Search for a command to run...
25 Nov 2001
‘‘ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి, కారణాన్ని నివారణ చేసి సమస్యలను సమాధానపరచండి’’
25 November 2001 · తెలుగు
ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్‌దాదా తమ ప్రేమ స్వరూపులైన పిల్లల ప్రేమ బంధానికి ఆకర్షించబడి మిలనం జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు మరియు హజూర్ (ప్రభువు) హాజరైపోయారు. అవ్యక్త మిలనాన్ని అయితే సదా జరుపుకుంటూనే ఉంటారు, అయినా కూడా సాకారములో పిలిచారు కనుక బాప్‌దాదా పిల్లల యొక్క విశాల మేళాకు చేరుకున్నారు. బాప్‌దాదాకు పిల్లల స్నేహము, పిల్లల ప్రేమ చూసి సంతోషము కలుగుతుంది మరియు హృదయాంతరాలలో నలువైపుల ఉన్న పిల్లల కోసం ఇలా పాట పాడుతారు - ‘‘వాహ్ శ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలూ వాహ్! భగవంతుని ప్రేమకు పాత్రులైన ఆత్మలూ వాహ్!’’ ఇంతటి గొప్ప భాగ్యము మరియు అది ఇంతటి సాధారణ రూపములో సహజంగా ప్రాప్తించటము, ఇది కలలో కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు సాకార రూపములో భాగ్యాన్ని చూస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు, దూరంగా కూర్చుని కూడా పిల్లలు మిలన మేళాను జరుపుకుంటున్నారు. బాప్‌దాదా వారిని చూస్తూ మిలనం జరుపుతున్నారు. మెజారిటీ మాతలకు గోల్డెన్ ఛాన్స్ లభించింది మరియు బాప్‌దాదాకు కూడా విశేషంగా శక్తి సైన్యాన్ని చూసి ఈ సంతోషము కలుగుతుంది - నాలుగు గోడల మధ్యన ఉండే మాతలు బాబా ద్వారా విశ్వ కళ్యాణకారులుగా అయ్యి, విశ్వ రాజ్యాధికారులుగా అయ్యారు అని. అలా అయిపోయారా లేక అవుతూ ఉన్నారా, ఏమంటారు? అయిపోయారు కదా! విశ్వ రాజ్యమనేది వెన్నలాంటిది, ఆ గ్లోబ్ ఇప్పుడు మీ అరచేతిలో ఉంది కదా! బాప్‌దాదా చూసారు, ఏయే మాతలైతే మధుబన్కు చేరుకున్నారో, వారికి ఒక విషయములో చాలా సంతోషంగా ఉంది, ఏ సంతోషము ఉంది? బాప్‌దాదా మాతలైన మమ్మల్ని విశేషంగా పిలిచారు అని. కావున మాతలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా! వారు నషాతో అంటారు - బాప్‌దాదా పిలిచారు, మమ్మల్ని పిలిచారు, మరి మేమెందుకు రాము! బాప్‌దాదా కూడా అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు, ఈ సంతోషపు నషాను చూస్తూ ఉంటారు. ఆ మాటకొస్తే పాండవులు కూడా తక్కువేమీ కాదు, పాండవులు లేకుండా కూడా విశ్వ కార్యము యొక్క సమాప్తి జరగదు, కానీ ఈరోజు విశేషంగా మాతలను పాండవులు కూడా ముందు ఉంచారు.
బాప్‌దాదా పిల్లలందరికీ చాలా సహజమైన పురుషార్థపు విధిని వినిపిస్తున్నారు. మాతలకు సహజమైనది కావాలి కదా! అందుకని బాప్‌దాదా మాతలు, పిల్లలు అందరికీ చెప్తున్నారు, అన్నింటికంటే సహజమైన పురుషార్థము యొక్క సాధనము - ‘‘కేవలము నడుస్తూ-తిరుగుతూ, సంబంధ-సంపర్కములోకి వస్తూ ప్రతి ఒక్క ఆత్మకు హృదయపూర్వకంగా శుభ భావనతో కూడిన ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఇతరుల నుండి కూడా ఆశీర్వాదాలను తీసుకోండి.’’ మీకు ఎవరు ఏమిచ్చినా కానీ, శాపనార్థాన్ని ఇచ్చినా కానీ మీరు ఆ శాపనార్థాన్ని కూడా మీ శుభ భావనా శక్తితో ఆశీర్వాదములోకి పరివర్తన చెయ్యండి. మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవమవ్వాలి. ఆ సమయములో ఎలా అనుభవం చేయండంటే, ఎవరైతే మీకు శాపనార్థాన్ని ఇస్తున్నారో వారు ఆ సమయములో ఏదో ఒక వికారానికి వశీభూతులై ఉన్నారు. వశీభూతమై ఉన్న ఆత్మ పట్ల లేక పరవశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ కూడా శాపనార్థము వెలువడదు. వారి పట్ల సదా సహయోగాన్ని ఇచ్చే ఆశీర్వాదమే వెలువడుతుంది. కేవలం ఒక్క విషయాన్నే గుర్తు పెట్టుకోండి, అదేమిటంటే, మనం నిరంతరము ఒకటే కార్యాన్ని చేస్తూ ఉండాలి - ‘‘సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, సంబంధ-సంపర్కముల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి’’. ఒకవేళ ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా వ్యర్థ సంకల్పము లేక నెగెటివ్ సంకల్పము వచ్చినా కానీ ఇదే గుర్తు తెచ్చుకోండి - నా కర్తవ్యము ఏమిటి! ఉదాహరణకు ఎక్కడైనా మంటలు అంటుకుంటే మరియు అక్కడ మంటలు ఆర్పేవారు ఉంటే, వారు ఆ మంటలను చూసి నీటిని వేయాలి అనే తమ కార్యాన్ని మర్చిపోరు. మేము నీటిని వేసేవారము, మంటలు ఆర్పేవారము అన్నది వారికి గుర్తుంటుంది, అదే విధంగా ఒకవేళ ఎవరైనా ఏదైనా వికారమనే అగ్నికి వశమై ఏదైనా అలాంటి-ఇలాంటి పని చేస్తే, అది మీకు మంచిగా అనిపించకపోతే, అప్పుడు మీరు మీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోండి - నా కర్తవ్యము ఏమిటంటే, ఏ రకమైన అగ్నిని అయినా ఆర్పటము, ఆశీర్వాదాలను ఇవ్వటము, శుభ భావనతో కూడిన భావన యొక్క సహయోగాన్ని ఇవ్వటము. కేవలం ఒక్క మాటను గుర్తు పెట్టుకోండి, మాతలకు ఒక్క మాటను గుర్తు పెట్టుకోవటము సహజము, అదేమిటంటే - ‘‘ఆశీర్వాదాలను ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి.’’ మాతలు ఇది చెయ్యగలరా? (మాతలందరూ చేతులెత్తుతున్నారు), చెయ్యగలరా లేక చెయ్యాల్సిందేనా? పాండవులు చెయ్యగలరా? పాండవులు ‘చెయ్యాల్సిందే’ అని అంటారు. పాండవులు అనగా సదా విజయులు అని గాయనము ఉంది మరియు శక్తులు సదా విశ్వ కళ్యాణకారులు అన్న పేరుతో ప్రసిద్ధులు.
