‘‘సర్వోత్తమ స్నేహము, సంబంధము మరియు సేవ’’
ఈరోజు బాప్దాదా పిల్లలందరి స్నేహంతో నిండిన కానుకలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహ సంపన్నమైన స్మృతి కానుకలు భిన్న-భిన్న రకాలుగా ఉన్నాయి. ఒక్క బాప్దాదాకు అనేక పిల్లల కానుకలు, అనేక సంఖ్యలో లభించాయి. ఇటువంటి కానుకలు మరియు ఇన్ని కానుకలు విశ్వములో ఎవ్వరికీ లభించజాలవు. ఇవి హృదయరామునికి హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకలు. ఇతర మనుష్య ఆత్మలందరూ స్థూలమైన కానుకలను ఇస్తారు, కానీ సంగమ యుగములో వీరు విచిత్రమైన తండ్రి మరియు ఇవి విచిత్రమైన కానుకలు. కావున బాప్దాదా అందరి స్నేహపూరిత కానుకలను చూసి హర్షిస్తున్నారు. అందరి కానుకలు చేరుకున్నాయి. కానుకలు తప్పకుండా భిన్న-భిన్న విలువలు కలిగి ఉన్నాయి. కొందరివి చాలా విలువ కలిగినవి, మరికొందరివి తక్కువ విలువ కలిగినవి. ఎంతగా ఎడతెగని మరియు సర్వ సంబంధాల స్నేహముందో అంత విలువైన కానుకలుగా ఉన్నాయి. ఈ హృదయపూర్వక కానుకలు నంబరువారీగా స్నేహము మరియు సంబంధాల ఆధారముతో ఉన్నాయి. ఇద్దరు తండ్రులు కానుకల నుండి నంబరువారీగా విలువైన మాలను తయారు చేస్తున్నారు. అంతేకాక మాలను చూసి విశేషంగా ఏ విషయంలో విలువలో తేడా ఉందో పరిశీలిస్తున్నారు. ఏం చూశారు? అందరికీ స్నేహముంది, సంబంధము కూడా అందరికీ ఉంది, సేవ కూడా అందరికీ ఉంది. కానీ స్నేహములో ఆది నుండి ఇప్పటి వరకు సంకల్పము ద్వారా లేక స్వప్నములో కూడా ఇతర వ్యక్తులు లేక వైభవాల వైపు బుద్ధి ఆకర్షించబడి ఉండరాదు. ఒకే తండ్రిపై ఏకరస ఎడతెగని స్నేహములో సదా ఇమిడి ఉండాలి. సదా స్నేహము యొక్క అనుభవాల సాగరములో ఎలా ఇమిడిపోయి ఉండాలంటే, ఆ ప్రపంచము తప్ప ఇతర వ్యక్తులు లేక వస్తువులు కనిపించరాదు. అనంతమైన స్నేహ ఆకాశములో అనంతమైన అనుభవాల సాగరములా ఉండాలి. ఈ ఆకాశము మరియు సాగరము తప్ప ఏ ఇతర ఆకర్షణ ఉండరాదు. అటువంటి ఎడతెగని స్నేహపు కానుక నంబరువారి విలువ కలిగినదిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని సంవత్సరాల స్నేహము యొక్క విలువ ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటుంది మరియు అంత విలువైన కానుక బాప్దాదా ఎదురుగా ప్రత్యక్షమయ్యింది. అందరిలో మూడు విషయాల విశేషతలను చూశాము.
1. ఎడతెగని స్నేహము :- హృదయపూర్వకమైన స్నేహముందా లేక సమయానుసారంగా, ఆవశ్యకత కారణంగా తమ స్వార్థాన్ని సిద్ధి చేసుకునే కారణంగా ఉందా? అటువంటి స్నేహమైతే లేదు కదా! స్నేహ స్వరూపము సదా ప్రత్యక్ష రూపంలో ఉందా? లేక సమయానికి ప్రత్యక్షమై మిగిలిన సమయంలో గుప్తంగా ఉంటుందా? హృదయాన్ని సంతోషింపజేసే స్నేహముందా లేక గాఢమైన, హృదయపూర్వకమైన స్నేహముందా? కావున స్నేహములో ఈ విషయాలన్నీ చెక్ చేసాము.
2. సంబంధములో :- మొదటి విషయంగా సర్వ సంబంధాలు ఉన్నాయా లేక ఏవైనా విశేష సంబంధాలు ఉన్నాయా? ఒకవేళ ఏ ఒక్క సంబంధము యొక్క అనుభూతి తక్కువగా ఉంటే సంపన్నతలో లోటు ఉంటుంది మరియు ఎప్పటికప్పుడు లోటుగా ఉన్న ఆ సంబంధము తన వైపుకు ఆకర్షిస్తుంది. ఉదాహరణకు, తండ్రి - టీచర్ - సద్గురువు ఈ విశేష సంబంధాలనైతే జోడించారు, కానీ చిన్నవైన మనవల, మునిమనవల సంబంధాలను జోడించకపోతే ఆ సంబంధాలు కూడా తమవైపుకు ఆకర్షిస్తాయి. కావున సర్వ సంబంధాలు ఉన్నాయా అని పరిశీలించుకోవాలి.
