"తమ శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉంటూ అసంభవమును సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి"
30-11-2019 ఓం శాంతి “దినచర్య” మధువనం
ప్రాణప్రదమైన అవ్యక్తమూర్తి తల్లిదండ్రి అయిన బాప్‌దాదాకు అతి స్నేహులు, సదా తమ అవ్యక్త స్థితి ద్వారా అవ్యక్త మిలనంతో అనుభూతులు చేసుకునేవారు, తమ ఉన్నతమైన శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉంటూ అసంభవాన్ని కూడా సంభవం చేసే నిశ్చింతులు, చింతలేని చక్రవర్తులు, నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సోదరసోదరీమణులు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతిని స్వీకరించండి.
తర్వాత సమాచారము - మీరంతా మీ మీ స్థానాల నుండి సూక్ష్మ స్నేహపు బంధాల ద్వారా మధుబన వరదాన భూమికి చేరుకుని అలౌకిక అవ్యక్త మిలనపు అనుభూతులను చేసుకుని ఉండవచ్చు. వర్తమాన సమయమైతే సైన్స్ సాధనాల ద్వారా కూడా ఎంతో చక్కని భావన ప్రతి ఒక్కరికీ లభిస్తుంది. బాబా అయితే మనందరికీ సైలెన్స్ అనే అతి పెద్ద శక్తితో పాటు దివ్య బుద్ధి అనే విమానాన్ని కూడా ఇచ్చారు, ఈ విమానం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు మూడు లోకాల షికారు చేసి రావచ్చు.
ఈసారి మధుబన ఇంటి శోభ ఎంతో అతీతంగా, అద్భుతంగా మరియు ప్రియంగా ఉంది. కర్ణాటక వారి సేవ టర్న్. ఎంతో కాలం నుండి మనకు స్నేహ సంబంధంలో ఉన్న కొంతమంది సాధువులు, మహాత్ములు కూడా ఈసారి వచ్చారు. అందరూ ఎంతో మంచి అనుభవాలు చేసుకుంటున్నారు. డబల్ విదేశీ సోదరసోదరీలైతే ప్రతి టర్నులో తమ బంగారు అవకాశాన్ని తీసుకుంటున్నారు. దాదీ జానకిగారి అలౌకిక పాలన, వారి స్నేహం నిండిన దృష్టి ప్రతిరోజూ సాయంకాలం క్లాసులో అందరికీ లభిస్తుంది. ఈసారి మన పెద్దన్నయ్యలు నిర్వైర్ అన్నయ్య, బృజ్‌మోహన్ అన్నయ్య, కరుణ అన్నయ్య, అమీర్‌చంద్ అన్నయ్యల సన్మాన సమారోహాన్ని కర్ణాటక వారు 29 నవంబరు నాడు డైమండ్ హాల్లో ఎంతో గొప్పగా చేసారు. షుమారు 17-18వేల మంది సోదరసోదరీల సంగఠన మధుబనంలో చాలా అలౌకిక అనుభూతిని కలిగించింది. మధురమైన ప్రియమైన బాప్‌దాదా అద్భుతమే చేసారు, తమ ఆకారి, నిరాకారి స్వరూపం ద్వారా పిల్లలందరినీ సంపన్నం చేసారు. వీడియో ద్వారా అవ్యక్త మహావాక్యాలను వింటూ కూడా ప్రతి ఒక్కరికీ మేము బాబా సమక్షంలో కూర్చుని బాప్‌దాదా నుండి దృష్టి తీసుకుంటూ మిలనం జరుపుకుంటున్నామని అనిపించింది. మీరందరూ కూడా మీ మీ టర్న్ అనుసారంగా ఈ దివ్య దృశ్యాలను సమ్ముఖంలో అనుభవం చేసుకుంటారు. అచ్ఛా - అందరికీ స్మృతి... ఓం శాంతి.