బాప్‌దాదాకు నలువైపుల ఉన్న పిల్లల విషయములో ఇప్పటివరకు ఒక ఆశ ఉండిపోయింది. అది ఏ ఆశో చెప్పమంటారా? తెలిసిపోయింది కదా! టీచర్లకు తెలిసిపోయింది కదా! పిల్లలందరూ తమ శక్తి అనుసారంగా పురుషార్థమైతే చేస్తున్నారు. బాప్‌దాదా ఆ పురుషార్థాన్ని చూసి చిరునవ్వు నవ్వుతారు. కానీ ఒక ఆశ ఏమిటంటే పురుషార్థములో ఇప్పుడు తీవ్ర వేగము కావాలి. పురుషార్థము చేస్తున్నారు కానీ ఇప్పుడు తీవ్ర వేగము కావాలి. దీనికి విధి ఏమిటంటే - ‘కారణము’ అన్న పదం సమాప్తమైపోవాలి మరియు నివారణ స్వరూపులుగా సదా కోసం అవ్వాలి. కారణాలైతే సమయమనుసారంగా తయారవుతాయి మరియు అవుతూనే ఉంటాయి. కానీ మీరందరూ నివారణ స్వరూపులుగా అవ్వండి ఎందుకంటే పిల్లలైన మీరందరూ విశ్వములోని కారణాలను నివారణ చేసి అందరినీ, మెజారిటీ ఆత్మలను నిర్వాణధామానికి పంపించాలి. కనుక ఎప్పుడైతే స్వయాన్ని నివారణ స్వరూపులుగా తయారుచేసుకుంటారో, అప్పుడే విశ్వములోని ఆత్మలను నివారణ స్వరూపము ద్వారా అన్ని సమస్యలను నివారణ చేసి నిర్వాణధామానికి పంపించగలరు. ఇప్పుడు విశ్వములోని ఆత్మలు ముక్తిని కోరుకుంటున్నారు కావున బాబా ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేందుకు నిమిత్తులు మీరే. కనుక నిమిత్త ఆత్మలు ముందుగా స్వయాన్ని రకరకాల సమస్యల కారణాన్ని నివారణ చేసి ముక్తులుగా చేసుకుంటే, అప్పుడు విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించగలుగుతారు. మరి మీరు ముక్తులుగా ఉన్నారా? ఏ విధమైన సమస్య యొక్క కారణము ఎదురుగా రాకూడదు, ఈ కారణము, ఈ కారణము, ఈ కారణము... ఎప్పుడైనా ఏదైనా కారణము ఎదురుగా వస్తే ఆ కారణానికి క్షణములో నివారణను ఆలోచించండి. ఇలా ఆలోచించండి - నేను విశ్వములోని కారణాలను నివారణ చేసేవాడిని అన్నప్పుడు మరి స్వయం యొక్క చిన్న-చిన్న సమస్యలను స్వయం నివారించలేనా! చెయ్యిలేనా! ఇప్పుడైతే ఆత్మల క్యూ మీ ముందుకు వచ్చేదుంది ‘‘ఓ ముక్తిదాతా, ముక్తిని ఇవ్వు’’ అని, ఎందుకంటే మీరు ముక్తిదాతకు డైరెక్ట్ పిల్లలు, అధికారి పిల్లలు. మీరు మాస్టర్ ముక్తిదాతలు కదా. కానీ క్యూ ఎదురుగా మాస్టర్ ముక్తిదాతలైన మీ వైపు నుండి ఆటంకములా ఒక తలుపు మూసి ఉంది. క్యూ సిద్ధముగా ఉంది, కానీ ఏ తలుపు మూసి ఉంది? పురుషార్థములో బలహీన పురుషార్థానికి చెందిన ఒక పదము అనే తలుపు, అదేమిటంటే - ‘ఎందుకు’. ఇది ప్రశార్థకము (?). ఎందుకు, ఈ ఎందుకు అన్న పదము ఇప్పుడు క్యూను ఎదురుగా తీసుకురాదు. కనుక బాప్‌దాదా ఇప్పుడు దేశ-విదేశాలలోని పిల్లలందరికీ ఇదే స్మృతిని కలిగిస్తున్నారు - మీరు సమస్యల యొక్క తలుపు అయినటువంటి ‘ఎందుకు’ అన్నదానిని సమాప్తం చెయ్యండి. చెయ్యగలరా? టీచర్లు చెయ్యగలరా? పాండవులు చెయ్యగలరా? అందరూ చేతులెత్తుతున్నారా లేక కొంత-కొంత మందేనా? విదేశీయులు అయితే ఎవరెడీగా ఉన్నారు కదా! అవునా, కాదా? ఒకవేళ అవును అని అన్నట్లయితే నేరుగా చేతులు పైకెత్తండి. కొంతమంది ఇలా-ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఏ సేవాకేంద్రములోనూ సమస్య యొక్క నామ-రూపాలు ఉండకూడదు. అలా వీలవుతుందా? ప్రతి ఒక్కరూ - నేను చెయ్యాలి అని భావించాలి. టీచర్లు నేను చెయ్యాలి అని భావించాలి, విద్యార్థులు నేను చెయ్యాలి అని భావించాలి, ప్రవృత్తివారు నేను చెయ్యాలి అని భావించాలి, మధుబన్వారు మేము చెయ్యాలి అని భావించాలి. చెయ్యగలరు కదా? సమస్య అన్న పదమే సమాప్తమైపోవాలి, కారణము సమాప్తమైపోయి నివారణ రావాలి, ఇది సాధ్యమేనా! వీలు కానిది