Search for a command to run...
17 Mar 2003
‘‘ఈ సంవత్సరము - స్వమానములో ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, అందరికీ సహయోగులుగా అవ్వండి మరియు సమర్థులుగా తయారు చెయ్యండి’’
17 March 2003 · తెలుగు
ఈరోజు భాగ్యవిధాత అయిన బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి మస్తకముపై మూడు భాగ్య రేఖలను చూస్తున్నారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ, రెండవది సత్యమైన శిక్షకుని శ్రేష్ఠ శిక్షణ యొక్క భాగ్య రేఖ, మూడవది శ్రీమతము యొక్క మెరుస్తూ ఉన్న రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకము మధ్యలో మూడు రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ మూడు భాగ్య రేఖలను చూస్తున్నారు కదా. భాగ్యవిధాతయే పిల్లలైన మీకు తండ్రి అన్నప్పుడు మీకు కాకుండా శ్రేష్ఠ భాగ్యము ఇంకెవరికి ఉండగలదు! బాప్‌దాదా చూస్తున్నారు, విశ్వములో అనేక కోట్ల ఆత్మలు ఉన్నారు కానీ అన్ని కోట్ల నుండి 6 లక్షల మంది పరివారము అంటే... ఎంత కొద్దిమంది! కోట్లలో కొద్దిమంది అయ్యారు కదా! ఆ మాటకొస్తే ప్రతి మానవుని జీవితములో ఈ మూడు విషయాలు - పాలన, చదువు మరియు శ్రేష్ఠ మతము, ఈ మూడూ అవసరమే. కానీ ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మలు లేక మానవాత్మల మతము, పాలన, చదువుకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. కనుక ఇంతటి శ్రేష్ఠ భాగ్యము సంకల్పములో కూడా లేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసు - ‘పొందేసాము’ అని పాడుతుంది. పొందేసారా లేక పొందాలా? ఏమంటారు? పొందేసారు కదా! బాబా కూడా ఇటువంటి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. పిల్లలేమో - వాహ్ బాబా వాహ్! అని అంటారు మరియు బాబా - వాహ్ పిల్లలూ వాహ్! అని అంటారు. ఈ భాగ్యాన్ని కేవలము స్మృతిలోనే ఉంచుకోవడం కాదు, సదా స్మృతి స్వరూపులుగా ఉండాలి. చాలామంది పిల్లలు చాలా బాగా ఆలోచిస్తారు కానీ ఆలోచనా స్వరూపులుగా అవ్వకూడదు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు. ఆలోచనా స్వరూపమనేది సమర్థ స్వరూపము కాదు.
బాప్‌దాదా పిల్లల రకరకాల లీలలను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కొందరు ఆలోచనా స్వరూపులుగా ఉంటారు, సదా స్మృతి స్వరూపులుగా ఉండరు. ఒక్కోసారి ఆలోచనా స్వరూపము, ఒక్కోసారి స్మృతి స్వరూపము. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో, వారు నిరంతరము న్యాచురల్ స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచనా స్వరూపులుగా ఉంటారో, వారు శ్రమ చెయ్యవలసి ఉంటుంది. ఈ సంగమయుగము శ్రమపడే యుగము కాదు, ఇది సర్వ ప్రాప్తుల అనుభవాల యుగము. 63 జన్మలు శ్రమించారు కానీ ఇప్పుడిది శ్రమకు ఫలాన్ని ప్రాప్తి చేసుకునే యుగము అనగా సమయము.
దేహభానపు స్మృతిలో ఉండటానికి ఏమైనా శ్రమ చేసారా అన్నది బాప్‌దాదా చూస్తున్నారు. నేను ఫలానాను, నేను ఫలానాను... అని ఈ శ్రమ ఏమైనా చేసారా? అది న్యాచురల్‌గానే ఉంది కదా! దేహాభిమానము అనేది స్వభావము అయిపోయింది కదా! అది ఎంత పక్కా స్వభావము అయిపోయిందంటే, ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలకు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో దేహాభిమానము తనవైపుకు ఆకర్షిస్తుంది. నేను ఆత్మను, నేను ఆత్మను అని అనుకుంటారు, కానీ దేహభానము ఎంత సహజము అయిపోయిందంటే, అది పదే-పదే వద్దనుకుంటున్నా, ఆలోచించకపోయినా దేహభానములోకి వచ్చేస్తారు. బాప్‌దాదా చెప్తున్నారు - ఇప్పుడు మరజీవా జన్మలో ఆత్మాభిమానము అనగా దేహీ-అభిమాని స్థితి కూడా అంతే స్వభావము వలె మరియు సహజము అయిపోవాలి. నేను ఆత్మను, నేను ఆత్మను అని శ్రమ చెయ్యాల్సిన అవసరము రాకూడదు. ఉదాహరణకు పిల్లలు జన్మించిన తర్వాత, వారికి కాస్త అర్థం చేసుకునే తెలివి వచ్చినప్పుడు - నువ్వు ఎవరివి, ఎవరివాడివి అని ఆ బిడ్డకు పరిచయము ఇస్తారు, అలాగే బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకు జన్మించటంతోనే ఏ పరిచయము లభించింది? మీరు ఎవరు? ఆత్మ పాఠము పక్కా చేయించటం జరిగింది కదా! కనుక ఈ మొదటి పరిచయము న్యాచురల్ నేచర్‌గా (సహజ స్వభావముగా) అయిపోవాలి. స్వభావము అనేది సహజముగా మరియు నిరంతరము ఉంటుంది, గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము ఉండదు, అలాగే బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికీ ఇప్పుడు సమయమనుసారముగా దేహీ-అభిమాని స్థితి సహజముగా ఉండాలి. కొందరు పిల్లలకు అలా ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉండటం లేదు, స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఇప్పుడు నిరంతరము మరియు సహజముగా స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణులందరికీ చివర్లో వచ్చే చిన్నపాటి అంతిమ పరీక్ష ఇదే - ‘‘నష్టోమోహా స్మృతి స్వరూపము’’.
