Search for a command to run...
30 Nov 2008
ఫుల్స్టాప్ పెట్టి, సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి, మనసా శక్తి ద్వారా సుఖశాంతుల అంచలిని ఇచ్చే సేవను చెయ్యండి
30 November 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న మహాన్ పిల్లలను చూస్తున్నారు. ఏ మహానతను చేసారు? దేనినైతే ప్రపంచం అసంభవంగా భావిస్తుందో దానిని సహజం చేసి చూపించారు. అదే పవిత్రత వ్రతము. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసారు కదా! బాప్‌దాదా నుండి పరివర్తన అనే దృఢ సంకల్ప వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతము తీసుకోవడము అనగా వృత్తి ద్వారా పరివర్తన జరగడము. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరమూ సోదరులము అని సంకల్పం చేసారు, ఈ వృత్తి పరివర్తనను తీసుకువచ్చారు. ఎన్ని విషయాలలో భక్తిలో కూడా వ్రతం తీసుకుంటారు కానీ మీరందరూ బాబా వద్ద దృఢ సంకల్పాన్ని చేసారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత. పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ ప్రాప్తులు కలుగుతున్నాయి. మహాత్ములు దేనినైతే కఠినంగా భావిస్తున్నారో, అసంభవం అని అనుకుంటున్నారో మీరు దానిని, ఆ పవిత్రతను స్వధర్మంగా భావిస్తున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు కొంతమంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేసారో వారు దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్‌గా పరివర్తనను చూపించారు. నలువైపుల ఉన్న ఇటువంటి మహాన్ పిల్లలకు బాప్‌దాదా చాలా-చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు.
మీరందరూ కూడా మనసు, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తున్నారు కదా! పవిత్రతా వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన కలిగి ఉండటము. దృష్టి అనగా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడటము, స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోవడము. బ్రాహ్మణ జీవిత మహత్వము మనసా వాచా కర్మణలో పవిత్రత. పవిత్రత లేకపోతే, బ్రాహ్మణ జీవితానికి ఉన్న గాయనము సదా పవిత్రతా బలంతో స్వయమే స్వయానికి ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు, ఏ ఆశీర్వాదాలను ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం సంతోషంగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు. పవిత్ర ఆత్మకు మూడు విశేష వరదానాలు లభిస్తాయి - ఒకటి స్వయమే స్వయానికి వరదానమును ఇచ్చుకోవడము, ఇది సహజంగా తండ్రికి ప్రియంగా చేస్తుంది. రెండు, వరదాత తండ్రికి నియరెస్ట్ (సమీపమైన) మరియు డియరెస్ట్ (ప్రియమైన) సంతానంగా కావడము, దీని ద్వారా తండ్రి ఆశీర్వాదాలు సహజంగా ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. మూడవది, బ్రాహ్మణ పరివారంలో విశేషంగా నిమిత్తమైనవారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ముగ్గురి ఆశీర్వాదాలతో సదా ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరిస్తూ ఉంటారు. మరి మీ అందరూ కూడా స్వయాన్ని ప్రశ్నించుకోండి, స్వయాన్ని పరిశీలించుకోండి - పవిత్రత బలాన్ని మరియు పవిత్రత ఫలమును సదా అనుభవం చేస్తున్నానా? సదా ఆత్మిక నషా, హృదయంలో శుద్ధ నషా ఉన్నాయా? అప్పుడప్పుడూ కొంతమంది పిల్లలు అమృతవేళ మిలనం చేసుకునేటప్పుడు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారో తెలుసా? పవిత్రత ద్వారా లభించే అతీంద్రియ సుఖము అనే ఫలము సదా ఉండటం లేదు. ఒకసారి ఉంటుంది, మరోసారి ఉండటం లేదు అని అంటారు. ఎందుకంటే పవిత్రతకు ఫలితమే అతీంద్రియ సుఖము. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి నేను ఎవరిని? సదా అతీంద్రియ సుఖ అనుభూతిలో ఉంటున్నానా లేక అప్పుడప్పుడా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? అందరూ మీ పేరును వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తారు? బి.