‘‘ఆత్మిక రాయల్టీతో సంపన్నంగా ఉండే ఆత్మల గుర్తులు’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ ఆత్మిక రాయల్ పరివారాన్ని చూస్తున్నారు. ఆత్మలైన మీరే మొత్తం కల్పంలో అందరికన్నా రాయల్. ఆ మాటకొస్తే హద్దులోని రాజ్యాధికారి రాయల్ పరివారానికి చాలా మహిమ ఉంది. కానీ ఆత్మిక రాయల్ పరివారమని కేవలం మీకు మాత్రమే మహిమ ఉంది. రాయల్ పరివారానికి చెందిన ఆత్మలైన మీరు ఆది కాలంలో కూడా, మరియు అనాది కాలంలో కూడా, మరియు వర్తమాన సంగమయుగంలో కూడా ఆత్మిక రాయల్టీ కలిగినవారు. అనాది కాలంలో మధురమైన ఇంట్లో కూడా విశేష ఆత్మలైన మీ ఆత్మికత యొక్క ప్రకాశము, మెరుపు సర్వాత్మల కన్నా శ్రేష్ఠమైనది. ఆత్మలన్నీ మెరిసే జ్యోతి స్వరూపాలే, కానీ మీ ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు అలౌకికమైనది. ఏ విధంగానైతే సాకార ప్రపంచంలో ఆకాశం మధ్యలో నక్షత్రాలన్నీ మెరుస్తూ కనిపిస్తాయి కానీ విశేషంగా మెరిసే నక్షత్రాలు స్వతహాగానే తమ వైపుకు ఆకర్షిస్తాయి, అన్నీ ప్రకాశవంతంగా ఉన్నా కానీ వాటి ప్రకాశం విశేషంగా మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే అనాది కాలంలో పరంధామంలో కూడా ఆత్మిక నక్షత్రాలైన మీ ప్రకాశము అనగా ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు విశేషంగా అనుభవమవుతుంది. అదే విధంగా ఆది కాలంలో సత్యయుగంలో అనగా స్వర్గంలో ఆత్మలైన మీరు విశ్వ మహారాజుల యొక్క రాయల్ పరివారానికి అధికారులుగా అవుతారు. ప్రతి రాజుకు రాయల్ పరివారం ఉంటుంది.
కానీ ఆత్మలైన మీ రాయల్ పరివారం యొక్క రాయల్టీ మరియు దేవాత్మల రాయల్టీ మొత్తం కల్పంలో ఏ ఇతర రాయల్ పరివారానికి ఉండదు. ఇంత శ్రేష్ఠమైన రాయల్టీని చైతన్య స్వరూపంలో ప్రాప్తి చేసుకున్నారు కనుక మీ జడ చిత్రాలకు కూడా ఎంతో రాయల్టీతో పూజ జరుగుతుంది. మొత్తం కల్పంలో రాయల్టీ యొక్క విధి ప్రమాణంగా ఏ ఇతర ధర్మపితలకు, ధర్మాత్మలకు లేక మహాత్ములకు ఇటువంటి పూజ జరగదు. కనుక ఆలోచించండి - జడ చిత్రాలకే అంత రాయల్టీతో పూజ జరుగుతున్నపుడు చైతన్యంలో ఎంతగా రాయల్ పరివారానికి చెందినవారిగా అవుతారు! మరి ఇంత రాయల్‌గా ఉన్నారా? లేక అలా అవుతూ ఉన్నారా? ఇప్పుడు సంగమంలో కూడా ఆత్మిక రాయల్టీ కలవారిగా అనగా ఫరిశ్తా స్వరూపంగా అవుతారు, ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక రాయల్ పరివారం వారిగా అవుతారు. కనుక అనాది కాలం, ఆది కాలం మరియు సంగమయుగ కాలం - మూడు కాలాలలో నంబర్‌వన్ రాయల్‌గా అవుతారు. మేము మూడు కాలాలలోనూ ఆత్మిక రాయల్టీ కల ఆత్మలము అన్న నషా ఉంటుందా?
ఈ ఆత్మిక రాయల్టీ యొక్క పునాది ఏమిటి? సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రతయే రాయల్టీ. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపు నా రూపం ద్వారా అందరికీ అనుభవమవుతుందా? ఆత్మిక రాయల్టీ యొక్క నషా ప్రతి చరిత్ర ద్వారా అనుభవమవుతుందా? లౌకిక ప్రపంచంలో కూడా వారెవరో తెలియకపోయినా సరే, అల్పకాలిక రాయల్టీ అనేది వారి ముఖము ద్వారా, నడవడిక ద్వారా అనుభవమవుతుంది. అలాగే ఆత్మిక రాయల్టీ కూడా గుప్తంగా ఉండదు, అది కూడా కనిపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ జ్ఞానమనే దర్పణంలో స్వయాన్ని చూసుకోండి - నా ముఖంలో, నడవడికలో రాయల్టీ కనిపిస్తుందా లేక సాధారణ ముఖము, సాధారణ నడవడిక కనిపిస్తుందా? ఎలాగైతే సత్యమైన వజ్రము తన మెరుపు వలన ఎక్కడా దాగి ఉండలేదో, అలా ఆత్మిక మెరుపు కలవారు, ఆత్మిక రాయల్టీ కలవారు దాగి ఉండలేరు.
కొంత మంది పిల్లలు స్వయాన్ని సంతోషపర్చుకునేందుకు ఎలా ఆలోచిస్తారు మరియు మాట్లాడుతారంటే - ‘‘మేము గుప్త ఆత్మలము, అందుకే మమ్మల్ని ఎవరూ గుర్తించరు, సమయం వచ్చినప్పుడు దానంతట అదే తెలుస్తుంది.’’ గుప్త పురుషార్థము చాలా మంచి విషయమే కానీ గుప్త పురుషార్థుల మెరుపు మరియు నషా లేక ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశం ఇతరులకు తప్పకుండా అనుభవం చేయిస్తుంది. తమను తాము ఎంత గుప్తంగా ఉంచుకున్నా కానీ, వారి మాటలు, వారి సంబంధ-సంపర్కాలు, ఆత్మిక వ్యవహారం యొక్క ప్రభావం వారిని ప్రత్యక్షం చేస్తుంది. దీనినే ప్రపంచంలోని వారు సాధారణ భాషలో మాటలు మరియు నడవడిక అని అంటారు. కనుక స్వయము స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోకుండా, గుప్తంగా ఉంచుకోవడము - ఇది నిర్మానత యొక్క విశేషత. కానీ ఇతరులు వారి మాటలు, నడవడిక ద్వారా తప్పకుండా అనుభవం చేస్తారు. వీరు గుప్త పురుషార్థులు అని ఇతరులు చెప్పాలి. ఒకవేళ నేను గుప్త పురుషార్థిని అని మీరు స్వయం గురించి చెప్పుకుంటే అది గుప్తంగా ఉంచినట్లా లేక ప్రత్యక్షం చేసినట్లా? గుప్తము అని అంటున్నారు కానీ ‘నేను గుప్త పురుషార్థిని’ అని మాటలలో చెప్తున్నారు! ఇది గుప్తము అయినట్లా? చాలా మంది ఉత్తరాలలో కూడా - గుప్త పురుషార్థులైన మా గురించి నిమిత్తంగా ఉన్న దాదీలకు తెలియదు అని రాస్తారు. అంతేకాక ఇకముందు మేము ఏం చేస్తామో, ఏం జరుగుతుందో చూడండి అని కూడా రాస్తారు, మరి ఇది గుప్తంగా ఉన్నట్లా లేక ప్రత్యక్షం చేసినట్లా? గుప్త పురుషార్థులు స్వయాన్ని గుప్తంగా ఉంచుకోవడం చాలా మంచి విషయము. కానీ మీరు వర్ణన చేయకండి, ఇతరులు మీ గురించి చెప్పాలి. ఎవరైతే స్వయం గురించి స్వయమే చెప్పుకుంటారో వారినేమంటారు? (మియా మిట్టూ - అన్నీ తెలుసునని భావించేవారు) మరి అన్నీ తెలుసని భావించేవారిగా అవ్వడము చాలా సులభం కదా!
