Search for a command to run...
24 Feb 2002
‘‘బాబాను ప్రత్యక్షం చేసేందుకు స్వయము మరియు ఇతరుల వృత్తిని పాజిటివ్‌గా తయారుచెయ్యండి’’
24 February 2002 · తెలుగు
ఈరోజు విశ్వ కళ్యాణి అయిన బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనసులోని ఉల్లాసాన్ని చూస్తున్నారు కూడా మరియు వింటున్నారు కూడా. అందరి మనసులోనూ లక్ష్యము ఒక్కటే ఉంది - త్వరత్వరగా బాబా సమానంగా అవ్వాలి అని. లక్ష్యాన్ని చూసి, ధైర్యాన్ని చూసి, శ్రేష్ఠ సంకల్పాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. దీనితో పాటు ఇంకా ఏమి చూస్తున్నామంటే - లక్ష్యము అందరిదీ చాలా ఉన్నతోన్నతంగా ఉంది కానీ ప్రత్యక్ష రూపంలో లక్షణాలు నంబరువారుగా ఉన్నాయి. లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండటము అనగా బాబా సమానంగా అవ్వటము. ఎవరైతే సేవా స్టేజ్‌పై నిమిత్తులైన పిల్లలు ఉన్నారో, వారు సదా ఒకటే సంకల్పములో ఉంటారు, అదేమిటంటే - బాబాను ఎలా ప్రత్యక్షము చెయ్యాలి, అది ఎప్పుడు జరుగుతుంది! ఇటువంటి సంకల్పాలు వస్తాయి కదా? బాబా తిరిగి పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ, మీరందరూ సంపన్న, సంపూర్ణ స్వరూపములో స్వయము ఎప్పుడు ప్రత్యక్షమవుతారు? బాబా పిల్లలను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఆ డేట్‌ను కూడా ఫిక్స్ చేసారా? లేదా ఆ డేట్ ఫిక్స్ అయ్యేది లేదా?
డబల్ విదేశీయులు ఏమంటారంటే - ఏ ప్రోగ్రామ్ యొక్క డేట్ అయినా ఒక సంవత్సరం ముందు ఫిక్స్ చేయటం జరుగుతుంది అని, అలా అంటారు కదా! మరి బాబా అడుగుతున్నారు, స్వయాన్ని ప్రత్యక్షం చేసే డేట్ ఫిక్స్ చేసారా? మీటింగులైతే చాలానే చేసారు కదా! చేస్తూనే ఉంటారు. ఈరోజు ఫలానా మీటింగు ఉంది, రేపు ఫలానా మీటింగు ఉంది. ఇప్పుడు కూడా మీటింగు చేసేవారు ఎంతమంది వచ్చారు, మీటింగు చేసే మూడు గ్రూపులవారు ఈరోజు కూడా కూర్చుని ఉన్నారు. ఇదైతే చాలా మంచిది, కానీ ఈ మీటింగ్ యొక్క డేట్ ఏమిటి? ఏదైతే ఆలోచిస్తారో, అవే మాటలు ఉండాలి, అవే కర్మలు ఉండాలి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలు, ఈ మూడూ శ్రేష్ఠ లక్ష్యం అనుసారంగా ఉండాలి. విశ్వ కళ్యాణానికి నిమిత్తులైన ఈ పిల్లలందరూ, సర్వాత్మల కళ్యాణకారులైన పిల్లలందరూ ప్రత్యక్ష రూపంలో స్టేజ్‌పైకి ఎప్పుడు వస్తారు అని బాప్‌దాదా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ గుప్త పురుషార్థములో ఉన్నారు, లగనములో ఉన్నారు. దీనిని కూడా బాప్‌దాదా చూస్తారు. కానీ ఈ విశేష సంకల్పము యొక్క లగనములో ఎప్పుడు మగ్నమవుతారు? లగనమైతే ఉంది కానీ నిరంతరము ఈ సంకల్పమును సంపన్నము చెయ్యడంలో నిమగ్నమై ఉండాలి అనగా నిరంతరము ఈ సంకల్పాన్ని పూర్తి చేసే ప్రాక్టికల్ స్వరూపములో ఉండాలి. ప్రస్తుతం సంకల్పాలు మరియు ప్రత్యక్ష కర్మలలో తేడా ఉంది. జరగాల్సిందే మరియు చెయ్యాల్సింది కూడా పిల్లలే. బాబా అయితే ఎలాగూ వెన్నెముకగా ఉన్నారు.
