Search for a command to run...
17 Jul 1969
అవ్యక్త స్థితిని తయారు చేసుకునేందుకు యుక్తులు
17 July 1969 · తెలుగు
అవ్యక్త స్థితి నచ్చుతుందా లేక వ్యక్తంలోకి రావడము బాగుందా? అవ్యక్త స్థితిలో ధ్వని ఉంటుందా? ధ్వనికి అతీతంగా ఉండాలనుకుంటున్నారా? మీరందరూ ఎప్పుడైతే ధ్వనికి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తారో అప్పుడు మంచిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు బాప్దాదాను వ్యక్తంలోకి ఎందుకు పిలుస్తున్నారు? ప్రతి క్షణం అవ్యక్త స్థితిలో ఉండాలంటే అందుకోసం ఏ పురుషార్థాన్ని చేయాలి? కేవలం ఒక్క పదాన్ని చెప్పండి. ఆ ఒక్క పదంతో అవ్యక్త స్థితిలో ఉండాలి. ఏ పదాన్ని గుర్తుంచుకుంటే అవ్యక్త స్థితి తయారవుతుంది? మనసా-వాచ-కర్మణ మూడూ వ్యక్తంలో ఉన్నప్పటికీ అవ్యక్తంలో ఉండాలి, ఇందుకోసం ఒక పదాన్ని చెప్పండి. (ఆత్మ అభిమానిగా కావాలి) ఆత్మ అభిమాని అనగా అవ్యక్త స్థితి. కానీ ఆ స్థితి కోసం గుర్తుంచుకోవలసినది ఏమిటి? ఏ పురుషార్థం చేయాలి? నెమ్మది నెమ్మదిగా అందరి స్థితి అలా అవుతుంది. ఎవరిలో అయితే ముందు నుండే ఈ విషయం ఉంటుందో వారికి తెలిసి ఉంటుంది. అందుకే ప్రాక్టీసు (అభ్యాసం) చేయిస్తున్నాము. ఎంతెంతగా అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటారో, నోటితో మాట్లాడినా మాట్లాడకపోయినా కానీ వారి లోపలి భావాన్ని ముందునుండే తెలుసుకుంటారు. అటువంటి సమయము వస్తుంది. అందుకే ఈ అభ్యాసాన్ని చేయిస్తున్నాము.
మరి ఏ పదాన్ని గుర్తుంచుకోవాలి అని అడిగాము. స్వయాన్ని అతిథిగా భావించాలి. అతిథిగా భావించినప్పుడు అంతిమ సంపూర్ణ స్థితి యొక్క వర్ణన ఏదైతే ఉందో అది ఇలా అతిథిగా అవ్వడం వలన జరుగుతుంది. స్వయాన్ని అతిథిగా భావిస్తే వ్యక్తంలో ఉంటున్నప్పటికీ అవ్యక్తంలో ఉంటారు. అతిథికి ఎవ్వరిపట్ల ఆకర్షణ ఉండదు. మనం ఈ శరీరంలో కూడా అతిథులము. ఈ పాత ప్రపంచంలో కూడా అతిథులము. శరీరంలోనే అతిథులము అన్నప్పుడు శరీరంపై ఏ మోహము పెట్టుకుంటాము! కేవలం కొద్ది సమయం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి.
ఇక్కడ అతిథిగా అయితే అక్కడ ఏమవుతారు? ఎంతగా ఇక్కడ అతిథిగా అవుతారో అంతగా అక్కడ విశ్వానికి యజమానిగా అవుతారు. ఈ ప్రపంచానికి యజమాని కాదు. ఈ ప్రపంచంలో మనం అతిథులము. కొత్త ప్రపంచానికి యజమానులం. వ్యక్త భావంలోకి వచ్చేస్తుండటానికి కారణము – స్వయాన్ని అతిథిగా భావించకపోవడము. వస్తువులపై కూడా అధికారము ఉందని భావిస్తుంటారు. అందుకే వాటిపై అటాచ్మెంటు(మోహము) వచ్చేస్తుంది. స్వయాన్ని అతిథిగా భావిస్తే ఈ విషయాలన్నీ సమాప్తమైపోతాయి.