కె. ఫలానా... అలాగే స్వయాన్ని మాస్టర్ సర్వశక్తిమాన్ అని అంటారు కదా. అందరూ కదా! అందరూ మాస్టర్ సర్వశక్తిమంతులు కదా! ఎవరైతే స్వయాన్ని మాస్టర్ సర్వశక్తిమాన్గా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. సదా, అప్పుడప్పుడూ కాదు. చూడండి, ఆలోచించండి, సదా ఉన్నారా? డబల్ విదేశీయులు చేతులెత్తడం లేదు. కొద్దిమందే ఎత్తుతున్నారు. టీచర్లు ఎత్తండి, అందరూ ఉన్నారా? ఊరికే ఎత్తకండి, ఎవరైతే సదా ఉన్నారో వారు ఎత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. పాండవులు ఎత్తండి, వెనుక ఉన్నవారు, చాలా కొద్దిమంది ఉన్నారు. పూర్తి సభ ఎత్తడం లేదు. అచ్ఛా, మాస్టర్ సర్వశక్తిమంతులు కదా, ఆ సమయంలో శక్తులు ఎక్కడకు వెళ్ళిపోతున్నాయి? మాస్టర్ ఉన్నారు, దీని అర్థమే ఉంది, మాస్టర్ అంటే తండ్రికన్నా ఉన్నతంగా ఉంటారు అని అర్థము. మరి పరిశీలించుకోండి - తప్పక పవిత్రత పునాదిలో కొంత బలహీనత ఉంది. ఏ బలహీనత? మనసులో అనగా సంకల్పాలలో బలహీనత, మాటలలో బలహీనత, కర్మలలో బలహీనత లేక స్వప్నాలలో బలహీనత కావచ్చు ఎందుకంటే పవిత్ర ఆత్మ మనసా-వాచ-కర్మణ, సంబంధ-సంపర్కము, స్వప్నము స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని మార్చుకోవాలి అని వ్రతాన్ని తీసుకున్నప్పుడు అప్పుడప్పుడూ ఎందుకు మరి? సమయాన్ని చూస్తున్నారు, సమయపు పిలుపు, భక్తుల పిలుపు, ఆత్మల పిలుపును వింటున్నారు మరియు అకస్మాతు అనే పాఠమైతే అందరికీ పక్కాగానే ఉంది. మరి పునాదిలో బలహీనత అనగా పవిత్రతలో బలహీనత ఉంది. ఒకవేళ మాటలలో కూడా శుభ భావన, శుభ కామన లేనట్లయితే పవిత్రతకు విపరీతంగా ఉన్నట్లయితే అప్పుడు సంపూర్ణ పవిత్రతలోని సుఖము, అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకోలేరు. ఎందుకంటే అసంభవాన్ని సంభవం చెయ్యడమే బ్రాహ్మణ జీవిత లక్ష్యము. అందులో అంత, ఇంత అన్న మాటలు ఉండవు. ఎంత కావాలంటే అంత అని ఉండదు. మరి రేపు అమృతవేళ విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని, ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులను చూడకండి, స్వయాన్ని పరిశీలించుకోండి - ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని పాటిస్తున్నాను? నాలుగు విషయాలను పరిశీలించుకోండి - ఒకటి వృత్తి, రెండు - సంబంధ సంపర్కాలలో శుభ భావన, శుభ కామన, వీరింతే అని అనుకోకండి. ఆ ఆత్మ పట్ల కూడా శుభ భావనను ఉంచండి. ఎప్పుడైతే మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా భావించారో, భావించారు కదా? స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులో ఎత్తుతున్నారు. ఇందులో చాలా బాగా చేతులెత్తుతున్నారు. ఇందుకు అభినందనలు. కానీ బాప్‌దాదా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. అడగమంటారా? ప్రశ్న అడగమంటారా? మీరు విశ్వ పరివర్తకులైనప్పుడు విశ్వ పరివర్తనలో ఈ ప్రకృతి, 5 తత్వాలు కూడా వస్తాయి, వాటిని పరివర్తన చెయ్యగలరు. మీ స్వయాన్ని, మీ తోటివారిని, పరివారాన్ని పరివర్తన చెయ్యలేరా? విశ్వ పరివర్తకులు అనగా ఆత్మలను, ప్రకృతిని అందరినీ పరివర్తన చెయ్యడము. కావున మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోండి. అందరూ బాబా వద్ద ఎన్నోసార్లు ప్రతిజ్ఞను చేసారు. సమయము చాలా వేగంగా వెళ్ళడం బాప్‌దాదా చూస్తున్నారు, అందరి పిలుపులు చాలా పెరుగుతున్నాయి. మరి పిలుపును వినేది, పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా!
బాప్‌దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, పర ఉపకారి మరియు విశ్వ ఉపకారిగా కావడానికి మూడు మాటలను సమాప్తం చెయ్యవలసి ఉంటుంది - తెలుసు కదా. తెలుసుకోవడంలో అయితే తెలివైనవారే, బాప్‌దాదాకు తెలుసు అందరూ తెలివైనవారు అని. మొదటి మాట - పరచింతన, రెండు - పరదర్శన మరియు మూడవది - పరమతము. ఈ మూడు పర మాటలను సమాప్తం చేసి పర ఉపకారిగా కావాలి. విఘ్న రూపంగా అయ్యేవి ఈ మూడు మాటలు, గుర్తున్నాయి కదా. క్రొత్త విషయము కాదు. మరి రేపు పరిశీలించుకోండి అమృతవేళ, బాప్‌దాదా కూడా తిరుగుతారు, ఏమి చేస్తున్నారు అని పిల్లలను బాప్‌దాదా చూస్తారు. ఎందుకంటే సమయానుసారంగా, పిలుపు అనుసారంగా ప్రతి ఒక్క దుఃఖీ ఆత్మకు మనసా శక్తి ద్వారా సుఖశాంతుల అంచలిని ఇవ్వడము ఇప్పుడు అవసరము. కారణం ఏమిటి? బాప్‌దాదా అప్పుడప్పుడూ అకస్మాత్తుగా పిల్లలు ఏమి చేస్తున్నారు అని చూస్తారు. ఎందుకంటే పిల్లలపై ప్రేమ ఉంది కదా, అంతే కాక పిల్లలతో కలిసి వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళేది లేదు. కలిసి వెళ్ళాలి కదా! వెళ్ళాలి కదా! వెళ్ళాలి కదా! కలిసి వెళ్దామా? ముందు కూర్చున్నవారు చేతులెత్తడం లేదు? కలిసి వెళ్దామా? వెళ్ళాలి కదా! బాప్‌దాదా కూడా పిల్లల కారణంగా, అడ్వాన్స్ పార్టీలో కూడా మీ దాదీలు, మీ విశేష పాండవులు మీ అందరికోసం ఎదురు చూస్తున్నారు. వారు కూడా మేమందరమూ కలిసి వెళ్ళాల్సిందే అని పక్కా ప్రతిజ్ఞ చేసారు. కొద్దిమందితో కాదు, అందరం కలిసి వెళ్ళాలి. మరి రేపు అమృతవేళ స్వయంలో ఏ బలహీనత ఉంది అని పరిశీలించుకోండి. మనసులోనా, వాచ లేక కర్మణలో బలహీనత ఉందా? బాప్‌దాదా ఒకసారి