30-11-19 ఓం శాంతి రివైజ్ వీడియో 31-10-07 మధువనం
తమ శ్రేష్ఠ స్వమానపు నషాలో ఉంటూ అసంభవమును సంభవము చేస్తూ నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి
ఈరోజు బాప్‌దాదా నలువైపుల ఉన్న తమ శ్రేష్ఠ స్వమానధారీ విశేష పిల్లలను చూస్తున్నారు. పిల్లలైన ప్రతి ఒక్కరి స్వమానము ఎంత విశేషమైనదంటే అటువంటి విశేషత విశ్వములోని ఏ ఆత్మకూ లేదు. మీరందరూ విశ్వ ఆత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా. మొత్తము సృష్టిరూపీ వృక్ష పునాదికి మీరు ఆధారమూర్తులు. విశ్వమంతటికీ పూర్వజులు, మొదటి రచన. చిన్న పిల్లవాడైనా, వృద్ధ మాత అయినా, ప్రవృత్తి వారు అయినా కానీ బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరికి వారి వారి విశేషతలు ఉన్నాయి. ఈరోజుల్లో ఎంత పెద్ద సైన్స్ వారు అయినా, ప్రపంచపు లెక్కలో విశేషమైన వారైనా కానీ ప్రకృతీజీత్లుగా అయితే అయ్యారు, చంద్రుని వరకు కూడా చేరుకున్నారు కానీ ఇంత చిన్నని జ్యోతి స్వరూప ఆత్మను గురించి తెలుసుకోలేకపోయారు. మరి ఇక్కడైతే చిన్న పిల్లవాడు కూడా నేను ఆత్మను, జ్యోతి బిందువును అని తెలుసుకుంటాడు. “నేను ఆత్మను” అని నషాతో అంటాడు. ఎంత పెద్ద మహాత్మలైనా మరియు బ్రాహ్మణ మాతలు, మాతలు మేము పరమాత్ముని పొందామని గర్వముతో అంటారు. పొందారు. కదా! మరి మహాత్మలు ఏమంటారు? పరమాత్ముని పొందటము చాలా కష్టమని అంటారు. మేము ప్రవృత్తిలో ఉంటూ, కలసి ఉంటూ పవిత్రంగా ఉంటాము ఎందుకంటే మా మధ్య తండ్రి ఉన్నారు అని ప్రవృత్తిలో ఉన్నవారు ఛాలెంజ్ చేస్తారు. కావుననే ఇద్దరూ కలసి ఉంటూ కూడా పవిత్రంగా ఉండగలుగుతున్నారు ఎందుకంటే పవిత్రత మన స్వధర్మము. పర ధర్మము కష్టమనిపిస్తుంది, స్వ ధర్మము సహజమవుతుంది. లోకులు ఏమంటారు? నిప్పు మరియు దూది కలసి ఉండలేవు అని అంటారు. చాలా కష్టమైనది, కానీ మీరందరూ ఏమంటారు? చాలా సహజము. మొదట్లో మీ అందరిది ఒక గీతము ఉండేది - ఎంత పెద్ద ధనవంతులైనాగానీ, యజమానులైనాగానీ ఒక్క అల్ఫను తెలుసుకోలేదు. చిన్ని బిందువైన ఆత్మను గురించి తెలుసుకోలేదు కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందారు. అసంభవము సంభవమైందని ఎంతో నిశ్చయము మరియు గర్వముతో అంటారు. బాప్‌దాదా కూడా విజయీ రత్నాలైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి సంతోషిస్తారు ఎందుకంటే ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది. కనుకనే ప్రపంచము వారికి అసంభవమైన విషయము మీకు సహజము మరియు సంభవమైపోయింది. మేము పరమాత్మునికి డైరెక్ట్ పిల్లలము అని ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉంటుంది. ఈ నషా కారణంగా, నిశ్చయము కారణంగా, పరమాత్ముని పిల్లలైన కారణంగా మాయనుంచి కూడా రక్షింపబడ్డారు. పిల్లలుగా కావటము అనగా సహజంగానే రక్షింపబడటము. కావున మీరు పిల్లలుగా అయ్యారు, అంతేగాక అన్ని విఘ్నాలనుంచి, సమస్యలనుంచి రక్షింపబడ్డారు.
