Search for a command to run...
15 Dec 2008
ఒకే రాజ్యము, ఒకే ధర్మము, లా అండ్ ఆర్డర్ స్థాపన అవుతున్న సమయములో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి
15 December 2008 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ రాజదులారే(ముద్దు) పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. పరమాత్ముని ప్రేమలో బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ మూడు సింహాసనాలకు అధికారులుగా చేసారు. ఒకటి - స్వరాజ్య అధికారపు భృకుటి సింహాసనము, రెండు - బాప్‌దాదా హృదయ సింహాసనము మరియు మూడవది - విశ్వ రాజ్యాధికార సింహాసనము. ఈ మూడు సింహాసనాలను బాబా తమ స్నేహీ దులారులకు ఇచ్చారు. ఈ మూడు సింహాసనాలు సదా స్మృతిలో ఉన్నట్లయితే పిల్లలు ప్రతి ఒక్కరూ ఆత్మిక నషాలో ఉంటారు. మరి పిల్లలందరూ బాబా ద్వారా ప్రాప్తించిన వారసత్వమును చూసి సంతోషంగా ఉంటున్నారు కదా! హృదయంలో స్వతహాగా వాహ్ బాబా వాహ్! మరియు వాహ్ నా భాగ్యము వాహ్! అనే పాట మ్రోగుతూ ఉండాలి. స్వప్నంలో కూడా లేనిది ప్రాక్టికల్‌లో లభించింది. సింహాసనంతో పాటు బాప్‌దాదా ఈ సంగమయుగంలో డబల్ కిరీటం ద్వారా ఎగిరే కళలో అనుభవీగా కూడా చేసారు.
బాప్‌దాదా ఈరోజు నలువైపుల ఉన్న పిల్లల పురుషార్థపు వేగాన్ని పరిశీలించారు ఎందుకంటే సమయపు వేగాన్నయితే మీరందరూ చూస్తున్నారు మరియు తెలుసుకుంటున్నారు. మరి బాప్‌దాదా ఏమి చూసారంటే ప్రతి ఒక్కరికీ బాబా ద్వారా లభించిన రాజ్య భాగ్యపు వారసత్వము, తమ రాజ్యము, భవిష్య ప్రాప్తి, భవిష్యత్తులో ఎలా అయితే మీ అందరి సంస్కారాలు నేచురల్‌గా(సహజంగా) మరియు నేచర్‌గా(స్వాభావికంగా) ఉంటాయో అవి ఇప్పటి నుండి బహుకాలపు సంస్కారాలుగా అనుభవం కావాలి ఎందుకంటే ఈ క్రొత్త ప్రపంచం మీ అందరి క్రొత్త సంస్కారం ద్వారానే తయారవుతుంది. మరి క్రొత్త ప్రపంచపు విశేషతలను అనుభవం చేసుకుంటున్నారు కదా! మన రాజ్యంలో ఏమవుతుంది, నషా ఉంది కదా. మా రాజ్యము, మా క్రొత్త ప్రపంచము వచ్చేసింది అని మనసు చెప్తుంది కదా. మరి క్రొత్త ప్రపంచపు విశేషతలు పిల్లల పురుషార్థీ జీవితంలో ఎంతవరకు ఇమర్జ్ అయ్యాయి అని బాప్‌దాదా చూసారు. క్రొత్త సంస్కారాలు, క్రొత్త ప్రపంచంలోని విశేషతలు ఏమిటో తెలుసు కదా! అందరి బుద్ధిలో క్రొత్త ప్రపంచపు విశేషతలు ఇమర్జ్ అయి ఉన్నాయి కదా! తెలుసు కదా! పాడుతారు కూడా, తెలుసు కూడా. మొదటి విశేషత, ఒక్కొక్క విశేషత నాలో ఎంత ఇమర్జ్ అయి ఉంది అని పరిశీలించుకోండి. ముఖ్య విశేషత - ఒకే రాజ్యము, ఎలా అయితే అక్కడ ఒక్క రాజ్యము స్వతహాగా ఉంటుందో, మరో రాజ్యము ఉండదో అలాగే ఈ సంగమ జీవితంలో కూడా ఒక్క రాజ్యము ఉందా అని పరిశీలించుకోండి. లేక అప్పుడప్పుడూ మరో రాజ్యం కూడా వచ్చేస్తుందా? ఒకవేళ నడుస్తూ-నడుస్తూ స్వరాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా నడుస్తుంటే మరి ఒక్క రాజ్యపు సంస్కారాలు ఉంటాయా? ఒక్క రాజ్యంతో మరో రాజ్యం కూడా నడవదు కదా? పరమాత్ముని శ్రీమతపు రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడూ మాయ ఒత్తిడి కూడా ఉంటుందా? మనసులో మాయా రాజ్యం అయితే ఉండటం లేదు కదా? ఇది పరిశీలించుకోండి. ఈ విషయాలలో తమ చార్టును పరిశీలించుకోండి. ఇప్పుడు సంగమంలో ఒక్క పరమాత్మ రాజ్యమే ఉందా లేక మాయా ఒత్తిడి కూడా ఉంటుందా? పరిశీలించుకున్నారా? ఇప్పుడే పరిశీలించుకోండి. తమ చార్టునైతే చూసుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఇప్పటి వరకూ రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఒక్క రాజ్యానికి ఎలా అధికారులుగా అవుతారు? శ్రీమతంతో పాటు మాయా మతం కూడా మిక్స్ అయిపోతుందా? అలాగే ఒక్క ధర్మము - ఒక్క రాజ్యమూ ఉంటుంది, ఒక్క ధర్మమూ ఉంటుంది. ధర్మము అనగా ధారణ. మరి మీ విశేష ధారణ ఏమిటి? పవిత్రతా ధారణ. మరి పరిశీలించుకోండి - సదా మనసు, వాచ, కర్మ, సంబంధ-సంపర్కంలో సంపూర్ణత మరియు సదా పవిత్రతా స్వభావము సహజంగా ఉన్నాయా? ఎలా అయితే అక్కడ మన రాజ్యంలో పవిత్రతా స్వధర్మము స్వతహాగా ఉంటుందో అలాగే ఈ సమయంలో పవిత్రతా ధారణ నేచురల్‌గా మరియు నేచర్‌గా ఉన్నదా? ఎందుకంటే తమ అనాది మరియు ఆది స్వరూపము పవిత్రత అని మీకు తెలుసు. మరి పరిశీలించుకోండి - ఒక్క ధర్మము అనగా పవిత్రత నేచురల్‌గా ఉందా? ఏదైతే నేచర్‌గా ఉంటుందో అది వద్దనుకున్నా పని చేసేస్తుంది. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమనంటారు? చాలా మధురాతి మధురంగా మాట్లాడుతారు, అంటారు - అలా అనుకోలేదు కానీ ఒకసారి మనసులో, ఒకసారి వాచలో ఏదో ఒక అపవిత్రత అంశము ఇమర్జ్ ఎందుకు అవుతుంది? అనేక జన్మల సంస్కారము కాబట్టి అవుతుంది. మరి ఒక్క ధర్మ స్థాపన అనగా పవిత్రతా ధారణ నేచర్‌గా మరియు నేచురల్‌గా ఉండాలి. వాచలో ఆవేశం వచ్చినా కూడా, క్రోధం కాదు కొద్దిగా ఆవేశం వచ్చింది అంటారు. అయితే ఈ ఆవేశం ఏమిటి? క్రోధం సంతానమే కదా. మరి ఒక్క ధర్మ సంస్కారము ఎప్పుడు నేచురల్‌గా అవుతుంది? కావున పరిశీలించుకోండి కానీ పరిశీలించుకోవడంతో పాటు బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పరివర్తన కండి. ఇప్పుడు బాప్‌దాదా