‘‘పూర్వజులము మరియు పూజ్యులము అనే స్మృతిలో ఉంటూ సర్వుల అలౌకిక పాలనను చేయండి’’
ఈరోజు విశ్వ-రచయిత అయిన తండ్రి తమ శ్రేష్ఠ రచనను చూస్తున్నారు. సర్వ రచనలలోకెల్లా శ్రేష్ఠ రచన బ్రాహ్మణాత్మలైన మీరే ఎందుకంటే మీరే విశ్వానికి పూర్వజ ఆత్మలు. ఒక వైపు పూర్వజులు, దానితో పాటు పూజ్య ఆత్మలు కూడా. ఈ కల్పవృక్షానికి పునాది అనగా వేర్లు బ్రాహ్మణాత్మలైన మీరే. ఈ వృక్షానికి మూల ఆధారమైన ‘కాండము’ కూడా మీరే, అందుకే మీరు సర్వాత్మలకు పూర్వజులు. సృష్టి చక్రంలో విశేషంగా ఎవరైతే ధర్మ పితలు అని పిలవబడతారో, ఆ ధర్మపితలకు కూడా పూర్వజ ఆత్మలైన మీ ద్వారానే తండ్రి సందేశం ప్రాప్తిస్తుంది, దీని ఆధారంగానే సమయమనుసారంగా ఆ ధర్మపితలు తమ ధర్మానికి చెందిన ఆత్మలకు సందేశమిచ్చేందుకు నిమిత్తంగా అవుతారు. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌గా ఉన్నారో, అలా బ్రహ్మాతో పాటు బ్రాహ్మణాత్మలైన మీరు కూడా సహచరులుగా ఉన్నారు, అందుకే పూర్వజ ఆత్మలైన మీరు మహిమ చేయబడ్డారు.
పూర్వజ ఆత్మలకు, డైరెక్ట్‌గా (ప్రత్యక్షంగా) లేక ఇన్‌డైరెక్ట్‌గా (పరోక్షంగా) సర్వాత్మలతో సంబంధం ఉంది. ఏ విధంగానైతే వృక్షం యొక్క కొమ్మలు-రెమ్మలు అన్నింటి సంబంధము వేర్లతో లేక కాండముతో తప్పకుండా ఉంటుందో అదే విధంగా ఏ ధర్మం యొక్క చిన్న లేక పెద్ద కొమ్మలు-రెమ్మలైనా కానీ సంబంధం స్వతహాగానే ఉంటుంది. కనుక మీరు పూర్వజులైనట్లు కదా. అర్థకల్పము రాజ్యాధికారులుగా అయిన తర్వాత మళ్ళీ పూజ్య ఆత్మలుగా అవుతారు. పూజ్యులుగా అవ్వడంలో కూడా ఆత్మలైన మీ వంటి పూజ ఇక ఏ ఇతర ధర్మాత్మలకు కూడా జరగదు. ఏ విధంగానైతే పూజ్య ఆత్మలైన మీకు విధి పూర్వకంగా పూజ జరుగుతుందో, అలా ఏ ధర్మ పితలకు కూడా పూజ జరగదు. తండ్రి కార్యంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఎవరైతే సహచరులుగా అవుతారో, వారికి కూడా దేవత లేక దేవీ రూపంలో విధి పూర్వకంగా పూజ జరుగుతుంది. ఇక ఏ ఇతర ధర్మపితల సహచరులకు, ధర్మ పాలన చేసే ఆత్మలకు విధి పూర్వకంగా పూజ జరగదు, మహిమ జరుగుతుంది. విగ్రహాలను (మూర్తులను) తయారుచేస్తారు కానీ మీ వంటి పూజ్యులుగా అవ్వరు.
మీకు మహిమ కూడా జరుగుతుంది, అలాగే పూజ కూడా జరుగుతుంది. బ్రాహ్మణాత్మలైన మీ మహిమ యొక్క విధి కూడా అందరికన్నా అతీతమైనది. ఏ విధంగానైతే దేవాత్మలైన మీ మహిమ చాలా సుందరంగా కీర్తనల రూపంలో జరుగుతుందో, హారతి రూపంలో జరుగుతుందో, అలా ఇతర ఆత్మల మహిమ ఈ విధంగా జరగదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే శ్రేష్ఠ రచన అయిన మీరు పూర్వజులు మరియు పూజ్యులు. బ్రాహ్మణాత్మలైన మీరు ఆది ఆత్మలు ఎందుకంటే ఆది దేవ్ అయిన బ్రహ్మాకు సహయోగులుగా, శ్రేష్ఠ కార్యానికి నిమిత్తులుగా అయ్యారు. అనాది రూపంలో కూడా పరమ ఆత్మకు అతి సమీపంగా ఉండేవారు. ఆత్మల చిత్రం ఏదైతే చూపిస్తారో, అందరికన్నా సమీప ఆత్మలుగా ఎవరిని చూపిస్తారు? అందులో మీరు ఉన్నారు. కనుక అనాది రూపంలో కూడా అతి సమీపంగా ఉన్నారు, దీనినే డబల్ విదేశీయులు నియరెస్ట్ మరియు డియరెస్ట్ అని అంటారు. స్వయాన్ని ఈ విధంగా భావిస్తున్నారా?
పూర్వజుల పని ఏమిటి? పూర్వజులు అందరి పాలన చేస్తారు. పెద్దవారి పాలనయే ప్రసిద్ధమైనది. కనుక పూర్వజ ఆత్మలైన మీరందరూ సర్వాత్మల పాలన చేస్తున్నారా? లేదా కేవలం మీ వద్దకు వచ్చే విద్యార్థుల పాలన మాత్రమే చేస్తున్నారా? లేక సంబంధ-సంపర్కంలోకి వచ్చే ఆత్మల పాలన చేస్తున్నారా? మొత్తం విశ్వంలోని ఆత్మలకు పూర్వజులా లేక కేవలం బ్రాహ్మణాత్మలకు పూర్వజులా? వేర్లు మరియు కాండము ఏవైతే ఉంటాయో, అవి పూర్తి వృక్షం కోసం ఉంటాయా లేక కేవలం తన కాండం కోసం మాత్రమే ఉంటాయా? కొమ్మలు-రెమ్మలు అన్నింటి కోసం ఉంటాయి కదా. వేర్లు మరియు కాండము ద్వారా పూర్తి వృక్షంలోని ఆకులన్నింటికీ నీరు లభిస్తుంది. లేదా కేవలం కొన్ని కొమ్మలు-రెమ్మలకు మాత్రమే నీరు లభిస్తుందా? అన్నింటికీ లభిస్తుంది కదా. చివర్లో ఉన్న ఆకులకు కూడా లభిస్తుంది. ఇంతటి అనంతమైన నషా ఉందా? లేక అనంతము నుండి హద్దులోకి కూడా వచ్చేస్తారా? ఎంత సేవ చేయాలి! ప్రతి ఆకుకు నీరు ఇవ్వాలి అనగా సర్వాత్మల పాలన చేసేందుకు మీరు నిమిత్తులు.