మరో విషయము - తండ్రితో ప్రతి సంబంధము100 శాతము ఉందా లేక ఏ సంబంధమైనా100 శాతము ఉంది, ఏదైనా 50 శాతము ఉందా లేక నంబరువారీగా ఉందా? శాతంలో కూడా పూర్తిగా ఉందా లేక కొంచెం కొంచెం అలౌకికంగా, కొంచెం లౌకికంగా రెండిటిలో శాతము పంచబడి ఉందా? మూడవ విషయము - సర్వ సంబంధాల అనుభూతి యొక్క ఆత్మిక రసము సదా అనుభవం చేస్తున్నారా? లేక అవసరమైనప్పుడే అనుభవం చేస్తున్నారా? సదా సర్వ సంబంధాల రసమును తీసుకునేవారా లేక అప్పుడప్పుడు తీసుకునేవారా?
3. సేవలో :- సేవలో విశేషంగా ఏం చెక్ చేసి ఉంటాము? మొదటి విషయం - స్థూల రూపంలో మనసు, వాణి, కర్మలు లేక తనువు, మనసు, ధనము అన్ని రకాల సేవల ఖాతా జమ అయ్యిందా? రెండవ విషయం - తనువు-మనసు-ధనము, మనసు-వాణి-కర్మలు ఈ ఆరు విషయాలలో ఎంత చేయగలరో అంత చేశారా లేక ఎంత చేయగలరో అంత చేయకుండా యథాశక్తి స్థితిని అనుసరించి చేసారా? ఈరోజు స్థితి చాలా బాగుంటే, సేవ శాతము కూడా బాగా ఉండడం, కారణంగా గానీ, అకారణంగా గానీ రేపు బలహీనంగా ఉంటే సేవా శాతము కూడా బలహీనంగా ఉండడం, ఎంత అవ్వాలో అంత అవ్వకపోవడం దీని కారణంగా యథాశక్తిగా నంబర్వార్గా అయిపోయారు. మూడవ విషయం - బాప్దాదా ద్వారా జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, గుణాల ఖజానా, సంతోషాల ఖజానా, శ్రేష్ఠ సమయపు ఖజానా, శుద్ధ సంకల్పాల ఖజానాలు ఏవైతే లభించాయో ఆ ఖజానాలన్నిటి ద్వారా సేవ చేసారా లేక కొన్ని కొన్ని ఖజానాల ద్వారానే సేవ చేసారా? ఒకవేళ ఒక్క ఖజానాతో కూడా సేవ చేయడంలో లోటు ఉంటే లేక విశాల హృదయంతో ఖజానాలను కార్యంలో వినియోగించకుండా కొద్దో గొప్పో అనగా పిసినారిగా చేసినట్లయితే, దీనికి కూడా రిజల్టులో వ్యత్యాసం వచ్చేస్తుంది. నాలుగవ విషయం - హృదయ పూర్వకంగా చేశారా లేక డ్యూటీ అనుసారంగా చేశారా? సేవ సదా ప్రవహిస్తున్న గంగలా ఉందా లేక సేవలో ఒకసారి ప్రవహించడం, ఒకసారి ఆగిపోవడం, మూడ్ ఉంటే సేవ చేసి, మూ లేకపోతే సేవ చేయకపోవడం, అటువంటి నిలిచి ఉండే చెరువులాగా అయితే లేరు కదా!
ఈ విధంగా మూడు విషయాల చెకింగ్ అనుసరించి ప్రతి ఒక్కరి విలువను చెక్ చేసాము. కావున ఆ విధంగా విధి పూర్వకంగా తమను తాము చెక్ చేసుకోండి మరియు ఈ నూతన సంవత్సరములో లోపాలను సదాకాలికంగా సమాప్తం చేసి సంపన్నంగా అయ్యి నెంబర్వన్ విలువైన కానుకను తండ్రి ముందు ఉంచుతామనే దృఢ సంకల్పము చేయండి. చెక్ చేసుకోవడం, ఛేంజ్ చేసుకోవడం వస్తుంది కదా! రిజల్ట్ అనుసారంగా ఇప్పుడు ఏదో ఒక విషయంలో మెజారిటీ యథాశక్తిగా ఉన్నారు. సంపూర్ణ శక్తి స్వరూపంగా లేరు కావున ఇప్పుడు గడిచిన దానిని గతింపజేసి వర్తమానంలో మరియు భవిష్యత్తులో సంపన్నంగా శక్తిశాలిగా అవ్వండి. మీ అందరి వద్ద కూడా కానుకలు పోగయినప్పుడు ఏ ఏ కానుకలు విలువైనవిగా ఉన్నాయని పరిశీలిస్తారు కదా! బాప్దాదా కూడా పిల్లలు ఆడే ఇదే ఆటను ఆడుతున్నారు, కానుకలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్థితి అనుసారంగా చాలా మంచి ఉల్లాస - ఉత్సాహాలు నిండిన సంకల్పాలను, శక్తిశాలి సంకల్పాలను తండ్రి ముందు ఉంచారు. ఇప్పుడు కేవలం యథాశక్తికి బదులు శక్తిశాలిగా ఉండే విధంగా పరివర్తన చేయాలి. అర్థమయ్యిందా! మంచిది.
