Search for a command to run...
4 Nov 2001
‘‘సత్యవాదులుగా అవ్వండి మరియు సమయం అనుసారంగా దయార్ద్ర హృదయులుగా అయ్యి అనంతమైన వృత్తిని, దృష్టిని మరియు కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి’’
4 November 2001 · తెలుగు
ఈరోజు ప్రేమసాగరుడైన బాప్‌దాదా తమ అతి ప్రియమైన సికీలధే మధురాతి-మధురమైన పిల్లలతో మిలనం జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా మిలనం జరుపుకునేందుకే వచ్చారు కదా! పరుగు-పరుగున వచ్చారు. మరి బాప్‌దాదా కూడా పిల్లలను కలుసుకునేందుకు పరుగు-పరుగున వచ్చారు. మీరందరూ అయితే ఈ లోకము నుండి వచ్చారు, బాప్‌దాదా పరలోకము మరియు సూక్ష్మలోకము నుండి వచ్చారు. మరి అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? ఎవరు దూరదేశీయులు? డబల్ విదేశీయులు దూరదేశీయులా? కాదు. అందరికంటే అత్యంత దూరంగా, దూరదేశీగా ఉన్నదైతే బాబాయే. బాప్‌దాదాకు ఈ సారి డబల్ విదేశీ పిల్లలు మరియు భారతవాసి పిల్లల యొక్క ఒక విషయం పట్ల చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది? చెప్పండి. విశేషంగా డబల్ విదేశీ పిల్లల ధైర్యాన్ని చూసి బాప్‌దాదాకు గర్వంగా ఉంది, అదేమిటంటే - ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ బాబాను కలుసుకునేందుకు చేరుకున్నారు. డ్రామా అయితే ఆటను కూడా చూపించింది కానీ తండ్రి మరియు పిల్లల మిలనాన్ని డ్రామా కూడా ఆపలేకపోయింది. మరి అటువంటి ధైర్యవంతులైన పిల్లలపై బాప్‌దాదా విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు.
ఇప్పుడు ఈ క్షణంలో ఏ పిల్లలు ఏ వరదానాన్ని కోరుకుంటే, ఆ వరదానం లభిస్తుంది. సహజంగా లభిస్తుంది కానీ ఈ వరదానాన్ని ప్రతి రోజూ అమృతవేళలో మరియు కర్మయోగి స్థితిలో పదే-పదే హృదయపూర్వకంగా స్మృతి చేయాలి. నిరాశపడకండి. వరదానము ప్రాప్తించి ఉంది. స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తుంటుంది కదా! అలా సదా నయనాలలో బిందువైన బాబాను ఇముడ్చుకుని ఉంచుకోండి. అలా ఉంచుకోగలరా లేక కష్టమా? (సహజము) మరి ఏ విధంగానైతే స్థూలమైన బిందువు నిరంతరం ఉంటుందో, అలా నయనాలలో నిరంతరం బిందువైన బాబా ఇమిడి ఉండాలి. ఇముడ్చుకున్నారా? బిందువైన బాబా సరిగ్గా ఫిట్ అయ్యారా? అక్కడి నుండి బయటకైతే రారు కదా? ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన బాబా ఇమిడి ఉన్నట్లయితే, మరే ఇతరవైపులకూ నయనాలు ఆకర్షించబడవు. శ్రమ నుండి విముక్తులవుతారు. వేరే వైపుకు దృష్టి వెళ్ళనే వెళ్ళదు. పూర్తిగా సురక్షితంగా ఉంటారు. ఏదేమైనా కానీ నయనాలలో సదా బిందువైన బాబా ఇమిడి ఉండాలి. సదా నయనాలలో ఇమిడి ఉన్నట్లయితే హృదయంలో కూడా వారే ఇమిడి ఉంటారు. మరి హృదయంలో మరియు నయనాలలో వారిని ఇముడ్చుకునేందుకు విధి ఏమిటంటే - బాప్‌దాదాను, సాహెబును సంతుష్టపరచటము. మరి సాహెబ్ సంతుష్టంగా ఉన్నారా? సాహెబ్ అయిన బాప్‌దాదా మిమ్మల్ని చూసి సంతుష్టంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఎంత శాతము సంతుష్టంగా ఉన్నారు? (కొందరేమో 99 శాతమని చెప్పారు, మరికొందరు 