‘‘ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టత శక్తి ద్వారా సమస్యా ప్రూఫ్‌గా, సమాధాన స్వరూపులుగా అవ్వండి’’
31-12-20 ఓం శాంతి “దినచర్య” మధుబన్
ప్రాణప్రదమైన అవ్యక్త బాప్‌దాదాకు అతి గారాల పిల్లలు, సదా సంతుష్టత శక్తితో మాయ మరియు ప్రకృతి యొక్క అలజడులను పరివర్తన చేసే నిమిత్త టీచర్ అక్కయ్యలు మరియు బాబా కనుపాపలు, సదా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేటువంటి దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణ సోదరసోదరీలు,
ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర స్మృతితో పాటు నూతన సంవత్సరం, నూతన యుగానికి చాలా చాలా హార్దిక శుభ కామనలు.
ఈ నూతన సంవత్సరము, నూతన ఉల్లాస-ఉత్సాహాలను తీసుకుని వచ్చింది. గడిచిన సంవత్సరాన్ని బ్రహ్మావత్సలు స్మృతిచిహ్నంలా చేసుకున్నారు. ఈ కాలం కరోనా కాలమే అయినా కానీ, పరిగెత్తి చేసే వాచ సేవలు తక్కువ అయినా కానీ, అందరూ ఎంతో చక్కగా మనసా సేవను చేసారు. ప్రతి ఒక్కరికీ ఉన్నతోన్నతమైన స్వ స్థితిని తయారు చేసుకునే గోల్డెన్ అవకాశం లభించింది. అందరూ తమ సమయం, శ్వాస మరియు సంకల్పాన్ని సఫలం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఎంతో నేర్చుకునేందుకు, అనుభూతి చెందేందుకు, ఏకాగ్రత అభ్యాసాన్ని పెంచుకునేందుకు, ఏకాంతవాసానికి సమయం లభించింది. సైన్స్ సాధనాల ద్వారా ఆన్లైన్ క్లాసులు మరియు సేవల భిన్న భిన్న కార్యక్రమాలు కూడా చాలా బాగా సఫలమవుతున్నాయి. అనేక క్రొత్త క్రొత్త ఆత్మలు ఈ మాధ్యమం ద్వారా బాబాను గుర్తించి జ్ఞానయోగాల సాప్తాహిక కోర్సును చేసారు. ఇది కూడా సేవ యొక్క కొత్త అల. డ్రామాలోని ప్రతి దృశ్యంలో ఏదో ఒక కళ్యాణం ఇమిడి ఉంది అని బాబా అంటారు. బాబా పిల్లలైతే ప్రతి దృశ్యాన్ని చూస్తూ నథింగ్ న్యూ స్మృతితో సదా అచలంగా, నిశ్చలంగా ఉంటారు.
ఇప్పుడు 21వ శతాబ్దంలోని ఈ 2021 సంవత్సరాన్ని విశేషంగా మనమందరమూ తపస్యా సంవత్సరంగా జరుపుకుందాము. ఈ తపస్సు ఆత్మను బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా చేస్తుంది. జనవరి నెల అయితే మనందరి ప్రియమైన బ్రహ్మా బాబా గారి స్మృతి మాసము, ఈ సమయంలో మనమంతా విశేషంగా బ్రహ్మా బాబా సమానంగా అయ్యేందుకు వారి అడుగుపై అడుగు వేసి మన స్థితిని శ్రేష్ఠంగా తయారు చేసుకోవలసిందే. ఇందుకోసం జనవరి నెల పత్ర పుష్పంలో పూర్తి నెలకు అవసరమైన హోమ్‌వర్క్‌ను మీ అందరి వద్దకు ఈమెయిల్ పంపడం జరిగింది. అందరూ ఎంతో చక్కగా అంతర్ముఖిగా అయ్యి, మనసు మరియు నోటి మౌనాన్ని పెట్టుకుని, తమ అవ్యక్త అలౌకిక స్థితిని తయారు చేసుకోగలరు.
బాబా మిలనపు ఈ సీజన్ కూడా చాలా అతీతమైనది, ప్రియమైనది, ఈసారి ఢిల్లీ ఆగ్రా నుండి కొంతమంది సోదరసోదరీలు సమ్ముఖానికి చేరుకున్నారు. ఇతర దేశవిదేశాలలోని లక్షల సోదరసోదరీలు ఆన్లైన్ ద్వారా అవ్యక్త మిలనపు అనుభూతులను చేస్తూ, అనేక వరదానాలతో తమ ఒడిని నింపుకుంటున్నారు. బాప్‌దాదా చెప్పే ప్రతి వరదాని మహావాక్యము పిల్లలందరిలో నూతన ఉల్లాసాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పుడైతే అందరూ సంపూర్ణంగా అవ్వాలన్న రేస్‌తో పాటు ప్రియమైన బాప్‌దాదాను విశ్వంలోని నలుమూలల ప్రత్యక్షం చేయవలసిందే. అచ్ఛా - అందరికీ చాలా చాలా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం శాంతి.