సదా స్నేహంగా ఉండేవారందరికీ, హృదయపూర్వక స్నేహితులుగా, సర్వ సంబంధాల స్నేహితులుగా ఉన్నవారికి, ఆత్మిక రసము యొక్క అనుభవీ ఆత్మలందరికీ సర్వ ఖజానాల ద్వారా శక్తిశాలి సదా సేవాధారి, అన్ని విషయాలలో యథాశక్తిని సదా శక్తిశాలి స్థితిలోకి పరివర్తన చేసే విశేష స్నేహీ మరియు సమీప సంబంధీకులైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
జానకి దాదితో:- మధువనము యొక్క శోభ మధువనములోకి వచ్చి చేరుకున్నారు. విచ్చేయండి, మంచిది. మీరు బాప్దాదా మరియు మధువనానికి విశేష అలంకారముగా ఉన్నారు. విశేష అలంకారము వలన ఏమవుతుంది? మెరుపు, ప్రకాశము వస్తుంది కదా! కావున బాప్దాదా మరియు మధువనానికి విశేష అలంకారమును చూసి హర్షితమవుతున్నారు. సేవలో విశేషంగా తండ్రి స్నేహము మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేశారు. ఈ విశేష సేవ అందరి హృదయాలను సమీపంగా తీసుకొస్తుంది. రిజల్టు అయితే సదా బాగుంది. అయినా ఎప్పటికప్పుడు దాని రిజల్ట్ ఉంటుంది. కావున తండ్రి స్నేహమును తమ స్నేహీ ముఖము ద్వారా, నయనాల ద్వారా ప్రత్యక్షం చేశారు. వినేవారిగా తయారు చేయడం గొప్ప విశేషమేమీ కాదు కానీ స్నేహితులుగా తయారు చేయడమే గొప్ప సేవ. అది సదా జరుగుతూ ఉంటుంది. ఎన్ని దీపపు పురుగులను చూశారు, దీపముపై బలిహారమవ్వాలన్న కోరికను వ్యక్తపరిచే దీపపు పురుగులను ఎంతమందిని చూసారు? ఇప్పుడిది నయనాల దృష్టితో దీపపు పురుగులను దీపము వైపుకు సైగ చేసే విశేష సమయము. సూచన లభించగానే నడుస్తూ ఉంటారు, ఎగురుతూ చేరుకుంటారు. కావున ఈ విశేష సేవ కూడా అవసరమే. ఈ సేవ చేశారు కూడా. అటువంటి మంచి రిజల్ట్ ఉంది కదా! మంచిది. ప్రతి అడుగులో అనేక ఆత్మల సేవ ఇమిడి ఉంది. ఎన్ని అడుగులు వేశారు? ఎన్ని అడుగులు వేశారో అంతమంది ఆత్మల సేవ జరుగుతుంది. మంచిగా చుట్టి వచ్చారు. వారికి కూడా ఇప్పుడు ఉల్లాస-ఉత్సాహాల సీజన్. ఏమి జరుగుతుందో అది మంచి కంటే మంచిగా జరుగుతుంది. బాప్దాదా అల్లారుముద్దు పిల్లల ప్రతి కర్మ రేఖ ద్వారా అనేకమంది భాగ్యరేఖలు మారిపోతాయి. కావున ప్రతి కర్మ యొక్క రేఖ ద్వారా అనేకమంది భాగ్య రేఖలను గీసారు. నడవడం అనగా భాగ్యమును గీయడం. కావున ఎక్కడెక్కడికి వెళ్తారో తమ కర్మల కలము ద్వారా అనేకమంది భాగ్యరేఖను గీసే సేవకు నిమిత్తంగా అయ్యారు. కావున ఇప్పుడు మిగిలిన అంతిమ మాట - వీరే, వీరే, వీరే. ఎవరినైతే వెతుకుతూ ఉన్నామో వారు వీరే అని అనాలి. ఇప్పుడు వీరా లేక వారా అని ఆలోచిస్తున్నారు. కానీ ‘కేవలం వీరే’ అనే ఒకే మాట వెలువడాలి. ఇప్పుడు ఆ సమయము సమీపంగా వస్తుంది. భాగ్యరేఖ పెరుగుతూ పెరుగుతూ బుద్ధి తాళము ఏదైతే కొద్దిగా మిగిలి ఉందో అది కూడా తెరుచుకుంటుంది. తాళం చెవినైతే పెట్టారు, తిప్పారు కూడా, తెరుచుకుంది కానీ ఇప్పుడు కొద్దిగా ఇరుక్కుని ఉంది. అది కూడా తెరిచే రోజు వచ్చేస్తుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
