Search for a command to run...
18 Jan 2001
‘‘యథార్థ స్మృతికి ప్రమాణము - సమర్థ స్వరూపులుగా అయ్యి శక్తుల ద్వారా సర్వుల పాలనను చెయ్యండి’’
18 January 2001 · తెలుగు
ఈరోజు అందరి హృదయాలలో స్మృతులు వస్తున్నాయి. బాప్‌దాదా వద్ద కూడా అమృతవేళ నుండీ స్నేహము మరియు స్మృతులతో కూడిన వెరైటీ మాలలు నలువైపులా ఉన్న పిల్లల తరఫు నుండి మెడలో పడుతున్నాయి. వాటితోపాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన హృదయములోని పాటలను కూడా వింటున్నాము. బాప్‌దాదా ఇరువురూ పిల్లలకు రిటర్న్‌లో భిన్న-భిన్న శక్తుల యొక్క, భిన్న-భిన్న వరదానాల యొక్క మాలలను మెడలో వేస్తున్నారు. ఈ స్మృతి దివసము సాకార ప్రపంచము యొక్క వేదికపై పిల్లలకు సమర్థ స్వరూపము అనే వరదానము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లల యొక్క విశేష దివసము ఎందుకంటే సాకార రూపములో సేవకు నిమిత్తులుగా చేసేందుకై పిల్లలను సేవా వేదిక అనే సింహాసనముపై కూర్చోబెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపజేసిన రోజు. సాకార రూపములో సేవకు నిమిత్తంగా చేసే పట్టాభిషేకాన్ని జరిపిన రోజు మరియు తిలకాన్ని దిద్దిన రోజు. పిల్లలందరూ బాబాకు సహయోగులుగా అయ్యి నిమిత్తులుగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు. బాప్‌దాదా కూడా పిల్లలు సేవలో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళటం చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నంబరువారుగా ధైర్యము మరియు ఉల్లాసముతో ముందుకు వెళ్తున్నారు. మెజారిటీ పిల్లలు స్మృతి మరియు సేవలలో నిమగ్నమై ఉంటారు. ఏ విధంగా ఈరోజు పిల్లలు విశేషంగా నలువైపులా బ్రహ్మాబాబా స్మృతిలో లవలీనులై ఉంటారో, అదే విధంగా విశేషంగా బ్రహ్మా బాబా కూడా పిల్లల ప్రేమలో లీనమై ఉంటారు.
ఈరోజు బ్రహ్మా బాబా పిల్లల విశేషతలను చూస్తున్నారు. ఎలా ఎలా అయితే పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతలు ఎదురుగా వస్తున్నాయో అలా బ్రహ్మా బాబా నోటి నుండి - వాహ్ పిల్లలూ వాహ్! శభాష్ పిల్లలూ శభాష్! అనే మాటలు వస్తున్నాయి. ఇంకా ఏమైంది? బ్రహ్మా బాబా వాహ్ పిల్లలూ, శభాష్ పిల్లలూ అని అనే కొద్దీ పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగ, యమునలు ప్రవహిస్తున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రేమ నదిలో లవలీనులై ఉన్నారు. ఇది వతనము యొక్క దృశ్యము. సాకార ప్రపంచములో కూడా ప్రతి స్థానములోనూ స్మృతి మరియు స్నేహము యొక్క దృశ్యాలను బాప్‌దాదా చూసారు. ఇప్పుడిక ముందు-ముందు ఏం చెయ్యాలి? స్మృతి అయితే ఉంటుంది కానీ యథార్థ స్మృతికి ప్రమాణము (రుజువు) ఏమిటంటే - స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వటము. స్మృతి అతి శ్రేష్ఠమైనది, బ్రాహ్మణులుగా అయినప్పుడు బాప్‌దాదా ద్వారా జన్మ సిద్ధ అధికారాన్ని ఏదైతే ప్రాప్తి చేసుకున్నారో దానిని క్షణకాలపు స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు. హృదయము తెలుసుకుంది మరియు హృదయములో, మనసులో, బుద్ధిలో స్మృతి కలిగింది - ‘‘నేను బాబా వాడిని మరియు బాబా నా వారు’’, ఈ స్మృతి ద్వారానే జన్మ సిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు. ఈ స్మృతే సర్వ శక్తులకు తాళంచెవిగా అయ్యింది. ఈ స్మృతి బంగారు తాళంచెవి. నేను బాబాకు చెందినవాడిని అనగా నేను ఆత్మను. ఆత్మనైన నేను బాబా బిడ్డను అన్న నిశ్చయం కలిగినప్పుడు ఆ నిశ్చయం కలగటానికి ఎంత సమయం పట్టింది? కోర్సు చెయ్యటానికి సమయం పట్టింది కానీ నిశ్చయం కలగటానికి ఎంత సమయం పట్టింది? క్షణకాలములో ఒప్పందం కుదిరింది కదా! క్షణములో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. అధికారులుగానైతే అందరూ అయ్యారు, అందరూ అధికారులుగా అయ్యారు కదా లేక అవుతూ ఉన్నారా? అధికారులుగా అయిపోయారా? ఇది పక్కాయేనా? అచ్ఛా.