కనుక ఏం విన్నారు? ఆత్మిక రాయల్టీ. రాయల్ ఆత్మలు ఒకటేమో సదా నిండుగా, సంపన్నంగా ఉంటారు మరియు సంపన్నతకు గుర్తు - వారు సదా తృప్త ఆత్మలుగా ఉంటారు. తృప్త ఆత్మ ప్రతి పరిస్థితిలో, ప్రతి ఆత్మ యొక్క సంబంధ-సంపర్కంలోకి వస్తూ, అన్నీ తెలిసి కూడా సంతుష్టంగా ఉంటారు. ఎవరు ఎంత అసంతుష్టంగా చేసే పరిస్థితులను వారి ఎదురుగా తీసుకొచ్చినా కానీ సంపన్న, తృప్త ఆత్మ అసంతుష్టంగా చేసేవారికి కూడా సంతుష్టతా గుణాన్ని సహయోగం రూపంలో ఇస్తారు. అటువంటి ఆత్మ పట్ల కూడా దయా హృదయులుగా అయి శుభ భావన మరియు శుభ కామనల ద్వారా వారిని కూడా పరివర్తన చేసే ప్రయత్నం చేస్తారు. ఆత్మిక రాయల్ ఆత్మల యొక్క శ్రేష్ఠ కర్మ ఇదే. ఏ విధంగానైతే స్థూలంగా కూడా రాయల్ ఆత్మలు ఎప్పుడూ చిన్న-చిన్న విషయాలలో, చిన్న-చిన్న వస్తువులలో తమ బుద్ధిని లేక సమయాన్ని వెచ్చించరు, చూస్తూ కూడా చూడరు, వింటూ కూడా వినరు, అదే విధంగా ఆత్మిక రాయల్ ఆత్మలు ఇతర ఆత్మల చిన్న-చిన్న విషయాలలో ఏవైతే రాయల్‌గా లేవో, వాటిలో తమ బుద్ధిని లేక సమయాన్ని వెచ్చించరు. రాయల్టీ అనగా ఎలాంటి తేలికపాటి విషయంపైకి దృష్టి వెళ్ళదు అని ప్రపంచంలోని వారు కూడా అంటారు. ఆత్మిక రాయల్ ఆత్మల నోటి ద్వారా ఎప్పుడూ వ్యర్థమైన లేక సాధారణమైన మాటలు వెలువడవు, ప్రతి మాట యుక్తియుక్తంగా ఉంటుంది. యుక్తియుక్తము అనగా వ్యర్థ భావము నుండి అతీతంగా అవ్యక్త భావము, అవ్యక్త భావన. దీనినే రాయల్టీ అని అంటాము.
ఈ సమయంలోని రాయల్టీ భవిష్యత్తులో రాయల్ పరివారంలోకి వచ్చేందుకు అధికారిగా చేస్తుంది. కనుక వృత్తి రాయల్‌గా ఉందా అని చెక్ చేసుకోండి. వృత్తి రాయల్‌గా ఉండడం అనగా సదా శుభ భావన, శుభ కామనల వృత్తితో ప్రతి ఆత్మతో వ్యవహారంలోకి రావాలి. రాయల్ దృష్టి అనగా సదా ఫరిశ్తా రూపంలో ఉంటూ ఇతరులను కూడా ఫరిశ్తా రూపంలో చూడాలి. రాయల్ కృతి అనగా కర్మలో సదా సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి - ఈ శ్రేష్ఠ కర్మ ప్రమాణంగా సంపర్కంలోకి రావాలి. ఈ విధంగా రాయల్‌గా తయారయ్యారా? లేక తయారవ్వాలా? బ్రహ్మా బాబా యొక్క మాట, ముఖము మరియు నడవడికలోని రాయల్టీని చూసారు. అలా బ్రహ్మా బాబాను ఫాలో చేయండి. సాకారుడిని ఫాలో చేయడం సులభమే కదా! బ్రహ్మాను ఫాలో చేసారంటే శివబాబాను ఫాలో చేసినట్లే. ఒక్కరినైతే ఫాలో చేయగలరు కదా. తండ్రి సమానంగా అయ్యే పాయింట్లనైతే ప్రతిరోజూ వింటారు! వినడం అనగా ఫాలో చేయడము. కాపీ చేయడం సులభమే కదా లేక కాపీ చేయడం కూడా రాదా?
బాప్‌దాదా ఈరోజు చిరునవ్వు నవ్వుతున్నారు – మధుబన్కు వచ్చినప్పుడు విశేషంగా గురువారం రోజున ఏం చేస్తారు? ఒకటేమో భోగ్ పెడతారు. ఇంకా కేవలం మధుబన్‌లో మాత్రమే చేసేదేమిటి? జీవిస్తూ మరణించే భోగ్ పెట్టిస్తారు. మీరందరూ జీవిస్తూ మరణించే భోగ్ పెట్టించారా? బాప్‌దాదా చిరునవ్వు నవ్వుతున్నారు - జీవిస్తూ మరణించడం అన్నది జరుపుకోవడము సులభమే, స్టేజీపై కూర్చున్నారు, తిలకం దిద్దుకున్నారు, మరణించారు! కానీ జీవిస్తూ మరణించడం అనగా పాత సంస్కారాల నుండి మరణించడము. పాత సంస్కారాలు, పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి మరణించడము, జీవిస్తూ మరణించడం అంటే ఇదే. భోగ్ పెట్టించారు. భండారీలో జమ చేసారు మరియు జీవిస్తూ మరణించడం అయిపోయింది - ఇలా చేయడం చాలా సులభము. కానీ మరణించారా? బాప్‌దాదా ఏమి ఆలోచిస్తున్నారంటే - పాత ప్రపంచము, పాత సంస్కారాలు - వీటి నుండి సదా కోసం సంకల్పం మరియు స్వప్నంలో కూడా మరణించడాన్ని జరుపుకోవాలి, ఈ విధంగా జీవిస్తూ మరణించడాన్ని ఎవరు మరియు ఎప్పుడు జరుపుకుంటారు? ఒకవేళ స్టేజిపై కూర్చోబెడితే అందరికందరూ కూర్చుండిపోతారు. స్టేజిపై కూర్చోవడము అనేదైతే సాధారణమైన విషయము. కానీ బుద్ధిని కూర్చోబెట్టాలి, దీనిని యథార్థంగా జీవిస్తూ మరణించడాన్ని జరుపుకోవడము అని అంటారు. మరణించారంటే, మరణించడము అనగా పరివర్తన అవ్వడము. మరి ఈ విధంగా జీవిస్తూ మరణించడం కోసం ఎంతమంది తయారుగా ఉన్నారు? లేక సెంటరుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, కావాలనుకోలేదు కానీ జరిగిపోయింది అని అంటారా? ఇక్కడైతే జీవిస్తూ మరణించడాన్ని జరుపుకుని వెళ్తారు, మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా విషయం ఎదురుగా వస్తే మళ్ళీ జీవిస్తారు. ఇలా చేయకండి.