మరి ఈ సంవత్సరము ఏం చేస్తారు? ఈ సంవత్సరములో ఏ విశేష లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. కావున బాప్‌దాదా అంటున్నారు - సదా దేహీ-అభిమాని, స్మృతి స్వరూప భవ. జీవన్ముక్తి అయితే ప్రాప్తి అయ్యేదే ఉంది కానీ జీవన్ముక్తులుగా అయ్యే కంటే ముందు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఈ స్థితి సమయాన్ని సమీపముగా తీసుకువస్తుంది మరియు మొత్తము విశ్వములోని మీ సోదర-సోదరీలను దుఃఖము, అశాంతి నుండి విముక్తులుగా చేస్తుంది. మీ ఈ స్థితి ఆత్మల కొరకు ముక్తిధామము యొక్క తలుపులను తెరుస్తుంది. మరి మీ సోదర-సోదరీలపై దయ కలగటం లేదా! నలువైపులా ఆత్మలు ఎంతగా ఆర్తనాదాలు చేస్తున్నారు! మీ ముక్తి సర్వులకు ముక్తిని ఇప్పిస్తుంది. సహజముగా స్మృతి మరియు సమర్థ స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు అన్నదానిని చెక్ చేసుకోండి. సమర్థ స్వరూపులుగా అవ్వటమే వ్యర్థాన్ని సహజముగా సమాప్తము చేస్తుంది. పదే-పదే శ్రమ చెయ్యాల్సిన అవసరము ఉండదు.
ఇప్పుడు ఈ సంవత్సరము బాప్‌దాదా పిల్లలపై ఉన్న స్నేహము కారణంగా ఏ బిడ్డ యొక్క ఏ సమస్యలోనూ శ్రమను చూడాలనుకోవటం లేదు. సమస్య సమాప్తమైపోవాలి మరియు సమాధాన సమర్థ స్వరూపము ఉండాలి. ఇది సాధ్యమేనా? దాదీలూ చెప్పండి, ఇది సాధ్యమేనా? టీచర్లు చెప్పండి, సాధ్యమేనా? పాండవులూ, సాధ్యమేనా? మళ్ళీ సాకులు చెప్పకండి - ఇది ఉంది కదా, ఇలా జరిగింది కదా, ఇది జరగకపోతే ఇలా అయ్యేది కాదు! బాప్‌దాదా చాలా మధురాతి-మధురమైన ఆటలను చూసి ఉన్నారు. ఏదేమైనా కానీ, హిమాలయము కంటే పెద్దగా, 100 రెట్లు సమస్యా స్వరూపము ఉన్నా కానీ, తనువు ద్వారానైనా, మనసు ద్వారానైనా, వ్యక్తుల ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా సమస్య వస్తే, ఆ పర-స్థితి అనేది మీ స్వ-స్థితి ముందు అసలేమీ కాదు మరియు స్వ-స్థితికి సాధనము - స్వమానము. సహజ రూపములో స్వమానము ఉండాలి. లేదు, లేదు, నేను స్వదర్శన చక్రధారిని, నేను కంటిరత్నాన్ని, నేను హృదయ సింహాసనాధికారిని... అని గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఉండకూడదు, పదే-పదే శ్రమపడాల్సిన అవసరం రాకూడదు. నేను అలా ఉన్నాను - అంతే! మీరు కాకుండా మరెవరైనా అలా అయ్యేది ఉందా! కల్పపూర్వము ఎవరు అయ్యారు? వేరే ఎవరైనా అయ్యారా లేక మీరే అయ్యారా? మీరే అలా ఉండేవారు, ఇప్పుడూ మీరే అలా ఉన్నారు, ప్రతి కల్పము మీరే అలా అవుతారు. ఇది నిశ్చితము. వీరు ఆ కల్పపూర్వము వారే అని బాప్‌దాదా అందరి ముఖాలను చూస్తున్నారు. ఈ కల్పానికి చెందినవారా లేక అనేక కల్పాలకు చెందినవారా? అనేక కల్పాలకు చెందినవారు కదా! అవునా? ప్రతి కల్పానికి చెందినవారు చేతులెత్తండి. మరి ఇది నిశ్చితమే కదా, మీకైతే పాస్ సర్టిఫికేట్ లభించేసింది కదా లేక తీసుకోవాలా? లభించేసింది కదా? లభించిందా లేక తీసుకోవాలా? కల్పపూర్వము లభించింది, ఇప్పుడెందుకు లభించదు. కనుక సర్టిఫికేట్ లభించి ఉంది అన్న ఈ స్మృతి స్వరూపులుగానే అవ్వండి. పాస్ విత్ ఆనర్లుగా అయినా లేక కేవలం పాస్ అయినా, ఈ తేడా అయితే ఉంటుంది కానీ అది మాత్రము మేమే. పక్కా కదా! లేదా ట్రైన్లో వెళ్తూ-వెళ్తూ మర్చిపోతారా, విమానం ఎక్కిన తరువాత ఎగిరిపోతుందా? లేదు.