మీ బ్యాంకు బాలెన్సును కూడా నోట్ చేసుకోండి. ఎంత సంపాదిస్తున్నారో అంతా ఖర్చు పెడుతున్నారా లేక జమ అవుతుందా? మొత్తం ఎంత జమ అయి ఉంది అని టోటల్ లెక్క వేసారా? ఆ జమ లెక్క ప్రకారం స్వయంతో స్వయం సంతుష్టంగా ఉన్నారా? (లేదు) మరి జమ చేసుకోవడానికి మరింకే సమయమైనా ఉందా? ఎంత సమయం ఉంది? సమయం కూడా లేదు, సంతుష్టత కూడా లేదు, మరేమి జరుగుతుంది? ఇప్పుడు అందరూ దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. మీ బాలెన్సును పెంచాలి. కనీసం స్వయం సంతుష్టపడేంత అయినా ఉండాలి. మీ సంపాదనతో స్వయమే సంతుష్టంగా లేకపోతే ఇతరులకు ఏమి చెప్తారు? ఒక్కొక్కరూ ఇంతగా జమ చేసుకోవాలి. కేవలం మీ కోసమే జమ చేసుకోవాలా లేక ఇతరుల కోసం కూడా జమ చేయాలా? ఇతరులకు ఇవ్వడానికి జమ చేసుకోవద్దా? అందరూ బికారిగా అయి మీ ముందుకు భిక్ష కోసం వచ్చే సమయం రానుంది. మరి వారికి ఇవ్వరా? అంత జమ చేసుకోవాలి కదా. స్వయం కోసమైతే చేసుకోవలసిందే కానీ దానితోపాటు ఇటువంటి దృశ్యము కూడా అందరి ముందుకు వచ్చేది ఉంది. ఎవరైతే ఈరోజు తమను నిండుగా భావిస్తున్నారో వారు కూడా బికారి రూపంలో మీ అందరి నుండి భిక్ష కోరుకుంటారు. మరి భిక్ష ఎలా ఇస్తారు? జమ అయి ఉంటేనే కదా. దాత పిల్లలు అందరూ ఇచ్చేవారే ఉన్నారు. మీ అందరి ఒక్క సెకండు యొక్క దృష్టి, అమూల్య మాట కోసం కూడా దప్పికతో ఉన్నారు. ఇటువంటి అంతిమ దృశ్యాన్ని మీ అందరి ముందు పెట్టుకుని పురుషార్థం చేయండి. మీ గుమ్మం వద్దకు ఆకలితో వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించకండి. సాకారంలో ఏమి చేసి చూపించారు? ఏ ఆత్మ అసంతుష్టంగా అయి వెళ్ళకూడదు. ఎటువంటి ఆత్మ అయినా కానీ సంతుష్టమై వెళ్ళాలి. మరి ఇలాంటి విషయాలను ఆలోచించండి. కేవలం మీ కోసం కాదు.
ఇప్పుడు మీరు రచయితలు. మీ ఒక్కొక్కరి వెనుక రచన ఉంది. తల్లిదండ్రులకు పిల్లలు కలగనంత వరకు, తల్లిదండ్రుల సంపాదన వారి వరకే ఉంటుంది. రచన వచ్చాక రచన గురించి కూడా పూర్తి శ్రద్ధను ఉంచుతారు. ఇప్పుడు మీ కోసం ఏదైతే సంపాదన చేసుకున్నారో, అది చాలా సమయం తిన్నారు, జరుపుకున్నారు. కానీ ఇప్పుడు మీ రచనపై కూడా శ్రద్ధ పెట్టండి. మీరు మీ రచనను చూసారా? ఎంత రచన ఉంది? చిన్నదా పెద్దదా? బాప్దాదా అందరి రిజల్టును చూస్తున్నారు. ఆ లెక్క ప్రకారంగా చెప్తున్నారు. ఒక్కొక్క సితార వెనుక ఎంత రచన ఉంది! ఇక్కడ ఎంత రచన ఉంటుందో అంతగా అక్కడ పెద్ద రాజ్యం ఉంటుంది. ఇక్కడ ఎంత రచనను రచించారు? మీ రచనను చూసుకున్నారా? భవిష్యత్తు తెలుసా? అందరూ రచయితలే కానీ పెద్ద రచనను చేసుకున్నారా లేక చిన్న రచననా? (పెద్దది చేయాలనే ఆశ) పెద్ద రచనతో పాటు బాధ్యతలు కూడా పెద్దగా ఉంటాయి. అచ్ఛా.
ఓంశాంతి