మరి మీ ఇంతటి శ్రేష్ఠ స్వమానమును తెలుసుకున్నారు కదా! ఎందుకని సహజము? ఎందుకంటే మీరు సైలెన్స్ శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యములో వినియోగిస్తారు. నెగెటివ్‌ను పాజిటివ్‌కి పరివర్తన చేసేస్తారు. మాయ ఎంత పెద్ద సమస్యరూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తన శక్తి ద్వారా, సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపముగా చేసేస్తారు. కారణమును నివారణ రూపంలోకి మార్చేస్తారు. ఇంత శక్తి ఉంది కదా, కోర్స్ కూడా చేయిస్తారు కదా! నెగటివ్‌ను పాజిటివ్‌గా చేసే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తన శక్తి తండ్రి ద్వారా వారసత్వముగా లభించింది. ఒక్క శక్తి కాదు, సర్వ శక్తులూ పరమాత్మ వారసత్వంగా లభించాయి, అందుకనే బాప్‌దాదా ప్రతిరోజూ చెప్తారు, ప్రతిరోజూ మురళిని వింటారు కదా! మరి ప్రతిరోజూ బాప్‌దాదా ఇదే అంటారు - తండ్రిని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. తండ్రి స్మృతి కూడా ఎందుకని సహజంగానే వస్తుంది? వారసత్వపు ప్రాప్తిని గుర్తు చేసుకున్నప్పుడు ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి సహజంగా వచ్చేస్తుంది. పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఈ ఆత్మిక ఫఖుర్ ఉంటుంది, మనస్సులో పాటను పాడుతారు - పొందాల్సింది పొందేసాము. ప్రతి ఒక్కరి హృదయములో ఈ పాట స్వతహాగనే మ్రోగుతుంది కదా! ఫఖుర్ ఉంది కదా! ఎంతగా ఈ ఫఖుర్లో ఉంటారో, ఫఖుర్కు గుర్తు – బేఫికర్‌గా (నిశ్చింతగా ఉండటము). ఒకవేళ సంకల్పములోగానీ, మాటలోగానీ లేక సంబంధ-సంపర్కములోగానీ ఏవిధమైనటువంటి ఫికర్ (చింత) ఉన్నా ఫఖుర్ (శుద్ధమైన గర్వము) ఉండదు. బాప్‌దాదా అయితే నిశ్చింత చక్రవర్తులుగా చేసారు. చెప్పండి, నిశ్చింత చక్రవర్తులేనా? ఎవరైతే నిశ్చింత చక్రవర్తులో వారు చేతులెత్తండి. నిశ్చింతులకు అప్పుడప్పుడు చింత వస్తుందా? మంచిది. తండ్రి నిశ్చింతులైనప్పుడు, పిల్లలకు ఏ చింత ఉంటుంది.
అన్ని చింతలు మరియు అన్ని భారాలను బాప్‌దాదాకు ఇచ్చెయ్యమని బాప్‌దాదా అయితే చెప్పి ఉన్నారు. తండ్రి సాగరుడు కదా! కాబట్టి భారము అంతా ఇమిడిపోతుంది. బాప్‌దాదా అప్పుడప్పుడు పిల్లల ఒక గీతాన్ని విని నవ్వుకుంటారు. ఏ పాటనో తెలుసా? ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి..... అప్పుడప్పుడు అయితే పాడుతుంటారు కదా. బాప్‌దాదా వింటూ ఉంటారు. కానీ బాప్‌దాదా పిల్లలందరికీ ఇదే చెప్తారు - ఓ నా మధురమైన పిల్లలూ, ముద్దు బిడ్డలూ - సాక్షీ దృష్టి స్థితి అనే సీట్‌పై సెట్ అవ్వండి మరియు సీట్‌పై సెట్ అయ్యి ఆటను చూడండి, చాలా మజా వస్తుంది, వాహ్! త్రికాలదర్శి స్థితిలో స్థితి అవ్వండి. సీటునుంచి క్రిందకు వస్తారు కనుకనే అప్సెట్ అవుతారు. సెట్ అయినట్లయితే అప్సెట్ కారు. ఏ మూడు విషయాలు పిల్లలను వ్యాకులపరుస్తాయి? 