఫలము కూడా లభిస్తుంది. బలము అనేది స్వయము యొక్క హృదయములో సంతుష్టత మరియు ఫలము అనేది సర్వుల సంతుష్టత. ఒకవేళ సేవ చేసారు, కష్టపడ్డారు, సమయాన్ని కూడా వెచ్చించారు అంటే సేవ ద్వారా హృదయము యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవ్వాలి, అది మీతోపాటు ఉన్న సహచరులకైనా లేక ఎవరికైతే సేవ చేసారో వారికైనా హృదయములో సంతుష్టత అనుభవం అవ్వాలి, అంతేకానీ చాలా బాగుంది, చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవటం కాదు. వారి హృదయములో సంతుష్టత యొక్క అల అనుభవం అవ్వాలి. ఏదో లభించింది అన్నట్లు అనుభవమవ్వాలి. చాలా బాగా విన్నారు అన్నది వేరే విషయము కానీ ఏదో లభించింది, ఏదో పొందాము అని వారికి అనుభవమవ్వాలి. దీని గురించి బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఒకటేమో, బుద్ధి వరకు బాణం తగలటము, ఇంకొకటి హృదయానికి బాణం తగలటము. ఒకవేళ సేవ చేసారు మరియు అది స్వయానికి సంతుష్టతను ఇచ్చిందంటే, అది మిమ్మల్ని మీరు సంతోషపరచుకునే సంతుష్టత కాదు, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని అనుకోవటం కాదు. స్వయం యొక్క మరియు సర్వుల యొక్క హృదయము అంగీకరించాలి. మరొక విషయం ఏమిటంటే సేవ చేసారు మరియు దాని ఫలితాన్ని మీరు స్వీకరించారంటే అనగా నేను కష్టపడ్డాను, నేను చేసాను, నేను చేసాను అని స్వీకరించారంటే సేవ ఫలాన్ని తినేసినట్లే. జమ అవ్వలేదు. బాప్‌దాదా చేయించారు అని అంటే బాప్‌దాదా వైపుకు అటెన్షన్ ఇప్పించినట్లు, అంతేకానీ స్వయము వైపుకు కాదు. ఈ అక్కయ్య చాలా మంచివారు, ఈ అన్నయ్య చాలా మంచివారు అని అనిపించటం కాదు. వీరి బాప్‌దాదా చాలా మంచివారు అని అనుభవము చేయించటము - ఇదే జమ ఖాతాను పెంచుకోవటము. అందుకే మొత్తము రిజల్టులో చూస్తే శ్రమ ఎక్కువ, సమయము, శక్తి ఎక్కువ మరియు కొంచెం-కొంచెం షో ఎక్కువ, అందుకే జమ ఖాతా తక్కువైపోతుంది. జమ ఖాతా యొక్క తాళంచెవి చాలా సహజమైనది, అది వజ్రపు తాళంచెవి, బంగారు తాళపుచెవిని పెడతారు కానీ జమ యొక్క డైమండ్ తాళంచెవి ఏమిటంటే - ‘‘నిమిత్త భావము మరియు నిర్మాన భావము’’. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల, అది సహచరుల పట్లనైనా లేక ఏ ఆత్మ సేవనైతే చేస్తారో వారి పట్లనైనా, ఇరువురి పట్ల సేవ చేసే సమయములో, ముందు-తరువాత కాదు, సేవ చేసే సమయములో నిమిత్త భావము, నిర్మాన భావము, నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహము ఇమర్జ్ అయి ఉన్నట్లయితే జమ ఖాతా పెరుగుతూ ఉంటుంది.
ఈ విధి ద్వారా సేవ చేసేవారి జమ ఖాతా ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది బాప్‌దాదా జగదాంబ తల్లికి చూపించారు. కేవలం ఒక్క క్షణములో అనేక గంటల జమ ఖాతా జమ అయిపోతుంది. టిక్-టిక్-టిక్ అంటూ వేగంగా త్వరత్వరగా చెయ్యండి, ఇటువంటి మెషిన్ నడుస్తుంది. కనుక జమ ఖాతాలో జమ చేసుకోవటము చాలా సహజమని జగదంబ తల్లి చాలా సంతోషపడుతున్నారు. బాప్‌దాదా మరియు జగదంబ, ఇద్దరి సలహా ఏమిటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక జమ ఖాతాను చెక్ చేసుకోండి - రోజంతటిలో పొరపాట్లనైతే చెయ్యలేదు, మంచిదే, కానీ సమయము, సంకల్పాలు, సేవ, సంబంధ-సంపర్కములో స్నేహము, సంతుష్టత, వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు? చాలామంది పిల్లలు ఈరోజు చెడు ఏమీ జరగలేదు, ఎవరికీ దుఃఖము ఇవ్వలేదు అని ఇంతమాత్రమే చెక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి - మొత్తము రోజంతటిలో శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను? శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవ ఖాతా ఎంత జమ అయ్యింది? ఎంతమంది ఆత్మలకు ఏ కార్యము ద్వారానైనా సుఖాన్ని ఇచ్చానా? యోగము చేసాను కానీ యోగము యొక్క పర్సెంటేజ్ ఎలా ఉంది? ఈరోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను?