31-12-20 ఓం శాంతి “అవ్యక్త మహావాక్యాలు” రివైజ్ వీడియో 31-12-12 మధుబన్
ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టత శక్తి ద్వారా సమస్యా ప్రూఫ్‌గా, సమాధాన స్వరూపులుగా అవ్వండి
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపుల సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి లైట్ చాలా చక్కగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే సంతుష్టత శక్తి చాలా శ్రేష్ఠమైనది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడకు ఇతర శక్తులు కూడా వచ్చేస్తాయి. సంతుష్టత శక్తి ఎటువంటి సమస్యనైనా సహజంగా సమాప్తం చెయ్యగలదు. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి శక్తి అంటూ ఉండదు. సంతుష్టత శక్తి ఎటువంటి వాతావరణమునైనా, ఎటువంటి పరిస్థితినైనా సహజంగా పరివర్తన చెయ్యగలదు. సంతుష్టత మాయ మరియు ప్రకృతిల అలజడులను పరివర్తన చేసేస్తుంది. కావున, ‘నేను సంతుష్టమణిగా ఉన్నానా? ఎటువంటి మనుష్యాత్మ పరిస్థితినైనా పరివర్తన చేసి వాతావరణాన్ని పరివర్తన చెయ్యగలనా?’ అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి.
బాప్‌దాదా కూడా ఈరోజు విశేషంగా తమ సంతుష్టమణి ఆత్మలను చూసి చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ సేవలో, తోటివారిలో ఉన్న సంతుష్టత శక్తి వాతావరణాన్ని పరివర్తన చేయడాన్ని బాప్‌దాదా చూసారు. మరి స్వయాన్ని ఇటువంటి సంతుష్టమణిగా అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే స్వయంలో సంతుష్టత శక్తి ఉంది. అని భావిస్తూ దానిని సమయానికి కార్యంలో వినియోగిస్తూ సఫలతను అనుభవం చేసుకుంటున్నామని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా. చేతులు బాగా పైకి ఎత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. బాప్‌దాదా కూడా అందరి చేతులను చూసి సంతోషిస్తారు. కానీ, మీ తోటివారిలో అలజడి కలిగినప్పుడు ఈ శక్తి పరివర్తన చేస్తుందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. దాని రిజల్ట్‌గా ముందు తమ తమ స్థానాలను శక్తిశాలిగా చేయటంలో సక్సెస్ (విజయవంతం) అయ్యారా?
బాప్‌దాదా ఏమి చూసారంటే కొన్ని స్థానాలలో ఇప్పటికీ సహనశక్తితో స్థానాలను సదా నిర్విఘ్నంగా చేసే ఆవశ్యకత ఉన్నది! ప్రతి ఒక్క స్థానము అనగా సేవాకేంద్రము, జోన్ నిర్విఘ్నంగా ఉన్న రిపోర్ట్‌ను ఇవ్వండి అని బాప్‌దాదా కార్యమును ఇచ్చారు. గుర్తుందా? గుర్తుందా? ఆ లెక్కతో సమయపు ఆవశ్యకత అనుసారంగా ఇప్పుడు ప్రతి స్థానము నిర్విఘ్నంగా అయ్యే ఆవశ్యకత ఉంది. సేవాస్థానము కావచ్చు, ప్రవృత్తి కావచ్చు, ప్రతి స్థానము నిర్విఘ్నంగా, సంతుష్టత శక్తితో సంపన్నంగా అవ్వాలి. సమయపు వేగాన్ని చూస్తున్నారు. కావున సంతుష్టత శక్తిపై స్వయంలో కావచ్చు, సంగఠనలో కావచ్చు ఇప్పుడు అటెన్షన్ ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది.
బ్రహ్మా బాబా నలువైపుల చుట్టి వస్తారు. సంపూర్ణంగా అవ్వడానికి అన్నిటికన్నా సహజ సాధనమేమిటో తెలుసా? ఫాలో ఫాదర్. ఆది నుండి అంతిమం వరకు బ్రహ్మా బాబా తమ సంతుష్టత శక్తితో ప్రతి పరిస్థితిపై విజయాన్ని పొందారు. కావున బాప్‌దాదా ఈరోజు అందరికీ విశేషమైన సూచనను ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ సంతుష్టమణిగా అయ్యి సంతుష్టత శక్తిని విశేషంగా కార్యంలో వినియోగిస్తూ ఉండండి.
ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ ఇది పరిశీలించుకోండి - సంతుష్టత శక్తితో స్వయం కూడా సంతుష్టము, తోటివారు కూడా సంతుష్టంగా ఉన్నారా? బాప్‌దాదా కోరుకుంటున్న విధంగా సంతుష్టంగా ఉన్నానా? ఏ సమస్య అయినా సంతుష్టతతో సమాప్తమయిందా? ఎందుకంటే ప్రపంచంలో రోజు రోజుకీ అసంతుష్టత పెరగనుంది, అందుకోసం స్వయాన్ని చూసుకోండి, నేను రోజంతా సంతుష్టమణిగా ఉన్నానా? ఇందుకు సహజ సాధనము - ఫాలో బ్రహ్మా ఫాదర్ ఎందుకంటే ఈ రోజుల్లో అసంతుష్టత పెరగవలసిందే.
ఇకపోతే బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సరం కోసం విశేషంగా అమృతవేళ సహజ వరదాన రూపంలో వరదానాలను ఇచ్చే ప్లాన్‌ను తయారు చేసుకున్నారు. క్రొత్త సంవత్సరంలో ఏమవుతుంది అని అందరూ అడుగుతారు కదా. దృఢ సంకల్పం ఉన్న వారికి విశేషంగా బాప్‌దాదా సహయోగము లభిస్తుంది, మరి క్రొత్త సంవత్సర బహుమతి సహజమైపోతుంది. అమృతవేళలో ఇచ్చే ఈ బహుమతి నచ్చిందా? నచ్చిందా! చేస్తూనే ఉన్నారు కానీ బాప్‌దాదా వైపు నుండి విశేషంగా సహయోగము, స్నేహము, శక్తి ప్రాప్తిస్తాయి. సరేనా! సరేనా? ఎందుకంటే అందరిలో లగనము మంచిగా ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. ఏదో ఒకటి చెయ్యాలి అన్న లగనము బాగుంది కానీ మధ్యలో ఏదో ఒక పరిస్థితి వచ్చేస్తుంది, అందుకోసం ఈ సంవత్సరంలో సంతుష్టత శక్తిని విశేషంగా కార్యంలోకి తీసుకురండి. పరిశీలించుకుంటూ ఉండండి అప్పుడు ముందుకు స్వతహాగానే సాగుతూ ఉంటారు. అచ్ఛా.
అందరూ అనేక స్థానాల నుండి వచ్చారు. నలువైపుల కూడా మధువనాన్ని లగనముతో గుర్తు చేస్తూ ఉంటారు. మరి మీరు ఏమవుతారు? సంతుష్టమణి. నచ్చిందా! సంతుష్టమణిగా అవ్వడం ఇష్టమయితే చేయి ఊపండి. ఒకవేళ ప్రతి ఒక్కరూ సంతుష్టంగా ఉంటే నలువైపుల ఏమి జరుగుతుంది? వాహ్ వాహ్! అన్న పాట మ్రోగుతుంది. మరి మీరందరూ ఎవరు? ఎవరు మీరు? అందరూ సంతుష్టమణులు! సంతుష్టమణులేనా లేక కొంచెం కొంచెమా? చెప్పండి, మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు! బాప్‌దాదా భ్రమణకు వెళ్ళినప్పుడు ఏమి చూడాలి? ప్రతి స్థానంలో సంతుష్టమణుల లైట్ ప్రకాశిస్తూ ఉండాలి ఎందుకంటే బాప్‌దాదాకు నలువైపుల భ్రమణము చెయ్యడానికి ఎక్కువ సమయము పట్టదు. మరి ఈ సంవత్సరం నలువైపుల సంతుష్టమణుల లైట్ ఎంత ప్రకాశిస్తుంది అన్న రిజల్ట్‌ను చూస్తాము.