75 శాతమని చెప్పారు) అభినందనలు. బాప్‌దాదాను సంతుష్టపరచడము చాలా సహజము. బాప్‌దాదాను సంతుష్టపరిచేందుకు సహజమైన సాధనము - ‘‘సత్యమైన హృదయము’’. సత్యమైన హృదయాన్ని చూసి స్వామి సంతుష్టమవుతారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. ఎవరైతే సత్యమైన హృదయం కలవారిగా ఉంటారో, వారు సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ-సంపర్కాలలో రాజయుక్తంగా (రహస్యయుక్తముగా) ఉంటారు అనగా రహస్యాన్ని అర్థం చేసుకుని చేసేవారిగా, రహస్యాన్ని అర్థం చేసుకుని నడుచుకునేవారిగా ఉంటారు. మనం ఎంతవరకు రహస్యము తెలిసినవారిగా ఉన్నాము అన్నదానిని పరిశీలించుకునేందుకు గుర్తు - ఒకవేళ ఎవరికైనా రహస్యం తెలిసి ఉంటే, వారు ఎప్పుడూ తమ స్వ స్థితితో అసంతుష్టులవ్వరు అనగా నిరాశపడరు, మరియు సంకల్పాలలో కూడా, వృత్తి ద్వారా కూడా, స్మృతి ద్వారా కూడా, దృష్టి ద్వారా కూడా ఎవ్వరినీ అసంతుష్టం చేయరు, ఎందుకంటే వారు అందరి యొక్క మరియు స్వయము యొక్క సంస్కార-స్వభావాల గురించి తెలిసినవారిగా, రహస్యము తెలిసినవారిగా ఉంటారు. కావున తండ్రిని సంతుష్టపరిచేందుకు విధి - రహస్యము తెలుసుకుని నడుచుకోవటము మరియు రహస్యము తెలిసినవారిగా ఉండటము అనగా స్వయము పట్ల అసంతుష్టత రాకూడదు, అలాగే ఇతరులను అసంతుష్టం చేయకూడదు.
సదా సమయమనుసారంగా మీ మనసు, బుద్ధిని స్వప్నంలో కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఏమంటూ ఉంటారంటే - బాప్‌దాదా అయితే శక్తులను ఇస్తారు కానీ సమయానికి ఆ శక్తి ఉపయోగపడటం లేదు అని. బాప్‌దాదా విశేషంగా పిల్లలందరికీ సహచరుని సంబంధములో విశేషంగా అటువంటి సమయములో ఎక్స్ట్రా సహాయాన్ని అందిస్తారు, ఎందుకని? పిల్లలను సంపన్నంగా చేసి తమతో పాటు తీసుకువెళ్ళడానికి బాబా బాధ్యులు. కనుక బాబా తమ బాధ్యతను విశేషంగా అటువంటి సమయములో నిర్వర్తిస్తారు కానీ అప్పుడప్పుడు పిల్లల మనసు యొక్క క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది, మరి అటువంటప్పుడు బాబా ఏం చెయ్యాలి? అయినా కానీ బాబా అయితే స్విచ్‌ను ఆన్ చేసేందుకు, దానిని తెరిచేందుకు ప్రయత్నిస్తారు కానీ అందుకు సమయం పట్టేస్తుంది, అందుకే మళ్ళీ ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో, అప్పుడు - అలా చెయ్యకుండా ఉండాల్సింది, కానీ జరిగిపోయింది అని అంటారు. కనుక సదా మీ మనసు యొక్క క్యాచింగ్ పవర్‌ను, దానిని మీరు టచింగ్ అని అంటారు, ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్‌ను ఆన్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసేందుకు మాయ ప్రయత్నిస్తుంది, అది క్షణంలో ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది, అందుకే ఏ విధంగానైతే సమయం నాజూకుగా అవుతూ ఉందో, అదే విధంగా ఇప్పుడింకా నాజూకుగా అయ్యేది ఉంది. మీరు భయపడటం లేదు కదా? బాప్‌దాదా ఇంతకుముందు కూడా అడిగారు - మీరందరూ సంవత్సరాన్ని ఎందుకు జరుపుకున్నారు? ఏ సంవత్సరాన్ని జరుపుకున్నారు? సంస్కారము ద్వారా విశ్వ పరివర్తన. పక్కానే కదా! జరుపుకున్నారు కదా! లేక