స్మృతిచిహ్నంలో కూడా ఎలా చూపిస్తారంటే, రావణుడి ఒక తలను అంతం చేస్తే మరొకటి వచ్చేది. ఇక్కడ కూడా ఒక విషయం పూర్తయితే మరొకటి ఉత్పన్నమవుతుంది, అప్పుడు ఏమనుకుంటారంటే - మేమైతే రావణుడిని అంతం చేసేసాము, మళ్ళీ ఇది ఎక్కడి నుండి వచ్చింది? కానీ ముఖ్యమైన పునాదిని సమాప్తం చేయని కారణంగా ఒక రూపం మారి మరొక రూపంలో వస్తుంది. పునాదినే సమాప్తం చేస్తే మాయ తన రూపాన్ని మార్చుకుని దాడి చేయదు, సదా కోసం వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఎలా తయారవ్వాలో అర్థమయిందా? ఆత్మిక రాయల్టీ కలవారిగా అవ్వాలి. ప్రతి కర్మ ఆత్మిక రాయల్ పరివారం అనుసారంగా ఉందా అని సదా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే 99 శాతం మాటలు, కర్మలు మరియు సంకల్పాలు రాయల్టీ కలవిగా ఉంటాయో, అప్పుడే భవిష్యత్తులో కూడా రాయల్ పరివారంలో వస్తారు. మేమైతే తప్పకుండా వస్తాము అని అనుకోకండి. సరే, సంపన్నంగా అవ్వకపోయినా ఒక శాతం ఫ్రీగా ఇస్తాను. కానీ 99 శాతం రాయల్టీ కల సంస్కారాలు, మాటలు మరియు సంకల్పాలు న్యాచురల్‌గా ఉండాలి. పదే-పదే యుద్ధం చేయాల్సిన అవసరం రాకూడదు, సహజ సంస్కారంగా అయిపోవాలి. అచ్ఛా!
నలువైపులా ఉన్న ఆత్మిక రాయల్టీ కల రాయల్ ఆత్మలకు, సదా పవిత్రత ద్వారా రాయల్టీని అనుభవం చేయించే ఆత్మలకు, సదా ఫరిశ్తా స్వరూప సంస్కారాలను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే ఆత్మలకు, సదా బ్రహ్మా బాబాను ఫాలో చేసే ఆత్మలకు, సదా శ్రేష్ఠ బ్రాహ్మణ ప్రపంచంలో బ్రాహ్మణ సంస్కారాలను అనుభవం చేసే ఆత్మిక రాయల్ పరివారానికి బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1:- సేవలో బిజీగా ఉన్నట్లయితే సహజంగా మాయాజీతులుగా అవుతారు
సదా మీ శక్తిశాలి వృత్తితో వాయుమండలాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలు కదా! ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన కర్తవ్యమేమిటి? తమ వృత్తి ద్వారా, వాణి ద్వారా మరియు కర్మల ద్వారా విశ్వ-పరివర్తన చేయడము. మరి అందరూ ఇలాంటి సేవ చేస్తున్నారా? లేక సమయం లభించడం లేదా? వాచ సేవ కోసం సమయం లేకపోయినా కానీ, వృత్తి ద్వారా, మనసా సేవ ద్వారా పరివర్తన చేసేందుకు సమయమైతే ఉంది కదా. సేవాధారి ఆత్మలు సేవ లేకుండా ఉండలేరు. బ్రాహ్మణ జన్మ ఉన్నదే సేవ కోసము. మరియు ఎంతగా సేవలో బిజీ ఉంటారో, అంత సహజంగా మాయాజీతులుగా అవుతారు. కనుక సేవ యొక్క ఫలం కూడా లభిస్తుంది మరియు సహజంగా మాయాజీతులుగా కూడా అవుతారు, కావున డబల్ లాభం ఉంది కదా. ఏ మాత్రం బుద్ధికి తీరిక లభించినా సేవలో నిమగ్నమవ్వండి. ఆ మాటకొస్తే పంజాబ్-హర్యానాలో సేవా భావము ఎక్కువగా ఉంది. గురుద్వారాలకు వెళ్ళి సేవ చేస్తారు కదా. అది స్థూలమైన సేవ మరియు ఇది ఆత్మిక సేవ. సేవ చేయకుండా సమయాన్ని పోగొట్టుకోకూడదు. నిరంతర యోగులుగా, నిరంతర సేవాధారులుగా అవ్వండి - సంకల్పాల ద్వారానైనా చేయండి, వాణి ద్వారానైనా చేయండి, కర్మల ద్వారానైనా చేయండి. మీ సంపర్కం ద్వారా కూడా సేవ చేయవచ్చు. సరే, మనసా సేవ చేయడం రాకపోతే మీ సంపర్కం ద్వారా, మీ నడవడిక ద్వారా కూడా సేవ చేయవచ్చు. ఇదైతే సహజమే కదా. కావున, సదా సేవాధారులుగా ఉన్నామా లేక అప్పుడప్పుడు సేవాధారులుగా ఉన్నామా అని చెక్ చేసుకోండి. ఒకవేళ అప్పుడప్పుడు సేవాధారులుగా ఉంటే రాజ్య భాగ్యము కూడా అప్పుడప్పుడే లభిస్తుంది. ఈ సమయంలోని సేవ భవిష్య ప్రాప్తికి ఆధారము. సేవ చేయాలనే కోరిక ఉంది కానీ సమయం లేదు అని ఎప్పుడూ ఎవ్వరూ ఈ సాకులు చెప్పలేరు. కొందరు శరీరం నడవదు, కాళ్ళు పని చేయవు, ఏం చేయాలి అని అంటారు. కొందరు నడుము పని చేయడం లేదని అంటారు, కొందరు కాళ్ళు పని చేయడం లేదని అంటారు. కానీ బుద్ధి అయితే నడుస్తుంది కదా! కావున బుద్ధి ద్వారా సేవ చేయండి. విశ్రాంతిగా మంచముపై కూర్చుని సేవ చేయండి. ఒకవేళ నడుము బాగోలేకపోతే మంచంపై పడుకోండి కానీ సేవలో బిజీగా ఉండండి.
