Search for a command to run...
21 Jan 1969
అచలము మరియు అఖండము – ఈ బహుమతిని బుద్ధి రూపి ఖజానాలో భద్రపరుచుకోండి
21 January 1969 · తెలుగు
ఈరోజు వతనానికి వెళ్ళినప్పుడు పిల్లలందరి తరఫున బాబాకు ప్రియస్మృతులను ఇచ్చాను మరియు అర్జీను పెట్టాను. బ్రహ్మా బాబాకు కూడా అర్జీ పెట్టాను. బ్రహ్మా బాబా అయితే, నా చేయి శివబాబా వద్దనే ఉంది, వారు ఏమి చేయిస్తే అదే చేస్తాను అన్నారు. నేను శివబాబాతో అన్నాను – బాబా, ఇంతమంది మీ పిల్లలు ఉన్నారు, మీరు అందరి ఆశలను పూర్తి చేసేవారు. బాబా, మా ఒక్క ఆశను పూర్తి చేయండి అన్నాను. వెంటనే బాబా ఒక కొమ్మను చూపించారు, దాని మధ్యలో ఇలా వ్రాసి ఉంది – విధిని ఎవ్వరూ తప్పించలేరు. నేనన్నాను, ఒకవేళ ఇదే విధి అయితే పిల్లలందరూ శివబాబా మరియు బ్రహ్మా బాబాను కలవాలనుకుంటున్నారు. బాప్‌దాదా ఎప్పుడూ పిల్లలను ఎలా కలిసేవారో అలాగే ఈరోజు కూడా పిల్లలతో బాప్‌దాదా కలుస్తారు అన్నారు. తర్వాత, మీరేమంటారు అని శివబాబా, బ్రహ్మా బాబాను అడిగారు. శివబాబా అన్నారు, పిల్లలు పెద్దవారైతే తండ్రి మరియు పిల్లలు సమానం అవుతారు. మరి నేను కూడా నా ప్రియమైన సంతానము యొక్క సలహా తీసుకోకుండా ఏమీ చేయను. ముందు తండ్రి తర్వాత పిల్లలు, కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు ముందు, తర్వాత తండ్రి. ఇలా ఇద్దరూ వతనంలో సమానంగా మరియు ఎంతో స్నేహము మరియు ప్రేమతో మాట్లాడుకోవడాన్ని చూసాను. ఇద్దరు మిత్రులు కలిస్తే ఎలా ఉంటుందో, అలాగే బాబా-దాదా ఇద్దరి మధ్య జరిగే ఆత్మిక సంభాషణ కనిపించింది. ‘మీ ఆజ్ఞ’ అని బ్రహ్మా బాబా అన్నారు. ‘బ్రహ్మా యొక్క సలహా పాటిస్తాము’ అని శివబాబా అన్నారు. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరూ నవ్వుతున్నారు. నేనన్నాను – ఒక్క సెకండు కోసం పిల్లలను కలిసి రండి. ఆ సమయంలో ఇద్దరి వైపు చూసాను, శివబాబా చెప్పినది బ్రహ్మా బాబాకు సమ్మతమే అన్నట్లుగా వారి నయనాల ద్వారా నాకు అనిపించింది.
ఆ తర్వాత బాప్‌దాదా సందేశి అయిన గుల్జార్గారి తనువులోకి ప్రవేశించి ఇలా ఉచ్ఛరించారు –
‘‘మిమ్మల్ని ఆకారీగా చేయడానికి బాప్‌దాదా ఇప్పుడు కూడా నిలిచి ఉన్నారు మరియు నిలిచి ఉంటారు. ఇప్పుడు బాప్‌దాదా ఆత్మిక రత్నాలైన మిమ్మల్ని కలిసి వీడ్కోలు తీసుకుంటున్నారు, తర్వాత కలుస్తాము. ఏది జరిగినా అందులో కళ్యాణము ఉంది. బాప్‌దాదా మరియు కళ్యాణము, మరో మాట వద్దు’’. అంతే, బాప్‌దాదా ఈ రెండు మహావాక్యాలే ఉచ్ఛరించి తిరిగి అవ్యక్త వతనానికి వెళ్ళిపోయారు.