మర్చిపోయారా? (జరుపుకుంటున్నాము) మరి ఎప్పుడైతే పిల్లలు విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి అన్న పక్కా సంకల్పాన్ని చేసారో, అప్పుడు ప్రకృతి బాబాను అడుగుతుంది - శుభ్రం చేయడానికి నేను ఏర్పాట్లను చేస్తాను కానీ శుభ్రం చేయడానికి ఎవరైతే నిమిత్తులై ఉన్నారో, వారు శుభ్రం చేస్తూ-చేస్తూ ఆలోచనలలో పడతారు - శుభ్రం చెయ్యాలా, వద్దా, త్వరగా చెయ్యాలా, నెమ్మదిగా చెయ్యాలా. మరి నేనేం చెయ్యాలి అని ప్రకృతి అడుగుతుంది! అప్పుడు బాప్‌దాదా ప్రకృతికి ఏమని సమాధానమివ్వాలి? డబల్ విదేశీయులు చెప్పండి. (కాస్త ఎదురు చూడాలి) ఇది సరైన సమాధానము కాదు. ఒకవేళ డబల్ విదేశీయులు ఎదురుచూస్తూ ఉంటే, వారికి విమానము దొరకదు. ఇప్పుడైతే విమానము దొరికింది కదా! నిద్రపోతూ- నిద్రపోతూ వచ్చారు కదా విమానములో! హాయిగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా రావడానికి కష్టమైందా? చేతులెత్తండి (ఒకరు - మా విమానము ఒకసారి తిరిగి వెళ్ళిపోయింది అని అన్నారు) సమయానికైతే చేరుకున్నారు కదా. ఇది ధైర్యానికి సంబంధించిన విషయము. ఎవరైతే కొంచెం భయపడ్డారో, వారు ఆగిపోయారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పము చేసారు, కనుక చేరుకున్నారు. కేవలం ఒక్కరి విమానము తిరిగి వెళ్ళిపోయింది, అంతే కదా. అదేమీ ఫర్వాలేదు, తర్వాత మంచిగా లభిస్తుంది. ఇప్పుడిక మున్ముందు ప్రకృతిని, శుభ్రం చేసేవారిని ఆలోచనలో పెట్టకండి ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆలోచనలో పడుతూ ఉంటారు - ఏం చెయ్యాలి, ఇలా చెయ్యాలా, వద్దా, సరిగ్గా అవుతుందా, సరిగ్గా అవ్వదా? అవునా, కాదా అనేది పూర్తిగా స్పష్టం ఉండాలి. ఇది రైట్, ఇది రాంగ్ అన్నది స్పష్టంగా ఉండాలి. కావున ప్రకృతి అయితే మీరు ఈ సంవత్సరాన్ని జరుపుకుంటున్న కారణంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇప్పుడు కూడా చేస్తుంది, కానీ స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు - ఇప్పుడు ఏ విషయములోనూ, అది స్వయము గురించి కానీ, ఇతరుల గురించి కానీ ఆలోచించటానికి సమయం వెచ్చించకూడదు. క్షణములో స్పష్టమైన టచింగ్ అందాలి. బిందువు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? (క్షణం) మరి ఎప్పుడైతే ప్రాక్టికల్ జీవితంలో బిందువును పెడతారో, అప్పుడు క్షణం పడుతుందా? ఏ విషయంలోనైనా బిందువు పెట్టడానికి లేక బిందురూప స్థితిలో స్థితులవ్వటానికి క్షణమే పడుతుందా? ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చిందనుకోండి, దానికి బిందువు పెట్టడానికి క్షణమే పడుతుందా? పాండవులకు క్షణమే పడుతుందా? (అప్పుడప్పుడు) పాండవులకు బిందువు పెట్టడానికి సమయం పడుతుందా, వీరైతే క్షణమే పడుతుంది అని చెప్తున్నారే? శక్తులలో శక్తి ఉందా? (పాండవులు నిజం చెప్తున్నారు) అలా కాదు, ఇరువురూ సత్యమైనవారే, ఎందుకంటే వారు పెట్టే బిందువు ఇప్పుడు పడుతూ ఉండవచ్చు, మీ బిందువు ఇప్పుడు పడుతూ ఉండకపోవచ్చు, అందుకే తేడా వచ్చింది. ఇకపోతే అందరూ సత్యమైనవారే. సత్యమైన హృదయం కలవారు. అచ్ఛా.
