"సర్వ శ్రేష్ఠ సితార - సఫలత సితార"
పిల్లలందరినీ సంతోషపెట్టే, జ్ఞాన సూర్యుడు – జ్ఞాన చంద్రుడు అయిన బాప్దాదా తమ లక్కీ మరియు లవ్లీ జ్ఞాన సితారలతో ఇలా మాట్లాడారు -
ఈరోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ అలౌకిక తారామండలమును చూస్తున్నారు. ఇది అలౌకిక విచిత్ర తారామండలము, దీని విశేషత కేవలము బాబా మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు. ప్రతి ఒక్క సితార తన మెరుపు ద్వారా ఈ విశ్వానికి వెలుగునిస్తుంది. బాప్దాదా ప్రతి ఒక్క సితార యొక్క విశేషతను చూస్తున్నారు. కొన్ని శ్రేష్ఠ భాగ్యశాలి, అదృష్ట సితారలు, కొన్ని బాబాకు సమీపంగా ఉన్న సితారలు మరియు కొన్ని దూరంగా ఉన్న సితారలు. అందరూ సితారలే కానీ విశేషత రకరకాలుగా ఉన్న కారణంగా సేవలో మరియు స్వ ప్రాప్తిలో వేరు వేరు ఫలము యొక్క ప్రాప్తిని అనుభవము చేసేవారు. కొందరు ఎల్లప్పుడూ సహజ సితారలు, కనుక సహజ ప్రాప్తి యొక్క ఫలమును అనుభవము చేసేవారు. కొందరు కష్టపడే సితారలు, తక్కువ కష్టమైనా, ఎక్కువ కష్టమైనాగానీ చాలా వరకు కష్టపడిన తరువాతనే ఫలము యొక్క ప్రాప్తిని అనుభవము చేస్తారు. సఫలత జన్మ సిద్ధ అధికారము అని కొందరు సదా కర్మకు ముందే అధికారమును అనుభవము చేస్తారు, కనుక ‘నిశ్చయము’ మరియు ‘నషా’లతో కర్మ చేసిన కారణంగా కర్మ యొక్క సఫలతను సహజంగా అనుభవము చేస్తారు. వీరినే సఫలత సితారలు అని అంటాము.
సఫలత సితారలు అందరికంటే శ్రేష్ఠమైనవారు ఎందుకంటే వారు సదా జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునికి సమీపంగా ఉంటారు, కనుక శక్తిశాలురు కూడా మరియు సఫలతకు అధికారులు కూడా. కొందరు శక్తిశాలురుగా ఉంటారు కానీ సదా శక్తిశాలురుగా ఉండరు, కనుక ఎల్లప్పుడు ఒకేరకంగా మెరుపు ఉండదు. వెరైటీ సితారల ఆకర్షణ చాలా ప్రియంగా అనిపిస్తుంది. సితారలందరూ సేవ చేస్తారు కానీ సమీప సితారలు ఇతరులను కూడా సూర్యుడు, చంద్రునికి సమీపంగా తీసుకువచ్చే సేవాధారులుగా అవుతారు. కనుక, నేను ఎటువంటి సితారను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి - లవ్లీ సితారలా, లక్కీ సితారలా, సదా శక్తిశాలురా, కష్టాన్ని అనుభవము చేసేవారా లేక సదా సహజ సఫలతా సితారలా? జ్ఞాన సూర్యుడైన బాబా సితారలందరికీ అనంతమైన ప్రకాశాన్ని మరియు శక్తిని ఇస్తారు కానీ సమీపంగా మరియు దూరంగా ఉన్న కారణంగా తేడా వచ్చేస్తుంది. ఎంతటి సమీప సంబంధమో, అంతటి ప్రకాశము మరియు శక్తి విశేషంగా ఉంటాయి ఎందుకంటే సమీప సితారల లక్ష్యమే సమానంగా అవ్వటము.
కనుక బాప్దాదా సితారలందరికీ సదా ఈ సూచనను ఇస్తారు - అందరూ అయితే లక్కీ మరియు లవ్లీ(అదృష్టవంతులుగా, ప్రియమైనవారు)గా అయితే అయ్యారు, ఇప్పుడు సదా సమీపంగా ఉండే, సహజ సఫలతను అనుభవము చేసే సఫలతా సితారలుగా ఎంతవరకు అయ్యాము అని ఈ విషయంలో ముందు మిమ్మల్ని చూసుకోండి. ఇప్పుడు పడిపోయే తారలైతే కారు మరియు తోకచుక్కలు కూడా కారు. ఎవరైతే పదే పదే స్వయముతో లేక బాబాతో లేక నిమిత్తంగా అయిన ఆత్మలతో ‘ఇదెందుకు’, ‘ఇదేమిటి’, ‘ఇదెలా’ అని ప్రశ్నిస్తూనే ఉంటారు, పదే-పదే ప్రశ్నించేవారే పూఛ్ వాలే (తోక కల) సితారలు. అలాంటివారైతే కారు కదా? ఎవరి ప్రతి కర్మలో సఫలత ఇమిడి ఉంటుందో వారే సఫలతా సితారలు. ఇటువంటి సితారలు ఎల్లప్పుడు బాబాకు సమీపంగా అనగా తోడుగా ఉంటారు. విశేషతలను విన్నారు, ఇప్పుడు ఈ విశేషతలను స్వయములో ధారణ చేసి సదా సఫలతా సితారలుగా అవ్వండి. ఎలా అవ్వాలో అర్థమైందా? లక్కీ మరియు లవ్లీలతోపాటు సఫలత - ఈ శ్రేష్ఠతను సదా అనుభవము చేస్తూ ఉండండి. అచ్ఛా!