డబల్ విదేశీయులు వారసత్వానికి అధికారులుగా అయ్యారా? పాండవులు అధికారులుగా అయ్యారా? పక్కానా? పక్కానా? పక్కానా? చాలా మంచిది, అధికారులకు అభినందనలు. అధికార రూపములో విశేషంగా బాబా ద్వారా సర్వ శక్తులు లభించాయా? ఒక్క చేతిని ఎత్తండి, లభించాయా? సర్వ శక్తులూ లభించాయి కదా! లేక కొందరికి 8 శక్తులు, కొందరికి 6 శక్తులు లభించాయా? స్వయాన్ని మాస్టర్ సర్వశక్తిమంతులు అని పిలుచుకుంటారు కూడా. శక్తిమంతులు అని అనరు, సర్వశక్తిమంతులు అని అంటారు. ముందు కూర్చున్న వీరు సర్వశక్తిమంతులేనా? బాప్‌దాదా సర్వ అన్న పదము గురించి అడుగుతున్నారు? అందరూ సర్వశక్తిమంతులేనా లేక కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా? అటువంటివారు ఎవరైనా ఉన్నారా? నేను సర్వశక్తిమంతుడను కాను, కానీ శక్తిమంతుడను అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరా? ఎవ్వరూ చేతులెత్తటం లేదు. అందరూ మాస్టర్ సర్వశక్తిమంతులే! అచ్ఛా! అయితే ఓ మాస్టర్ సర్వశక్తిమంతులారా, బాప్‌దాదా అడుగుతున్నారు - ప్రకృతి, మాయ, స్వభావ-సంస్కారాలు, వాయుమండలము ద్వారా వచ్చే పరిస్థితులలో సర్వశక్తిమంతులే కదా? ప్రకృతి, మాయ, సంస్కారాలు, వాయుమండలము లేక సాంగత్య దోషము, ఈ ఐదింటినీ మీ శక్తి ఆధారంగా ఆధీనం చేసుకున్నారా? ఇది ఐదు తలల సర్పము, ఈ సర్పముపై, ఈ ఐదు తలలపై అధికారులుగా అయ్యి నాట్యం చేస్తారా? మీరు నాట్యం చేస్తారా లేక ఏదైనా ఒక తల బయటకు వచ్చి మీపై నాట్యం చేస్తుందా? సర్పము కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది కదా. మరి ఏదైనా ఒక తల మీకు నాట్యం చూపించటానికైతే రావటం లేదు కదా? ఎప్పుడైనా దాని ఆటను చూడటం మంచిగా అయితే అనిపించటం లేదు కదా? ఆటను చూడటంలో మునిగిపోలేదు కదా. ఆ ఐదు సర్పాలనూ మెడలోని హారముగా చేసుకున్నారా? శేషపానుపుగా చేసుకున్నారా, నాట్యం చేసే వేదికగా చేసుకున్నారా? మీ యొక్క అంతిమ మహాదేవ్, తపస్వీ దేవ్, అశరీరి స్థితి కల దేవాత్మ, ఫరిశ్తా ఆత్మ, ఈ స్మృతిచిహ్న రూపములో ఈ సర్పాలన్నింటినీ కంఠహారముగా చూపించారు. ఎప్పుడైతే ఈ మాలను ధరిస్తారో అప్పుడు బాబా మాలలో మంచి నంబరులో సమీప మణులుగా అవుతారు. విజయ మాలలో సమీప మణులుగా అవుతారు.