ఈ క్రొత్త సంవత్సరములో ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నా సరే, మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణా ద్వారానైనా, సమయమనుసారంగా మనసులో ఈ ధ్యాసే ఉండాలి - నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. అఖండ మహాదానిగా అవ్వాలి, కేవలం మహాదాని కాదు, అఖండ మహాదాని. మనసా ద్వారా శక్తుల దానము, వాచా ద్వారా జ్ఞాన దానము మరియు తమ కర్మల ద్వారా గుణ దానము. ఈరోజుల్లో ప్రపంచములో, అది బ్రాహ్మణ పరివారపు ప్రపంచములోనైనా లేక అజ్ఞానుల ప్రపంచములోనైనా వినటం కన్నా చూడాలని కోరుకుంటున్నారు. చూసి చెయ్యాలని కోరుకుంటున్నారు. మీకు ఎందుకు సహజమైంది? బ్రహ్మాబాబాను కర్మలలో గుణ దాన మూర్తిగా చూసారు. జ్ఞాన దానమునైతే చేస్తూనే ఉంటారు కానీ ఈ సంవత్సరము విశేషముగా ఈ ధ్యాసను పెట్టుకోండి - ప్రతి ఆత్మకు గుణ దానమును ఇవ్వాలి అనగా తమ జీవితములోని గుణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణులకు దానమునైతే ఇవ్వరు కదా, సహయోగాన్ని ఇవ్వండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతటి అవగుణధారులైనా కానీ, నేను నా జీవితము ద్వారా, కర్మల ద్వారా, సంపర్కము ద్వారా గుణ దానమును ఇవ్వాలి అనగా సహయోగిగా అవ్వాలి. ఇందులో ఇతరులను చూడకండి, వీరు చెయ్యకపోతే నేను ఎలా చేస్తాను, వీరు కూడా ఇలాగే ఉన్నారు కదా అని అనుకోకండి. బ్రహ్మా బాబా కేవలం శివబాబానే చూసారు. పిల్లలైన మీరు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మాబాబానే చూడండి. ఇందులో ఇతరులను చూడకుండా ఈ లక్ష్యము పెట్టుకోండి - ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటారో వారే అర్జునులు అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్తముగా చేసుకుంటారో, వారే నంబర్‌వన్ అర్జునుడిగా అవుతారు. బ్రహ్మా బాబా నంబర్‌వన్ అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నంబర్‌వన్‌గా అవ్వరు. నంబరువారులోకి వస్తారు, నంబర్‌వన్‌గా అవ్వరు. చేతులు ఎత్తించినప్పుడు అందరూ నంబరువారులో చేతులెత్తుతారా లేక నంబర్‌వన్‌లో చేతులెత్తుతారా? మరి ఏం లక్ష్యము పెట్టుకుంటారు? అఖండ గుణదాని, అచంచలము, ఎవరు ఎంతగా చలింపజేసినా కానీ చలించకండి. అందరూ ఇలాగే ఉన్నారు, నిన్ను నువ్వు చంపుకోవటం ఎందుకు, నువ్వు కూడా అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా బలహీనం చేసే సహచరులు ఎంతోమంది దొరుకుతారు. కానీ బాప్‌దాదాకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని పెంచే సహచరులు కావాలి. మరి ఏం చెయ్యాలో అర్థమైందా? సేవ చెయ్యండి కానీ జమ ఖాతాను పెంచుకుంటూ చెయ్యండి, బాగా సేవ చెయ్యండి. మొదట స్వయం యొక్క సేవ, ఆ తర్వాత సర్వుల సేవ. మరొక విషయాన్ని కూడా బాప్‌దాదా గమనించారు, వినిపించమంటారా?