బాప్‌దాదా చూస్తున్నారు - అన్నింటికన్నా తీవ్రవేగము కల సేవ ఏమిటంటే, ‘‘వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపజేయటము’’. వృత్తి చాలా తీవ్రవేగము కల రాకెట్ కంటే కూడా వేగవంతమైనది. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చెయ్యగలరు. ఎక్కడకు కావాలంటే అక్కడకు, ఎంతమంది ఆత్మల వద్దకు కావాలంటే అంతమంది వద్దకు ఇక్కడ కూర్చుని-కూర్చునే వృత్తి ద్వారా చేరుకోగలరు. వృత్తి ద్వారా దృష్టిని మరియు సృష్టిని పరివర్తన చేయగలరు. కానీ ఒక విషయము వృత్తి ద్వారా సేవ చెయ్యటంలో ఆటంకము కలిగిస్తూ ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. మీ జడచిత్రాలు ఇప్పటివరకు, చివరి జన్మ వరకు కూడా వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి కదా! చూసారు కదా! మందిరాలు చూసారు కదా! డబల్ విదేశీయులు మందిరాలు చూసారా? చూసి ఉండకపోతే చూడండి ఎందుకంటే అవి మీ మందిరాలే కదా! కుమారీలూ, అవి మీ మందిరాలేనా లేక భారత్ లోనివారి మందిరాలేనా? అవి అందరి మందిరాలు, మంచిది. అభినందనలు. మందిరములోని మూర్తులు ప్రత్యక్ష రూపములో వైబ్రేషన్ల ద్వారా సేవ చేస్తున్నాయి అనగా మందిరములోని మూర్తులైన ఆత్మలైన మీరు సేవ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు వైబ్రేషన్ల ద్వారా తమ కోరికలన్నింటినీ పూర్తి చేసుకుంటున్నారు. కావున - ఓ చైతన్యమూర్తులారా, ఇప్పుడు మీ శుభ భావన యొక్క వృత్తి ద్వారా, శుభ కామనల వృత్తి ద్వారా వాయుమండలములో వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. కానీ, కానీ అని అనటము మంచిగా అనిపించదు కానీ అనాల్సి వస్తుంది. పాండవులూ - కానీ అనే మాట మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించదు. కానీ, కానీ అనేది ఉందా లేక సమాప్తమైపోయిందా? దీని కోసం అన్నింటికంటే సహజమైన విధి ఏమిటంటే ముందుగా ప్రతి ఒక్కరు తమను తాము ఆంతరికంగా చెక్ చేసుకోండి, ఒక్క క్షణంలో చెక్ చేసుకోగలరు. ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. ఒక క్షణాన్ని ఇవ్వమంటారా లేక ఇలా చెప్పటంలోనే క్షణం లభించేసిందా. ఇప్పుడు మీ లోపల చెక్ చేసుకోండి - నా వృత్తిలో ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా నెగెటివ్ వైబ్రేషన్ ఉందా? విశ్వము యొక్క వాయుమండలాన్ని పరివర్తన చెయ్యాలి, కానీ మీ మనసులో ఒక్క ఆత్మ పట్లనైనా ఒకవేళ వ్యర్థమైన వైబ్రేషన్లు ఉంటే లేక నిజమైన వైబ్రేషన్లు కూడా నెగెటివ్‌గా ఉంటే, అటువంటివారు విశ్వ పరివర్తన చెయ్యలేరు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, సమయము పట్టేస్తుంది, వాయుమండలంలో శక్తి రాదు. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - వారు ఉన్నదే అలా కదా! అలానే ఉన్నారు కదా! కావున వైబ్రేషన్ మరి ఉంటుంది కదా! బాబాకు కూడా జ్ఞానాన్ని ఇస్తారు - బాబా, మీకు తెలియదు, ఆ ఆత్మ ఉన్నదే అలా. కానీ బాబా అడుగుతున్నారు - వారు చెడ్డవారే, తప్పే, వారు అలా ఉండకూడదు కానీ ఆ చెడును మీ వృత్తిలో పెట్టుకోమని బాబా ఏమైనా అనుమతినిచ్చారా? ఇలా బాబా అనుమతినివ్వలేదు అని ఏ పిల్లలైతే భావిస్తున్నారో వారు ఒక చేతిని ఎత్తండి. టి.వి. లో చూపించండి. (దాదీజీతో) మీరు చూస్తున్నారు కదా! అచ్ఛా, చేతిని ఎత్తారని గుర్తుపెట్టుకోండి. డబల్ విదేశీయులు చేతులెత్తారు! బాప్‌దాదా యొక్క టి.వి.