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, వర్తమాన సమయములో సమయమనుసారంగా విశేషంగా సహనశక్తి మరియు సమస్యను లేక పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కర్మలలో అవసరము. కేవలం మనసు మరియు వాణి వరకే కాదు, కర్మల వరకు కూడా అవసరము. బాప్‌దాదా రిజల్టులో ఏం చూసారంటే శక్తులు ఉన్నాయి, శక్తులు లేవు అని కాదు, ఉన్నాయి, కానీ తేడా ఏం వస్తుంది? అవసరమైన సమయములో ఏ శక్తిని ఏ విధితో కార్యములో పెట్టాలో, దానిని అవసరమైన సమయములో మరియు విధిపూర్వకంగా ఉపయోగించటములో, కార్యములో పెట్టడములో తేడా వచ్చేస్తుంది. స్మృతి ఉంది కానీ స్మృతిని సమర్థ స్వరూపములోకి తీసుకురారు. స్మృతి ఎక్కువగానే ఉంది, సమర్థత అప్పుడప్పుడు తక్కువగా, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. స్మృతి అనేది వారసత్వానికి అధికారులుగా చేసింది కానీ ప్రతి స్మృతి యొక్క సమర్థత, విజయులుగా చేసి విజయమాలలోని సమీప మణిగా చేస్తుంది. సమర్థతలను స్వరూపములోకి తీసుకురండి. స్మృతి మనసులో ఉంది, బుద్ధిలో ఉంది కానీ మీ స్వరూపములో ప్రతి కార్యములో, ప్రతి సమర్థత ప్రత్యక్ష రూపములోకి రావాలి. స్మృతి దివసమునైతే చాలా బాగా జరుపుకున్నారు. ఇప్పుడు సమర్థతలను స్వరూపములోకి తీసుకురండి. ఒకవేళ మీరు ఎవరినైనా చూస్తే మీ నయనాల ద్వారా వారికి సమర్థ స్వరూపము అనుభవమవ్వాలి. మీ ప్రతి మాట ద్వారా ఇతరులు కూడా సమర్థులుగా అవ్వాలి. సమర్థతను అనుభవము చెయ్యాలి. సాధారణ మాటలు ఉండకూడదు. మీ ప్రతి మాట ద్వారా మీకు సమర్థత యొక్క వరదానము ఏదైతే లభించిందో దానిని మీరు వారికి అనుభవము చేయించండి. మనసు-బుద్ధి ద్వారా శ్రేష్ఠ సంకల్పాలను మరియు యథార్థ నిర్ణయశక్తితో కూడిన వాయుమండలాన్ని స్వరూపములోకి తీసుకురండి. సాధారణ నడవడికలో కూడా ఫరిశ్తాతనముకు చెందిన సమర్థ స్వరూపము కనిపించాలి. డబల్ లైట్ యొక్క అనుభవం స్వయానికి మరియు ఇతరులకు కూడా కలగాలి. ఇలా ఉన్నారా? కనుక నడుస్తూ-తిరుగుతూ సమర్థ స్వరూపులుగా అవ్వండి మరియు ఇతరులకు సమర్థతను అందించండి.
