Search for a command to run...
20 Feb 2001
‘‘శివజయంతి అనేది వ్రతం తీసుకోవడము మరియు సర్వ సమర్పణ అయ్యేందుకు స్మృతి చిహ్నము’’
20 February 2001 · తెలుగు
ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా తమ పూజ్య శాలిగ్రామాలను కలిసేందుకు వచ్చారు. కలవాలి కూడా మరియు ఈరోజు జరుపుకోవాలి కూడా. మీరందరూ విశ్వ నలువైపుల నుండి బాప్‌దాదా జయంతిని చాలా ఉల్లాస-ఉత్సాహాలతో జరుపుకునేందుకు చేరుకున్నారు. తండ్రి జయంతిని జరపడానికి వచ్చాము అని పిల్లలు అంటారు మరియు పిల్లల జయంతిని జరపడానికి వచ్చాను అని తండ్రి అంటారు. మీరందరూ కూడా మీ జయంతిని, అలౌకిక జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మొత్తము కల్పములో ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన జన్మదినం ఎప్పుడూ ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒక్కటే రోజు ఉండటము, ఇటువంటి జన్మదినాన్ని మొత్తము కల్పములో ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే విశ్వ పరివర్తన కార్యములో శివబాబా, బ్రహ్మా దాదాతోపాటు బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు లేకుండా యజ్ఞము సఫలమవ్వదు, అందుకే తండ్రి మరియు పిల్లల జన్మదినం అనగా జయంతి కలిసి ఉంటుంది. పిల్లలు మనసులోనే బాబాకు శుభాకాంక్షలను ఇస్తున్నారు మరియు బాబా బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికీ అలౌకిక జన్మ సందర్భంగా కోటానుకోట్ల కంటే కూడా ఎక్కువగా మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలతో పాటు శుభాకాంక్షలను ఇస్తున్నారు. కనుక శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు! (అందరూ చేతులు ఊపారు). చాలా మంచిది - ఒక్క చేతితో కొట్టే చప్పట్లు మంచిగా అనిపిస్తాయి, రెండు చేతులతో కొట్టేవి కాదు. చాలా సంతోషంగా ఉంది కదా, అందుకే చేతులు ఆగడం లేదు, ఊగుతూనే ఉంటాయి.
ప్రపంచములో భక్తులు కూడా శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. కానీ వారు ఒక్క రోజు యొక్క జాగరణను మరియు ఒక్క రోజు యొక్క వ్రతాన్ని పాటిస్తారు. పిల్లలైన మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే సంకల్పాన్ని ఒక్క రోజు కోసం చెయ్యలేదు. జాగరణ వారు కూడా చేస్తారు కానీ మీరు ఒక సంగమయుగము యొక్క వజ్రతుల్యమైన జన్మ కొరకు జాగరణ చేసారు మరియు చేస్తూ ఉన్నారు. మేల్కొన్నారు కదా, ఇప్పుడిక మళ్లీ నిద్రపోరు కదా! లేక కొద్దికొద్దిగా నిద్రపోతారా! అచ్ఛా, నిద్రపోకపోయినా కాస్త కునికిపాట్లు పడతారా! ఈ జాగరణ ఎటువంటి జాగరణ అంటే దీని వలన స్వయమూ మేల్కొంటారు, అంతేకాక ఇతరులను కూడా మేల్కొలుపుతారు. జ్ఞానము యొక్క జీవితములో జాగరణ చెయ్యటము అనగా అంధకారము నుండి ప్రకాశములోకి రావటము. ఈ అలౌకిక జాగరణ అందరికీ మంచిగా అనిపిస్తుంది కదా! జన్మ తీసుకున్నప్పటి నుండి, జయంతి జరుపుకున్నప్పటి నుండి ఏ, ఏ వ్రతాన్ని చేపట్టారు? గుర్తుంది కదా! పిల్లలు అంటారు - గుర్తుండటమేమిటి, మా జీవితమే సహజంగా వ్రతానికి చెందినదిగా అయిపోయింది. పవిత్రమైన ఆహారము, పవిత్రమైన వ్యవహారము మరియు పవిత్రమైన ఆలోచనలు, ఇవే జీవితముగా అయ్యాయి. ఒక్క నెల కోసమో, రెండు నెలల కోసమో కాదు, జీవితమే వ్రతాన్ని ఆచరించేదిగా అయిపోయింది. నేచురల్ అయిపోయింది మరియు నేచర్ (స్వభావం) అయిపోయింది. పవిత్రతా స్వభావము తయారైంది కదా! స్వభావము తయారైందా లేక తయారుచేసుకోవాల్సి వస్తుందా? తయారైపోయింది కదా? కేవలము తల ఊపండి, చాలు, తయారైందా? అపవిత్రత అనేది స్వభావము నుండి సమాప్తమైపోయింది మరియు పవిత్రత అనేది జీవితంలో ఇమిడిపోయింది. ఇటువంటి వజ్రతుల్యమైన శివ జయంతిని లేక శాలిగ్రామాల జయంతిని జరుపుకున్నారు. నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని పిల్లలు కూడా మనతోపాటు కలిసి జరుపుకుంటున్నారు. బాబాతోపాటు మరియు మీతోపాటు నలువైపులా ఉన్నవారు కూడా ఎంతో సంతోషపడుతున్నారు అనేది బాప్‌దాదా చూస్తున్నారు.