లోనైతే ఎలాగూ వస్తుంది. ఎప్పటివరకైతే ప్రతి బ్రాహ్మణాత్మకు స్వయం యొక్క వృత్తిలో ఎటువంటి ఆత్మ పట్లనైనా వైబ్రేషన్లు నెగెటివ్‌గా ఉన్నట్లయితే, వారు విశ్వ కళ్యాణం కొరకు వృత్తి ద్వారా వాయుమండలములో వైబ్రేషన్లను వ్యాపింపజేయలేరు. ఇది పక్కాగా అర్థం చేసుకోండి. ఎంతైనా సేవ చెయ్యండి, రోజుకు ఎనిమిది-ఎనిమిది భాషణలు చేయండి, యోగ శిబిరాలు చేయించండి, అనేక రకాల కోర్సులు చేయించండి, కానీ ఎవరి పట్ల కూడా మీ వృత్తిలో ఎటువంటి పాత నెగెటివ్ వైబ్రేషన్లను పెట్టుకోకండి. సరే, వారు చెడ్డవారే, చాలా పొరపాట్లు చేస్తుంటారు, చాలామందికి దుఃఖాన్ని ఇస్తారు, మరి మీరు వారు దుఃఖాన్ని ఇవ్వటంలో బాధ్యత వహించేందుకు బదులుగా వారిని పరివర్తన చెయ్యటంలో సహాయకులుగా అవ్వలేరా! వారు దుఃఖాన్ని ఇవ్వడానికి మీరు సహాయకులుగా అవ్వకండి, వారిని పరివర్తన చెయ్యటంలో మీరు సహాయకులుగా అవ్వండి. ఒకవేళ వీరు మారరు అని ఏ ఆత్మ గురించైనా మీరు భావించినా, సరే, మీ జడ్జిమెంట్ పరంగా వారు మారేవారు కాకపోయినా కానీ నంబరువారుగా అయితే ఉంటారు కదా! కావున వీరు మారనే మారరు అని మీరు అలా ఎందుకు ఆలోచిస్తారు. మీరెందుకు జడ్జిమెంట్ ఇస్తారు, జడ్జి బాబా కదా. మీరందరూ ఒకరికొకరు జడ్జిగా అయిపోయారు. వీరు ఇలాంటివారు, వారు అలాంటివారు, వీరు ఇలాంటివారు... అని బాబా కూడా చూస్తూ ఉన్నారు. బ్రహ్మాబాబాను ప్రత్యక్షంగా చూసారు కదా, పదే-పదే పొరపాట్లు చేసే ఆత్మనైనా సరే, బాప్‌దాదా (విశేషంగా సాకార రూపములో బ్రహ్మా బాబా) పిల్లలందరికీ ప్రియస్మృతులను ఇచ్చేవారు, పిల్లలందరినీ మధురమైనవారు-మధురమైనవారు అని అన్నారు. ఇద్దరు, నలుగురు కఠినమైనవారు మరియు మిగిలినవారు మధురమైనవారు... అని ఇలా అన్నారా? అటువంటి ఆత్మల పట్ల కూడా సదా దయార్ద్ర హృదయులుగా అయ్యారు, క్షమా సాగరులుగా అయ్యారు. సరే, మీరు మీ వృత్తిలో ఎవరి పట్లనైనా ఒకవేళ నెగెటివ్ భావాన్ని పెట్టుకున్నట్లయితే, అందులో మీకు లాభమేంటి? ఒకవేళ మీకు ఇందులో లాభముంటే సరే, ఉంచుకోండి, దానికి అనుమతి ఉంది. ఒకవేళ లాభం లేకపోతే, దాని వలన ఆందోళన కలిగితే, ఆ విషయము ఎదురుగా వస్తుంది. బాప్‌దాదా చూస్తుంటారు, ఆ సమయములో అటువంటివారికి అద్దం చూపించాలి. కనుక ఏ విషయములోనైతే మీకు లాభమేమీ లేదో, నాలెడ్జ్‌ఫుల్‌గా అవ్వటము వేరే విషయము, ఇది రాంగ్, ఇది రైట్ అన్న నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్‌ఫుల్‌గా అవ్వటము తప్పు కాదు, కానీ వృత్తిలో ధారణ చెయ్యటము తప్పు ఎందుకంటే దాని ద్వారా మీరు మూడ్ ఆఫ్ అవుతారు, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, స్మృతి శక్తి తగ్గిపోతుంది, నష్టం కలుగుతుంది. మీరు ప్రకృతిని కూడా పావనంగా తయారుచేసేవారు అన్నప్పుడు, వీరైతే ఆత్మలే. వృత్తి, వైబ్రేషన్లు మరియు వాయుమండలము, ఈ మూడింటికీ సంబంధము ఉంది. వృత్తి ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలము తయారవుతుంది. కానీ ముఖ్యమైనది వృత్తి. ఒకవేళ మీరు బాబా ప్రత్యక్షత త్వరత్వరగా జరగాలి అని భావిస్తే, దాని కొరకు తీవ్రవేగంతో కూడిన ప్రయత్నము ఏమిటంటే - అందరూ తమ వృత్తిని తమ కొరకు మరియు ఇతరుల కొరకు పాజిటివ్‌గా ధారణ చేయండి. నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే తప్పకుండా అవ్వండి కానీ మీ మనసులో నెగెటివ్‌ను ధారణ చెయ్యకండి. నెగెటివ్ అంటే అర్థము చెత్త. ఇప్పుడిప్పుడే వృత్తిని శక్తిశాలిగా చేసుకోండి, వైబ్రేషన్లను శక్తిశాలిగా చేయండి, వాయుమండలాన్ని శక్తిశాలిగా చేయండి ఎందుకంటే వాణి ద్వారా పరివర్తన, శిక్షణ ద్వారా పరివర్తన చాలా నెమ్మదిగా జరుగుతుంది, జరుగుతుంది కానీ చాలా నెమ్మదిగా జరుగుతుంది అన్నదానిని అందరూ అనుభవము చేసారు. ఒకవేళ మీరు తీవ్రవేగాన్ని కోరుకుంటే నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యి, క్షమా స్వరూపులుగా అయ్యి, దయార్ద్ర