ముందునుండే అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఇప్పటికైనా పరిశీలించుకుని పరివర్తన కావడానికి తీవ్ర పురుషార్థం చేసినట్లయితే ఇంకా మార్జిన్ ఉంది కానీ కొద్ది సమయం తర్వాత అకస్మాత్తుగా టూ లేట్ (చాలా ఆలస్యము) అన్న బోర్డును పెట్టవలసిందే. బాబా చెప్పలేదు అని అప్పుడు అనకండి. ఇప్పుడు పురుషార్థం చేసే సమయము గడిచిపోయింది, ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసేందుకు ఇంకా సమయం ఉంది. కావున పరిశీలించుకోండి కానీ కేవలం పరిశీలించుకోవడమే కాక పరివర్తన కూడా తీసుకురండి. కొంతమంది పరిశీలించుకుంటారు కానీ పరివర్తన అయ్యే శక్తి ఉండదు. పరిశీలన మరియు పరివర్తన రెండూ జరగాలి. మీ అందరి స్వమానము మరియు మీ అందరి మహిమ ఏమిటి? టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తిమంతులు. మాస్టర్ సర్వశక్తిమంతులేనా లేక శక్తిమంతులా? మాస్టర్ సర్వశక్తిమంతులు అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా. మరి మాస్టర్ సర్వశక్తిమంతులకు అభినందనలు కానీ మాస్టర్ సర్వశక్తిమంతులు మరియు పరివర్తన చేసుకోలేకపోతే ఏమని అంటారు? తమ సంస్కారాన్ని, నేచర్‌ను పరివర్తన చేసుకోవాలని కూడా చేసుకోలేకపోతే ఏమంటారు? స్వయాన్ని ప్రశ్నించుకోండి - మాస్టర్ శక్తిమంతులా లేక మాస్టర్ సర్వశక్తిమంతులా? మాస్టర్ సర్వశక్తిమంతులు ‘ఇది చెయ్యాలి’ అని సంకల్పం చెయ్యగానే అది జరిగే ఉంది. అవుతుందిలే, చూద్దాములే... ఇలా జరుగదు. మరి ఇప్పుడు సమయ ప్రమాణంగా రిజల్టు ఎలా ఉండాలంటే ఏదైతే ఆలోచిస్తారో, సంకల్పము మరియు స్వరూపము రెండూ ఒకేసారి జరగాలి.
ఇప్పుడు క్రొత్త సంవత్సరము, అవ్యక్త సంవత్సరము రానుంది. అవ్యక్త పాలన మొదలై 40 సంవత్సరాలు కావస్తుంది. అవ్యక్త పాలన మరియు వ్యక్త రూప పాలన మొదలై 72 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇద్దరు తండ్రుల పాలనకు రిటర్న్ బాప్‌దాదాకు ఇవ్వరా! ఆలోచించండి - పాలన ఏమిటి మరియు ప్రాక్టికల్ ఏమిటి? బాప్‌దాదా ఏమి చూసారంటే నిర్లక్ష్యము మరియు రాయల్ సోమరితనము, రాయల్ సోమరితనము అంటే - అవుతుందిలే, అవుతాములే, చేరుకుంటాములే మరియు నిర్లక్ష్యము అంటే చేస్తున్నాము, ము... ము...ఇదైతే అవ్వవలసిందే, ఇదైతే చెయ్యవలసిందే, చెప్పడంలో మరియు చెయ్యడంలో తేడా వచ్చేస్తుంది. బాప్‌దాదా ఒక దృశ్యము చూసి చాలా నవ్వుకుంటారు, ఏమంటారు? ఇది జరిగిపోతే, ఇది చేసేస్తే చాలా మంచిగా నేను ముందుకు వెళ్ళగలను అని అంటారు. ఇతరుల పరివర్తనా వృత్తి ఉంటుంది కానీ స్వ పరివర్తన వృత్తి అక్కడక్కడ తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసే వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలనుకుంటే విశేషతను చూడండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, ఇలా అయితే అవుతూనే ఉంటుంది, వీరు కూడా చేస్తున్నారు కదా... ఇటువంటి భావనను తగ్గించండి. స్వయాన్ని చూసుకోండి, బాబాను ఎదురుగా పెట్టుకోండి. ఇక ఎవరు ఉన్నాకానీ, మహారథి కావచ్చు, మధ్యవారు కావచ్చు, పురుషార్థంలోని ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటూనే ఉన్నారు. అందుకే సీ ఫాదర్, సీ డబల్ ఫాదర్. బ్రహ్మా బాబాను చూడండి, శివ బాబాను చూడండి. బాబా మిమ్మల్ని తమ హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారు మరియు మీరు కూడా తమ హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారు. మీ స్లోగన్ ఉంది సీ ఫాదర్(తండ్రిని చూడండి) అని. సీ సిస్టర్, సీ బ్రదర్ అన్న స్లోగనే లేదు. ఏదో ఒక లోపము అందరిలో ఇప్పటికీ ఉంది. కానీ ఒకవేళ ఇతరులను చూడాలంటే విశేషతను చూడండి. వారిలో ఉన్న ఏ లోపాన్ని వారు తీసేస్తున్నారో దానిని చూడకండి. రెండవ విషయము - మీ రాజ్యంలో, మీ రాజ్యం గుర్తుంది కదా. నిన్ననే ఉన్నది మరియు రేపు రాబోతుంది. మీ బుద్ధిలో, నయనాలలో మీ రాజ్యం స్పష్టంగా వచ్చేసింది కదా. ఎన్ని సార్లు రాజ్యం చేసారు? లెక్కపెట్టారా? అనేకసార్లు రాజ్యం చేసారు. అనడంతోటే ఎదుటకు వచ్చేస్తుంది. తమ రాజ్యాధికార రూపము మరియు శ్రేష్ఠ రాజ్యము, తమ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ స్వతహాగా జరుగుతాయి. అందరూ జ్ఞానవంతమైన సంస్కారాలు కలవారే, లా ఏమిటి, ఆర్డర్ ఏమిటి అని అందరికీ తెలుసు. అలాగే తమ జీవితంలో కూడా చూసుకోండి - బాబా ఆర్డర్లో నడుస్తున్నారా లేక ఒక్కోసారి మాయా అర్డర్ కూడా నడుస్తుందా? శ్రీమతం కాకుండా ఒకసారి పరమతము, మన్మతములో అయితే నడవడం లేదు కదా? మరి లా ఏమిటి? నిశ్చింత చక్రవర్తి, ఏ చింత లేదు ఎందుకంటే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. అలాగే పరిశీలించుకోండి - సంగమ శ్రేష్ఠ జన్మలో కూడా బాప్‌దాదా ఇచ్చిన సర్వ ప్రాప్తులు, ఇవి భగవంతుని ప్రసాదము ఉంటుంది కదా, ప్రసాదానికి ఎంతటి మహత్వము ఉంటుంది. మరి బాబా ఇచ్చిన ప్రాప్తులన్నీ ప్రభు ప్రసాద ప్రాప్తము. ప్రభు ప్రసాదానికి మహత్వము ఉంది! వారసత్వము కూడా ఉంది, అధికారము కూడా ఉంది మరియు ప్రసాదము కూడా ఉంది. మరి పరిశీలించుకోండి - లా అండ్ ఆర్డర్, రెండింటిలో సంపన్నంగా ఉన్నారా?