ఈరోజు విశేషంగా భక్తులు మీ స్మృతిచిహ్నంగా బలిని కూడా ఇస్తారు. మీరందరూ మనసా-వాచా-కర్మణా ద్వారా తండ్రి ముందు సమర్పణ అవుతారు, దీనికి స్మృతిచిహ్నంగానే భక్తులు తమను తాము బలి ఇచ్చుకోకుండా మేకను బలి ఇస్తారు. వారికి వేరే ఇంకేమీ దొరకలేదా, మేకే ఎందుకని దొరికింది? దీని రహస్యము కూడా మీకు తెలుసు, ఎందుకంటే దేహాభిమానానికి అన్నింటికంటే అతి పెద్ద కారణము ‘‘మైపన్’’ (నేను అన్న భావము). ఈ ‘‘మైపన్’’ను అర్పణ చేసినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. మేక కూడా ఏం చేస్తుంది? మే, మే... అంటుంది. ఇది దేహాభిమానానికి చెందిన మైపన్కు గుర్తు. దేహాభిమానానికి చెందిన మైపన్ అనేది చాలా సూక్ష్మమైనది కూడా మరియు రకరకాలుగా కూడా ఉంటుంది. అన్నింటికంటే మొదటి మైపన్ - నేను శరీరమును, ఫలానాను. ఇంకా ముందుకు వెళ్తే సంబంధాలలో చిక్కుకునే విషయములో కూడా రకరకాల మైపన్లు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే పొజిషన్‌కు సంబంధించి కూడా రకరకాల మైపన్లు ఉన్నాయి. అంతకంటే కూడా సూక్ష్మమైనది తమ విశేషతకు చెందిన మైపన్, ఇది పై నుండి కిందకు తీసుకు వచ్చేస్తుంది. విశేషత ప్రతి ఒక్కరిలో ఉంటుంది, స్థూలంగా గానీ లేక సూక్ష్మంగా గానీ ఏ విశేషత లేని మనుష్యాత్మలు ఎవ్వరూ లేరు. జ్ఞానీ జీవితంలో కూడా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరిలో కనీసం ఒక విశేషత అయితే తప్పకుండా ఉంది, కానీ జ్ఞానీ జీవితంలోని విశేషత పరమాత్మ ఇచ్చిన వరము, అది పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ ఇచ్చిన వరమును దేహాభిమానానికి వశమై మైపన్లోకి తీసుకు వచ్చినట్లయితే, నేను ఇటువంటివాడిని... అని అనుకుంటే, ఈ రాయల్ అభిమానము అతి పెద్ద మైపన్. మరి సమర్పణ అయితే అయ్యారు, కానీ ఇంకా ముందు ఏం చూడాలి?
టీచర్లు అందరూ స్వయాన్ని ఏమని చెప్పుకుంటారు? సమర్పణ అయినవారిమి అని కదా! టీచర్లందరూ సమర్పణ అయ్యారా? అచ్ఛా - ప్రవృత్తిలో ఉండేవారు సమర్పణ అయ్యారా? అయ్యారా, లేదా? పాండవులు సమర్పణ అయ్యారా? చాలా మంచిది, అభినందనలు. ఇకముందు ఏం చెయ్యాలి? సమర్పణ అయితే అయ్యారు, చాలా మంచిది. ఇకముందు దీనిని చెక్ చేసుకోవాలి, ఏంటో చెప్పమంటారా? సమర్పణ అయితే అయిపోయాము కదా, ఇప్పుడింకా ఏం చెయ్యాలి అని మీరు అంటారు? ఒకటేమో సమర్పణ మరియు దాని తర్వాతది సర్వ సమర్పణ. సర్వ అన్న మాటలో విశేషంగా అండర్లైన్ చేయవలసినది ఏమిటంటే - మీ మనసు-బుద్ధి-సంస్కారాల సహితంగా సమర్పణ ఎందుకంటే ఎంతగా ముందుకు వెళ్తారో, పురుషార్థములో తీవ్రగతితో అడుగులు వేస్తారో మరియు వేస్తున్నారు కూడా, కానీ వర్తమాన వాయుమండలము అనుసారంగా బ్రాహ్మణ జీవితంలో కూడా మనసు మరియు బుద్ధిపై వ్యర్థము యొక్క ప్రభావము, చెడు యొక్క ప్రభావము కాదు, చెడు అనేది సమాప్తమైపోయింది కానీ వ్యర్థము మరియు నెగెటివ్ యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది, అందుకే యథార్థమైన మరియు సత్యమైన నిర్ణయము తీసుకునే రియలైజేషన్ శక్తి తక్కువైపోతుంది. అవును, ఇది తప్పు, ఇది కరెక్టు కాదు అని వివేకము ద్వారా రియలైజేషన్ అవుతుంది, కానీ ఒకటేమో వివేకము ద్వారా రియలైజ్ అవ్వటము, మరొకటి హృదయము ద్వారా రియలైజ్ అవ్వటము. ఒకవేళ హృదయముతో ఏ విషయాన్ని అయినా రియలైజ్ అయినట్లయితే ప్రపంచము మారినా కానీ స్వయము మారరు. సంస్కారాలనేవి పాత 63 జన్మలవైన కారణంగా అవి నేచురల్ అయిపోయాయి, దీనినే వేరే మాటలలో ఏమంటారంటే - ఇది తప్పు కాదు, ఇది నా నేచర్. పాత సంస్కారాలు కొన్ని తొలగిపోతాయి, కొన్ని అణిగి ఉండి మళ్ళీ బయటకు వస్తాయి. కానీ సర్వ సమర్పణ అంటే అర్థము - మనసులోని భావము మరియు భావన ప్రతి ఆత్మ పట్ల పరివర్తన అవ్వాలి, దీనినే బాప్‌దాదా ఇలా అంటారు - ఎటువంటి ఆత్మ అయినా గానీ, రకరకాలుగా అయితే తప్పకుండా ఉంటారు, ఇది కల్పవృక్షము, వెరైటీ లేకపోతే శోభించదు, కానీ ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభ కామన ఉండాలి. అశుభ భావనను కూడా పరివర్తన చేసి శుభ భావనను పెట్టుకోవాలి మరియు శుభ భావనను ఇవ్వాలి. వీరు తప్పకుండా మారుతారు అని ప్రతి ఆత్మ పట్ల శుభ కామన ఉండాలి. వీరు మారనే మారరు అని అనుకోకూడదు, వీరు మారనే మారరు అని వారి విషయములో జడ్జిగా అయ్యి జడ్జిమెంటును ఇవ్వకండి. ప్రకృతిని కూడా పరివర్తన చేసి సతోగుణిగా తయారు చెయ్యాల్సిందే, తయారు చెయ్యాల్సిందే అని ఛాలెంజ్ చేసారు. తయారవుతుందా, లేదా అన్న ప్రశ్నే లేదు, తయారు చెయ్యాల్సిందే. తయారు చెయ్యాల్సిందే అన్న మాటను అండర్లైన్ చేసారు. మరి ప్రకృతి మారగలిగినప్పుడు ఆత్మ మారలేదా? ఆత్మ అయితే ప్రకృతికి యజమాని. మరి ప్రకృతి మారినప్పుడు యజమాని ఎందుకు మారడు? కనుక వర్తమాన సమయములో ఈ మనసు-బుద్ధి-సంస్కారాలు స్వయానివి పరివర్తన అవ్వాలి మరియు సర్వులవి పరివర్తన అవ్వాలి - ఇదే సేవ.