చూడండి, శివరాత్రిని నలువైపులా ఉల్లాస-ఉత్సాహాలతో జరుపుకోవాలి అని ఈ సంవత్సరము దృఢ సంకల్పము చేసారు కదా, జరుపుకున్నారు కదా! దృఢ సంకల్పముతో ఏదైతే అనుకున్నారో అది జరిగింది కదా! మరి ఇది ఏ విషయము యొక్క అద్భుతము? ఏకత మరియు దృఢత. 67 ప్రోగ్రాములు చెయ్యాలని అనుకున్నారు కానీ బాప్‌దాదా చూసారు - కొంతమంది పిల్లలు దానికంటే కూడా ఎక్కువ ప్రోగ్రాములు చేసారు. ఇది సమర్థ స్వరూపానికి గుర్తు, ఇది ఉల్లాస-ఉత్సాహాలకు ప్రత్యక్ష ప్రమాణము. స్వతహాగానే నలువైపులా చేసారు కదా! ఇదే విధంగా అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఈ సంకల్పము చెయ్యండి - ఇప్పుడు సమయాన్ని సమీపముగా తీసుకురావాల్సిందే. ఆత్మలకు ముక్తిని ఇప్పించాలి. కానీ ఎప్పుడైతే మీరు ఆలోచనను స్మృతి స్వరూపములోకి తీసుకువస్తారో, అప్పుడే ఇది జరుగుతుంది.
బాప్‌దాదా విన్నారు - విదేశీయులకు విశేషముగా స్నేహ మిలనము మరియు మీటింగ్ ఉంది మరియు భారత్ వారికి కూడా మీటింగ్ ఉంది. మరి మీటింగ్‌లో కేవలం సేవా ప్లాన్లను తయారుచెయ్యటమే కాదు, వాటిని తయారు చెయ్యండి కానీ బ్యాలెన్సుతో కూడిన ప్లాన్లు తయారుచెయ్యండి. ఒకరికొకరు ఏ విధంగా సహయోగులుగా అవ్వండి అంటే ఇక అందరూ మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యి ముందుకు ఎగురుతూ వెళ్ళాలి. దాతగా అయ్యి సహయోగాన్ని ఇవ్వండి. విషయాలను చూడకండి, సహయోగులుగా అవ్వండి. స్వమానములో ఉండండి మరియు గౌరవాన్ని ఇస్తూ సహయోగులుగా అవ్వండి ఎందుకంటే ఏ ఆత్మకైనా మీరు హృదయపూర్వకముగా గౌరవాన్ని ఇచ్చినట్లయితే అది చాలా-చాలా పెద్ద పుణ్యము ఎందుకంటే బలహీన ఆత్మను ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకువస్తే అదెంత పెద్ద పుణ్యము! పడిపోయినవారిని ఇంకా పడేయకూడదు, వారిని ఆలింగనం చేసుకోవాలి అనగా బాహ్యంగా ఆలింగనం చేసుకోవడము కాదు, ఆలింగనం చేసుకోవటము అనగా బాబా సమానముగా తయారు చెయ్యడము, సహయోగాన్ని ఇవ్వడము.
ఈ సంవత్సరము ఏమేమి చెయ్యాలి అని అడిగారు కదా? గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానములో ఉండండి, అంతే. సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారుచెయ్యండి. వ్యర్థ విషయాలలోకి వెళ్ళకండి. బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది, వారి బలహీనతనే చూస్తూ ఉంటే సహయోగిగా ఎలా అవుతారు! సహయోగము ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. అన్నింటికంటే సహజ పురుషార్థము, వేరే ఇంకేమీ చెయ్యలేకపోతే అన్నింటికంటే సహజ పురుషార్థము - ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. గౌరవాన్ని ఇవ్వండి మరియు మహిమాయోగ్యులుగా అవ్వండి. గౌరవాన్ని ఇచ్చేవారే అందరి ద్వారా గౌరవనీయులుగా అవుతారు. మరియు ఎంతగా ఇప్పుడు గౌరవనీయులుగా అవుతారో, అంతగానే రాజ్యాధికారులుగా మరియు పూజ్యాత్మలుగా అవుతారు. ఇస్తూ వెళ్ళండి, తీసుకునేది లేదు. తీసుకుని ఇవ్వటము అంటే అది బిజినెస్ చేసేవారి పని. మీరైతే దాత పిల్లలు. ఇకపోతే బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. అందరూ మంచి సేవ చేసారు. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా! వాణి ద్వారా అందరూ మంచి సేవ చేసారు, సాధనాల ద్వారా కూడా సేవా రిజల్టును మంచిగా తీసుకువచ్చారు. అనేకాత్మల ఫిర్యాదును కూడా సమాప్తము చేసారు. వీటితోపాటు సమయము యొక్క తీవ్రగతితో కూడిన వేగాన్ని చూసి బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - కేవలం కొద్దిమంది ఆత్మలకు సేవ చెయ్యటము కాదు, కానీ విశ్వములోని సర్వాత్మలకు ముక్తిదాతలుగా మీరు నిమిత్తమయ్యారు ఎందుకంటే మీరు బాబాకు సహచరులు. అందుకే ఇప్పుడు సమయము యొక్క వేగము అనుసారంగా ఒకే సమయములో మూడు సేవలను కలిపి చెయ్యాలి:-
ఒకటి వాణి, రెండవది స్వయము యొక్క శక్తిశాలి స్థితి మరియు మూడవది శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్లు. ఎక్కడ సేవ చేసినా అక్కడ ఎటువంటి ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యండి అంటే ఆ వైబ్రేషన్ల ప్రభావములో వారు సహజముగానే ఆకర్షితులవుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ అందరి జడ చిత్రాలు ఎలా సేవ చేస్తున్నాయి? అవి వాణి ద్వారా మాట్లాతున్నాయా? వైబ్రేషన్లు ఎలా ఉంటాయంటే భక్తులకు వారి భావనకు ఫలము సహజంగా లభిస్తుంది. అలా వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి, వైబ్రేషన్లలో సర్వశక్తుల కిరణాలు వ్యాపిస్తూ ఉండాలి, వాయుమండలము మారిపోవాలి. వైబ్రేషన్లు ఎటువంటివంటే అవి మనసులో ముద్రించబడిపోతాయి. మీ అందరికీ అనుభవము ఉంది కదా, ఏ ఆత్మ పట్లనైనా మీ మనస్సులో మంచి లేక చెడు వైబ్రేషన్లు కూర్చుండిపోతే, అవి ఎంత సమయము నడుస్తాయి? చాలా సమయము నడుస్తాయి కదా! తొలగించుకోవాలి అనుకున్నా తొలగవు. ఎవరి గురించైనా చెడు వైబ్రేషన్లు ఉంటే అవి సహజముగా తొలగిపోతాయా? కనుక మీ సర్వశక్తుల కిరణాల వైబ్రేషన్లు ముద్ర వలె పని చేస్తాయి. వాణిని మర్చిపోవచ్చు కానీ వైబ్రేషన్ల ముద్ర సహజముగా తొలగదు. అనుభవముంది కదా! ఉంది కదా అనుభవము?