హృదయులుగా అయ్యి, శుభ భావన-శుభ కామనల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చెయ్యండి. చూడండి, మీరందరూ దీనిని ప్రత్యక్షంగా చూసారు, మధుబన్కు ఎవరు వచ్చినా కానీ అన్నింటికంటే ఎక్కువగా వారిపై ఏ విషయం యొక్క ప్రభావం పడుతుంది? వాయుమండలము. ఇక్కడ కూడా అందరూ నంబరువారుగా ఉన్నారు కానీ ఇది బ్రహ్మా బాబా యొక్క కర్మభూమి, బాప్‌దాదా యొక్క వరదానీ భూమి, ఆ వాయుమండలము పరివర్తన చేసేస్తుంది. అనుభవము ఉంది కదా! కనుక వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారుచెయ్యడము - ఇది తీవ్రవేగంతో మనసుపై ముద్రించబడుతుంది. వాయుమండలం మనసులో ముద్రించబడుతుంది. విన్న విషయాలను మర్చిపోవచ్చు, కానీ వాయుమండలము మనసులో ముద్రించబడుతుంది, దానిని మర్చిపోలేరు. అంతేనా? ప్రత్యక్షత ఎప్పుడు అవుతుంది అని పరస్పరంలో ఆత్మిక సంభాషణను మంచిగా చేసుకుంటూ ఉంటారు, దానిని బాప్‌దాదా వింటూ ఉంటారు. మంచిది. చెప్పండి, పాండవులు ఇప్పుడు ఏం చేస్తారు? వాయుమండలాన్ని శక్తిశాలిగా చెయ్యండి. సేవాకేంద్రములోనైనా, మరే స్థానములోనైనా, ప్రవృత్తిలోనైనా వాయుమండలము శక్తిశాలిగా ఉండాలి. నలువైపులా ఉన్న వాయుమండలము ఒకవేళ సంపూర్ణ నిర్విఘ్నంగా, దయాహృదయం కలదిగా, శుభ భావన, శుభ కామన కలదిగా అయినట్లయితే ప్రత్యక్షతలో ఎటువంటి ఆలస్యముండదు.
బాప్‌దాదా ఏదైతే డేట్ ఇచ్చారో, అది బాప్‌దాదాకు గుర్తుంది. లెక్క అయితే అడుగుతాము కదా! ప్రతి ఒక్కరూ తమ-తమ అకౌంట్నైతే పెట్టుకున్నారు కదా! ఆ అకౌంట్లో బాప్‌దాదా ఏం చెక్ చేస్తారంటే - వృత్తిలో, దృష్టిలో, మాటలలో దయార్ద్రహృదయులుగా, శుభ భావన మరియు శుభ కామన కల ఆత్మగా ఎంత శాతం ఉన్నారు? ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉన్నాయి కదా! ఎక్కువే. అచ్ఛా, ఎవరైనా చేసి ఉండకపోతే ఈ 15 రోజులలో చేసినా సరే పాస్ చేస్తాము. గతానికి బిందువు పెట్టండి మరియు దయలో సింధువుగా (సాగరులుగా) అవ్వండి. క్షమలో సింధువుగా అవ్వండి.
(బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
అందరూ విన్నారా! అచ్ఛా. మూడు మీటింగుల వారు ఎవరెవరైతే వచ్చారో, స్పార్క్ వారు ఒక చేతిని ఎత్తండి. మంచిది, చాలా మంచిది. ఇప్పుడు ఈ విషయంపైనే రిసెర్చ్ చెయ్యండి - వాయుమండలాన్ని ప్రాక్టికల్‌గా ఎలా శ్రేష్ఠాతిశ్రేష్టంగా చెయ్యవచ్చు! రిసెర్చ్ చేస్తున్నారు కదా! ఇటువంటి వాయుమండలాన్ని తయారుచెయ్యటానికి ఏమేమి బుద్ధిలో ఉంచుకోవాలి, కర్మలలో ఏమేమి చెయ్యాలి, సంబంధ-సంపర్కాలలో ఏమేమి చెయ్యాలి అని రిసెర్చ్ చెయ్యండి. మంచిది, మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకుంటారు, ఇది మంచి విషయము. కానీ బాప్‌దాదా ఈ ప్రాక్టికల్ అనుభవాన్ని చూడాలనుకుంటున్నారు, అదేమిటంటే - దీనిని ప్రాక్టికల్‌గా ఎలా చేసారు మరియు దాని పరిణామము ఏం వెలువడింది, ఒకవేళ మధ్యలో ఏదైనా ఆటంకము వచ్చి ఉంటే ఏమి వచ్చింది? ఈ అనుభవాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూడండి. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని కేవలం పాయింట్లను తీయడం కాదు, అనుభవం చెయ్యండి. అనుభవము చేసి ఉదాహరణగా అయ్యి చూపించండి మరియు ఆ ఉదాహరణ ఇతరులకు కూడా సహయోగాన్ని ఇస్తుంది. సరేనా! వీరు (రమేష్ భాయి) నిమిత్తము కదా! మంచిది. ఇప్పటికీ ఇంకా 15 రోజులు మిగిలి ఉన్నాయి, ఇప్పుడింకా పూర్తవ్వలేదు. ఇప్పటికి చాలా గడిచిపోయింది, కానీ కొద్దిగా మిగిలి ఉంది. కనుక స్పార్క్ వారు ఇలా ప్రాక్టికల్‌గా చేసి చూడండి మరియు ఇతరులకు చూపించండి. సరేనా? చెయ్యగలరా? వీలవుతుందా? అచ్ఛా. మంచిది, చాలా మంచిది. అచ్ఛా.