ఈ సంవత్సరంలో ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతుంటారు. డబల్ సేవ చెయ్యాలి. ఒకటేమో స్వయాన్ని సర్వ సమర్పణ చేయడము మరియు స్వయాన్ని ఎంతగా సమర్పణ చేయండి అంటే మీ వాయుమండలము, మీ వైబ్రేషన్లు, మీ సాంగత్యము, మీ మనసు యొక్క సహయోగము, మీ మనసు నుండి వెలువడే ఆశీర్వాదాలు, ఇతరులను కూడా సహజంగా పరివర్తన చేయడములో సహయోగాన్ని ఇవ్వాలి. ఇంతగా స్వ పరివర్తనను చేసుకోవాలి. సర్వస్వాన్ని సమర్పితం చేయాలి. ఒకటేమో ఈ సేవ, మరొకటి లోక సేవ. రిజల్ట్‌లో ఏం చూసామంటే, నలువైపులా దేశములో, విదేశములలో, గ్రామాలలో బ్రాహ్మణ పిల్లలందరూ ఇప్పటివరకు ఏ సేవలనైతే చేసారో అదంతా బాబాపై ప్రేమతో చేసారు, అందుకు బాప్‌దాదా చాలా-చాలా-చాలా అభినందనలను ఇస్తారు. ఇక ముందు ఏం చెయ్యాలి?
బాప్‌దాదా చూసారు, ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో, బ్రాహ్మణులలో కూడా వృద్ధి జరిగింది, ఇంకా తీవ్రగతితో వృద్ధి జరుగనున్నది. కానీ దానితో పాటు లోక ప్రియమైన సేవ ఏదైతే చేసారో, రకరకాల ప్రాజెక్టుల ద్వారా సేవ జరుగుతూ ఉంది, అది చాలా బాగుంది. ఇప్పుడు భిన్న-భిన్న స్థానాలలో సహయోగి ఆత్మలు చాలా బాగా నిమిత్తంగా అయ్యారు. సహయోగులైతే చాలా మంచిగా ఉన్నారు, సహయోగము యొక్క ఒక అడుగును వేసారు, ఒక అడుగునైతే వేసారు కానీ ఇంకొక అడుగు సహజయోగి, కర్మయోగి. కర్మయోగులుగా లేక సహజయోగులుగా కూడా కొంతమంది తయారయ్యారు, ఇది రెండవ స్థితి. ఇప్పుడు ఇటువంటి ఆత్మలు ప్రాక్టికల్ స్వరూపముతో స్టేజ్‌పై పాత్రను అభినయించాలి. మైక్ స్టేజ్‌పై ఉంటుంది కదా! కనుక మైక్‌గా అయ్యి సేవా స్టేజ్‌పై ప్రత్యక్ష స్వరూపములో కూడా తప్పకుండా వస్తారు. మీరు మైట్ (శక్తి), వారు మైక్. ఎలాగైతే బ్రహ్మా బాబా అవ్యక్త రూపంలో మైట్‌గా ఉన్నారు మరియు పిల్లలైన మిమ్మల్ని మైక్‌గా తయారుచేసారు, అలాగే మీరు మైట్‌గా అవ్వండి మరియు అటువంటి మైక్‌లను తయారు చెయ్యండి. అటువంటివారు ఉన్నారు, చాలా మంచి-మంచివారు, ఆశావాదులు, వేగంగా వెళ్ళేవారు ఉన్నారు. ఇప్పుడు కేవలం అటువంటి మరికొంతమంది ఆత్మలతో కనెక్షన్‌ను పెంచే అవసరము ఉంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని వారు అనుకుంటుంటారు. మీరు మైట్‌గా అయ్యి వారికి ఎటువంటి విధిని వినిపించండంటే వారు లౌకిక వృత్తి మరియు అలౌకిక సేవ, రెండింటి బ్యాలెన్సును పెట్టుకుంటూ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ యొక్క లైన్లోకి రావాలి. ఇటువంటివారు ఉన్నారు, ప్రత్యక్షమవ్వాలి. మీరు కేవలం కనెక్షన్ మరియు కరెంట్‌ను ఇవ్వండి, ఆత్మికత యొక్క కరెంట్, వైబ్రేషన్లు, వాయుమండలము యొక్క కరెంట్ మరియు విధి అందించండి, తద్వారా బ్యాలెన్సు పెట్టుకునే జీవితము చాలా మంచిది మరియు సహజమైనది అని అనిపించేలా చేయడానికి వారు నిమిత్తులవ్వాలి. సరేనా! ఏం చెయ్యాలో విన్నారు కదా!
చిన్న-చిన్న పుష్పగుచ్ఛాలనైతే తయారుచెయ్యండి. పెద్ద పుష్పగుచ్ఛము కాకపోయినా, 5 పుష్పాలతో కూడిన పుష్పగుచ్ఛాన్నయినా, 10 పుష్పాలతో కూడిన పుష్పగుచ్ఛాన్నయినా తీసుకురండి. అన్నివైపుల వారు బాప్‌దాదా దృష్టిలో ఉన్నారు. విన్నారా! పాండవులు విన్నారా? చాలా మంచిది.