గుజరాత్ వారు, బొంబాయి వారు ఏవైతే ఉల్లాస-ఉత్సాహాలను చూపించారో, వారికి కూడా బాప్‌దాదా పదమాపదమా రెట్ల అభినందనలను ఇస్తారు. ఎందుకని? ఏ విశేషత ఉంది? ఎందుకు అభినందనలు ఇస్తాము? ఫంక్షన్లు అయితే పెద్ద-పెద్దవి చేస్తూనే ఉంటారు కానీ ప్రత్యేకంగా అభినందనలు ఎందుకు ఇస్తున్నాము? ఎందుకంటే ఈ రెండు స్థానాలలోనూ ఏకత మరియు దృఢత అనే విశేషత ఉండినది. ఎక్కడైతే ఏకత మరియు దృఢత ఉంటాయో, అక్కడ ఒక్క సంవత్సరానికి బదులుగా ఒక నెల ఒక సంవత్సరముతో సమానముగా ఉంటుంది. గుజరాత్ వారూ, బొంబాయి వారూ విన్నారా. అచ్ఛా!
గుజరాత్:- గుజరాత్ వారు చాలామంది ఉన్నారు. వీరి సేవ టర్న్. గుజరాత్ నుండి 4500 మంది వచ్చారు. (ఈనాటి సభలో షుమారుగా 18-19 వేల మంది సోదరసోదరీలు డైమండ్ హాల్లో కూర్చుని మురళిని వింటున్నారు). అందరికీ అభినందనలు. కేవలం టీచర్లకే కాదు. ముందు మీకు, ఒకవేళ మీ సహయోగం లేకపోతే టీచర్లు మాత్రం ఏమి చేస్తారు! కావున గుజరాత్ యొక్క సర్వ పిల్లలకు ఇప్పుడు తీసుకున్న గోల్డెన్ ఛాన్స్ కోసం అభినందనలు మరియు సేవకు కూడా అభినందనలు. ఇలాగే సదా స్వ ఉన్నతిలో, సేవ యొక్క ఉన్నతిలో, ఒకరు చెబితే మరొకరు సరేనండీ అంటూ ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. అభినందనలు, అభినందనలు. అచ్ఛా.
ముంబయి, మహారాష్ట్ర:- (బాంబేలోని శివాజీ పార్కులో షుమారు 75-80 వేలమందితో కూడిన విశాల సంగఠన జరిగింది) అచ్ఛా, అభినందనలు అయితే లభించాయి. బాప్‌దాదా ఇరువురికీ చాలా-చాలా, మహారాష్ట్ర, బాంబే, ఆంధ్రప్రదేశ్ అందరికీ, సర్వ బ్రాహ్మణ పరివారం తరఫు నుండి బాప్‌దాదా తరఫు నుండి గుజరాత్ మరియు మాహారాష్ట్రకు మనస్ఫూర్తిగా చాలా-చాలా దీవెనలు. ఈ మనసు ఆశీర్వాదాలు, సదా హృదయంలో ఉల్లాస-ఉత్సాహాలతను పెంచుతాయి. సరేనా! పాండవులూ! అందరూ చాలా బాగా సేవ చేసారు. అందరి సహయోగముతో లక్షలమంది ప్రోగ్రామ్ విజయవంతమైనది. అచ్ఛా.