బాప్‌దాదా ఒక విషయము ఏమి చూసారంటే మెజారిటీ పిల్లలు లభించిన పరివర్తన శక్తిని సమయానికి కార్యంలో వినియోగించినట్లయితే ఎటువంటి కష్టము ఉండదు. చూడండి, ఒకవేళ ఎప్పుడైనా, ఏ విధంగానైనా మాయతో ఓటమి జరిగితే, భాషణ చేసేటప్పుడు, క్లాస్ చేసేటప్పుడు ఈ రెండు మాటలు పడవేసేవి మరియు పైకి తీసుకువెళ్ళేవి కూడా అని అంటారు కదా. ఆ రెండు మాటలు ఏమిటో తెలుసు కదా, మనసులోకి వచ్చేసాయి కదా. ఆ రెండు మాటలు నేను, నాది. భాషణలో చెప్తారు కదా, క్లాసులో కూడా చెప్తారు. బాప్‌దాదా క్లాసు కూడా వింటారు, ఏమంటారు? ఇప్పుడు ఈ మాటలను పరివర్తన శక్తి ద్వారా ఎప్పుడు నేను అని మాట్లాడినా నేను ఫలానా, నేను బ్రాహ్మణుడిని కానీ నేను ఎవరిని? బాప్‌దాదా ఏ స్వమానాలైతే ఇచ్చారో, ఎప్పుడు నేను అని చెప్పినా కానీ దానితో పాటు ఏదో ఒక స్వమానాన్ని చెప్పండి అంటే బుద్ధిలోకి తీసుకురండి. నేను అనగానే స్వమానం వచ్చేయాలి. నాది అని అనగానే బాబా గుర్తుకు రావాలి. నా బాబా. ఇది నేచురల్ స్మృతిలోకి రావాలి. ఈ పరివర్తన తీసుకురండి, చాలు. రెండవ విషయము - చాలా వరకు సంబంధ సంపర్కాలలోకి వచ్చినప్పుడు రెండు మాటల ద్వారా మాయ వస్తుంది, ఒకటి భావము మరియు రెండు భావన. ఎప్పుడు భావము అన్న మాట ఉపయోగించినా, ఆలోచించినా, ఆత్మిక భావము కలగాలి. భావము అన్న మాట అనగానే ఆత్మిక భావము ముందు గుర్తుకు రావాలి మరియు భావన అంటే శుభ భావన గుర్తుకు రావాలి. శబ్దము యొక్క అర్థాన్ని పరివర్తన చెయ్యండి. మీ టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు. విశ్వ పరివర్తకులు ఈ మాటను పరివర్తన చేయలేరా? సమయానికి పరివర్తన శక్తిని ఉపయోగించి చూడండి. తర్వాత వస్తుంది, గడిచిపోతుంది, మనసుకు నచ్చదు, స్వయమే ఆలోచిస్తూ ఉంటారు కానీ సమయమైతే గడిచిపోయింది కదా. అందుకే ఇప్పుడు తీవ్ర గతి యొక్క అవసరం ఉంది, అప్పుడప్పుడూ కాదు. చాలా సమయమైతే మంచిగానే ఉంటాను కదా అని అనుకోకండి. అంతిమ క్షణంపై ఎటువంటి నమ్మకం లేదని బాప్‌దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. అకస్మాత్తుగా ఆటలు జరుగనున్నాయి. కొంతమంది పిల్లలు బాప్‌దాదాకు కూడా అతి మధురమైన మాటలను వినిపిస్తూ ఉంటారు, ఏమనంటారంటే సమయం కొంచెం అతిలోకి వెళ్తుంది కదా, అప్పుడు వైరాగ్యం వస్తుంది, వైరాగ్య సమయంలో స్వతహాగానే వేగం తీవ్రం అవుతుంది అని. కానీ బహుకాలపు పురుషార్థం అవసరము అని బాప్‌దాదా వినిపించి ఉన్నారు. ఒకవేళ కొద్ది సమయపు పురుషార్థం ఉన్నట్లయితే ప్రాలబ్ధము కూడా కొద్ది సమయానికే లభిస్తుంది, పూర్తిగా 21 జన్మల ప్రాలబ్ధము లభించదు. బాప్‌దాదా చెప్పే మూడు మాటలను సదా గుర్తుంచుకోండి - ఒకటి - అకస్మాత్తు, రెండు - ఎవరెడీ మరియు మూడు - బహుకాలము. ఈ మూడు మాటలను సదా బుద్ధిలో పెట్టుకోండి. ఎప్పుడు, ఎక్కడైనా ఎవ్వరికైనా అంతిమ కాలము రావచ్చు. ఇప్పుడే ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారో చూడండి. వారికేమైనా తెలుసా, అందుకే బహుకాలపు పురుషార్థంతో 21 జన్మల వారసత్వ ఫలితాన్ని ప్రాప్తి చేసుకోవలసిందే. ఈ తీవ్ర పురుషార్థాన్ని గుర్తుంచుకోండి. ఫస్ట్ నంబరు, ఫస్ట్ జన్మ తమ రాజ్యంలో. ఏమి ఆలోచిస్తున్నారు? ఫస్ట్ జన్మలోకి రావాలి కదా. ఎందులో మజా ఉంది? ఫస్ట్ జన్మలోఉందా లేక ఏ జన్మలో అయినా ఉందా? మా రాజ్యంలో ఫస్ట్ జన్మలో శ్రీకృష్ణుడితో పాటు మా పాత్ర కూడా ఉంది అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా, పాత్ర ఫస్ట్‌లో ఉందా? చేతులు చూసైతే సంతోషంగా ఉంది. చప్పట్లు కొట్టండి. ఫస్ట్ జన్మలోకి వస్తున్నందుకు అభినందనలు. కానీ చెప్పమంటారా... చెప్పవద్దా. ఫస్ట్ జన్మలోకే వచ్చేదున్నప్పుడు ఇక మరో విషయము ఎందుకు? మంచిది, ఎంతమందైతే వచ్చారో అందరూ ఫస్ట్ జన్మలోకి రావలసిందే. చప్పట్లయితే కొట్టారు, ఫస్ట్ జన్మ మరియు ఫస్ట్ స్టేజి కూడా. ఫస్ట్ స్టేజిని తయారు చేసుకోవలసిందే అని ఎవరికైతే సంకల్పం ఉందో, ఎటువంటి విఘ్నము వచ్చినా కూడా అది విఘ్నముగా ఉండకూడదు, విఘ్న వినాశకుల ఎదుట విజయ రూపంగా మారిపోవాలి ఎందుకంటే మీరందరూ విఘ్న వినాశకులు. టైటిల్ ఏమిటి? విఘ్న వినాశకులు. కావున ఒకవేళ వచ్చినా కూడా ఆట ఆడుకోవడానికి వస్తాయి. కానీ మీరు దూరంనుండే తెలుసుకోండి, రాయల్ రూపంలో వస్తుంది కానీ విఘ్న వినాశకులైన మీరు ఈ ఆట ఏమిటి అని దూరం నుండే తెలుసుకుంటారు. అందుకే బాప్‌దాదా కూడా పిల్లలందరూ కలిసి వెళ్ళాలి, వెనుక ఉండిపోకూడదు అని ఆశిస్తారు. బాప్‌దాదాకు పిల్లలు లేనిదే మజా రాదు. కావున దృఢత్వాన్ని ఎప్పుడూ బలహీనంగా చేసుకోవద్దు. చెయ్యాల్సిందే. లే, లే అని అనకండి, చేద్దాములే, చూద్దాములే, అవుతుందిలే... చూడండి, ఈ మాటలు రాకూడదు. దృఢత్వము సఫలతకు తాళం చెవి. ఈ తాళం చెవిని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మాయ కూడా తెలివైనది, అది తాళం చెవిని వెతుకుతుంది కావున ఈ తాళం చెవిని జాగ్రత్తగా సంభాళించి పెట్టుకోండి.