బిజీగా ఉండడమే సహజ పురుషార్థము. శ్రమ చేయాల్సిన అవసరముండదు. పదే-పదే మాయ వస్తూ ఉంటే, మీరు దానిని పారద్రోలుతూ ఉంటే శ్రమ అవుతుంది, యుద్ధం జరుగుతుంది. బిజీగా ఉండేవారు యుద్ధం నుండి విముక్తులవుతారు. బిజీగా ఉంటే మాయకు వచ్చేందుకు ధైర్యముండదు మరియు మీరు ఎంతగా స్వయాన్ని బిజీగా ఉంచుకుంటారో అంతగానే మీ వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తనవుతూ ఉంటుంది. ఏం చేయాలి, వాయుమండలం చెడుగా ఉంది అని బ్రాహ్మణాత్మలెవ్వరూ ఆలోచించకూడదు. చెడుగా ఉంది కావుననే పరివర్తన చేస్తారు కదా. చెడుగానే లేకపోతే ఏం చేస్తారు? మంచిగా ఉన్నదానిని ఏమైనా మారుస్తారా? చెడును మంచిగా చేయడమే విశ్వపరివర్తకుల పని. కనుక చెడుగానే ఉంటుంది. చెడును మంచిగా చేసేవారు మీరే! విశ్వ పరివర్తన యొక్క కార్యాన్ని చేసారు కనుకనే ఇప్పటివరకు మీకు మహిమ ఉంది. శక్తుల గాయనంలో మీకు ఎంత మహిమ చేస్తారు! మీ మహిమ వింటుంటే సంతోషంగా ఉంటుంది కదా! అచ్ఛా.
పాండవుల మహిమ కూడా ఉంది. లక్ష్మితో పాటు గణేశుడిని తప్పకుండా ఉంచుతారు. మరి పాండవులు కల్ప క్రితం నాటి తమ స్మృతిచిహ్నాన్ని ఇప్పుడు స్వయంగా చూస్తున్నారు, వింటున్నారు. సంతోషం కలుగుతుంది కదా! ఎంత సంతోషమంటే ఎలాంటి బాధాకరమైన ఆటలు జరిగినా కానీ మీరు సంతోషంలో నాట్యం చేస్తూనే ఉంటారు! పాదాలతో నాట్యం చేయడం కాదు. మనసులో సంతోషంతో నాట్యం చేస్తారు. ఎందుకు సంతోషంతో నాట్యం చేస్తారు? ఎందుకంటే నథింగ్ న్యూ, జరగాల్సిందే అనే నాలెడ్జ్ ఉంది. బాధాకరమైన విషయాలు విని ఎప్పుడైనా కంగారుపడతారా? పక్కాగా ఉన్నారా? బ్రాహ్మణ ఆత్మలైన మీరే పక్కాగా అవ్వకపోతే ఇక ఎవరు అవుతారు? మాస్టర్ సర్వశక్తిమాన్ ఎన్నడూ కంగారుపడరు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైతే నా సహచరుడు ఎవరు అని మొదట ఆలోచించండి! పాండవులు ఎంతో సహించారు కానీ బాబా తోడుగా ఉండటం వల్ల విజయిగా అయ్యారు. కాబట్టి విజయానికి గ్యారెంటీ ఉంది. తోడుగా బాబా ఉంటే విజయిగా అవ్వడానికి గ్యారెంటీ ఉంది. అందువలన ఎన్నడూ ఏ విషయంలోనూ బలహీనంగా అవ్వకండి. ప్రపంచం కంగారుపడితే మీరు సంతోషంలో, ఆనందంలో ఉంటూ కంగారుపడేవారికి కూడా శక్తిని ఇవ్వండి. సదా ఎదురుగా మృత్యువును చూస్తూ బాబా మాత్రమే గుర్తుకొస్తారు కదా. కాబట్టి మరింతగా స్మృతిలో ఉండే వాతావరణం లభించింది. మరణ సమయంలో ఎవరు గుర్తుకొస్తారు అని అంటారు కదా? మరి మీకు కూడా అకాల మృత్యువు సమాచారం లభిస్తుంది. మృత్యులోకాన్ని చూసి తమ స్వర్గము అనగా అమర లోకం గుర్తుకొస్తుంది. నేడు మృత్యులోకం, రేపు మన రాజ్యం ఉంటుంది! ఈ సంతోషం ఉంది కదా. నేటిని చూసి రేపటి స్మృతి ఇంకా ఎక్కువగా వస్తుంది. మరి అందరూ నిర్భయంగా ఉండేవారే కదా. అచ్ఛా!
గ్రూప్ నం. 2 :- డబల్ హీరోలము - ఈ పొజిషన్ యొక్క స్మృతితో ప్రతి కర్మ శ్రేష్ఠంగా అవుతుంది
అందరూ తమను తాము ఈ డ్రామాలో పాత్రను అభినయించే శ్రేష్ఠ పాత్రధారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? బాబా ఎలాగైతే అత్యున్నతమైనవారో, అలాగే అత్యున్నతమైన పాత్రను అభినయించే శ్రేష్ఠ ఆత్మలు మీరు. డబల్ హీరోలు. వజ్రతుల్య జీవితం కూడా ఉంది మరియు హీరో పాత్రధారులు కూడా. మరి ప్రతి కర్మలో ఎంత నషా ఉండాలి! ఒకవేళ స్మృతిలో ఈ శ్రేష్ఠమైన పాత్ర ఉంటే, స్మృతి ఎలా ఉంటుందో స్థితి అలాగే ఉంటుంది మరియు స్థితి ఎలా ఉంటుందో కర్మలు అలాగే ఉంటాయి. మరి సదా ఈ స్మృతి ఉంటోందా? శరీర రూపంలో ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే - అది సదా గుర్తుంటుంది కదా. మరి ఆత్మ యొక్క ఆక్యుపేషన్, ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో, ఎలా ఉందో అది కూడా గుర్తుండాలి కదా. శరీరం వినాశి అయినది కానీ దాని స్మృతి అవినాశిగా ఉంటుంది. ఆత్మ అవినాశి అయినది, మరి దాని స్మృతి కూడా అవినాశిగా ఉంటోందా? నేను శరీరాన్ని అనే అలవాటు పడిపోయినట్లుగా. ఇది వ్యతిరేకమైనది, రాంగ్. కానీ అలవాటు అయితే పక్కా అయిపోయింది. కాబట్టి మరచిపోవాలని అనుకున్నా మరచిపోలేరు. అలాగే యథార్థమైన తమ స్వరూపం కూడా ఇంత పక్కాగా ఉండాలి. శరీరపు ఆక్యుపేషన్ స్వప్నంలో కూడా గుర్తుంటుంది. నేను క్లర్క్, నేను లాయర్, నేను బిజినెస్ చేసేవాడిని అనైతే మరచిపోరు. అలాగే నేను హీరో పాత్రధారిని అనే ఈ బ్రాహ్మణ జీవిత ఆక్యుపేషన్ పక్కాగా ఉండాలి మరియు నేచురల్‌గా ఉండాలి. మరి ఇలా నేచురల్ జీవితం ఉందా అని చెక్ చేసుకోండి?