బిజినెస్ ఇండస్ట్రీ వర్గము:- బాప్‌దాదా బిజినెస్ వర్గం వారికి విశేషమైన సంకల్పాన్ని ఇస్తున్నారు, ఎందుకంటే బిజినెస్ వారి వద్దకు కస్టమర్లు తీసుకోవడానికి వస్తూనే ఉంటారు, మీరు వెళ్ళవలసిన అవసరం లేదు, వస్తూనే ఉంటారు. కావున ఎవరైతే సంబంధ-సంపర్కంలోకి వస్తారో వారికి కనీసం సందేశాన్ని ఇస్తూ ఉండండి, ప్రతి ఒక్క బిజినెస్ లేక ఇండస్ట్రీ వారు తమ-తమ కార్డును ముద్రించి ఉన్నారు, అందులో చాలా మంచి చిన్నని జ్ఞాన స్లోగన్, ఎడ్రెస్ ఉండాలి, రెండు మాటలలో ఆహ్వానము ఉండాలి, ఇలా ఎవరైతే ముద్రించారో వారు చేతులెత్తండి. ఇంతమంది ముద్రించనేలేదా! బిజినెస్ వారైతే ఇంట్లో కూర్చునే సేవ చేయవచ్చు. మేము కస్టమర్లుగా మీ వద్దకు వచ్చాము కానీ మాకు సందేశాన్ని ఇవ్వలేదు అన్న ఫిర్యాదు రాదు కదా! కార్డును తప్పకుండా ముద్రించండి. ఎంత సుందరమైన కార్డును ముద్రించాలంటే దానిని వారు చెత్త బుట్టలో వేయకూడదు, సంభాళించి పెట్టుకోవాలి. బిజినెస్‌మేన్‌కు వ్యాపారము చేయడం బాగా వచ్చు కదా. ఏ కస్టమర్ వచ్చినా వారితో బేరం కుదిరిచ్చకుండా తిరిగి పంపనివారే మంచి బిజినెస్‌మేన్. మరి మీరు భగవంతునితో వారికి బేరాన్ని కుదిరించరా! కేవలం బట్టలు మరియు ఇతర వస్తువుల వ్యాపారమే చేస్తారా! బిజినెస్‌మేన్ చాలామంది ఆత్మలను సహయోగులుగా చేయగలరు మరియు సహయోగుల నుండి నెమ్మది-నెమ్మదిగా యోగులుగా అవుతారు. మరి సహయోగుల లిస్టును ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం తయారు చేయాలి. ప్రతి ఒక్క బిజినెస్‌మేన్ ఎంతమంది ఆత్మలకు సందేశాన్ని ఇచ్చారు, ఎంతమందిని సహయోగులుగా చేసారు, ఎంతమంది ఆత్మలను సహజయోగులుగా చేసారు? సరేనా, చేస్తారా? సంఖ్య పెంచండి అని దాదీ అంటుంటారు కదా, మరి ప్రతి ఒక్క బిజినెస్‌మేన్ కూడా సంఖ్యను పెంచగలరు. సరేనా! ఇప్పుడు బాప్‌దాదా కూడా రిజల్ట్‌ను చూస్తారు. బాప్‌దాదాకు ఏమి తెలుస్తుందిలే అని అనుకోకండి. బాప్‌దాదా చూస్తారు, వతనంలో కూర్చుని కూడా చూడగలరు. అడగవలసిన అవసరం కూడా ఉండదు. మరి బిజినెస్ వారు అద్భుతం చేస్తారు కదా! ఎవరైతే మంచి పని చేస్తారో వారితో ఏమంటారు, నీ నోట్లో గులాబ్‌జామూన్ అంటారు కదా. బాప్‌దాదా కూడా బిజినెస్‌మేన్ నోట్లో గులాబ్‌జామూన్ అంటున్నారు. వచ్చేసిందా నోట్లోకి! అచ్ఛా.
స్పోర్ట్స్ వింగ్ (క్రీడల విభాగము):- ఆట-పాటలు కూడా తప్పకుండా కావాలి. మీరు ఏమి ఆటను ఆడిస్తారు? మీరు ఆట చూస్తారా లేక ఆడిస్తారు కూడానా? చూడటమైతే అందరూ చూస్తారు, ఈరోజుల్లో అయితే అందరూ చూడటంలో నిమగ్నమై ఉంటారు. బాప్‌దాదాకు తెలుసు. అచ్ఛా, ఇది కూడా చాలా అవసరము ఎందుకంటే ఈరోజుల్లో ఆత్మలలో టెన్షన్ చాలా ఉంది కావున ఆటపాటలు కూడా కావాలి. ఫారెన్‌లో ఒకరు పిల్లల కోసం చాలా మంచి ఆటను తయారు చేసారని బాప్‌దాదా విన్నారు. ఎవరు తయారు చేసారు? బాప్‌దాదాకు సమచారాము లభించింది మరియు బాప్‌దాదాకు నచ్చింది, అందరికీ చూపించండి. మరి క్రీడల విభాగం వారు ఈ ఆటను చూసి ఇటువంటి అనేక ఆటలను ఇన్వెన్షన్ చేయండి. అందులో ఆటకు ఆట కూడా ఉండాలి మరియు జ్ఞానానికి జ్ఞానము కూడా ఉండాలి. ఒకవేళ కోర్సు చేయించినా కానీ ఆటపాటలతో చేయించండి. మంచి ఇన్వెన్షన్, అభినందనలు. ఇటువంటి రమణీయమైన ప్రోగ్రామును తయారు చేయండి. భాషణను అయితే అందరూ చాలా విన్నారు, కానీ ఇటువంటి ఏదైనా క్రొత్తదానిని తయారు చేయండి, దీనితో వద్దనుకున్నా జనాలు మీ వద్దకు రావాలి మరియు మీ సోదరసోదరీలు మేలుకోవాలి. ఇకపోతే బాగుంది, ప్లాన్ తయారు చేస్తూ ఉంటారు, మీటింగులు చేస్తూ ఉంటారు, బాప్‌దాదాకు పిల్లల ఈ ప్లాన్ చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ సంవత్సరంలో ఇటువంటిదానిని దేనినైనా తయారు చేయండి. ఆరంభంలో మేళా చేసే సమయంలో కూడా ఎటువంటి వస్తువులు పెట్టే వారంటే ప్రజలు స్వతహాగానే చూసి రమ్మని పంపేవారు, బాప్‌దాదాకు గుర్తుంది. ఇటువంటి ఇన్వెన్షన్‌ను తయారు చేయండి. సరేనా! దీని ఇన్ఛార్జ్ (శశి అక్కయ్య), వీరైతే తెలివైనవారే, చేస్తారు. అచ్ఛా. అభినందనలు.