ఇప్పుడు పరిశీలించుకోండి - మీ రాజ్య సంస్కారాలను ఇప్పటి నుండే ధారణ చేసుకోవలసిందే. లే,లే, అని అనకండి. ఒకటి లే, లే, మరొకటి ము, ము...ఈ మాటలను బ్రాహ్మణుల డిక్షనరీ నుండి తీసెయ్యండి. సరే, ఒకవేళ ఎవరిలోనైనా బలహీనత చూసినా, అందరూ పురుషార్థీలే కదా, లేకపోతే బ్రాహ్మణ జీవితం నుండి వెళ్ళిపోయి ఉండేవారు. పురుషార్థీలు కనుకనే ఇంకా బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారు. కొందరు ఏమంటారంటే నేనైతే మంచిగానే ఉన్నాను కానీ ఇతరులు చేస్తారు కదా అది విఘ్న రూపంగా అవుతుంది అని అంటారు. ఇది చెయ్యకూడదు, వీరు మారాలి, కానీ బాప్‌దాదా ముందునుండే స్లోగన్ ఇచ్చి ఉన్నారు - మేము మారి వారిని మార్చాలి అని. నేను మారాలి. వారు మారితే నేను మారుతాను అని కాదు. వినిపించాము కదా, భావము మరియు భావనను పరివర్తన చెయ్యండి. భావము ఆత్మది, భావన శుభ భావన. మీరు చేసి చూడండి, అలసిపోకండి. శుభ భావన ఎంతో పెట్టి చూసాము, కానీ మారడం లేదు, మారేదే లేదు - బ్రాహ్మణులైన మీ నోటి నుండి ఈ మాటలు, వీరు మారరు అన్నది వరదానం అయిందా? బ్రాహ్మణులు ఏ వరదానాన్ని ఇస్తారు? ఆధారాన్ని ఇవ్వగలగాలి, శుభ భావనల ఆధారాన్ని ఇవ్వండి, లేకపోతే ప్రక్కకు తప్పుకోండి. మనసులో పెట్టుకోకండి. శుభ భావనల ఆశీర్వాదాలను ఇవ్వండి. మిగతా మాటలను ఇవ్వకండి. ఒకటి ఇలా అంటారు, రెండవ మాట ఏమంటారో చెప్పమంటారా? ఎందుకంటే ఈరోజు బాప్‌దాదా బాగా చెక్ చేసారు, ఇంకా ఏమంటారు? ఇదైతే జరుగుతూనే ఉంది, వీరు కూడా చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమవుతుంది? వారు బావిలో పడి ఉన్నారు మీరు కూడా బావిలో పడి చూస్తున్నారు, ఇది తెలివైన పనియేనా? ఇప్పుడు ఒక విషయము 18 జనవరి వరకు బాప్‌దాదా పురుషార్థం కోసం హోమ్‌వర్కును ఇస్తున్నారు-చేస్తారా? చేస్తారా? చేతులెత్తండి. ఏమి జరిగినా కానీ, మారవలసిందే, ఎదుర్కోవలసిందే, ప్రక్కకు తప్పుకోవలసిందే, కానీ మారుతాము. చేతులెత్తారా? పక్కా? లేక నేను చాలా ప్రయత్నించాను, కానీ వీలు కాలేదు అని అయితే జవాబు చెప్పరు కదా ఎందుకంటే ఇప్పుడు అకస్మాతు యొక్క ఆటలు చాలా రానున్నాయి. పిల్లలు ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు, కలిసి వెళ్ళాలి అని బాప్‌దాదా కోరుకుంటున్నారు. ఒకవేళ ఎవ్వరూ మారకపోతే, శుభ భావన పెట్టినా పరివర్తన కాకపోతే మీరు మారండి. వీరు ఇది చేసారు, వీరు ఇలా అన్నారు అందుకే నేను చెయ్యవలసి వచ్చింది అని అనకండి. చేసేది నేర్పించే భావనతో కానీ చూసేది లోపాన్ని. కావున భావము మరియు భావన ఆత్మిక భావము మరియు శుభ భావన. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, వీరైతే చేస్తున్నారు కదా, నడుస్తుంది కదా, నేను చేస్తే ఏమవుతుంది... మీరు వెళ్ళాల్సినప్పుడు వీరు ఉండిపోతున్నారు, నేను కూడా ఉండిపోతాను అని అంటారా? కావున సీ ఫాదర్, మరియు భావము మరియు భావన రెండింటిలో పరివర్తన. 5 తత్వాల పట్ల మీరు శుభ భావన పెడ్తారు కానీ బ్రాహ్మణ పరివారంపై పెట్టలేరా? ఇదైతే జరుగుతూనే ఉంటుంది, వీరైతే చేస్తున్నారు కదా, ఈ మాటలను సమాప్తం చెయ్యండి. నేను మారి చూపించాలి. నేనూ మారుతాను, ఇతరులూ మారుతారు, తప్పక మారుతారు. ఈ నిశ్చయము మరియు శుభ భావనతో నడుచుకోండి, అప్పుడు చూడండి త్వరత్వరగా మీ రాజ్యం వచ్చేస్తుంది. మరి ఈ 18 జనవరినాటికి రెండు విషయాలను సదా ధారణ చేసుకోండి. కేవలం వ్రాసి పంపండి అని బాప్‌దాదా చెప్పడం లేదు, ప్రతిజ్ఞలు చేసే ఫైల్స్ బాప్‌దాదా వద్ద చాలా ఉన్నాయి వతనంలో. ప్రతిజ్ఞ కాదు, దృఢ సంకల్పం రూపంలో ఈ రెండు విషయాలను ధారణ చేసుకోండి. టీచర్లు సరేనా? చెయ్యాలి కదా? అచ్ఛా. మాతలు చేతులెత్తండి, చేస్తారా? చేయి పెద్దగా ఎత్తండి. పాండవులు చేతులెత్తండి. పాండవులు. పాండవులు కూడా ఎత్తుతున్నారు, బాగుంది. బాప్‌దాదా అయితే రోజూ చూస్తూ ఉంటారు. బాప్‌దాదాకు చూడడంలో సమయం పట్టదు. సరేనా. అచ్ఛా.