అన్ని సెంటర్లను చుట్టి వచ్చారు. ఏమి చూసామో చెప్పమంటారా? ఏ విషయంలో లోపము ఉంది? ఒక్క క్షణంలో పరివర్తన చెంది ఫుల్స్టాప్ పెట్టడంలో లోపము కనిపించింది. ఫుల్స్టాప్ పెట్టనంత వరకు ఏదేదో జరుగుతూ ఉంటుంది. బాప్‌దాదా వినిపించారు, అంతిమ సమయపు అంతిమ ఒక్క క్షణంలో ఫుల్స్టాప్ పెట్టవలసి ఉంటుంది. కానీ ఏమి చూసాము? పెట్టవలసింది ఫుల్స్టాప్ కానీ కామా వచ్చేస్తుంది. ఇతరుల విషయాలను గుర్తు తెచ్చుకుంటారు, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరుగుతుంది, ఇందులో ఆశ్చర్యార్థకం వచ్చేస్తుంది. అప్పుడు ఫుల్స్టాప్ కాకుండా కామా, ఆశ్చర్యార్థకము మరియు ఎందుకు అన్న ప్రశ్నల క్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని పరిశీలించుకోండి. ఒకవేళ ఫుల్స్టాప్ పెట్టే అలవాటు జరగకపోతే అంత మతి సో గతి శ్రేష్ఠంగా ఉండదు. ఉన్నతంగా ఉండదు. కావున బాప్‌దాదా హోమ్‌వర్కును ఇస్తున్నారు, ముఖ్యంగా రేపు అమృతవేళ పరిశీలించుకోండి మరియు పరివర్తన కండి. ఒక వారములో ఫుల్‌స్టాప్‌ను సెకండులో పెట్టడము పదే పదే అభ్యాసము చెయ్యండి మరియు 18 జనవరికి, జనవరి మాసంలో అందిరకీ బాబా సమానంగా కావాలన్న ఉత్సాహము ఉంటుంది. మరి 18 జనవరినాడు అందరూ తమ చిట్టీ వ్రాసి బాక్సులో వేయండి - 18వ తారీఖువరకు రిజల్టు ఏమిటి? ఫుల్స్టాప్ పెట్టారా లేక మిగతావి వచ్చాయా? ఇష్టమేనా? ఇష్టమేనా? తల ఊపండి ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది, ఒంటరిగా వెళ్ళాలని లేదు, మరి ఏమి చేస్తారు? ఇప్పుడు వేగంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఇప్పుడు ఢీలా-ఢాలా పురుషార్థము సఫలతను ఇవ్వలేదు.
పవిత్రతను పర్సనాలిటీ, రాయల్టీ, రియాలిటీ అని అనడం జరుగుతుంది. మరి మీ రాయల్టీను గుర్తు తెచ్చుకోండి. అనాది రూపంలో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు తమ దేశంలో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఎలా అయితే ఆకాశంలో విశేషమైన సితారలు మెరుస్తూ ఉంటాయో అలాగే మీరు అనాది రూపంలో విశేషమైన సితారలుగా మెరుస్తున్నారు. ఇప్పుడు మీ ఆదికాలపు రాయల్టీని గుర్తు చేసుకోండి. సత్యయుగానికి వచ్చినప్పుడు దేవతా రూపములోని రాయల్టీను గుర్తు తెచ్చుకోండి. అందరి శిరస్సుపై రాయల్టీ అనే ప్రకాశ కిరీటం ఉంది. అనాది ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. తర్వాత ద్వాపరంలోకి రండి. అక్కడ కూడా మీ చిత్రాలలోని రాయల్టీ ఇంకెవ్వరికీ లేదు. నేతలు, అభినేతలు, ధర్మాత్మల చిత్రాలు తయారవుతాయి కానీ మీ చిత్రాల పూజ మరియు మీ చిత్రాల విశేషత ఎంత రాయల్‌గా ఉంది. చిత్రాలను చూసే అందరూ సంతోషిస్తారు. చిత్రాలద్వారానే ఎన్ని ఆశీర్వాదాలను తీసుకుంటారు. మరి ఈ రాయల్టీ అంతా పవిత్రతదే. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి జన్మ సిద్ధ అధికారము. పవిత్రత విషయంలో ఉన్న లోపము సమాప్తమైపోవాలి. అయిపోతుందిలే అని కాదు, ఆ సమయంలో వైరాగ్యం వచ్చినప్పుడు అయిపోతుందిలే అంటారు, మాటలు చాలా మంచి మంచిగా వినిపిస్తూ ఉంటారు. బాబా, మీరు చింతించకండి అయిపోతుంది అంటారు. కానీ బాప్‌దాదాకు ఈ జనవరి మాసంలో విశేషంగా పవిత్రతలో ప్రతి ఒక్కరూ సంపన్నంగా కావాలి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు, వ్యర్థ సంకల్పం కూడా అపవిత్రతయే. వ్యర్థ మాటలు, మాటల వ్యర్థ రూపము, దానినే క్రోధము యొక్క అంశము, ఆవేశము అంటారు. ఎటువంటి సంస్కారమును చేసుకోండంటే దూరం నుండే మిమ్మల్ని చూసి పవిత్రత వైబ్రేషన్లను తీసుకోవాలి ఎందుకంటే మీ అంతటి పవిత్రత, ఫల స్వరూపంగా ఆత్మ కూడా పవిత్రంగా, శరీరం కూడా పవిత్రంగా, డబల్ పవిత్రత ప్రాప్తిస్తాయి.
ఎప్పుడైనా ఎవరైనా బిడ్డ మొదటిసారి వస్తే బాబానుండి ఏ వరదానము లభించేది? గుర్తుందా? పవిత్ర భవ, యోగి భవ. మరి రెండు విషయాలు ఉన్నాయి - ఒకటి పవిత్రత, రెండు ఫుల్స్టాప్, యోగి. ఇష్టమేనా? బాప్‌దాదా అమృతవేళ తిరుగుతారు, సెంటర్లను చుట్టి వస్తారు. బాప్‌దాదా అయితే ఒక్క సెకండులో నాలుగు వైపులను చుట్టి రాగలరు. మరి ఈ జనవరి అవ్యక్త మాసమునకు ఏదైనా ప్లాను వెయ్యండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మ మరియు మాటలు వీటిని పెంచండి. మరి 18 జనవరినాడు బాప్‌దాదా అందరి రిజల్టును చూస్తారు. ప్రేమ ఉంది కదా, 18 జనవరినాడు అమృతవేళ నుండి ప్రేమతో కూడిన మాటలనే మాట్లాడుతూ ఉంటారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు అని అందరూ ఫిర్యాదు చేస్తారు. మరి బాబా కూడా ఫిర్యాదు చేస్తున్నారు, సాకారంలో ఉంటూ బాబా సమానంగా ఎప్పటికి అవుతారు?