ఎవరైనా ఇతర ధర్మాల ఆత్మలను కలిసినప్పుడు లేక చూసినప్పుడు కూడా - “ఓ పూర్వజ ఆత్మలూ, ఇలా అనుభవం చేస్తున్నారా, ఈ ఆత్మలందరూ మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వంశావళివారు, బ్రాహ్మణాత్మలైన మేము కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లము అనగా పూర్వజులము, వీరందరూ మా వారే’’ అని. లేక కేవలం బ్రాహ్మణాత్మలు మాత్రమే మన వారా? పరస్పరంలో అందరూ సోదరులు అని అంటున్నప్పుడు పూర్వజ ఆత్మలైన మీరు పెద్ద అన్నయ్యలు అనగా తండ్రి సమానమైనవారు. ఈ స్మృతిని ప్రాక్టికల్ జీవితంలో అనుభవం చేయాలి మరియు చేయించాలి. పూర్వజ ఆత్మలైన మీ అందరి పాలనా స్వరూపం ఏమిటి? లౌకిక జీవితంలో కూడా పాలనకు ఆధారం ఏమిటి? పాలన చేయడము అనగా ఎవరినైనా శక్తిశాలిగా తయారుచేయడము. ఏదో ఒక విధితో, సాధనంతో పాలన చేసి శక్తిశాలిగా చేస్తారు - భోజనం ద్వారానైనా, చదువు ద్వారానైనా శక్తిశాలిగా తయారుచేస్తారు. ఆ పాలనకు ప్రత్యక్ష స్వరూపంగా ఆత్మలోనూ, శరీరంలోనూ శక్తి వస్తుంది. కనుక పాలనకు ప్రత్యక్ష స్వరూపము - శక్తిశాలిగా తయారుచేయడము.
పూర్వజ ఆత్మలైన మీ పాలన యొక్క విధి ఏమిటి? అలౌకిక పాలన యొక్క స్వరూపము ఏమిటంటే, స్వయానికి తండ్రి ద్వారా ప్రాప్తించిన సర్వ శక్తులను ఇతర ఆత్మలలో నింపడము. ఏ ఆత్మకు ఏ శక్తి అవసరమో, వారికి ఆ సమయంలో ఆ శక్తి ద్వారా పాలన చేయడము - ఇలాంటి పాలన చేయడం వస్తుందా? మీరు పూర్వజులే కదా. అందరూ పూర్వజ ఆత్మలేనా లేక చిన్నవారా? అందరూ పూర్వజులేనా లేక ఎవరో కొంతమంది మాత్రమే పూర్వజులా? మరి పూర్వజులకు పాలన చేయడం వస్తుంది కదా. కేవలం సెంటరు యొక్క పాలననే చేస్తారా లేక మొత్తం విశ్వంలోని ఆత్మలకు పాలన చేస్తారా? కేవలం ప్రవృత్తిని మాత్రమే పాలన చేస్తారా లేక విశ్వాన్ని పాలన చేస్తారా? వర్తమాన సమయంలో పూర్వజ ఆత్మలైన మీ పాలన సర్వాత్మలకు అవసరము.
ఏమేమి జరుగుతుంది అనే వార్తలనైతే అందరూ చాలా ఆసక్తితో వింటారు (అయోధ్యలో జరిగిన సంఘటన తర్వాత చాలా స్థానాల నుండి హింస యొక్క వార్తలు అందుతున్నాయి). కానీ పూర్వజ ఆత్మలు సమాచారం విన్న తర్వాత సర్వుల పాలనను చేసారా? అశాంతి సమయంలో పూర్వజ ఆత్మలైన మీకు ఇది ఇంకా విశేష కార్యంగా స్వతహాగానే అవుతుంది. కనుక ఓ పూర్వజులారా! పాలన యొక్క మీ సేవలో నిమగ్నమవ్వండి. అశాంతి సమయంలో విశేషంగా పోలీసులు లేక మిలట్రీవారు, అశాంతిని శాంతిగా చేయడము మా కార్యము అని భావిస్తారు. ఆజ్ఞ లభించగానే వచ్చి చేరుకుంటారు మరియు ఇటువంటి సమయంలో విశేషమైన అటెన్షన్‌తో తమ సేవ చేసేందుకు అలర్ట్‌గా అవుతారు. మీరందరూ అలజడి యొక్క సమాచారాన్ని అయితే విన్నారు కానీ సేవలో అలర్ట్ అయ్యారా లేక వినే ఆనందాన్ని మాత్రమే తీసుకున్నారా? మీ పూర్వజ స్థితి స్మృతిలోకి వచ్చిందా? ఆత్మలందరినీ శాంతి శక్తితో పాలన చేశారా? లేక ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది జరిగింది అని ఇదే ఆలోచిస్తున్నారా? ఇలాంటి సమయంలో విశేష ఆత్మల సేవ అత్యంత అవసరము. మీ వృత్తి ద్వారా, మనసా శక్తి ద్వారా విశేషమైన సేవ చేశారా? లేదంటే ఎలాగైతే విధి పూర్వకంగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అలాగే చేశారా? మీరు ఆత్మిక సమాజ సేవకులు కూడా. మరి ఆత్మిక సమాజ సేవకులు తమ విశేషమైన సమాజ సేవను అదనంగా చేశారా? ఇంత బాధ్యత మాది ఉంది అని భావించారా? లేక ప్రోగ్రామ్ లభిస్తేనే చేస్తారా? ఇలాంటి సమయంలో క్షణంలో తమ సేవకు అలర్ట్ అవ్వాలి. ఇదే పూర్వజ ఆత్మలైన మీ బాధ్యత.