డబల్ విదేశీయులు జంప్ చెయ్యటం లేదు, ఎగురుతున్నారు. మరి మొదటి పుష్పగుచ్ఛాన్ని విదేశీయులు తీసుకువస్తారా లేక భారత్ వారు తీసుకువస్తారా? ఎవరు తీసుకువస్తారు? లేక ఇరువురూ ఒకేసారి తీసుకువస్తారా? ఒకవైపు నుండి విదేశాలది, మరొకవైపు నుండి భారత్‌ది, రెండు పుష్పగుచ్ఛాలూ స్టేజ్‌పైకి వస్తాయి. ఎలా అయితే ఈ ఉత్సవాన్ని జరుపుతామో అలా ఆ ఉత్సవాన్ని కూడా జరుపుదాము, రెండు పుష్పగుచ్ఛాల ఉత్సవము, భారత్‌ది కూడా మరియు విదేశాలది కూడా. సరేనా? విదేశీయులు ఏమనుకుంటున్నారు? సరేనా. మరి తర్వాత సీజన్లో తీసుకువస్తారా? తీసుకువస్తారా? భారత్ వారు తీసుకువస్తారా? లౌకిక మరియు అలౌకిక వృత్తులలో బ్యాలెన్స్ పెట్టుకునేవారిని తీసుకురావాలి. మీలా కేవలం బ్రాహ్మణ జీవితము కలిగినవారు కాదు, లౌకిక జీవితము కూడా మరియు అలౌకిక జీవితము కూడా ఉండాలి, అటువంటివారి ప్రభావము ఎక్కువ ఉంటుంది. మీ నుండైతే దృష్టిని తీసుకోవటానికి వస్తారు. అచ్ఛా - జయంతి, ఏమాలోచిస్తున్నారు?
పేర్లు ఆలోచిస్తున్నారా? ఈ నిర్మల, మోహిని పేర్లు ఆలోచిస్తున్నారు కదా! ఇక్కడ పాండవులను చూడండి, భారత్‌లోని పాండవులు ఏమైనా తక్కువా, వారు అల్లా సమానమైనవారు. ఇక్కడ చూడండి, కొంతమంది అయితే ఇక్కడ కూర్చుని ఉన్నారు కూడా. ఈ బ్రాయన్ ఎదురుగా కూర్చుని ఉన్నారు కదా! (ఆస్ట్రేలియాకు చెందిన బ్రాయన్ సోదరునితో) పుష్పగుచ్ఛాన్ని తయారుచెయ్యాలి కదా! చాలా మంచి-మంచివారు ఉన్నారు. మీరు ఏమని పిలుస్తారు, యన్.సి.ఓ. (నేషనల్ కో ఆర్డినేటర్స్), మంచిది. విదేశాలకు చెందిన యన్.సి.ఓ.లు చేతులెత్తండి. యన్.సి.ఓ.లుగా అవ్వటము సహజమైన విషయము కాదు, అద్భుతాలు చెయ్యాల్సి ఉంటుంది. చెయ్యగలరు, అదేమంత పెద్ద విషయము కాదు ఎందుకంటే ధరణి తయారుగా ఉంది. బీజము కూడా వేసి ఉంది, కేవలం పాలన అనే నీటిని అందించాలి. ఇప్పుడు బీజానికి పాలన అనే నీరు కావాలి. అచ్ఛా.
బాప్‌దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు, ప్రతి టర్న్‌లో సగం సంఖ్య క్రొత్తవారు ఉంటున్నారు, మొదటిసారి వచ్చినవారు ఉంటున్నారు. ఇది వృద్ధికి గుర్తే కదా. ఈసారి కూడా మొదటి సారి వచ్చినవారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో ఆ విశేష ఆత్మలకు క్రొత్త జన్మ దినం జరుపుకున్నందుకు శుభాకాంక్షలు. మధుబన్‌లో అయితే జన్మ దినాన్ని ఈరోజే జరుపుకుంటున్నారు, ఈసారి జరుపుకుంటున్నారు. మంచిది.
టీచర్లు కూడా చాలామంది వచ్చారు. టీచర్లకు కూడా అభినందనలు. మీరే కదా సేవ చేసారు! కనుక సేవకు అభినందనలు. అచ్ఛా. గుజరాత్ పరిస్థితి ఎలా ఉంది? (గుజరాత్లో చాలా పెద్ద భూకంపము వచ్చింది) అలజడి గుజరాత్ నుండే ప్రారంభమైంది. ఎక్కువ అలజడి గుజరాత్లో జరిగింది మరియు విదేశాలలో కూడా కొద్దికొద్దిగా మొదలైంది. భయపడటం లేదు కదా! భూమి అయితే కదులుతుంది, కానీ హృదయమైతే కదలటం లేదు కదా! ఎక్కడైతే భూకంపము వచ్చిందో, నష్టము వాటిల్లిందో, అక్కడి నుండి వచ్చినవారు లేచి నిలబడండి. అహ్మదాబాద్వారు కూడా లేచి నిలబడండి. అచ్ఛా. హృదయము కదిలిందా లేక భూమి కదిలిందా? ఏం జరిగింది? హృదయములో కొద్దిగా అలా ఇలా అయ్యిందా? అవ్వలేదా! ధైర్యవంతులు. బాప్‌దాదా చూసారు, పిల్లలు తమ ధైర్యము మరియు బాబా యొక్క ఛత్రఛాయతో తమ రికార్డును మంచిగా పెట్టుకున్నారు. ఎవ్వరూ ఫెయిల్ అవ్వలేదు, అందరూ పాస్ అయ్యారు, కొందరు తక్కువగా, కొందరు ఎక్కువగా పాస్ అయ్యారు. ప్రతి స్థానములో