ఈరోజు చంద్రుడు మరియు సూర్యుడి మిలనం కదా! జగదంబ తల్లి అన్నారు - ఎడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురుచూడాలి? ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎడ్వాన్స్ స్థితిలోకి వెళ్తారో, అప్పుడు ఎడ్వాన్స్ పార్టీ వారి కార్యం పూర్తవుతుంది. కావున జగదంబ తల్లి ఈరోజు బాప్‌దాదాకు చాలా నెమ్మదిగా, చాలా పద్ధతిపూర్వకముగా ఒక విషయాన్ని వినిపించారు, ఏ విషయాన్ని వినిపించారు? బాప్దాదాకైతే తెలుసు, కానీ ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది కదా! జగదంబ ఏమన్నారంటే - నేను కూడా తిరిగి చూస్తూ ఉంటాను, మధుబన్‌లో కూడా తిరుగుతాను, సెంటర్లు కూడా తిరుగుతాను. నవ్వుతూ నవ్వుతూ చెప్పారు. వారు నవ్వుతూ-నవ్వుతూనే సూచనల ద్వారా చెప్తారు, డైరెక్టుగా చెప్పరు అని ఎవరైతే జగదాంబను చూసారో వారికి ఈ విషయము తెలుసు. నవ్వుతూ నవ్వుతూ ఏమన్నారంటే, ఈరోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది, ఏ విశేషత? ఈరోజుల్లో నిర్లక్ష్యము అనేక రకాలుగా వచ్చేసింది. ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన నిర్లక్ష్యము ఉంది. అయిపోతుందిలే, చేసేస్తాములే... వేరే వారు ఇంకా చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తాములే... ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది... నిర్లక్ష్యము యొక్క ఈ భాష సంకల్పాలలోనైతే ఉండనే ఉంది కానీ అది మాటలలో కూడా ఉంది. అప్పుడు బాప్‌దాదా - దీని కోసం ఈ క్రొత్త సంవత్సరములో మీరు పిల్లలకు ఏదైనా యుక్తిని వినిపించండి అని జగదాంబతో అన్నారు. జగదాంబ తల్లిది సదా ఒక ధారణా యుక్తమైన స్లోగన్ ఉండేదని మీ అందరికీ తెలుసు, గుర్తుందా? ఎవరికి గుర్తుంది? (హుకుమీ హుకుమ్ చలాయే రహే - ఆజ్ఞాపించేవారు నన్ను నడిపిస్తున్నారు) అప్పుడు జగదాంబ అన్నారు - మమ్మల్ని బాప్‌దాదా నడిపిస్తున్నారు, వారి ఆజ్ఞానుసారముగా ప్రతి అడుగు వేస్తున్నాము అన్న ఈ ధారణను అందరూ చేసినట్లయితే, మమ్మల్ని నడిపించేవారు డైరెక్ట్ బాబా అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే ఇక దృష్టి ఎక్కడకు వెళ్తుంది? నడిచేవారి దృష్టి నడిపించేవారి వైపుకే వెళ్తుంది, వేరే వైపుకు వెళ్ళదు. కనుక ఈ చేయించేవారు నిమిత్తులుగా చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించేవారిది. అప్పుడు సేవలో ఏదైతే తల భారమైపోతుందో అది సదా తేలికగా ఉంటుంది, ఆత్మిక గులాబీ వలె ఉంటారు. ఏం చెయ్యాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. అచ్ఛా.
క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవటానికి అందరూ పరుగు-పరుగున చేరుకున్నారు. హౌస్ ఫుల్ అయిపోయింది, మంచిది. అచ్ఛా, నీరైతే లభించింది కదా! లభించిందా నీరు? నీటి కోసం కష్టపడుతున్నవారికి అభినందనలు. ఇన్ని వేల మందికి నీటిని అందించటమంటే, రెండు-నాలుగు బకెట్ల నీరైతే కాదు కదా! ఇక రేపటి నుండైతే తిరుగు ప్రయాణము యొక్క మేళా ఉంటుంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా! తుఫాను కాస్త పరీక్ష పెట్టింది. కొంత తీవ్రమైన గాలులు వీచాయి. అందరూ బాగానే ఉన్నారా? పాండవులు బాగానే ఉన్నారా? మంచిది. కుంభమేళా కంటే బాగానే ఉంది కదా! అచ్ఛా, మూడు అడుగుల నేలైతే లభించింది కదా. మంచము లభించకపోయినా కానీ మూడు అడుగుల నేల అయితే లభించింది కదా!