నేచురల్ అయినది సదా ఉంటుంది మరియు అన్నేచురల్ (అస్వాభావికమైనది) అప్పుడప్పుడు ఉంటుంది. కాబట్టి మనం డబల్ హీరోలము అనే ఈ స్మృతి సదా ఉండాలి. ఈ నషాలో నష్టం లేదు, ఇతర నషాలలో నష్టం ఉంది. ఇది హద్దు నషా కాదు, అనంతమైన ఆత్మిక నషా. ఆ నషాలో కూడా అన్ని విషయాలూ స్వతహాగానే మరచిపోతారు, మరచిపోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఆత్మిక నషా ఉన్నప్పుడు హద్దు విషయాలు మరచిపోతాయి, మరచిపోయేందుకు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. నేను హీరో పాత్రధారి ఆత్మను అనే ఈ స్మృతి ఉన్నప్పుడు స్వతహాగానే ప్రతి కర్మ శ్రేష్ఠంగా అవుతుంది. ప్రతి కర్మ ద్వారా వీరు ఎవరో విశేష ఆత్మ, సాధారణమైనవారు కారు అని అందరికీ అనుభవమవుతుంది. ఇలా భావిస్తున్నారా? లేదా అందరిలాగే మేము కూడా ఉన్నాము అనుకుంటున్నారా? అతీతంగా కనిపిస్తున్నారా? ఎంతమంది అజ్ఞానులు ఉన్నా, అనేకమంది అజ్ఞానుల మధ్యలో మీరు ‘జ్ఞాని ఆత్మ’గా ప్రియంగా అనుభవమవుతారు. వీరిని హీరో పాత్రధారి అంటాము. ఇలా ఉందా? ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి. కేవలం తమను తాము అలా అనుకుంటే సరిపోదు. వీరు అతీతంగా ఉన్నారు అని అంతరంగం నుండి అర్థం చేసుకోవాలి. ఇష్టం లేకపోయినా అందరూ మీ ముందు తలవంచుతారు. అభిమానం యొక్క తల వంగుతుంది. కానీ ఇంత పక్కా అవస్థ కావాలి. చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి. ప్రతి కర్మలో నేను అతీతంగా ఉన్నానా, ప్రియంగా ఉన్నానా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. డబల్ హీరో స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఒకరిని మించి మరొకరు ముందుకు వెళ్ళాలి మరియు ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళాలి. ఇతరులు ముందుకు వెళ్తే నేను వెనుకబడిపోతాను అని అనుకోకండి. కాదు, ఇతరులను ముందుకు తీసుకు వెళ్ళడమే మీ పురోగతి. బ్రాహ్మణ జీవితం అనగా ముందుకు వెళ్ళడం మరియు ముందుకు నడిపించడం.
గ్రూప్ నం. 3 :- శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి స్వరూపంగా అవ్వండి, అప్పుడు దుఃఖపు అల రాలేదు
సదా తమ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి భాగ్యవిధాత అయిన బాబా స్వతహాగానే గుర్తుకొస్తారు కదా. భాగ్యవిధాత మరియు భాగ్యము - రెండూ గుర్తుంటున్నాయి కదా. ఏమేమి భాగ్యం లభించింది అనే దాని స్మృతి సదా ఇమర్జ్ రూపంలో ఉండాలి. లోపల అయితే గుర్తుందిలే అని ఇలా కాదు. కాదు, బయటకు కనిపించాలి. ఎందుకంటే మొత్తం కల్పంలో ఇలాంటి శ్రేష్ఠ భాగ్యం ఎన్నడూ లభించదు. సత్యయుగపు భాగ్యానికి మరియు ఈ సమయపు భాగ్యానికి తేడా ఏమిటి? ఇప్పటి భాగ్యమే శ్రేష్ఠమైనది కదా. ఎందుకంటే ఈ సమయంలో వజ్రతుల్యంగా ఉన్నారు మరియు సత్యయుగంలో స్వర్ణతుల్యంగా అయిపోతారు. కాబట్టి సదా హృదయంలో శ్రేష్ఠ భాగ్యం యొక్క పాటలు పాడుతూనే ఉంటారు. ఆటోమేటిక్‌గా మోగుతోందా లేక అప్పుడప్పుడు ఆగిపోతోందా? సదా మోగుతోందా లేక అప్పుడప్పుడు పాడైపోతోందా? ఎందుకంటే అవినాశి ప్రాప్తిని కలిగించేవారు భాగ్యవిధాత. లభించిన భాగ్యం యొక్క జాబితా తీస్తే ఎంత పెద్ద జాబితా అవుతుంది! పెద్ద జాబితా ఉంది కదా. అందుకనే అంటారు ఎంత లభించింది, ఏమి లభించింది? అప్రాప్తమైన వస్తువు ఏదీ లేదు అంటారు. దీనిని బట్టి సర్వస్వం లభించిందని స్పష్టమవుతోంది. లభించిన దానిని సంభాళించడం వచ్చా? లేక అప్పుడప్పుడు ఎవరైనా దొంగిలించుకుపోతున్నారా? మాయ దొంగిలించుకుపోవడం లేదు కదా?
మాతలకు ఎప్పుడైనా కొద్దిగానైనా దుఃఖపు అల వస్తుందా? మరి ఆ సమయంలో తమ భాగ్యాన్ని మరచిపోతారు కదా. స్మృతిలోకి తెచ్చుకుంటున్నారు అంటే విస్మృతి జరిగింది అని స్పష్టమవుతోంది. సదా స్మృతి స్వరూపంగా ఉండండి. ప్రపంచంలోనివారు భాగ్యం కోసం పరుగులు తీస్తున్నారు మరియు మీకు ఇంట్లో కూర్చునే భాగ్యవిధాత అయిన బాబా భాగ్యాన్ని ఇచ్చేశారు! ఎంత పెద్ద పరివర్తన వచ్చింది! ఎన్నడూ తమను తాము ఈ శ్రేష్ఠ భాగ్యం నుండి వేరు చేసుకోకండి. నా భాగ్యం, మరి ‘నాది’ అనేది ఎప్పుడైనా మరచిపోతారా? బాబా ఇచ్చిన ఖజానా మనదే కదా. ఇప్పటివరకు కూడా మీ భాగ్యాన్ని ఎంతగానో మహిమ చేస్తూనే ఉండేంత శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలుగా అవుతున్నారు! ఈ కీర్తనలు ఏమిటి? మీకు లభించిన భాగ్యం యొక్క మహిమయే. మరి ఎప్పుడైనా దేవీ-దేవతల కీర్తనలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? మా ప్రాప్తులనే మహిమ చేస్తున్నారు అని భావిస్తున్నారా! చైతన్యంలో ఉంటూ తమ జడ చిత్రాల మహిమను వింటున్నారు. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది? ఎవరికీ తక్కువ లేదు! నంబరువారీగా అయితే ఉంటారు కదా. అందరూ నంబర్వన్నా? విఘ్నజీత్లో నంబర్‌వన్ ఎవరు? ఏ విఘ్నం వచ్చినా దానిని వినాశనం చేయడంలో నంబర్‌వన్ ఎవరు? ఎంత టైమ్ పడుతుంది? ఒక రోజు తీసుకున్నారా లేక ఒక గంట తీసుకున్నారా? నంబర్‌వన్ అనగా ఏ విఘ్నం వచ్చే ముందైనా తెలిసిపోవాలి. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- విఘ్న వినాశకులుగా అవ్వడానికి సర్వ శక్తులతో సంపన్నంగా అవ్వండి
అందరూ తమను బాబా యొక్క ప్రతి కార్యంలోనూ సదా సహచరుడిగా భావిస్తున్నారా? బాబా కార్యం ఏదైతే ఉందో అది మన కార్యం. పాత సృష్టిని కొత్తగా తయారుచేయడం, అందరికీ సుఖ-శాంతుల అనుభవాన్ని కలిగించడమే బాబా కార్యం. ఇదే బాబా కార్యం. మరి బాబా కార్యం ఏదైతే ఉందో అది పిల్లల కార్యం. కాబట్టి తమను తాము సదా బాబా యొక్క ప్రతి కార్యంలో సహచరుడిగా భావించడం ద్వారా సహజంగానే బాబా గుర్తుకొస్తారు. కార్యాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా కార్యకర్త యొక్క స్మృతి స్వతహాగానే వస్తుంది. దీనినే సహజ స్మృతి అంటాము. మరి సదా స్మృతి ఉంటోందా లేక చేయాల్సి వస్తోందా? మాయ యొక్క ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు అప్పుడు స్మృతి చేయాల్సి వస్తుంది. చూడండి, మీ స్మృతిచిహ్నమే విఘ్న వినాశకుడు. గణేశుడిని ఏమంటారు? విఘ్న వినాశకుడు. మరి విఘ్న వినాశకులుగా అయ్యారా లేదా? విఘ్న వినాశకులు అనగా సమస్త విశ్వానికీ విఘ్న వినాశకులు. తమ విఘ్నాలకు మాత్రమే వినాశకులు కారు. తమ విఘ్నాలలోనే నిమగ్నమై ఉంటే ఇక విశ్వానిది ఎప్పుడు చేస్తారు? కాబట్టి సమస్త విశ్వానికీ విఘ్న వినాశకులు. అంత నషా ఉందా? లేక తమ విఘ్నాల పరుగులలోనే నిమగ్నమై ఉంటున్నారా?
