Search for a command to run...
28 Feb 2003
"సేవతోపాటు ఇప్పుడు సంపన్నముగా అయ్యేందుకు ప్లాన్‌ను తయారు చెయ్యండి, కర్మాతీతులుగా అయ్యే ధ్యాసలో నిమగ్నమైపోండి"
28 February 2003 · తెలుగు
ఈరోజు శివబాబా తమ శాలిగ్రామాలైన పిల్లలతో పాటు తమ మరియు పిల్లల యొక్క అవతరణ జయంతిని జరుపుకోవడానికి వచ్చారు. ఈ అవతరణ జయంతి ఎంతటి అద్భుతమైనది. నలువైపుల ఉన్న పిల్లలందరూ బాబా జయంతిని మరియు తమ జయంతిని జరుపుకోవడానికి పరుగు పరుగున వచ్చారు. బాబా మరియు పిల్లల జయంతి అనగా అవతరణ దివసము ఒకటే. బాబా మరియు పిల్లలది ఒకే రోజు జన్మ జరగడము ఇదే వండర్. మరి శాలిగ్రామ పిల్లలైన మీరందరూ బాబాకు అభినందనలు తెలపడానికి వచ్చారా లేక బాబా నుండి అభినందనలు తీసుకోవడానికి వచ్చారా? ఇవ్వడానికి కూడా వచ్చారు, తీసుకోవడానికి వచ్చారు. కలిసి-కలిసి ఉన్నారు అనేందుకు గుర్తు – పిల్లలైన మీకు మరియు తండ్రికి పరస్పరం చాలా-చాలా-చాలా స్నేహము ఉంది. అందుకే జన్మ కూడా కలిసే జరిగింది మరియు ఉండటము కూడా కలిసే అనగా జన్మంతా కంబైండ్‌గా అనగా కలిసి ఉంటాము. ఇంతటి ప్రేమను చాసారా! ఒకవేళ వృత్తిని చూస్తే కూడా తండ్రి మరియు పిల్లలది ఒకటే – విశ్వ పరివర్తన చేసే వృత్తి. ప్రతిజ్ఞ ఏమిటి? పరంధామము, స్వీట్ హోమ్‌కు కూడా కలిసి వెళ్తామా లేక ముందు వెనుక ఉంటారా? కలిసి-కలిసి వెళ్ళాలి కదా! మరి మీది మరియు బాబా ప్రేమ ఇటువంటి కదా. బాబా ఒంటరిగా ఏమీ చేయలేరు, పిల్లలు కూడా ఒంటరిగా ఏమీ చేయలేరు. చేయగలరా? బాబా లేకుండా చేయగలరా? బాబా కూడా చేయలేరు. అందుకే బ్రాహ్మణులైన మిమ్మల్ని రచించడానికి బ్రహ్మా బాబాను ఆధారం చేసుకున్నారు. బ్రాహ్మణులు లేనిదే బాబా కూడా ఏమీ చేయలేరు. అందుకే ఈ అలౌకిక అవతరణ యొక్క జన్మ దివసము సందర్భంగా బాబా పిల్లలకు మరియు పిల్లలు బాబాకు పదమాపదమ్ సార్లు అభినందనలు తెలుపుతున్నారు. మీరు బాబాకు ఇస్తున్నారు, బాబా మీకు ఇస్తున్నారు. అమృతవేళ నుండి, అంతకంటే ముందునుండే పిల్లల అభినందనలు, కార్డులు, ఉత్తరాలు, మనసు నుండి వచ్చే తియ్య-తియ్యని పాటలు బాబాకు అందాయి. నలువైపుల ఉన్న దేశ-విదేశాల పిల్లలు సూక్ష్మంగా బాప్‌దాదాకు అభినందనలు తెలపడాన్ని బాప్‌దాదా కూడా చూస్తున్నారు. చేరుతున్నాయి. పిల్లలకు ధ్వని చేరుతుంది మరియు పిల్లల మనసు ధ్వని బాబాకు చేరుతుంది. నలువైపుల ఉన్న పిల్లలు సంతోషంతో ఊగుతున్నారు. వాహ్! బాబా, వాహ్! శాలిగ్రామ ఆత్మలమైన మేము! వాహ్ వాహ్! పాట పాడుతున్నారు. మీ యొక్క ఈ జన్మ దివసము యొక్క స్మృతి చిహ్నాన్ని ద్వాపరం నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా జరుపుకుంటున్నారు. భక్తులు కూడా భావనలో తక్కువైనవారేమీ కారు. కానీ వారు భక్తులు, పిల్లలు కారు. వారు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు మరియు మీరు మొత్తము కల్పములో ఒక్కసారి అవతరణ మహత్వాన్ని జరుపుకుంటారు. వారు ప్రతి సంవత్సరము ఉపవాసము పాటిస్తారు, ఉపవాసము కూడా పాటిస్తారు మరియు వ్రతాన్ని కూడా చేపడతారు. మీరు ఒకే ఒక్కసారి వ్రతాన్ని చేపడతారు, మిమ్మల్నే కాపీ చేసారు, కానీ మీ మహత్వానికి మరియు వారి స్మృతిచిహ్న మహత్వానికి తేడా ఉంది. వారు కూడా పవిత్రతా వ్రతాన్ని చేపడతారు కానీ వారు ప్రతి సంవత్సరము ఒక్క రోజు కోసము వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా జన్మ తీసుకోవటముతోనే ఒక్కసారి పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు కదా! తీసుకున్నారా లేక