ఎడ్యుకేషన్ వింగ్:- ఎడ్యుకేషన్‌కు మహత్వం ఉంది, అందుకే ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ వైపు ఎంతో ఆసక్తిని చూపిస్తుంది. మీరందరూ కూడా కలిసి ఎడ్యుకేషన్ ప్రోగ్రాములు చేసారు కూడా, చేస్తున్నారు కూడా, ఇకముందు కూడా ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వర్గం నుండి కూడా చాలామంది ఆత్మలు వెలువడవచ్చు. అచ్ఛా.
విదేశాల నుండి 125 సోదరసోదరీలు మీటింగ్ కోసం వచ్చారు:- మరి ఏ అద్భుతాన్ని చేస్తారు? ఇంతమంది బాప్‌దాదాకు సికీలధే సేవాధారి పిల్లలు కలిస్తే ఏమేమి జల్వాను చూపిస్తారు? ఏదైనా నవీనతను చూపిస్తారు కదా? మంచిది. అందరూ కలిసి ఏదైనా జ్వాలారూప ప్రోగ్రామును తయారు చేయండి, సాధారణ ప్లాన్ కాదు, జ్వాలా రూప ప్లాన్‌ను తయారు చేయండి. ఒకటైతే అందరూ జ్వాలారూపులుగా అయిపోవాలి, తయారైపోవాలి. స్వయంలో జ్వాలా స్వరూపము మరియు సేవలో ఏదైనా ఇన్వెన్షన్ లేదా షార్ట్‌కట్‌ను ఆలోచించండి ఎందుకంటే ఈనాటి సమయం అనుసారంగా ప్రజలకు ఉన్న అతి పెద్ద సమస్య – సమయాన్ని కేటాయించడము. కావున అటువంటి ఏదైనా ప్లాన్‌ను తయారు చేయండి, వృత్తి కావచ్చు, దృష్టి కావచ్చు, వైబ్రేషన్లు కావచ్చు, కొద్ది సమయంలోనే వారికి అర్థమైపోవాలి – ఇక్కడి నుండే ఏదైనా లభిస్తుంది అని. అయస్కాంతం వంటి సేవను ఆలోచించండి. అయస్కాంతం నుండి ఎవరైనా దూరం వెళ్ళాలనుకున్నాగానీ వెళ్ళలేరు. దూరంనుండే సమీపానికి వస్తారు. ఇటువంటి క్రొత్త ప్లాన్‌ను తయారు చేయండి, డబల్ విదేశీయులు కదా! మీకు నిమిత్తమైన దాదీ మరియు దీదీలు, మీ దీదీలు మరియు దాదీలు అందరూ తెలివైనవారు. పాండవులు కూడా తక్కువైనవారేమీ కాదు. చూడండి, ఇక్కడ 5 పాండవులు నిల్చుని ఉన్నారు. మరి 5 పాండవులు ఏమి చేసారు? అక్షోహిణి సైన్యాన్ని సమాప్తం చేసారు. కావున పాండవులు కూడా తక్కువేమీ కాదు. పాండవులు ఒక్కొక్కరూ మహాన్ ఉన్నారు. మరి అద్భుతాన్ని చేస్తారుకదా? ఎలా అన్నా చేయండి, వృత్తి ద్వారా కావచ్చు, దృష్టి ద్వారా కావచ్చు, దృఢ సంకల్పం ద్వారా కావచ్చు, ఏదైనా ప్లాన్‌ను ఆలోచించండి. దాదీలు, దీదీలు, సరేనా! డబల్ విదేశీయులు ఇండియా టీచర్లకు తక్కువేమీ కారు. చాలా సంఖ్య ఉన్నారు. అలాంటప్పుడు అద్భుతం జరిగే ఉంది. మంచిది, ముందు మీరు ప్లాన్‌ను తయారు చేయండి, తర్వాత ఇండియా మీటింగ్ ఏదైతే జరుగుతుందో అందులో వారు ఆ ప్లాన్‌కు రత్నాలు పెడ్తారు. మీరు ఆధారంగా అవ్వండి, అందులో వజ్రాలు ముత్యాలు ఇండియా మీటింగ్ వారు పెడ్తారు. పెడ్తారు కదా? మీటింగ్‌లో పెడ్తారు కదా? అభినందనలు. బాప్‌దాదా సాకార రూపంలో ఎదురుగా ఇప్పుడు చూసి-చూసి సంతోషిస్తున్నారు, ఫారెన్‌లో ఇంతమంది తయారయ్యారు, చూడండి. అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. ఎంతమంది టీచర్లు తయారయ్యారో అందరూ చూసారు. అది కూడా విశేషంగా టీచర్లు, ఇతరులైతే చాలామంది ఉన్నారు. మరి బాప్‌దాదా డబల్ విదేశీ సేవాధారి పిల్లలను చూసి చాలా-చాలా-చాలా-చాలా సంతోషిస్తున్నారు. మేమెందుకు చప్పట్లు కొట్టాలి, వేరేవారు కొడ్తారు అని వీరనుకుంటున్నారు, అభినందనలు అయితే మీరు ఇవ్వాలి కదా! (అందరూ చప్పట్లు కొట్టారు) మంచిగా చేసారు, బాగా చప్పట్లు కొట్టండి.