ఈరోజు కొద్దిగా విశేషమైన అటెన్షన్‌ను ఇప్పిస్తున్నాము. ప్రేమ కూడా చేస్తున్నాము, కేవలం అటెన్షన్‌ను మాత్రమే ఇప్పించడం లేదు. ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే నా పిల్లలు ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని బాబా కోరుకుంటున్నారు. ప్రతి కర్మలోని శ్రీమతాన్ని పరిశీలించుకోండి, అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు లభించిన శ్రీమతాన్ని పరిశీలించుకోండి. పటిష్టంగా ఉంది కదా! కలిసి వెళ్ళాలి కదా! వెళ్ళాలి కదా! చెతులెత్తండి. వెళ్ళాలా? అచ్ఛా. టీచర్లు? అచ్ఛా. వెనుకవారు చేతులెత్తండి. కుర్చీలోనివారు చేతులెత్తండి. పాండవులు చేతులెత్తండి. సమానంగా అయినప్పుడే కదా చేతిలో చేయి వేసి కలిసి వెళ్ళగలరు, చేయాల్సిందే అని దృఢ సంకల్పం చెయ్యండి. 15-20 రోజులు ఈ దృఢత్వం ఉంటుంది ఆ తర్వాత నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కనుక నిర్లక్ష్యాన్ని సమాప్తం చెయ్యండి. ఎక్కువలో ఎక్కువగా ఒక నెల రోజులు ఫుల్ ఉత్సాహం ఉంటుంది, దృఢత్వం ఉంటుంది. ఒక మాసం తర్వాత కొద్దికొద్దిగా నిర్లక్ష్యం మొదలవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం సమాప్తం కావస్తుంది, మరి మీరు ఏమి సమాప్తం చేస్తారు? కేవలం సంవత్సరాన్ని సమాప్తం చేస్తారా లేక సంవత్సరంతో పాటు సంకల్పంలో, ధారణలో ఉన్న బలహీనతను సమాప్తం చేస్తారా? చేస్తారు కదా! చేతులెత్తడం లేదు? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్న పాట స్వతహాగా మనసులో వినిపిస్తూ ఉండాలి. కేవలం వెళ్ళడం కాదు, రాజ్యంలోకి కూడా కలిసి రావాలి. అచ్ఛా, మొదటిసారి బాప్‌దాదాను కలవడానికి వచ్చినవారు చేతులెత్తండి.
మొదటిసారి వచ్చినవారికి విశేషమైన అభినందనలను ఇస్తున్నాము. లేట్‌గా (ఆలస్యంగా) వచ్చారు కానీ టూ లేట్ (చాలా ఆలస్యంగా) రాలేదు. కానీ తీవ్ర పురుషార్థము అన్న వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థం చెయ్యాల్సిందే. చేస్తాములే, లే, లే అని అనకండి. చెయ్యాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్‌లో రావాలి. అచ్ఛా.
సేవా టర్న్ పంజాబ్ జోన్ వారిది (పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాంచల్):- బాగుంది, మీకు లభించే ఈ అవకాశం మంచిగా అనిపిస్తుందా? విశేషమైనవారు. పంజాబ్ అంటే ఎలా అయితే స్థూల నదులు పావనం చేస్తాయి అని అంటారో అలాగే పంజాబ్ యొక్క పతిత పావన పిల్లలు, పంజాబ్ అయితే పావన ఆత్మలను తయారు చెయ్యడంలో ఫస్ట్ నంబరులో ఉంటుంది కదా. చూడండి, పంజాబ్‌ది ఒక విషయంలో విశేషత ఉంది - మొదట్లో, ఆదిలో చేసిన భాషణ మహాత్ములు ఇచ్చిన ఆహ్వానంపై జరిగింది. గుర్తుంది కదా! ఈ బిడ్డకు (జానకి దాదీకు) గుర్తుంది. మరెక్కడా, మహాత్ముల స్టేజీపై భాషణ కోసం ఆహ్వానం లభించడం, మొదట్లో, ఎక్కడా జరుగలేదు. పంజాబ్ పులి అని అంటారు కదా, పులి చేసే పనిని చేసారు. సాధు సన్యాసుల మధ్య గర్జించారు, అప్పుడు పంజాబ్ పులి అయ్యారు కదా. ఇప్పుడు కూడా ఈ బిడ్డ (అమీర్ చంద్ అన్నయ్య) లిస్ట్ ఇచ్చారు, ప్రతి ఒక్కరి సంబంధంలో వి.ఐ.పిలు ఎంతమంది ఉన్నారు అని బాప్‌దాదా అడిగారు. ప్రతి వర్గంవారు ఈ లిస్టును ఇవ్వండి అని బాప్‌దాదా అన్నారు. అప్పుడు బాప్‌దాదాకు ఈ బిడ్డ నుండి లిస్టు వచ్చింది, లిస్టు ఇచ్చినందుకు చప్పట్లు కొట్టండి. బాగుంది. వీరందరి లిస్టును చూసాము, బాగుంది, కానీ ఇప్పుడు వీరిని కలుస్తూ ఉండండి. వి.ఐ.పిలు వి.ఐ.పిలుగానే ఉండిపోకూడదు. మొదటి స్టేజివరకు తీసుకువచ్చారు. రెండవ స్టేజి - ప్రతి కార్యంలో స్నేహి, సహయోగిగా కావడము. ఆ తర్వాత బ్రాహ్మణ పరివారంతో కలిసి ఉండాలి, పరివారాన్ని తనదిగా భావించాలి. కొన్ని కొన్ని చోట్ల వి.