తీసుకోవాలా? తీసుకున్నారు. మీరు ఒకేసారి తీసుకున్నారు, వారు ప్రతి సంవత్సరము తీసుకుంటారు. అందరూ వ్రతాన్ని చేపట్టారా? కేవలం బ్రహ్మచర్యమే కాదు, సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపట్టారు. పాండవులారా, సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని చేపట్టారా? లేక కేవలం బ్రహ్మచర్యమే సరిపోతుందా! బ్రహ్మచర్యమనేది పునాది కానీ కేవలం బ్రహ్మచర్యమే కాదు, దానితో పాటు ఇంకో నాలుగు కూడా ఉన్నాయి. ఆ నాలిగింటి వ్రతాన్ని కూడా చేపట్టారా లేక కేవలము ఒకదానిదే చేపట్టారా? చెక్ చేసుకోండి. క్రోధము చెయ్యటానికైతే అనుమతి ఉంది కదా? అనుమతి లేదా? కొంచెం, కొంచెమైతే క్రోధము చేయవలసి ఉంటుంది కదా? చేయవలసిన అవసరం లేదా? పాండవులు చెప్పండి, క్రోధము చేయవలసిన అవసరం లేదా? చేయవలసి అయితే ఉంటుంది కదా! సరే, బాప్‌దాదా చూసారు, క్రోధము మరియు దానితోపాటు మిగిలిన సహచరులు ఏవైతే ఉన్నాయో, ఆ మహా భూతాలనైతే త్యాగము చేసారు, కానీ ఎలాగైతే మాతలకు, ప్రవృత్తిలోనివారికి పెద్ద పిల్లలపై అంతగా ప్రేమ ఉండదు, మోహము ఉండదు కానీ మనవలు, మునిమనవలపై చాలా ఉంటుంది. చిన్న-చిన్న పిల్లలు చాలా ప్రియముగా అనిపిస్తారు. కనుక బాప్‌దాదా చూసారు, పిల్లలకు కూడా ఈ పంచ వికారాలనే మహాభూతాలు ఏవైతే ఉన్నాయో, వాటి మహారూపాలపై ప్రేమ తగ్గిపోయింది కానీ ఈ వికారాల యొక్క పిల్లాజెల్లా ఉన్నాయి కదా, చిన్న-చిన్నగా అంశమాత్రముగా, వంశమాత్రముగా, వాటిపై ఇప్పుడు కూడా కొంచెం-కొంచెం ప్రేమ ఉంది. ఉందా ప్రేమ! అప్పుడప్పుడైతే ప్రేమ కలుగుతుంది. కలుగుతుందా? మాతలూ? డబల్ విదేశీయులూ, క్రోధము రాదా? కొంతమంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడుతారు, ఏమంటారో వినిపించమంటారా? వినిపించమంటారా? ఒకవేళ వినిపిస్తే, మరి మీరు ఈ రోజు వదిలేయాల్సి ఉంటుంది. సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారా, వదిలేస్తారా? లేక కేవలము ఫైల్లో కాగితాన్ని జమ చేస్తారా? ప్రతి సంవత్సరము చేస్తుంటారు కదా, ప్రతిజ్ఞల ఫైళ్లు బాబా వద్ద చాలా-చాలా పెద్దవైపోయాయి, మరి అలాగే ఇప్పుడు కూడా మరొక ప్రతిజ్ఞా కాగితాన్ని ఫైల్లో జమ చేయడమనేది చేయరు కదా, అలా చేయరు కదా! ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో పెడతారా? ఏం చేస్తారు? చెప్పండి, టీచర్లు ఏం చేస్తారు? ఫైనల్? చేతులెత్తండి. ఏదో అలా ఊరికే ప్రతిజ్ఞ చెయ్యకండి. మరల బాప్‌దాదా కాస్తంత రూపాన్ని ధారణ చేస్తారు. సరేనా. డబల్ విదేశీయులు - ఫైనల్ చేస్తారా? ఎవరైతే ఫైనల్ చేస్తారో వారు చేతులెత్తండి. టి.వి.లో చూపించండి. చిన్నగా త్రేతాయుగ చేతిని ఎత్తటము కాదు, చేతిని బాగా పైకి ఎత్తండి. అచ్ఛా, మంచిది. వినండి, బాబా మరియు పిల్లల మాటలు ఎలా ఉంటాయి? బాప్‌దాదా నవ్వుకుంటారు. క్రోధము ఎందుకు చేసావు అని బాబా అడుగుతారు. నేను చేయలేదు, కానీ నా చేత క్రోధము చేయించారు అని వారు అంటారు. నేను చేయలేదు, నా చేత చేయించారు. మరి ఇప్పుడు బాబా ఏమనాలి? ఇంకా ఏమంటారంటే, ఒకవేళ మీరు అక్కడ ఉండి ఉంటే మీకు కూడా క్రోధము వచ్చేస్తుంది. తియ్య-తియ్యగా మాటలు చెప్తారు కదా! ఇంకా ఏమంటారు, నిరాకారము నుండి సాకార తనువును తీసుకుని చూడండి. మరి ఇప్పుడు చెప్పండి, ఇటువంటి మధురమైన పిల్లలకు బాబా ఏమి చెప్పాలి! అయినా కూడా బాబాకు దయార్ద్ర హృదయునిగా అవ్వవలసి ఉంటుంది. అచ్ఛా, ఇప్పుడు క్షమిస్తున్నాను కానీ ఇకముందు చెయ్యకండి అని అంటాము. కానీ చాలా మంచి-మంచి జవాబులిస్తారు.