ఇప్పుడు కూడా విశ్వంలో అలజడి ఉంది మరియు ఈ అలజడి ఎప్పటికప్పుడు ఇంకా పెరిగేదే ఉంది. ఆత్మలైన మీ కర్తవ్యం ఏమిటంటే - ఇటువంటి సమయంలో ఆత్మలలో విశేషంగా శాంతిని, సహనశక్తి యొక్క ధైర్యాన్ని నింపడము, లైట్ హౌస్‌గా అయి అందరికీ శాంతి ప్రకాశాన్ని ఇవ్వడము. ఏం చేయాలో అర్థమయిందా? ఇప్పుడు మీ బాధ్యతను లేక కర్తవ్యాన్ని ఇంకా తీవ్ర వేగంతో పాటించండి, తద్వారా ఆత్మలకు ఆత్మిక శక్తి యొక్క ఊరట లభించాలి, రగులుతున్న దుఃఖపు అగ్నిలో శీతల జలాన్ని నింపిన అనుభవం చేయాలి. ఈ కర్తవ్యాన్ని చేయగలరా? దూరం నుండి కూడా చేయగలరా లేక ఎదురుగా వచ్చినప్పుడే చేస్తారా? చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు అలజడి తీవ్రమయ్యే కొలది మీ సేవ కూడా ఇంకా తీవ్రమవ్వాలి. పూర్వజుల పాలన ఏమిటో అర్థమయిందా? అంతేకానీ, పూర్వజులుగా ఉన్నారు కానీ పాలన చేయలేరు అని కాదు. పూర్వజుల కర్తవ్యమే పాలన ద్వారా శక్తి నింపడము. శ్రేష్ఠమైన శక్తిశాలి స్థితి ద్వారా పరిస్థితిని దాటే శక్తిని అనుభవం చేయించండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న ఆదిదేవ్ బ్రహ్మాకు సహాయకులైన ఆది ఆత్మలందరికీ, సర్వాత్మలకు పునాది అయిన పూర్వజ ఆత్మలకు, సదా సర్వాత్మల పట్ల అనంతమైన సేవ చేసే శ్రేష్ఠ వృత్తిని ఉంచుకునే ఆత్మలందరికీ, ఆత్మిక సమాజ సేవాధారి ఆత్మలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- వర్తమాన సమయంలో అశాంతిగా ఉన్న ఆత్మలకు శాంతినివ్వడము - ఇదే అందరి విశేష కార్యము. దయాహృదయుడైన తండ్రి యొక్క పిల్లలకు సర్వాత్మల పట్ల దయ కలుగుతుంది కదా. దయాహృదయులు ఏం చేస్తారు? దయ అంటేనే అర్థము, ఎలాంటి ధైర్యాన్ని అయినా ఇవ్వడము, నిర్బల ఆత్మకు బలాన్ని ఇవ్వడము. కనుక ఆత్మల దుఃఖపూరిత సంకల్పాలు మాస్టర్ సుఖదాతలైన ఆత్మల వద్దకు తప్పకుండా చేరుకుంటాయి. ఎలాగైతే అక్కడ దుఃఖపు అల ఉందో, అలా విశేషమైన ఆత్మలలో ఇవ్వాలి, ఏదో చేయాలి అని సేవ యొక్క విశేషమైన అల నడవాలి. మేము ఏం చేసాము అని ప్రతి ఒక్కరూ తమ సేవ యొక్క అదనపు చార్టును చెక్ చేసుకోవాలి. సాధారణ సేవ నడుస్తుంది, అదైతే నడుస్తుంది. కానీ వర్తమాన సమయంలో వాయుమండలం ద్వారా, వృత్తి ద్వారా సేవ చేయడము పట్ల విశేషమైన అటెన్షన్ ఉంచండి. దీని ద్వారానే స్వస్థితి కూడా స్వతహాగా శక్తిశాలిగా అవుతుంది. ఇటువంటి అలను వ్యాపింపజేసారా? విశ్వానికి రాజులుగా అవుతారు కనుక సర్వాత్మల పట్ల అలను వ్యాపింపజేయాలి కదా. ఏ ఆత్మ వంచితమవ్వకూడదు. ఇతర ధర్మాలకు చెందిన ఆత్మలైనా కానీ వాస్తవానికి మీ వంశావళివారే. ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా కానీ అందరికీ వేర్లు ఒకటే కదా. ఈ అల ఉందా? (లేదు). అటెన్షన్ ప్లీజ్!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము -
గ్రూప్ నం.1:- వ్యర్థం యొక్క ప్రభావంలోకి వచ్చేవారిగా అవ్వకండి, మీ శ్రేష్ఠ ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి
సదా స్వయాన్ని, పురుషార్థంలో ముందుకు వెళ్ళే ఆత్మను అని అనుభవం చేస్తున్నారా? పురుషార్థంలో ఎప్పుడు కూడా ఒకసారి ఆగే కళ, ఒకసారి దిగే కళ - ఇలా ఉండకూడదు. ఒకసారి చాలా మంచిగా, ఒకసారి మంచిగా, ఒకసారి కొంచెం మంచిగా, ఇలా ఉండకూడదు. సదా చాలా మంచిగా ఉండాలి ఎందుకంటే సమయం తక్కువగా ఉంది మరియు సంపూర్ణంగా అయ్యే గమ్యము శ్రేష్ఠంగా ఉంది. కనుక మీ పురుషార్థ వేగాన్ని కూడా తీవ్రం చేయాల్సి ఉంటుంది. పురుషార్థంలో తీవ్రవేగానికి గుర్తు ఏమిటంటే - వారు సదా డబల్ లైట్‌గా ఉంటారు, ఏ రకమైన బరువును అనుభవం చేయరు. ప్రకృతి ద్వారా ఏదైనా పరిస్థితి వచ్చినా, వ్యక్తుల ద్వారా ఏదైనా పరిస్థితి వచ్చినా కానీ ప్రతి పరిస్థితి, స్వస్థితి ముందు అసలు ఏమాత్రం అనుభవమవ్వదు. స్వస్థితి యొక్క శక్తి పర-స్థితి కన్నా చాలా ఉన్నతమైనది, ఎందుకు? ఇది స్వ, అది పరాయి. మీ శక్తిని మర్చిపోతారు, అప్పుడే పర-స్థితి పెద్దదిగా అనిపిస్తుంది. సదా డబల్ లైట్ అంటే అర్థము - లైట్ అనగా పైన ఉండేవారు. తేలికగా ఉండే వస్తువు పైకి వెళ్తుంది. బరువు ఉండే వస్తువు సదా కిందకు వస్తుంది. అర్థకల్పమైతే కిందకే వస్తూ ఉన్నారు కదా. కానీ ఇప్పుడిది పైకి వెళ్ళే సమయము. కనుక ఏం చేయాలి? సదా పైన ఉండాలి.
శరీరంలో కూడా చూసినట్లయితే ఆత్మ యొక్క నివాస స్థానము పైన ఉంది, ఉన్నతంగా ఉంది. కాళ్ళలోనైతే లేదు కదా. ఏ విధంగానైతే శరీరంలో ఆత్మ స్థానము ఉన్నతంగా ఉందో, అలా స్థితి కూడా సదా ఉన్నతంగా ఉండాలి. బ్రాహ్మణుల గుర్తును కూడా ఉన్నతమైన పిలక స్థానముగా చూపిస్తారు కదా. పిలక అంటే ఉన్నతము అని అర్థము. స్థితి ఉన్నతంగా ఉంది అన్నదానికి స్థూలమైన గుర్తును చూపించారు. శూద్రులను కింద చూపిస్తారు, బ్రాహ్మణులను ఉన్నతంగా చూపిస్తారు. కనుక బ్రాహ్మణుల స్థానము మరియు స్థితి, రెండూ ఉన్నతమైనవే. ఒకవేళ స్థానము గుర్తుంటే స్థితి స్వతహాగా ఉన్నతంగా అవుతుంది. బ్రాహ్మణుల దృష్టి కూడా సదా పైన ఉంటుంది ఎందుకంటే ఆత్మ, ఆత్మలను చూస్తుంది, ఆత్మ పైన ఉంది కనుక దృష్టి కూడా పైకి వెళ్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు లేక మాట్లాడినప్పుడు ఆత్మను చూస్తూ మాట్లాడుతారు, ఆత్మతో మాట్లాడుతారు. మీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్తుంది. ఆత్మ మస్తకంలో ఉంది కదా. కనుక ఉన్నతమైన స్థితిలో స్థితులవ్వడము సహజము.
ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో, అప్పుడు కింది స్థాయి మాటల నుండి, కింది స్థాయి వాయుమండలం నుండి సదా దూరంగా ఉంటారు, వాటి ప్రభావంలోకి రారు. మంచి ప్రభావం పడుతుందా లేక చెడు ప్రభావం కూడా పడుతుందా? ఒకవేళ ప్రవృత్తిలో చెడు వాయుమండలం ఉంటే అప్పుడేం చేస్తారు? ప్రభావితులవుతారా? చెడును మంచిగా చేసేవారా లేక ప్రభావంలోకి వచ్చేవారా? ఎందుకంటే మాయ కూడా చూస్తుంది - అచ్ఛా, వ్రేలు అయితే పట్టుకున్నాను. వ్రేలు తర్వాత చేతిని పట్టుకుంటుంది, చేతి తర్వాత కాలు పట్టుకుంటుంది, అందుకే ప్రభావంలోకి రాకండి. ప్రభావంలోకి వచ్చేవారు కాదు, శ్రేష్ఠ ప్రభావాన్ని వేసేవారు. కనుక బ్రాహ్మణాత్మ అనగా సదా డబల్ లైట్, ఉన్నతంగా ఉండేవారు. ఈ స్మృతి ద్వారానే ముందుకు ఎగురుతూ వెళ్ళండి.
అందరూ సంతోషంగా ఉన్నారు కదా. దుఃఖపు అల అయితే రాదు కదా? ఎందుకంటే ఎవరైతే దుఃఖధామాన్ని వదిలి వెళ్ళారో వారి వద్దకు దుఃఖపు అల ఎలా రాగలదు. సంగమములో దుఃఖధామము మరియు సుఖధామము, రెండింటి జ్ఞానము ఉంది. మీరు రెండింటి గురించి తెలిసిన నాలెడ్జ్‌ఫుల్, శక్తిశాలి ఆత్మలు. పొరపాటున కూడా దుఃఖధామంలోకి వెళ్ళలేరు. సదా సంతోషంగా ఉండేవారి వద్దకు దుఃఖపు అల ఎప్పుడూ రాలేదు. అచ్ఛా! సేవ మరియు స్వ ఉన్నతి - రెండింటి బ్యాలెన్స్ ఉంచండి. అంతేకానీ, సేవలో మునిగిపోయి స్వ ఉన్నతిని మర్చిపోకూడదు. సేవ పట్ల అభిరుచి ఎక్కువగా ఉంది. కానీ రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి. అర్థమయిందా? మంచిగా నడుస్తున్నారు. కానీ కేవలం మంచి వరకే ఆగిపోకండి, ఇంకా మంచి కన్నా మంచిగా నడవాలి.
గ్రూప్ నం. 2 :- అనేక భావాలను సమాప్తం చేసి శ్రేష్ఠ ఆత్మిక భావాన్ని ధారణ చేయండి
ముందుకు వెళ్ళేందుకు అత్యంత సహజమైన విధి ఏమిటి? ముందుకు అయితే అందరూ వెళ్తున్నారు కానీ అన్నింటికంటే సహజమైన విధి ఏది? యోగం కూడా సహజం కావడానికి విధి ఏమిటి? అత్యంత సహజమైన విధి “నా బాబా”. ఇంకేదీ గుర్తుండకూడదు, ప్రతి సమయం ఒకే ఒక్క విషయం గుర్తుండాలి - “నా బాబా”. ఎందుకంటే మనస్సు లేదా బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడైతే నాది అనే భావం ఉంటుందో అక్కడికే వెళ్తుంది. ఒకవేళ దేహభానంలోకి వచ్చినా ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే నాది అనే భావం ఉంది. అదే “నా బాబా” అని అయిపోతే స్వతహాగానే నాది అనే వైపుకే బుద్ధి వెళ్తుంది. సహజ సాధనం “నా బాబా”. నాది అనే భావం ఇష్టం లేకపోయినా గుర్తుకొస్తుంది. శరీరం గుర్తుకురాకూడదు అని అనుకుంటారు, కానీ ఎందుకు గుర్తుకొస్తుంది? నాది అనే భావమే లాగుతుంది కదా, ఇష్టం లేకపోయినా లాగుతుంది. ఎప్పుడైతే “నా బాబా” అనే ఈ నిశ్చయము మరియు స్మృతి సదా ఉంటాయో, అప్పుడు పురుషార్థపు శ్రమ పడటానికి బదులుగా స్వతహాగానే నాది అనే భావమే లాగుతుంది. మరి సహజ సాధనం ఏమిటి అయింది? అందుకనే ‘ఒక్కరినే’ స్మృతి చేయండి. ‘ఒక్కరినే’ స్మృతి చేయడం సహజంగా ఉంటుంది.
సంబంధం ఎంతెంత లోతుగా ముడిపడి ఉంటుందో స్మృతి అంత సహజమవుతుంది మరియు సహజమైన విషయమే నిరంతరం ఉంటుంది. ఒకవేళ సహజంగా లేకపోతే నిరంతరం ఉండదు. శ్రమతో కూడిన ఏ పనీ నిరంతరం చేయలేరు. రోజంతా, రాత్రింబవళ్ళు ఎవరికైనా శ్రమతో కూడిన పనిని అప్పగిస్తే తప్పదని చేస్తారు కానీ ప్రేమతో చేయరు. కాబట్టి బాప్‌దాదా సహజం చేసి ఇస్తున్నారు. సహజం కావడం వల్ల నిరంతరం ఉండటం కష్టమేమీ కాదు. సదా ఈ స్మృతిలో ఉండేవారి గుర్తు ఏమిటి? వారు సదా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే తండ్రి నుండి ప్రాప్తి లభిస్తుంది. ప్రాప్తి కలిగినప్పుడు సంతోషం ఉంటుంది కదా. కాబట్టి “నా బాబా” అనే స్మృతికి ప్రాక్టికల్ గుర్తు ‘సంతోషం’. ఎలాంటి విషయం జరిగినా సంతోషం పోకూడదు. ఎందుకంటే ప్రాప్తి ఎదుట ఆ విషయం ఏపాటిది? ఏమీ కాదు. తండ్రి అనగానే ఆస్తి యొక్క ప్రాప్తి. తండ్రి సంబంధం ఎందుకు ప్రియంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఆస్తి లభిస్తుంది. కాబట్టి తండ్రి అనగానే ఆస్తి యొక్క స్మృతి స్వతహాగానే వస్తుంది. తండ్రి లభించారు, ఆస్తి లభించింది అంటే సంతోషం కలుగుతుంది కదా. అల్పకాలిక ప్రాప్తికే సంతోషం కలుగుతుంది. అలాంటిది ఇది అవినాశి ప్రాప్తి, దీని సంతోషం కూడా అవినాశిగా ఉండాలి కదా. మరి సంతోషంగా ఉంటున్నారా? లేక అప్పుడప్పుడు ఉంటున్నారా? సదా సంతోషంగా ఉంటున్నారా? తమదైన వస్తువును ఎన్నడూ మరచిపోరు. చిన్న వస్తువైనా తమది అయితే మరచిపోతారా? కాబట్టి ఈ ‘సంతోషం’ మన స్వంత ఖజానా. తండ్రి ఖజానా నా ఖజానా. మన స్వంత వస్తువును మరచిపోలేము. కాబట్టి నిరంతర యోగిగా అవ్వడం సహజమే కదా. ఈ సహజ విధి ద్వారా ఇతరులకు కూడా సహజంగా ప్రాప్తిని కలిగించగలరు. ఎందుకంటే తమకు సంతోషం ప్రాప్తించినప్పుడు ఇతరులకు తప్పక సంతోషాన్ని ఇస్తారు. ఎవరికైనా మంచి వస్తువు లభిస్తే వారు ఇతరులకు ఇవ్వకుండా ఉండలేరు.