ఐ.పిలు ముందుకు వెళ్తున్నారు, బాప్‌దాదా వారికి అభినందనలు కూడా తెలుపుతున్నారు కానీ జ్ఞాన సరోవరం తర్వాత ఎంత సేవ అయితే ప్రారంభమయిందో, ఎన్ని వర్గాలు అయ్యాయో, ఎంత సమయము ఎంత సేవ అయితే జరిగిందో, దాని అనుసారంగా వి.ఐ.పిలు ఇంటివారిగా కావాలి. ఫోన్ చెయ్యగానే చేరుకోవాలి, హా జీ, హా జీ అనాలి, తోడుగా నిలవాలి. ఇప్పుడు ప్రతి వర్గము ఈ లక్ష్యము పెట్టుకోండి, సహజయోగిగా కావాలి. గౌరవమును ఇవ్వాలి, విశేషమైన సీటు ఇస్తేనే వస్తాము అని అనడం కాదు. కొంచెం హోమ్లీ (ఇంటివారిగా) కావాలి. ఆబూకు రాలేకపోతే, మీ జోన్‌లోని పెద్ద పెద్ద సెంటర్లకు వారిని పిలవండి. కనీసం 3 నెలలు లేక 6 నెలలకు ఒకసారి వారిని కలుస్తూ ఉండండి. హోమ్లీగా చేస్తూ ఉండండి. సమయానుసారంగా పరిస్థితులు మారినప్పుడు వీరు సమయానికి సహాయపడ్తారు. మరి అన్ని వర్గాలవారు వింటున్నారు కదా. కొన్ని చోట్ల ఇలా అయ్యారు కూడా కానీ కొద్దిమందే అయ్యారు. మరి పంజాబ్వారు పులులు, అవును రెండు చేతులెత్తండి. అందరూ పులులే. కావున మొదటి నంబరు మీరు తీసుకోండి, పంజాబ్ వి.ఐ.పిలు హోమ్లీగా కావాలి. మహాత్ములు కూడా హోమ్లీగా కావాలి. ఆహ్వానం లభించినప్పుడు రావడం కాదు, వారే స్వయంగా మేము వస్తాము అనాలి. బాగుంది, వృద్ధి అయితే పంజాబ్ చేసింది. బాప్‌దాదాకు కూడా పంజాబ్‌పై ప్రేమ ఉంది, ఎందుకు ప్రేమ ఉంది? జమ్మూ కశ్మీర్‌ను తమదిగా చేసుకున్నారు కానీ జమ్మూకశ్మీర్ పేరు కొంచెం ప్రసిద్ధమైనది, పాకిస్థాన్‌లో కావచ్చు, అమెరికాలో కావచ్చు... అందరి దృష్టి జమ్మూ కశ్మీర్‌పై ఉంది. ఇప్పుడు అక్కడ ఏదైనా జల్వా చేసి చూపించండి. అక్కడి సోదరీలే చెయ్యాలని కాదు. మీరు సహయోగమును ఇచ్చి అక్కడ ఏదైనా అద్భుతమైన విషయాన్ని చేసి చూపించండి. కొద్దిగా అటెన్షన్ ఇచ్చినట్లయితే పేరు ప్రసిద్ధమవుతుంది. ఎక్కడ గొడవ ఉందో అక్కడ శాంతి పతాకాన్ని ఎగురవేయండి. సరేనా. సంఖ్య అయితే చాలా ఉంది. ఒకటి నిర్విఘ్నంగా కండి మరియు రెండు సేవలో శాంతి పతాకాన్ని ఎగురవేయండి. అశాంతి స్థానంలో శాంతి జెండా ఎగురుతుండటం అందరికీ కనిపించాలి. సరేనా. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- వీరిప్పుడు డబల్ విదేశీయులు కాదు, డబల్ తీవ్ర పురుషార్థీలు. అంతే కదా. డబల్? డబల్ పురుషార్థీలు కదా? బాగుంది, ఇన్ని దేశాల నుండి వస్తారు, ఇన్ని దేశాలలో సేవాకేంద్రం ఉంది అని విని అందరూ సంతోషిస్తారు. తమ తమ దేశాలలో జెండా ఎగురవేసి ఉండకపోవచ్చు, ఒక్క లండన్‌లో జెండా ఉంది, ఇంకే దేశంలో అయినా జెండా ఉందా? ఉందా, చేతులెత్తండి. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా జెండా ఉందా? అచ్ఛా. ఎన్ని దేశాలలో ఉంది? 10-12 దేశాలలో ఉందా? ఇది కూడా మంచిది. కానీ అనేక ఆత్మల హృదయాలలో అయితే జెండాను ఎగురవేసినందుకు బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూసి వీరు విశ్వానికి సేవాధారులు, కేవలం భారతదేశానికి సేవాధారులు కాదు, విశ్వ సేవాధారులు అని అందరూ సంతోషిస్తారు. విశ్వ సేవాధారి అన్న టైటిల్ కేవలం భారతదేశంలో కాదు, విశ్వంలోని మూల మూలన ఉంది. ఇప్పుడైతే సేవను మంచిగా వృద్ధి చేస్తున్నారు. ముస్లిం దేశాలలో కూడా సేవ బాగా జరుగుతుంది. బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు, చాలా మంచిది. కరాచీకు ప్లాను చేసారు, బాగుంది. ఏది జరిగినా డ్రామా ఎంతో మంచిగానే జరుగుతుంది. కొత్త కొత్త పట్టణాలలో మిగిలిపోయి ఉన్న పిల్లలు ఉన్నారు, అక్కడ ఇప్పుడు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు. అందరికంటే కూడా మీలో ధైర్యవంతురాలు ఒకరున్నారు. బాప్‌దాదా