వచ్చిన టీచర్లందరూ, మురళి అయితే అందరి వద్దకు వెళ్తుంది. కేవలం వచ్చినవారికే కాదు, దేశ విదేశాల వారికి ఇరువురికీ, సర్వ పిల్లల కోసం. ఇప్పుడు మీ పని పెరిగేది ఉంది. సేవ చేసాము, భాషణ చేసాము, వర్గాన్ని నడిపిస్తున్నాము అని కాదు. సేవ ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మనసు ద్వారా ప్రకాశాన్ని ఇచ్చే సేవ చేయాలి. ఎలా అయితే ఆరంభంలో శివబాబా బ్రహ్మా బాబాలోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో కూర్చునే ప్రకాశాన్ని ఇచ్చారు. కొందరికి సాక్షాత్కారం జరిగింది, కొందరికి ఇక్కడకు వెళ్ళండి అని మాట వినిపించేది, విని నేను వెళ్ళవలసిందే అని ప్రేరణ వచ్చింది, పారిపోయి వచ్చారు కదా. ఆదిలో వచ్చినవారు ఎంతమంది పక్కా అయ్యారు. దాదీను గుర్తు చేస్తారు కదా, ఇతర దాదీలను కూడా గుర్తు చేస్తారు కదా, మరి ఆదిలో అయినది ఇప్పుడు అంతిమంలో రిపీట్ కానుంది. కావున తమ మనసా శక్తిని, మనసా సేవను పెంచండి. ఆ సమయంలో మీ భాషణ ఎవ్వరూ వినరు. ఎవ్వరూ కోర్సు తీసుకోరు, పరిస్థితులు కూడా గంభీరంగా ఉంటాయి. మనసా ప్రకాశాన్ని ఇచ్చే సేవను చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఇప్పుడు అభ్యాసం చెయ్యండి. కేవలం అమృతవేళ కాదు, కర్మ చేస్తూ కూడా మధ్య మధ్యలో మనసును అన్ని వైపుల నుండి కంట్రోల్ చేసి, ఏకాగ్రులై ప్రకాశాన్ని ఇవ్వగలనా లేక ఇవ్వలేనా, దీనిని ట్రయల్ వేయండి. చాలా అవసరముంది, ఆఖరకు దుఃఖహర్త, సుఖకర్త అయిన మీ చిత్రాలు కూడా తయారవుతాయి. మరి చైతన్యంలో అవ్వరా? అంతర్ముఖిగా అయి మధ్య మధ్యలో 5 నిమిషాలు కేటాయించండి. కేవలం అమృతవేళ కాదు, రాత్రి పగలు ఈ అభ్యాసాన్ని చేయండి. రాత్రి మెలకువ రాగానే ట్రయల్ వెయ్యండి. తర్వాత కావాలంటే మళ్ళీ వెళ్ళి పడుకోండి. కానీ కొద్ది సమయము ట్రయల్ వెయ్యండి అలాగే పని కోసం కూడా లేవాల్సి ఉంటుంది కదా. మరి ఈ అభ్యాసము కూడా చెయ్యండి. అప్పుడే మీ పూజ జరుగుతుంది. లేకపోతే మీ పూజ నామమాత్రంగానే జరుగుతుంది. పెద్ద పెద్ద మందిరాలు తయారు కావు, నామమాత్రపు మందిరాలు అవుతాయి. విన్నారా? అచ్ఛా.
ఇప్పుడు బాప్‌దాదా ఇచ్చిన సమాచారమైతే విన్నారు, ఈరోజు బాగా పరిశీలించారు. పరిశీలించడంలో బాప్‌దాదాకు సమయం పట్టదు. అచ్ఛా. ఇప్పుడే మీ మనసును ఏకాగ్రం చెయ్యగలరా? చెయ్యగలరా లేక సమయం అయిపోయింది, అలసిపోయాము, ఆకలి వేస్తుంది అని సంకల్పం చేస్తారా? లేదు. బాప్‌దాదాకు తెలుసు, బాబాపై స్నేహము పిల్లలకు చాలా ఉంది. ఈ స్నేహ సర్టిఫికేటును బాప్‌దాదా కూడా ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడకు వచ్చినవారందరూ ఏ విమానంలో వచ్చారు? ట్రైనులో వచ్చి ఉండవచ్చు లేక విమానంలో వచ్చి ఉండవచ్చు కానీ మీరు ఒక విచిత్ర విమానంలో వచ్చారు, తెలుసా, అది స్నేహ విమానము. స్నేహమనే విమానంలో వచ్చారు కదా. ట్రైను కావచ్చు మరేదైనా కావచ్చు కానీ బాబాపై ప్రేమ ఉంది కనుకనే ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు కేవలం ఏ సమయంలో కొద్దిగా వస్తుందో, మాయ ఆట వచ్చినప్పుడు ఆ సమయంలో బాబా స్నేహంలో మునిగిపోండి, మాయకు కనిపించకండి. బాప్‌దాదా ఆరంభంలో ట్రాన్స్ ద్వారా ఎన్నో దృశ్యాలను చూపించారు. అంతిమ సమయంలో ఎప్పుడైనా ఏదైనా అలజడి జరిగినప్పుడు అన్ని వృత్తులు బయటకు వస్తాయి, చెడు వృత్తులు కూడా మరియు ఆధారాన్ని ఇచ్చే వృత్తులు కూడా. బాప్‌దాదా ఆరంభంలో పిల్లలకు ఏమి చూపించారంటే చెడు దృష్టి కలిగినవారు కొంతమంది వెనుక వస్తారు కానీ వారికి ప్రకాశమే కనిపిస్తుంది. మనుష్యులు కనిపించరు, ప్రకాశమే కనిపిస్తుంది, ఫరిశ్తా రూపమే కనిపిస్తుంది. అలాగే మీ ఏకాగ్రత అభ్యాసంతో మీరు ఇలా ఎదురుగా కూర్చుని ఉన్నాకానీ వారికి కనిపించరు. ప్రకాశమే ప్రకాశము కనిపిస్తుంది. ఇలా ఉన్నారు కదా. కానీ అభ్యాసము ఇప్పటినుండే చెయ్యండి. ఫరిశ్తా. అచ్ఛా. ఇప్పుడు మూడు నిమిషాలు మనసు యొక్క ఏకాగ్రత అభ్యాసాన్ని చెయ్యండి. ఈ డ్రిల్ చెయ్యండి. అచ్ఛా.