అందరూ నంబరువారుగా అయితే ఉంటారు. కానీ పాస్ అయ్యారు. అభినందనలు. అన్నింటికంటే నాజూకు స్థానము నుండి ఎవరు వచ్చారు? (భుజ్ నుండి ఒకరు, భచావూ నుండి ఒక అక్కయ్య వచ్చారు) అచ్ఛా, భుజ్‌లో మీరు సహస్ర భుజాలు కలిగినవారితో ఉన్నారు. అచ్ఛా, పరీక్షలో పాస్ అయ్యారు. చాలా బాగా చేసారు. ఇకముందు కూడా చలించకూడదు. ఇప్పుడిక జరుగుతూనే ఉంటుంది, భయపడకండి. (ప్రతిరోజూ భూకంపం వస్తుంది). రానివ్వండి. చూడండి, పరివర్తన అయితే అవ్వాలి కదా! కావున ప్రకృతి కూడా తన పని తాను చేస్తుంది కదా! మనుష్యాత్మలు ప్రకృతిని తమోగుణిగా చేసారు కనుక అది తన పని తాను చేస్తుంది కదా. కానీ ప్రతిదీ ఆట. డ్రామా ఆటలో ఇది కూడా ఒక ఆట. ఆటను చూస్తూ మీ అవస్థను కింద-మీద చేసుకోకండి. మాస్టర్ సర్వశక్తిమాన్ ఆత్మల యొక్క స్వ స్థితిపై పర-స్థితి ప్రభావాన్ని చూపకూడదు. ఇంకా ఆత్మలను మానసిక ఆందోళనల నుండి విడిపించేందుకు నిమిత్తులుగా అవ్వండి ఎందుకంటే మనసులోని ఆందోళనను మీరు మెడిటేషన్ ద్వారానే తొలగించగలరు. డాక్టర్లు వారి పనిని వారు చేస్తారు, సైన్స్ వారు వారి పనిని వారు చేస్తారు, గవర్నమెంట్ తన పనిని తను చేస్తుంది. మీ పని మనసులోని ఆందోళనను, టెన్షన్‌ను తొలగించటము. టెన్షన్ ఫ్రీ జీవితాన్ని దానముగా ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. ఏ విధంగా వర్తమాన సమయములో దేశ-విదేశాలవారు సహయోగులుగా అయ్యి సహయోగాన్ని ఇస్తున్నారు కదా! వారు చాలా బాగా చేస్తున్నారు. దీని బట్టి ఏం నిరూపణ అవుతుందంటే, విదేశాలలోనివారైనా లేక మరెవరైనా గానీ, వారికి భారత్ దేశము పట్ల ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరూ తమ-తమ పనినైతే చేస్తున్నారు, మీరు మీ పనిని చేస్తున్నారు. ఎలాగైతే నిప్పు అంటుకున్నప్పుడు నిప్పును ఆర్పేవారు భయపడరు, నిప్పును ఆర్పుతారు, అలాగే మీరందరూ కూడా మనసులోని ఆందోళన అనే నిప్పును ఆర్పేవారు. అచ్ఛా!
మరి గుజరాత్ వారు గట్టిగా ఉన్నారు కదా! వేలాది భుజాల ఛత్రఛాయలో ఉన్నారు. భూకంపం ఎక్కడ వచ్చినా సరే, ఇప్పుడైతే గుజరాత్‌ను చూసి అనుభవజ్ఞులుగా అయిపోయారు కదా, అది ఎక్కడైనా రావచ్చు. చూడండి, ప్రకృతిని ఎవ్వరూ ఆపలేరు. గుజరాత్లో రా, ఆబులో రావద్దు, బాంబేలో రావద్దు అని ఇలా ఆపలేరు. అది స్వతంత్రమైనది. కానీ అందరూ తమ స్వస్థితిని స్థిరంగా, దృఢంగా పెట్టుకోవాలి మరియు బుద్ధిని, మనసు యొక్క లైన్‌ను క్లియర్‌గా ఉంచుకోవాలి. లైన్ క్లియర్‌గా ఉన్నట్లయితే టచింగ్ లభిస్తుంది. బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - వారిది వైర్లెస్, మీది వైస్లెస్ (నిర్వికారి) బుద్ధి. ఏం చెయ్యాలి, ఏమవుతుంది అన్న విషయములో నిర్ణయం స్పష్టంగా మరియు శీఘ్రంగా ఉంటుంది. బయటకు వెళ్ళాలా, లోపల కూర్చోవాలా, తలుపు దగ్గర కూర్చోవాలా, మేడపై కూర్చోవాలా అని ఇలా ఆలోచిస్తూ ఉండకూడదు. ఎక్కడైతే రక్షణ ఉంటుందో మీ కాళ్ళు అక్కడికే వెళ్తాయి. మరియు ఒకవేళ చాలా భయపడితే, నిజానికైతే భయపడకూడదు, కానీ చాలా భయపడితే, భయమనిపిస్తే ఆశ్రయ స్థానమైన మధుబన్ ఇల్లు మీదే. భయపడవద్దు. ఇప్పుడైతే ఏమీ జరగలేదు, ఇప్పుడింకా అంతా జరిగేది ఉంది, భయపడవద్దు, ఇది ఆట. పరివర్తన అవ్వాలి కదా. వినాశనము కాదు, పరివర్తన అవ్వాలి. అందరిలోనూ వైరాగ్య వృత్తి ఉత్పన్నమవ్వాలి. దయాహృదయులుగా అయ్యి సర్వ శక్తుల ద్వారా సకాష్ను ఇచ్చి దయ చూపించండి. అర్థమైందా! అచ్ఛా.