1. చంచలమైన మనస్సు, 2. భ్రమించే బుద్ధి మరియు 3. పాత సంస్కారాలు. పిల్లల ఒక విషయాన్ని వింటుంటే బాప్‌దాదాకు నవ్వు వస్తుంటుంది. అది ఏ విషయమో తెలుసా? ఏం చెయ్యాలి బాబా, ఇది నా పాత సంస్కారం కదా అని పిల్లలు అంటుంటారు! బాప్‌దాదా నవ్వుతారు. నా సంస్కారము అని అంటున్నారంటే, మరి నాదిగా చేసుకున్నారా? మరి నాది అనేదానిపై అధికారం ఉండనే ఉంటుంది. ఎప్పుడైతే పాత సంస్కారాన్ని నాదిగా చేసుకున్నారో, మరి నాది అన్నది చోటు చేసుకుంది కదా. నా సంస్కారము అని బ్రాహ్మణ ఆత్మ అనగలదా? నాది నాది అని అన్నట్లయితే నాది అనేది తన చోటును ఏర్పరుచుకుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని అనజాలరు. ఇది గత జీవితపు సంస్కారము. శూద్ర జీవిత సంస్కారము. బ్రాహ్మణ జీవితముది కాదు. కావున నాది నాది అన్నట్లయితే అది కూడా నా అధికారము అని కూర్చుంటుంది. బ్రాహ్మణ జీవితపు శ్రేష్ఠ సంస్కారము గురించి తెలుసుకదా! మీరు దేనినైతే పాతది అని అంటున్నారో ఆ సంస్కారము కూడా పాతది కాదు, శ్రేష్ఠ ఆత్మలైన మీ అతి పాతదైన సంస్కారము అనాది మరియు ఆది సంస్కారము. ఇదైతే మధ్యలోని ద్వాపరములోని సంస్కారము. కావున మధ్యలోని సంస్కారమును సమాప్తము చేసెయ్యాలి, తండ్రి సహాయము కారణంగా ఎటువంటి కష్టమూ ఉండదు. కానీ ఏం జరుగుతుంది? బాబా సదా మీతో కంబైండ్‌గా ఉన్నారు, కంబైండ్ అన్నదానికి అర్ధమే అవసరమైన సమయంలో సహయోగి అని కానీ సరైన సమయంలో సహయోగము తీసుకోని కారణంగా మధ్యలో వచ్చిన సంస్కారము పెద్దదిగా అయిపోతుంది.
బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - అందరూ పూజ్యనీయ ఆత్మలు కనుక పూజ్యనీయ ఆత్మల విశేషమైన లక్షణము ఆశీర్వాదములను ఇవ్వటమే. మీరందరూ పూజ్యనీయ ఆత్మలని మీకందరికీ తెలుసు, కావున ఆశీర్వాదములను ఇవ్వటము, ఆశీర్వాదములను ఇవ్వటము అనగా ఆశీర్వాదములను తీసుకోవటమని అర్ధమైపోతుంది. ఎవరైతే ఆశీర్వాదములను ఇస్తారో, ఎవరికైతే ఇస్తారో వారి మనసునుంచి పదే పదే ఇచ్చేవారి కొరకు ఆశీర్వాదము వెలువడుతూ ఉంటుంది. కావున ఓ పూజ్య ఆత్మల్లారా, మీ నిజ సంస్కారము - ఆశీర్వాదములను ఇవ్వటము. ఆశీర్వాదములను ఇవ్వటము అనాది సంస్కారము. మీ జడమైన చిత్రాలే ఆశీర్వాదములను ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలు ఆశీర్వాదములను ఇవ్వటము, ఇదైతే సహజ సంస్కారము. ఇటువంటి సంస్కారమును నా సంస్కారము అని అనండి. మధ్యలో ద్వారపములోని సంస్కారము సహజమైపోయింది, నేచర్ అయిపోయింది. వాస్తవానికి ఆశీర్వాదములను ఇచ్చే ఈ సంస్కారమే నేచురల్ నేచర్. ఎవరికైనా ఆశీర్వాదములను ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎంతగా సంతోషిస్తుంది, ఆ సంతోషపు వాయుమండలము ఎంత సుఖదాయిగా ఉంటుంది! కావున ఎవరైతే చేసారో, వారందరికీ, వారు ఇక్కడకు వచ్చినా, రాకపోయినా కానీ, వారందరూ బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. మరి వారందరికీ బాప్‌దాదా అభినందనలను ఇస్తున్నారు. చేసి ఉంటే దానిని తమ నేచురల్ నేచర్ తయారుచేసుకుంటూ ఉండండి, ఇక ముందు కూడా చేస్తూ, చేయిస్తూ ఉండండి. ఎవరైతే కొద్దిగా చేసినా కూడా, చెయ్యకపోయినా వారు సదా తమను - నేను పూజ్య ఆత్మను, నేను తండ్రి శ్రీమతంపై నడిచే విశేష ఆత్మను అని భావించండి, ఈ స్మృతిని పదేపదే తమ స్మృతి మరియు స్వరూపములోకి తీసుకురండి ఎందుకంటే ప్రతి ఒక్కరినీ మీరు ఏమవుతారు అని అడిగినప్పుడు నేను లక్ష్మీ నారాయణునిగా అవుతాము అని అంటారు. సీతారాములని ఎవ్వరూ చేతులెత్తరు. 16 కళలు కలిగినవారిగా అవ్వాలనే లక్ష్యమున్నప్పుడు, 16 కళలు అనగా పరమ పూజ్యులు, పూజ్య ఆత్మల కర్తవ్యమే ఆశీర్వాదములను ఇవ్వటము. ఈ సంస్కారాన్ని నడుస్తూ, తిరుగుతూ సహజంగా మరియు సదాకాలము కొరకు తయారుచేసుకోండి. ఉన్నదే పూజ్యులుగా, 16 కళలవారిగా. లక్ష్యమైతే ఇదే కదా!
మరి సంకల్పము చెయ్యండి, తండ్రి ప్రేమలో, ఎంత పెద్ద తుఫానును మాయ ఎదురుగా తీసుకువచ్చినా కానీ మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మల ముందు తుఫాను కూడా తోఫాగా (కానుక) అయిపోతుంది. ఈ వరదానమును సదా గుర్తుంచుకోండి. ఎంత పెద్ద పర్వతమైనా కానీ, పర్వతము మారిపోయి దూదిలా అయిపోతుంది. ఇప్పుడు సమయ సమీపత ప్రమాణంగా వరదానాలను ప్రతి సమయము అనుభవములోకి తీసుకురండి. అనుభవము యొక్క అథారిటీలుగా అవ్వండి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరులుగా అయ్యే, ఫరిశ్తా స్వరూపులుగా అయ్యే ఎక్సరైసైజ్ను చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిశ్తాలు, ఇప్పుడిప్పుడే అశరీరులు, నడుస్తూ తిరుగుతూ, కార్యవ్యవహారములు చేసుకుంటూ కూడా ఒక్క నిమిషము, రెండు నిమిషాలను కేటాయిస్తూ అభ్యాసము చెయ్యండి. ఏ సంకల్పమునైతే చేస్తున్నానో ఆ స్వరూపమును అనుభవము చేసుకుంటున్నానా అని పరిశీలించుకోండి. అచ్ఛా!
నలువైపుల ఉన్న సదా శ్రేష్ఠ స్వమానధారులు, సదా స్వయమును పరమపూజ్య మరియు పూర్వజులుగా అనుభవము చేసేవారు, సదా తమను ప్రతి సబ్జెక్ట్‌లో అనుభవీ స్వరూపులుగా తయారుచేసుకునేవారు, సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు, భృకుటీ సింహాసనాధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితి అయ్యేవారు, నలువైపుల గల పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే.
