Search for a command to run...
16 Jul 1969
ఏ కార్యంలోనైనా సఫలమవ్వడానికి సాధనము – సాహసాన్ని విడవకండి మరియు పరస్పర స్నేహాన్ని కలిగి ఉండండి
16 July 1969 · తెలుగు
(మధుబన నివాసి గోపకులతో అవ్యక్త బాప్దాదా యొక్క అవ్యక్త ఆత్మిక సంభాషణ)
ఈరోజు ఎందుకని ఆహ్వానాన్ని ఇచ్చారు? కలవడానికే పిలిచారా లేక ఇంకేదైనా లక్ష్యము ఉందా? మీరందరూ ఈ సంగఠనకు ఏ ఆహ్వానంపై వచ్చారు? ఏ లక్ష్యంతో మధుబన నివాసులైన గోపకుల ఈ సభ ఏర్పాటు అయింది? మీ అందరి పరివర్తన సమారోహానికి బాప్దాదా వచ్చారు. అంటే, మీరు పరివర్తన సమారోహానికి వచ్చారు. భట్టీలో ఎందుకు కూర్చున్నారు? పరివర్తన కోసం. కనుక ఈ రోజు పరివర్తన సమారోహంలో కలుసుకుంటున్నాము. పరివర్తన కావాలన్న ఉత్కంఠ అందరిలో చాలా బాగుంది. ఉత్సాహము కూడా ఉంది, ధైర్యము కూడా ఉంది. ఈనాటి భట్టీ చార్టులో ఇది కనిపిస్తుంది. ఈ గోపకుల పరివర్తన యొక్క ఉత్సాహంలో మీకు (కుమారక దాదీతో) ఏమేమి కనిపిస్తున్నాయి? పెనుగాలి వస్తుంటే వర్షం రాబోతుంది అని తెలుస్తుంది కదా, అలాగే ఈ పరివర్తన ఉత్సాహం గురించి మీరు ఏమనుకుంటున్నారు? పరివర్తన ఏ అవగాహనను ఇస్తుంది? ఇప్పుడు ప్రత్యక్షతకు సమయం సమీపంగా ఉంది అన్న విషయాన్ని పరివర్తన తెలుపుతుంది. ముందు ప్రత్యక్షత జరుగుతుంది తర్వాత ఈ సృష్టిపై స్వర్గము ప్రఖ్యాతమవుతుంది. ఇది ప్రత్యక్షతను తెలుపుతుంది.
వర్తమాన సమయంలో ప్రతి ఒక్క వత్స తమ తమ ప్రత్యక్షతను ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావడాన్ని చూసాము. ముందు గుప్తంగా ఉండేది. సూర్యని ప్రకాశంలో నక్షత్రాలు దాగిపోతాయి, సూర్యుడు మరో పక్కకు వెళితే సితారల ప్రకాశము ప్రత్యక్షము అవుతుంది. ఇప్పుడు జ్ఞాన సూర్యుడు వ్యక్త ఒడ్డును వదిలి అవ్యక్త వతనంలో నిల్చున్నారు, వ్యక్త దేశంలోని సితారలైన మీ ప్రకాశము కనిపిస్తుంది. ఇంతకముందుకన్నా ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నారు కదా. ఒక్కొక్క సితారలో ప్రపంచం ఉందని అంటారు కదా, కానీ ఒక్కొక్క సితారలో ఉన్న ఆ ప్రపంచం ఏమిటో వారికి తెలియదు. ఈ ఆకాశంలోని సితారలలో ఏ ప్రపంచమూ లేదు. కానీ ఈ ధరిత్రి యొక్క చైతన్య సితారలలో ఒక్కొక్క ప్రపంచం ఉంది. మీ ప్రపంచం యొక్క సాక్షాత్కారం జరుగుతుందా? మీ అందరి సంగమ సంపూర్ణ రూపాన్ని కొద్ది సమయంలోనే చూస్తారు. శక్తులు మరియు పాండవుల రూపంలో సంగమ యుగం యొక్క సంపూర్ణ రూపము ఏమిటో తెలుసా? సంగమ సంపూర్ణ స్వరూపము ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రత్యక్షంగా మీ అందరికీ మీలో కనిపిస్తుంది. మా భక్తులు ఎవరు, ప్రజలు ఎవరు అని తెలుస్తుంది. ప్రజలు అయితే మీకు సమీపంగా వస్తారు , భక్తులైతే చివరలో చరణాలు పట్టుకుంటారు. మరి ప్రతి సితారలో ఉన్న రాజధాని లేక ప్రపంచం ఏదైతే తయారై ఉందో, అది ఇప్పుడు ప్రత్యక్ష రూపాన్ని తీసుకుంటుంది. అది ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో అప్పుడు అందరూ ‘అహో ప్రభూ’ అన్న నినాదం చేస్తారు. ఇప్పుడు ఈ సమయము సమీపిస్తుంది. కనుక ఇప్పుడు త్వరగా పరివర్తనను తీసుకురావాలి. మీరు రచయిత కదా! రచయిత ఎలా ఉంటారో వారి రచన అలా ఉంటుంది. రచయిత తన రచనపై శ్రద్ధ ఉంచాలి.