పవిత్రత బ్రాహ్మణులైన మీకు అత్యంత గొప్ప అలంకరణ, అందుకే మీ చిత్రాలను ఎంతగానో అలంకరిస్తారు. ఇది పవిత్రతకు స్మృతిచిహ్నమైన అలంకారము. పవిత్రత అనగా సంపూర్ణ పవిత్రత, ఏదో పైపైకి, మొక్కుబడిగా ఉండే పవిత్రత కాదు. సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితము యొక్క అన్నింటికన్నా అత్యంత పెద్ద ప్రాపర్టీ (ఆస్తి), రాయల్టీ (హుందాతనము), పర్సనాలిటీ (వ్యక్తిత్వము). అందుకే భక్తులు కూడా ఒక్క రోజు కోసము పవిత్రతా వ్రతాన్ని చేపడతారు. వారు మిమ్మల్ని కాపీ చేసారు. రెండవది, ఆహార-పానీయాల వ్రతాన్ని చేపడతారు. ఆహార-పానీయాల వ్రతము కూడా అవసరము. ఎందుకని? బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార-పానీయాల వ్రతాన్ని పక్కాగా చేపట్టారు కదా! మధుబన్కు వచ్చేందుకు అందరి చేత ఫారమ్ నింపించినప్పుడు, ఆహార-పానీయాల శుద్ధత ఉందా అని ఇది కూడా ఫారమ్‌లో నింపిస్తారు కదా? నింపిస్తారు కదా! మరి ఆహార-పానీయాల వ్రతము పక్కాగా ఉందా? పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు కచ్చాగా అయిపోతుందా? డబల్ విదేశీయులకైతే డబల్ పక్కాగా ఉంటుంది కదా! డబల్ విదేశీయులకు డబల్ పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలసిపోతే, అచ్ఛా, ఈ రోజు కొద్దిగా తినేద్దాము అని అంటారా, కొంచెం ఢీలా చేసేస్తారా, అలా వద్దు. ఆహార-పానీయాలలో పక్కాగా ఉంటారు, అందుకే భక్తులు కూడా ఆహార-పానీయాల వ్రతాన్ని చేపడతారు. మూడవ వ్రతము జాగరణకు సంబంధించి పెట్టుకుంటారు - రాత్రివేళ మేల్కుని ఉంటారు కదా! బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకొనే వ్రతాన్ని చేపడతారు. మధ్యమధ్యలో అజ్ఞానమనే నిద్ర అయితే రాదు కదా! భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తున్నారు, మీరు పక్కాగా ఉన్నారు కావుననే కదా వారు కాపీ చేస్తారు. ఎప్పుడు కూడా అజ్ఞానము యొక్క అనగా బలహీనత, నిర్లక్ష్యము, సోమరితనము యొక్క నిద్ర రాకూడదు. లేక కొంచెం-కొంచెం కునుకుపాట్లు వచ్చినా ఫర్వాలేదా? కునుకుపాట్లు పడతారా? అమృతవేళ కూడా కొందరు కునుకుపాట్లు పడుతుంటారు. కానీ ఆలోచించండి - మన స్మృతిచిహ్నములో భక్తులు ఏమేమి కాపీ చేస్తున్నారు! భక్తులు ఎంత పక్కాగా ఉంటారంటే ఏం జరిగినా కానీ వ్రతాన్ని భంగము చేయరు. ఈ రోజున భక్తులు ఆహార-పానీయాల ఉపవాసము కూడా చేస్తారు, మరి ఈ రోజు మీరేమి చేస్తారు? పిక్నిక్ చేసుకుంటారా? వారు ఉపవాసము చేస్తారు మరియు మీరు పిక్నిక్ చేసుకుంటారు, కేక్ కట్ చేస్తారు కదా! పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరు జన్మించినప్పటి నుండే వ్రతాన్ని చేపట్టారు, అందుకే ఈ రోజు పిక్నిక్ చేసుకుంటారు.
బాప్‌దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు? మీకు తెలుసు కదా. సంకల్పాలు చాలా మంచివి చేస్తారు, ఎంత మంచి సంకల్పాలు చేస్తారంటే వాటిని వింటూ-వింటూ సంతోషపడిపోతాము. సంకల్పము చేస్తారు కానీ తర్వాత ఏమవుతుంది? సంకల్పము బలహీనముగా ఎందుకవుతుంది? మీరు కోరుకుంటున్నారు కూడా ఎందుకంటే బాబాపై చాలా ప్రేమ ఉంది, బాప్దాదాపై పిల్లలందరికీ మనస్ఫూర్వకమైన ప్రేమ ఉంది అన్నది బాబాకు కూడా తెలుసు మరియు ప్రేమ విషయములో అందరూ చేతులెత్తుతారు, 100 శాతము ఏంటి, 100 శాతము కంటే ఎక్కువే ఉంది అని అంటారు. మరియు బాబా కూడా, ప్రేమలో అందరూ పాస్ అయ్యారు అన్నదానిని అంగీకరిస్తారు. కానీ ఏమిటి? కానీ... అనేది ఉందా, లేదా? కానీ అనేది వస్తుందా, రాదా? పాండవులూ, మధ్యమధ్యలో కానీ అనేది వస్తుందా? రాదు అని అనటము లేదంటే వస్తుందనే కదా! బాప్‌దాదా మెజారిటీ పిల్లల్లో ఒక విషయాన్ని నోట్ చేసారు - ప్రతిజ్ఞ బలహీనము అవ్వటానికి ఒకటే కారణము ఉంది, ఒకటే పదము ఉంది. ఆ పదము ఏమిటో ఆలోచించండి? టీచర్లు చెప్పండి, ఆ ఒక్క పదము ఏమిటి? పాండవులు చెప్పండి, ఆ ఒక్క పదము ఏమిటి? గుర్తుకు వచ్చేసింది కదా! ఆ ఒక్క పదము ఏమిటంటే - ‘‘నేను’’. అభిమానము రూపములో కూడా ‘నేను’ అనేది వస్తుంది మరియు బలహీనము చెయ్యటములో కూడా ‘నేను’ అనేది వస్తుంది. నేను ఏదైతే చెప్పానో, నేను ఏదైతే చేసానో, నేను ఏదైతే అనుకున్నానో, అదే రైట్. అదే జరగాలి. ఇది అభిమానముతో కూడుకున్న ‘నేను’. నేను అనేది ఎప్పుడైతే నెరవేరదో, అప్పుడు నిరాశలోకి కూడా వస్తారు, నేను చెయ్యలేను, నడవలేను, చాలా కష్టము. దేహాభిమానానికి చెందిన ‘నేను’ అనేది మారిపోవాలి, ‘నేను’ అనేది స్వమానాన్ని కూడా గుర్తు తెప్పిస్తుంది మరియు ‘నేను’ అనేది దేహాభిమానములోకి కూడా తీసుకువస్తుంది. ‘నేను’ అనేది నిరాశలోకి కూడా తీసుకువస్తుంది మరియు ‘నేను’ అనేది మనసును సంతోషపెడుతుంది కూడా. మరియు అభిమానము యొక్క గుర్తు ఏమిటో తెలుసా? ఎప్పుడైనా, ఎవరిలోనైనా ఒకవేళ దేహాభిమానానికి చెందిన అభిమానము అంశమాత్రము ఉన్నా కూడా, దాని గుర్తు ఏముంటుంది? వారు తమ అవమానాన్ని సహించలేరు. అభిమానము అవమానాన్ని సహించనివ్వదు. ఇది కరెక్టు కాదు, కొద్దిగా నిర్మానచిత్తముగా అవ్వండి అని ఎవరైనా కొద్దిగా చెప్పినా, అది వారికి అవమానముగా అనిపిస్తుంది, ఇది అభిమానానికి గుర్తు.