బాప్‌దాదా ఈరోజు బ్రహ్మా బాబాను (బాప్‌దాదా ఇరువురూ కలిసి) విహారానికి తీసుకువెళ్ళారు. ఎక్కడికి విహారానికి తీసుకువెళ్ళారు? బ్రహ్మా బాబా అవ్యక్తమైన తర్వాత దేశ-విదేశాలలో ఎవరైతే అవ్యక్త జన్మను తీసుకున్నారో, ఆ బ్రాహ్మణులందరినీ చూపించారు. వారు ఎంతమంది ఉండి ఉండవచ్చు? సాకార రూపము కంటే కూడా అవ్యక్త రూపములోని రచన చాలా ఎక్కువగా ఉంది. ప్రతి స్థానములోని అవ్యక్త రచన అయిన ఆత్మలందరినీ వతనములో ఇమర్జ్ చేసారు. విన్నారా! వారిలో మీరు కూడా ఉన్నారు కదా! మరియు ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా చాలా స్నేహముతో కూడిన సమీప దృష్టిని ఇచ్చారు మరియు అవ్యక్త రచనకు ఒక విశేషమైన కానుకను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, వారిలో సాకార బ్రహ్మా తర్వాత బ్రాహ్మణాత్మలెవరైతే రచనలోకి వచ్చారో వారు చేతులెత్తండి. మెజారిటీ ఉన్నారు, మంచిది, చేతులు దించండి. అచ్ఛా, సాకార రూపములోని రచన ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. నేటి ఈ సభలో చాలా కొద్దిమంది ఉన్నారు. కనుక బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఇమర్జ్ చేసారు, ఎందుకంటే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే కూర్చోను కూడా కూర్చోలేరు, వతనములోనైతే అందరూ రాగలరు. అక్కడ ఎంత పెద్ద స్థానము కావాలంటే అంత పెద్ద స్థానము ఉంది. కావున బాప్‌దాదా అందరినీ వతనములో ఇమర్జ్ చేసారు అనగా ఆహ్వానం ఇచ్చి పిలిపించారు. అందరూ చాలా సంతోషపడుతున్నారు మరియు బాప్‌దాదా వారికంటే కూడా ఎక్కువ సంతోషపడుతున్నారు. బాప్‌దాదా అటువంటి రత్నాలకు కానుకను ఇచ్చారు, అదేమిటంటే చాలా సుందరమైన, మచ్చ లేని వజ్రాలతో కూడిన చాలా మెరుస్తూ ఉన్న కమల పుష్పము. ఆ కమల పుష్పములోని ఒక్కొక్క ఆకులో భిన్న-భిన్న శక్తులు ఉన్నాయి, అవి రకరకాల రంగులతో మెరుస్తూ ఉన్నాయి. ఆ మచ్చ లేని వజ్రపు కమల పుష్పాన్ని మీరు ఇమర్జ్ చేసుకోండి, అది ఎంత శోభాయమానంగా ఉంటుంది. ఇమర్జ్ అయ్యిందా? ఇమర్జ్ చేసుకున్నారా? డబల్ విదేశీయులు ఇమర్జ్ చేసుకున్నారా? టీచర్లు ఇమర్జ్ చేసుకున్నారా? పాండవులు ఇమర్జ్ చేసుకున్నారా? మధురాతి మధురమైన మాతలు ఇమర్జ్ చేసుకున్నారా? మాతలు ఈ విశ్వ విద్యాలయానికి విశేషమైనవారు. అందరికీ ఏ విషయములో ఆశ్చర్యమనిపిస్తుంది? ఎంతోమంది మాతలు ఉన్నారు, వీరు శక్తులుగా తయారయ్యారు! ఇంతమంది మాతలు పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసి దేవీల రూపములోకి పరివర్తన అయిపోయారు! మెజారిటీ మాతలే కనిపిస్తున్నారు. బాప్‌దాదా ఈరోజు అవ్యక్త రచనకు చాలా-చాలా ప్రేమను ఇచ్చారు మరియు వతనములో తోటను కూడా ఇమర్జ్ చేసారు, పర్వతాన్ని కూడా ఇమర్జ్ చేసారు, దానితో పాటు సాగరాన్ని కూడా ఇమర్జ్ చేసారు మరియు అందరినీ చాలా బాగా తిప్పారు. అలా తిరగడానికి ఫ్రీడమ్ ఉంది. ఆడించలేదు, బాల్ మరియు బ్యాట్-బాల్ యొక్క ఆటను ఆడించలేదు. కొంతమంది సాగరము యొక్క అలలలో తేలియాడుతున్నారు, కొందరు పర్వతంపై కూర్చున్నారు, కొందరు తోటలో తిరుగుతున్నారు, కావున ఈరోజు వతనములో అవ్యక్త రచన యొక్క సభ ఉంది. బాప్‌దాదా అందరికీ ఏ వరదానమును ఇచ్చారంటే, సదా సర్వ శక్తులతో జీవించి ఉండండి, ఎగురుతూ ఉండండి.