ఈ సమయంలో బాప్దాదా కూడా సంతోషిస్తున్నారు - స్నేహము మరియు సాహసము, ఈ రెండు విషయాలను చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో స్నేహము మరియు సాహసము ఉన్నాయి. అవి కేవలం బీజ రూపంలోనే కాదు, బీజము నుండి కొంత ప్రత్యక్ష ఫలం కూడా కనిపిస్తుంది. ఆ ప్రత్యక్ష ఫలాన్ని చూసి హర్షిస్తున్నాము. ఫలము వచ్చినప్పుడు దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసి కూడా ఉంటుంది. మీరు కూడా ఈ ఫలాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫలాన్ని బాప్దాదాకే స్వీకరింపజేయాలి. అయితే మధ్యలో మాయా రూపి పక్షి ఫలాన్ని ఎంగిలి చేయకుండా ఉండేలా జాగ్రత్త పడండి. ఫలము పండిన తర్వాత దానిని తినడానికి పక్షులు చాలా ప్రయత్నం చేస్తాయి, అలాగే మాయ కూడా ఈ ఫలాన్ని తినే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఎందుకు ఫలాన్ని పండేలా చేసారు? మరి జాగ్రత్త కూడా పూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు కేవలం పండు వచ్చింది, పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు స్వీకరిస్తాము. అప్పటివరకు సంభాళించండి. ఫలాన్ని సంభాళించడానికి ఏ ప్రయత్నం చేస్తారు? అందుకోసం మీ వద్ద ఏ సాధనము ఉంది? కొద్దిగా అయినా పండును ఎంగిలి చేస్తే ఆ పండును స్వీకరిస్తామా! మరి ఇప్పుడు ఆశ అయితే చాలా బాగుంది. అందరి మస్తకాలపై ఆత్మ సితారయే కనిపిస్తుంది కానీ దానితో పాటు మీ మస్తకంలో ఇంకేమి మెరుస్తుంది? ఆశా సితార మెరుస్తున్నట్లుగా బాప్దాదా చూస్తున్నారు. కేవలం ఈ సితారల మధ్యకు మబ్బులను రానివ్వకండి. లేకపోతే సితార దాగిపోతుంది. ఈ కనిపిస్తున్న ఆశా సితారను పోషిస్తూ ఉండండి. ఎప్పుడు ఏ కార్యంలోనైనా, స్థూలం కావచ్చు, సూక్ష్మ కార్యం కావచ్చు ఎప్పుడూ సాహసాన్ని విడిచి పెట్టకండి, రెండు, పరస్పరంలో స్నేహాన్ని పదిలంగా ఉంచండి. అప్పుడు పాండవుల జయజయకారము జరుగుతుంది. జయజయకారాల నినాదాలు వినిపిస్తాయి. ఇప్పుడైతే ఒకసారి ఒకటి, మరోసారి మరొకటి అవుతుంది. జయజయకారం జరిగినప్పుడు నాటకము సమాప్తమవుతుంది. అప్పుడు మీ అందరికీ అవ్యక్త స్థితి అను జెండా దూరం నుండే కనిపిస్తుంది. మీరందరూ కూడా అవ్యక్త, ఏకరస స్థితి అను జెండాను పూర్తి ప్రపంచంలో ఎగురవేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ రోజు పరివర్తన అను కంకణాన్ని ఏదైతే ధరించారో, దీనిని అవినాశిగా పెట్టుకోండి. కంకణాన్ని తీయవద్దు. ఏదైనా కంకణం ధరిస్తే, ఆ కార్యం పూర్తవ్వనంత వరకు దానిని తీయరు. అలాగే ఈ కంకణాన్ని కూడా తీయకండి.