రెండవ మీటింగువారు ట్రాన్స్పోర్ట్ వారు:- ట్రాన్స్పోర్ట్ వారైతే అందరికీ సుఖాన్ని ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వారు చేతులెత్తండి. మంచిది. అక్కయ్యలూ, అక్కయ్యలు లేకపోతే గతి ఉండదు. మరి ట్రాన్స్పోర్ట్ వారు ఏం చేస్తారు? కేవలం యాత్ర చేయిస్తారా? ట్రాన్స్పోర్ట్ వారు పరస్పరము ఇటువంటి ప్రోగ్రామును తయారుచెయ్యండి - ఏ ఆత్మనైనా అతి తక్కువ సమయములో దుఃఖ ప్రపంచము నుండి దూరంగా తీసుకువెళ్ళి, కొద్ది సమయం కోసమైనా శాంతి యాత్రను చేయించగలగాలి. సరే, పరంధామము వరకు చేరటమైతే కష్టమే కానీ దుఃఖ ప్రపంచములో శాంతి యాత్రనైతే చెయ్యగలరు. ఆ ప్లాన్లు అయితే చాలా తయారు చెయ్యండి. నాలుగు రకాలుగా యాత్రలు చేసేవారికి బాప్‌దాదా సందేశాన్ని అయితే చేరుస్తున్నారు, తప్పకుండా చేరుస్తారు కూడా, ఎందుకంటే ఏ వర్గమూ మిగిలిపోకూడదు కదా. వర్గాల ఇన్వెన్షన్ చేసారు, చాలా మంచిది, ఇది బాగుంది, ఫిర్యాదులు రావు. ఏ వర్గమూ మిగిలిపోదు, ప్రతి ఒక్కరూ తమ వర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు ఉల్లాసాన్ని అయితే పెట్టుకుంటారు కదా! ఇది చాలా మంచిది. కానీ ఇప్పుడు ఏ వర్గాలైతే తయారయ్యాయో, ఎంత సమయము నుండి వర్గాలు నడుస్తున్నాయి? ఒకటిన్నర, రెండు సంవత్సరాలయ్యాయా లేక ఇంకా ఎక్కువ అయ్యాయా? (10-12 సంవత్సరాలు) వర్గాల సేవ మొదలై 10-12 సంవత్సరాలు అయ్యింది, మంచిది, చాలా సమయం అయ్యింది. వర్గాల వారి కోసం బాప్‌దాదాకు ఒక సంకల్పము ఉంది. బాప్‌దాదా 2-3 సార్లు చెప్పారు కానీ ఇంకా జరగలేదు, అదేమిటంటే - ప్రతి వర్గమూ, ఏ వర్గము ఎంత సమయము నుండి సేవ చేసినా, ఆ ఒక్కొక్క వర్గము నుండి విశేషంగా సర్వీసబుల్ అయినవారు, వారు సహయోగి అయినా లేదా సగం యోగి అయినా, అప్పుడప్పుడు వచ్చేవారైనా, రెగ్యులర్ కాకపోయినా సరే, ఇలా తక్కువలో తక్కువ 5 మంది ప్రతి వర్గము నుండి, అన్ని వర్గాల నుండి ఎదురుగా రావాలి. వారిని మధుబన్ వారందరూ చూడాలి, 10-12 మంది ఉన్నా ఫరవాలేదు కానీ పక్కాగా ఉన్న 5 మందినైనా తీసుకురండి, మంచి సహయోగులు, సేవకు నిమిత్తంగా అయిన 5-5 మందైతే వెలువడగలరా లేక వెలువడలేరా! వెలువడగలరంటే తీసుకురండి (ఎప్పుడు తీసుకురావాలి?) అది దాదీల ఇష్టము. (బాప్‌దాదా ప్రోగ్రాంలో తీసుకురావాలా?) అలాగైతే మరి వారు బాప్‌దాదాను కలుసుకునేందుకు యోగ్యులై ఉండాలి, 5 మందైతే అలా వెలువడగగలరు. ఎక్కువమంది అని చెప్పటం లేదు, 5 మంది చాలు. వారిని దాదీలు పాస్ చేస్తారు.