హాల్ అయితే నిండిపోయింది. (కింద పాండవ్ భవన్లో కూడా కూర్చున్నారు) కింద అయితే కూర్చున్నారు కానీ బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. బాప్‌దాదా మధుబన్కు వచ్చారు అన్న స్మృతిలోనే దేశ-విదేశాలలోని పిల్లలందరూ ఉన్నారు. తమ-తమ దూరదేశీ దృష్టి అనే దుర్భిణి (బైనాక్యులర్స్) ద్వారా చూస్తున్నారు. వారు కూడా ఇప్పుడు బాబా ఎదురుగా వస్తున్నారు, వారు దూరంలో కూర్చుని ఉన్నా కూడా మనసుతో మధుబన్‌లో ఉన్నారు. మీ ఈ సాకార వతనంలోని సాధనాలైతే కిందా-మీదా అవ్వవచ్చు కానీ ఈ ఆధ్యాత్మిక దూర దృష్టి, దూరదేశ దృష్టి ఎప్పటికీ పాడవ్వదు. బాప్‌దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవాకేంద్రాలలోని పిల్లలు కనిపిస్తున్నారు. అచ్ఛా.
దీపావళిని జరుపుకున్నారా? సంగమయుగము అంటేనే జరుపుకునే యుగము. అంతర్ముఖులుగా అయ్యి అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్ని అయినా అనుభవించండి, లేదంటే సేవలో మహాదానులుగా అయ్యి ఆత్మలకు మహాదానాన్ని అయినా ఇస్తూ జరుపుకోండి, లేదంటే పరస్పరంలో ఆత్మిక సంభాషణ అయినా చెయ్యండి, డ్యాన్స్ చెయ్యండి, సంబంధ-సంపర్కం ద్వారా పరస్పరంలో విశేషతలను చూసుకోండి, విశేషత యొక్క సువాసనను అయినా తీసుకోండి, సదా జరుపుకోవటమే జరుపుకోవటము. పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది. ఇది పోగొట్టుకునే యుగమైతే కాదు కదా? ఇప్పుడు ఇది జరుపుకునే మరియు సంపాదించుకునే యుగము, జమ చేసుకునే యుగము. బాప్‌దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరి విషయంలో దీనినే చూస్తూ ఉంటారు, జరుపుకుంటున్నారు, ఏదో ఒక రూపంలో జరుపుకోవాల్సిందే ఎందుకంటే సంగమయుగములోనే - పోగొట్టుకోవటము మరియు జరుపుకోవటము, ఈ రెండింటి యొక్క జ్ఞానం ఉంది, అందుకే పోగొట్టుకున్న తర్వాత జరుపుకోవటము, దీనికి మహత్వం ఉంటుంది. ఇప్పుడు పోగొట్టుకోవడానికి బిందువును పెట్టండి. స్టాప్. పోగొట్టుకోకూడదు. ఒక్క సంకల్పాన్ని కూడా పోగొట్టుకోకూడదు. సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే, సంపాదించుకునేది ఎప్పుడు? తర్వాత అయితే సమయం దొరకదు. చెక్ చేసుకోండి - ఏయే ఖజానాలైతే ఉన్నాయో, అందులో గొప్ప ఖజానా ఏది? సంకల్పాలు, సమయము, జ్ఞానము యొక్క ఖజానా ప్రాక్టికల్ జీవితంలోకి రావాలి. జ్ఞానాన్ని వినిపించటము మరియు వినటము, ఇది మొదటి స్టేజ్ కానీ జ్ఞానం అనగా నాలెడ్జ్. నాలెడ్జ్‌ను ఏమంటారు? నాలెడ్జ్ అనేది లైట్, మైట్ (ప్రకాశము, శక్తి) అని అంటుంటారు కదా! మరి జ్ఞానం లేక నాలెడ్జ్ అంటే అర్థము - సంకల్పాలు, మాటలు, కర్మలలో లైట్ మరియు మైట్ ఉండాలి, అప్పుడే నాలెడ్జ్‌ఫుల్ అని అంటాము.