బాప్‌దాదా వతనములో నవ్వుతూ ఉన్నారు - ఈ పిల్లలు శివరాత్రి సందర్భముగా ఇక్కడా, అక్కడా భాషణ చేస్తారు కదా, ఇప్పుడు చాలా భాషణలు చేస్తున్నారు కదా. అందులో ఏమి చెప్తారు, బాప్‌దాదాకు పిల్లల పాయింట్ గుర్తుకొచ్చింది. అందులో ఏం చెప్తారంటే, శివరాత్రి నాడు మేకను బలి ఇస్తారు - ఆ మేక మే, మే అని చాలా అంటుంటుంది కదా, అలాగే శివరాత్రి నాడు ఈ ‘‘మై-మై’’ (నేను-నేను) అనేదానిని బలి ఇవ్వండి. బాబా అది వింటూ, వింటూ నవ్వుకుంటున్నారు. మరి ఈ ‘నేను’ అనేదానిని మీరు కూడా బలి ఇవ్వండి. సరెండర్ చెయ్యగలరా? చెయ్యగలరా? పాండవులు చెయ్యగలరా? డబల్ విదేశీయులు చెయ్యగలరా? ఫుల్ సరెండరా లేక సరెండరా? ఫుల్ సరెండర్. ఈ రోజు బాప్‌దాదా జెండా ఎగురవేసే సమయములో మామూలుగా ప్రతిజ్ఞ చేయించరు. ఈ రోజు ప్రతిజ్ఞ చెయ్యటము మరియు ఫైల్లో ఆ కాగితాన్ని జమ చెయ్యటము, ఇటువంటి ప్రతిజ్ఞను చేయించరు. ఏం ఆలోచిస్తున్నారు, దాదీలు, ఈరోజు కూడా అటువంటి ప్రతిజ్ఞను చేయించాలా? ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో జమ చేస్తారా? చెప్పండి (ఫైనల్ చేయించండి). ధైర్యము ఉందా? ధైర్యము ఉందా? వినటములో నిమగ్నమైపోయారు, చేతులెత్తటం లేదు. రేపు ఏమీ అవ్వదు కదా! అవ్వదు కదా! రేపు మాయ తిరగటానికి వస్తుంది. మాయకు కూడా మీపై ప్రేమ ఉంది కదా ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా ఘనముగా సేవా ప్లాన్లను తయారుచేస్తున్నారు కదా. సేవను చాలా వైభవముగా చేస్తున్నారు, సేవను చాలా వైభవముగా చెయ్యటము అనగా సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపముగా తీసుకురావటము. భాషణ చేసి వచ్చాము అని ఊరికే అలా అనుకోకండి కానీ సమయాన్ని సమీపముగా తీసుకువస్తున్నారు. సేవ బాగా చేస్తున్నారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కానీ బాప్‌దాదా చూస్తున్నారు, సమయము సమీపముగా వస్తూ ఉంది, మీరు తీసుకువస్తున్నారు. కేవలం లక్షమందిని, లక్షన్నర మందిని ప్రోగు చేసారనే కాదు, మీరు సమయాన్ని సమీపముగా తీసుకువచ్చారు. ఇప్పుడు గుజరాత్ చేసింది, తర్వాత బొంబాయి చేస్తుంది, ఇతరులు కూడా చేస్తున్నారు. పోనీ, లక్షమంది కాకపోయినా 50 వేలమందైనా ఫర్వాలేదు కానీ సందేశాన్ని ఇస్తున్నారు. మరి సందేశముతోపాటు సంపన్నత యొక్క తయారీ కూడా జరుగుతుందా? తయారీ ఉందా? వినాశనాన్ని పిలుస్తున్నారు, మరి తయారీ ఉందా? దాదీ ప్రశ్న అడిగారు, త్వరత్వరగా ప్రత్యక్షత జరగాలంటే ఇప్పుడు ఎటువంటి ప్లాన్‌ను తయారుచేయాలి అని. అందుకు బాప్‌దాదా అంటున్నారు, ప్రత్యక్షత అనేది క్షణము యొక్క విషయము, కానీ ప్రత్యక్షత కంటే ముందు బాప్‌దాదా అడుగుతున్నారు, స్థాపనవారు ఎవరెడీగా ఉన్నారా? పరదా తెరవమంటారా? లేదా కొందరు చెవులను అలంకరించుకుంటూ ఉన్నారా, కొందరు తలను అలంకరించుకుంటూ ఉన్నారా? తయారుగా ఉన్నారా? అయిపోతారా, ఎప్పుడు? డేట్ చెప్పండి. ఎలాగైతే ఇప్పుడు డేట్‌ను ఫిక్స్ చేసారు కదా! ఈ మాసము లోపల సందేశాన్ని ఇవ్వాలి అని! అలాగే అందరూ ఎవరెడీగా ఉండాలి, కనీసం 16 వేలమందైనా ఎవరెడీగా ఉండాలి, 9 లక్షల విషయము వదిలేయండి, దానిని కూడా వదిలేయండి, 16 వేలమందైతే తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? చప్పట్లు కొట్టాలా? ఊరికే అలా సరే అని చెప్పకండి. ఎవరెడీగా అయిపోండి, అప్పుడు బాబా టచ్ చేస్తారు, చప్పట్లు కొడతారు, ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది, సైన్స్ వారు తమ పనిని ప్రారంభిస్తారు. ఆలస్యమేముంది, అందరూ రెడీగా ఉన్నారు. 16 వేల మంది తయారుగా ఉన్నారా? ఉన్నారా తయారుగా? తయారైపోతారా? (మీకే బాగా తెలుసు). ఈ జవాబు తప్పించుకోవటానికి ఇచ్చే జవాబు. ఎవరెడీగా ఉన్నాము, సంపూర్ణ పవిత్రతతో సంపన్నముగా అయిపోయాము అని 16 వేల మంది నుండి రిపోర్ట్ రావాలి. బాప్‌దాదాకు చప్పట్లు కొట్టడానికి ఆలస్యమేమీ లేదు. డేట్ చెప్పండి (మీరు డేట్ ఇవ్వండి) అందరినీ అడగండి. చూడండి, జరిగేదే ఉంది కానీ వినిపించాము కదా - ‘నేను’ అనే పదము సంపూర్ణముగా పరివర్తన అవ్వాలి, అప్పుడు బాబాతోపాటు వెళ్తారు. లేదంటే వెనుక-వెనుక వెళ్ళాల్సి వస్తుంది. బాప్‌దాదా అందుకే ఇప్పుడే గేట్ తెరవరు ఎందుకంటే కలిసి వెళ్ళాలి.