మూడవ మీటింగ్ - ఇంజినీర్లు:- చాలా మంచిది. ఇంజనీర్ల పనే ప్లాన్లు తయారుచెయ్యటము. మరి తీవ్ర పురుషార్థానికి ఏదైనా ప్లాన్ తయారుచేసారా లేక సేవదే తయారుచేసారా? ఇంజనీర్లు ప్రతి నెల తీవ్ర పురుషార్థానికి సంబంధించి ఏవైనా క్రొత్త-క్రొత్త ప్లాన్లు తయారుచెయ్యాలి. సలహా ఇవ్వాలి, ఫైనల్ అయితే దాదీలు చేస్తారు. దాదీలు మీ సహచరులు, కానీ ఇంజనీర్లు మరియు సైన్సువారు ఎటువంటి ప్లాన్ తయారుచెయ్యాలంటే దాని ద్వారా త్వరత్వరగా కొత్త ప్రపంచము రావాలి. ఇవే మీటింగ్‌లు చేస్తూ ఉంటారా, ఇవే ప్లాన్లు చేస్తూ ఉంటారా, ఎప్పటివరకు? తీవ్రవేగంతో కూడిన ఏదైనా ప్లాన్ తయారుచెయ్యండి ఎందుకంటే మీ వర్గము యొక్క లక్ష్యమే ఇది - మీ రాజ్యము త్వరత్వరగా రావాలి అనేదానికి సంబంధించి ప్లాన్లు తయారుచేయాలి. కనుక అటువంటి ప్లాన్లు కూడా తయారుచెయ్యండి మరియు సేవలో కూడా కొద్ది సమయములో ఎక్కువ సఫలత ప్రత్యక్షంగా కనిపించాలి, అటువంటి ప్లాన్లు తయారుచెయ్యండి. అటువంటి ప్లాన్లు తయారుచేస్తారు కదా! ప్రతి వర్గము వారు సఫలతను తీవ్రతరం చేయడానికి ఏ ప్లాన్‌ను తయారుచేసారు అన్నది చివరి టర్న్‌లో అందరూ రిపోర్ట్ వింటారు. కేవలం తయారుచేయడమే కాదు, 15 రోజులు దాని అభ్యాసం చెయ్యాలి, ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. సరేనా. ఇప్పుడు ప్రాక్టికల్‌గా జరగాలి కదా! అందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, బాప్‌దాదా అయితే అందరి ఆత్మిక సంభాషణను వింటూ ఉంటారు. ప్రత్యక్షత జరగాలి, ప్రత్యక్షత జరగాలి అని అందరూ అంటూ ఉంటారు. కానీ ముందు మీరైతే ప్రత్యక్షమవ్వండి. బాబా కూడా మీ ద్వారా ప్రత్యక్షమవుతారు కదా!
ఇప్పుడు కుమారీల సెరిమనీ(వేడుక) ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. లేవండి. పుష్పగుచ్ఛాన్ని ఊపండి. కూర్చోండి. అందరూ చూసారు. కుమారీలపై బాప్‌దాదాకు అందరికన్నా ఎక్కువ గర్వంగా ఉంటుంది. కుమారీలు, అది కూడా డబల్ విదేశీ కుమారీలు 110మంది వెలువడ్డారు, ఇది బాప్‌దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పదమ్-పదమ్-పదమ్ రెట్లు అభినందనలు కుమారీలకు. అచ్ఛా. కుమారీలపై బాప్‌దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకని? కారణము? కారణమేమిటంటే, బాప్‌దాదా ఏమని భావిస్తారంటే, విదేశాలలో ఉంటూ కుమారి సుకుమారిగా అయిపోయింది, రక్షింపబడింది, ఎన్నో విషయాల నుండి రక్షింపబడింది. మరి కుమారీలు రక్షింపబడటము, బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. కుమారీలపై విశేషమైన ప్రేమ ఉంది అనేందుకు ప్రత్యక్ష ప్రమాణము – కుమారికి ముందుగా అతి త్వరగా కట్నం రూపంలో సెంటర్ లభిస్తుంది. ఇందులో ఎంతమంది సెంటర్ సంభాళించేవారు ఉన్నారో చూడండి. ఇందులో సెంటర్‌ను సంభాళించేవారు చేతులెత్తండి. మీకైతే వరుడు, ఇల్లు, కట్నం అన్నీ లభించేసాయి. మరి కుమారీల విశేషత ఉంది కదా! బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఒక్కొక్క కుమారి క్లాసులో నేను ఎవరు అన్న తమ పరిచయాన్ని ఇవ్వాలి. అప్పుడు మరింతగా పక్కా స్టాంప్ పడిపోతుంది కదా. మరి బాప్‌దాదాకు కుమారీల సంగఠన చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కొక్క కుమారి ఎన్నో పరివారాల కళ్యాణాన్ని చేస్తుంది. కుమారి అంటే 21 కులాలను ఉద్ధరించేది అని ఇండియాలో అంటారు. బాప్‌దాదా అంటారు, కుమారి, బ్రహ్మా కుమారి అంటే ఆత్మల 21 జన్మల కళ్యాణం చేసేవారు. చాలా బాగా చేసారు. వీరి టీచర్లు ఎవరు? కుమారీల టీచర్ ఎవరు? డబల్ విదేశీయులు ఎవరైతే ఉన్నారో, వారు సేవ చేయించారు. చాలా బాగా చేసారు మరియు బాప్‌దాదా రిజల్ట్‌ను కూడా చూసారు, మంచి ఉల్లాస-ఉత్సాహాలతో చేసారు మరియు చేయించేవారు కూడా చేయించారు. అందుకే పాస్ అయ్యారు, అభినందనలు. అచ్ఛా.