బాబా ఎలాగైతే అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారో, అలాగే తమను తాము సదా అతీతంగా మరియు ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? తండ్రి అందరికీ ప్రియమైనవారిగా ఎందుకు ఉన్నారు? ఎందుకంటే అతీతంగా ఉన్నారు. ఎంత అతీతంగా అవుతారో అంతగా అందరికీ ప్రియమైనవారిగా అవుతారు. దేనికి అతీతంగా? మొదట తమ దేహ స్మృతికి అతీతంగా. దేహ స్మృతికి ఎంత అతీతంగా ఉంటారో అంతగా తండ్రికి ప్రియంగా మరియు అందరికీ ప్రియంగా ఉంటారు. ఎందుకంటే అతీతంగా ఉండటం అనగా ఆత్మాభిమానిగా ఉండటం. మధ్యలో దేహభానం వచ్చినప్పుడు ప్రియత్వం సమాప్తమైపోతుంది. అందువలన బాబా సమానంగా సదా అతీతంగా మరియు అందరికీ ప్రియంగా అవ్వండి. ఆత్మ రూపంలో ఎవరిని చూసినా ఆత్మిక ప్రేమ ఉత్పన్నమవుతుంది కదా. అదే దేహభానంతో చూస్తే వ్యక్త భావం ఉండటం వల్ల అనేక భావాలు ఉత్పన్నమవుతాయి - కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చెడుగా అనిపిస్తుంది. కానీ ఆత్మిక భావంలో, ఆత్మిక దృష్టిలో, ఆత్మిక వృత్తిలో ఉండేవారు ఎవరి సంబంధంలోకి వచ్చినా అత్యంత ప్రియంగా అనిపిస్తారు. మరి సెకనులో అతీతంగా కాగలరా? లేక సమయం పడుతుందా? శరీరంలోకి రావడం ఎంత సహజంగా అనిపిస్తుందో, శరీరం నుండి అతీతంగా కావడం కూడా అంతే సహజం కావాలి. పాత స్వభావ-సంస్కారాలు ఏవీ తమ వైపుకు ఆకర్షించకూడదు మరియు సెకనులో అతీతంగా అయిపోవాలి. రోజంతా, మధ్యమధ్యలో ఈ అభ్యాసం చేయండి. స్మృతిలో కూర్చున్న సమయంలో మాత్రమే అశరీరి స్థితి అనుభవం చేసుకోవాలి అని కాదు. కాదు. నడుస్తూ తిరుగుతూ మధ్యమధ్యలో “నేను ఉన్నదే ఆత్మను!” అనే ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోండి. మరి ఆత్మ స్వరూపం ఎక్కువగా గుర్తుండాలి కదా! సదా సంతోషం కలుగుతుంది కదా! అది తగ్గకూడదు, పెరగాలి. దానికి సాధనంగా నా బాబా అని చెప్పారు. ఇంకేది మరచినా ‘నా బాబా’ అనేదానిని మరచిపోకండి. అచ్ఛా!
ఇప్పుడు “తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం” (కమ్ ఖర్చా బాలా నషీన్) ఉండేలాంటి ఏదైనా కొత్త ఇన్వెన్షన్ కనిపెట్టండి. ఖర్చు తక్కువ కావాలి, శబ్దం కూడా ఎక్కువగా వ్యాపించాలి. ఒకప్పుడు ఎగ్జిబిషన్ (ప్రదర్శన) ఇన్వెన్షన్ కనిపెట్టారు, మేళా ఇన్వెన్షన్ కనిపెట్టారు. అది నవీనత కదా. కానీ ఇప్పుడది పాత విషయమైపోయింది. అందరూ మేము కూడా ఇలాగే చేయాలి అని అనుకునేలా ఏదైనా కొత్త ఇన్వెన్షన్ కనిపెట్టండి. ఇప్పుడు శాంతి-అనుభూతి అనే కొత్త విషయాన్ని తీసుకురాగానే అందరూ మంచి అనుభూతి పొందుతున్నారు కదా. అలాగే సేవకు సంబంధించి ఏదైనా కొత్త ఇన్వెన్షన్ కనిపెట్టండి. కాన్ఫరెన్స్ జరగడం లేదా మేళా జరగడం అనేది ఇప్పుడు పాత జాబితాలోకి వచ్చేసింది. కాబట్టి ఏదైనా నవీనత చేసి చూపించండి. అర్థమైందా?
మిమ్మల్ని మీరు కూడా ముందుకు తీసుకువెళ్ళండి మరియు సేవను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు అనంతమైన సేవ చేయాలి అని వినిపించాము కదా! సర్వ ధర్మాల ఆత్మలకు కూడా సందేశం చేరవేయాలి. మరి ఎంత సేవ ఇంకా మిగిలి ఉంది! ఇప్పుడు తీవ్ర గతితో సేవను పెంచండి. కానీ స్వ ఉన్నతి ముందు, తర్వాత సేవ. కేవలం సేవ మాత్రమే కాదు. స్వఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి - ఈ రెండూ కలిసినప్పుడే సేవ యొక్క సఫలత అవినాశిగా ఉంటుంది. లేకపోతే స్వల్ప కాలపు సఫలత మాత్రమే లభిస్తుంది. మంచిది! ఇప్పుడు చూస్తాము ఎలాంటి నవీనతను కనిపెడతారో?