కుమారీలు నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యేవారే కదా? కేవలం కోర్సు చెప్పేవారిగా అవ్వకండి, భాషణ చేసేవారిగా అవ్వకండి. వీటితోపాటు సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో జ్ఞానం యొక్క లైట్-మైట్ ఉండాలి. కుమారీలపై బాప్‌దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని? తమ జీవితం గురించి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నారా లేక నిర్ణయించుకోవాలా? మంచిగా ఆలోచించారా లేక అక్కడకు వెళ్ళిన తర్వాత ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించారా, అయితే అభినందనలు. చూడండి, ఇంతమంది హ్యాండ్స్ మీకు రెడీగా లభిస్తున్నారు. కుమారీలు ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో, వారు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు? (80) ఎవరైతే ఇప్పుడింకా సేవలో లేరో, సెంటర్ ను సంభాళించటం లేదో, వారు చేతులెత్తండి. లెక్కపెట్టండి, సగం మంది ఉన్నారు. అచ్ఛా, ఇంతమంది హ్యాండ్స్ అయితే లభిస్తారు కదా! రైట్ హ్యాండా (కుడి భుజమా) లేక లెఫ్ట్ హ్యాండా (ఎడమ భుజమా)? కుడి భుజాలుగా అవుతారు కదా! మంచిది. కుమారీలు కదా, మరి బాప్‌దాదా కుమారీలకు సెంటర్ అనే ఇల్లును కూడా ఇస్తారు, ఎలాగూ వరుడైతే లభించే ఉన్నారు. ఎప్పుడూ ఇల్లు మరియు వరుడు, రెండూ కావాలి. కుమారీలకు వరుడైతే లభించేసారు, ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది, సెంటర్ లభిస్తుంది. కుమారులకు కూడా లభిస్తుంది. కుమారులు - మేము వెనుక ఎందుకు ఉండాలి అని భావిస్తారు. మీరు వెనుక లేరు, ముందు ఉన్నారు. కుమారులు లేకుండా సేవ ఎలా జరుగుతుంది. ఏ సెంటర్‌లోనైనా చూడండి, ఒకవేళ కష్టపడి పనిచేసే కుమారులు లేకపోతే అక్కయ్యలు ఏమీ చెయ్యలేరు. ఇరువురూ అవసరము, అందుకే పాండవులకు కూడా పేరు ఉంది, అలాగే శక్తులకు కూడా పేరు ఉంది. ఇరువురికీ పేరు ఉంది. అచ్ఛా.
మీ అందరి దేశ-విదేశాల మీటింగ్ సమాచారము బాప్‌దాదా వద్దకు చేరుకుంది. ఈ సంవత్సరం దేశవిదేశాలలో, దేశంలో కాన్ఫరెన్సులు, విదేశాలలో స్నేహ మిలనాలు ఎక్కువగా జరిగాయి మరియు విదేశాలలో భిన్న భిన్న ప్రాజెక్టులు జరుగుతున్నాయి. సేవ పట్ల లగ్నము కూడా ఉంది మరియు సేవ గతిలో తీవ్రత కూడా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. రెండూ ఉన్నాయి. సమయం అనుసారంగా ప్రతి ప్రాజెక్టు లేక కాన్ఫరెన్సు లేక స్నేహ మిలనము అనండి, ఏ ప్రోగ్రామ్ జరిగినా, అందులో కేవలం సమయం అనుసారంగా టాపిక్‌ను పెట్టడం అవసరము ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి దప్పిక వేస్తుంటే వారికి మీరు 36 రకాల భోజనము ఇస్తే స్వీకరిస్తారా? కనుక ప్రాజెక్టు ఏదైనా కానివ్వండి, టాపిక్ ఏదైనాగానీ ఇప్పుడు సర్వాత్మలకు కావలసినది – శాంతి మరియు స్నేహము. శాంతి కోసం దప్పికతో కూడా ఉన్నారు మరియు స్నేహముతో కూడా దప్పికతో ఉన్నారు. సేవను బాగా చేస్తున్నారు, ఏ ప్లాన్ అయితే