డబల్ విదేశీయులలో విశేషంగా పాండవులు ఎవరైతే సెంటర్‌ను సంభాళించడంలో నిమిత్తంగా ఉన్నారో, వారు లేవండి. పాండవులకు కూడా చాలా-చాలా అభినందనలు. పాండవులపై బాబాకు ప్రేమ లేదని కాదు, పాండవులైతే పాండవపతితో కలిసి ఉంటారు. ఇదైతే స్మృతిచిహ్నము కూడా చెప్తుంది కదా. పాండవుల స్మృతిచిహ్నము సదా పాండవపతి అయిన బాప్‌దాదాతో ఉన్నట్లుగా చూపిస్తారు. చాలా మంచి ఉదాహరణగా అయ్యి, సేవాధారిగా అయ్యి సేవ చేస్తున్నారు మరియు సదా చేస్తూ ఉంటారు, ఇందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. అందుకని మనోభిరాముడైన బాబా మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. అచ్ఛా. డబల్ విదేశీయుల అద్భుతము ఏమిటంటే, జాబ్ చేస్తారు, సెంటర్‌ను కూడా సంభాళిస్తారు, డబల్ కార్యాన్ని చేస్తారు. సోదరీలు కావచ్చు, సోదరులు కావచ్చు. డబల్ విదేశీయులు అన్న పేరుకు తగ్గట్లుగా డబల్ కార్యాన్ని చేస్తారు. అందుకే బాప్‌దాదా డబల్ విదేశీయులు అందరికీ చాలా-చాలా-చాలా-చాలా స్మృతిని ఇస్తున్నారు. విన్నారా!
గుజరాత్ సేవాధారులతో:- సమీపంగా ఉన్నవారు సదా గుర్తుంటారు అని అంటారు. మరి అన్నిటికన్నా సమీపంగా ఉన్న ముఖ్య స్థానము గుజరాత్. అచ్ఛా, గుజరాత్ వారు లేవండి. చాలామంది సేవాధారులు ఉన్నారు. గుజరాత్ విశేషత – ఎప్పుడు పిలిచినా చేరుకుంటారు. అంతే కదా! ఎప్పుడు సేవ కోసం పిలిచినా వచ్చేస్తారు. సమీపంగా ఉన్నందుకు లాభము ఉంది. అన్ని మురళీలకు చేరుకోగలగడం కూడా సమీపంగా ఉండటం వలన ఉన్న లాభమే.
సేవలో గుజరాత్ సదా మంచిగానే ఉంది, సదా మంచిగా ఉంటుంది. సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు గుజరాత్లో లక్షమంది తయారవ్వలేదు అని బాప్‌దాదా విన్నారు, ఇది కొంచెం మిగిలి ఉంది. 9 లక్షలలో, ఏవైతే పెద్ద-పెద్ద జోన్లు ఉన్నాయో వారు ఒక్కొక్క లక్షను తయారు చేస్తే 9 లక్షల మంది తయారైపోతారు. డబల్ విదేశీయులు ఎంతమంది ఉన్నారు? 50 వేల మంది ఉన్నారా? (20 వేల మంది ఉన్నారు) ఇప్పుడు 50 వేల వరకు రండి. ఇండియా వారు లక్ష, ఫారెన్ వారు 50 వరకు తీసుకురావాలి. (విదేశాలలో కూడా గుజరాతీలు చాలామంది ఉన్నారు) కానీ వారు కూడా విదేశీయులే కదా! విదేశాలలో ఎక్కడెక్కడైతే గుజరాతీలు లేక ఇండియన్లు ఉంటారో అక్కడ భండారీ మరియు భండారా తప్పనిసరిగా నిండుగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే బాప్‌దాదా డబల్ విదేశీయుల గురించిన ఒక శుభవార్త విన్నారు – డబల్ విదేశీయులకు కూడా మిగిలి ఉన్న వారసత్వము లభిస్తూ ఉంటుంది. మరి డబల్ విదేశీయులకు ఇది కూడా భవిష్యత్తును తయారు చేసుకునే మంచి అవకాశం లభిస్తుంది. మంచిది. బాప్‌దాదా అయితే అన్ని సమాచారాలను వింటారు. మంచిది. భారతవాసులు కావచ్చు, డబల్ విదేశీయులు కావచ్చు, ప్రతి ఒక్కరికీ విశేషతలు చాలా ఉన్నాయి, కానీ ఎంతని వినిపించమంటారు. కనుకనే ప్రతి స్థానానికి ఏదో ఒక విశేషత ఉంది. విశేషత లేని స్థానము ఏదీ లేదు. విశేష ఆత్మలు మరియు విశేషత ఉంది.