సందేశి తిరిగి వచ్చాక వతనం నుండి సందేశము
‘‘ప్రేమ మరియు స్మృతి – ఈ రెండింటినీ బాబా ప్రతి ఒక్కరిలో చూసారు. ఇలాగే ప్రేమ మరియు స్మృతిని స్థిరంగా ఎప్పటికీ పెట్టుకోండి. ఈ ప్రేమ మరియు స్మృతి ఒక తాడు వంటివి. ఆ తాడును స్థిరంగా పెట్టుకోండి. ఈ తాడు ద్వారానే మధ్యలో కలుస్తూ ఉంటాము. స్థాపన కార్యంలో ఏది, ఎలా ఆది నుండి జరుగుతూ వచ్చిందో అంతిమం వరకు అలాగే జరుగుతుంది. ఏమీ తేడా ఉండదు. ఏ పిల్లలనైతే బాబా నిమిత్తం చేస్తారో వారి ద్వారా బాప్‌దాదా పిల్లలందరికీ డైరెక్షన్లను ఇస్తూ ఉంటారు. బాప్‌దాదా ఇరువురూ కలిసి ఎలా డైరెక్షన్లను ఇస్తారో పిల్లలు అనుభవం చేసుకుంటారు. సంగమయుగంలో బాప్ దాదా ఇరువురూ వేరు అవ్వరు. అందరికీ రెండు మాటలను చెప్పమని బాబా అన్నారు – అచలము మరియు అఖండము. ఇది బాప్ దాదా ఇరువురు ఇచ్చే బహుమతి. దీనిని బుద్ధి రూపి ఖజానాలో ఎంత భద్రంగా పెట్టుకోవాలంటే ఎవరు దీనిని దొంగిలించాలని చూసినా కానీ ఈ బహుమతి మాత్రం మీతోనే ఉండాలి. తర్వాత బాబా అన్నారు, ఇప్పుడు కొద్ది సమయం కోసం వీడ్కోలు తీసుకుంటున్నాము. తర్వాత కార్యం అనుసారంగా డైరెక్షన్లను ఇస్తూ ఉంటాము’’.
21-01-1969
‘‘శరీరం వీడింది కానీ చేయి మరియు తోడు వీడలేదు’’
అందరూ అవ్యక్తమూర్తులై కూర్చున్నారా? వ్యక్త రూపంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండాలి. అవ్యక్త స్థితిలో స్థితులైనప్పుడు ఆ అవ్యక్త స్థితిలో ఎటువంటి గందరగోళం ఉండదు. వర్తమాన సమయంలో జరిగే అన్ని పాత్రలు పిల్లలైన మిమ్మల్ని అతి శీఘ్రంగా అవ్యక్తంగా చేసేందుకు సాధనాలు. అలజడిలోకి వచ్చే అవసరము లేదు. ఆరంభంలో యజ్ఞ స్థాపన ఎంతో అనాయాసంగా జరిగిపోయింది. మీరు ఆరంభంలో యజ్ఞ స్థాపనలో వచ్చినప్పుడు మీ అందరితో నిశ్చయ పత్రాన్ని రాయించడం జరిగింది. నిశ్చయంలో ఇదే వ్రాయించాము కదా – ఒకవేళ బ్రహ్మా వెళ్ళిపోయినా కానీ, అప్పుడు కూడా మా స్థితి, మా నిశ్చయము అచంచలంగా ఉంటుంది. ఆ నిశ్చయ పత్రము గుర్తుందా? నిశ్చయము అంటే ఏ విధమైన, ఎటువంటి స్థితి అనుసారంగా అయినాగానీ, విఘ్న సమయమైనాగానీ సంశయము రాకుండా ఉండటము. పరిస్థితులైతే మారవలసిందే, మారుతూనే ఉంటాయి, ప్రపంచం మారినా కానీ మేము మారము అని మీరు పాట పాడుతుంటారు కదా. మరి అటువంటి నిశ్చయబుద్ధి కలవారి సంగఠనయే కదా ఇది? నిశ్చయానికి ఆధారంగా నిలిచినవన్నీ తొలగుతూ ఉంటాయి, అవి తొలగినా కానీ నిశ్చయం యొక్క పునాది గట్టిగా ఉండాలి అని మీ మమ్మా అంటూ ఉండేవారు కదా. పునాది సరిగ్గా లేకపోతేనే ఆధారం అవసరమవుతుంది. ఆధారము ఏమిటి? బాబా ఆధారము, సంగఠన ఆధారము, పరివారపు నియమాల ఆధారాన్ని విడిచిపెట్టవద్దు. కానీ పరీక్ష సమయంలో ఏ దృశ్యమైతే మీ ఎదురుగా వస్తుందో అందులో నిశ్చయం తగ్గలేదు కదా? నిశ్చయం ఎడతెగనిదిగా ఉంటుంది, అది తెంచితే తెగేది కాదు. ఇటువంటి నిశ్చయబుద్ధి వారే కంఠహారములుగా అవుతారు.