గ్రూప్ నం. 3 :- ఫరిశ్తాగా అవ్వాలంటే సర్వ మోహపు బంధనాలను సమాప్తం చేయండి
బాబా సమానంగా నిరాకారి మరియు ఆకారి స్థితిలోనే స్థితమై ఉండే ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే శివబాబా నిరాకారి మరియు బ్రహ్మా బాబా ఆకారి. మరి మీరందరూ కూడా సాకారంలో ఉంటూ నిరాకారి మరియు ఆకారి అనగా అవ్యక్త స్థితిలో స్థితులు కాగలరా లేక సాకారంలోకి ఎక్కువగా వచ్చేస్తున్నారా? సాకారంలో ఉండటం ఎలాగైతే నేచురల్ అయిపోయిందో, అలాగే నేను ఆకారి ఫరిశ్తాను మరియు నిరాకారి శ్రేష్ఠ ఆత్మను అనే ఈ రెండు స్మృతులు నేచురల్ కావాలి. ఎందుకంటే ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమకు గుర్తు సమానంగా తయారవ్వడమే. బాబా మరియు దాదా నిరాకారి మరియు ఆకారిగా ఉన్నారు, ఇద్దరితోనూ ప్రేమ ఉన్నప్పుడు సమానంగా అవ్వాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడే ఆకారి, ఇప్పుడే నిరాకారి అనే అభ్యాసం సదా చేయండి. సాకారంలోకి వస్తూ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకారి మరియు నిరాకారి స్థితిలో స్థితులు కాగలగాలి. స్థూల కర్మేంద్రియాలు మీ కంట్రోల్లో ఎలాగైతే ఉన్నాయో, కన్నును లేదా నోటిని మూసుకోవాలనుకుంటే మూసుకోగలరు. అలాగే మనస్సు మరియు బుద్ధిని ఏ స్థితిలో స్థితి చేసుకోవాలనుకుంటే ఆ స్థితిలో స్థితి చేయగలగాలి. ఫరిశ్తాగా కావాలనుకుంటే సెకనులో ఫరిశ్తాగా మారేంత అభ్యాసం ఉందా లేక సమయం పడుతుందా? ఎందుకంటే అలజడి పెరిగినప్పుడు అలాంటి సమయంలో ఏ స్థితిని తయారుచేసుకోవాల్సి వస్తుంది? ఆకారి లేదా నిరాకారి స్థితిని. సాకార దేహధారి స్థితి పాస్ అవ్వనివ్వదు, ఫెయిల్ చేసేస్తుంది. ఇప్పటికీ చూడండి, ఎలాంటి అలజడి సమయంలోనైనా అచలంగా నిలిపే స్థితి ఫరిశ్తా స్వరూపం లేదా ఆత్మాభిమాని స్థితే. ఈ స్థితే అలజడిలో అచలంగా తయారుచేసేది. మరి ఏమి అభ్యాసం చేయాలి? ఆకారి మరియు నిరాకారి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితి కావాలి, దీని కొరకు రోజంతా అభ్యాసం చేయాల్సి ఉంటుంది, కేవలం అమృతవేళ మాత్రమే కాదు. మధ్యమధ్యలో ఈ అభ్యాసం చేయండి.
ఫరిశ్తా సదా పైనుండి కిందకు వస్తారు, మళ్ళీ కింద నుండి పైకి ఎగిరిపోతారు. ఫరిశ్తా సెకనులో పైకి ఎందుకు ఎగిరిపోతారు? ఎందుకంటే వారికి దేహంతో గానీ, దేహం యొక్క పాత ప్రపంచంతో గానీ ఎలాంటి మోహము ఉండదు. కాబట్టి మోహం యొక్క గొలుసులు ఏమైనా మిగిలి ఉన్నాయా అని చెక్ చేసుకోండి? మోహం యొక్క ఏ గొలుసు లేదా దారం చిక్కుకుని ఉన్నా ఎగరగలరా? ఆ తాడు లేదా దారం లాగి కిందకు తెచ్చేస్తుంది. కాబట్టి ఫరిశ్తా అనగా పాత ప్రపంచంతో ఎలాంటి సంబంధమూ లేనివారు. ఇలా ఉన్నారా లేక కొద్దికొద్దిగా సంబంధం ఉందా? స్థూలమైన దారాలైతే సమాప్తమైపోయాయి. సూక్ష్మమైనవి ఏమైనా మిగిలి ఉన్నాయా? చాలా సన్నని దారాలు ఉంటాయి. స్థూలమైనవాటిని చూసి స్వాతంత్ర్యం వచ్చేసింది అనుకుని, తీరా ఎగిరే సమయానికి కిందకు పడిపోకూడదు. అందువల్ల సూక్ష్మ రీతిలో చెక్ చేసుకోండి. అంశమాత్రంగా కూడా ఉండకూడదు. ఏ వస్తువు గురించీ కోరిక లేదు కానీ బాగుంది అనిపిస్తుంది అని కొందరు పిల్లలు అంటారు అని వినిపించాము కదా. మరి ఇది ఏమిటి? అంశమాత్రం అయింది కదా. ఏ వస్తువైతే బాగుంది అనిపిస్తుందో అది తన వైపుకు ఆకర్షిస్తుంది కదా. కాబట్టి ‘కోరిక’ అనేది లావుపాటి దారం మరియు ‘బాగుంది అనిపించడం’ అనేది సూక్ష్మమైన దారం. లావుపాటి దారాన్ని సమాప్తం చేసేశారు, కానీ సూక్ష్మమైనది ఉంటే అది ఎగరనివ్వదు.
బాబాతో ప్రేమ అనగా బాబా సమానంగా అవ్వడం. రోజూ ఫరిశ్తా గురించి వింటున్నారు కదా. కేవలం వింటున్నారా లేక తయారయ్యారా? అవుతున్నారా లేక అయ్యారా? ఎప్పటివరకు అవుతారు? వినాశనం వరకా? అంతకంటే ముందే తయారైతే దానికి లెక్క ఉంటుంది. 10 సంవత్సరాలలో వినాశనం జరుగుతుంది కదా అని 9 సంవత్సరాల తర్వాత ఆ ఒక్క సంవత్సరంలో తయారవుదాము అని ఇలా అనుకోకండి. అలా చేయకూడదు. బహు కాలం కావాలి. స్వల్ప సమయం యొక్క అభ్యాసమైతే స్వల్ప సమయమే స్థితులవుతారు కానీ బహు కాలం కాలేరు, శ్రమ పడాల్సి వస్తుంది. ఇప్పుడే శ్రమ పడితే ఆ సమయంలో శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. శ్రమ పడుతూ-పడుతూ వెళ్ళిపోతే రిజల్ట్ ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తారు, సూర్యవంశంలోకా లేక చంద్రవంశంలోకా? కాబట్టి చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి. ఏ లోపం ఉన్నా దాన్ని భర్తీ చేసుకుంటూ వెళ్ళండి. సంపన్నంగా అవ్వండి. బాబాకు ప్రేమ యొక్క రుజువును ఇవ్వాలి - సమానంగా కావాలి అని సదా గుర్తుంచుకోండి. సదా తమను బాబా సమానంగా తయారుచేసుకునే అభ్యాసాన్ని మరింత తీవ్ర గతితో పెంచుకోండి. అచ్ఛా!
గ్రూప్ నం. 4 :- యజమానియే బాలకుడు - ఈ డబల్ నషా నిర్విఘ్నంగా తయారు చేస్తుంది
సదా యజమానితనం మరియు బాలకతనం యొక్క నషాలో ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు యజమాని స్థితిలో స్థితులు కావడం మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాలక స్థితిలో స్థితులు కావడం - ఇలాంటి అనుభవం ఉందా? లేదా బాలకులుగా కావాల్సిన సమయంలో యజమానిగా అయిపోవడం, యజమానిగా కావాల్సిన సమయంలో బాలకులుగా అయిపోవడం జరుగుతుందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఆ స్థితిలో స్థితులు కాగలరా? ఎందుకంటే ఈ డబల్ నషా సదా నిర్విఘ్నంగా తయారుచేసేది. ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఆ సమయంలో ఏ స్థితిలో స్థితి కావాలో, అందులో స్థితి కాకపోవడం వల్లే విఘ్నం వస్తుంది.