ఏముంది? ప్రారంభములో స్థాపనా సమయములో వచ్చిన పిల్లలందరూ ఏమని ప్రమాణము చేసారు, మరియు దానిని చేసి చూపించారు! అసంభవాన్ని సంభవం చేసి చూపించారు. చూపించారు కదా? మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైపోయాయి? స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలైపోయాయి? (65). మరి ఇన్ని సంవత్సరాలలో అసంభవము సంభవము అవ్వలేదా? అవ్వగలదా? ముఖ్యమైన టీచర్లు చేతులెత్తండి. పంజాబ్వారు చేతులెత్తడం లేదు, ఏదైనా అనుమానం ఉందా? కొంచెం ఆలోచిస్తున్నారు, ఆలోచించకండి. చెయ్యాల్సిందే. ఇతరుల గురించి ఆలోచించకండి, ప్రతి ఒక్కరూ మీ గురించి మీరు ఆలోచించండి, మీ గురించైతే ఆలోచించగలరు కదా? ఇతరుల సంగతి వదిలేయండి, మీ గురించి ఆలోచించి మీ కొరకైతే ధైర్యాన్ని పెట్టగలరు కదా? లేక పెట్టలేరా? విదేశీయులు ధైర్యాన్ని పెట్టగలరా? (చేతులెత్తారు) అభినందనలు. అచ్ఛా, ఇప్పుడు ఎవరైతే చెయ్యగలమని భావిస్తున్నారో వారు మనస్ఫూర్తిగా చేతులెత్తండి, చూపించుకోవడానికి కాదు. అందరూ చేతులెత్తుతున్నారు కావున నేను కూడా ఎత్తుతాను అన్నట్లు కాదు. ఒకవేళ మనస్ఫూర్తిగా ఈ దృఢ సంకల్పాన్ని చేస్తే, అదేమిటంటే - కారణాన్ని సమాప్తము చేసి నివారణ స్వరూపముగా అవ్వాల్సిందే, ఏం జరిగినా సరే, సహనం చెయ్యాల్సి వచ్చినా, మాయను ఎదిరించాల్సి వచ్చినా, ఇతరుల సంబంధ-సంపర్కములో సహనం చెయ్యాల్సి వచ్చినా సరే, నేను సమస్యగా అవ్వకూడదు. ఇది సాధ్యమేనా? ఒకవేళ ఈ దృఢ నిశ్చయము ఉన్నట్లయితే వెనుక నుండి ముందు వరకు అందరూ చేతులెత్తండి. (బాప్‌దాదా అందరి చేతా చేతులెత్తించారు మరియు ఈ దృశ్యమంతా టి.వి.లో చూసారు). బాగుంది కదా, ఎక్సర్సైజ్ అయిపోయింది! చేతులు ఇందుకోసమే ఎత్తిస్తాము. ఎలాగైతే ఇప్పుడు ఒకరినొకరు చూసుకొని చేతులెత్తడంలో ఉల్లాసము వస్తుంది కదా, అలాగే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే ఎదురుగా బాప్‌దాదాను చూడండి, మనస్ఫూర్తిగా ‘బాబా’ అని అనండి, అప్పుడు బాబా హాజరైపోతారు, సమస్య సమాప్తమైపోతుంది. సమస్య మీ ఎదురుగా నుండి పక్కకు వెళ్ళిపోతుంది మరియు బాప్‌దాదా ఎదురుగా హాజరైపోతారు. ‘‘మాస్టర్ సర్వశక్తిమాన్’’, మీ ఈ టైటిల్‌ను అన్నివేళలా గుర్తు చేసుకోండి, లేదా బాప్‌దాదా ఇప్పుడు ప్రియస్మృతులను చెప్పేటప్పుడు మాస్టర్ సర్వశక్తిమంతులు అని చెప్పకుండా శక్తిమంతులు అని చెప్పాలా? శక్తిమంతులైన పిల్లలకు ప్రియస్మృతులు అని చెప్తే మంచిగా అనిపిస్తుందా? మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు. మాస్టర్ సర్వశక్తిమంతులు చెయ్యలేనిది ఏముంది? కేవలం మీ టైటిల్‌ను మరియు కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. టైటిల్ ‘‘మాస్టర్ సర్వశక్తిమాన్’’ మరియు కర్తవ్యము ‘‘విశ్వ కళ్యాణకారి’’. కావున సదా మీ టైటిల్‌ను మరియు కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవటం వలన శక్తులు ఇమర్జ్ అవుతాయి. మాస్టర్‌గా అవ్వండి, శక్తులకు కూడా మాస్టర్‌గా అవ్వండి, ఆర్డర్ చెయ్యండి, ప్రతి శక్తినీ అవసరమైన సమయములో ఆర్డర్ చెయ్యండి. వాస్తవానికి శక్తులను ధారణ చేస్తారు కూడా, అవి ఉన్నాయి కూడా, కానీ కేవలం లోపమేమిటంటే అవసరమైన సమయంలో వాటిని ఉపయోగించటం రావటం లేదు. సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తాయి, ఇలా చేసి ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటారు. ఇప్పుడు ఈ అభ్యాసము చెయ్యండి - ఏ శక్తులైతే ఇమిడి ఉన్నాయో, వాటిని సమయానికి