Search for a command to run...
22 January 1969 · తెలుగు
మధ్యాహ్నం భోగ్ సమయంలో వతనం యొక్క సమాచారము
ఈరోజు వతనానికి వెళ్ళినప్పుడు, బ్రహ్మా బాబా ఇక్కడ ఎలా అయితే కలిసేవారో అలాగే అక్కడ కూడా కలిసారు. పిల్లల భోజన సమయానికన్నా ఆలస్యంగా వచ్చారు అని బాబా అన్నారు. నేనన్నాను – బాబా, మీరైతే ఒకటి, ఒకటిన్నరకు భోజనం చేసేవారు కదా. బాబా అన్నారు – బాబా పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు పిల్లల సమయానికి చేసేవారు. ఆ సమయం ప్రకారంగా చూసుకుంటే ఆలస్యంగా వచ్చారు కదా. తర్వాత బాబా, తీసుకువెళ్ళు అని బ్రహ్మా బాబాకు చెప్పారు... వెళ్ళి ఏమి చూసానంటే, ఇక్కడ ఎలా అయితే ఆఫీసులో కుర్చీపై బాబా వచ్చి కూర్చునేవారో, ఉత్తరాలు వ్రాసేవారో, అదే కుర్చీ, అదే అట్ట, అదే పెన్సిల్ పెట్టి ఉన్నాయి. ఈ వస్తువులన్నీ వతనానికి ఎలా వచ్చాయి అని నేను కంగారు పడ్డాను. తర్వాత బాబా తమ హస్తాలతో వ్రాసిన ఉత్తరాన్ని నాకిచ్చారు. నేను చదివాను. అందులో ఇలా వ్రాసి ఉంది –
‘‘స్వదర్శన చక్రధారి కనుపాపలకు ప్రియస్మృతులు, తర్వాత, ఈరోజు, అవ్యక్త స్థితిలో స్థితులైన పిల్లలను అవ్యక్త రూపంలో కలుస్తున్నాము’’. రెండవ పేజీలో ఇలా వ్రాసి ఉంది – ‘‘పిల్లలూ, బాప్దాదా యొక్క సాకార రూపం ద్వారా ఏ శిక్షణలైతే లభించాయో దానిని విస్తరిస్తూ ఉండండి. ఇప్పుడిక గుర్తు చేయకండి, మర్చిపోకండి’’
వీడ్కోలు తర్వాత బాబా ఏ విధంగా అయితే సంతకం చేసేవారో అలాగే చేసి ఉంది. మేము మా సమయానికి ఉత్తరాన్ని వ్రాసి ఉంచి భోజనం కోసం వేచి ఉన్నాము అని బాబా అన్నారు. తర్వాత భోజనం తినిపించాము. బాబా అన్నారు – వతనంలో తింటున్నా కానీ యజ్ఞ భోజనము యొక్క రుచి చాలా బాగుంటుంది.
తర్వాత బాబా భోజనాన్ని స్వీకరించారు. మేము తిరిగి వస్తుంటే, బాబా ఒక దృశ్యాన్ని చూపించారు – ఒక సాగరం ఉంది, అందులో అలలు చాలా వేగంగా వస్తున్నాయి. మీరు ఈ సాగర మధ్యలోకి వెళ్ళండి అని బాబా నాతో అన్నారు. నేను భయపడ్డాను, ఇంత పెద్ద అలల మధ్యలోకి నేను ఎలా వెళ్ళను అనుకున్నాను. అయినా కానీ బాబా ఆజ్ఞ అనుసారంగా పాదం పెట్టాను. ఎక్కడ పాదం పెట్టానో అక్కడి అలలు శాంతించసాగాయి. తర్వాత బాప్ దాదా ఇరువురూ ఆ సాగరం మధ్యలో చిన్న చిన్న పడవలు వేసారు కానీ సాగరంలోని అలల కారణంగా అవి మాయమైపోయాయి. కొన్ని అయితే అలల కారణంగా అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. కొన్ని అయితే ఎక్కడ ఉన్నవి అక్కడే ఉన్నాయి. మేము ఇది చూడటంలోనే బిజీ అయిపోయాము. తర్వాత ఆ దృశ్యం సమాప్తమయింది.
ఈ ఆటను బాబా ప్రాక్టికల్లో రచించారు అని బాప్దాదా చెప్పారు. ఏ పిల్లల జీవితము అను నావలు బాబా చేతిలో ఉంటాయో వారు కదలరు. ఇప్పుడు పరీక్షలు అను సాగరం మధ్యనుండి నడుస్తున్నారు. ఎవరి కనెక్షన్ అనగా ఎవరి చేయి బాప్దాదా చేతిలో ఉంటుందో వారి జీవితము అను నావ ఊగిసలాడదు, మునగదు. పిల్లలైన మీరు దీనిని డ్రామాలోని ఆటగా భావిస్తే కదలరు. ఎవరి బుద్ధి రూపి చేయి, తోడు ఢీలాగా ఉంటాయో వారు ఊగిసలాడుతూ ఉంటారు. కనుక పిల్లలు తమ బుద్ధి రూపి చేతిని గట్టిగా పట్టుకుని ఉండటంపై శ్రద్ధ ఉంచాలి.
ఓంశాంతి