బాప్‌దాదా నేటి ఈ స్మృతి దివసములో ఇచ్చిన విశేషమైన మహామంత్రము ఏమిటంటే ‘‘స్మృతి స్వరూపులుగా అయ్యి సమర్థతలను స్వరూపములోకి తీసుకురండి’’. ఖజానాలను గుప్తంగా ఉంచకండి, ప్రతి కర్మ ద్వారా వాటిని బయటకు ప్రత్యక్షము చెయ్యండి. ఏ ఆత్మనైనా దృష్టి ద్వారా అయినా, నోటి మాట ద్వారా అయినా, కర్మలలో సంపర్కములోకి వచ్చినా, వారికి సమర్థులుగా అయ్యే సహయోగాన్ని ఇవ్వండి, సమర్థ స్వరూపము యొక్క స్నేహాన్ని ఇవ్వండి. బాప్‌దాదా ఇది కూడా చూసారు, ఎవరైతే కొత్త-కొత్త పిల్లలు వస్తారో, వారిలో కొంతమంది ఎలా ఉంటారంటే వారికి బాప్‌దాదా యొక్క సహయోగముతోపాటు బ్రాహ్మణాత్మలైన మీ నుండి ధైర్యము, ఉల్లాసము, ఉత్సాహము, సమాధానము లభించాల్సిన అవసరము ఉంది. వారు చిన్న-చిన్నవారు కదా! చిన్నవారైనా కానీ ధైర్యాన్ని పెట్టి బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా! కనుక చిన్నవారికి శక్తుల ద్వారా పాలన అవసరము. వేరే పాలన ఏమీ కాదు, శక్తిని ఇచ్చే పాలన యొక్క అవసరము ఉంది. స్థాపనకు త్వరత్వరగా బ్రాహ్మణాత్మలు తయారైపోవాలి ఎందుకంటే తక్కువలో తక్కువ 9 లక్షలమందైతే కావాలి కదా! కనుక శక్తుల సహయోగాన్ని ఇవ్వండి, శక్తుల ద్వారా పాలనను ఇవ్వండి, శక్తులను పెంచండి. ఎక్కువగా వాదన చేసే శిక్షణలను ఇవ్వకండి, శక్తిని ఇవ్వండి. వారిలోని బలహీనతను చూడకండి, వారిలో ఏ విశేషత లేక ఏ శక్తి లోపించిందో దానిని నింపుతూ వెళ్ళండి. నిమిత్తమైన ఆత్మలు ఈరోజుల్లో ఈ పాలనకు నిమిత్తమవ్వాల్సిన అవసరము ఉంది. జిజ్ఞాసువులు పెరగటము, సేవాకేంద్రాలు పెరగటము, ఇదైతే సాధారణ విషయము, కానీ ప్రతి ఒక్క ఆత్మను బాబా సహాయముతో శక్తిశాలిగా తయారుచెయ్యాలి, ఇప్పుడు దీని అవసరము ఉంది. సేవనైతే అందరూ చేస్తున్నారు మరియు సేవ చెయ్యకుండా ఉండలేరు కూడా. కానీ సేవలో శక్తి స్వరూపపు వైబ్రేషన్లు ఆత్మలకు అనుభవమవ్వాలి, శక్తిశాలి సేవ ఉండాలి. సాధారణ సేవనైతే నేటి ప్రపంచములో చాలామంది చేస్తున్నారు కానీ మీ విశేషత శక్తిశాలి సేవ. బ్రాహ్మణ ఆత్మలకు కూడా శక్తి యొక్క పాలన అవసరము. అచ్ఛా.
బాప్‌దాదా ఎదురుగా దేశ-విదేశాలలో ఉన్న పిల్లలు దూరంగా ఉన్నా కూడా ఎదురుగా ఉన్నారు. బాప్‌దాదాకు తెలుసు, అందరూ ఒకటే మాట అంటారు - మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి, మా ప్రియస్మృతులను కూడా ఇవ్వండి. బాప్‌దాదా వద్దకు అందరి స్మృతి తప్పకుండా చేరుకుంటుంది, ఉత్తరాల ద్వారానైనా, మాటల ద్వారానైనా, కార్డుల ద్వారానైనా, నేటి ఈ-మెయిల్ ద్వారానైనా పంపిస్తారు. సైన్స్ సాధనాలు చాలా వచ్చేసాయి. బాప్‌దాదా వద్దకు సాధనాల ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది మరియు హృదయము యొక్క ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది. హృదయము యొక్క ధ్వని అన్నింటికంటే త్వరగా చేరుకుంటుంది. ఈరోజు ఎవరైతే హృదయము ద్వారా, రకరకాల సాధనాల ద్వారా స్మృతిని పంపించారో వారందరికీ బాప్‌దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. పిల్లలు ఒక్కసారి స్మృతి చేస్తే, బాబా పదమాల రెట్లు రిటర్న్‌లో ప్రియస్మృతులను ఇస్తున్నారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న హృదయానికి సమీపంగా ఉండే సమర్థ ఆత్మలకు, సదా అవసరమైన సమయములో ప్రతి శక్తిని స్వరూపము ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా శక్తుల ద్వారా ఆత్మల యొక్క పాలనకు నిమిత్తులయ్యే బాబా యొక్క సహయోగి ఆత్మలకు, సదా ప్రతి ఒక్కరికీ ధైర్యాన్ని, ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చే ఎగిరే కళలో ఎగిరేవారికి, సదా సమస్యను సమాధానములోకి పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు, స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అయ్యే ఆత్మలకు బాప్‌దాదా యొక్క పదమా రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవ టర్న్ ఛత్తీస్‌ఘడ్, ఇండోర్ జోన్ వారిది:- అందరూ చాలా బాగా, మనసుతో సేవను చేసారు, అందరినీ సంతుష్టపరిచారు మరియు స్వయం కూడా సంతుష్టమయ్యారు, ఇందుకు అభినందనలు. క్రొత్త రాష్ట్రం తయారయింది కనుక క్రొత్త రాష్ట్రం వారికి బాప్‌దాదా సదా స్మృతి మరియు సేవలో ఎగిరేందుకు అభినందనలు ఇస్తున్నారు. మంచిగా చేసారు.
కన్యలతో:- ముందు కుమారీలు ఉన్నారు, వెనుక మాతలు ఉన్నారు. చాలా బాగుంది. ఎలా అయితే ఇప్పుడు నిల్చున్నారో అలా ఇప్పుడు స్మృతి మరియు సేవలో సదా నిల్చోండి. హాస్టల్ కుమారీలైతే చక్కని పాలనలో పెరుగుతున్నారు. వాయుమండలం యొక్క ప్రభావం నుండి రక్షింపబడేటువంటి పాలన ఇది. మరి సదా ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. అచ్ఛా, అభినందనలు.
క్రొత్త రాష్ట్రం ఏదైతే ఛత్తీస్‌ఘడ్ తయారయిందో, (ఛత్తీస్‌ఘడ్‌లో 16 జిల్లాలు ఉన్నాయి, రాయపుర్ దాని రాజధాని) దాని రాజధానికి అభినందనలు. మంచి సేవకు ఫలం లభించింది, బలం కూడా లభించింది. ఫలం సంతోషము మరియు బలం సదా ఇలా నిర్విఘ్నంగా ఉండటము. మరి దీనిని సదా మీతో పెట్టుకోండి. అచ్ఛా. టీచర్లకు కూడా చాలా-చాలా అభినందనలు. ఇప్పుడు బాప్‌దాదా ఏదైతే చెప్పారో, శక్తినిచ్చే పాలనను పెంచుతూ ఉండండి. మధుబన్ నివాసులు కూడా వచ్చారు.