ఈ సంవత్సరము స్వయంలో సమస్యా ప్రూఫ్, సమాధాన స్వరూపమును విశేషంగా రిజల్ట్‌లో చూడాలి. నలువైపుల ఉన్న పిల్లలు మెజారిటీ మనసుతో మధువనానికి చేరుకున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు ఎంత లగనముతో మనసు ద్వారా మధువనానికి చేరుకున్నారో బాప్‌దాదా చూస్తున్నారు. మీరు సాకారంలో చేరుకున్నారు, నలువైపుల ఉన్న పిల్లలకు కూడా బాప్‌దాదా విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. మరియు విశేషంగా సంతుష్టత శక్తి యొక్క వరదానాన్ని నలువైపుల ఉన్న పిల్లలకు ఇస్తున్నారు. సంతుష్టంగా ఉండండి, సంతుష్టం చెయ్యండి మరియు సంతుష్టత శక్తితో విశ్వంలో కూడా సంతుష్టత వైబ్రేషన్లను వ్యాప్తి చెయ్యండి. అచ్ఛా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నట్లయితే రెండు రెండు చేతులెత్తండి. బాప్‌దాదా కూడా పిల్లలను మధువనంలో చూసి సంతోషిస్తున్నారు. ఏమి జరిగినా కానీ, ఏదైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినా కానీ మీరు మధువనానికి చేరుకోండి, మనసుతో, తనవుతో కాదు మనసుతో. బాప్‌దాదా పిల్లల మనసులో ఎక్స్ట్రా సంతోష ఔషధాన్ని నింపుతారు. బాగుంది, మధుబనానికి రావడము అంటే పురుషార్థంలో అడుగులు ముందుకు వేయడము. ఇప్పుడు కూడా పరిశీలించుకోండి, మధువనానికి వచ్చారంటే ముందుకు వెళ్ళేందుకు స్వయం ఎంత సహయోగాన్ని తీసుకున్నారు? మధువనంలో సహజంగానే రోజంతా ఏమి గుర్తుంటుంది? బాబా, బాబా, బాబా... విన్నా బాబా విషయాలే, నడిచినా అది మధువన పావన స్థానంలో, తింటే బ్రహ్మా భోజనము, పవర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ విశేషంగా డ్యూటీవారికి గుర్తు తెప్పించడం జరుగుతుంది కావున మధుబనానికి రావడము అంటే స్వయంలో జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవలో అడుగును ముందుకు వెయ్యడము. మరి అందరూ మధువనం యొక్క ఈ లాభాన్ని పొందారా? పొందారా! లాభం పొందారా? ఎందుకంటే ఇక్కడైతే ఎటువంటి బాధ్యత లేదు. స్వయాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత ఉంది. అచ్ఛా.
సేవ టర్న్ ఢిల్లీ, ఆగ్రా వారిది:- ఢిల్లీవారు లేవండి. ఢిల్లీవారు లైట్-మైట్ రూపులై వచ్చారు. హాల్లో మంచి శోభ వచ్చింది. అచ్ఛా. ఢిల్లీవారైతే రాజధానిని తయారు చెయ్యాల్సి ఉంది ఎందుకంటే అందరూ రాజ్యం చేయాలి కదా. సింహాసనంపై కూర్చోకపోయినా కానీ రాజ్యాధికారులుగా అయితే అవుతారు కదా. బాగుంది, ఢిల్లీవారికి సేవా ఉత్సాహం బాగుంది. ఇప్పుడు ఢిల్లీవారు నంబర్‌వన్ నిర్విఘ్న జోన్ యొక్క రిజల్ట్ ఇవ్వాలి. ఉత్సాహం బాగుంది. కానీ ఇప్పుడు ఋజువు ఇవ్వాలి. ఢిల్లీవారు చేస్తారు కదా! చేతులెత్తండి ఎందుకంటే ఇప్పటివరకు బాప్‌దాదాకు ఏ జోన్ నుండి కూడా రిజల్ట్ రాలేదు. మరి ఇందులో కూడా ఢిల్లీ నంబర్‌వన్ తీసుకుంటుంది కదా. చెప్పండి టీచర్లు, చేతులెత్తండి. మరి తీసుకుంటారా? కొంచెం ఢిలాగా ఎత్తారు. సోదరులు ఎత్తారు. అచ్ఛా. భిన్న భిన్న స్థానాలలో కూర్చున్నారు. బాగుంది, సేవా ఉత్సాహము అన్ని జోన్లలో ఉండటాన్ని బాప్‌దాదా చూసారు మరియు ఈ సంవత్సరం నలువైపుల అందరూ తమ యథా శక్తి ప్రోగ్రాములు కూడా బాగా చేసారు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు నలువైపుల ఉన్నాయి. ఈ సేవా ఉత్సాహాన్ని పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుంది? భారతదేశము మహాన్‌గా అయిపోతుంది. అచ్ఛా. ఢిల్లీ వారికి అభినందనలు.