ఈరోజు అందరినీ కలుస్తాము. బాప్దాదా ఈరోజు విశేషంగా అందరితో కలవటానికే వచ్చారు. కలవాలి అన్న లక్ష్యమే అందరికీ ఉంటుంది. పిల్లల ఉత్సాహాన్ని చూసిన బాబాకు పిల్లలందరినీ సంతోషపరచవలసి ఉంటుంది ఎందుకంటే పిల్లల సంతోషములో బాబా సంతోషము ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలో ఉంటున్న అల- వ్యక్తిగతంగా కలవటము. కనుక సాగరుడు కూడా ఆ అలలోకి రావలసి ఉంటుంది. ఈ సీజన్ యొక్క అల ఇది, కనుక రథానికి కూడా విశేష సకాష్ను ఇచ్చి నడిపిస్తున్నాము. అచ్ఛా!
నలువైపుల ఉన్న అలౌకిక తారామండలములోని అలౌకిక సితారలకు, సదా విశ్వానికి వెలుగును ఇచ్చి అంధకారమును తొలగించే మెరుస్తున్న సితారలకు, సదా బాబాకు సమీపంగా ఉండే శ్రేష్ఠ సఫలతా సితారలకు, అనేక ఆత్మల భాగ్యరేఖను పరివర్తన చేసే భాగ్యవంతులైన సితారలకు, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అయిన బాప్దాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము సమయంలో వరదాన రూపంలో ఉచ్ఛరించబడ్డ అమూల్యమైన మహావాక్యాలు
1. ‘సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇచ్చే సుఖదాత అయిన బాబా పిల్లలము’ - ఇలా అనుభవము చేస్తున్నారా? అందరికీ సుఖాన్ని ఇచ్చే విశేషత ఉంది కదా. డ్రామా అనుసారంగా ఈ విశేషత లభించి ఉంది. ఈ విశేషత అందరికీ ఉండదు. ఎవరైతే అందరికీ సుఖాన్ని ఇస్తారో, వారికి అందరినుండి ఆశీర్వాదాలు లభిస్తాయి కనుక స్వయమును కూడా సదా సుఖంగా అనుభవము చేస్తారు. ఈ విశేషత ద్వారా వర్తమానము కూడా మంచిగా ఉంటుంది మరియు భవిష్యత్తు కూడా మంచిగా అయిపోతుంది. ఎంతటి మంచి పాత్ర, అందరి ప్రేమ కూడా లభిస్తుంది, అందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ‘ఒకటి ఇచ్చి వెయ్యిని పొందటము’ అని దీనిని అంటాము. సేవ ద్వారా సుఖాన్ని ఇస్తారు, కనుక అందరి ప్రేమ లభిస్తుంది. ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోవాలి.
2. ‘సదా స్వయమును సర్వ శక్తిమంతుడైన బాబా యొక్క శక్తిశాలీ ఆత్మను - ఇలా అనుభవము చేస్తున్నారా? శక్తిశాలీ ఆత్మ సదా స్వయము కూడా సంతుష్టంగా ఉంటుంది మరియు ఇతరులను కూడా సంతోషపరుస్తుంది. అటువంటి శక్తిశాలురేనా? సంతుష్టతయే మహానత. శక్తిశాలి ఆత్మ అనగా సంతుష్టతా ఖజానాతో నిండుగా ఉన్న ఆత్మ. ఈ స్మృతితో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఈ ఖజానాయే అందరినీ నిండుగా చేసేటువంటిది.