ఉపయోగించండి. ఎలాగైతే ఈ కర్మేంద్రియాలకు ఆర్డర్ ఇచ్చి నడిపిస్తారు కదా, చేతులను, కాళ్ళను నడిపిస్తారు కదా! అలాగే ప్రతి శక్తినీ ఆర్డర్ అనుసారంగా నడిపించండి. శక్తిని కార్యములో పెట్టండి. శక్తులను లోపల ఇముడ్చుకుని పెట్టుకుంటారు, వాటిని కార్యంలో తక్కువగా ఉపయోగిస్తారు. అవసరమైన సమయంలో కార్యంలో ఉపయోగిస్తే శక్తి తన పనిని తప్పకుండా చేస్తుంది. మరియు సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లల ముఖం చాలా ఆలోచనలో ఉన్నట్లు, కొంచెం ఎక్కువ గంభీరంగా కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి, ఆడండి, పాడండి, మీ బ్రాహ్మణ జీవితము ఉన్నదే సంతోషములో నాట్యము చేసేదిగా మరియు మీ భాగ్యము గురించి మరియు భగవంతుని గురించి పాటలు పాడేదిగా. మరి ఆడుతూ-పాడుతూ ఉండేవారు ఉంటారు కదా, వారు ఇలా గంభీరంగా ముఖం పెట్టుకుని నాట్యం చేస్తే, వీరికి నాట్యం చెయ్యటం రాదు అని అంటారు. గంభీరత మంచిదే కానీ టూ మచ్ (అతి) గంభీరత ఉంటే అది ఏదో బాగా ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
ఢిల్లీలో ప్రారంభోత్సవం కానున్నది అని బాప్‌దాదా ఇప్పుడు విన్నారు (డిసెంబర్ 9, 2001న ఢిల్లీలోని గుర్గావ్లో ఓం శాంతి రిట్రీట్ సెంటర్ ప్రారంభోత్సవము ఉంది) కానీ బాప్‌దాదా ఇప్పుడు ఏ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు? ఆ తారీఖునైతే ఫిక్స్ చేయండి. ఈ చిన్న-చిన్న ప్రారంభోత్సవాలైతే జరిగిపోతాయి. కానీ బాప్‌దాదా ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు - ‘‘అందరూ విశ్వమనే స్టేజ్‌పైకి బాబా సమానంగా సాక్షాత్తు ఫరిశ్తాల వలె ఎదురుగా రావాలి మరియు పరదా తెరుచుకోవాలి’’. ఇటువంటి ప్రారంభోత్సవము మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా! ఆత్మిక సంభాషణలో కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు, బాబా కూడా వింటూ ఉంటారు, ఇప్పుడు కేవలం ఇదే కోరిక ఉంది - బాబాను ప్రత్యక్షము చెయ్యాలి. మరియు బాబా కోరిక ఏమిటంటే - ముందు పిల్లలు ప్రత్యక్షమవ్వాలి. బాబా పిల్లలతోపాటు ప్రత్యక్షమవుతారు. ఒంటరిగా ప్రత్యక్షమవ్వరు. కావున బాప్‌దాదా అటువంటి ప్రారంభోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. ఉల్లాసము కూడా మంచిగా ఉంది, ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు, ఆ ఆత్మిక సంభాషణ సమయములో అందరి ఉల్లాసము చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కర్మయోగులుగా అవుతారో అప్పుడు కాస్త తేడా వచ్చేస్తుంది. మరి మాతలు ఏం చేస్తారు? మాతలది చాలా పెద్ద గుంపు. మరియు మాతలను చూస్తే బాప్‌దాదాకు చాలా సంతోషమనిపిస్తుంది. ఎవరూ కూడా మాతలను ఇంత ముందుకు తీసుకురాలేదు కానీ బాప్‌దాదా మాతలు ముందుకు వెళ్ళటం చూసి సంతోషిస్తారు. మాతలకు విశేషంగా ఈ సంకల్పము ఉంది - ఏదైతే ఎవ్వరూ చేసి చూపించలేదో, దానిని మాతలమైన మేము బాబాను తోడు పెట్టుకుని చేసి చూపిస్తాము. చేసి చూపిస్తారా? ఇప్పుడు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. మాతలు అన్నీ చెయ్యగలరు. మాతలలో ఉల్లాసము బాగుంది. ఏమీ అర్థం చేసుకోకపోయినా కానీ ఇదైతే అర్థం చేసుకున్నారు కదా - నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నా వారు. దీనినైతే అర్థం చేసుకున్నారు కదా! మేరా బాబా (నా బాబా) అని అయితే అందరూ అంటారు కదా? మనస్ఫూర్తిగా ఈ పాటనే పాడుకుంటూ ఉండండి, అంతే - మేరా బాబా, మేరా బాబా, మేరా బాబా...