క్రొత్త సంవత్సరములో నలువైపుల ఉన్న పిల్లలు కూడా, విదేశాలలో కూడా మరియు దేశములో కూడా క్రొత్త సంవత్సర మహోత్సవాన్ని బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. మధుబన్‌లో కూడా చూస్తున్నారు. మధుబన్ వారు కూడా యజ్ఞ రక్షకులుగా అయ్యి సేవ పాత్రను పోషించారు, చాలా మంచిది. బాప్‌దాదా దేశ-విదేశాలవారితోపాటు సేవకు నిమిత్తులైన మధుబన్ వాసులకు కూడా అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా. ఇకపోతే కార్డులైతే ఎన్నో వచ్చాయి. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, చాలా కార్డులు వచ్చాయి. కార్డులు పంపటమనేది పెద్ద విషయమేమీ కాదు కానీ వాటిలో హృదయపూర్వకమైన స్నేహము దాగి ఉంది. బాప్‌దాదా కార్డు యొక్క అందము చూడరు కానీ ఎంత విలువైన హృదయపూర్వకమైన స్నేహము నిండి ఉందో అది చూస్తారు, కనుక అందరూ తమ-తమ హృదయపూర్వకమైన స్నేహాన్ని పంపారు. అటువంటి స్నేహీ ఆత్మలకు విశేషముగా, ఒక్కొక్కరి పేరైతే తీసుకోము కదా, కానీ బాప్‌దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలకు స్నేహముతో నిండిన గౌరవాన్ని ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈ-మెయిల్, ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ సాధనాలన్నింటి కంటే కూడా ముందుగా సంకల్పము ద్వారానే బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి, ఆ తరువాత మీ కంప్యూటర్, ఈ-మెయిల్లో వస్తాయి. పిల్లల స్నేహము బాప్‌దాదా వద్దకు ప్రతి సమయము చేరుకుంటూనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా క్రొత్త సంవత్సరానికి సంబంధించి కొంతమంది ప్లాన్లు కూడా వ్రాసారు, ప్రతిజ్ఞలు కూడా చేసారు, గతం గతఃగా భావించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. బాప్‌దాదా అందరికీ చాలా చాలా శభాష్ పిల్లలూ, శభాష్ అని అంటున్నారు, శభాష్.
మీరందరూ సంతోషపడుతున్నారు కదా! కావున వారు కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు బాప్‌దాదా యొక్క మనసులోని ఆశ ఏమిటంటే - ‘‘దాత పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వండి’’. ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని యాచించకండి. దాతగా అవ్వండి, ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళడంలో విశాల హృదయులుగా అవ్వండి. మాకు పెద్దవారి ప్రేమ కావాలి అని చిన్నవారు బాప్‌దాదాతో అంటారు, అప్పుడు బాబా, పెద్దవారి పట్ల గౌరవం ఉంచినట్లయితే ప్రేమ లభిస్తుంది అని చిన్నవారికి చెప్తారు. గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటము. గౌరవము ఊరికే అలా లభించదు. ఇవ్వటమే తీసుకోవటము. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా. దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థము. దేవి అంటేనే ఇచ్చేవారు అని అర్థము. కనుక చైతన్య దేవీ-దేవతలైన మీరు దాతగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చే దాతలుగా అయినట్లయితే ఇక తీసుకునేవారు సమాప్తమైపోతారు కదా! అప్పుడిక నలువైపుల సంతుష్టత యొక్క, ఆత్మిక గులాబి యొక్క సుగంధము వ్యాపిస్తుంది. విన్నారా!
కనుక క్రొత్త సంవత్సరములో పాత భాష మాట్లాడకూడదు. కొందరు పాత భాష మాట్లాడుతుంటారు, అది మంచిగా అనిపించదు, కనుక పాత మాటలకు, పాత నడవడికకు, ఏదైనా పాత అలవాటుకు వశమవ్వకండి. ప్రతీ విషయములోనూ క్రొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి! ఏమి క్రొత్తగా చేసారు? ఇప్పుడు కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవాలి. 21 జన్మల వారసత్వాన్ని సంపూర్ణముగా 21వ శతాబ్దములో పొందాల్సిందే. పొందాలి కదా! అచ్ఛా.