వారికి రోజూ అమృతవేళ వరదానాన్ని ఇస్తారు, మరియు వారు కూడా చాలా ఎక్యురేట్గా ఉంటారు. పేరేమిటి? (వజీహా) అటువంటి కార్యాన్ని చేసి చూపించండి, ధైర్యవంతురాలు, భయపడరు. తమ ఇంటివారిని కూడా చూడండి, యుక్తితో సరి చేసారు. తెలివైనవారు మరియు నైరోబీ వారు కూడా చాలా మంచి పురుషార్థం చేసారు. నైరోబీ వైపు విశేషత ఏమిటంటే సోదరీలు తక్కువైతే వచ్చే విద్యార్థులే సేవాకేంద్రాన్ని సంభాళిస్తారు - ఇది కూడా విశేషతయే. మరి అందరి విశేషతలను ప్రోగు చేసి ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలను విశేషంగా చేసుకోండి. డబల్ పురుషార్థీలు మంచి పురుషార్థాన్ని చేసి ముందుకు సాగుతున్నారు. కానీ బాబా చార్టును చూస్తారు. ఏ సమాచారాన్నయితే చెప్పారో, సంపూర్ణ పవిత్రత విషయంలో చార్టును చూస్తారు. బాగుంది. అందరి లక్ష్యము చాలా బాగుంది కానీ మధ్యలో నిర్లక్ష్యము అనే మాయ చాలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు దానికి వీడ్కోలు ఇవ్వండి. నిర్లక్ష్యానికి వీడ్కోలు మరియు ఫుల్‌స్టాప్‌కు ఆహ్వానము. సరేనా, చేస్తారు కదా. నిర్లక్ష్యాన్ని చూపించకండి. బాప్‌దాదా నిర్లక్ష్యపు ఆటలను ఎన్నో చూసేసారు. ఇప్పుడు సెకండులో ఫుల్స్టాప్ ఆటను చూపించండి. పెన్సిల్ ఇలా పెట్టగానే ఫుల్స్టాప్ వచ్చేస్తుంది. అచ్ఛా. డబల్ విదేశీయులు సదా టర్న్ తీసుకుంటూ ఉంటారు, ఇది చాలా బాగుంది, తీసుకుంటూ ఉండండి. అచ్ఛా.
దిల్వాలే, క్యాడ్ గ్రూపు:- అచ్ఛా, క్రొత్త ప్లాను ఏమైనా చేసారా? (గుప్తా అన్నయ్యగారితో) అచ్ఛా, కార్యమైతే జరుగుతుంది. ఖర్చు లేకుండా గుండె జబ్బు నయం కాగలదు అన్న విషయము ప్రభుత్వం ద్వారా అఫిషియల్‌గా తెలపడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ముందు అందరూ చూస్తారు, ఒక ప్రశ్న అడుగుతున్నారు, బాప్‌దాదాను కూడా ప్రశ్న అడిగారు, చెప్పమంటారా? బ్రాహ్మణ పిల్లల గుండెను ఎందుకు నయం చెయ్యరు, వీళ్ళెందుకు అక్కడకు వెళ్తారు? వారిని కూడా ట్రయల్ వెయ్యండి. ఇందులో వీరి తప్పు కూడా ఉంది. క్యాడ్లోని నియమాలపై పూర్తిగా నడవరు. బయటవారు పత్యం పూర్తిగా పాటిస్తారు కానీ బ్రాహ్మణులు మన ఇల్లే కదా అని పత్యం తక్కువగా పాటిస్తారు. కానీ బ్రాహ్మణులలో కూడా విశేషంగా ఒక ఉదాహరణను తయారుచెయ్యండి, వారిని చూసి మేమూ చెయ్యగలము అని భావించాలి. కార్యం చాలా మంచిగా ఉంది, సందేశం అందుతుంది కానీ సందేశం ఇచ్చే గొంతును కొంచెం పెద్దగా చెయ్యండి. అప్పుడు అది నలువైపుల వ్యాపిస్తుంది. శుభ భావన, శుభ కామనలు కూడా పని చేస్తున్నాయి. ప్రతి వర్గం వారు ముందుకు వెళ్ళాలి. బాగుంది, మరింత ముందుకు వెళ్ళండి మరియు ముందుకు నడిపించండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాప్‌దాదా నుండి విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇమిడిపోయినందుకు అభినందనలు. ఎప్పుడు బాబా అవతరణ జరిగినా ఈ-మెయిల్ లేక ఉత్తరాలు మొదలగు భిన్న భిన్న సాధనాలతో నలువైపుల ఉన్న పిల్లలు ప్రియస్మృతులు పంపుతారని బాప్‌దాదాకు తెలుసు. బాప్‌దాదాకు వినిపించే ముందే అందరి ప్రియస్మృతులు చేరుకుంటాయి ఎందుకంటే ఇటువంటి గారాల పిల్లలు, స్మృతి చేసే పిల్లల సంబంధము చాలా త్వరగా జోడింపబడుతుంది. మీరైతే మూడు నాలుగు రోజులు తర్వాత సమ్ముఖంలో కలుస్తారు కానీ సత్యమైన, యోగ్యత ఉన్న పిల్లల ప్రియస్మృతులు ఆ క్షణంలోనే బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి. కావున ఎవరైతే హృదయంలో అయినా గుర్తు చేసారో, సాధనాలు లభించకపోయినా, వారి ప్రియస్మృతులు కూడా లభించాయి. బాప్‌దాదా పిల్లలందరికీ పదమ పదమ పదమా రెట్లు ప్రియస్మృతులకు రెస్పాండ్ ఇస్తున్నారు.