3. ‘బాబా మొత్తము విశ్వము నుండి మమ్మల్ని ఎన్నుకుని తమవారిగా చేసుకున్నారు’ - ఈ సంతోషము ఉంటుంది కదా. ఇంతమంది అనేక ఆత్మల నుండి నన్నే బాబా ఎన్నుకున్నారు - ఈ స్మృతి ఎంతటి సంతోషాన్ని కలిగిస్తుంది! ఈ సంతోషముతో ముందుకు వెళ్తూ ఉండండి. బాబా నన్ను తమవారిగా చేసుకున్నారు ఎందుకంటే నేనే కల్పపూర్వపు భాగ్యశాలి ఆత్మగా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను మరియు మరల కూడా అవుతాను - ఇటువంటి భాగ్యశాలి ఆత్మను అన్న ఈ స్మృతి ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉండండి.
4. ‘సదా నిశ్చింతగా అయ్యి సేవ చేసే బలము ముందుకు తీసుకు వెళ్తూ ఉంటుంది’. వీరు చేసారు లేక మేము చేసాము - ఇటువంటి సంకల్పాల నుండి నిశ్చింతగా ఉండటం వలన నిశ్చింతగా సేవ జరుగుతుంది మరియు ఆ సేవా బలము సదా ముందుకు తీసుకు వెళ్తుంది. మరి నిశ్చింత సేవాధారులే కదా? లెక్క పెట్టుకుని సేవ చేసేవారు కాదు. దీనినే నిశ్చింత సేవ అని అంటాము. కనుక ఎవరైతే నిశ్చింతులై సేవ చేస్తారో, వారికి నిశ్చితంగా ముందుకు వెళ్తున్నామన్న అనుభూతి సహజంగా అవుతుంది. ఈ విశేషత వరదానము రూపంలో ముందుకు తీసుకు వెళ్తూ ఉంటుంది.
5. అనేక ఆత్మలను బాబా స్నేహితులుగా తయారు చేసేందుకు సేవ కూడా సాధనంగా అయింది. చూడటానికి కర్మణా సేవే అయినాగానీ కర్మణా సేవ నోటి ద్వారా చేసే సేవ కంటే కూడా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. కర్మణా సేవ ద్వారా ఎవరి మనసునైనా పరివర్తన చేసే సేవ, కనుక ఆ సేవ యొక్క ఫలముగా ‘విశేష సంతోషము’ ప్రాప్తిస్తుంది. కర్మణా సేవ చూడటానికి స్థూలమైనదిగా అనిపిస్తుంది కానీ సూక్ష్మ వృత్తులను(ఆలోచనలను) పరివర్తన చేసేదిగా ఉంటుంది. మరి, అటువంటి సేవకు మేము నిమిత్తులము అన్న సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. భాషణ చేసేవారు భాషణ చేస్తారు కానీ కర్మణా సేవ కూడా భాషణ చేసేవారి సేవ కంటే కూడా ఎక్కువైనది ఎందుకంటే వీరికి ప్రత్యక్ష ఫలము అనుభవమవుతుంది.
6. ‘సదా పుణ్య ఖాతాను జమ చేసుకునే శ్రేష్ఠ ఆత్మను’ - ఇలా అనుభవమవుతుందా? ఈ సేవ పేరుకే సేవ కానీ ఇది పుణ్య ఖాతాను జమ చేసుకునేందుకు సాధనము. కనుక పుణ్య ఖాతా సదా నిండుగా ఉంది మరియు ఇక ముందు కూడా నిండుగా ఉంటుంది. ఎంత సేవ చేస్తే అంతగా పుణ్య ఖాతా పెరుగుతుంటుంది. మరి పుణ్య ఖాతా అవినాశిగా అయింది. ఈ పుణ్యము అనేక జన్మలు నిండుగా చేసేటువంటిది. కనుక, మీరు పుణ్య ఆత్మలు మరియు ఎల్లప్పుడు పుణ్యాత్మగా అయ్యి ఇతరులకు కూడా పుణ్యమునకు దారిని చూపించేవారు. ఈ పుణ్య ఖాతా అనేక జన్మలు తోడుగా ఉంటుంది, అనేక జన్మలు చాలా సంపన్నులుగా ఉంటారు. ఈ సంతోషములో సదా ముందుకు వెళ్తూ ఉండండి.
7. ‘సదా ఒక్క బాబా స్మృతిలో ఉండే, ఏకరస స్థితిని అనుభవము చేసుకునే శ్రేష్ఠ ఆత్మను’ - ఇలా అనుభవము చేస్తున్నారా? ఎక్కడైతే ఒక్క బాబా స్మృతియే ఉంటుందో, అక్కడ ఏకరస స్థితి స్వతహాగనే సహజ అనుభవంగా ఉంటుంది. ఏకరస స్థితి శ్రేష్ఠ స్థితి. ఏకరస స్థితిని అనుభవము చేసుకునే శ్రేష్ఠ ఆత్మను - ఈ స్మృతి ఎల్లప్పుడు ముందుకు తీసుకు వెళ్తూ ఉంటుంది. ఈ స్థితి ద్వారా అనేక శక్తుల అనుభూతి కలుగుతుంటుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