సేవ టర్న్ – ఈస్టర్న్, నేపాల్, తమిళనాడు వారిది:- తమిళనాడు వారు లేవండి. అందరూ పట్టాలు వేసుకుని నిల్చున్నారు. అచ్ఛా, హాల్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నారా! సేవను బాగా చేసారు మరియు సేవకు ఫలితంగా సంతోషము లభించింది మరియు వర్తమానము మరియు భవిష్యత్తు కోసం బలం కూడా లభించింది. అంటే సేవా బలం కూడా లభించింది మరియు ఫలం కూడా లభించింది. అంతే కదా! చాలా బాగా సేవ చేసారు, అభినందనలు. నేపాల్ వారు లేవండి. నేపాల్ వారు ఏ సేవను చేసారు? (కూరగాయలు కట్ చేయడము, ధాన్యం శుభ్రం చేయడము) కష్టమైన పని చేసారు. చూడండి, ఒకవేళ కూరగాయలు కట్ చేయకపోతే అందరూ ఏమి తింటారు! అందుకే చాలా మంచి సేవ చేసారు అంటున్నాము మరియు సేవ చేసినందుకు ఇంతమంది బ్రాహ్మణ ఆత్మల ఆశీర్వాదాలు లభించాయి. ఆశీర్వాదాలు జమ అయ్యాయి. అందరూ మనసుతో సేవ చేసారు, ఈ రికార్డు అందరిదీ బాగుంది. అచ్ఛా, అభినందనలు.
ఈస్టర్న్ - బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం... బీహార్ వారు లేవండి. బీహార్ వారు ఏ డ్యూటీ చేసారు? (సెక్యూరిటీ) మీ సెక్యూరిటీని కూడా చేసుకున్నారు కదా! మీ స్వ స్థితి యొక్క సెక్యూరిటీ మరియు శాంతివన్ యొక్క సెక్యూరిటీ కూడా. చాలా బాగా చేసారు. చూడండి, అందరి ముఖాలు ఎంతో హర్షితమవుతున్నాయి ఎందుకంటే సేవ యొక్క తేజస్సు ముఖంలోకి వచ్చేసింది. చాలా బాగుంది. ఒరిస్సా వారు కూడా లేవండి – అందరికంటే ఎక్కువ ఒరిస్సా వారున్నారు. ఒరిస్సా వారు ఏమి చేసారు? (వసతి, రోటీ, నీరు, టీ, భోజనం వడ్డించడము) ఒరిస్సా వారు చూడండి, ఎంతో బాగా చేసారు, చాలా బాగుంది. సంఖ్య ఎక్కువ ఉన్న కారణంగా అందాన్ని పెంచారు. సంతోషం కలిగింది కదా. సేవ చేసినందుకు ఎంత సంతోషం కలిగింది? చాలా కలిగింది! అస్సాం వారు లేవండి – అస్సాంలో శక్తి సైన్యం ఎక్కువ ఉన్నారు. ఏ డ్యూటీ చేసారు? (ట్రాన్స్పోర్ట్, వి.ఐ.పి భోజనము మొదలైనవి) అచ్ఛా, అందరినీ క్షేమంగా చేర్చారా? ట్రైన్ నుండి తీసుకువచ్చారు మరియు ట్రైన్ వద్దకు చేర్చారు, ఇబ్బంది లేకుండా చేర్చారు. మంచిగా చేసారు. అస్సాం అంటే విశేషమైన ఆసామి (పెద్ద మనిషి) అని బాప్‌దాదా అంటారు. అస్సాం కాదు, ఆసాములు. చాలా బాగుంది. అభినందనలు. బెంగాల్ – బెంగాల్ వారు ఏ డ్యూటీ చేసారు? (శుభ్రపరచడము, దాదీ గారితో కలిపించడము, చాకలి సేవ మొదలైనవి) ఒకవైపు శుభ్రపరచడము మరియు మరోవైపు కలిపించడము, రెండింటి కలియిక బాగుంది. శుభ్రం చేయడము కూడా చాలా అవసరము మరియు కలిపించడము కూడా చాలా అవసరము. చూడండి, మన ఇల్లు అని భావించి డ్యూటీ చేసారు, అందుకే సఫలత, సఫలత, సఫలత. సఫలత పిల్లల జన్మసిద్ధ అధికారము. మరి సఫలత లభించింది కదా. చాలా మంచిది.
అచ్ఛా, ఇప్పుడు ఫారెన్ యొక్క కుమారుల గ్రూప్ చాలా బాగా భట్టీ చేసారు. చాలా బాగా అనిపించింది. కుమార్ కమాల్ చేస్తారు. కుమారులు ఏమి కావాలంటే అది చేయగలరు. చేస్తున్నారు మరియు ఇకముందు కూడా చేస్తారు. చేయాలి కదా! అందరూ తెలివైనవారే! అందరూ ధైర్యవంతులుగా ఉన్నారు అని బాప్‌దాదాకు ముఖాలు చూసి తెలుస్తుంది. ధైర్యానికి అభినందనలు, చాలా మంచిది. బాప్‌దాదా చూసేసారు. మమ్మల్ని ఎవ్వరూ చూడటం లేదు అని ఇక మీదట ఫిర్యాదు ఉండదు కదా! ఒక్కొక్కరినీ చూసాము. మంచిగా శ్రమ చేసారు.
అచ్ఛా - బాప్‌దాదా చూసారు, వినడం కాదు, చూసారు – ఈసారి డబల్ విదేశీయులు సైలెన్స్ యొక్క మంచి మంచి అనుభూతులను చేసుకున్నారు. అందరిదీ వినలేము, కానీ విన్నాము. మంచి ఉల్లాస-ఉత్సాహాలతో ప్రోగ్రామ్‌ను చేసారు, ఇకముందు కూడా మీ మీ దేశాలకు వెళ్ళి ఈ సైలెన్స్ యొక్క అనుభూతిని మధ్య-మధ్యలో చేస్తూ ఉండండి. ఎంత సమయం వీలైతే అంత కేటాయించండి ఎందుకంటే సైలెన్స్ యొక్క ప్రభావం సేవపై కూడా పడుతుంది. మరి మంచి ప్రోగ్రామ్ చేసారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ముందుకు కూడా వెళ్తూ ఉండండి. ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా.