సదా సర్వ శక్తులతో సంపన్నంగా ఉండేవారే విఘ్న వినాశకులుగా అవ్వగలరు. ఏ విఘ్నాన్ని అయినా వినాశనం చేయడానికి ఏమి అవసరం? శక్తులే కదా. ఒకవేళ ఏ శక్తీ లేకపోతే విఘ్నాన్ని వినాశనం చేయలేరు. అందువలన సదా బాబాకు సహచరుడు మరియు విశ్వానికి విఘ్న వినాశకులము అనే స్మృతి ఉంచుకోండి. విఘ్న వినాశకుల ఎదుటకు ఏ విఘ్నమూ రాలేదు. తమ వద్దకే వస్తూ ఉంటే ఇక ఇతరుల విఘ్నాలను ఏమి వినాశనం చేస్తారు. సర్వ శక్తుల ఖజానా ఉందా? లేక కొద్దికొద్దిగా ఉందా? ఏ ఖజానా తక్కువైనా సమయానికి విజయాన్ని పొందలేరు. కాబట్టి సదా తమ స్టాక్‌ను చెక్ చేసుకోండి - సర్వ ఖజానాలు ఉన్నాయా, సర్వ శక్తులు ఉన్నాయా అని? ఎందుకంటే బాబా అందరికీ సర్వ శక్తులను ఇచ్చారు. లేక ఎవరికైనా తక్కువ ఇచ్చి, ఎవరికైనా ఎక్కువ ఇచ్చారా? అందరికీ సర్వ శక్తులను ఇచ్చారు కదా. తమను తాము మాస్టర్ సర్వశక్తిమాన్ అని చెప్పుకుంటున్నారు కూడా. కాబట్టి సర్వ శక్తులు నా ఆస్తి. మరి ఆస్తి ఎన్నడూ పోజాలదు. ఆస్తి యొక్క నషా ఉంటుంది కదా. ఎవరికైనా చాలా పెద్ద ఆస్తి లభిస్తే ఎంత నషా, ఎంత సంతోషం ఉంటుంది! మీకు అవినాశి ఆస్తి లభించింది. మరి నషా కూడా అవినాశిగా ఉండాలి కదా. మరి సదా నషా ఉంటోందా? బాలకులు అనగా యజమాని.
పిల్లల సేవా వృద్ధిని చూసి బాప్‌దాదా సంతోషిస్తారు. క్వాంటిటీ మరియు క్వాలిటీ రెండూ ఉన్నాయి కదా. రెండింటి సేవ యొక్క బ్యాలెన్స్ ఉందా? లేక క్వాంటిటీ ఎక్కువ ఉండి, క్వాలిటీ తక్కువగా ఉందా? బాబాకు క్వాంటిటీ కూడా కావాలి, క్వాలిటీ కూడా కావాలి. క్వాలిటీ సేవ గురించి ఎందుకు అంటారు? ఎందుకంటే క్వాలిటీ ఉన్న ఒకరు అనేకమంది క్వాంటిటీని తీసుకువస్తారు. అయినా కూడా ఇప్పటి లెక్క ప్రకారం సాధారణ ఆత్మలే బాబాకు ప్రియమైనవారు. నిజానికి విశేషమైనవారే కానీ ఇప్పటి కాలం లెక్క ప్రకారం సాధారణమైనవారిగా పరిగణించబడతారు. సాధారణ ఆత్మలు అతి శ్రేష్ఠంగా మారిపోవడమే అద్భుతము! ఈ ఆత్మలు ఇంతటి ఆస్తికి అధికారులుగా అవుతారని ఎవరూ ఊహించను కూడా లేరు! ప్రపంచం ఆలోచిస్తూ ఉండిపోయింది, మీరు అయిపోయారు! వారైతే ఏ వేషంలో వస్తారు, ఎప్పుడు వస్తారు అని వెతుకుతూనే ఉంటారు? మరి మీరు ఏమి అంటారు? పొందేశాము. కాబట్టి ‘పొందేశాము’ అనే సంతోషం ఉంది కదా.
అన్నింటికంటే అతిపెద్ద ఖజానా సంతోషమే. సంతోషం ఉంటే సర్వస్వం ఉన్నట్లే, సంతోషం లేకపోతే ఏదీ లేనట్లే. మరి మాతలు సదా సంతోషంగా ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు మనసులో ఏడుస్తున్నారా? పాండవులు ఏడుస్తున్నారా? కళ్ళతో ఏడవరు, మనసుతో ఏడుస్తున్నారా? ఉదాసీనంగా అవుతున్నారా? అప్పుడప్పుడు వ్యాపార వ్యవహారాలలో నష్టం వస్తే ఉదాసీనంగా అవుతారు కదా. మరి ఈ ఉదాసీనత కూడా మనసుతో ఏడవడమే. ఉదాసీనంగా ఉంటే నవ్వు రాదు, అంటే సంతోషం మాయమైపోయింది కదా. ఇప్పుడు ఉదాసీనంగా కూడా అవ్వలేరు. ఎందుకంటే ఈ కొద్దిపాటి నష్టం ఏదైనా జరిగినా అఖండమైన ప్రాప్తుల ముందు ఇది ఎంతటి పెద్ద విషయం! ప్రాప్తులను మరచిపోయినప్పుడే ఉదాసీనంగా అవుతారు. ఏది జరిగినా కానీ బాబా ఖజానాను ఎన్నడూ పోగొట్టుకోకూడదు. ‘సంతోషం’ బాబా ఖజానా, దానిని వదులుకోకూడదు. శరీరం పోయినా సంతోషం పోకూడదు అని ఇంతకుముందు కూడా చెప్పాము కదా. ఇంత పక్కాగా అవ్వడమే బ్రాహ్మణ జీవితం. అర్థమైందా? ఉదాసీనతకు విడాకులు ఇచ్చేయండి. విడాకులు ఇచ్చినవారిని వెంట ఉంచుకోరు. విడాకులు ఇచ్చేశారు అంటే ఇక సమాప్తమైనట్లే.