అన్నివైపులనుంచి అందరి ఉత్తరాలు, ఈ-మెయిల్స్, సమాచారములన్నీ బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి, సేవ యొక్క ఫలము మరియు బలము సేవాధారులందరికీ లభించింది మరియు లభిస్తూ ఉంటుంది. ప్రేమ ఉత్తరాలు కూడా చాలా వస్తాయి, పరివర్తన ఉత్తరాలు కూడా చాలా వస్తాయి. పరివర్తన శక్తి కలిగినవారికి బాప్‌దాదా అమరభవ వరదానమును ఇస్తున్నారు. సేవాధారులు ఎవరైతే శ్రీమతాన్ని బాగా ఫాలో చేసారో, అలా ఫాలో చేసే పిల్లలకు బాప్‌దాదా “సదా ఆజ్ఞాకారి పిల్లలు, వాహ్!” అనే వరదానమును ఇస్తున్నారు మరియు ప్రేమ కలిగిన పిల్లలకు చాలా చాలా ప్రేమతో హృదయములో ఇమిడిపోయే అతి ప్రియమైనవారు మరియు మాయ విఘ్నాలనుంచి అతి అతీతంగా ఉండేవారు, ఇటువంటి వరదానమును ఇస్తున్నారు. అచ్ఛా!
సేవ టర్న్ కర్ణాటక జోన్ వారిది:- మంచిది, ఎవరైతే సేవ అవకాశాన్ని తీసుకున్నారో వారు కూడా సంతుష్టులయ్యారు మరియు ఇతరులనూ సంతుష్టంగా చేసారు, దీనివలన తమ జమ ఖాతాను చాలా మంచిగా జమ చేసుకున్నారు. కర్ణాటక వారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు, సంఖ్య ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఏవిధంగా అయితే అందరూ సంగఠిత రూపంలో కలిసి నిర్విఘ్న సేవ యొక్క రికార్డ్‌ను చూపించారో, అలాగే ఇకముందు కూడా కర్ణాటక సంగఠిత రూపంలో చాలా ఆద్భుతాన్ని చెయ్యగలదు. బాప్‌దాదా వద్ద మ్యాప్ ఉంది, అద్భుతాన్ని చెయ్యగలరు. కావున సంగఠిత రూపములోని సత్తాను చూపించాలి. ఇప్పుడు బాగా చేసారు. పరివారమంతా కర్ణాటకను చూసి సంతోషిస్తుంది. అచ్ఛా - బాప్‌దాదా కర్ణాటక వారికి పని ఇచ్చారు, గుర్తుందా. ఏ పని ఇచ్చారు! వారిస్ క్వాలిటీ వారిని వెలికితీసే పని, గుర్తుందా? సేవలో అయితే నంబర్‌ను తీసుకున్నారు మంచిది, నంబర్‌వన్‌లోకి వచ్చేంతగా వారసులను వెలికితీయండి. అచ్ఛా
డబల్ విదేశీయులు:- విదేశాలలో కూడా సేవ యొక్క ఉల్లాస - ఉత్సాహాలు ఎక్కువవుతూ ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. విదేశాలలో స్టూడెంట్ను తయారుచేయటం చాలా కష్టమని మొదట అనేవారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కష్టమా లేక సహజమా? సహజమా?
ప్రతి సంవత్సరమూ వృద్ధిని చేస్తూ బాబా ముందుకు తీసుకురావటాన్ని బాప్‌దాదా అయితే చూసారు, ఇలా ఇకముందు కూడా చాలా బాగా వృద్ధి చేస్తూ ఉంటారు. తండ్రి మరియు తమ ప్రత్యక్షతను చేస్తూ ఉంటారు. మంచి గ్రూప్. అందరూ నిశ్చయ బుద్ధి మరియు ఈశ్వరీయ నషాలో ఉండేవారు, ఎగిరేవారు. నడిచేవారుగా అవ్వవద్దు, ఎగిరేవారు. నడిచేవారు సమయానికి చేరుకోలేరు, ఎగిరేవారుగా అవ్వండి. డబల్ లైట్. బాప్‌దాదా అయితే సంతోషిస్తున్నారు. ఏదైతే చేసారో అది సఫలమైంది. మరి మీరందరూ ఎవరు? సఫలతా సీతారలు. మంచిది. చాలా మంచిది.