బ్రహ్మా మీకు అతి ప్రియమైనవారేనా? ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా మీకు ప్రియమైనవారే. మరి వారు ఇవన్నీ చెప్పలేదా? అన్ని విషయాలను చెప్పి ఉన్నారు. సమయానికి గుర్తు రావడమే తీవ్ర పురుషార్థము. గుర్తు తెచ్చుకోండి. వారు కూడా మీరు గట్టిగా అవ్వడానికి చెప్పారు, బాప్‌దాదా పిల్లల్ని ఎంతో అలంకరించారు, మరి పిల్లలు అంతగా అలంకారధారులుగా అవ్వలేదా? ఒకరోజు ఈ బాప్‌దాదా చేసిన అలంకారాన్ని గుర్తు తెచ్చుకునే రోజు వస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ముందైతే బ్రహ్మాబాబా స్వయాన్ని నిరహంకారిని, నమ్రచిత్తుడను అని చెప్పుకుంటూనే నేను కూడా సంపూర్ణం కాలేదు అనేవారు. నేను కూడా ఇప్పటికీ నిరంతరం దేహి అభిమానిగా అవ్వలేదు అనేవారు. కానీ మీరందరూ మీ అనుభవం ద్వారా చివరి మూడు నాలుగు నెలలలో గమనించి ఉంటారు, సమ్ముఖంలో కలిసే సౌభాగ్యం లభించి ఉండవచ్చు, అప్పుడు, ఈ బ్రహ్మా ఇప్పుడు సాకారీ కాదు అవ్యక్త ఆకారీ రూపధారిగా ఉన్నారు అని అనిపించి ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న చిన్న విషయాలను వినేవారు, సమయాన్ని కేటాయించేవారు కానీ ఇప్పుడు ఏమి చూసారు? ఈ చిన్న చిన్న విషయాలను వినకపోవడానికి కారణము ఏమిటి? ఈ సమయాన్ని కూడా నిరంతర స్మృతిలో గడపాలి అన్న ఆలోచన. పిల్లలైన మీరు బ్రహ్మా తనువు ద్వారా, వారి మస్తకంలో సితార మెరుస్తూ ఉండటాన్ని నోట్ చేయలేదా? అవ్యక్త స్థితిలో ఉండేవారు అవ్యక్త మూర్తిని తెలుసుకున్నారు, గుర్తించారు. ఎవరైతే స్వయం అవ్యక్త స్థితిలో లేరో వారు ఈ అమూల్య రత్నాన్ని పూర్తిగా గుర్తించలేదు.
ఇప్పుడు కూడా స్థాపన కార్యము బ్రహ్మాది, మాది కాదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీ పాలన బ్రహ్మా ద్వారానే జరుగుతుంది. చివరి వరకు స్థాపన చేసే పాత్ర బ్రహ్మాదే. బ్రహ్మా ద్వారా ఇప్పుడు చదువు ఎలా కొనసాగుతుంది అని మీరు ఆలోచిస్తుండవచ్చు. నిజానికి, స్థితి అనుసారంగా ఎలా, ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తకూడదు. కానీ కొందరి మనసులలో ప్రశ్నలేమిటి, ఎంతో అలజడి యొక్క సాగరమే మొదలయింది. ఈ మొదటి సమస్యలు ఎందుకు ముందుకు వస్తాయి సమస్యలు ఎందుకు ముందుకు వస్తాయి చాలా కొద్ది మందే పాస్ అయ్యారు. కొంచెం ఓర్పు వహించండి. అవినాశి జ్ఞానము ఇది, అవినాశి చదువు అయినప్పుడు ఈ ప్రశ్నల అలజడి ఎందుకు? అయినా కానీ ఆ అలజడిని సమాప్తం చేయడానికి అర్థం చేయిస్తున్నాము. క్లాసు ఎలా జరిగేదో అలాగే జరుగుతుంది. ఏమి వినిపిస్తారు? ఏ బ్రహ్మా తనువు అయితే నియమితమయిందో, ఆ తనువు ద్వారా ఏదైతే క్లాసు జరుగుతుందో అదే మురళి. ఇతర సందేశీల ద్వారా కొద్ది సమయం కోసం ఏ సేవ అయితే చేస్తామో, దానిని మురళి అని అనము. ఆ మురళిలో ఇంద్రజాలం లేదు. బాప్‌దాదా మురళిలోనే ఇంద్రజాలం