సేవ టర్న్ భోపాల్ జోన్వారిది:- అచ్ఛా, భోపాల్వారు కూడా మంచి సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పుడు భోపాల్ ఏ నవీనతను ఆలోచించారు? ఏదైతే చేసి ఉన్నారో అదైతే అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ ఏ నవీనతను చేస్తారు? బాప్‌దాదా గత టర్నులో కూడా చెప్పి ఉన్నారు, ఇప్పుడైతే వి.ఐ.పీల సేవ అయితే చేసారు, అన్ని జోన్లు చేసాయి, అన్ని వర్గాలు చేసాయి, కానీ ఇప్పుడు సంబంధంలోకి వచ్చే వి.ఐ.పీలు ఎవరైతే మైక్‌గా అయి ఉన్నారో ఇతరులను తమ మాటతో పరివర్తన చెయ్యాలి, వారిని సమీపంలోకి తీసుకురండి. 6 నెలలలో, 12 నెలలలో ఒక్కసారి వచ్చినా లేక 4-5సార్లు వచ్చినా, భాషణ కూడా చేసారు, సంబంధ సంపర్కంలోకి కూడా వచ్చారు, కానీ ఎవరి మాటతో అయితే అనేకుల కళ్యాణం జరుగుతుందో అటువంటి మైకులను వారస క్వాలిటీలుగా చెయ్యండి. ప్రసిద్ధమైనవారుగా కూడా ఉండాలి. కానీ ఈరోజుల్లో లోకులు బాహ్యముఖులుగా ఉన్నారు కదా, కావున వారు బాహ్యపు ఆడంబరాన్ని చూడాలని ఆశిస్తారు. కావున ఎలాంటి ప్లాన్‌ను తయారు చెయ్యండంటే అది నిరంతరం జరుగుతూనే ఉండాలి మరియు ఇటువంటి వారస క్వాలిటీని తయారు చెయ్యండి ఎందుకంటే వర్గీకరణ ప్రారంభమై కూడా ఎన్ని సంవత్సరాలు అయ్యాయి! అయ్యాయి కదా! ఇప్పుడు వారిని ఎంత సమీపంగా తీసుకురండంటే వారస క్వాలిటీగా అయిపోవాలి. ఇప్పుడు వి.ఐ.పి లైనులో ఉన్నారు, సహయోగిగా ఉన్నారు, సేవ కూడా చేస్తున్నారు కానీ వారస క్వాలిటీ లేరు. మరి ఇప్పుడు ఎటువంటి సహయోగిగా కావాలంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ కార్యం చెయ్యవలసి అవసరం వస్తే, వారికున్న క్వాలిఫికేషన్లో హా జీ, హా జీ అనాలి. కనెక్షన్ మంచిగా జోడించారు, బాప్‌దాదా ఈ విషయంలో సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు వారు కూడా ఎవరెడీ సేవాధారిగా కావాలి. ఇటువంటి క్వాలిటీవారిని అన్ని వర్గాల వారు ప్రోగు చెయ్యండి. బాప్‌దాదా వద్దకు తీసుకురావాలి అని కాదు. ఏ స్థానంలో అయినా కానీ వారి సంగఠన ఏర్పాటు చెయ్యండి. ఎక్కడైనా చెయ్యండి, అందరికీ రాకపోకలకు వీలైన సహజ స్థానంలో చెయ్యండి, వారికి విశేషంగా ఏదో ఒక ప్రోగ్రామును పెట్టండి. ప్రోగ్రాము ఉంటే వెళ్తారు, కలుస్తారు, సహయోగము కూడా ఇస్తారు కానీ కొంచెం హోమ్లీగా (ఇంటివారిగా) అయి సమయానికి సహయోగిగా కావాలి. ఆరంభంలో భోపాల్వారు సేవను చేసారు, వి.ఐ.పిల కనెక్షన్‌ను పెట్టారు, ఇప్పుడు ఈ విధితో సేవను చేసి చూపించండి. బ్రాహ్మణులైతే అవుతున్నారు, ఇప్పుడు అన్ని క్లాసులలో బ్రాహ్మణుల సంఖ్య పెరుగుతుంది. ఇది మంచిది. క్లాసులు అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎటువంటి వ్యక్తి, సేవాధారి లభించాలంటే వారి మాట లేక పరిచయం వినగానే సేవ జరగాలి మరియు సమయానికి వారు రెడీ కావాలి. చేయగలరు, ఇప్పుడు చేసి చూపించండి. ఇంతమంది వి.ఐ.పిలు ఉన్నారు అని లిస్టు అయితే ఇస్తారు కానీ వారి సంగఠనను చేసినప్పుడే జరుగుతుంది. ఆ సంగఠన కూడా కనిపించాలి, ఒకరినొకరు చూసుకుని కూడా ఉల్లాసం వస్తుంది, వీరు కూడా వస్తున్నారు, వీరు కూడా వస్తున్నారు... అని ఉల్లాసం వస్తుంది. మరి ఇప్పుడు ఏ జోన్లు అయితే వస్తాయో, ఏ వర్గాలైతే వస్తాయో, ఇప్పుడు ముందు ముఖ్యమైన స్థానాలలో సంగఠన ఏర్పాటు చేయండి. కేవలం మధువనంలో కాదు, ఏ స్థానంలో అయినా సంగఠన చేసి వారిని స్నేహము మరియు సహయోగంలో మరింత ముందుకు నడపండి. టీచర్లు ఏమి చేస్తారు? టీచర్లు చేసి చూపిస్తారు కదా? ఏమి చెయ్యలేరు! ఒక్కొక్కరూ చిన్నవారు కానీ, పెద్దవారు కానీ ఒకవేళ దృఢ సంకల్పం ఉన్నట్లయితే చిన్నవారైనా అద్భుతం చేయగలరు. కేవలం చేయవలసిందే అన్న దృఢ సంకల్పం ఉండాలి. అభిమానంతో ముందుకు వెళ్ళకండి. స్వమానంతో ముందుకు వెళ్ళండి. బాప్‌దాదా ఏ పిల్లలను చూసినా, ఏ జోన్‌ను చూసినా వీరు కాబోయే దేవతలు అన్న దృష్టితోటే చూస్తారు. కొంతమంది క్రొత్త పిల్లలు లోపల లోపలే సేవలో ఎంతో అద్భుతాన్ని చేసి చూపిస్తున్నారు. బాప్‌దాదా వద్దకు సమాచారం రాకపోయినా కానీ బాప్‌దాదాకు తెలుసు. కనుక అద్భుతం చేసి చూపించండి. చేస్తారు కదా, చేస్తారా? బాగుంది. సంఖ్య అయితే పెరుగుతుంది. కానీ ఇప్పుడు క్వాలిటీ కావాలి. అచ్ఛా.
సేవ యొక్క బంగారు అవకాశమైతే అన్ని జోన్లకు లభిస్తుంది. బాబా కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషంతో అవకాశాన్ని తీసుకుంటున్నారు. బాగుంది, వృద్ధిని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు.