బ్రహ్మాబాబా పిల్లలందరినీ అడుగుతున్నారు - గేట్ తెరిచే డేట్‌ను చెప్పండి. గేట్ తెరవాలి కదా! వెళ్ళాలి కదా! ఈరోజు జరుపుకోవటము అనగా తయారవ్వటము. కేవలం కేక్‌ను కట్ చెయ్యటము కాదు, కానీ ‘నేను’ అనేదానిని సమాప్తము చేస్తారు. ఆలోచిస్తున్నారా లేక ఆలోచించేసారా? ఎందుకంటే బాప్‌దాదా వద్దకు అమృతవేళ అందరి నుండి చాలా వెరైటీ సంకల్పాలు చేరుకుంటాయి. కనుక పరస్పరం చర్చించుకుని బాబాకు డేట్ చెప్పండి. డేట్ ఫిక్స్ చేయనంత వరకు ఏ పనులూ జరగవు. మొదట మహారథులు పరస్పరములో డేట్ ఫిక్స్ చెయ్యండి, తర్వాత అందరూ ఫాలో చేస్తారు. ఫాలో చేసేవారు సిద్ధముగా ఉన్నారు మరియు మీ ధైర్యము వలన ఇంకా ఎక్కువ బలము లభిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు చూడండి, ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చిన కారణంగా సిద్ధమైపోయారు కదా! అలా సంపన్నముగా అయ్యే ప్లాన్‌ను తయారుచేయండి. కర్మాతీతముగా అవ్వాల్సిందే అన్న ధ్యాసలో నిమగ్నమైపోండి. ఏం జరిగినా కానీ తయారవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, జరగాల్సిందే. సైన్స్ వారి శబ్దము కూడా, వినాశనము చేసేవారి శబ్దము కూడా బాబా చెవులకు చేరుకుంటుంది, వారు కూడా అంటున్నారు - ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అని. అడ్వాన్స్ పార్టీ వారు కూడా అంటున్నారు – డేట్‌ను ఫిక్స్ చేయండి, డేట్‌ను ఫిక్స్ చేయండి అని. బ్రహ్మాబాబా కూడా డేట్‌ను ఫిక్స్ చేయండి అని అంటున్నారు. కనుక ఈ మీటింగ్ చెయ్యండి. బాప్‌దాదా ఇప్పుడు ఇంత దుఃఖాన్ని చూడలేకపోతున్నారు. ముందుగా శక్తులైన మీకు, దేవతలైన పాండవులకు దయ రావాలి. ఎంతగా పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ పిలుపు యొక్క ధ్వని మీ చెవులలో మారుమ్రోగాలి. సమయము యొక్క పిలుపు అన్న ప్రోగ్రామును చేస్తారు కదా! ఇప్పుడు భక్తుల పిలుపును కూడా వినండి, దుఃఖితుల పిలుపును కూడా వినండి. సేవ చేసే విషయములో నంబర్ మంచిగా ఉంది, దీనికైతే బాప్‌దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తారు, ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి, గుజరాత్వారు నంబర్‌వన్ తీసుకున్నారు, కనుక నంబర్‌వన్ తీసుకున్నందుకు అభినందనలు. ఇప్పుడు కొంచెం-కొంచెం వారి పిలుపును వినండి కదా, పాపం వారు చాలా పిలుస్తున్నారు, మనస్ఫూర్తిగా పిలుస్తున్నారు, విలవిలలాడుతున్నారు. సైన్స్ వారు కూడా చాలా ఆర్తనాదాలు చేస్తున్నారు, ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని పిలుస్తున్నారు. ఈ రోజైతే కేక్ కట్ చేసుకోండి, కానీ రేపటి నుండి పిలుపును వినండి. జరుపుకోవటమైతే సంగమయుగపు వేడుక. ఒకవైపు జరుపుకోండి, మరొకవైపు ఆత్మలను తయారుచెయ్యండి. అచ్ఛా. మరి ఏం విన్నారు?