చేసారో, అవి మంచిగా చేసారు, ఏవైతే జరుగుతున్నాయో అవి మంచిగా జరుగుతున్నాయి. రిజల్ట్ కూడా ఉంది మరియు ధైర్యము కూడా ఉంది. అందుకే బాప్‌దాదా సేవా సమచారాన్ని విని సంతోషిస్తున్నారు. ఏ పాటను పాడుతాము? బాప్‌దాదా ఏ పాటను పాడుతారు? వాహ్ పిల్లలూ వాహ్! ఈ సమయంలో ప్రోగ్రాములు అయితే జరగాలి, ప్రోగ్రాములను ఆపకండి. సమయం యొక్క పరిస్థితులు ప్రోగ్రామ్‌ను ఆపితే ఆపండి, కానీ మీరు ప్రోగ్రామ్‌లను ఆపలేరు. సరే, ఉదాహరణకు, మీరు ప్రోగ్రామ్ పెట్టారనుకోండి, కానీ పరిస్థితి మారిపోతే ప్రోగ్రామ్‌కు వచ్చేవారు కూడా అర్థం చేసుకుంటారు, వెళ్ళేవారు కూడా అర్థం చేసుకుంటారు. మీరెందుకు చేయకూడదు. దాత పిల్లలు కదా, మరి మీరు ఇవ్వడంలో, ప్రోగ్రాములు చేయడంలో నో అని చెప్పలేరు. రండి, తప్పకుండా రండి, సంతోషంగా రండి అని స్వాగతం చేయండి. పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులే ఆపుతాయి, మీరు ఆపకండి. ఇప్పుడు కూడా చూడండి, అమెరికాలోని పీస్ విలేజ్‌లో, హంగామా జరిగినా కూడా అమెరికాలో కూడా చాలా మంచి ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఆగాయా? ఆగలేదు కదా? ఇప్పుడు 4వ తారీఖు వరకు ఏ ప్రోగ్రాములైతే మీరు తయారు చేయారో అవి ఆగాయా? బాంబులు కూడా పడుతున్నాయి, పడనివ్వండి. యుద్ధమైతే జరుగుతుంది కదా? వింటూ ఉండండి. మంచిది, వింటూ ఉంటే బ్రాహ్మణ ఆత్మలైన మీ అందరి విశేష సంస్కారము మరియు స్వభావము – దయా హృదయము, మర్సీఫుల్ – అవి ఇమర్జ్ అవుతాయి మరియు ఇమర్జ్ అవ్వవలసిందే. వర్తమాన సమయములో మీలోని ప్రతి ఒక్కరూ, ఆత్మల పట్ల దయార్ద్ర హృదయులుగా మరియు దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే, మనసా సేవ ద్వారానైనా ఇవ్వండి, శుభ భావనల ద్వారానైనా ఇవ్వండి, శ్రేష్ఠ సకాష్ను ఇచ్చే వృత్తి ద్వారానైనా ఇవ్వండి, ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన మాటల ద్వారానైనా ఇవ్వండి, మీ స్నేహ సంపన్నమైన సంబంధ-సంపర్కాల ద్వారానైనా ఇవ్వండి, కానీ ఏ ఆత్మ కూడా వంచితం అవ్వకూడదు. దాతలుగా అవ్వండి, దయార్ద్ర హృదయులుగా అవ్వండి. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. బాబా ముందు తమ-తమ భాషలలో ఆర్తనాదాలు చేస్తున్నారు - శాంతిని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, హృదయపూర్వకమైన ప్రేమను ఇవ్వండి, సుఖము యొక్క కిరణాలను చూపించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. మరి బాప్‌దాదా ఎలా ఇస్తారు? పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా! బాబాకు మీరందరూ కుడి భుజాలు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా! మరి మీరందరూ బాబాకు కుడి భుజాలు కదా! పాండవులు కుడి భుజాలేనా? కుడి భుజాలైన మీ స్మృతిచిహ్నము ఉంది. స్మృతిచిహ్నము ఏమిటో తెలుసా? విరాట రూపము యొక్క చిత్రాన్ని చూసారా, మరి అందులో ఎన్ని భుజాలను చూపిస్తారు? అందులో కుడి భుజాలైన మీ చిత్రమే ఉంది కదా! కుమారీలు, అందులో మీ చిత్రం ఉంది కదా? ఇప్పుడు బాబా తమ కుడి భుజాల ద్వారా ఆత్మలకు సుఖ-శాంతుల దానమును అయితే అందిస్తారు కదా! పాపం వారికి దోసిలి అంత కూడా ఇవ్వకపోతే, వారు ఎంతగా తపిస్తారు! ఇప్పుడు అన్ని హద్దు విషయాల నుండి అతీతం అయిపోండి. హద్దు విషయాలలో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాప్‌దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ, వారు ఇక్కడ కూర్చుని ఉన్నా, సెంటర్లో కూర్చుని ఉన్నా, భారత్‌లో ఉన్నా, విదేశాలలో ఉన్నా కానీ దయార్ద్ర హృదయ భావనతో సూచనను ఇస్తున్నారు, అదేమిటంటే - బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క హద్దు విషయాలను, హద్దు స్వభావ-సంస్కారాలను, అల్లరితనాన్ని లేక చతురతతో కూడిన సంస్కారాలను, నిర్లక్ష్యపు సంస్కారాలను బాప్‌దాదా చాలా సమయము నుండి చూస్తున్నారు, కొంతమంది పిల్లలు - అంతా జరిగిపోతుంది, ఎవరు చూస్తారు, ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటారు కానీ ఇప్పటి వరకూ బాప్‌దాదా దయార్ద్ర హృదయులుగా ఉన్నారు. అందుకే అంతా చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ దయ చూపిస్తున్నారు. అయితే బాప్‌దాదా ప్రశ్నిస్తున్నారు - ఇలా దయార్ద్ర హృదయులుగా ఉండటం కూడా ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఇంకా సమయం కావాలా? సమయం కూడా బాబాను అడుగుతుంది - ఇంకా ఎంత వరకు? ప్రకృతి కూడా అడుగుతుంది. మీరు సమాధానమివ్వండి. సమాధానమివ్వండి. ఇప్పుడింకా తండ్రి రూపమే నడుస్తూ ఉంది, శిక్షకునిగా మరియు సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు తండ్రి రూపం నడుస్తుంది. క్షమాసాగరుని పాత్ర నడుస్తుంది. కానీ ధర్మరాజు పాత్ర నడిచినట్లయితే? ఏం చేస్తారు? బాప్‌దాదా ఏం కోరుకుంటారంటే - ధర్మరాజు పాత్రలో కూడా, వాహ్ పిల్లలూ వాహ్! అన్న శబ్దం చెవులలో మారుమ్రోగాలి. తర్వాత బాబాకు ఫిర్యాదు చెయ్యకండి - బాబా, మీరు చెప్పనే చెప్పలేదు, మేము తయారైపోయేవాళ్ళము కదా అని. అందుకే ఇప్పుడు హద్దుకు సంబంధించిన చిన్న-చిన్న విషయాలలో, స్వభావములో, సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తున్నాము, నడుస్తాము అని కాదు, జమ అవుతూ ఉంటుంది. అదంతా రెండు రెట్లు, మూడు రెట్లు, వంద రెట్లు జమ అవుతూ ఉంటుంది. నడుస్తుందిలే అని కాదు. అందుకే మనస్సులో ఈ దృఢ సంకల్పం అనే దీపాన్ని మనసులో వెలిగించండి. వృత్తిని, దృష్టిని, కృతిని హద్దు నుండి అనంతములోకి తయారు చేసుకోవాల్సిందే, అందుకే బాప్‌దాదా అంటారు - అలా తయారుచేసుకోవాల్సి ఉంది. ఈ రోజైతే తయారుచేసుకోవాల్సి ఉంది అని అంటున్నాము, కానీ తర్వాత ఏమంటాము? టూ లేట్. సమయాన్ని చూడండి, సేవను చూడండి, సేవ వృద్ధి చెందుతుంది, సమయం ముందుకు పరుగులు తీస్తుంది. కానీ స్వయం హద్దులో ఉన్నారా లేక అనంతంలో ఉన్నారా? హద్దు విషయాల వెనుక మీరు పరుగులు తీయకండి. అప్పుడు అనంతమైన వృత్తి, స్వమానం యొక్క స్థితి మీ వెనుక పరుగు తీస్తాయి.