అచ్ఛా, టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చాలామంది వచ్చారు. (1300 మంది టీచర్లు వచ్చారు) టీచర్లూ, మాతలను మంచిగా తీసుకువచ్చారు కదా! ఇది కూడా పుణ్య ఖాతాను జమ చేసుకోవడమే. మీకు లాభం కలిగింది కదా. మీ పుణ్య ఖాతా పెరిగింది. అచ్ఛా, డబల్ విదేశీయులు చేతులెత్తండి. డబల్ విదేశీయులలో స్పెషల్‌గా ఒక విశేషతను బాప్‌దాదా చూసారు. డబల్ విదేశీయులు లేని గ్రూప్ ఏదీ లేదు. సర్వవ్యాపి అయిపోయారు. మధుబన్ నివాసులు మరియు బాప్‌దాదా డబల్ విదేశీయులైన మిమ్మల్ని చూసి విశేషంగా సంతోషిస్తారు కనుక తప్పకుండా రండి. అచ్ఛా. ఈ సభలో ఉన్న కుమారీలు చేతులెత్తండి. చాలామంది కుమారీలు ఉన్నారు. కుమారీలు కమాల్ చేసేవారు కదా? కుమారీలకు ఎక్స్ట్రా లక్ లభించింది. ఈ పాండవులు నవ్వుతారు, ఫిర్యాదు చేస్తారు, కుమారి ఒకవేళ సెంటరులో ఉంటే దీదీ అయిపోతుంది, పాండవ్ సెంటరులో ఉంటే దాదా అవ్వరు అంటారు. మరి చూడండి, కుమారీలకు విశే,గా ఇది ఒక లిఫ్ట్, సరెండర్ మనసుతో అయ్యారు మరియు బాప్‌దాదా మురళిని వినిపించే సింహాసనం లభించింది. ఈ సింహాసనం తక్కువైనదేమీ కాదు. పాండవులు కూడా మురళిని వినిపిస్తారు కానీ మెజారిటీ అక్కయ్యలు వినిపిస్తారు. ఇది కుమారీలు లభించిన అదృష్టము. కుమారీలు ఈ గిఫ్ట్‌ను ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అచ్ఛా, కుమారులు ఎంతమంది ఉన్నారు? కుమారులు కూడా తక్కువేమీ కాదు. కుమారులు ఇప్పుడు సుకుమారులుగా అయ్యారు. కుమారులు లేకుండా సెంటర్ నడవదు. టీచర్లు చెప్పండి, కుమారులు లేకుండా సెంటర్ నడుస్తుందా? నడవదు. కుమారులలోని ఒక విశేషత బాగుంది, కుమారులు ఏ దృఢ సంకల్పం చేస్తారో దానిని ప్రాక్టికల్లోకి తీసుకువస్తారు ఎందుకంటే సుకుమార్ తప్పు అయితే చెయ్యరు, మంచే చేస్తారు. కుమారులలో దృఢ సంకల్పం అనే గిఫ్ట్ ఉంది, ఏది అనుకుంటే అది చేయగలరు – ఇది గిఫ్ట్. ఇక ఉపయోగించుకోవడం మీ చేతులలో ఉంది. సుకుమారులది పెద్ద గ్రూప్ ఉండాలి, కుమారులది కాదు అని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఇప్పుడు బాప్‌దాదా యొక్క ఒక సూచనను ఇంకా ప్రాక్టికల్లోకి తీసుకురాలేదు, పూర్తి విశ్వంలోని కుమారుల గ్రూపును మధుబన్కు పిలవండి, అప్పుడు ప్రధానమంత్రి, మినిస్టర్ ఇక్కడకు రావాలి. రాగలరు. మంచిది. కుమారులు తమ జల్వాను చూపించండి. కుమారుల గ్రూప్‌ను తయారు చేయండి, ఒకరు ఒకచోట నుండి, మరొకరు మరో చోటు నుండి... నేరుగా ఆహ్వానాన్ని పంపండి, ఆ గ్రూపులో అన్ని దేశాల కుమారులు ఉండాలి, ఆహ్వానాన్ని పెపండి, డేట్ ఫిక్స్ చేయండి. కుమారులపై అయితే బాప్‌దాదాకు చాలా-చాలా-చాలా సుభ ఆశలు ఉన్నాయి మరియు అవి పూర్తి కావలసిందే. అచ్ఛా.
(భారతదేశ నలుమూలల నుండి రెండు నెలలు మాతల ర్యాలీ జరిగింది) అందుకే మాతలు ఇంతమంది వచ్చారు, ముప్పావు హాల్ మాతలే ఉన్నారు. (13 వేలమంది మాతలు ఉన్నారు) పూర్తి హాల్‌కు మాతలు అందాన్ని తెచ్చారు. అచ్ఛా, మాతలు మరియు కన్యలు ఎవరైతే ర్యాలీలో వెళ్ళారో, వారు లేవండి. కొద్దిమందే వచ్చారు. వారికి స్మృతి లభిస్తుంది. బాప్‌దాదా వారిని కూడా టి.వీలో చూస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు. మంచిగా యాత్రను చేసారు మరియు నలువైపుల సేవ కూడా బాగా చేసారు, అందుకే చాలా-చాలా అభినందనలు. ప్రవృత్తిలోని అధర్ కుమారులు చేతులెత్తండి. అచ్ఛా, అధర్ కుమారుల విశేషత ఏమిటి? అధర్ కుమారులు విశ్వంలోని ఆత్మలకున్న ఒక భ్రాంతిని తొలగించారు. బ్రాహ్మణులుగా అవ్వడము అంటే ఇంటిని, గృహస్థాన్ని విడిచిపెట్టడము అని లోకులు భావించేవారు, కానీ ఎప్పటినుండైతే అధర్ కుమారులు మరియు అధర్ కుమారీలను చూసారో అప్పటినుండి, మేము కూడా బ్రాహ్మణులుగా అవ్వగలము అన్న ప్రేరణ వారికి లభించింది, కావున ఒకప్పుడు ఏదైతే భ్రాంతి ఉండిందో, బ్రహ్మాకుమారీల వద్దకు వెళ్ళకూడదు అని ఏదైతే అనుకునేవారో, దానిని అధర్ కుమారులు మార్చారు, సేవ యొక్క ద్వారాన్ని తెరిచారు. (అందరూ చప్పట్లు కొట్టారు) మంచిగా చప్పట్లు కొట్టండి. అధర్ కుమారులు తక్కువేమీ కాదు. ప్రతి ఒక్క వర్గం వారికి, బాప్‌దాదా వద్ద బ్రాహ్మణ జీవితంలో మహత్వము ఉంది.
అచ్ఛా, చిన్న పిల్లలు ఎంతమంది వచ్చారు? చిన్న పిల్లలను చూసి అందరూ సంతోషిస్తారు ఎందుకంటే చిన్నతనంలోనే ఎంతో గొప్ప భాగ్యాన్ని పొందారు. పిల్లలు ప్రతి ఒక్కరూ, నేను బ్రహ్మాకుమార్ను అని గర్వంగా చెప్తారు. చిన్న పిల్లలు అనుభవాన్ని చాలా బాగా వినిపిస్తారు, మేము భగవంతుడితో కలుస్తాము, మాట్లాడుతాము అని చెప్తారు. చిన్న పిల్లలు చెప్పే మాటలు అందరికీ చాలా మంచిగా అనిపిస్తాయి కావున వీరు చిన్న పిల్లలు కాదు, చిన్న పిల్లలైనా సేవకు ఎంతో బాగా నిమిత్తమైనవారు. అందుకనే బాప్‌దాదా చిన్న పిల్లలను చాలా-చాలా-చాలా-చాలా ప్రేమ చేస్తారు. అచ్ఛా.