ఎడ్యుకేషన్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ (శిక్షణ మరియు ప్రశాసక వర్గం):- బాగుంది, ప్రభుత్వం కూడా జీవితాన్ని తయారు చేయడానికి ఎడ్యుకేషన్ అవసరం అని భావిస్తుంది. ఈరోజుల్లో మెజారిటీ ఎడ్యుకేషన్‌లో స్పిరిచువాలిటీ(ఆధ్యాత్మికత) అవసరము అని భావిస్తున్నారు. ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఆధ్యాత్మికంగా కావడము పెద్దలకు, వృద్ధులకే అని ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో ఆధ్యాత్మికత లేకపోతే పరివర్తన జరుగదు అని భావిస్తున్నారు. కాబట్టి ఎంతవరకు వీలైతే అంత ప్రతి పట్టణంలో చిన్న పెద్ద స్కూళ్ళు, కాలేజీలు లేక భిన్న భిన్న ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ట్రయల్ వేసి అక్కడ తమ పాత్రను చెయ్యండి. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను మార్చగలరు. ప్రతి స్థానంలోని స్కూళ్ళలో సేవ జరగాలి. స్కూలు కారణంగా టీచర్లు మరియు తల్లిదండ్రులు మీ కనెక్షన్‌లోకి వస్తారు. ఈరోజు పిల్లవాడు సమస్యగా ఉంటే ఆ పిల్లవాడి నడవడికలో టీచరు కానీ తల్లిదండ్రులు కానీ కొద్దిగా తేడా చూసినా కానీ ఇది మంచిది అని నమ్ముతారు. అయితే అక్కడక్కడా చేస్తున్నారు కానీ అన్ని వైపులా జరగాలి. ఎవరికైనా సహయోగము కావాలంటే, భాషణ చేసేవారు కానీ, ప్రోగ్రాము తయారు చేసేవారు కానీ, పరస్పరంలో సహాయాన్ని తీసుకోవచ్చు. మీరు డిపార్టుమెంటును చూడండి, ఎక్కడెక్కడ వీలవుతుంది, ఎక్కడ ఎవరైనా సహయోగము ఇవ్వగలరా, చేయించగలరా, కొంచెం వ్యాపింపజేయండి. అక్కడక్కడా వాప్తి చేస్తున్నారు కానీ నలువైపుల గ్రామాలలో కూడా వ్యాప్తి చెయ్యండి. కొన్ని కొన్ని గ్రామాలలో అయితే వ్యాప్తి చేస్తున్నారు. ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు ఎంతగానో చెయ్యవచ్చు. ప్రపంచం ప్రకారంగా కూడా పిల్లలు ఒకవేళ ఎక్యురేట్గా అయితే ప్రపంచానికి కూడా లాభము మరియు మీకు కూడా పుణ్యము జమ అవుతుంది. బాగుంది, చేస్తున్నారు, బాప్‌దాదా వింటారు కానీ నలువైపుల బ్రహ్మాకుమారీల ఆధ్యాత్మిక జ్ఞానము అవసరము అన్న మాట వ్యాపించాలి. ఈ మాటను వ్యాపింపజేసే గ్రూపును తయారు చెయ్యండి. ఏ వర్గాలైతే తయారై ఉన్నాయో అన్నీ వాటి వాటి రీతిలో అవసరమే. సందేశాన్ని వ్యాప్తి చెయ్యగలవు. ఎక్కడకు వెళ్ళినా, ఎడ్యుకేషన్‌లో వెళ్ళినా, డాక్టరీలో వెళ్ళినా, మినిస్టరీలో వెళ్ళినా, ఎక్కడకు వెళ్ళినా, ఏ వర్గంలోకి వెళ్ళినా కూడా ఈ వర్గంలో కూడా అవసరం ఉంది, ఈ వర్గంలో కూడా అవసరం ఉంది అన్న మాట వినిపించాలి. ఇప్పుడు కొంచెం కొంచెం ప్రారంభమయింది. మేనేజ్మెంట్ గురించి కూడా బ్రహ్మాకుమారీలు చేయించే మేనేజ్మెంట్ను ఎవ్వరూ చేయించలేరు అని భావిస్తున్నారు. ఇలా ప్రతి వర్గంవారు ప్రతి స్థానంలో ఈ మాటను వ్యాపింపజేయండి. ఎక్కడకు వెళ్ళినా కూడా బ్రహ్మాకుమారీల కార్యం మంచిగా ఉంది, అప్పుడే కదా మంచిగా అవుతాము అని వినిపించాలి. అచ్ఛా. ఇక ఏదైతే చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు. ఇకమీదట మరింత బాగా చేస్తూ ఉండండి, వ్యాపింపజేస్తూ ఉండండి. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులందరూ లేవండి. యూత్(యువకులు) కూడా లేవండి. మీ అందరి తరఫున డబల్ విదేశీయులకు అభినందనలు. మీరందరూ మధువనానికి అలంకారము. కావున మధువన అలంకారానికి అభినందనలు, అభినందనలు, అభినందనలు. ప్రతి టర్నులో ఎవరో ఒకరు హాజరు కావాలి అని మంచి సంకల్పాన్ని చేసారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఆరంభంలో ఏ దేశంలోనైనా ఏదైనా పెద్ద ప్రోగ్రాము జరిగితే స్టేజిపై వి.ఐ.పిగా విదేశీవారు ఉండేవారు, ఇప్పుడు స్పీకర్ వి.ఐ.పిలు రావడం లేదు, బ్రాహ్మణులు వస్తున్నారు, ఇది సంతోషించాల్సిన విషయము. మన ఇంటి అలంకారం వస్తున్నారు అని. విదేశీయులు దేశంలో సేవ చెయ్యాలి అన్న ప్రోగ్రామును తయారు చేసారని బాప్‌దాదా విన్నారు, చేసారు కదా. వీరు ఎదురుగా ఉన్నారు కదా, (నిజార్ అన్నయ్య) ప్లాన్ చేసారు కదా? మంచిగా చేసారు కానీ ఆరంభంలో బాప్‌దాదా అనేవారు విదేశీయులు భారతదేశంలోని కుంభకర్ణులను మేల్కొల్పుతారు అని. ఇప్పుడు ఏ పెద్ద ప్రోగ్రాములైతే అవుతాయో అందులో స్పీకర్ కూడా వచ్చేలా ప్రయత్నించండి. వి.ఐ.పి. మంచి ప్లానును చేసారు. మన బ్రాహ్మణులైతే వస్తారు కానీ వి.ఐ.పి.లు వచ్చి వారికి ఏమి లభించింది అని తమ అనుభవాన్ని వినిపించాలి. ఇది కూడా జరిగిపోతుంది. ఇప్పుడు కనెక్షన్లో అయితే చాలామంది ఉన్నారు.
డబల్ పురుషార్థీలు కదా. మేము డబల్ పురుషార్థీలము అని భావించేవారు చేతులెత్తండి. డబల్ పురుషార్థీలు. డబల్! డబల్ పురుషార్థీలు? మెజారిటీమంది చేతులెత్తుతున్నారు. కొంతమంది ఎత్తడంలేదు. దీనిని ఢీలా చేయకండి. ఇప్పుడు డబల్ పురుషార్థీలు అన్న టైటిల్ లభించింది కదా. తర్వాత మీకు ఫరిశ్తా పురుషార్థీ అన్న టైటిల్ లభిస్తుంది ఎందుకంటే ఎలా అయితే ఎగురుకుంటూ ఇక్కడకు వస్తారో అలాగే స్థితిలో కూడా ఫరిశ్తా అనగా ఎగిరే కళవారు. ఎక్కే కళ, నడిచే కళ కాదు, ఎగిరే కళ. అటెన్షన్ ఉంది, సేవ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి గ్రూపును తయారు చెయ్యండి అంటే సదా ఏకరసంగా, ఏకాగ్రంగా ఉండాలి. అప్పుడప్పుడూ అన్న మాట రాకూడదు. సదా అన్న మాట ఉండాలి, అటువంటి గ్రూపును తయారు చేసుకోండి. సదా అన్న మాట ఎంత పక్కాగా ఉండాలంటే అప్పుడప్పుడు అన్న పురుషార్థం ఏమిటి అని అనిపించాలి. నడుస్తూ తిరుగుతూ సదా అన్న మాట ప్రాక్టికల్‌గా జరగాలి ప్రతి సబ్జెక్టులో. ఇటువంటి గ్రూపును విదేశంలోనూ, దేశంలోనూ తయారు చేయండి. రేస్ చేయండి. చిన్న గ్రూపు అయినా, పెద్ద గ్రూపు అయినా ఎక్కడైనా ఇటువంటి గ్రూపును తయారుచేసి చూపించండి. చేస్తారు కదా! డబల్ పురుషార్థీల అలవాటు - ఏదైతే ఆలోచిస్తారో అది చేసి చూపిస్తారు. మరి ఇది చేసి చూపించండి. ధైర్యముందా? ధైర్యముందా? టీచర్లు చెప్పండి. జనక్(జానకి దాదీ) చెప్పండి. ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆలోచించండి. ఆలోచించండి, ట్రయల్ వెయ్యండి. సదా నో ప్రాబ్లమ్ అని వినిపించాలి. అచ్ఛా.