డబల్ విదేశీయులు:- చేతులెత్తండి. చాలా బాగుంది. మధువనం యొక్క లాభాన్ని విదేశీయులు మంచిగా పొందడాన్ని బాబా చూసారు. రిట్రీట్ చేసుకున్నా, ప్రోగ్రామ్ చేసుకున్నా కానీ సంగఠనలో పరస్పరం లభించిన సహకారం మరియు ధైర్యానికి రిజల్ట్ మంచిగా ఉంది అందుకే బాప్‌దాదా డబల్ విదేశీయులకు 100సార్లు లాభాన్ని పొందినంత అభినందనలు తెలుపుతున్నారు. డబల్ విదేశీయులకు బాప్‌దాదా ఏ టైటిల్‌ను ఇచ్చారు? డబల్ పురుషార్థి. డబల్ ఫారెనర్ కాదు, డబల్ పురుషార్ధి. ఎప్పుడైనా ఎవరైనా డబల్ అంటే డబల్ ఫారెనర్స్ మాత్రమే కాదు, డబల్ పురుషార్ధీలము కూడా అని చెప్పండి. మరియు స్వయాన్ని పరిశీలించుకోండి. అటెన్షన్ ఉంది, అది బాప్‌దాదాకు తెలుసు, విశేషమైన అటెన్షన్‌ను ఇప్పించడం కూడా జరుగుతుంది అందుకే బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఆలస్యంగా వచ్చినాకానీ పురుషార్ధంలో వెనుక లేరు. ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది కూడా బాప్‌దాదా చూస్తున్నారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇందుకు చప్పట్లు కొట్టండి.
ఇప్పుడు బాప్‌దాదా ప్రతి ఒక్కరి పురుషార్థంలో ప్రోగ్రెస్ చూడాలనుకుంటున్నారు. పురుషార్థంలో నలువైపుల అందరూ నంబర్‌వన్‌గా అవ్వాలి, అలా అందరూ పరస్పరం సహయోగిగా అయ్యి ఇటువంటి రిజల్ట్‌ను తీసుకురండి. ఏ జోన్ చూసినా కానీ నంబర్‌వన్ అవ్వాలి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? దాదీలు వినిపించండి, వీలవుతుందా? చెప్పండి, వీలవుతుందా? (మేము చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు, మేమే కదా చేస్తాము) చేతులెత్తండి, డబల్ పురుషార్టీలుగా అవుతాము! ఎక్కడనుండి ఎవరు వింటున్నా కానీ, చూస్తున్నా కానీ అందరూ ఈ సంకల్పం చెయ్యండి - చెయ్యాల్సిందే. ధైర్యవంతులైతే, ‘బాబా, ఇదేమంత పెద్ద విషయము, జరిగే ఉంది’ అని అంటారు ఎందుకంటే మీ వైబ్రేషన్ ప్రపంచంవరకు వెళ్ళాలి. మీరు పురుషార్థంలో ఒకవేళ ముందుకు వెళ్తే ఆ వైబ్రేషన్లు ప్రపంచంలోని దుఃఖిత ప్రజల వరకు చేరుకుంటాయి. ఈ రోజుల్లో దుఃఖము ఎంత పెరుగుతుంది! అతి దుఃఖాన్ని తీసుకువచ్చే కారణాలు తయారువుతున్నాయి. అచ్ఛా -
అందరికీ స్మృతి, వచ్చే సంవత్సరం ఏమి చెయ్యాలి? మరి ఇటువంటి పురుషార్థము చేసి ముందుకు సాగండి మరియు ముందుకు తీసుకువెళ్ళండి. అచ్ఛా.
బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు.
నలువైపుల ఉన్న పిల్లలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఏదో ఒక నవీనతను స్వయంలో తీసుకురావాలి. ఇప్పుటివరకు ఏదైతే పరివర్తన చేసుకోలేదో, కష్టమనిపిస్తుందో అది ఈ నూతన సంవత్సరంలో చేసి సమాచారాన్ని వ్రాయండి. స్వయాన్ని నిర్విఘ్నంగా చేసుకుని ఇతరులను కూడా నిర్విఘ్నులుగా చెయ్యడంలో సహయోగులుగా అవ్వండి. సంతుష్టమణులందరూ మెరుస్తూ ఉండాలి, అలా బాప్‌దాదా చూడాలని ఆశిస్తున్నారు.
అచ్ఛా - నలువైపుల ఉన్న పిల్లలకు చాలా - చాలా - చాలా ప్రియ స్మృతులు మరియు పరివర్తన జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
*** ఓంశాంతి ***