విఘ్న వినాశక ఆత్మలా లేక విఘ్నాలకు వశమయ్యేవారా? మన టైటిలే ‘విఘ్న-వినాశకుడు’ అనే స్మృతిని సదా ఉంచుకోండి. విఘ్న-వినాశక ఆత్మ స్వయంగా విఘ్నంలోకి ఎలా వస్తుంది? ఎవరెంతటి విఘ్న రూపంగా వచ్చినా కానీ మీరు విఘ్నాన్ని వినాశనం చేస్తారు. కేవలం తమ కొరకే విఘ్న-వినాశకులు కారు, సమస్త విశ్వానికీ విఘ్న-వినాశకులు. విశ్వ-పరివర్తకులు. మరి విశ్వ-పరివర్తకులు శక్తిశాలిగా ఉంటారు కదా. శక్తి ఎదుట ఎవరెంత శక్తిశాలిగా ఉన్నా వారు బలహీనులుగా మారిపోతారు. విఘ్నాన్ని బలహీనం చేసేవారే తప్ప స్వయం బలహీనమయ్యేవారు కారు. స్వయం బలహీనపడితే విఘ్నం శక్తిశాలిగా మారుతుంది మరియు స్వయం శక్తిశాలిగా ఉంటే విఘ్నం బలహీనమైపోతుంది. కాబట్టి సదా మీ మాస్టర్ సర్వశక్తిమాన్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి.
వినడం అయితే చాలా విన్నారు, ఇక మిగిలింది ఏమిటి? అవ్వడమే. వినడము అంటే అవ్వడము అని అర్థము. మరి అయ్యారా? ఇలాంటి శక్తిశాలి పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తారు. లౌకికంలో కూడా తండ్రికి ఎలాంటి పిల్లలు ప్రియంగా అనిపిస్తారు? ఆజ్ఞాకారులుగా, ఫాలో ఫాదర్ చేసేవారిగా ఉండేవారు. మరి మీరు ఎవరు? ఫాలో ఫాదర్ చేసేవారు. ఫాలో చేయడం సహజంగా ఉంటుంది కదా. బాబా చెప్పారు, పిల్లలు చేశారు. ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. చేద్దామా, వద్దా, మంచి జరుగుతుందా, జరగదా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఫాలో చేయడం సహజం కదా. ప్రతి కర్మలోనూ ఏమేమి ఫాలో చేయాలి, ఎలా చేయాలో కూడా అందరికీ స్పష్టంగా ఉంది. ప్రతి అడుగులోనూ ఫాలో చేసేవారికి ఎలాంటి నషా ఉంటుంది? ప్రతి కర్మలోనూ సఫలత జరిగే ఉంది అనే నిశ్చయపు నషా ఉంటుంది. జరుగుతుందా లేదా అని కాదు. జరిగే ఉంది. ఎందుకంటే కల్ప క్రితం కూడా పాండవుల విజయమే జరిగింది కదా. పాండవులు ఏమి చేశారు? భగవంతుని మతంపై నడిచారు అనగా ఫాలో చేశారు కాబట్టి విజయం లభించింది. మరి అదే కల్ప క్రితం నాటివారే కదా. కాబట్టి ఈ నిశ్చయమే స్వతహాగా నషాను రప్పిస్తుంది. ఏ విషయమూ కష్టంగా అనిపించదు. కాబట్టి సదా సహజమైన మరియు శ్రేష్ఠమైన ప్రాప్తి అనుభవాన్ని చేసుకుంటూ సాగండి. యజమానియే బాలకులు - సమయానుకూలంగా ఈ డబల్ నషాను ప్రాక్టికల్లోకి తీసుకురండి. అప్పుడప్పుడు ఏదైనా గొడవ జరిగినా కానీ సంతోషం తగ్గకూడదు. సదా సంతోషంగా ఉండండి. అచ్ఛా!
గ్రూప్ నం. 5 :- కేవలం కళ్యాణకారులుగా కాదు, విశ్వ-కళ్యాణకారులుగా అవ్వండి
తమను సదా సంగమయుగపు కళ్యాణకారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ సృష్టి చక్రంలో సంగమయుగం ఒక్కటే ఎక్కే కళ యొక్క యుగం. ఇతర యుగాలు క్రమక్రమంగా కిందకు దింపుతాయి. సత్యయుగం నుండి కలియుగంలోకి వచ్చేసరికి ఎన్ని కళలు తగ్గిపోతాయి? కాబట్టి అన్ని యుగాలలోనూ కిందకు దిగుతారు మరియు సంగమయుగంలో పైకెక్కుతారు. ఎక్కడానికి కూడా లిఫ్ట్ లభిస్తుంది. అందరికీ లిఫ్ట్ లభించింది కదా. మధ్యలో ఎక్కడా చిక్కుకుపోవడం లేదు కదా? ఎప్పుడైనా చిక్కుకుపోవడం, వేలాడటం జరగట్లేదు కదా. ఎన్నడూ వేలాడనివ్వని, చిక్కుకోనివ్వని అలాంటి లిఫ్ట్ లభిస్తుంది. చూడండి, కళ్యాణకారి యుగంలోకి వచ్చినందుకు మరియు కళ్యాణకారి తండ్రి లభించినందుకు ఎంత లక్కీ! మీ ఆక్యుపేషన్ కూడా విశ్వ-కళ్యాణకారి. కాబట్టి తండ్రి కూడా కళ్యాణకారి, యుగం కూడా కళ్యాణకారి, మీరు కూడా కళ్యాణకారి మరియు మీ ఆక్యుపేషన్ కూడా విశ్వ-కళ్యాణకారి. మరి ఎంత లక్కీ! సరే, ఈ లక్ ఎంత సమయం నడుస్తుంది? పూర్తి కల్పమా లేక అర్థ కల్పమా? అర్థ కల్పం అనేవారు చేతులెత్తండి. పూర్తి కల్పం అనేవారు చేతులెత్తండి. అందరూ సరైనవారే. ఎందుకంటే అర్థ కల్పం రాజ్యం చేస్తారు, అర్థ కల్పం పూజ్యులుగా అవుతారు. కాబట్టి ఇది కూడా లక్.
డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా? మీ మందిరాలు ఉన్నాయా? చూడండి, 33 కోట్ల మందిని గాయనం చేసి పూజించేది ఒకే ఒక్క దేవతా ధర్మంలోనే. మీరు అందులో అయితే ఎలాగూ ఉన్నారు కదా. సరే, ఆబూలో మీ మందిరాన్ని చూశారా? అందులో మీ విగ్రహం ఉందా? ఇది నాది అని నంబర్ వేసుకుని వచ్చారా? బాబాను ఫాలో చేసేవారైనప్పుడు, బ్రహ్మా బాబా ఎలాగైతే పూజ్యులుగా అవుతారో, ఫాలో చేసేవారు కూడా తప్పక పూజ్యులుగానే అవుతారు. పూర్తి కల్పమంతా బ్రహ్మా బాబాతో కలిసి రాజ్యము, పూజ మరియు పూజ్యులుగా అయ్యే సర్వ పాత్రలనూ అభినయిస్తారు. అలాంటి నిశ్చయం ఉందా? పూజను కూడా బ్రహ్మా బాబాతో కలిసే ప్రారంభిస్తారు. ఎవరి పూజ ప్రారంభిస్తారు? మీరు పూజ చేశారా? మీ పూజ మీరే చేసుకున్నారా? దేవతలను పూజించారు అంటే మిమ్మల్ని మీరే పూజించుకున్నట్లే కదా. అందుకే స్వయమే పూజ్యులు, స్వయమే పూజారులు అని గానం చేయబడింది. బ్రహ్మా బాబాతో ఎంత ప్రేమ ఉందంటే సదా తోడుగానే ఉంటారు. కానీ ఎవరు తోడుగా ఉంటారు? ఫాలో చేసేవారే. కాబట్టి ఏ కర్మ చేస్తున్నా అది బ్రహ్మా బాబా సమానమైన శ్రేష్ఠ కర్మనా లేక సాధారణ కర్మనా అని చెక్ చేసుకోండి? విశేష కర్మలు చేసేవారిగా అయినప్పుడే విశేష బ్రహ్మా ఆత్మతో కలిసి పాత్రను అభినయిస్తారు.
నేను సదా విశ్వ-కళ్యాణకారి ఆత్మను అనే ఈ స్మృతిలో ఉండటం వల్ల ఏ కర్మ చేసినా కళ్యాణకారకమైనదే చేస్తారు. కళ్యాణకారి అని భావించడం వల్ల కళ్యాణకారి అయిన సంగమయుగం కూడా గుర్తుకొస్తుంది మరియు కళ్యాణకారి అయిన తండ్రి కూడా స్వతహాగానే గుర్తుకొస్తారు. కేవలం కళ్యాణకారులుగా మాత్రమే కాదు, విశ్వ-కళ్యాణకారులుగా అవ్వాలి. సంగమయుగంలో సాధారణ ఆత్మలుగా ఉండడమే అత్యంత గొప్ప భాగ్యానికి గుర్తు. ఒకవేళ షాహుకారులుగా ఉండి ఉంటే బాబావారిగా అయ్యేవారు కాదు, కేవలం కలియుగపు షాహుకారితనం మాత్రమే భాగ్యంలో దక్కేది. కాబట్టి సాధారణంగా ఉండడమే మంచిది కదా. స్థూల ధనంతో సాధారణమైనవారే కానీ జ్ఞాన ధనంతో షాహుకారులు. కాబట్టి బాబా సమస్త విశ్వం నుండి మనలను తమవారిగా చేసుకున్నారు అనే సంతోషం ఉంది కదా. రోజంతా సంతోషంలో ఉంటున్నారా? మురళి రోజూ వింటున్నారా? ఎప్పుడూ మిస్ చేయట్లేదు కదా? మిస్ చేస్తే ఫాలో ఫాదర్ కానట్లే కదా. బ్రహ్మా బాబా ఒక్క రోజు కూడా మురళిని మిస్ చేయలేదు. అచ్ఛా!
మధుబన్ నివాసులు మరియు గ్లోబల్ హాస్పిటల్ వారు - ఇద్దరూ చక్కటి సేవ చేస్తున్నారు. ఈ గ్లోబల్ వారు శరీరాలను నిరోగిగా చేసి ఆత్మను శక్తిశాలిగా తయారుచేస్తున్నారు మరియు మధుబన్ నివాసులు అందరినీ సంతుష్టం చేసే సేవ చేస్తున్నారు. ఇద్దరి సేవనూ చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. సేవాధారులు కూడా అలసిపోని విధంగా అయి సేవలో సదా ముందుకు సాగుతున్నారు. అందరికీ సేవ యొక్క అభినందనలు! సాల్గావ్లో కూడా ఎంతో ప్రేమతో సేవ చేస్తున్నారు, మీ ప్రేమపూర్వక సేవ సఫలతను సమీపానికి తీసుకువస్తుంది. కింద తలహటీ వారు కూడా మంచి సేవను చేస్తున్నారు. డబల్ విదేశీయులు కూడా మంచి సేవ చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు మరియు మంచిగానే కొనసాగుతుంది. విదేశాలలో కూడా మంచి సేవ యొక్క ఉత్సాహం ఉంది. భారతదేశం మరియు విదేశాలలో సేవ వృద్ధిని పొందుతోంది మరియు తీవ్ర గతితో వృద్ధిని పొందాల్సిందే. అచ్ఛా!
డబల్ విదేశీ సోదర-సోదరీల కోసం బాప్‌దాదా సందేశం:- అందరూ సేవ అనే లగ్నంలో లీనమై ఉండేవారు. స్వ-ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి - రెండింటి బ్యాలెన్స్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు మరియు సాగిస్తున్నారు. సేవ కూడా జరుగుతుంది మరియు స్మృతిలోనూ కూర్చుంటున్నారు. కానీ ఇప్పుడు బ్యాలెన్స్‌పై మరింత అటెన్షన్ ఇస్తూ నడవండి. కొన్నిసార్లు సేవలో చాలా ముందుకు వెళ్ళిపోతారు, కొన్నిసార్లు స్వ-ఉన్నతి పట్ల కూడా లగ్నం ఏర్పడుతుంది. కానీ రెండూ కలిసి సాగితే సఫలత సహజంగా మరియు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది. కాబట్టి ఈ అటెన్షన్‌నే ఇప్పిస్తూ ఉంటున్నారు కదా. ఎవరికైతే బ్యాలెన్స్ ఉంచడం వచ్చో వారు సదా ఆశీర్వాదాలను తీసుకుంటారు మరియు ఆశీర్వాదాలను ఇస్తారు. బ్యాలెన్స్ యొక్క ప్రాప్తియే బ్లెస్సింగ్. బ్యాలెన్స్ ఉన్నవారికి బ్లెస్సింగ్ లభించకపోవడం అనేది జరగదు. కాబట్టి బ్యాలెన్స్‌కు గుర్తు బ్లెస్సింగ్. ఒకవేళ లభించకపోతే బ్యాలెన్స్ లోపం ఉందని అర్థం. మీ అందరి పాలన దేనితో జరిగింది? ఆశీర్వాదాలతోనే ముందుకు సాగారు కదా, ఏమైనా శ్రమ పడాల్సి వచ్చిందా? తల్లి, తండ్రి మరియు పరివార ఆశీర్వాదాలతో సహజంగా ముందుకు సాగుతూ వెళ్ళారు మరియు ఇప్పటికీ ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. మహారథుల పాలన ఏమిటి? ఆశీర్వాదాలే కదా. మీకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తున్నాయి! కాబట్టి మహారథుల పాలనే ఆశీర్వాదాలు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