దుఃఖితులపై కొంచెం దయ చూపించండి అన్న మీ పాట ఉంది. మీరు తప్ప ఇంకెవరూ దయ చూపించలేరు, అందుకే ఇప్పుడు సమయమనుసారముగా దయలో మాస్టర్ సాగరులుగా అవ్వండి. స్వయం పట్ల కూడా దయ, ఇతర ఆత్మల పట్ల కూడా దయ. ఇప్పుడు మీ ఈ స్వరూపముగా లైట్ హౌస్‌గా అయ్యి రకరకాల లైట్ల యొక్క కిరణాలను ఇవ్వండి. మొత్తము విశ్వములోని అప్రాప్త ఆత్మలకు ప్రాప్తి అనే అంచలి యొక్క కిరణాలను ఇవ్వండి. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులను చూసి బాప్‌దాదాకు డబల్ సంతోషం కలుగుతుంది, ఎందుకని? ఎందుకని డబల్ సంతోషం కలుగుతుంది? డబల్ విదేశీయులు డబల్ అద్భుతాన్ని చేసి చూపించినందుకు బాప్‌దాదాకు విశేషమైన సంతోషం ఉంది. ఏ అద్భుతాలను చూపించారు? చూడండి, ఇప్పుడు ఈ గ్రూప్‌లో భిన్న-భిన్న దేశాల వృక్షం యొక్క కొమ్మలు వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా 60 దేశాల నుండి వచ్చారు, ఇంకా కూడా చాలామంది వస్తారు. మరి భిన్న-భిన్న వృక్షం యొక్క కొమ్మలు ఒకే చందన వృక్షంగా అయ్యారు. ఈ అద్భుతాన్ని చేసారు. ఒకే వృక్షం యొక్క కొమ్మలు కదా. లేక వేరువేరా? ఒకటేనా? మరో అద్భుతం – భిన్న-భిన్న దేశ కల్చర్లు ఒకే కల్చర్‌గా అయిపోయాయి. విదేశం యొక్క కల్చర్ కాదు, భారత్ యొక్క కల్చర్ కాదు, ఒకే బ్రాహ్మణ కల్చర్‌గా అయ్యారు. మరి ఇప్పుడు ఏ కల్చర్ వారు మీరు? విదేశమా లేక భారత్ కల్చరా? బ్రాహ్మణ కల్చర్. ఒకే కల్చర్, ఒకే చందన వృక్షంగా అయ్యారు. మరి ఈ డబల్ అద్భుతానికి బాప్‌దాదాకు డబల్ సంతోషంగా ఉంది. 60 దేశాలు గుర్తున్నాయా లేక ఒకే మధుబన్ గుర్తుందా? మధుబన్ నివాసులు కదా! అందుకే బాప్‌దాదాకు డబల్ సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కదా! ఎంత సంతోషం ఉంది? చాలా సంతోషం ఉంది. సదా సంతోషంగా ఉండండి, వర్ధిల్లండి, ఇతరులను కూడా సంతోషంగా వర్ధిల్లేలా చేయండి. సభ మంచిగా అనిపిస్తుంది, ఇంటర్నేషనల్ సభ కదా! మరి మీ అందరికీ బాప్‌దాదా అలౌకిక జన్మకు అభినందనలు ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
సేవ టర్న్ కర్ణాటక వారిది:- మంచిది, సేవ యొక్క ఈ గోల్డెన్ ఛాన్స్, పరివారానికి దగ్గరగా తీసుకువచ్చే ఛాన్స్. చూడండి, సేవలో వచ్చారు అంటే అందరి దృష్టి ఎవరిపై పడుతుంది? కర్ణాటక వారు సేవ చేస్తున్నారు. అంటే అందరికీ కర్ణాటక గుర్తుకు వస్తుంది, మరి మీకు స్మృతి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు కర్ణాటక పట్ల బాప్‌దాదాకు ఒక శ్రేష్ఠమైన ఆశ ఉంది, అది ఇంకా పూర్తి చేయలేదు. అదేమిటో చెప్పమంటారా? టీచర్లు, చెప్పమంటారా? కర్ణాటకలో వారస క్వాలిటీ వారు తయారు కావచ్చు అని బాప్‌దాదా చూసారు. 2-4 స్థానాలు ఇంకా కూడా ఉన్నాయి, వారి గురించి మాట్లాడటం లేదు, కానీ కర్ణాటక ధరణి నుండి వారసులు చాలామంది వెలువడే అవకాశం ఉంది. (అందరూ చప్పట్లు కొట్టారు) కేవలం చప్పట్లు కొట్టడం కాదు, వెలికితీసి చూపించండి. మంచి మంచి వారున్నారు, బాప్‌దాదా దృష్టి వారిపై పడుతుంది కానీ టీచర్ల దృష్టి వారిపై పడటం లేదు. విన్నారా! పాండవులు, విన్నారా? చాలామంది వెలువడవచ్చు. బాప్‌దాదాకు మూలమూలన ఉన్నవారు గుర్తుకు వస్తారు. పూర్తి యజ్ఞాన్ని కేవలం కర్ణాటక వారసులే నడిపించవచ్చు. ఏమి భావిస్తున్నారు? ఇప్పుడు వెలికి తీయండి, సహజంగా వెలువడుతారు. కేవలం అటెన్షన్ ఇవ్వలేదు, అంతే. జనరల్ సేవలో ఉండిపోయారు. పర్సనల్ సేవ, మనసా సేవ యొక్క చమత్కారము వారసులను వెలువడేలా చేస్తుంది. పాలన కావాలి. లేపండి, బాధ్యత తీసుకోండి. మేము సహయోగిగా అవుతాము అని దాదీ గారికి చెప్పండి. తయారు చేస్తాము మరియు తయారవుతాము. తయారవుతారా? అచ్ఛా. చూస్తాము, 6 నెలలలో చూస్తాము. (ముగ్గురు దాదీలు రావాలి) దాదీలైతే వచ్చేస్తారు, మీరైతే ముందు తయారు చేయండి. దాదీలు వస్తారు, కొంతమంది వారసులను తయారు చేయండి అప్పుడు దాదీలను పిలవండి, వస్తారు. ఏ ప్లాన్ తయారు చేయాలనుకుంటే అది తయారు చేయండి, కానీ వారసులను తయారు చేయండి. పాలన ఇవ్వవలసి ఉంటుంది. వారస క్వాలిటీని ఎలా వెలికి తీయాలి అన్న ఒక్క విషయం గురించి టీచర్లు క్లాసు చేసి వెళ్ళండి. (దాదీ జానకితో) ఈ క్లాసును చేయండి. ఏమనుకుంటున్నారు, వీలవుతుందా? అచ్ఛా, 6 నెలల సమయాన్ని ఇస్తున్నాము, చూస్తాము. ఎక్కడి నుండి మైక్‌లు ఎక్కువ వెలువడతారో చూడండి, ఎక్కడి నుండి వారసులు ఎక్కువ వెలువడతారో చూడండి. జరగవలసిందే. సమయం సమాప్తి అయినప్పుడు అందరూ వెలువడవలసిందే కదా. తప్పకుండా వెలువడతారు. విన్నారా! కేవలం తల ఊపకండి, చేసి చూపించండి. కర్ణాటక వారు తల చాలా బాగాఊపుతారు, ఇలా ఇలా అంటారు. మంచిగా అనిపిస్తుంది. క్వాలిటీ చాలా బాగుంది. అచ్ఛా.