సేవ టర్న్ గుజరాత్ వారిది:- గుజరాత్ సేవ ప్రసిద్ధి చెందింది కదా? బాగుంది, గుజరాత్ విశేషత ఏమిటంటే, ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా ప్రతి కార్యంలో సహయోగాన్ని అందించడంలో ఎవరెడీగా ఉంటారు. గుజరాత్ వారికి బాప్‌దాదా కేవలం ఒక్క ఫిర్యాదును చేస్తారు, చెప్పమంటారా? ఎంత సమీపంగా ఉన్నారో, అంతగా మైక్‌లను సమీపంగా మీరు తీసుకురాలేదు. గుజరాత్ మినిస్ట్రీ చాలా మంచిది. గుజరాత్ వారు మినిస్ట్రీ నుండి ఒక గ్రూప్‌ను తయారు చేయాలి, వీలవుతుందా! హైదరాబాద్ వలె గుజరాత్, కర్ణాటకలో కూడా ఉంది, ఆ విధంగా ఎవరినైనా సంబంధ-సంపర్కంలోకి తీసుకురండి, సంబంధ-సంపర్కంలో ఉన్నారు కూడా, కానీ సేవలోకి రావాలి. పని వచ్చినప్పుడు ఆ కొద్ది సమయానికి వారు సహయోగాన్ని ఇస్తున్నారు, కానీ సేవలో నిమిత్తంగా అవ్వడము, ఇంతగా సమీపంగా మరియు నిర్భయంగా ఉండేవారు కావాలి. బాప్‌దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు, ఇప్పుడు సంవత్సరం పూర్తి కావస్తుంది, కానీ బాప్‌దాదా వద్దకు ఆ రిజల్ట్ మాత్రం ఇంకా రాలేదు. వేరువేరు స్థానాలలో మంచి-మంచి ఐ.పీలు ఉన్నారు. మధుబన్కు కూడా చాలామంది వచ్చారు, సేవాకేంద్రాలకు కూడా చాలామంది వస్తుంటారు, కానీ వారి సంగఠన జరగలేదు. జోన్-జోన్లో కూడా సంగఠన జరగవచ్చు, ముందుకు వెళ్ళడానికి వారికి ధైర్యం రావాలి. వ్యక్తిగతంగా అయితే సేవను చేస్తూనే ఉన్నారు కానీ సంగఠనలోకి వచ్చినప్పుడే ధ్వని వ్యాపిస్తుంది. ఎలా అయితే ఫారెన్ నుండి గ్రూపుగా వచ్చారు కదా! చిన్న గ్రూపు కావచ్చు పెద్ద గ్రూపు కావచ్చు, కానీ గ్రూపుగా వచ్చారు కదా. గ్రూపుగా అవ్వడం వలన శక్తి ఉంటుంది, ధైర్యం వస్తుంది. అచ్ఛా. గుజరాత్ వారికి సేవ యొక్క అభినందనలు.
విదేశీయుల యూథ్ రిట్రీట్ జ్ఞాన్ సరోవర్‌లో జరుగుతుంది:- బాగుంది, యూథ్ గ్రూప్ గురించి కూడా బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు. మంచి పురుషార్థాన్ని మరియు విధిని మీ సొంతం చేసుకుంటారు. ఫారెన్ యొక్క యూథ్ లేచి నిల్చోండి. అచ్ఛా. ఇక్కడ ఏ అభ్యాసమునైతే పక్కా చేసుకున్నారో అది అక్కడ కూడా చేస్తారు కదా. లేక కొంచెం తగ్గుతుందా? చెప్పండి! 5 సెకండ్ల అభ్యాసము ఏదైతే చేసారో అది మీ మీ దేశాలకు వెళ్ళిన తర్వాత కూడా ఉంటుంది కదా? (చేతులు ఊపుతున్నారు) అచ్ఛా, ప్రోగ్రామును చాలా బాగా తయారు చేసారు. అటెన్షన్ కూడా మంచిగా పెట్టారు. ఇప్పుడు కేవలం దీనిని పెంచుతూ ఉండండి, తగ్గించకండి. మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు, ఈ రిజల్ట్ మున్ముందుకు వెళ్ళింది, తగ్గలేదు అని చెప్పండి. ఇకపోతే అంతా బాగుంది, ధైర్యముతో వస్తారు, ప్రేమతో వస్తారు. ఇంత దూరదూరాల నుండి వస్తున్నారంటే ప్రేమ ఉంది కనుకనే వస్తున్నారు కదా! మొత్తం ప్రపంచంలోని యూథ్ను జమ చేసి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళండి, ఈ యూథ్ స్వ పరివర్తనతో విశ్వ పరివర్తన చేస్తున్నారు అని చెప్పండి. ఇటువంటి సంగఠన కూడా తయారవుతుంది. విదేశాలలో ఎన్ని దేశాలలో సేవ జరుగుతుంది? (75) భారతదేశంలో? ఇండియా అయితే ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒకటిగా చూపించండి మరియు విదేశాలలో ఒక్కొక్క దేశాన్ని ఒకటిగా చూపించండి. మరి ఒక్కొక్క దేశం యొక్క యూథ్, విదేశాలు కావచ్చు, దేశం కావచ్చు, అక్కడినుండి ఒక్కొక్కరే ఉండవచ్చు, గ్రామం వారు కూడా ఉండవచ్చు, దేశం వారు కూడా ఉండవచ్చు, విదేశీయులు కూడా ఉండవచ్చు. అన్నివైపుల నుండి యూథ్ కలవాలి, అప్పుడు చాలా బాగా సేవ జరుగుతుంది. అలాగే ప్రతి దేశంలో తమ లెక్క అనుసారంగా మంచి ప్రసిద్ధి చెందిన ఐ.పీలు ఉండాలి. వి.ఐ.పీలను విడిచిపెట్టండి. వారు ధైర్యవంతులై ఉండాలి మరియు ఇటువంటి వారు అన్నిదేశాల నుండి ఒకచోట చేరాలి. మన దేశంలో ఎంతోమందికి లాభం కలుగుతుంది అన్న విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలి. అచ్ఛా.