76 దేశాలనుండి డబల్ విదేశీయులు వచ్చారు, కుమారుల రిట్రీట్ కూడా జరిగింది:- కుమారులు మంచి గుర్తును పెట్టుకున్నారు. యూథ్ గ్రూప్ ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారు చేసిందా లేక ఇంకా ఆలోచిస్తున్నారా? మీరు కూడా బ్రాహ్మణ పరివారం నుండి బ్రాహ్మణ ప్రపంచం యొక్క వరల్డ్ కప్‌ను తీసుకోండి. ఇప్పుడు ఢిల్లీవారు యూథ్ ప్రోగ్రామ్ యొక్క ప్లాన్‌ను తయారు చేయలేదు. ఢిల్లీవారు లేవండి, ఢిల్లీవారు, వరల్డ్ కుమారులను, యూథ్ను ప్రోగు చేసి, ఎంచుకుని బ్రాహ్మణ ప్రపంచం నుండి వరల్డ్ కప్‌ను ఇప్పించాలి. చేయాలి కదా? ధైర్యము ఉంది కదా? ప్లాన్ తయారు చేయండి. చేయగలరు. ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రెజిడెంట్ యూథ్కు సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు వర్తమాన సమయంలో ప్రపంచంలో కేవలం ఒక్క క్రికెట్ ఆటయే కాదు, ఇతర ఆటలు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు అలజడి మరోవైపు అచలము. మరి ఇప్పుడు ఇరువురిదీ ఫుల్ ఫోర్స్ ఉంది. అలజడి యొక్క ఫోర్స్ కూడా ఉంది మరియు అచల స్థితిలో ఉండేవారి ఫోర్స్ కూడా ఉంది కావున వాయుమండలం అనుసారంగా లాభాన్ని తీసుకోవచ్చు. ప్లాన్‌ను తయారు చేయండి. ఈ మీటింగ్ ఏదైతే చేస్తారో అందులో తయారు చేయండి. చాలామంచిది, ఢిల్లీవారు! యూథ్, మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ప్లాన్ తయారు చేయండి, వినిపించడం మొదలుపెట్టండి, అద్భుతాన్ని చేసి చూపించండి, విజయము మీకు ఉండనే ఉంది. అచ్ఛా.
అహ్మదాబాద్ నుండి ట్రైనింగ్ కుమారీలు వచ్చారు:- కుమారీలు ఏమి ఆలోచిస్తున్నారు? కుమారీలైతే చాలా లక్కీ. సరెండర్ అవ్వగానే దీదీ అని పిలిపించుకుంటారు. ఎంత భాగ్యమో చూడండి, టీచర్ అయితే బాప్‌దాదా మురళిని వినిపించే సింహాసనం లభిస్తుంది. గురువు యొక్క గద్దె లభిస్తుంది. బాప్‌దాదా టీచర్లను గురుభాయి అనైతే అంటూ ఉంటారు. మరి ఇలా అవుతారు కదా! ఇప్పుడింకా ట్రైనింగ్ జరుగుతుందా లేక పూర్తయిపోయిందా? పూర్తయింది. ఇప్పుడు సెంటర్లలో ఉంటున్నారు, అభినందనలు. చూడండి, టీచర్ అంటే వీరిలా ఉండాలి అని అందరూ అనేలా అటువంటి టీచర్‌గా అవ్వండి. నిస్వార్థమైన సేవాధారి టీచర్. టీచర్లు అయితే చాలామంది ఉన్నారు, మీరు ఎటువంటి టీచర్‌గా అవ్వాలంటే నిస్వార్థమైన సేవాధారిగా అవ్వాలి. నిర్మాణ్ మరియు నిర్మలచిత్తము. ఇలా అవుతారు కదా! ఉల్లాసము మంచిగా ఉంది. ఉల్లాసము కూడా ఉంది, ఉత్సాహము కూడా ఉంది, సఫలురుగా అవుతారు కాదు, సఫలతను పొందేసి ఉన్నారు. అచ్ఛా.
ఇప్పుడు సెకెండులో జ్ఞాన సూర్య స్థితిలో స్థితులై నలువైపులా భయభీతులై అలజడిలో ఉన్న ఆత్మలకు సర్వశక్తుల కిరణాలను వ్యాపింపజెయ్యండి. చాలా భయభీతులుగా ఉన్నారు, శక్తిని ఇవ్వండి, వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. అచ్ఛా. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
నలువైపులా ఉన్న పిల్లల నుండి రకరకాల ప్రియస్మృతులు మరియు సమాచార పత్రాలు మరియు ఈ-మెయిల్స్ బాబా వద్దకు చేరుకున్నాయి. నా స్మృతిని కూడా ఇవ్వండి, నా స్మృతిని కూడా ఇవ్వండి అని అందరూ అంటారు. బాప్‌దాదా అంటున్నారు - ప్రియమైన పిల్లల ప్రతి ఒక్కరి స్మృతి బాప్‌దాదా వద్దకు చేరుకుంది. దూరంగా కూర్చుని ఉన్నా కానీ బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు. కావున మీ అందరికీ - మా స్మృతిని ఇవ్వండి, మా స్మృతిని ఇవ్వండి అని ఎవరెవరైతే చెప్పారో, వారందరి స్మృతులు బాబా వద్దకు చేరుకున్నాయి. ఇదే పిల్లల ప్రేమ మరియు బాబా ప్రేమ పిల్లలను ఎగిరేలా చేస్తుంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులకు, కోట్లలో కొద్దిమంది అయిన విశేష ఆత్మలకు, సదా స్వమానములో ఉండేవారికి, గౌరవాన్ని ఇచ్చేవారికి, సర్వీసబుల్ పిల్లలకు, సదా స్మృతి స్వరూప మరియు సమర్థ స్వరూప ఆత్మలకు, సదా చలించని, స్థిరమైన స్థితి అనే ఆసనముపై స్థితులై ఉండే సర్వ శక్తి స్వరూప పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- బాప్‌దాదా మీ విషయములో విశేషముగా సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? విశేషముగా ఏ విషయములో సంతోషిస్తున్నారంటే - ఏ విధంగా బ్రహ్మాబాబా అందరినీ - ఇది చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి అని ఆజ్ఞాపించేవారో అలా మీరు కూడా బ్రాహ్మాబాబాను ఫాలో చేసారు. (మీరు కూడా నాతోపాటు ఉన్నారు) అదైతే ఉండనే ఉంటుంది, నిమిత్తమైతే మీరు అయ్యారు కదా. మరియు ఎటువంటి దృఢ సంకల్పము చేసారంటే దానివలన నలువైపులా సఫలత ఉంది, అందుకే మీలో ఆత్మిక శక్తి చాలా గుప్తముగా నిండి ఉంది. ఆరోగ్యము బాగుంది, ఆత్మిక శక్తి ఎంతగా నిండి ఉందంటే ఇక ఆరోగ్యము అసలేమీ కాదు. అద్భుతము కదా! (గుజరాత్ చేసింది, బాంబే కూడా లక్ష-లక్ష మంది ప్రోగ్రామ్‌ను చేసింది, ఇప్పుడు పంజాబ్ మరియు మద్రాస్ చేస్తున్నారు) ఈ కలకత్తా కూడా చేస్తుంది. (దాదీ నిర్మలశాంత గారితో) మీరు కేవలం కుర్చీలో కూర్చోండి, అంతే, ఇంకేమీ చేయకండి, మీకు అందరూ సహయోగులుగా అవుతారు. అంతా వారే తయారీలు చేసుకుంటారు. (బాబాను కూర్చోబెడ్తాము) బాబాతో పాటు మీరు కూడా కూర్చోండి. ఇద్దరూ కూర్చోండి.