సేవాధారులతో:- ఈ సిస్టమ్‌ను చాలా బాగా తయారు చేసారు, ప్రతి ఒక్కరికీ సేవ చేసేందుకు, జమ చేసుకునేందుకు ఛాన్స్ లభిస్తుంది. సెంటర్లో సేవ చేస్తారు, అదైతే చేస్తూనే ఉంటారు, కానీ యజ్ఞ సేవకు విశేషమైన మహత్వం ఉంది. ఇప్పుడు ఈ మహత్వము పంజాబ్, హరియాణా, హిమాచల్ మరియు జమ్ము-కశ్మీర్‌కు లభించింది, చాలా పెద్ద జోన్. అచల్, ప్రేమ్, రాజ్, వీరందరూ ఎవరైతే కూర్చున్నారో, పంజాబ్ యొక్క ముఖ్యమైన టీచర్లు లేవండి. ఫస్ట్ మరియు సెకండ్ లేనిదే గతి లేదు. అచ్ఛా, బాప్దాదాకైతే పంజాబ్‌ను చూసి పంజాబ్ శేరినీ (చంద్రమణి దాదీ) గుర్తుకు వస్తున్నారు. పంజాబ్‌కు కూడా గుర్తుకు వస్తుంది. చాలా బాగుంది, చాలా కష్టవడవలసి వచ్చింది కదా. ఐదు జోన్లు కలిపి పంజాబ్ జోన్ అంటారు, పంజాబ్‌లో ఐదు నదులు కూడా ప్రసిద్ధి. మరి మీకు పెద్ద గ్రూప్ లభించింది మరియు మొదటి గ్రూప్ లభించింది, మరి మొదటి నంబర్‌ను తీసుకున్నారు కదా. అచ్ఛా, పంజాబ్ సేవాధారులు ఎవరైతే వచ్చారో వారు లేవండి. చాలామంది సేవాధారులు ఉన్నారు. చాలా బాగుంది, సేవకు అభినందనలు, అభినందనలు. యజ్ఞ సేవకు మహత్వం ఎందుకు ఉంది? సెంటర్లు కూడా యజ్ఞమే కదా! కానీ మధుబన్ను మహా యజ్ఞము అంటాము. అన్నీ యజ్ఞములే, కానీ మహా యజ్ఞము యొక్క మహాన్ సేవకు ప్రసాదము లభిస్తుంది ఎందుకంటే మహా యజ్ఞానికి ఎంతోమంది మహాన్ ఆత్మలు వస్తారు. మరి ఇంతమంది మహాన్ ఆత్మల సేవ చేసేందుకు ఛాన్స్ లభిస్తుంది కావున మహా యజ్ఞములో చేసే సేవకు మహత్వము ఉంది. పంజాబ్ జోన్ అయితే, ఒక కమాల్ చేసింది. చెప్పండి, ఏ కమాల్‌ను చేసారు? గుర్తుకు వచ్చిందా, ఏ కమాల్ చేసారు? చెప్పండి. తీవ్రవాదాన్ని సమాప్తం చేసారు. చిన్న చిన్నవి విడిచిపెట్టండి. అదైతే అక్కడక్కడ ఉండనే ఉన్నాయి కానీ ఎంతైతే తీవ్రవాదం జరిగిందో, అంతగా దానిని చిన్నదిగా చేసేసారు. ప్రతి మూల నుండి మీరు చేసిన తపస్సుకు ఇది మంచి కమాల్. ఇప్పుడు భయం లేదు కదా! ఇకపోతే విశ్వంలోనే తీవ్రవాదము ఉంది, ఫారెన్‌లో కూడా ఉంది. అచ్ఛా, ఫారెన్ వారు, ఫారెన్ విశేషత – బాబా ఏదైతే చెప్తారో దానిని ఫౌరెన్ (వెంటనే) చేసేవారు. ఫారెన్ అంటే ఫౌరన్. బాబా చెప్పారు, ఫారెన్ వారు ఫౌరన్ చేసేస్తారు. ఇదే ఫారెన్ వారి విశేషత. అంతే కదా! అచ్ఛా – ఇప్పుడు ఇంకెవరైనా మిగిలిపోయారా? అందరూ వచ్చేసారు. మమ్మల్ని బాబా కలవరు అని అందరూ అనుకుంటారు. ఇప్పుడైతే అందరినీ కలిసాము. ఒకే స్థానములో కూర్చుని అందరినీ కలిసాము.