విదేశీ చిన్న పిల్లల రిట్రీట్ కూడా ఉంది:- చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. లేచి నిల్చోండి. ట్రైనింగ్ బాగా తీసుకున్నారా? మంచి పిల్లలుగా అవుతారు కదా!
టీచర్లతో:- టీచర్లందరూ కల్చర్ ఆఫ్ పీస్ కోసం కష్టపడ్డారు. సేవ బాగా చేసారు. ఆత్మలకు పరిచయం లభించింది, కొందరు సంబంధ-సంపర్కంలోకి కూడా వచ్చారు, సందేశం కూడా కొందరికి లభించింది. ఇప్పుడు వచ్చినా లేక రాకపోయినాగానీ, మాకు కూడా కరపత్రము లభించింది అని సమయం వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంది. ఆ శ్వేత వస్త్రధారీ సోదరీలు ఎక్కడున్నారు, మాకు కరపత్రాన్ని ఇచ్చినది ఎవరు, వారి ఇచ్చినా మేము వినలేదు అని అనిపిస్తుంది. ఆ సమయం కూడా వస్తుంది. ఏ ఆత్మలలో అయితే బీజము వేసారో వాటి ఫలం రావలసిందే. ప్రైజ్ అయితే ఉల్లాస-ఉత్సాహాలను పెంచడానికి కొద్దిమందికే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరెవరైతే ఎంతమందికైతే సేవను చేసారో ఆ సేవ అంతా ఆత్మల వద్దకు చేరుకుంటుంది మరియు బాబా వద్ద జమ అవుతూ ఉంటుంది. ప్రైజ్ అయితే ఒక్కరికే లభిస్తుంది కానీ సహయోగము అయితే చాలామంది చేసారు, టీచర్లు, స్టూడెంట్లు చాలామంది చేసారు. కనుక, సేవ చేసిన ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా తరఫు నుండి స్నేహ కానుక ఉండనే ఉంటుంది. మాకు బహుమతి లభించలేదు అని భావించకండి, మాకు హృదయము యొక్క స్నేహము లభించింది. అచ్ఛా.