ఉంది. కనుక ఇప్పటి వరకు ఏ మురళీలైతే జరిగాయో వాటిని రివైజ్ చేయండి. ఇప్పటివరకు ఎలా అయితే పోస్ట్ వెళ్లేదో అలాగే ముఖ్య సేవాకేంద్రాలకు ఆబూ నుండి పోస్ట్ వెళ్తుంది. మీకు ఒక సంవత్సరం క్రితం జరిగిన మురళి గుర్తుందా? నిన్న చదివినది కూడా గుర్తుండకపోవచ్చు. కొన్ని పాయింట్లు ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు చదివినా కానీ బుద్ధిలో నిలువవు. కనుక మురళి మరియు ఉత్తరాల కనెక్షన్ ఎలా ఉండినదో అలాగే ఉంటుంది. ఎలా అయితే మీరు మధుబనానికి రిఫ్రెష్ అవ్వడానికి వచ్చేవారో, అలాగే వస్తూ ఉంటారు. వచ్చి ఏమి చేయాలి, ఎవరిని కలుసుకోవాలి? ఇప్పుడు మళ్ళీ ఈ ప్రశ్న వస్తుంది. ఎవరితో రిఫ్రెష్ అవుతాము? ఎవరైతే లక్కీ సితారలు ఉన్నారో అనగా ముఖ్యమైన నిమిత్తులు ఎవరున్నారో వారితో పూర్తి సంబంధాన్ని పెట్టుకుని మీ సేవాకేంద్రం యొక్క రిజల్టును, సమస్యలను, సేవాకేంద్రాల ఉన్నతిని, మీ పూలతోటలో వికసించే కొత్త కొత్త పూలను, వారికి కూడా సంగఠనను చూపించడానికి మధుబనానికి తీసుకురండి. అలాగే ఇటువంటి సంగఠన మధ్యన బాప్‌దాదా నిమిత్తమైన సందేశి ద్వారా పూర్తి సేవను చేస్తారు.
ఇప్పుడు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ బ్రహ్మా బాబా అయితే 100 సంవత్సరాల కంటే ముందే వెళ్ళిపోయారే అని అందరూ అడుగుతారని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఇదైతే చాలా సహజమైన ప్రశ్న, ఏమంత కష్టం కాదు. 100కు దగ్గరి ఆయుష్షే కదా. 100 సంవత్సరాలు అని ఏదైతే చెప్తున్నారో అది తప్పు కాదు. ఒకవేళ ఏదైనా మిగిలి ఉంటే ఆకారీ రూపం ద్వారా పూర్తి చేస్తారు. 100 సంవత్సరాలు బ్రహ్మా యొక్క స్థాపనా పాత్ర. ఆ 100 సంవత్సరాలైతే పూర్తి అవ్వవలసినదే, అయితే ఇప్పుడు మధ్యలో, బ్రహ్మా తర్వాత బ్రాహ్మణుల పాత్ర జరిగేది ఉంది. బ్రహ్మా బ్రాహ్మణులను ఎందుకు రచించారు? మరి బ్రహ్మా తమ రచనను చూడరా? ఇప్పుడు మీకు సంగమంలో బాధ్యతా కిరీటాన్ని ఇవ్వరా? లేకపోతే సత్యయుగంలో దేవతగా ఎలా అవుతారు? ఇక్కడి బాధ్యతయే అక్కడ కోసం పునాది అవుతుంది. కనుక, మిమ్మల్ని ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే, బ్రహ్మా యొక్క స్థాపనా కార్యమైతే జరుగుతూనే ఉంటుంది అని జవాబు చెప్పండి.
ఇప్పుడు పిల్లల చదువు సమయం సమీపిస్తుంది. మమ్మా వెళ్ళిన తర్వాత ప్రతి మురళిలో ఈ సూచనను అయితే ఇవ్వడం జరిగింది. పరీక్ష గురించి తిథి తారీఖు చెప్పడం జరుగుతుందా? ముందు నుండే చెప్పేస్తే దానిని . పరీక్ష అని అంటామా? అకస్మాత్తుగా జరిగే దానినే . పరీక్ష అంటాము. ఎవరి మనసులో ఏమి జరుగుతుందో దానిని అకస్మాత్తు అని అనము. రిజల్టులో ఏమి చూసాము? పూర్తిగా పాస్ అవ్వలేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపాన్ని చూసాము. అయినా చాలా బాగుంది. ఎందుకంటే ఇది పురుషార్థం చేసే సమయము. ