Search for a command to run...
11 Mar 2002
‘‘విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు - వాటిని విశ్వ సేవలో అర్పణ చెయ్యండి’’
11 March 2002 · తెలుగు
ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మా బాబా మరియు శివ బాబా విశ్వములో నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ భాగ్యవాన్ బ్రాహ్మణ కులానికి చాలా-చాలా కోటాను కోట్ల సార్లు దివ్య అలౌకిక జన్మ యొక్క అభినందనలను ఇస్తున్నారు. దానితో పాటు అతి స్నేహముతో కూడిన, మనస్సులోని ప్రేమతో కూడిన ఆత్మిక పుష్పాలతో జన్మదిన శుభాకాంక్షలను అందిస్తున్నారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క విశేషతను చూస్తూ-చూస్తూ హర్షిస్తున్నారు. హృదయము లోలోపలే పాట పాడుకుంటున్నారు - వాహ్ పిల్లలూ వాహ్! ఈ రోజు అమృతవేళ నుండి అందరి హృదయాలలో ఈ సంతోషపు అలలే కనిపిస్తూ ఉన్నాయి - వాహ్ బాబా మరియు వాహ్ మా యొక్క అలౌకిక జన్మ! బాబా కూడా అమృతవేళ నుండి పిల్లలందరూ వేస్తున్న అభినందనల మాలలను చూస్తూ-చూస్తూ సంతోషిస్తున్నారు. ఈ జన్మదినాన్ని మొత్తము కల్పములో ఈ సంగమయుగములోనే జరుపుకుంటారు. సత్యయుగములో కూడా ఇటువంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఇటువంటి విచిత్ర జన్మదినం అక్కడ కూడా ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మ ఒకే రోజున జరిగింది అన్న విషయాన్ని ఇంతవరకు ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ రోజున పిల్లలైన మీ యొక్క మరియు బాప్‌దాదా యొక్క జన్మ దినాన్ని ఒకే రోజున జరుపుకుంటున్నారు. కనుక వాహ్-వాహ్ అనే పాటను పాడుతున్నారు కదా!
ఈరోజు బాప్‌దాదా అమృతవేళ ఒక మాలను తయారుచేస్తున్నారు. ఏ మాల? అందులో మా పేరు ఉందా, మా పేరు ఉందా... అని మీరు ఆలోచించటానికి 108 యొక్క ఫైనల్ మాలను తయారుచెయ్యటం లేదు. ఆది నుండి, స్థాపనా సమయము నుండి ఇప్పుడు వినాశనము సమీపిస్తున్న ఈ సమయము వరకు ఏ, ఏ పిల్లలు అమర భవ యొక్క వరదానీలుగా ఉన్నారు అన్న వారి మాలను ఈరోజు తయారుచేస్తున్నాము. డ్రామానుసారంగా ఆ ఆత్మలకు ఉన్నతోన్నతమైన భగవంతునితోపాటు సర్వ చరిత్రను చూసే మరియు వినే శ్రేష్ఠ పాత్ర ఉంది, కానీ అటువంటివారు ఎంత కొద్దిమంది ఉన్నారు! మీ అందరి పాత్ర కూడా ఉంది, ఎందుకని? బాప్‌దాదా బ్రాహ్మణ వంశావళిని తయారుచేస్తున్నారు. అందుకే విశ్వము లెక్కలో బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు చాలా-చాలా-చాలా భాగ్యవంతులు, ఎందుకని? కోట్లలో కొద్దిమంది అన్న లైన్లో ఉన్నారు మరియు ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా ఉన్నారు. ఒక వైపు విశ్వములోని కోట్లాదిమంది ఆత్మలు, మరొక వైపు బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ ఒక్కరిగా ఉన్నారు. కావున జన్మదినాన బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరిదీ, కొంతమందిదని కాదు, పిల్లలందరి జన్మపత్రికను చూసి ప్రతి ఒక్కరి విశేషతల మాలలను మెడలో వేస్తూ ఉన్నారు. మీరందరూ, వారు కొత్తవారైనా లేక ఆదిలోనివారైనా లేక మధ్యలోనివారైనా కానీ, మీరు విశేషమైనవారు మరియు విశేషంగా ఉండనే ఉంటారు. మొత్తము కల్పమంతా విశేషంగా ఉంటారు. మొత్తము కల్పమంతా విశ్వములోని సర్వాత్మలకు శ్రేష్ఠ ఆత్మలైన మీ పట్ల మహానతకు సంబంధించిన దృష్టి ఉంటుంది. మరి మీలోని ప్రతి ఒక్కరికీ మీ విశేషతల గురించి తెలుసా? ఒకవేళ తెలుసు అని అనుకుంటే ఒక్క చేతిని ఎత్తండి. చాలా మంచిది. ఆ విశేషతలను ఏం చేస్తారు? విశేషతల గురించి చాలా బాగా తెలుసు మరియు వాటిని చాలా బాగా అంగీకరిస్తారు కానీ ఆ విశేషతలను ఏం చేస్తారు? (సేవలో పెడతాము) వేరే విధంగా అయితే ఉపయోగించరు కదా? ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు. పరమాత్మ ఇచ్చిన కానుకలను సదా విశ్వ సేవలో అర్పణ చెయ్యాలి. విశేషతలను ఒకవేళ నెగెటివ్ రూపంలో ఉపయోగించినట్లయితే అది అభిమానము రూపంగా తయారవుతుంది ఎందుకంటే జ్ఞానములోకి వచ్చిన తరువాత, బ్రాహ్మణ జీవితములోకి వచ్చిన తరువాత బాబా ద్వారా చాలా విశేషతలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే బాబాకు చెందినవారిగా అవ్వటంతో విశేషతల ఖజానాలకు అధికారులుగా అవుతారు. ఒకటి-రెండు విశేషతలు కాదు, చాలా విశేషతలు ఉన్నాయి. స్మృతిచిహ్నములో కూడా మీ విశేషతల వర్ణన ఉంది - 16 కళల సంపన్నులు, అంటే కేవలం 16 అని కాదు, 16 అనగా సంపూర్ణము. సర్వ గుణ సంపన్నము. సంపూర్ణ నిర్వికారీతనము యొక్క వివరణ ఉంది. సంపూర్ణ నిర్వికారి అని అంటాము కానీ సంపూర్ణము అన్న మాటలో చాలా వివరణ ఉంది. మరి విశేషతలైతే బాబా ద్వారా ప్రతి బ్రాహ్మణాత్మకు వారసత్వముగా తప్పకుండా ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చెయ్యండి మరియు వాటిని సేవలో పెట్టండి. ఇది నా విశేషత అని అనుకోకూడదు, ఇది పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ ఇచ్చిన కానుక అని భావించటంతో ఆ విశేషతలో పరమాత్ముని శక్తులు నిండుతాయి. ‘నాది’ అని అనటంతో అభిమానము మరియు అవమానము, రెండింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. ఏ రకమైన అభిమానమైనా కానీ, అది జ్ఞానానికి సంబంధించినదైనా, యోగానికి సంబంధించినదైనా, సేవకు సంబంధించినదైనా, బుద్ధికి సంబంధించినదైనా, ఏదైనా గుణానికి సంబంధించినదైనా, వీటికి సంబంధించి ఏ విషయములో అభిమానం ఉన్నా, వారి గుర్తు ఏమిటంటే - వారు అవమానము చాలా త్వరగా ఫీల్ అవుతారు. కనుక మీరు విశేష ఆత్మలు అనగా పరమాత్మ కానుకకు అధికారులు.
ఈరోజు మీరందరూ బాప్‌దాదా జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు కదా! మరియు బాప్‌దాదా మీ అందరి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మీరైతే కేవలం బాప్‌దాదా జన్మదినాన్ని జరుపుతారు కానీ బాప్‌దాదా మొత్తము బ్రాహ్మణ కులము యొక్క జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. భారత్‌లో దూరంలో కూర్చుని ఉన్నా, విదేశములో మూలలో దూరంగా కూర్చుని ఉన్నా, బ్రాహ్మణ ఆత్మలు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అయిపోయారో, వారందరి జన్మదినాన్ని బాప్‌దాదా కూడా జరుపుతున్నారు, మీరు కూడా జరుపుతున్నారు. అందరిదీ జరుపుతున్నారా లేక కేవలం ఇక్కడ కూర్చుని ఉన్నవారిదే జరుపుతున్నారా? అందరూ గుర్తున్నారు కదా! మా జన్మదినాన్ని కూడా జరుపుతున్నారా లేదా అని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కనుక అందరిదీ జరుపుతున్నాము. అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. జరుపుకోవటము అనగా ఉల్లాస-ఉత్సాహాలలోకి రావటము. మరి - వాహ్, మా అలౌకిక జన్మదినము అని హృదయములో ఉత్సాహము ఉంది కదా!
ఈరోజు అమృతవేళ నుండీ జన్మదినము యొక్క ఉల్లాస-ఉత్సాహాలు అందరిలోనూ చాలా చాలానే ఉన్నాయి కదా! బాప్‌దాదా కార్డులను కూడా చూసారు, మీరు ఈ కళ్ళతో చూస్తారు, బాప్‌దాదా అయితే సూక్ష్మములోనే మీకంటే ముందే చూసేస్తారు. కానీ బాప్‌దాదా చూసారు - అందరూ తమ మనసులోని ఉల్లాసాన్ని చూపించేందుకు ఎంత ఉల్లాస-ఉత్సాహాలను పెట్టుకుంటారు. ఈ రోజుల్లో అయితే ఈ-మెయిల్ చాలా చవక కదా! కనుక అందరూ చాలా ఈ-మెయిల్స్ కూడా పంపిస్తారు. బాప్‌దాదా వద్దకు అన్నీ చేరుకుంటాయి. ఈ-మెయిల్స్ అయినా, కార్డులైనా, ఉత్తరాలైనా, హృదయములోని సంకల్పాలైనా అన్నీ చేరుకుంటాయి. అమృతవేళ నుండి వతనములో ఒకవేళ నలువైపుల నుండి వచ్చిన ఈ కార్డులు, ఉత్తరాలు, ఈ-మెయిల్స్, సంకల్పాలు అన్నింటినీ ఒకచోట చేరిస్తే వాటిని చూస్తూ-చూస్తూ చాలా మజా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ విచిత్రంగా ఉంటుంది. పుట్టిన రోజున భవిష్యత్తు కొరకు సంకల్పము చేస్తారు. ఎలా అయితే పుట్టినరోజు యొక్క నంబరు పెరుగుతుంటుందో, సంవత్సరము పెరుగుతుంటుందో, అలాగే పురుషార్థములో మరియు మీ అమూల్య జీవితములో, మనసులో అనగా సంకల్పాలలో, బుద్ధి యొక్క నిర్ణయ శక్తిలో, వాణిలో, క్షణములో సఫలతా మూర్తులుగా అయ్యే శక్తిలో, సంబంధ-సంపర్కములో ప్రతి సమయము సంబంధ-సంపర్కములోకి వచ్చేవారికి ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభూతి కలగాలి. ఇలా మీ భవిష్య సంవత్సరము కొరకు దృఢ సంకల్పముతో కూడిన వ్రతాన్ని చేపట్టారా? ఎందుకంటే విశేషంగా శివ జయంతినాడు రెండు లక్ష్యాలు బ్రాహ్మణ ఆత్మలలో ఉంటాయి - ఒకటి, స్వయముతో చేసుకునే ప్రతిజ్ఞ గురించి మరియు రెండవది, బాబా యొక్క ప్రత్యక్షతా జెండాను ఎగురవెయ్యడము గురించి, ఈ రెండు విశేష లక్ష్యాలు ఈ రోజు ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి. బాప్‌దాదా మీ అందరూ చేసిన (గతంలో చేసిన) ప్రతిజ్ఞల లెక్కాపత్రాన్ని చూసారు. ప్రతి సంవత్సరము, ప్రతి ఒక్కరూ విధి పూర్వకంగా సంకల్పము ద్వారా, వాణి ద్వారా ప్రతిజ్ఞ చేసారు. చాలా బాగా చేసారు. కానీ ఇప్పుడు ఈ రోజు తరువాత అనగా జన్మదినాన్ని జరుపుకున్న తరువాత ఒక మాటను విశేషంగా అండర్లైన్ చెయ్యండి. అది కామన్ మాటే, కొత్తదేమీ కాదు. ఆ మాట ఏమిటంటే - నిరంతర దృఢత. ఒక్కోసారి దృఢత ఉండటము మరియు ఒక్కోసారి దృఢతలో కూడా నిర్లక్ష్యము ఉండటము, ఇలా ఉండకూడదు. ఒకవేళ నిరంతర దృఢత ఉన్నట్లయితే దానికి గుర్తు ఏమిటంటే - నిరంతరము ప్రతి సంకల్పము, మాట, కర్మ ద్వారా, స్వయములో, సేవలో మరియు సంబంధములో 100 శాతము సఫలత ఉండటము. ఎప్పటివరకైతే ఈ అన్ని విషయాలలో బ్రాహ్మణులలో సదా సఫలత తక్కువగా ఉంటుందో, అప్పటివరకు ప్రత్యక్షత డ్రామానుసారంగా ఆగి ఉంటుంది. సఫలత ప్రత్యక్షతకు ఆధారము. ప్రతి మాటా సఫలతా పూర్వకంగా ఉండాలి, ప్రతి సంకల్పము సఫలతా పూర్వకంగా ఉండాలి, అందుకే ఈ రోజుల్లోని స్మృతిచిహ్నములో కూడా గురువుగా పిలవబడేవారి విషయములో సత్య వచన మహరాజ్ అని అంటారు. వారు అబద్ధాలు చెప్తున్నా కూడా భక్తులు వారి మాటలను సత్య వచనములు అనే అంటారు. మరి ఇది మీ వచనముకు ఉన్న గాయనము. మహారాజులుగా, మహానులుగా అయితే మీరే అవుతారు కదా! అందుకే సత్య వచన మహారాజు అనగా మహానాత్మలు. నా భావము అది కాదు కానీ మాట్లాడేసాను, అలా వచ్చేసింది అని ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. భావము లేకుండా, భావన లేకుండా మాట అలా రాదు, అలా అంటున్నారంటే అది తప్పించుకోవటము. ఒక్కోసారి, అలా వచ్చేసింది అని అంటారు, అలా ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకు, అది అలా వచ్చేయటానికి కంట్రోలింగ్ పవర్ లేదా? అలా అయిపోయింది అని అంటే మీరు రాజులు కారా? అలా వచ్చేసింది, అలా అయిపోయింది అని అంటే ఏవో కర్మేంద్రియాలకు వశీభూతులైపోయారు కదా!
కనుక ఈ సంవత్సరములో శుభాకాంక్షలతోపాటు నిరంతరము ప్రతి విషయములో దృఢత అన్నదానిని అండర్లైన్ చెయ్యండి. ఈ రోజు పుట్టినరోజు కనుక బాప్‌దాదా ఈ రోజు వినిపించరు, కానీ అందరి చార్టు నుండి బాప్‌దాదా ఒక విషయాన్ని నోట్ చేసారు, కానీ దానిని చివరి టర్న్‌లో వినిపిస్తారు. ఈ రోజు అయితే జన్మదినాన్ని జరుపుకోవాలి, వినిపించరు. 15 రోజుల తర్వాత వినిపిస్తారు. (బాప్‌దాదా వినిపించినట్లయితే 15 రోజులలో అందరూ బాగైపోతారు అని పిల్లలు చెప్పారు) అచ్ఛా, అయితే 15 రోజులలో కరెక్షన్ అయిపోతుంది అని ముందు చెప్పండి, అప్పుడు వినిపించినా బాగుంటుంది. ఒకవేళ 15 రోజులలో పరివర్తన అయిపోతే ఇక బాప్‌దాదా ఏం చేస్తారో మీకు తెలియదు! మరి వినిపించమంటారా? మరి 15 రోజులలో పరివర్తన జరిగిపోతుందా? సంకల్పము చేస్తారా? అచ్ఛా, పాండవులు చేస్తారా? వినిపించమంటారా? వినటమైతే సహజమే, చేస్తారా? చెయ్యాల్సే ఉంటుంది. (బాప్‌దాదా వెనుక ఉన్నవారిని, మాతలను, టీచర్లను, డబల్ విదేశీయులను అందరినీ అడిగారు, అందరూ చేతులు ఊపారు) చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు.
డబల్ విదేశీయులవి మూడు గ్రూపులు ఉన్నాయి కదా? (అంతర్ముఖి గ్రూప్, మస్తానా గ్రూప్, శక్తి గ్రూప్)
అచ్ఛా, అంతర్ముఖి గ్రూప్ వారు చేతులెత్తండి. అంతర్ముఖిలో కొద్దిమందే ఉన్నారు. రెండవ గ్రూప్ మస్తానా, అచ్ఛా, మస్తానా గ్రూప్ వారు లేచి నిలబడండి. సదా మస్త్‌గా ఉండేవారు కదా! మస్తానా అంటే అర్థమేమిటి? సదా మస్త్‌గా ఉండేవారు కదా! మూడవ గ్రూప్ - శక్తి. శక్తి గ్రూప్ శక్తిశాలురు కదా! పేర్లు అయితే చాలా మంచివి పెట్టుకున్నారు. చూడండి, మొదట్లో మీ భట్టీ ఉన్నప్పుడు మీ గ్రూపుల పేర్లు ఏముండేవి? (డివైన్ యూనిటీ, మనోహర్ పార్టీ, సుప్రీమ్ పార్టీ) పేర్లు అయితే సుందరముగా ఉన్నాయి కదా? అలాగే ఈ గ్రూపులు కూడా మంచిగా తయారయ్యాయి. పేరు గుర్తుంటే పేరుతోపాటు కర్తవ్యము కూడా గుర్తుంటుంది. అచ్ఛా, డబల్ విదేశీయులలోని కుమారులు లేవండి. అచ్ఛా, ఇది కుమారుల గ్రూప్. బాగా చేసారు, బాప్‌దాదా డబల్ విదేశీయుల రిఫ్రెష్మెంట్ సమాచారమును చాలా బాగా విన్నారు. బాప్‌దాదా మనస్ఫూర్తిగా అభినందనలను కూడా ఇస్తున్నారు కానీ అన్ని గ్రూపుల వారికి ఈరోజు ఏదైతే అండర్లైన్ చేసారో, దానిని గుర్తు చేయిస్తున్నారు కూడా.
డబల్ విదేశీ టీచర్లు చాలామంది ఉన్నారు. టీచరుగా అవ్వటము చాలా-చాలా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు ఎందుకంటే బాప్‌దాదా టీచర్లను గురు-భాయిగా (గురువు యొక్క ఆసనముపై కూర్చునేందుకు యోగ్యుడైన శిష్యునిగా) చూస్తారు, ఇంతగా సమాన రూపములో చూస్తారు ఎందుకంటే బాబా ఆసనముపై కూర్చుంటారు, టీచర్లకు ఈ హక్కు లభిస్తుంది. ఏ విధంగా గురువుల ఆసనము ఉంటుంది కదా, అలా ఇది మురళి సింహాసనము, మురళిని ధారణ చేయించటము మరియు మురళిని వినిపించటము చేయాలి. కేవలం వినిపించటము కాదు కానీ మురళిని ధారణ చేయించటము, టీచర్లకు బాప్‌దాదా ఈ గురు-భాయి సింహాసనాన్ని ఇచ్చారు. విదేశాలలోనైతే చాలా త్వరగా సింహాసనాధికారులుగా అయిపోతారు అని చూడడం జరిగింది. బాప్‌దాదా సంతోషిస్తారు. బాధ్యతా కిరీటాన్ని ధరించటము, ధైర్యాన్ని ఉంచడము, ఇది కూడా తక్కువ విషయమేమీ కాదు, కానీ గురు-భాయి అనగా బాబా సమానము. మామూలుగా అయితే అందరూ బాబా సమానంగా అవ్వాల్సిందే, అయినా కూడా టీచర్లకు విశేషంగా బాధ్యతా కిరీటము ఉంది. బాప్‌దాదాకు కూడా టీచర్ల సంగఠన చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు యొక్క విశేషమైన మాట ‘‘నిరంతర అటెన్షన్’’.
అచ్ఛా - భారత్ టీచర్లు లేవండి, భారత్‌లోని టీచర్లు కూడా తక్కువేమీ లేరు. మరి విన్నారా, టీచర్లను బాబా ఏ దృష్టితో చూస్తారో. క్లాస్ చేసే ఈ సీట్, మురళిని వినిపించే ఈ సీట్... మీరు చాలా భాగ్యవంతులు. చాలా, చాలా, చాలా అదృష్టవంతులు ఎందుకంటే సాకార రూపములో నిమిత్తులు ఎవరు? అచ్ఛా, దాదీలైతే ఒకరు విదేశాలలో ఉంటారు, ఒకరు మధుబన్‌లో ఉంటారు, కానీ ప్రతి స్థానములో సాకార రూపములో నిమిత్త టీచర్లు ఉన్నారు లేక నిమిత్త పాండవులు కూడా ఉన్నారు. కేవలం టీచర్లే (అక్కయ్యలే) ఉన్నారని కాదు, పాండవులు కూడా ఉన్నారు, వారిని పెద్ద అన్నయ్యలు అని అంటారు కదా. పాండవులు ఉండటము తప్పకుండా అవసరము. శక్తులు మరియు పాండవులు, ఈ ఇరువురి వలనే ఆది నుండి కార్యము నడిచింది. కొద్దిమంది పాండవులే ఉండేవారు, కానీ విశ్వ కిశోర్ అయితే ఉండేవారు కదా. ఆనంద కిశోర్, విశ్వ కిశోర్, వీరు మొదట్లో ఉండేవారు. కనుక పాండవుల తోడు అయితే ఉంది కదా. కానీ మెజారిటీ టీచర్లు ఎక్కువ ఉన్నారు, వారు నిమిత్తులు అవుతారు. మీరు వెన్నెముక వంటివారు, టీచర్లకు కూడా వెన్నెముక వంటివారు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ విదేశాలలోని విశేషత ఏమిటంటే పాండవులు కూడా టీచర్లుగా అవుతారు, భారత్‌లో పాండవులు టీచర్లుగా తక్కువ అవుతారు. కనుక టీచర్లకు బాప్‌దాదా సదా చెప్తారు - టీచర్ అనగా తమ ఫీచర్స్ ద్వారా బాబాను సాక్షాత్కారము చేయించేవారు, ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్‌ను స్పష్టంగా చూపించేవారు. మరి మీరు అటువంటి టీచర్లే కదా? మిమ్మల్ని చూస్తే బాప్‌దాదా యొక్క పాలన అనుభూతి అవ్వాలి. పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు మీ ముఖం ద్వారా కనిపించాలి, మాటల ద్వారా కనిపించాలి. అంతేకానీ ఫలానా టీచరు చెప్పారు అని కాదు, బాప్‌దాదా టీచర్ల ఫీచర్స్ ద్వారా అనుభవం చేయించారు అని అనిపించాలి. బాబాతో ప్రతి ఒక్కరి కనెక్షన్‌ను జోడించటము - ఇదే టీచర్ల కర్తవ్యము. ప్రతి ఒక్కరి హృదయము నుండి ప్రతి సమయము బాబా అని వెలువడాలి.
ఈ గ్రూపులను కూడా మంచిగా తయారుచేసారు ఎందుకంటే పర్సనల్ రిఫ్రెష్మెంట్ దొరకటం వలన అనుభూతి బాగా చేస్తారు. గ్రూపులలో మంచి రిజల్ట్ వెలువడింది కదా! మంచిది!
సేవ ఛాన్స్ యు.పి వారిది:- అచ్ఛా, గోల్డెన్ ఛాన్సలర్లు లేవండి. పాండవులు కూడా ఉన్నారు, శక్తులు కూడా ఉన్నారు. మరి మీ అందరికీ సేవ యొక్క ఈ టైటిల్ లభించింది- గోల్డెన్ ఛాన్సలర్. మరి ఇప్పుడు యు.పి అద్భుతము చేసి చూపిస్తుంది కదా! యు.పిలో బాగా కోలాహలం చేయండి. యు.పిలో పాత-పాతవారు కూడా బాగున్నారు, క్రొత్తవారు కూడా చాలామంది ఉన్నారు. దేశవిదేశాలలో ఉన్న బ్రాహ్మణుల దృష్టి యు.పిపై పడేలా ఇప్పుడు ఏదైనా అటువంటి ప్రోగ్రామ్‌ను తయారు చేయండి. యు.పిలో గుర్తు ఉంది – బ్రహ్మా బాబా కూడా చూసారు. బ్రహ్మా బీజాన్ని వేసారు, ఆ స్థానంలో సాకర రూపంలో ప్రయత్నం చేసారు, భూమి తీసుకుని ఏమైనా చేయాలనుకున్నారు, కానీ ఇప్పటి వరకు అది అవ్వలేదు. అద్భుతము చేయండి, అయిపోతుంది. (బనారస్ వారు మ్యూజియం తయారు చేస్తున్నారు, ఆగ్రా వారు కూడా తయారు చేస్తున్నారు). ఎంతమంది వారసులు వెలువడుతారో, ఎంతమంది సహయోగులు వెలువడుతారో, ఎంతమంది రెగ్యులర్ స్టూడెంట్లు వెలువడుతారో చూద్దాము. రిజల్ట్ బాగుంది, ఇకపోతే బాగుంది, మంచిగా ధైర్యాన్ని ఉంచారు, సహాయం లభిస్తూ ఉంటుంది. మరి యు.పి వారు ఏ అద్భుతాన్ని చేస్తారు? అద్భుతం చేయాలా వద్దా? చేయాలి కదా, మరి యు.పి వారు ఏ అద్భుతాన్ని చేస్తారో చూస్తాము. అందరూ, యు.పికి వెళ్దాము, యు.పికి వెళ్దాము అని అనాలి. ఆ వినాశకారులు వినాశనము చేస్తారు, స్థాపన చేసేవారు స్థాపన చేస్తారు. మరి చూస్తాము, ప్లాన్ తయారు చేయండి. సరేనా! ప్లాన్ తయారవుతుంది కదా!
మీడియా వారి మీటింగ్ ఉంది:- మీడియా వారు ఏమి చేస్తున్నారు? మీడియా అంటేనే అర్థము ప్రతి విషయాన్ని ప్రత్యక్షం చేసేవారు. మరి మీడియా వారు ప్రత్యక్షత కోసం ఏ ప్లాన్‌ను తయారు చేసారు? ఈ సంవత్సరం ప్రత్యక్షత జరుగుతుందా? మీడియా వారు ఛానెల్ పెట్టినా లేక ఇంకేదైనా చేసినాగానీ ఇదే, ఇదే, ఇదే... అన్నది రావాలి. ఇప్పటివరకు ఇదే, ఇదే... అన్నది రాలేదు. వీరు కూడా మంచివారు... చాలా మంచివారు వీరే అన్నది వార్తా పత్రికల్లో రావాలి. ఛానెల్లో రావాలి, అప్పుడు ఇది మీడియా అని బాప్‌దాదా అంటారు. అయినా కానీ పెరుగుతున్నారు, ఎంతైతే చేసారో అంతకు వృద్ధి జరిగింది, కానీ లక్ష్యమైతే అది ఉంది కదా? బాగా కష్టపడుతున్నారు, పేరైతే వచ్చింది కానీ ఇప్పటికీ పని అయితే జరగలేదు. తప్పకుండా జరిగిపోతుంది. అచ్ఛా.
చాలా పెద్ద సింధీ గ్రూప్ వచ్చింది:- చాలా మంచి పని చేసారు. మీ ఇంటికి వచ్చారు కదా? మీ ఇంటికి వచ్చాము అని భావిస్తున్నారా లేక బ్రహ్మాకుమారీల వద్దకు వచ్చాము అని భావిస్తున్నారా? ఇది మీ ఇల్లు ఎందుకంటే సింధ్ నుండి స్థాపన జరిగింది, మరి స్థాపనకు నిమిత్తమైన స్థానముతో మీకు సంబంధం ఉంది. అందుకే వచ్చారు, చాలా మంచిది, వచ్చారు, ఇలాగే వస్తూ ఉండండి. మీ సంబంధ-సంపర్కంలో ఉన్నవారిని మేలుకొల్పుతూ ఉండండి. సేవను బాగా చేస్తారు, ఇప్పటి వరకు కూడా. ఒకరిద్దరికి పరిచయాన్ని ఇస్తూ ఉంటారు కానీ సేవను పెంచండి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మరోసారి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మందిని తీసుకురండి. సింధీ వారిని చూసి అందరికీ సంతోషంగా ఉంటుంది – ఎక్కడ స్థాపన జరిగిందో ఆ సింధీ వారు వీరు అని సంతోషిస్తారు. మంచి పని చేసారు. వృద్ధి జరుగుతుంది కదా? వృద్ధి బాగుంది. చాలా బాగా చేసారు.
అచ్ఛా, డబల్ విదేశీయులకైతే అభినందనలు లభించాయి. (50 దేశాల నుండి 1000 మంది డబల్ విదేశీయులు వచ్చారు). డబల్ విదేశీయులు విశ్వ కళ్యాణము చేయాలన్న ధైర్యము ఏదైతే ఉంచారో, అందుకు బాప్‌దాదా విశేషంగా డబల్ విదేశీ పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. ఏ మూలను కూడా విడిచిపెట్టేవారు కాదు. ధైర్యము ఉంచి సేవలో ముందుకు వెళ్తూ ఉంటారు. బాప్‌దాదా ఏమి చూసారంటే, రిజల్ట్‌లో, కాల్ ఆఫ్ టైమ్, లివింగ్ వాల్యూస్, పీస్ ఆఫ్ మైండ్... ఏవైతే చేస్తారో అవి మంచిగా చేస్తారు. మంచిది. రిజల్ట్ కూడా బాగుంది మరియు ముందుకు కూడా వెళ్తున్నారు. గ్రామగ్రామాలలో జెండాను ఎగరవేయాలన్న వరదానము భారత్‌కు ఉంది. భారత్‌లో కష్టం కాదు కానీ డబల్ విదేశీయులు ప్రతి దేశంలో పరిస్థితులను కూడా చూడకుండా స్థాపన చేసే పద్ధతి బాగుంది. భారత్ అయితే ఉన్నదే బాబాది, అందుకే వారికి వరదానము ఉండనే ఉంది.
టర్కీ నుండి చాలా మంచి గ్రూప్ వచ్చింది:- అచ్ఛా, టర్కీ వారు లేవండి – చూడండి, మీపై బాబాకు చాలా-చాలా ప్రేమ ఉంది, అందుకే టర్కీకి చేరుకున్నారు కదా! మంచిగా మస్త్‌గా ఉన్నారు. గుప్తము మరియు మస్త్. గుప్తంగా కూడా ఉండాలి మరియు మీ మస్తీలో కూడా ఉండాలి. మీ పాత్రను మంచిగా చేస్తున్నారు. అచ్ఛా. డబల్ విదేశీ టీచర్లు బాగా కష్టపడ్డారు. ఆర్.సి.ఓ గ్రూప్ లేవండి. డబల్ ఫారెన్‌లో ఆర్.సి.ఓ ఎవరున్నారు, మీ అందరికీ తెలియాలి కదా. టైమ్ కూడా ఇచ్చారు మరియు బాగా కష్టపడ్డారు కూడా. అభినందనలు. చాలా బాగా చేసారు. బ్యాక్‌బోన్ అయితే ఉన్నారు (దాదీ జానకి) మీరు కూడా లేవండి, చూడండి, మీపై అందరికీ ప్రేమ ఉంది కదా, అందుకే చప్పట్లు కొట్టారు. మంచిది. (ఎన్.సి.ఓలు కూడా ఉన్నారు) మంచిది, ఎవరైతే ఉన్నారో అందరూ మంచివారే. ఎన్.సి.ఓ, ఆర్.సి.ఓ ఎవరైనా కావచ్చు. సమయం ఇచ్చారు. సమయం ఇస్తే సఫలత కలుగుతుంది. అచ్ఛా.
గుజరాత్ పరిస్థితి ఎలా ఉంది? ధైర్యము మంచిగా ఉంది కదా? భయం లేదు కదా? శక్తులకు ఏ భయము ఉంటుంది? ఇది జరగవలసిందే. కానీ రియల్ ఆగి ఉంది, ఇదైతే రిహార్సల్ మాత్రమే. గాభరా పడటం లేదు కదా! ఏవరైనా గాభరా పడుతున్నారా? లేదు. ప్రశాంతంగా డ్రామాలోని ప్రతి సీన్‌ను చూస్తూ ఉండండి. కేవలం సాక్షి స్థితి నుండి క్రిందకు వచ్చి చూడకండి. సీట్‌పై మంచిగా సెట్ అయ్యి కూర్చోండి.
మధుబన్ వారితో:- అచ్ఛా, మధుబన్ వారు బాగున్నారా? సేవ యొక్క సీజన్ చాలా నడుస్తుంది. మధుబన్ వారు లేవండి. మధుబన్ వారు అందరికన్నా చాలా ప్రియమైనవారు ఎందుకంటే ఎవరైతే సమీపంగా ఉంటారో వారు మనసులో ఉంటారు. బాప్‌దాదా మధుబన్ నివాసి పిల్లలను సదా ఇమర్జ్ చేసుకుని ప్రియస్మృతులను ఇస్తారు ఎందుకంటే ఇంతమంది ఆత్మలకు బాబాతో కలిసే సుఖాన్ని ఇస్తారు. సేవ చేయడము అంటే బాబా సమానంగా సుఖదాయిగా అయ్యి సుఖాన్ని ఇవ్వడము. మధుబన్కు సేవ చేసేందుకు చాలా-చాలా-చాలా పరమాత్మ ఛాన్స్ ఉంది. మధుబన్ వారిపై పరమాత్మ దయ ఉంది, గురుకృప ఉంది. పైన కూర్చుని వింటున్నా, సమ్ముఖంలో ఉన్నాగానీ బాప్‌దాదా మధుబన్ నివాసి సేవాధారి సో బాబా హృదయంలో, సింహాసనంపై కూర్చునే పిల్లలకు చాలా-చాలా సేవకు రిటర్న్‌గా వరదానమును ఇస్తున్నారు – నిర్విరామ భవ (అథక్ భవ). సదా నిర్విరామ భవ యొక్క మీ చిత్రాన్ని అందరికీ చూపించండి. అలాంటివారే కదా! సుఖదాయిగా ఉన్నారు కదా? ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! ఎవరైతే సత్యమైన హృదయం కలిగిన వారున్నారో వారికి ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తాయి. మధుబన్ వారికి ఆశీర్వాదాలు జమ చేసుకునే ఛాన్స్ చాలా బాగుంది. ఎంత కావాలంటే అంత చెయ్యండి. మరి ఆశీర్వాదాల స్టాక్ జమ అవుతుంది కదా? మధుబన్ నివాసులపై బాప్‌దాదాకు స్పెషల్ ప్రేమ ఉంది. వేరుగా కలవరు కానీ మనసుతో సదా కలుస్తూ ఉంటారు. చాలా బాగుంది. సోదరీలు కూడా ఉన్నారు. అచ్ఛా.
గ్లోబల్ హాస్పిటల్ ట్రస్టీలు కూడా వచ్చారు:- గ్లోబల్ హాస్పిటల్‌తో అందరికంటే ఎక్కువ లాభము బ్రాహ్మణులకు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. బ్రాహ్మణులకు సహజ సాధనముగా అయింది. అందుకని బాప్‌దాదా హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేకంగా స్మృతిని ఇస్తున్నారు. అచ్ఛా – ట్రస్టీలు లేవండి. బాగుంది. బాప్‌దాదా ఒక నవ్వు తెప్పించే విషయాన్ని వినిపిస్తారు. కామన్ విషయమే కానీ నవ్వు తెప్పించేది, అందరికన్నా ఎక్కువగా హాస్పిటల్ యొక్క లాభము మధుబన్ వారికి ఉండటాన్ని బాప్‌దాదా చూసారు, ఎందుకు? ఎవరు శరీరం విడిచిపెట్టినా, మధుబన్ వారికి టిఫిన్ ఆగదు, ఇక్కడైతే ప్రతి సీజన్లో 2-4 ఉండనే ఉంటారు. మధుబన్ వారికి లాభము ఉంది కదా, భోజనం ఆగడం లేదు కదా. ఇతర పిల్లలకు కూడా లాభము ఉంది. సోషల్ సేవ లెక్కలో చూస్తే కూడా ఆబూ నివాసుల వృత్తి మారడానికి నిమిత్తం హాస్పిటల్ అయింది. హాస్పిటల్ సేవాధారులు వచ్చారు, లేవండి. సేవకు చాలా-చాలా అభినందనలు. బాగా సేవ చేస్తారు. రోజురోజుకూ అనుభవీగా కూడా అవుతారు. ధైర్యమైతే ఉంచారు కదా? అచ్ఛా, ఇప్పుడైతే బాంబేలో కూడా హాస్పిటల్‌ను తెరవబోతున్నారు. బాగుంది, చూడండి, గ్లోబల్ హాస్పిటల్‌కు మంచి వారసుడు లభించాడు కదా. (భువనేశ్వర్‌లో కూడా ఒక హాస్పిటల్ తెరవడం జరిగింది) అందరికీ మంచిగా అనిపిస్తుందా? చేయి అయితే ఊపండి. టీచర్లకు చెక్ చేయడం సహజమైపోయింది కదా. మంచిది. దేశ-విదేశాలలో ఈ పేరు కూడా చాలా సేవ చేస్తుంది. విదేశంలో జానకి ఫౌండేషన్ ఉంది, మంచిది, ఇది కూడా సేవకు సాధనము. పరస్పరం ఏదైతే కనెక్షన్ పెట్టుకున్నారో అది కూడా బాగుంది. ట్రస్టీలు కూడా మంచి-మంచిగా ఉన్నారు. అచ్ఛా.
నలువైపులా జన్మ ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా అలౌకిక జన్మ యొక్క అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఇటువంటి ఏకనామీ మరియు సర్వ ఖజానాలలో ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అయ్యే పిల్లలకు, సదా ప్రతి వరదానాన్ని మరియు వారసత్వాన్ని జీవితము ద్వారా ప్రత్యక్షము చేయాలన్న ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే పిల్లలకు, అలౌకిక జన్మకు బాప్‌దాదా యొక్క శుభాకాంక్షలతోపాటు ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- దాదీజీ బాప్‌దాదాకు జన్మదినం యొక్క చాలా-చాలా శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు మాలలో మీరందరూ వచ్చారు. మాలను గుర్తు చేసాము కదా! ఆదిలోని స్థాపనా రత్నాలను గుర్తు చేసాము, అందులో మీరు మాలలోని మణులుగా ఉన్నారు. మంచిది, స్థాపనకు కూడా నిమిత్తులుగా అయ్యారు, పాలనకు కూడా నిమిత్తులుగా అయ్యారు, ఇప్పుడు బాబాతో పాటు వెళ్ళేందుకు కూడా నిమిత్తులుగా అవుతారు. ద్వారాన్ని బాప్‌దాదా ఒక్కరే తెరుస్తారా ఏమిటి? (కాదు) మీ కోసం ఆగి ఉన్నారు. మీరు వస్తే ద్వారాన్ని తెరుస్తాము. కానీ సేవను పూర్తి చేయాల్సి ఉంటుంది కదా ఎందుకంటే సాకారములో మిమ్మల్ని నిమిత్తులుగా చేసారు. కనుక సాకారములోని కార్యాన్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది కదా. ఈ రోజుల్లో అందరూ ఎవరిని చూస్తారు? అందరి దృష్టి ఎటువైపు వెళ్తుంది? మీవైపుకే వెళ్తుంది కదా. ఎవరైతే నిమిత్తులుగా అయ్యారో, వారివైపుకే అందరి దృష్టి వెళ్తుంది. నయనాలలోనైతే అందరినీ కూర్చోబెట్టుకున్నారు ఎందుకంటే బాబా దృష్టి తక్కువేమీ కాదు, వారి దృష్టి అనంతమైనది. కనుక అందరూ దృష్టిలో ఉన్నారు. అందరూ కంటి రత్నాలు. చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తున్నారు మరియు అభినయించాల్సిందే. డ్రామాలో బంధించబడి ఉన్నారు. ఆనందం కలుగుతుంది కదా! చాలా మంచిది!
బాప్‌దాదా తమ హస్తాలతో శివ ధ్వజాన్ని ఎగురవేసారు, కేక్ కట్ చేసారు మరియు పిల్లలందరికీ శుభాకాంక్షలను తెలిపారు:-
పిల్లలందిరి హృదయంలో బాబా ప్రత్యక్షతా జెండా ఎగురుతుంది. మీ అందరి హృదయాలలో ఎగురుతున్న జెండా ప్రపంచంలో ఎగురవేయబడుతుంది. అందరి నోటి నుండి ఇదే వెలువడుతుంది – వాహ్ శివ శక్తి పాండవ సైన్యం! బాప్‌దాదాకు అందరి సంతోషకర ముఖాలను చూసి చాలా-చాలా సంతోషంగా ఉంది. అదృష్టవంతులు మరియు సంతోషకర ముఖము కూడా ఉంది మరియు ఇతరులకు కూడా సదా దిల్ఖుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి. అమృతవేళ ఈ మిఠాయిని అందరూ గుర్తుగా తినండి. అప్పుడు రోజంతా ఈ మిఠాయి శక్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. అచ్ఛా. అందరికీ శుభాకాంక్షలు. (అందరి తరఫు నుండి బాప్‌దాదాకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అచ్ఛా!