ఈరోజు బాప్‌దాదాకు రైల్వే వారి సేవ గుర్తుకు వచ్చింది. చలిలో అయినా, వేడిలో అయినా రైల్వే స్టేషన్‌కు వెళ్ళి రిసీవ్ చేసుకునేవారు గుర్తుకు వస్తున్నారు, వారు కూర్చున్నారా? ఎవరైతే రైల్వే స్టేషన్‌కు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారో వారు ఇక్కడ ఉన్నారా లేక ఇప్పుడు కూడా స్టేషన్లో ఉన్నారా? సేవలో బీజీగా ఉంటారు. వీరి సేవ కూడా నిర్విరామంగా ఉంటుంది. మీ అందరినీ చక్కగా తీసుకువస్తారు కదా. చేరుకుంటారు కదా! విశేషంగా మెజారిటీ సంగమ్ భవన్లో ఉంటారు కదా. మరి అటువంటి నిర్విరామ సేవాధారులను కూడా బాప్‌దాదా గుర్తు చేస్తున్నారు. అసలైతే మధుబన్‌లోని అన్ని డిపార్టుమెంట్లు చాలా కష్టపడతాయి. అందుకే అందరూ మధుబన్ డిపార్టుమెంటు వారిని, శాంతివన్ కావచ్చు, పాండవ భవన్ కావచ్చు, చుట్టు ప్రక్కల ఉండేవారికి, జ్ఞాన సరోవర్ వారికి, హాస్పిటల్ వారికి సేవాధారులదంరికీ బాప్‌దాదా అభినందనలు చెప్తున్నారు. అచ్ఛా. వీరు కూడా (ఎదురుగా కేబిన్‌లో కూర్చున్న సోదరులను చూస్తూ) ఎంత సేవ చేస్తున్నారో చూడండి! చాలా బాగుంది. (ఎయిర్పోర్ట్ వారు, ఆవాస-నివాసము వారు కూడా నిర్విరామంగా సేవను చేస్తారు) అందుకే అన్ని డిపార్టుమెంట్లకు అభినందనలు చెప్పాము. ప్రతి ఒక్కరి సేవ చాలా బాగుంది. ఎవరైతే స్వచ్ఛతను ఉంచుతారో, వారి సేవ కూడా తక్కువైనదేమీ కాదు. ప్రతి డిపార్టుమెంట్ యొక్క పని వారివారిది. డిపార్టుమెంటులు లేకపోతే మీరందరూ ఇంత మంచిగా ఎలా ఉండగలరు! అందుకని బాప్‌దాదా పేరు తీసుకోవడం లేదు కానీ ప్రతి డిపార్టుమెంట్ వారు స్వయాన్ని నంబర్‌వన్‌గా భావించండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, పిల్లలందరికీ, సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే ఆత్మలకు, సదా స్వయం బ్రహ్మా బాబా సమానంగా సర్వుల ఎదురుగా శ్యాంపుల్‌గా అయ్యి అందరికీ సింపుల్‌గా చేసే ఆత్మలకు, సదా తమ జీవితములో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా చేసేవారికి, సదా అఖండ మహాదానులకు, మహా సహయోగి ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
జగదీశ్ అన్నయ్యతో:- బాగున్నారా? (చల్తీ కా నామ్ గాడీ) జీవితాన్ని అయితే ముందునుండే బాబాకు అర్పించేసారు. ఎప్పటివరకైతే జీవితంలో ఉంటారో అప్పటివరకు సేవను చేసారు మరియు చేస్తూ ఉంటారు. జమ అవుతూ ఉంది. ఇక్కడ మహారథులు అందరూ కూర్చుని ఉన్నారు కదా, ఇప్పుడు మహారథులు అందరికీ ఏ సేవను చేయాలో చెప్తాము. సేవలనైతే అందరూ చేస్తున్నారు, మీరందరూ ఇప్పటివరకు ఏ సేవలనైతే చేసారో, వాటిని ఇతరులు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు, వారు తెలివైనవారు, ఇప్పుడు మహారథులు ఒక క్రొత్త సేవను చేయాలి. చేస్తారా! ఇప్పుడు మీరు ఏ సేవలనైతే చేయాలో అందుకు వీటి (చెవులు) అవసరము లేదు. (తక్కువ వినిపిస్తుంది) ఇప్పుడు మీ సేవ – వైబ్రేషన్ల ద్వారా ఆత్మలను సమీపంగా తీసుకురావడము. పరస్పరంలో అయితే జరగవలసిందే. పరస్పర స్నేహము ఇతరులను వైబ్రేషన్ల ద్వారా ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు ఇటువంటి సాధారణ సేవను చేయాల్సిన అవసరం లేదు. భాషణ చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ మీరు ప్రతి ఆత్మకు ఎటువంటి ఫీలింగ్ కలిగించాలంటే, మాకేదో లభించింది అని వారికి అనిపించాలి. బ్రాహ్మణ పరివారాన్ని కూడా మీ సంగఠన యొక్క వైబ్రేషన్ల ద్వారా నిర్విఘ్నంగా తయారు చేయాలి. మనసా సేవ యొక్క విధిని మరింత తీవ్రతరం చేయండి. వాచ వారు చాలామంది ఉన్నారు. మనసా ద్వారా ఏదో ఒక శక్తి యొక్క అనుభవాన్ని చేయించండి. ఈ ఆత్మల ద్వారా ఈ ఈ శక్తుల అనుభవం జరిగింది అని వారు భావించాలి. శాంతి కావచ్చు, సంతోషము కావచ్చు, సుఖము కావచ్చు, నావారు అన్న భావన కావచ్చు. ఎవరైతే స్వయాన్ని మహారథిగా భావిస్తున్నారో వారు ఇప్పుడు ఈ సేవను చేయాలి. అందరూ స్వయాన్ని మహారథిగా భావిస్తున్నారా? మహారథులేనా? మంచిది. (జగదీశ్ అన్నయ్య ఒక పాటను పాడారు)
ఇప్పుడు ఇతరులకు కూడా మీ ద్వారా ఇటువంటి అనుభవాన్ని చేయించండి. పెరుగుతూ ఉంటుంది. దీనిద్వారానే ఇప్పుడు ఇటువంటి అనుభవాలు మొదలవుతాయి, తర్వాత సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి.