ఇప్పుడు ఒక్క సెకండులో మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రము చెయ్యగలరా? స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి. ఇప్పుడు ఒక్క సెకండు కోసం మనసు మరియు బుద్ధిని పూర్తిగా ఏకాగ్రము చేసి బిందువుగా అయ్యి, బిందువులో ఇమిడిపోండి. అచ్ఛా. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, నలువైపులా ఉన్న సదా దృఢ సంకల్పమనే వ్రతాన్ని పెట్టుకునే అచంచల ఆత్మలకు, నలువైపులా ఉన్న ధైర్యము మరియు ఉల్లాసములతో స్వ సేవను మరియు లోక కళ్యాణ సేవను చేసే మహాన్ సేవాధారి ఆత్మలకు, నేటి శివజయంతికి, వజ్రతుల్య జయంతికి, అతీతమైన మరియు ప్రియమైన జయంతికి శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలతోపాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా – అందరి కార్డులు, ఉత్తరాలు చాలా మంచి-మంచివి వచ్చాయి. బాప్‌దాదా చూస్తున్నారు, ఇక్కడ కూడా పెట్టి ఉన్నాయి. డబల్ విదేశీయులు మనసుతో తమ పురుషార్థం గురించి వ్రాసిన ఉత్తరాలు అన్నీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. అందరి ఉత్తరాలు మరియు భిన్న-భిన్న అలంకరణలతో చాలా సుందరమైన మనసు యొక్క ఆలోచనలు ఉన్న ఉల్లాస-ఉత్సాహాల కార్డులు అందాయి. అందుకని దూరంగా కూర్చుని ఉన్నవారిని అందరికంటే సమీపంగా, ఎదురుగా చూస్తూ ప్రియస్మృతులను మరియు అభినందనలను ఇస్తున్నాము. అచ్ఛా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు మరియు వారి ధర్మపత్నితో బాప్‌దాదా కలయిక:-
మీరు గాడ్లీ ఫ్యామిలీ (ఈశ్వరీయ పరివారం)లోకి వచ్చి చాలా మంచి పని చేసారు. ఇది గాడ్లీ ఫ్యామిలీ కదా. మీరు ఫ్యామిలీ మెంబరే కదా (కుటుంబ సభ్యులు) లేక బయటి వారా? ఏమిటి? ఫ్యామిలీ మెంబర్? మీరు గెస్ట్(అతిథి) కాదు, మీరు గెస్టా? హోస్ట్ (ఆతిథ్యం ఇచ్చేవారు) మీరు. గెస్ట్ కాదు. ఇది మీ ఇల్లే ఎందుకంటే ఈ ఇల్లు పరమాత్ముని ఇల్లు అంటే ఇది అందరి ఇల్లు. బాప్‌దాదాకు సంతోషంగా ఉంది ఎందుకంటే బచ్చాలో ఒక విశేషత ఉంది. ఆ విశేషత – ధైర్యము. ఏ కార్యము చేసినాగానీ ధైర్యముతో చేస్తారు. ధైర్యము కారణంగా స్వతహాగా సహాయం లభిస్తుంది. ధైర్యమును ఎప్పుడూ విడిచిపెట్టకండి. ధైర్యము పరమాత్మ సహాయానికి పాత్రునిగా చేస్తుంది. (శ్రీమతి నాయుడుగారితో) వీరు కూడా ధైర్యము కలిగినవారు, తక్కువేమీ కాదు. అందుకనే కొద్దిపాటి గొడవలు జరిగినాగానీ సఫలత ఎందుకని లభిస్తుంది? దృఢత యొక్క తాళం చెవి మీ వద్ద ఉంది. ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంది. ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నే లేదు, కాకపోతే వాయుమండలం అనుసారంగా కొద్దిగా విషయాలైతే వస్తాయి. కానీ ఆ విషయాలను ధైర్యముతో సైడ్సీన్లుగా భావించి నడుచుకోండి. మంచిగా పాత్రను చేసారు. మీ రాష్ట్రంపై ప్రేమ బాగుంది. వీరు మీ సహచరిణి. సహచరునిగా ఉన్నారు కదా! తోడు నిలుస్తారు కదా! వీరంతా ఎవరు? (అసిస్టెంట్ మరియు సెక్యూరిటీ). చాలా మంచిది.
ఎంతోమంది భక్తులకు భక్తి దారిని చూపించారు కదా, దీని ఫలం కూడా లభిస్తుంది ఎందుకంటే మంచి కార్యాన్ని చేసారు, చెడు కార్యము కాదు, మరి మంచి కార్యానికి ఫలితంగా సంతోషం, తేలికతనము లభిస్తాయి. మంచిది. వాహ్! అసిస్టెంట్ అయితే చాలా నమ్మకస్థునిగా ఉంటారు, మంచిది. చూడండి, అసిస్టెంట్ ఒకవేళ సహయోగిగా లేకపోతే కార్యం జరగదు. కావున సహయోగం చేసే అసిస్టెంట్లదే బలిహారము. వచ్చినవారందరూ కూడా.
అచ్ఛా, మీరు బి.కేనా? చూడండి, జగత్తును రచించినది ఎవరు? సృష్టిని రచించినది బ్రహ్మా కదా. ఇదైతే నమ్ముతారు కదా. స్థాపన చేసేవారు బ్రహ్మా, పాలన చేసేవారు విష్ణువు మరియు పాత ప్రపంచాన్ని వినాశనం చేసేది శంకరుడు. ముగ్గురి గురించి తెలుసు కదా! మరి మీరు బ్రహ్మా యొక్క రచన కాదా? అందరూ బ్రహ్మా కుమారులు మరియు బ్రహ్మా కుమారీలే. రచయిత బ్రహ్మా అన్నప్పుడు అందరూ బి.కేలే కదా. ఇప్పుడు కేవలం కొంచెం బ్రహ్మా గురించి తెలుసుకోవాలి, అంతే. చాలా బాగా చేసారు. చూడండి, మీరు మైక్‌గా అవ్వడంలో మంచి పాత్రను చేసారు. మైక్ అంటే అర్థం తెలిసింది కదా! ఎవరైతే సేవా స్టేజీపైకి వస్తారో వారిని బాప్‌దాదా మైక్ అంటారు. మీ అసెంబ్లీలో అందరికీ సందేశాన్ని ఇప్పించడము, మీ ఈ బాధ్యతను చాలా బాగా పాలన చేసారు. నమ్మినా నమ్మకపోయినా, నడిచినా నడవకపోయినా కానీ మీరు మీ బాధ్యతను పూర్తి చేసారు. ఈ విధమైన ఉదాహరణ మీరే ముందు చేసారు. అందుకని బాప్‌దాదా సంతోషిస్తున్నారు, మీ తోటివారితో కూడా సంతోషంగా ఉన్నాము. (వీరు అందరికీ మెడిటేషన్ చేయమని ప్రేరణను ఇచ్చారు) ధైర్యము ఉంచారు కదా. (స్వర్ణాంధ్రను తయారు చేయాలన్నది వీరి విజన్) అవును, ఎందుకు అవ్వదు, మొత్తం స్వర్ణముగా అవ్వవలసిందే.