ఈరోజు ఫారెన్‌లో వినడము లేక చూడటము చేస్తున్నారా లేదా? (చూస్తున్నారు) మంచిది. యజ్ఞ స్థాపన తర్వాతనే సైన్సు వృద్ధిని పొందింది. మరి దాని లాభాన్ని అయితే తీసుకోవాలి కదా! కానీ విధిపూర్వకంగా లాభాన్ని తీసుకోవాలి. ఎవరైతే సైన్సు సాధనాల ద్వారా చూస్తున్నారో, వింటున్నారో, ఆ పిల్లలందరినీ అందరికన్నా ముందుగా బాప్‌దాదా గుర్తు చేసుకుంటున్నారు. ఎంతెంతగా స్మృతి బలము శక్తిశాలిగా ఉంటుందో అంతగా బాప్‌దాదా మాతోటే మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. ఎంతైనా మధుబన్ మధుబనే.
అచ్ఛా - ఇప్పుడిప్పుడే మీ వృత్తిని ఏకాగ్రము చెయ్యగలరా? వృత్తి ఎక్కడా కూడా అలజడిలోకి రాకూడదు. అచలంగా, ఏకాగ్రంగా, శక్తిశాలిగా ఉండాలి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు). అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వీసబుల్ పిల్లలందరికీ, సదా తమ శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా సేవ చేసేవారికి, తీవ్రగతితో కూడిన పురుషార్థము చేసే పిల్లలకు, సదా మాస్టర్ క్షమాసాగరులు, సదా శుభ భావన-శుభ కామనల ద్వారా చాలా బలహీన ఆత్మలను కూడా శక్తిశాలిగా తయారుచేసేవారికి, అటువంటి మాస్టర్ సర్వశక్తిమంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీ, దాదీ జానకితో:- మీరు చెప్పండి, అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఎవరు ఉంటారు? బాబా సంతోషంగా ఉంటారా లేక మీరు సంతోషంగా ఉంటారా? (ఒకరికన్నా మరొకరు ఎక్కువ సంతోషంగా ఉంటారు) అచ్ఛా, బాప్‌దాదా ఎప్పుడైతే నిమిత్త ఆత్మలైన మీ సేవను చూస్తారో అప్పుడు సేవపై బలిహారమవుతారు. సంభాళించే విధి బాగుంది. పూర్తి విశ్వం ఎదుట మీ ఇరువురి స్నేహము, సహయోగము మరియు ఒకరి పట్ల మరొకరికి ఉన్న సహానుభూతి చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. (గుల్జార్ దాదీ కూడాఉన్నారు, త్రిమూర్తి) వారైతే నిమిత్తము. మిమ్మల్ని చూస్తే, ఒకరు చెబితే మరొకరు ఆ మాటను గౌరవిస్తారు. ఇలా గౌరవించడమే గౌరవనీయులుగా చేస్తుంది. హా జీ, హా జీ అంటూ హజూర్ను కూడా మీవారిగా చేసేసుకున్నారు. (ఈ విషయాన్ని బాబా మాలో బాగా నింపారు) 14 సంవత్సరాల పాలనలో అన్నీ బాగా నింపారు. (ఇప్పుడు కూడా విడిచి పెట్టరు) మీరు విడిచి పెట్టగలరా, మరి బాబా ఎలా విడిచిపెట్టగలరు! చాలా బాగుంది! మీ సహచరులు కూడా చాలా బాగున్నారు. అందరి తోడు ఉంది అందుకే ముందుకు వెళ్తున్నారు. ఒక్క చిన్నవారి తోడు లేకపోయినా కానీ అలజడి వస్తుంది. అందరూ కావాలి కదా! పాండవులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఒక్కొక్కరి సహయోగము, సఫలతను ప్రాప్తి చేయిస్తుంది. మేము కేవలం చూసేవారిమి అని అనుకోకండి, కాదు. చేసేవారు. సర్వుల సహయోగముతో అనంతమైన కార్యం జరుగుతుంది. బ్రహ్మా బాబా ఏ పునాదిని వేసారు? సహయోగము అనే పునాదిని వేసారు, ఒక్క బాప్‌దాదా చేయలేరా? కానీ సహయోగము అన్న పునాదిని వేసారు. సహయోగముతోటే ప్రపంచం మారుతుంది. అచ్ఛా. అందరి సహయోగము ఉంది, ఒక్కొక్క రత్నము విశేషమైనది. అచ్ఛా!