అచ్ఛా! ఈరోజు విశేషముగా ఈ సంగమ్ భవన్ వారు ఉన్నారు కదా, సంగమ్ భవన్ వారు వచ్చారు, వారి సేవ కూడా తక్కువేమీ కాదు. ఈరోజు విశేషముగా వారి స్మృతి బాప్‌దాదాకు చేరుకుంది. రిసీవ్ చేసుకునే సేవ కూడా తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే శాంతివన్ సేవాధారులెవరైతే ఉన్నారో, వారందరి సేవ ఒకరికంటే ఒకరిది ముందుంటుంది, బాగుంది. మేల్కోవాల్సి కూడా ఉంటుంది, నడవాల్సి కూడా ఉంటుంది, పరుగెత్తాల్సి కూడా ఉంటుంది, సంతుష్టం కూడా చేయాల్సి ఉంటుంది. అభినందనలు. పాండవ్ భవన్ వారికి, మధుబన్ యొక్క నాలుగు భుజాల వారికి, అందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.
మాకు బాప్‌దాదా ఏమీ చెప్పలేదే అని డబల్ విదేశీయులు చూస్తున్నారు. డబల్ విదేశీయులంటే బాప్‌దాదా సహితముగా దాదీలు మరియు బ్రాహ్మణులందరికీ డబల్, త్రిబుల్ ప్రేమ ఉంది, ఎందుకని? బాప్‌దాదా సదా విశేషత వినిపిస్తుంటారు, వీరు ఎన్నో రకాల సంస్కృతులనే అడ్డుగోడలను పడగొట్టి బ్రాహ్మణ జీవితములోకి చేరుకున్నారు. బ్రాహ్మణ సంస్కృతి కలవారిగా అయ్యారు. వీరు వేరే దేశం నుండి వచ్చారు అని అనే అనిపించదు. వీరు మన భారత్‌కు చెందినవారు మరియు సదా ఇలానే ఉంటారు. అందుకే డబల్ విదేశీయులకు కూడా చాలా-చాలా కోటానుకోట్ల రెట్ల అభినందనలు. చాలా మంచిది.
చూడండి, ధైర్యము చేసి చేరుకోనైతే చేరుకున్నారు కదా! టికెట్ లభించినా లభించకపోయినాగానీ తీసుకుని వచ్చేసారు. ధైర్యము బాగుంది. అచ్ఛా. ఇప్పుడు ఏమి చేయాలి?
దాదీజీతో:- సాధనాలను ఉపయోగించవలసి ఉంటుంది. వృద్ధి చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది కదా! మంచిది. వృద్ధి కూడా జరుగుతుంది మరియు అందరికీ సంతుష్టత కూడా లభిస్తుంది. మంచిగా పాత్రను చేస్తున్నారు. (బాబా చేయిస్తున్నారు) అయినాగానీ నిమిత్తంగా ఉన్నారు కదా. బాప్‌దాదా రోజూ అమృతవేళ వరదానముతో పాటు మసాజ్ కూడా చేస్తారు. నిమిత్తమైన వారు శ్రమ చేయవలసి రావడం బాప్‌దాదా చూస్తారు. (బాబా, ఎటువంటి శ్రమ లేదు). సరే, ఆట అనే అనండి, ఆట ఆడుతారు, కష్టపడరు. ఈ సమయంలో జనక్ బచ్చీ కూడా గుర్తు చేస్తున్నారు. నేను స్టేజీపై ఉన్నాను అని వారు భావిస్తున్నారు. బాప్‌దాదా కూడా అభినందనలు చెప్తున్నారు. ఎవరికి ఏ పాత్ర లభించిందో దానిని విధిపూర్వకంగా చేస్తున్నారు, మంచిది. పాండవులు కూడా ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను చేస్తున్నారు.
నారాయణ్ దాదా మరియు వారి కొడుకుతో:- బాగున్నారా? ఇద్దరూ బాగున్నారా? వీరిని బాప్‌దాదా ఫ్రీగా ఉంచారు, ఎప్పుడు అనిపిస్తే, ఎలా అనిపిస్తే, మర్యాదాపూర్వకంగా అలా చేయండి. బ్రాహ్మణ జీవితము, లౌకిక పరివారము రెండింటి మర్యాదలు తెలుసు. రెండూ తెలుసు కదా లేక ఒక్కటే తెలుసా? రెండూ తెలుసు. మరి రెండిటినీ నిర్వర్తించండి. మంచిది. ఇప్పుడు కేవలం మధుబన్తో కనెక్షన్‌ను పెంచండి. ఇచ్చిపుచ్చుకోవడాలు చేయండి. మనసులోనే మాట్లాడుకోకండి, నోటితో మాట్లాడండి. ఈ బీజము వినాశనము అయ్యేది కాదు. మంచిది, అయినాగానీ వెళ్తున్నారు. అచ్ఛా.
సికీలధా కదా! చాలా బాగుంది. ఇద్దరూ బాగున్నారు. ఇది మీ ఇల్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి. సరేనా!
జగదీశ్ అన్నయ్యతో:- జగదాంబ తల్లి యొక్క స్లోగన్ గుర్తుంది కదా – హుకిమీ హుకుమ్ చలా రహా హై (ఆజ్ఞాపించేవాడు ఆజ్ఞాపిస్తున్నారు) మరి ఇప్పుడు మీది కూడా ఇదే అనుభవము కదా. చేయించేవారు చేయిస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు. ఇకపోతే అంతా బాగుంది, ఈ ఆది రత్నాలు, మీరు సేవకు ఆది రత్నము, వీరు (దాదీలు) స్థాపనకు ఆది రత్నాలు. ఈ పాండవులు కూడా సేవకు ఆది రత్నాలు. (ఈరోజు బాబా గదికి వెళ్తే ఆ స్మృతులు కలిగాయి, ఇక్కడున్నా లేనట్లుగా అనిపించింది, కన్నీళ్ళు వచ్చాయి) ఈ స్మృతితో మరింతగా ప్రత్యక్ష రూపంలో, ఒకటైతే ప్రేమ పెరుగుతుంది, మనసులోని ప్రేమ బయటకు వస్తుంది మరియు రెండవది, స్మృతిలో బాబా సమానత కోసం ధైర్యం కూడా వస్తుంది. మంచిగా అయింది. కానీ బాప్‌దాదా ఏమంటున్నారంటే, ఎవరైతే సేవకు ఆదిరత్నాలు ఉన్నారో లేక స్థాపనకు ఆది రత్నాలు ఉన్నారో ఇద్దరూ సేవ చాలా బాగా చేసారు, నిమిత్తంగా అయ్యారు. సహనం కూడా చేసారు మరియు ప్రేమ కూడా లభించింది. మంచిగా చేసారు ఎందుకంటే ఆ సమయంలో ధైర్యంగా ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు కానీ ధైర్యం ఉంచి సహయోగిగా కూడా అయ్యారు కదా, ఆ సహయోగానికి మార్కులు జమ అయ్యాయి. జమ ఖాతా బాగుంది. ఒకటికి పదమారెట్లు జమ అవుతాయి కదా. ఎవరైతే మనసుతో శక్తిశాలిగా అయ్యి చేసారో, వారికి ఒకటికి లక్ష రెట్లు కాదు పదమారెట్లు జమ అయింది. మీ అందరిదీ జమ అయింది, వీరిది కూడా జమ అయింది.
రతన్మోహిని దాదీతో:- మంచి సహయోగి మీరు. క్రిందమీద అయితే అవ్వాల్సి ఉంటుంది కానీ సహయోగిగా అయితే అవ్వవలసిందే. బాప్‌దాదాకు భూజాలు కదా, మరి భుజాల పని ఏమిటి? సహయోగము చేయడము. మంచి సహయోగులు కదా మీరు! అచ్ఛా!