Search for a command to run...
8 May 1969
మనసా వాచ కర్మణలను సరి చేసుకునే యుక్తి
8 May 1969 · తెలుగు
ఈరోజు బాబా విశేషంగా ఒక ప్రత్యేకమైన కార్యం కోసం వచ్చారు. ఇక్కడ ఎవరైతే అందరూ కూర్చుని ఉన్నారో వారందరూ స్వయాన్ని నిశ్చయబుద్ధి కలవారిగా భావిస్తున్నారా? (నంబరువారీగా ఉన్నాము) నంబరువారీగా ఉన్నా కానీ నిశ్చయుబుద్ధితో ఉన్నారా? నిశ్చయబుద్ధి అన్న టైటిల్ ఇవ్వవచ్చా? నిశ్చయంలో నంబరు ఉంటుందా లేక పురుషార్థంలో నంబరు ఉంటుందా? నిశ్చయంలో ఎప్పుడూ శాతం ఉండదు, నిశ్చయంలో ఎప్పుడూ నంబరువారీగా ఉండరు. పురుషార్థపు స్థితిలో నంబరు ఉంటుంది. నిశ్చయబుద్ధిలో నంబరు ఉండదు. అయితే నిశ్చయము ఉంటుంది లేకపోతే సంశయము. నిశ్చయంలో ఒకవేళ కొంచెమైనా సంశయం ఉంటే, మనసాలో కావచ్చు, వాచలో కావచ్చు, కర్మణలో కావచ్చు, మనసులో ఒక్క సంకల్పమైనా సంశయంతో కూడినదై ఉంటే సంశయబుద్ధి అనే చెప్తాము. ఇటువంటి నిశ్చయబుద్ధిగా అందరూ ఉన్నారా? నిశ్చయబుద్ధికి ముఖ్య పరిశీలన ఏమిటి? పరిశీలించడానికి ముఖ్య విషయం ఏమైనా ఉంటుందా? మీ ముందుకు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, వారి చరిత్ర మీకు తెలియదు, అప్పుడు వారిని మీరు ఎలా పరిశీలిస్తారు? (వైబ్రేషన్ ద్వారా) మీరు పరిశీలించగలిగేలా ఏ వైబ్రేషన్ వస్తుంది? ఇప్పుడు ఇది ప్రాక్టీసు చేయండి. ఎందుకంటే వర్తమాన సమయంలో ప్రజలు చాలామంది పెరుగుతారు. మరి ప్రజలను మరియు సమీపమైనవారిని పరిశీలించేందుకు చాలా అభ్యాసం కావాలి.
పరిశీలనకు ముఖ్య విషయము, వారి నయనాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా గురి వైపు ఏకాగ్రంగా చూస్తే వారి నయనాలు ఎలా ఉంటాయి? బాణం వేసేవారు, గురి పెట్టే మిలటరీ వారు పూర్తిగా గురి పెడతారు. వారి నయనాలు, వారి వృత్తి ఆ సమయంలో ఒకే వైపుకు ఉంటాయి. ఎవరైతే ఇటువంటి నిశ్చయబుద్ధితో పక్కాగా ఉంటారో వారి ముఖం ద్వారా వీరు గురిపెడ్తున్నారు అని మీకు అనిపిస్తుంది. ఒకే వైపుకు గురి పెట్టండి అనగా బిందువును చూడండి అని మీకు ముఖ్యమైన శిక్షణ లభించింది. మరి నిశ్చయబుద్ధి యొక్క లక్షణము ఏమిటి? పూర్తిగా గురి పెడ్తారు. గురి కొద్దిగా తప్పినా కానీ ఓడిపోయినట్లు. నిశ్చయబుద్ధి ఉన్నవారి నయనాలు ఎలా ఉంటాయంటే అవి చూస్తూ కూడా మరేదో చూస్తున్నట్లుగా ఉంటాయి. వారి మాటలు కూడా అలాగే ఉంటాయి. ఇది నిశ్చయబుద్ధి యొక్క గుర్తు. గురిపెట్టే వారి స్థితి నషాతో ఉంటుంది, కనుక నిశ్చయబుద్ధి యొక్క గుర్తు గురి పెట్టడము, వారి స్థితి నషాతో ఉంటుంది. ఈ అభ్యాసాన్ని ఇప్పుడు చేయండి. తర్వాత, మా నిర్థారణ సరైనదా కాదా అని పరిశీలించుకోండి. అలా అభ్యాసం చేస్తూ చేస్తూ పరిశీలన యథార్థంగా అయిపోతుంది. దృష్టిలో సృష్టి అంటారు కదా. మరి మీరు వారి దృష్టిలో పూర్తి సృష్టిని తెలుసుకోగలరు.
మనసా, వాచ, కర్మణ – మూడింటిని సరి చేసుకోవడానికి కేవలం మూడు పదాలను గుర్తు పెట్టుకోండి. ఆ మూడు పదాలు ఏమిటి? ఆ మూడు పదాలు రోజూ మురళిలో కూడా వస్తాయి. మనసు కోసం నిరాకారి, వాచ కోసం నిరహంకారి, కర్మణ కోసం నిర్వికారి. దేవతలకు నిదర్శనంగా వారి వాచ మరియు కర్మణలే ఉంటాయి కదా. మరి నిరాకారి, నిరహంకారి మరియు నిర్వికారి ఈ మూడు మాటలను ఒకవేళ గుర్తుంచుకుంటే మనసా-వాచ-కర్మణ మూడింటిలో చాలా బాగుంటారు. ఎంతగా నిరాకారి స్థితిలో ఉంటారో అంతగా నిరహంకారి మరియు నిర్వికారిగా ఉంటారు. ఎటువంటి వికారాల దుర్గంధము ఉండదు. ఇదే ముఖ్య పురుషార్థము. ఈ మూడు మాటలను గుర్తుంచుకుంటే ఎలా తయారవుతారు? త్రికాలదర్శిగా కూడా అవుతారు. భవిష్యత్తులో విశ్వానికి యజమానిగా అవుతారు. ఇప్పుడు త్రిలోకినాథులుగా, త్రికాలదర్శిగా అవుతారు. త్రిలోకినాథుడు అంటే అర్థం తెలిసింది కదా. ఎవరైతే మూడు లోకాలను తెలుసుకుని స్మరిస్తారో వారే త్రిలోకినాథులు ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీరందరూ కూడా ఉన్నారు కదా. అచ్ఛా!
ఓంశాంతి