దాదీ జానకి గారితో:- ఉదాహరణకు, మీరు ఇక్కడ భారత దేశంలో కలిసి విదేశాలకు వెళ్ళిపోయారు అనుకోండి, విదేశాలకు వెళ్ళిన తర్వాత మీ ఫరిశ్తా రూపము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది – వీరు ఎవరు, ఈ దేవి ఎవరు, నాకు క్షణకాలం కోసం శాంతిని, సుఖాన్ని అనుభవం చేయించిన దేవి ఎవరు అని ఆలోచిస్తారు... దీనితోటే సాక్షాత్కారాలు మొదలవుతాయి. ఈ పాఠాన్ని ఇతరులకు కూడా నేర్పించండి. ప్రతి విషయంలో బాబా-బాబా-బాబా, నేను అన్నది తీసుకురాకండి, అప్పుడే సాక్షాత్కారాలు మొదలవుతాయి. నేను అన్నది వస్తుంది కనుకనే ప్రజలు బ్రహ్మాకుమారీల మహిమను చేస్తున్నారు, బాబాను తక్కువ గుర్తిస్తున్నారు. (పేరే బ్రహ్మాకుమారీ కదా) కానీ ముందుగా బ్రహ్మా అన్న పేరు ఉంది కదా.
అచ్ఛా, జగదీశ్ అన్నయ్యతో:- శరీరాన్ని నడిపిస్తున్నారు కదా, నడిపిస్తూ ఉండండి. లైట్‌గా ఉండటమే మంచిది. పాండవులు కూడా అందరూ సహయోగులు. పాండవుల ప్రేమ కూడా ఉంది, దాదీల ప్రేమ కూడా ఉంది. (పాండవులకన్నా దాదీల ప్రేమ ఎక్కువగా ఉంది) అసంభవం సంభవంగా మారే ఆ ఘడియ కూడా వస్తుంది. అచ్ఛా. అందరినుండి విన్నాము కదా!
జగదీశ్ అన్నయ్య సేవలో ఢిల్లీ నుండి వచ్చిన సాధన అక్కయ్య ఉన్నారు, వారితో బాప్‌దాదా మాట్లాడుతున్నారు):- సేవ యొక్క భాగ్యము లభించడము కూడా చాలా పెద్ద విషయము. మనస్ఫూర్తిగా సేవ చేస్తూ ఉండండి. చేస్తున్నారు, చేస్తూ ఉండండి.
అవ్యక్త బాప్‌దాదా కల్చర్ ఆఫ్ పీస్ సేవలలో ఫస్ట్ వచ్చినవారికి ప్రైజ్ ఇచ్చారు మరియు రాత్రి 12 గంటల తర్వాత నూతన సంవత్సరంలో పిల్లలందరికీ 2001 సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు
ఈ సమయము పాత మరియు క్రొత్త సంవత్సరాల సంగమ సమయము. సంగమ సమయము అనగా పాతది సమాప్తమవ్వటము మరియు క్రొత్తది ఆరంభమవ్వటము. ఎలా అయితే అనంతమైన సంగమయుగములో బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తులయ్యారో, అలా నేటి ఈ పాత మరియు క్రొత్త సంవత్సరాల సంగమములో కూడా స్వపరివర్తన యొక్క దృఢ సంకల్పాన్ని చేసారు మరియు చెయ్యాల్సిందే. ప్రతి క్షణము అచంచలమైన, అఖండ మహాదానిగా అవ్వాలి. దాత పిల్లలు మాస్టర్ దాతగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతోపాటు పాత ప్రపంచము యొక్క ఆకర్షణలకు మరియు పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి క్రొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించాలి. అందరికీ కోటానుకోట్ల సార్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.
ఇంజినీర్లు మరియు ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో వారంతా సేవను బాగా చేస్తున్నారు కావున బాప్‌దాదా అందరి నోటిలో గులాబ్ జామున్ పెడ్తున్నారు. మీ అందరి సహయోగముతో తయారైతే మీ అందరి నోటిలో కూడా గులాబ్ జామూన్ వస్తుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***