కాల్ ఆఫ్ టైమ్‌కు వచ్చిన అతిథులతో:- మీ అందరికీ ఇది మీ ఇల్లుగా అనిపిస్తుందా? మీ ఇల్లేనా? ఇంత పెద్ద గాడ్లీ ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా? చూసారా? చూడలేదు. ఇంతపెద్ద గాడ్లీ ఫ్యామిలీలోకి చేరుకున్నారు అంటే మీరు చాలా అదృష్టవంతులు. అందరి అనుభవం మంచిగా ఉంది మరియు ఈ అనుభవాన్ని కనెక్షన్ ద్వారా పెంచుతూ ఉండండి. కనెక్షన్ అవసరము కదా. ఎంతగా కనెక్షన్ పెట్టుకుంటారో అంతగా అనుభవం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు మెసెంజర్‌గా అయ్యి వెళ్తున్నారు. మెసెంజర్ కదా! మెసెంజర్? ఏ మెసేజ్ మీకు లభించిందో దానిని ఇతరులకు ఇస్తూ ఉండండి, టెన్షన్ ఫ్రీగా చేయండి. ఈరోజు ప్రపంచంలో టెన్షన్ చాలా ఉంది. మరి మీరు టెన్షన్ ఫ్రీ అనుభవం చేసి ఇతరులతో కూడా చేయించండి. చేయాలి కదా! మంచిది. ఎవరైతే వచ్చారో వారు విశేషమైనవారు. మీలో విశేషత ఉంది. ఇప్పుడు ఆ విశేషతనే కార్యంలో పెడితే మరింత పెరుగుతుంది. ఎలా అయితే బీజములో అన్నీ ఉంటాయి కానీ ధరణిలో పడనంతవరకు అది ఫలాన్ని ఇవ్వదు, అలాగే మీ అందరిలో కూడా విశేషత అనే బీజము ఉంది. ఇప్పుడు దానిని ఉపయోగించండి అప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు. సరేనా! వీరు సేవ చేసారు. మంచి సేవను చేసారు. గ్రూప్‌ను తయారు చేసారు మరియు ప్లాన్ కూడా మంచిగా తయారు చేసారు. అచ్ఛా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా? అచ్ఛా.
65వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా బాప్‌దాదా తమ హస్తాలతో శివ ధ్వజాన్ని ఎగురవేసారు మరియు పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు, క్రొవ్వొత్తులను వెలిగించారు, కేక్ కట్ చేసారు
అందరూ ఈ జెండాను ఎగురవేసారు, చేతులు కొద్దిమందివే ఉన్నాయి కానీ మీ అందరి చేతులు బాబాతో కలిసి ఉన్నాయి. ఎవరైతే వెనుక కూర్చుని ఉన్నారో వారు కూడా అందరితో కలిసి జెండాను ఎగురవేసారు. అందరి ముఖాలలో, అందరి మనసులలో బాబా జెండా ఎగురుతుంది, ఇది ముఖంలో కనిపిస్తుంది. మనసులో అయితే జెండాను ఎగురవేసారు కానీ బట్టతో చేసిన జెండాను కూడా ఎగురవేసారు – అనేక స్థానాలలో. ఇప్పుడు ప్రత్యక్షత జెండాను అతి త్వరగా ఎగుర వేయవలసిందే. ఇప్పుడు అతి త్వరగా పేరును ప్రసిద్ధి చేసే ఈ జెండాను ఎగుర వేయవలసిందే అన్న వ్రతాన్ని, దృఢ ప్రతిజ్ఞను తీసుకోండి. ఇప్పుడు ఈ దుఃఖ ప్రపంచాన్ని ముక్తిధామానికి, జీవన్ముక్తిధామానికి పంపండి. చాలా దుఃఖంలో ఉన్నారు కదా. మరి దయ చూపించండి, ఇప్పుడు దుఃఖం నుండి విడిపించండి. తండ్రి వారసత్వమైన ముక్తిని అందరికీ ఇప్పించండి ఎందుకంటే అందరూ చింతలో ఉన్నారు. మీరు శాన్‌లో (ఉన్నత స్థితిలో) ఉన్నారు, వారు పరేషాన్లో ఉన్నారు. ఎప్పుడూ మనసా సేవకు దూరం కాకండి, సదా సేవను చేస్తూ ఉండండి. వాయుమండలాన్ని వ్యాప్తి చేస్తూ ఉండండి. సుఖదాత పిల్లలు సుఖ వాయుమండలాన్ని వ్యాప్తి చేస్తూ ఉండండి. ఇదే జరుపుకోవడము. మరి శివ రాత్రిని జరుపుకున్నారు కదా! కుర్చీలో కూర్చున్నవారు జరుపుకున్నారా? వెనుక ఉన్నవారు జరుపుకున్నారా? ఇటువైపు వారు జరుపుకున్నారా? గ్యాలరీలోని వారు జరుపుకున్నారా? అందరూ కలిసి జరుపుకున్నారు, అందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.