అచ్ఛా - ఇప్పుడు బాప్‌దాదా ఒక్క సెకండు ఇస్తున్నారు, అందరూ అలర్ట్ అయి కూర్చోండి. బాప్‌దాదా పట్ల అందరికీ 100 శాతము ప్రేమ ఉంది కదా! ప్రేమ అయితే పర్సెంటేజ్లో లేదు కదా. 100 శాతము ఉందా? మరి 100 శాతము ప్రేమకు రిటర్న్ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారా? 100 శాతము ప్రేమ ఉంది కదా. ఎవరికైతే కాస్త తక్కువగా ఉందో వారు చేతులెత్తండి. తర్వాత రక్షించబడతారు. ఒకవేళ తక్కువగా ఉంటే వారు చేతులెత్తండి. 100 శాతము ప్రేమ లేకపోతే వారు చేతులెత్తండి. ప్రేమ గురించి మాట్లాడుతున్నాము (ఒకరిద్దరు చేతులెత్తారు) అచ్ఛా, ప్రేమ లేదా, ఏమీ ఫర్వాలేదు, అదే వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్తారు, ప్రేమించాల్సిందే. అచ్ఛా, ఇప్పుడు అందరూ అలర్ట్‌గా కూర్చున్నారు కదా! ఇప్పుడు అందరూ ప్రేమకు రిటర్న్‌లో ఒక్క సెకండు బాబా ఎదురుగా అంతర్ముఖులుగా అయ్యి మీకు మీరే మనస్ఫూర్తిగా మనసులో ఈ సంకల్పాన్ని చెయ్యగలరా - ఇప్పుడు మేము స్వయం పట్ల గానీ లేక ఇతరుల పట్ల గానీ సమస్యగా అవ్వము. ప్రేమకు రిటర్న్‌లో ఈ దృఢ సంకల్పాన్ని చెయ్యగలరా? ఏమైనా కానీ అనగా ఒకవేళ ఏదైనా జరిగినా కానీ, సెకండులో స్వయాన్ని పరివర్తన చేసుకుంటాము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు మనసులో ఈ సంకల్పాన్ని దృఢంగా చెయ్యండి. ఎవరైతే దృఢ సంకల్పాన్ని చెయ్యగలరో, వారు చెయ్యండి. బాప్‌దాదా సహాయం చేస్తారు కానీ సహాయాన్ని తీసుకునేందుకు విధి - దృఢ సంకల్పము యొక్క స్మృతి. బాప్‌దాదా ఎదురుగా సంకల్పము చేసారు, ఈ స్మృతి యొక్క విధి మీకు సహయోగాన్ని ఇస్తుంది. మరి చెయ్యగలరా? తల ఊపండి. చూడండి, సంకల్పముతో జరగనిదంటూ ఏముంది, భయపడకండి, బాప్‌దాదా యొక్క ఎక్స్ట్రా సహాయం తప్పకుండా లభిస్తుంది. అచ్ఛా.
బాప్‌దాదా కేవలం తమకున్న శుభ సంకల్పాన్ని వినిపిస్తున్నారు. చేయడం ఇప్పుడు పిల్లల పని. ఎవరు ఎంత చేస్తారో అంతగా వారి ఖాతా జమ అవుతుంది. పిల్లలందరి ఖాతా పూర్తి కల్పంలో ఎంతగా జమ అవ్వాలంటే వారు రాజ్యం కూడా చేయాలి మరియు అర్థ కల్పం పూజ్యులుగా కూడా అవ్వాలి అని బాప్‌దాదా భావిస్తున్నారు. పూజ్యులుగా అయ్యే ఖాతా మరియు రాజ్య అధికారులుగా అయ్యే ఖాతా రెండూ జమ అవ్వాలి. ఏ పిల్లల ఖాతా కూడా తక్కువగా ఉండకూడదు. అందరిదీ నిండుగా ఉండాలి. సంపన్నంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి.
అచ్ఛా – ఈరోజు సైన్స్ సాధనాలతో దూర-దూరాలలో కూర్చుని కూడా పిల్లలు వింటున్నారు, చూస్తున్నారు (ఈరోజు బాప్‌దాదా మురళిని భారతదేశంలో టి.విలో మరియు విదేశాలలో ఇంటర్నెట్ ద్వారా వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా) ఆ పిల్లలందరినీ బాప్‌దాదా చూస్తున్నారు.
అచ్ఛా, పిల్లలందరికీ బాప్‌దాదా మిలన్ మేళా కోసం అభినందనలు తెలుపుతున్నారు. కొందరు ఉత్తరం ద్వారా మిలనం చేసుకుని ఉండవచ్చు, మరికొందరు సమ్ముఖంలో వచ్చి మిలన్ మేళా జరుపుకుని ఉండవచ్చు, తమ తమ స్థానాలలో కూర్చుని మిలన్ మేళా జరుపుకుని ఉండవచ్చు. నలువైపుల ఉన్న పిల్లలు ఒక్కొక్కరూ బాబాకు అతి ప్రియమైనవారు. బాప్‌దాదా పిల్లలు ఒక్కొక్కరినీ చూసి చాలా హర్షిస్తున్నారు. బాబా ప్రేమను లెక్కించలేము, వర్ణించలేము అని పిల్లలు అంటారు, అలాగే బాబా కూడా సికీలధే, గారాల, విశేష ఆత్మల ప్రేమను వర్ణించలేము అని అంటున్నారు. ఇటువంటి పిల్లలు పూర్తి కల్పంలో మరెవ్వరికీ లభించరు.
ఇటువంటి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా ప్రేమకు రిటర్న్ ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు, సదా తమ విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేష ఆత్మలుగా తయారుచేసే పుణ్యాత్ములైన పిల్లలకు, సదా సమస్యలకు సమాధాన స్వరూపులుగా ఉంటూ విశేషంగా ముందుకు ఎగిరి వెళ్ళే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోలు సమయములో:- మధుబన్‌లో పైన ఎవరైతే సెక్యూరిటీ కార్యములో బిజీగా ఉన్నారో వారు ఈరోజు విశేషంగా బాప్‌దాదా ఎదురుగా వస్తున్నారు. యజ్ఞాన్ని రక్షించేవారిగా ఉన్నవారిది చాలా పెద్ద డ్యూటీ, కాపలా కాస్తున్నారు, దూరంగా కూర్చుని కూడా గుర్తు చేస్తున్నారు, కనుక ప్రత్యేకంగా బాప్‌దాదా ఎవరెవరైతే పైన ఏ సేవార్థమైనా కూర్చుని ఉన్నారో, జ్ఞాన సరోవర్‌లో కావచ్చు, పాండవ భవన్లో కావచ్చు, శాంతివన్లో కావచ్చు, ఎవరైతే కాపలా కాస్తున్నారో, వారికి బాప్‌దాదా విశేషంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. మ్యూజియమ్ వారు, మానేసర్ వారు అందరూ ఎవరైతే సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారో వారందరికీ చాలా-చాలా స్మృతి. అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు.