ఇప్పుడు నలువైపుల రెండు మాటల తపనను పెంచండి - ఒకటి సంపూర్ణ పవిత్రతను పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపజేయాలి. బలహీనంగా ఉన్నవారిని కూడా సహయోగమును ఇచ్చి తయారు చెయ్యండి. ఇది చాలా పెద్ద పుణ్యము. వదిలెయ్యకండి, వీరింతే, వీరు మారరు అని శాపము ఇవ్వకండి. పుణ్య కర్మ చెయ్యండి. మార్చి చూపిస్తాము, మారాల్సిందే. వారి ఆశలను పెంచండి. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి, ఆధారాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నలువైపుల ఉన్న అదృష్టవంతులకు, సంతోషకర స్వభావం కలిగినవారికి, సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (దాదీలను సంభాళించే సేవా సహవాసి సోదరీలు, బ్రాహ్మణిలను బాప్‌దాదా కలుస్తున్నారు) - మీరందరూ రాజయుక్తులుగా ఉన్నారు కదా! మీరు నిమిత్తంగా ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి రూపాన్ని, స్థితిని తయారు చేసుకోండంటే దాదీల తరఫు నుండి వీరి ద్వారా కూడా మాకు లభించింది అని అందరూ భావించాలి. కేవలం ప్రోగ్రాము లభించింది అనే కాక, వీరి నుండి కూడా లభించింది, మీరు దృష్టి ద్వారా ఇవ్వవచ్చు, ముఖము ద్వారా ఇవ్వవచ్చు. ముఖము మరియు నడవడికతో సేవలో నంబరువన్. వీలవుతుందా? అందర్నీ బాప్‌దాదా విశేషంగా ప్రేమిస్తారు. (ఈ ముగ్గురూ చేతులెత్తరు) బాబా చెప్పినప్పుడు చేయి ఎత్తాలి, దీని వలన గుర్తుంటుంది. ఈరోజు మీ నలుగురు గారాబాల పిల్లలు, వీరి (మోహినీ అక్కయ్య మరియు మున్ని అక్కయ్య) బ్రాహ్మణిలు ఎక్కడున్నారు, వారిని కూడా పిలవండి. చూడండి, మీ అందరికీ మంచి బాధ్యత లభించి ఉంది. అందరితో పరిచయం జరుగుతంది. ఎవరి పేరు తీసుకున్నా, నీలూ, హంసా, ప్రవీణ, లీల, రుక్మిణి... అవును, మాకు వారు తెలుసు అని అంటారు. మరి మీరు ఒక సాంపుల్‌గా ఉన్నారు. మరి సాంపుల్‌ను చూసి వ్యాపారం చెయ్యడం జరుగుతుంది. నిమిత్తమైన మీరంతా మేము ఉదాహరణగా ఉన్నాము అని భావించండి, దాదీలకు ఉదాహరణ. వీరు కూడా ఇలా (దాదీలా) ఉన్నారు అని అంటారు. మోహజీత రాజు కథలో చెప్తారు కదా, ద్వారపాలకుడు కూడా మోహజీతుడుగా ఉన్నాడు అని. మరి మీరు నిమిత్తం కదా. ఇది కూడా ఒక వరదానమే. ఈ బాధ్యత లభించడం కూడా ఒక వరదానమే. ఎంత సమీపంగా ఉన్నారు. మరి సమీపంగా ఉన్నందుకు లాభాన్ని తీసుకోవాలి కదా. బాగుంది. మిమ్మల్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. మీ అందరూ బాగున్నారు, మీ అందరూ కొద్దిగా దాదీల గుణాలను ధారణ చేస్తూ ఉండండి. అచ్ఛా.
పర్దాదీతో:- మీ ముఖమే సేవ చేస్తుంది. మిమ్మల్ని చూసి అందరికీ బ్రహ్మా బాబా గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఫాలో చేసారు కదా, ఇతర పిల్లల నుండి ఈ భావన రాదు కానీ మీరు ఫాలో చేసారు. అయినా మధువన నివాసిగా అయిపోయారు కదా. మధువన నివాసి. చాలా బాగుంది. (పర్దాదీని సంభాళించే సోదరీలతో) బాగా సంభాళిస్తున్నారు. వీరికి సర్టిఫికేట్ ఉంది. మంచి ప్రేమతో చేస్తున్నారు.
శాంతమణి దాదీతో:- (కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు) ఇదైతే నయమైపోతుంది. ధైర్యం ఉంది. మీ అందరి ధైర్యము చూసి ఇతరులలో కూడా ధైర్యము వస్తుంది ఎందుకంటే బీజము, పునాది చాలా బాగుంది, ఫీలింగ్‌లోకి రారు, అనారోగ్యపు ఫీలింగ్ లేదు. తమ ఆనందంలో ఉంటారు. చదువుపై అటెన్షన్ ఉంది. సేవపై అటెన్షన్ ఉంది. అందుకు ఆశీర్వాదాలు లభిస్తాయి. డాక్టర్లు కూడా చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే బాధపడరు కదా, అయ్యో అయ్యో అని అనరు.
నిర్వైర్ అన్నయ్య హైదరాబాద్ అకాడమీలో జరుగుతున్న నిర్మాణ కార్యం గురించి బాప్‌దాదాకు వినిపించారు:- ఏ కార్యమైతే మిగిలి ఉందో, అందులో ఆంధ్రప్రదేశ్ టీచర్లను పిలవండి ఎందుకంటే ధనం పెడితే మనసు కూడా అక్కడ ఉంటుంది. అందరూ సహయోగాన్ని ఇస్తారు, తక్కువైతే యజ్ఞము ఉండనే ఉంది కానీ ఒకవేళ వారి ధనం రాకపోతే మనసు కూడా రాదు. కనుక వారి సంగఠనను ఏర్పాటు చెయ్యండి, ఆంధ్రప్రదేశ్ కొంచెం ముందుకు రావాలి. బాగుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టర్న్ వస్తుంది కదా. అందులో కూడా మీరు విశేషంగా ఆంధ్రప్రదేశ్ సంగఠనను ఏర్పాటు చెయ్యండి. ప్రతి మాసంలో లేక 6 మాసాలకు ఒకసారి ఎవరో ఒకరు వెళ్తూ ఉండండి లేక మీటింగ్‌కు పిలవండి, అన్ని జోన్లు కలిసినప్పుడు వీరు కూడా కలవాలి కదా, అప్పుడు బాగా జరుగుతుంది. సరేనా.