(రాబోయే సీజన్లో బాప్‌దాదా ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోంది?) ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. బాబా మిలనము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఒక్క సంవత్సరం గురించి మాట్లాడుతున్నాము. ఆ తర్వాత మరుసటి సంవత్సరం, మరుసటి సంవత్సరం గురించి చెప్తాము.
దాదీలు బాబాను కలవడాన్ని చూస్తుంటే అందరికీ - మేము కూడా దాదీలమై ఉంటే కలిసేవారము కదా అని అనిపిస్తుంది. మీరు కూడా దాదీగా అవుతారు. ఇప్పుడు బాప్‌దాదా మనసులో ప్లాన్‌ను తయారుచేసారు, దానిని ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. ఎవరైతే సేవలో, బ్రహ్మాబాబా యొక్క సాకార సమయములో ఆదిరత్నాలు వెలువడ్డారో, వారి సంగఠనను పక్కా చెయ్యాలి. (ఎప్పుడు చేస్తారు?) మీరు చేసినప్పుడు. ఈ డ్యూటీ మీది (జానకి దాదీది). మీ మనసులో కూడా ఈ సంకల్పము ఉంది కదా? ఎందుకంటే ఏ విధంగా దాదీలైన మీ ఏకత మరియు దృఢతతో కూడిన సంగఠన పక్కాగా ఉందో, అలా ఆది సేవా రత్నాల సంగఠన పక్కాగా ఉండాలి, ఇది చాలా-చాలా అవసరము ఎందుకంటే సేవ అయితే పెరిగేదే ఉంది. సంగఠన శక్తి ఏది కావాలంటే అది చెయ్యగలదు. సంగఠన యొక్క గుర్తుకు స్మృతిచిహ్నము పంచ పాండవులు. ఐదుగురే ఉన్నారు కానీ వారు సంగఠనకు గుర్తు. అచ్ఛా - ఇప్పుడు ఎవరైతే సాకార బ్రహ్మా ఉన్న సమయములో సేవ కోసము సెంటరులో ఉన్నారో, సేవలో నిమగ్నమై ఉన్నారో, వారు లేచి నిలబడండి. సోదరులు కూడా ఉన్నారు, పాండవులు లేకపోతే గతే లేదు. ఇక్కడైతే కొద్దిమందే ఉన్నారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. సంగఠనను జమ చేసే బాధ్యత వీరిది (జానకి దాదీది). వీరు (పెద్ద దాదీ) వెన్నెముక. చాలా మంచి-మంచి రత్నాలు ఉన్నారు. అచ్ఛా! అంతా బాగుంది. ఏది చేస్తూ ఉన్నా సరే, మీ సంగఠనకు చాలా మహానత ఉంది. కోట దృఢముగా ఉంది. అచ్ఛా!
పిల్లలందరినీ బాప్‌దాదా కలిసిన తర్వాత బాప్‌దాదా తమ హస్తాలతో హోలీని ఆడారు – అందరిపై గులాబ్బాశీ బాగా వేసారు, ఆ తర్వాత బాప్‌దాదా పిల్లలందరికీ హోలీ ఉత్సవం యొక్క స్మృతిని అందించారు:-
నలువైపుల ఉన్న హోలీ పిల్లలు పరమాత్మ యొక్క సాంగత్యము అనే హోలీ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి మరియు సదా ఈ ఉత్సవంలో ఉత్సాహములో ఉండండి. అప్పుడు ప్రతిరోజూ ఉత్సవం అవుతుంది. ఉత్సాహంలో ఉండటము అంటే ఉత్సవాన్ని జరుపుకోవడము. మరి అందరూ ఉత్సాహములో ఉన్నారు కదా! మరి హోలీ ఉంది మరియు హోలీని జరుపుకుంటున్నారు. సదా ఈ పరమాత్మ సాంగత్యపు రంగు అనే హోలీలో ఉండండి. అచ్ఛా. అందరికీ హోలీ ఉత్సవానికి శుభాకాంక్షలు. అచ్ఛా!