స్పార్క్ గ్రూప్:- అచ్ఛా, ఎలాంటి ప్లాన్ తయారు చేయండంటే మీ మీటింగ్‌తో మీరే మీ-మీ స్థానాలలో సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేందుకు ఉదాహరణగా అవ్వాలి. రాబోయే సమయంలో ఏ తయారీలు ఉండాలి అన్న ప్లానే తయారు చేస్తున్నారు కదా! బాప్‌దాదా ఇదే సూచనను ఇస్తున్నారు – ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి సహజమైన విధి – ముందు, ఏకాగ్రత శక్తి కావాలి. మనసు ఏకాగ్రమవ్వాలి, ఏకాగ్రత శక్తి నిర్ణయాన్ని మంచిగా తీసుకుంటుంది. అందుకే చూడండి, కోర్టులో కూడా తక్కెడను చూపిస్తారు. నిర్ణయానికి గుర్తు -తక్కెడ, అందుకే ఏకాగ్రమైన ముల్లును చూపిస్తారు. కావున ఎటువంటి సమస్యనైనా ఏ సమయంలో అయితే నలువైపుల అలజడి ఉంటుందో ఆ సమయంలో మనసు ఏకాగ్రత శక్తి కలిగి ఉండాలి, ఎక్కడ కావాలంటే అక్కడ మనసు ఏకాగ్రమవ్వాలి, నిర్ణయం జరగాలి. ఏ పరిస్థితిలో ఏ శక్తి కార్యంలోకి తీసుకురావాలి అన్నది తెలుస్తుంది. ఏకాగ్రత శక్తి దృఢతను స్వతహాగానే తీసుకువస్తుంది. దృఢత సఫలతకు తాళం చెవి. మరి ఈ విధంగా మిమ్మల్ని మీరు ఒక ఉదాహరణగా తయారు చేసుకుని ఇతరులకు కూడా ప్రేరణను ఇస్తూ ఉండండి. సరేనా! మంచిది. ప్రతి వర్గం వారికి తమ సేవ యొక్క ఉన్నతిని చేయాలన్న ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి. మంచిది, మంచిగానే జరుగుతుంది. బాగుంది, భిన్న-భిన్న సెంటర్లవారు, మంచి-మంచి వారు కార్యంలో నిమగ్నమై ఉన్నారు, ప్లాన్ తయారు చేయడంలో మునిగి ఉన్నారు. సఫలత ఉండనే ఉంది. అచ్ఛా.
అచ్ఛా – మధురాతి మధురమైన మాతలందరికీ, కుమారీలకు ప్రత్యేకంగా బాప్‌దాదా యొక్క ఆశీర్వాదాలు నిండిన ప్రియస్మృతులు. మాతలు లేనిదే అందం లేదు, సెంటర్ లేదు, మధుబన్ లేదు. ప్రత్యేకంగా మాతలను ముందుకు నడిపించడానికి బాబా రావలసి వచ్చింది. మాతలను ఒకవేళ లేపితే పూర్తి హాల్ నిల్చుంటుంది, అందుకని కూర్చునే ఉండండి. ఈరోజు పాండవులు కూడా తక్కువేమీ లేరు, సగం-సగం ఉన్నారు. మంచిది, చూడండి, విజయము యొక్క గాయనము పాండవులది. శక్తుల గాయనము శక్తులు ఇవ్వడము. మరి పాండవుల పేరే విజయాన్ని గుర్తుకు తెప్పిస్తుంది. అందుకే పాండవులు ప్రతి ఒక్కరూ తమ మస్తకంపై విజయ తిలకాన్ని సదా స్మృతిలో పెట్టుకోవాలి. అచ్ఛా – పిల్లలు కూడా వచ్చారు. మేము ఉండిపోకూడదు అని పిల్లలు అంటారు. పిల్లలతో కూడా అందం ఉంటుంది. చిన్న-చిన్న పిల్లలు కూడా, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను జ్ఞానంలోకి తీసుకువచ్చారన్న విషయాన్ని బాప్‌దాదా విన్నారు. వాహ్! పిల్లలూ వాహ్! పరివారం యొక్క కళ్యాణం కోసం పిల్లలు నిమిత్తమవుతారు. మరి పిల్లలది కూడా బలిహారమే.
అచ్ఛా, టీచర్లందరూ ఉన్నారే బాప్‌దాదాకు రైట్ హ్యాండ్స్. పాండవులు లెఫ్ట్ హ్యాండ్స్ కాదు, పాండవులు రైట్ హ్యాండ్స్. లెఫ్ట్ హ్యాండ్స్ వేరేవారు. మీరందరూ రైట్ హ్యాండ్స్. టీచర్లు ఇప్పుడు సాక్షాత్కారమూర్తులుగా అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఈ ‘నేను’ అన్నదానిని ఈరోజు ఫుల్ సరెండర్ చేసేస్తారు కదా. అప్పుడు సాక్షాత్కారం జరగడం మొదలవుతుంది. ఇక్కడ నేను అన్న పరదా ముందుకు వచ్చేస్తుంది. ఈ పరదా తొలగిపోతే ప్రతి ఒక్కరి ద్వారా బాబా సాక్షాత్కారము జరుగుతుంది. అప్పుడు ఈ స్లోగన్ వినిపిస్తుంది – సాక్షాత్తూ బాబా వచ్చేసారు, వచ్చేసారు, వచ్చేసారు. సాక్షాత్కారము దివ్య దృష్టితో కాదు, సాక్షాత్ రూపము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అందరి నోటి నుండి ఇదే మాట వినిపిస్తుంది – వీరైతే సాక్షాత్తూ బాబా లాగే ఉన్నారు. ఇటువంటి తయారీ చేస్తున్నారు కదా! అచ్ఛా!