రమేష్ అన్నయ్యతో:- ఆరోగ్యం బాగుందా. (బాంబే సమాచారాన్ని వినిపించారు). సెంటర్లన్నీ సురక్షితంగా ఉన్నాయి కదా. అయినా బాంబే అయితే బాబాది. బాబా పరివారము, కానీ బాబా ఏదైతే చెప్పారో ఫుల్స్టాప్ మరియు తపస్య, దీనిని తప్పక పెంచండి. ఇదైతే ఏమీ లేనట్లే, ఇంటి నుండి బయటకు రావడం కుదరదు, కిటికీను తెరవలేరు, అప్పుడు ఏమి చేస్తారు? దీనితో కూడా చాలా జరిగేదుంది.
బృజ్‌మోహన్ అన్నయ్యతో:- (ఓ.ఆర్.సి లో జరిగిన సింధీ సమ్మేళనం గురించి వినిపించారు) కనెక్షన్ అయితే ఏర్పడింది కదా, ఇప్పుడు వారిని కలుస్తూ ఉండండి. ఇప్పుడు మరింత కనెక్షన్‌లోకి తీసుకురండి. ఈ సినిమాకు సంబంధించిన వ్యక్తి మీకు ఉపయోగపడవచ్చు. వీరు(సింధీవారు) ఉండిపోకూడదు. అయినా బాబా అవతరణ జరిగినప్పుడు ఎవ్వరూ మిగిలిపోకూడదు. మీ పని సందేశమును ఇవ్వడము, మాకు వినిపించలేదు అని అనకూడదు. (ఆశ అక్కయ్యతో) కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. బాబాపై ప్రేమ ఉంది కావున శ్రమ అనిపించదు. (ఇప్పుడు ఓ.ఆర్.సి సేవలో పరిగెడుతుంది) నలువైపుల పరిగెత్తాలి. ఏ జోన్లు అయితే కొద్దిగా బలహీనంగా ఉన్నాయో, పరస్పరంలో కలుసుకోవడం లేదో, అక్కడకు ప్రతి నెల ఎవరో ఒకరు వెళ్ళాలి, సంగఠనను ఏర్పాటు చెయ్యాలి. (దాదీ జానకి అన్నారు, ఇందులో గుల్జార్ దాదీ సహయోగం కూడా కావాలి) పరస్పర సహయోగమైతే కావాలి కదా.
8 మంది పెద్దక్కయ్యలు 5 రోజులు మౌన భట్టీ చేసారు, వారు బాప్‌దాదా ఎదుటకు వచ్చారు:- అచ్ఛా, ఫరిశ్తాలు వచ్చారు. ఫరిశ్తాలు కదా. ఇది ఫరిశ్తాల సభ. అచ్ఛా. స్వయంలో ఉల్లాస ఉత్సాహాలను నింపుకుని చేసారు కదా, ఇందుకు చాలా చాలా అభినందనలు. కొందరే ఉన్నారు, వస్తారా, రారా అని ఆలోచించలేదు. చెయ్యాల్సిందే. మరి 8 రత్నాలయ్యారు. మరి 8 రత్నాలను చూసి అందరికీ ఉల్లాసము వస్తుంది. ఈ జనవరి మాసం కోసం ప్రోగ్రాము తయారు చేస్తారు కదా అందులో అందరికీ ఉల్లాసాన్ని కలిగించే విషయమేదైనా ఉంచండి. దాని గురించి కనిపెడ్తూ ఉండండి. మీరు స్వయం బాధ్యులు కదా మరి మీరు మీ బాధ్యతను సంభాళించారు. కానీ ఇతరులను ఆకర్షించవలసి ఉంటుంది. ఎలా అయితే మధువన వాతావరణంలో ప్రాక్టికల్‌గా తేడా కనిపిస్తుందో అలాంటి వాతావరణం తయారు కావాలి. ప్రతి గృహము మందిరమే అన్న గాయనం ప్రకారంగా ప్రతి సెంటరులోనూ ఇటువంటి వాతావరణం తయారు కావాలి. మీరు ధైర్యం ఉంచి ఇది చేసినందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు. కనుక బాప్‌దాదా అంటారు ఇది ధైర్యమున్న గ్రూపు. ఉదాహరణగా కావాలి. మంచిగా అనిపించింది కదా, చాలా మంచిగా అనిపించింది, సహజంగా కూడా అనిపించింది. శ్రమ చెయ్యాల్సి రాలేదు. లేవాలని కూడా అనిపించి ఉండకపోవచ్చు. ఇలా తిరగండి, (చప్పట్లు కొట్టండి) చూడండి, వీరు ఏ విషయంలో ధైర్యమును ఉంచారు? ఇందుకు బాప్‌దాదా మరియు పరివారం కూడా సహయోగిగా అయింది, వీరు 5 రోజులు ఫుల్స్టాప్ పెట్టే భట్టీను చేసారు. 5 రోజులు నిరంతరం ఎవ్వరూ మిస్ కాలేదు. ఆదిలో మొదలుపెట్టారు, అంతిమ సమయానికి మీ ముందు ఉన్నారు. ఈ పురుషార్థం మంచిగా చేసారు. ఇలా మీరు కూడా గ్రూపులు గ్రూపులుగా అయి లోపల లోపలే పురుషార్థం చెయ్యండి. ఇద్దరు గ్రూపుగా కండి, సెంటరులోని ఒక సఖిని తోడుగా తీసుకుని మీ పెద్దవారికి వినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే, భట్టీ చేస్తారు కదా, విశేషంగా నియమం పెట్టుకుంటారు కాబట్టి అందుకు సహాయం లభిస్తుంది. బాప్‌దాదాకు నచ్చింది. ఇప్పుడు సహజ పురుషార్థమైపోయింది కదా. ఇప్పుడు అక్కడకు వెళ్ళాక మర్చిపోకండి. మాటలలోకి రాకండి. ఫుల్స్టాప్లో నంబరువన్ తీసుకోండి. ఇతరులతో చేయించండి మరియు తమ అనుభవాన్ని కూడా వినిపించండి. అచ్ఛా.
ఓంశాంతి