ఈ సంవత్సరములో ఇప్పటి వరకు ఏదైతే చేసారో, అది చూసి బాప్‌దాదా సంతుష్టంగా ఉన్నారు, అభినందనలను కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సేవలో అనుభూతిని చేయించండి, దీపముపై దీపపు పురుగులుగా చెయ్యండి. సహయోగులుగానైనా చేయండి, సహచరులుగానైనా చేయండి, ఎలాగో ఒకలాగ తయారవ్వాలి. అనుభూతి యొక్క ఖజానాను తెరవండి. మంచిది, ఇంతవరకు బాగుంది. కానీ కేవలం చుట్టూ తిరిగి వెళ్ళే దీపపు పురుగులుగా అవ్వకూడదు. అనుభూతి యొక్క కోర్సును చేయించటం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు. చాలా బాగుంది, స్వర్గంలా ఉంది, ఇదే యథార్థ జ్ఞానము, నాలెడ్జ్ అని ఇంత వరకు అనుభూతి అవుతుంది. ఇంతవరకు సేవా రిజల్ట్ మంచిగా ఉంది. ఇప్పుడు అనుభూతి స్వరూపులుగా అయ్యి అనుభవం చేయించండి. అనుభవం చేసుకునేవారు అనగా బాబాతో డైరెక్ట్ సంబంధాన్ని పెట్టుకునేవారు. అటువంటి అనుభవీ దీపపు పురుగులను తయారుచెయ్యండి. సహయోగులుగా చేసారు, అందుకు అభినందనలు, ఇంకా తయారుచెయ్యండి. ఇదే ఆ స్థానము, ఇక్కడి నుండే ప్రాప్తి కలుగుతుంది అని ఇంతవరకైతే ఒప్పుకుంటున్నారు కానీ బాబాతో కొద్దిగానైనా సంబంధాన్ని జోడించేలా చేయండి, వారు దీపం వెనుకే పరిగెత్తే విధంగా ఉండాలి. కనుక ఈ సంవత్సరం విశేషంగా బాప్‌దాదా సేవలో అనుభూతి చేయించే కోర్సును చేయించాలని కోరుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి మరియు సాక్షాత్తు బాబా ప్రత్యక్షమవుతారు. విన్నారా, ఏం చెయ్యాలి? ప్లాన్ దొరికిందా?
ఇప్పుడు ఈ సంవత్సరము యొక్క రిజల్ట్‌ను చూస్తాము – ఎంతమందిని బాబా దీపానికి దీపపు పురుగులుగా తయారు చేసారు, సరే దీపం చుట్టూ తిరిగి వెళ్ళారా, స్వాహా అవ్వలేదా, బాబా-బాబా అంటూ చుట్టూ అన్నా తిరగాలి. అచ్ఛా. కుమారీలు, సరేనా! అచ్ఛా.
నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలు కూడా బాప్‌దాదాకు లభిస్తూ ఉంటాయి. అక్కడ పిల్లలు వ్రాయడం మొదలు పెడితే ఇక్కడ బాప్‌దాదాకు ముందుగానే చేరుకుంటాయి. మనసు యొక్క మాట కదా ఇది. వ్రాసేది చేతులతో వ్రాస్తారు, కానీ ముందుగా మనసులోని మాట మనోభిరాముడి వద్దకు చేరిపోతుంది. ఇది కూడా బాగుంది, బాప్‌దాదా స్మృతి అయితే కలుగుతుంది కదా. సమచారాన్ని వ్రాసే సమయంలో ఎంత సంతోషం కలుగుతుంది! ఎవరెవరైతే ఉత్తరాలు, ఈ-మెయిల్స్, ఏ సాధనం ద్వారానైనా ప్రియస్మృతులను లేక సమచారాన్ని పంపారో, వారందరికీ, ఒక్కొక్కరికీ పేరు సహితంగా స్పెషల్ ప్రియస్మృతులు మరియు అభినందనలు తెలుపుతున్నారు. మీరందరూ సమ్ముఖంగా ఇస్తున్నారు కదా! వారికి ఇవ్వాలి కదా! మరి అందరికీ, నలువైపుల ఉన్న పిల్లలకు దీపావళి శుభాకాంక్షలు, ఏ దీపావళి జరుపుకోవాలో అదైతే విన్నారు కదా. అచ్ఛా.
నలువైపులా ఉన్న అతి ప్రియమైన బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనాధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సదా హద్దు స్వభావ-సంస్కారాలను పరివర్తన చేసుకునే అనంతమైన పరివర్తక ఆత్మలకు, సదా ఒక్క క్షణాన్ని, ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఉండేవారికి, జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా దయార్ద్ర హృదయులుగా అయ్యి, దాతగా అయ్యి ప్రతి ఆత్మకు, వారు బ్రాహ్మణాత్మ అయినా, దాహంతో ఉన్న ఆత్మలైనా కానీ, ఏదో ఒకదాని యొక్క దోసిలిని ఇచ్చేవారికి, సకాష్ను ఇచ్చేవారికి, ఇలా విశాల హృదయాన్ని పెట్టుకునే పిల్లలకు బాప్‌దాదా యొక్క చాలా-చాలా-చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.