సాక్షాత్తూ బాబా సమాన శ్రేష్ఠాత్మలందరికీ, సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే బాబా యొక్క సమీప ఆత్మలకు, సదా అన్ని అడుగులను బాబా సమానముగా వేసే పిల్లలకు, నలువైపులా ఉన్న బ్రాహ్మణ జన్మ అభినందనలకు పాత్రులైన పిల్లలకు, సదా ఏకాగ్రతా శక్తి సంపన్న ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమాపదమ్ రెట్లు జన్మదిన శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు మరియు నమస్తే.
దాదీలతో:- (గుజరాత్ యొక్క సేవా సమాచారాన్ని వినిపించారు – అందరూ ఏకమతంతో కలిసి 28 రోజులలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసారు) సంకల్పాలలో ఎంత శక్తి ఉంటుందో ప్రత్యక్ష రూపంలో చూసారు కదా. వ్యర్థం నుండి సెలవు దొరికింది. ఐకమత్యము వచ్చింది. సేవ మరియు యోగము రెండూ మంచిగా జరిగాయి. (అలసిపోలేదు కూడా) సేవ యొక్క చార్టు నలువైపుల మంచిగా ఉంది, ఇప్పుడు కేవలం అందరినీ సంపన్నంగా తయారు చేయండి. కర్ణాటక చాలా చేయవచ్చు. కేవలం అక్కడ పాలన కావాలి. (కర్ణాటకలో చాలా సెంటర్లు ఉన్నాయి) సెంటర్లు ఏమిటి అక్కడ పెద్దపెద్దవారు కూడా ఉన్నారు. ఎవరైనా చేసి చూపించండి, కర్ణాటకలో ఎవరైనా సేవ చేసి చూపించండి. చేయగలరు, ప్లాన్ తయారు చేయండి. మంచిది. ఇకపోతే మీరు (దాదీ) అయితే సదా భూజాలలో ఉంటారు. భుజాలలో సదా ఇమిడి ఉంటారు. బాప్‌దాదాకు సహయోగి భుజం కూడా మరియు భుజాలలో కూడా ఇమిడి ఉంటారు. సేవ చేసేటప్పుడు స్వయం భుజం అవుతారు మరియు ఉండటానికి భుజాలలో ఇమిడి ఉంటారు. అచ్ఛా – మేమూ భుజాలము, మేమూ భుజాలలో ఉన్నాము అని దాదీలు అంటున్నారు, తతత్వమ్. మీరు ఎక్కడ ఉంటారు? బాబా భుజాలలో ఉంటారు కదా, లేక బయటకు వెళ్ళిపోతారా? ఎవరైతే ప్రియమైనవారు ఉంటారో వారు సదా భుజాలలోనే ఉంటారు. భుజాలుగా అయ్యి సేవలో ఉంటారు. ఎంతటి భాగ్యశాలురు, భగవంతుని భుజాలు, భుజాలనే బాహుబలము అంటారు. మరి బాబా భుజాలు అంటే బాబా హృదయానికి గుర్తు. అందుకే దేవీలకు, దేవతలకు ఎక్కువ భుజాలను చూపిస్తారు. కాళ్ళను చూపించరు, భుజాలను చూపిస్తారు. తలలు కూడా రావణుడికి చూపిస్తారు. దేవీ-దేవతలకు భుజాలను చూపిస్తారు ఎందుకంటే భుజాలు బలానికి గుర్తు. మరి ఎన్ని భుజాలు ఉన్నాయో చూడండి. అచ్ఛా. ఫస్ట్ భుజాలు. ఆది రత్నాలు ఐకమత్యము యొక్క బాధ్యతను తీసుకున్నారు. ఒకరు స్థాపనకు ఆది రత్నాలు, రెండవ వారు సేవా ఆరంభానికి ఆది రత్నాలు. ఇరువురు ఆది రత్నాలకు మహత్వము ఉంది. ఉంది కదా! సేవ యొక్క ఆది రత్నాలు కదా – వీరంతా ముందు కూర్చుని ఉన్నారు. మంచిది. సమయాన్ని సమీపంగా తీసుకురండి. ప్రవృత్తి వారు మరింతగా నివృత్తిలో ఉంటారు. చూడండి, ఎప్పటినుండైతే ప్రవృత్తి వారు సేవలో ముందుకు వచ్చారో అప్పటి నుండి వాయుమండలం పరివర్తన అయింది. లేకపోతే ఒకప్పుడు, మీ నుండి దూరంగా వెళ్ళేవారు. ఇప్పుడు ఏమంటారు, రండి, మా వద్దకు రండి. ఇది ప్రవృత్తి వారు చేసిన అద్భుతం. ప్రవృత్తి వారు 108 మాలలోకి రాలేరు అని లేదు. మనసుతో సరెండర్, సరెండర్ లిస్టులోనే ఉన్నారు. అచ్ఛా.
67వ త్రిమూర్తి శివ జయంతి సందర్భంగా ప్రియమైన అవ్యక్త బాప్‌దాదా తమ హస్తాలతో శివ ధ్వజారోహణ చేసారు మరియు అందరికీ అభినందనలను తెలిపారు:-
ఈరోజు అందరూ తమ జన్మదిన శుభాకాంక్షలను ఇచ్చారు మరియు తీసుకున్నారు, జెండాను కూడా ఎగురవేసాము. కానీ ఇప్పుడు విశ్వమనే గ్లోబ్‌పై ఆత్మలందరూ నిలబడి మీ అందరి ముఖాలలో బాబా జెండాను చూసే రోజును త్వరగా తీసుకురావాలి. వస్త్రముతో తయారుచేసిన జెండా అయితే నిమిత్తమాత్రము, కానీ ఒక్కొక్క బిడ్డ యొక్క ముఖము బాబా చిత్రాన్ని చూపించాలి. అటువంటి జెండాను ఎగురవేయాలి. ఆ రోజును కూడా చాలా, చాలా, చాలా త్వరగా తీసుకురావాలి, అది రావాలి, రావాలి. అచ్ఛా!