నలువైపుల ఉన్న పిల్లలు భిన్న భిన్న విధాలుగా పంపిన ప్రియస్మృతులు బాప్‌దాదా వద్దకు తప్పకుండా చేరుకుంటాయి. బాప్‌దాదా కూడా ఆ పిల్లలను హృదయంలో ఇముడ్చుకుంటూ సమీపంగా ఇమర్జ్ చేసుకుంటున్నారు. ఈరోజుల్లో కొంతమంది పిల్లలు తమ గత జన్మల లెక్కాచారాలను సమాప్తం చేసుకోవడంలో ఉన్నారు. వారి ప్రియస్మృతులు కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి. ఎలా అయితే అంకుల్, (అంకుల్ స్టీవ్నారాయణ్) మొదటి వి.ఐ.పి నిమిత్తమయ్యారు కదా. మరి బాప్‌దాదా మరియు సర్వ పరివారము యొక్క ప్రకాశము తప్పకుండా పిల్లల వరకు చేరుకుంటాయి. అందరూ హృదయపూర్వక స్మృతులను అందిస్తున్నారు. ఇలాగే కొంతమంది పిల్లలు బాబా, బాబా అంటూ తమ లెక్కాచారాలను సమాప్తం కూడా చేసుకున్నారు మరియు ప్రకాశాన్ని తీసుకుని నడుస్తున్నారు. దేశంలో కానీ విదేశంలో కానీ ఎవరైతే శరీర లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటున్నారో, ఆ విశేష పిల్లలందరికీ బాప్‌దాదా ప్రియ ఆశీర్వాదాలు సదా లభించాయి మరియు లభిస్తూనే ఉంటాయి. దీనితోపాటు నలువైపుల నుండి ఉత్తరాలు, ఈరోజుల్లో ఉత్తరాలకన్నా వేగవంతమైన సాధనాలు వచ్చాయి. ఎవరెవరైతే స్మృతిని పంపారో ఆ పిల్లలందరికీ పేరు మరియు విశేషతల సహితంగా బాప్‌దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. వీరితోపాటు బంధనం ఉన్న గోపికల హృదయం నుండి ఎంతో ధ్వని వినిపిస్తుంది. కానీ బంధనంలో ఉంటూ మనసుతో బంధనముక్తులుగా ఉండే లవ్లీ పిల్లలకు బాప్‌దాదా స్మృతిని ఇస్తున్నారు. తమ సంపాదనను గుప్తంగా కఠినమైన బంధనంలో కూడా చేసుకుంటున్నారు. వారు నిదురిస్తూ ఉంటారు, వీరు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ బంధనంవారి చరిత్ర విచిత్రంగా ఉంటుంది. నలువైపుల ఉన్న బంధన గోపికలకు కూడా బాప్‌దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. వారికి విశేష సమయం ఉంటుంది మరియు బాప్‌దాదా వీరికి ఆ సమయంలోనే కిరణాలను ఇస్తారు. అచ్ఛా.
నలువైపుల ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కలిగిన పిల్లలు, ఆలోచించడము మరియు చేయడము, చేస్తాము, చూస్తాము కాదు, ఆలోచించడము మరియు చేయడము, సదా స్వయంలో నష్టోమోహలో, కేవలం సంబంధపు మోహము కాదు, తమ దేహ భానము మరియు దేహ అభిమానపు మోహము కూడా ఉండకూడదు. ఇటువంటి నష్టోమోహ ఎవరెడీ పిల్లలకు, సదా శ్రీమతం అనే చేతిలో చేయి వేసి, కలిసి ఎగిరేవారు మరియు బ్రహ్మాబాబాతో పాటు తమ రాజ్యంలోకి వచ్చే తీవ్ర పురుషార్థీ ఎగిరే కళలో ఉండే పిల్లలకు బాప్‌దాదా అందించే చాలా-చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులను స్వీకరించండి మరియు బాలకులు సో మాలికులైన పిల్లలకు నమస్తే.
దాదీలతో:- (దాదీ జానకి మరియు మోహిని అక్కయ్య బాప్‌దాదాను కౌగలించుకున్నారు) నిమిత్తంగా వీరిద్దరూ అయ్యారు, కానీ అందరినీ దగ్గరకు తీసుకున్నాము.
శాంతమణి దాదీతో:- బాగుంది, మంచంపై ఉన్నాకానీ అందరి హృదయంలో గుర్తున్నారు ఎందుకంటే ఆదిరత్నము కదా. ఆదిరత్నము, అమూల్య రత్నము, రత్నాలు కొద్దిమందే ఉన్నారు. అందరికీ దాదీలు చాలా గుర్తున్నారు కదా.
గ్రామ వికాస ప్రభాగము వైపు నుండి గుజరాత్లో 18 డిసెంబరు నుండి 29 డిసెంబరు 2008 వరకు ‘‘శాశ్వత యోగిక పొలముల జాగృతి కార్యము’’ మొదలవుతుంది, దీని ఆరంభ కార్యక్రమము నిన్న నది వద్ద జరిగింది. ఆ సమాచారాన్ని బాప్‌దాదా వద్దకు పంపించడం జరిగింది:-
గ్రామ సేవ చేసేవారు చాలా మంచి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపిస్తున్నారని బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు. పొలాలలో వేసే రకరకాల ఎరువులను వేయకుండా యోగబలంతో ఎరువులు లేకుండా ఫలాలు, పూలు, ధాన్యాన్ని పండిస్తున్నారు. అవి అనారోగ్యాన్ని తీసుకురావు. అనారోగ్యానికి కారణమైన కీటకాలు యోగబలంతో సమాప్తమైపోతాయి. మరి ఈ ప్రాక్టికల్ ఋజువును అనేక స్థానాలలో చూపించారు మరియు నిమిత్తమైన వి.ఐ.పిలు కూడా యోగబలంతో ప్రయత్నిస్తే ఇది వృద్ధి జరుగుతుంది అని విశ్వసిస్తున్నారు. కావున ఇది చాలా మంచి ప్రత్యక్ష ఋజువు. ఈ ప్రత్యక్ష ఋజువును చూసి అందరూ ఒప్పుకోవడానికి తయారవుతున్నారు. ఇది కూడా బ్రాహ్మణ పరివారము మంచి ఋజువును చూపించే సేవ. కొన్ని స్థానాలలో చేసారు కదా. వారు వచ్చి ఉన్నారు. గ్రామ సేవ వారు ఎక్కడున్నారు? గ్రామ వికాసంవారు లేవండి.
ఇక్కడ ఆబూలో కూడా ఇటువంటి పంటను తయారు చేస్తున్నారు. మరి పొలం నుండి ఏమి వచ్చింది? ఇప్పుడు ఏమి తయారు చేసారు? (ఇప్పుడు బొప్పాయి వచ్చింది, శనగలు మరియు బఠానీ తయారవుతున్నాయి) మంచిది కదా. తమ సంపాదన కూడా జరుగుతుంది, యోగము చేసారు. మరి ఇందులో మీ లాభము కూడా ఉంది మరియు అందరికీ కూడా లాభము ఉంది. మంచి విషయము. ప్రాక్టికల్‌గా ఎప్పుడైనా క్లాసులో చూపించండి. ఏవైతే వచ్చాయో (బొప్పాయి లేక శనగలు) అవి అందరికీ చూపించండి. బాగుంది, ఒకవేళ ఇదే విధంగా సందేశం వ్యాపిస్తూ ఉంటే పిలవకుండానే అందరూ వచ్చేస్తారు. ఆహ్వానాన్ని ముద్రించాల్సిన అవసరం లేదు. అభినందనలు, చాలా మంచి సేవ. అచ్ఛా!
ఓంశాంతి