పీస్-పార్క్‌లో నిర్వహించిన శాంతి మేళాలో సేవకు నిమిత్తమైన సేవాధారులతో:- సేవలో మంచి ధైర్యము కలవారు. మేళాను బాగా ఏర్పాటు చేశారు. అనేక ఆత్మలకు సహజ శాంతి అనుభవాన్ని కలిగించడం ఎంత పుణ్యకార్యం! కాబట్టి పుణ్యాత్మలుగా అయి పుణ్యపు మూలధనాన్ని సేవ ద్వారా జమ చేసుకుంటున్నారు. మంచి ప్రేమతో సేవ చేస్తున్నారు. ఈ సేవ కూడా సంతోషాన్ని పెంచుతుంది. కాబట్టి మొదట తమను తాము అనుభవజ్ఞులుగా చేసుకుంటారు, తర్వాత ఇతరులకు అనుభవం చేయిస్తారు. భాగ్యాన్ని తయారుచేసుకునే గోల్డెన్ ఛాన్స్ లభించింది. మంచిది, సహజ సాధనం కూడా మరియు సింపుల్ కూడా. అచ్ఛా! గుజరాత్ యూత్ నిర్విఘ్నంగా ఉన్నారా? లేక కొద్దికొద్దిగా విఘ్నం ఉందా? “సీ ఫాదర్” చేయడం వల్ల సదా నిర్విఘ్నంగా ఉంటారు. “సీ సిస్టర్”, “సీ బ్రదర్” చేయడం వల్ల ఏదో ఒక అలజడి కలుగుతుంది. సదా “సీ ఫాదర్”. బ్రహ్మా బాబా ఏమి చేశారు? అచ్ఛా! మాతలు అయితే నాట్యం చేస్తూనే ఉంటారు. గర్బా కూడా బాగా చేస్తారు మరియు సంతోషంతో నాట్యం చేస్తూనే ఉంటారు. గర్బా చేస్తున్నప్పుడు ఒకరినొకరు కలుస్తారు కదా. డాన్స్ ఏది చేసినా ఒకరితో ఒకరు కలుపుతారు కదా. ఒకరు చేయి పైకి ఎత్తి, ఇంకొకరు కిందకు పెడితే బాగుంటుందా? ఇలా సంస్కారాలను కలిపే గర్బా చేయాలి. అర్థమైందా? ఈ గర్బా అజ్ఞానులు కూడా చేస్తారు. కానీ జ్ఞానులు ఏ గర్బా చేయాలి? సంస్కారాలను కలిపేది. అందరి సంస్కారాలు బాబా సమానంగా ఉండాలి. సంస్కారాలను కలిపే ఈ డాన్స్ వచ్చా? లేక అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదా? కాబట్టి ఇప్పుడు ఈ విశేషతను చూపించాలి. సంస్కారాలతో ఢీకొనకూడదు, సంస్కారాలను కలపాలి. వేరొకరు ఏదైనా గందరగోళం చేసినా మీరు కలపండి, మీరు గందరగోళం చేయకండి. పైగా వారికి శాంతి సహయోగాన్ని ఇవ్వండి. కాబట్టి అర్థమైందా, విఘ్న వినాశక ఆత్మలు మీరు.
మనదే విఘ్న-వినాశకుడి స్మృతిచిహ్నం అని సదా అనుభవం చేసుకోండి. విఘ్న వినాశకులుగా అయ్యే విధి ఏమిటి, ఎలా విఘ్న వినాశకులుగా అవుతారు? శాంతితోనా లేక ఎదుర్కోవడం ద్వారానా లేక కాస్త అలజడి చేయడం ద్వారానా? శాంతంగా ఉండాలి మరియు శాంతితో సర్వ కార్యాలను సంపూర్ణం చేయాలి. కాస్త అలజడి చేయడం వల్ల అటెన్షన్ ఆకర్షిస్తాము అని అనకూడదు. అలా చేయకూడదు. ఇది అటెన్షన్ ఆకర్షించడం కాదు, టెన్షన్ పుట్టిస్తుంది. అందువలన విఘ్న వినాశకులుగా అవ్వాలంటే శాంతితో అవ్వాలి, అలజడి చేయడం వల్ల కాదు. సదా శాంతంగా. ఎంత పెద్ద విఘ్నమైనా సరే, శాంతి శక్తి దానిని సహజంగా సమాప్తం చేస్తుంది. మరి శాంతి శక్తి జమ అయింది కదా. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- బ్రాహ్మణ జీవితపు సేఫ్టీకి సాధనం - బాబా ఛత్రఛాయ
తమను తాము ప్రతి సమయం, ప్రతి కర్మ చేస్తూ బాబా ఛత్రఛాయలో ఉండేవారిగా అనుభవం చేసుకుంటున్నారా? ఛత్రఛాయ సేఫ్టీకి సాధనం కావాలి. స్థూల ప్రపంచంలో ఎండ నుండి లేదా వర్షం నుండి రక్షించుకోవడానికి ఛత్రఛాయ ఆధారాన్ని తీసుకుంటారు. అదైతే స్థూల ఛత్రఛాయ. ఇది బాబా ఛత్రఛాయ, ఇది ఆత్మను ప్రతి సమయం సేఫ్‌గా ఉంచుతుంది. ఆత్మ ఏ అల్పకాలిక ఆకర్షణలోనూ ఆకర్షితం కాదు, సేఫ్‌గా ఉంటుంది. మరి ఇలా తమను సదా ఛత్రఛాయలో ఉండే సేఫ్ ఆత్మగా భావిస్తున్నారా? సేఫ్‌గా ఉన్నారా లేక కాస్త వేడి సెగ తగులుతోందా? ఈ సాకార ప్రపంచపు మాయ ప్రభావపు వేడి సెగ అంశమాత్రంగా కూడా తగలకూడదు. ఎందుకంటే సెగ నుండి తప్పించుకునే సాధనాన్ని బాబా ఇచ్చారు. అత్యంత సహజమైన సాధనం ఛత్రఛాయ. సెకను కూడా పట్టదు, బాబా అనగానే సేఫ్! నోటితో కాదు, నోటితో బాబా-బాబా అంటూ ప్రభావంలోకి లాగబడిపోవడం - అలా అనడం కాదు. మనసుతో బాబా అనగానే సేఫ్. మరి అలా సేఫ్‌గా ఉన్నారా? ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో అందరూ సేఫ్టీ మార్గాన్ని వెతుకుతున్నారు. ఏ పని చేయాలన్నా ముందు సేఫ్టీ ఆలోచిస్తారు, తర్వాత చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో సేఫ్టీని అందరూ కోరుకుంటున్నారు - స్థూలమైనదైనా, సూక్ష్మమైనదైనా. మరి బాబా కూడా బ్రాహ్మణ జీవితపు సేఫ్టీ సాధనాన్ని సదా ఇచ్చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మీరు సదా సేఫ్‌గా ఉండగలరు. అలా సేఫ్‌గా ఉన్నారా లేక ఎప్పుడైనా అలజడిలోకి వచ్చేస్తున్నారా? ఎంత సహజ సాధనాన్ని ఇచ్చారు! శ్రమ పడాల్సిన అవసరం రాలేదు.