టీచర్లందరూ లేవండి:- టీచర్లు కూడా తక్కువ కాదు. బాప్‌దాదా టీచర్లందరినీ గురుభాయిగా (సహపాఠిగా) చూస్తారు. గురుభాయి అనగా బాబా సమానము. కావున విశేషంగా టీచర్లు ప్రతి కర్మనూ తండ్రి సమానంగా చెయ్యాల్సిందే. చేస్తాము కాదు, చెయ్యాల్సిందే ఎందుకంటే టీచర్లు తండ్రి తరఫున స్టూడెంట్ల ముందు ఒక నిమిత్త సాకార రూపంలో తండ్రి సమానులు. టీచర్ల ప్రతి కర్మ స్టూడెంట్ల ముందు బాబా సమానంగా కనిపించాలి. వీరైతే తండ్రిని అనుసరిస్తూ బాబా సమానంగా అయ్యారు అని ప్రతి ఒక్కరి నోటినుంచి వెలువడాలి. మరి అటువంటి లక్ష్యము ఉంది కదా. ఇదే లక్ష్యము కదా. తల ఊపండి. టీచర్లు నిమిత్తులు, మరి టీచర్ల పైన బాధ్యత కూడా ఉంటుంది కదా. చేస్తున్నారు కానీ ఇంకా బాగా చెయ్యాలి. లక్ష్యము చాలా మంచిది. తండ్రి సమాసంగా అవ్వవలసిందే అన్న శుభ భావనను తండ్రి ప్రతి టీచర్‌పైనా ఉంచుతారు.
దాదీ జానకిగారు:- ఓం శాంతి. డైమండ్ హాల్లో ఏమి జరుగుతుందో పూర్తి ప్రపంచానికి తెలుస్తుంది. జీవించడం ఎలాగా, ఒకవేళ మరణించాల్సి వస్తే ఎలా మరణించాలి, ఒకటి బాబా రెండు నేను ఆత్మను, వాహ్ బాబా వాహ్. వై, వై (ఎందుకు, ఎందుకు) అనవద్దు. ఎందుకంటే కొంతమందికి వై, వై అనడం ఇష్టం. వాహ్ మధురమైన పిల్లలూ, వాహ్! బాబా పిల్లలకు స్వర్గ సుఖం లభించింది. ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వవద్దు, దుఃఖమును తీసుకోవద్దు. కేవలం చెప్పడం కాదు, ప్రాక్టికల్‌లో చేసి చూపించాలి. ఎవరైనా మనకు దుఃఖాన్ని ఇచ్చినాకానీ మనం తీసుకోకూడదు. పాపం వారు. బాబా పిల్లలందరూ బాబాను తమ హృదయ సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు. మనం వాణి నుండి అతీతంగా వానప్రస్థంలో ఉండాలి. బాబా దిలారాముడు, వారి ముగ్గురు పిల్లలు సుఖము, శాంతి మరియు ప్రేమ బాగా సేవ చేస్తున్నాయి. ఇంత పెద్ద సభను చూసి ధన్యవాదాలు బాబా మీకు. మీరు అందరినీ పిలుస్తారు, తినిపిస్తారు, అందరికీ భోజనం మంచిగా లభిస్తుంది. కదా. పడుకోవడానికి మంచిగా లభించింది కదా.
దాదీ గుల్జార్‌గారు బాబా రథం కదా. బాబా చెప్పింది మనం చేయాలి. దాదీ గుల్జార్‌గారు ఇప్పుడు అక్కడనుండి వింటున్నారు. వినండి దాదీ, మన శాంతివన్లో ఎంతో పెద్ద డైమండ్ హాల్ ఉంది. హాల్ అంతా నిండిపొయింది. అందరూ మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు. అచ్ఛా. ఓం శాంతి.
*** ఓంశాంతి ***