(రోజీ అక్కయ్య విశేష స్మృతిని పంపారు):- ఎవరెవరైతే విశేష స్మృతిని పంపారో వారందరికీ ప్రత్యేకమైన-ప్రత్యేకమైన- ప్రత్యేకమైన స్మృతి. ఇకపోతే మానేసర్‌లో కూడా బాగా కష్టపడుతున్నారు. ఢిల్లీవారు జల్వా చూపిస్తారు. చూపిస్తారు కదా జల్వా? సేవకు క్రొత్త దృశ్యాన్ని చూపిస్తారు. మంచిగా కష్టపడుతున్నారు మరియు మనసుతో కష్టపడుతున్నారు. ఎవరైతే ఇంజినీర్ నిమిత్తంగా ఉన్నారో, ఇప్పుడు తయారు చేస్తున్నారో, వారి ధైర్యానికి బాప్‌దాదా కూడా బలిహారం అవుతున్నారు. కనిపించడం లేదు కానీ చూపిస్తారు, ఇది కూడా ధైర్యమే కదా. మరి బాప్‌దాదా ఏదైతే ఢిల్లీకి బహుమతిని ఇచ్చారో, ఆ బహుమతికి సహయోగాన్ని ఇస్తున్నారు, ఇందుకోసం చాలా-చాలా అభినందనలు. మీ అందరి ఢిల్లీ కదా. కేవలం ఢిల్లీవారి ఢిల్లీ మాత్రమే కాదు, మీ అందరి ఢిల్లీ. రాజ్యమైతే చేయాలి కదా. ఢిల్లీలో రాజ్యం చేస్తారా లేక ఫారెన్‌లో రాజ్యం చేస్తారా, ఫారెనర్లు?
(ఇప్పుడు సోనీపత్ కార్యాన్ని ప్రారంభించ వలసి ఉంది) అంతా అయిపోతుంది. అన్నింటిలో సఫలత ఉంది. (హైదరాబాద్ భూమి కూడా ఫైనల్ అయిపోయింది) కొద్దిగా అయితే భూమి విషయంలో గందరగోళం జరుగుతుంది, గందరగోళం కూడా బ్రాహ్మణులకున్న వరదానం కానీ సఫలత కూడా కలిసే ఉంటుంది. గందరగోళంతో పాటు, సఫలత కూడా వరదానంగా ఉంది కనుక కొద్దిగా సమయం పడుతుంది. జరిగేదే ఉంది. హైదరాబాద్‌కు ఎవరైతే నిమిత్తమయ్యారో, చీఫ్ మినిస్టర్ లేక ఇతర ఆపీసర్లు, వరందరికీ స్మృతిని పంపండి, టోలీ పంపండి. మంచి ధైర్యాన్ని ఉంచారు. ఇప్పుడైతే అందరిలో ధైర్యము వచ్చేసింది. చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరూ ధైర్యంగా చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు. ఎక్కడైతే తయారవుతుందో, బాప్‌దాదా, డ్రామా, సర్వ పరివారం యొక్క ఆశీర్వాదాలు ఉండనే ఉన్నాయి. అందుకనే సఫలత ఉండనే ఉంది. (సారనాథ్, ఆగ్రా, లండన్ మొదలైన భవనాలు తయారవుతున్నాయి) ఎక్కడెక్కడైతే తయారవుతున్నాయో, అక్కడ సేవ ముందునుండే తయారుగా ఉంది. మీ అందరి, సర్వుల వ్రేలు (సహకారం) ఇవ్వడం వలన నలువైపుల కార్యం నడుస్తుంది, సఫలత జరుగుతుంది. ఇంకా మున్ముందు మరింత సఫలత వచ్చేదే ఉంది. మరి మీరందరూ తయారు చేస్తున్నారు, అంతేనా లేక అక్కడివారే తయారు చేస్తున్నారా! మీరందరూ కూడా తోడుగా ఉన్నారు కదా! ఎక్కడ ఏదైనా తయారవుతుంది అంటే, మనది తయారవుతుంది. అంతేకానీ, ఢిల్లీలో అవుతుంది, హైదరాబాద్‌లో తయారవుతుంది అని కాదు. మన బాబాది, మనది. మనది అన్న భావన అన్ని వైపుల ఉండాలి. దీనిని అనంతమైన పరివారము అంటాము, అనంతమైన భావన, ఈ భావనకే ఫలితం లభిస్తుంది. (బోరివల్లిలో కూడా భూమి కోసం సంతకాలు జరిగాయి)
మంచిది కదా. సమాచారము విని సంతోషంగా ఉంటుంది కదా. అచ్ఛా.
(చాలామంది మాతలు టెంట్లో ఉన్నారు) టెంట్లో ఉన్నవారికి టెంట్ అయితే లభించింది కదా, క్రింద పరుచుకోవడానికైతే లభించింది కదా. భక్తిలో అయితే మట్టిలో పడుకుంటారు, మీకైతే మట్టి లభించలేదు కదా. కంబళి లభించింది కదా, వారైతే చలిలో పడుకుంటారు. మీరైతే చాలా చాలా మజాలో ఉన్నారు, కేవలం బాబా ఒడిలో నిద్రించండి. టెంట్‌ని చూడకండి, బాబా ఒడిని చూడండి. బాప్‌దాదా ముందుగా టెంట్ వద్దకే వస్తారు ఎందుకంటే టెంట్ వారు ఎంతో సహనం చేసారు కదా. మరి సహనం చేసినందుకు ఫలం లభించింది కదా. మంచిది, టెంట్లో పడుకున్నవారు చేతులెత్తండి. మంచిది, బాప్‌దాదా టెంట్ వారిని వతనంలోకి పిలిచి మసాజ్ చేస్తారు. సంతోషంగా ఉన్నారు. చూడండి, అందరి దృష్టి, దాదీలను అడగండి, అందరికన్నా ఎక్కువగా ఎవరిని గుర్తు చేసారు? టెంట్ వారిని గుర్తు చేసారు కదా. (దాదీలు అందరూ టెంట్ వద్ద తిరిగారు) అందుకే మీరు భాగ్యవంతులు. అచ్ఛా. దేశ-విదేశాల వారందరికీ, ఎవరైతే స్మృతిని పంపారో, బాప్‌దాదా మాకు విశేష రూపంలో స్మృతిని పంపారు అని భావించండి. అచ్ఛా.