మార్గం శ్రమతో కూడినది కాదు కానీ తమ బలహీనతే శ్రమ అనుభవాన్ని కలిగిస్తుంది. బలహీనంగా అయినప్పుడే శ్రమ అనిపిస్తుంది, శక్తిశాలిగా ఉన్నప్పుడు సహజంగా అనిపిస్తుంది. ఉన్నది సహజమే కానీ స్వయంగా మీరే శ్రమ అనుభవం కావడానికి నిమిత్తమవుతున్నారు. శ్రమలో అలసట ఉంటుంది మరియు సహజత్వంలో సంతోషం ఉంటుంది. ఏ కార్యమైనా సహజంగా సఫలమవుతూ ఉంటే సంతోషం కలుగుతుంది కదా. శ్రమ పడాల్సి వస్తే అలసట కలుగుతుంది. మరి సంతోషం మంచిదా లేక అలసట మంచిదా? బాప్‌దాదా సదా పిల్లలకు ఇదే చెప్తారు - అర్థ కల్పం శ్రమ చేశారు, ఇప్పుడు కూడా శ్రమ పడకండి, ఇప్పుడు ఆనందంగా ఉండండి. ఆనందం అనుభవించే సమయంలో కూడా శ్రమ పడితే ఇక ఆనందంగా ఎప్పుడు ఉంటారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేరు. అందువలన సదా సహజం అనగా సదా ఆనందంలో ఉండేవారు. మరి సదా ఛత్రఛాయలో ఉంటున్నారా? లేక బయటకు వచ్చి చూడటంలో ఆనందం ఉందా? కొందరు మంచి స్థానంలో కూర్చున్నా కానీ చూసే అలవాటు ఉంటుంది కాబట్టి మంచి స్థానాన్ని వదిలి కూడా చూస్తూ ఉంటారు, బయట చక్కర్లు కొడుతూ ఉంటారు. అలాంటి అలవాటు అయితే లేదు కదా? ఛత్రఛాయలో ఉండే ఆనందాన్ని అనుభవం చేసుకోండి. ఇదేమిటి, ఇది ఎందుకు, ఇది ఎలా - ఇవి ఛత్రఛాయ నుండి బయటకు వచ్చి చక్కర్లు కొట్టడం. ఈ ఛత్రఛాయ సదా శ్రేష్ఠంగా సేఫ్‌గా ఉండే గీత. గీత దాటి బయటకు వెళ్తే ‘శోక వాటిక’ లభిస్తుంది మరియు గీత లోపల ఉంటే ‘అశోక వాటిక’. ఏమైనా శోకం ఉందా? అప్పుడప్పుడు దుఃఖపు అల వస్తుందా? ఏ విషయంలోనైనా కొద్దిగా, సంకల్పంలో కూడా దుఃఖపు అల వస్తే ‘శోక వాటిక’లో ఉన్నట్లే. సంగమయుగంలో బాబా ‘అశోక వాటిక’లో ఉండే సాధనాన్ని తెలియజేస్తున్నారు మరియు ఇప్పటి అభ్యాసం ద్వారా అనేక జన్మలు అశోకంగా ఉంటారు, శోకం యొక్క నామరూపాలు కూడా ఉండవు. కాబట్టి సదా సేఫ్‌గా ఉండే శ్రేష్ఠ ఆత్మలము - ఇది అనుభవం చేసుకుంటూ నడవండి. సమర్థ బాబా, సమర్థ పిల్లలు. మరి ఛత్రఛాయ నచ్చింది కదా. అచ్ఛా!
గ్రూప్ నం. 6 :- పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయితే సహజంగా మాయాజీత్గా అయిపోతారు
అందరూ తమను తాము పరమాత్మ దీపానికి దీపపు పురుగులు భావిస్తున్నారా? దీపపు పురుగులు రెండు రకాలు - ఒకరు చక్కర్లు కొట్టేవారు మరియు రెండవవారు సెకనులో బలిహారమయ్యేవారు. మరి మీరందరూ ఎలాంటి దీపపు పురుగులు? బలిహారమైపోయారా లేక కాబోతున్నారా? లేక ఇంకా కొద్దిగా ఆలోచిస్తున్నారా? ఆలోచించడం అనగా చక్కర్లు కొట్టడం. బలిహారమైన తర్వాత ఇక చక్కర్లు కొట్టవలసిన అవసరం ఉండదు. అందరూ అయిపోయారా? ఏదైనా మంచి వస్తువు లభించినప్పుడు మరియు ఇంతకంటే మంచి వస్తువు ఏదీ లేదు అని అర్థమైనప్పుడు ఆలోచించవలసిన ఆవశ్యకత ఉండదు. ఇలాంటి ఒప్పందమే చేసుకున్నారు కదా. బాప్‌దాదాకు కూడా ఇలాంటి నిశ్చయబుద్ధి విజయి రత్నాలను చూసి సంతోషం కలుగుతుంది. ఎక్కువ సంతోషం ఎవరికి కలుగుతుంది - బాబాకా లేక మీకా? పిల్లలకు ఎక్కువ సంతోషం ఉంటే బాబాకు అంతకంటే ఎక్కువే ఉంది అని బాబా అంటున్నారు. బాప్‌దాదా చూడండి, ఎక్కడెక్కడి నుండో ఎన్నుకుని ఒకే తోటలోని ఆత్మిక గులాబీలుగా తయారుచేశారు. ఈ ఒక్క కుటుంబానికి చెందినవారిగా అవ్వడంలో ఎంత సంతోషం ఉంది! ఇంత పెద్ద కుటుంబం ఎవరికైనా ఉంటుందా? ఫాలోవర్స్ ఉండవచ్చు కానీ కుటుంబం కాదు. ఎన్ని సంతోషాలు - బాబా యొక్క సంతోషం, తమ భాగ్యం యొక్క సంతోషం, కుటుంబం యొక్క సంతోషం! సంతోషాలే సంతోషాలు కదా. కళ్ళు తెరవగానే అమృతవేళ సంతోషపు ఊయలలో ఊగుతారు మరియు నిద్రించేటప్పుడు కూడా సంతోషపు ఊయలలోనే. అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే ఎవరిని అడగాలి? నన్ను అడగండి అని ప్రతి ఒక్కరూ అంటారు. ఇది శుద్ధమైన నషా, ఇది దేహాభిమానం యొక్క నషా కాదు. ప్రతి ఒక్క ఆత్మకూ తమ తమ ఆత్మిక నషా ఉంది. కేవలం ఆత్మిక నషాను హద్దు నషాగా మార్చుకోకూడదు.
బాప్‌దాదాకు పిల్లలపై అత్యంత ఎక్కువ ప్రేమ ఉంది, దానికి గుర్తు ఏమిటి? ఏదైనా ప్రాక్టికల్ గుర్తు చెప్పండి. (అందరూ చెప్పారు) చూడండి, ప్రతిరోజూ ఇంత పెద్ద లేఖను (మురళిని) ఎవరూ రాయరు. ఇలాంటి ప్రేమ ఎవరూ చేయరు. పరమాత్మ ప్రేమకు పాత్రులు. ఎప్పుడైనా ఒక్క రోజైనా లేఖ మిస్ అయిందా? ఇలాంటి ప్రియుడు మొత్తం కల్పంలోనూ ఉండజాలరు. వినిపించిన ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. ప్రతి సమయం ఈ ప్రాప్తులే గుర్తుంటే ప్రాప్తుల ముందు మరే వ్యక్తీ లేదా వస్తువూ ఎన్నడూ ఆకర్షించలేవు మరియు సదా సహజంగా మాయాజీత్గా అయి ఇతరులను కూడా తయారుచేస్తారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