మున్ముందు చాలా మంచి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ మీ పరివర్తనయే ఆ దృశ్యాలను సమీపంగా తెస్తుంది. మీ విలువ కూడా తెలుస్తుంది, మీ విలువ తెలిసినప్పుడు నషా కూడా వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి ఒక విలువను ఉంచుతున్నారు, మరోసారి మరో విలువను ఉంచుతున్నారు. విలువలో తేడాలు జరుగుతున్నాయి. ఎలా అయితే ఏదైనా వస్తువు కొత్తగా వెలువడితే దాని విలువ అటుఇటు అవుతూ ఉంటుంది, తర్వాత ఫైనల్ అవుతుంది. మీ విలువ కూడా ఇప్పుడు ఫైనల్గా తెలీలేదు. ఒక్కోసారి చాలా విలువైనవారిగా భావిస్తారు, ఒక్కోసారి తక్కువగా భావిస్తారు. కానీ యథార్థంగా ప్రతి ఒక్కరి విలువ ఏమిటి అన్నది త్వరలో తెలుస్తుంది.
ఈ మధుబనము, ఎక్కడైతే మీరు కూర్చున్నారో, పూర్తి సృష్టి మధ్యలో ఇది ఏమిటి? పూర్తి ప్రపంచం మధ్యలో బాప్దాదా ఎంతో ప్రేమగా తయారు చేసిన షో కేసు. ఎలా అయితే షో కేసులో చాలా మంచి-మంచి వస్తువులను ఉంచుతారో, అన్నిటికన్నా మంచి వస్తువులను షో కేసులో ఉంచుతారో, అలాగే మధుబనము అన్నది పూర్తి ప్రపంచానికి షోకేసు వంటిది. ఆ షోకేసులో అమూల్య రత్నాలైన మీరు ఉన్నారు. మేము మధుబనము అను షోకేసులో ఉన్న అమూల్య రత్నాలము అని తెలుసా? షోకేసులో ఏ వస్తువులనైతే పెడ్తారో వాటిపై ఎక్కువ శ్రద్ధను ఉంచుతారు. మీరందరూ కూడా షోకేసులోని ముఖ్య రత్నాలు. మిమ్మల్ని చూసి లోపల ఎటువంటి సరుకు ఉందో అందరూ తెలుసుకుంటారు. ఒకవేళ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే షోకేసు నుండి షో చేస్తారు - ‘నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు’. నేను ఒంటరిగా లేను, నా ముందు వెనుక పూర్తి రాజధాని ఉందని ప్రతి ఒక్కరూ భావించండి. నా ప్రజలు, నా భక్తులు నన్ను చూస్తున్నారు, నేను ఒంటరిగా లేను. ఒక్కరే ఉండి చేసే పనుల గురించి ఏమంత ఆలోచించరు. ఇప్పుడు స్వయాన్ని మీ ప్రజలు, భక్తుల మధ్య ఉన్నట్లుగా భావించండి. అందరూ మిమ్మల్ని ఫాలో చేస్తారు. ప్రతి క్షణం పడే అడుగు మీ సంస్కారము, మీ ప్రజలు, మీ భక్తులలో నిండుతూ ఉంటుంది. ఎలా అయితే తల్లి తన గర్భాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది కదా, ఎందుకంటే తల్లి ఏమి చేస్తుందో, ఏమి తింటుందో అవే సంస్కారాలు బిడ్డలో నిండుతాయి. అలాగే మీరు కూడా అంతే శ్రద్ధను పెట్టాలి, ఏ కర్మను నేను చేస్తానో నన్ను చూసి నా ప్రజలు, ద్వాపరం నుండి కలియుగం వరకు ఉండే భక్తులు కూడా అలాగే అవుతారు. మందిరాలు కూడా అలాగే తయారవుతాయి. విగ్రహం కూడా అలాగే అవుతుంది, మందిరానికి స్థానము కూడా అలాగే లభిస్తుంది. కనుక, నేను ఒంటరిగా లేను అని గుర్తుంచుకోండి. మేము మాస్టర్ రచయితతో ఉన్న రచన కూడా. తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా చేస్తారు, కానీ తమ రచన ముందు ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. మరి మీరు కూడా రచయిత కదా! రచయిత ఏమి చేస్తారో రచన అదే చేస్తుంది. మీపై బాధ్యత ఉంది అని భావించినప్పుడు, బాధ్యత వచ్చినప్పుడు సోమరితనము, నిర్లక్ష్యము సమాప్తమైపోతాయి. ఏ బాధ్యత? నేను ఏ కర్మను చేస్తానో... ప్రతి సితారకు తమ ప్రపంచం గురించిన అవగాహన ఉండాలి. కొందరిది చిన్నని ప్రపంచము, కొందరిది పెద్ద ప్రపంచము.
సమారోహము చేసేది జీవితాంతము గుర్తుండటానికి. ఈ సమారోహము కూడా అందుకే. ఈరోజు స్మృతిచిహ్న రోజు. సమారోహానికి గుర్తుగా ఏదో ఒకటి ఇస్తారు కదా. బాప్దాదా ఏమి ఇస్తారు? బాప్దాదా రెండు విషయాల బహుమతిని ఇస్తున్నారు – ముఖ్యంగా మధుబన నివాసులకు. సాహసము మరియు స్నేహాన్ని విడిచిపెట్టవద్దు అన్న శిక్షణ అయితే లభించింది. ఏ కానుకలను ఇస్తున్నాము? (1) ఒకే తపనలో ప్రతి సమయము ఉండాలి. మాకు ఉన్నది ఒక్కరే, మరెవ్వరూ లేరు (2) ఏకనామంలో ఉండటము. ఒక్కరి స్మృతి మరియు ఎకానమి. ఈ రెండు కానుకలు ఈ రోజు సమారోహానికి ఇస్తున్నాము. ఎవరు ఎంతగా తమ వైపుకు లాగినా కానీ ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు. ఇది మనసు విషయము. ఎకానమీ (పొదుపు) కర్మణ విషయము. మనసు మరియు కర్మణ రెండూ సరిగ్గా ఉంటే వాణి సరిగ్గా ఉంటుంది. ఈ రెండు విషయాలపై ముఖ్యంగా శ్రద్ధ వహించండి. సాకార రూపంలో కూడా ఒకే తపన, ఒకే నామం ఉండటాన్ని చూసారు. అందుకే ఏ మంత్రాన్ని వినిపించామో గుర్తుందా? తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి. ఎకానమీతో పాటు ఈ మంత్రాన్ని కూడా మర్చిపోవద్దు. ఏకనామం కూడా ఉండాలి, అలాగే ఎంత ఎకానమీ ఉంటుందో అంతే విశాల మనసు కూడా ఉండాలి. విశాల మనసులో ఎకానమీ ఇమిడి ఉంది. దీనినే తక్కువ ఖర్చు - ఎక్కువ ఖ్యాతి అంటారు.
మీరు మిగతా అందరికన్నా అధిక భాగ్యశాలురు, ఎందుకని? ఎవరి ఇంటికైతే ఎక్కువమంది అతిథులు వస్తూ ఉంటారో వారు అదృష్టవంతులు అంటారు కదా, మరి మీరు ఎక్స్ట్రా అదృష్టవంతులు ఎందుకంటే అందరికంటే ఎక్కువగా ఇక్కడికే అతిథులు వస్తుంటారు. కానీ ఆతిథ్యాన్ని, అతిథి సత్కారాన్ని కూడా చేయాలి. ఎంతగా ఆతిథ్యాన్ని ఇవ్వాలంటే తమ ఇంటితో జీవితకాల అతిథులుగా అయిపోవాలి. మీ ఆతిథ్యం వారిని సదా కోసం అతిథిగా చేసేయాలి. బాప్దాదా సాకారంలో ఇది చేసి చూపించారు. ఒక్కరోజు ఆతిథ్యంతో జీవితకాల అతిథులుగా చేయండి. ఇటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వండి. దీనిని సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేయడము) అంటారు. అచ్ఛా – ఈ క్లాసులో అందరికన్నా ఎక్కువ పురుషార్థీలు ఎవరు? నంబరువన్ ఎవరు? అందరూ ఒకరిని మించి మరొకరు మంచిగా ఉన్నారు. ఇదైతే అద్భుతము. ఈ గ్రూపే అందరికన్నా నంబరువన్ నంబరును తీసుకున్నారు. ఎందుకంటే ఒకరు ఒక విషయంలో విశేష పురుషార్థం చేస్తే, మరొకరు మరొక విషయంలో చేసారు. కనుక అందరూ నంబరువన్. ఈ గ్రూపువారు నంబరువన్ అనే ముద్రను వేసుకున్నారు. ఈ నంబరువన్ ముద్రను మర్చిపోకండి. ముఖ్యంగా నాలుగు విషయాలను మర్చిపోకండి. (1) శిక్షణ (2) హెచ్చరిక (3) ముద్ర (4) ఒకరినొకరు ముందుంచుకొని ఉన్నతిని పొందడము - ఈ నాలుగు విషయాలను ఎప్పుడూ మర్చిపోకండి. అచ్ఛా.
ఓంశాంతి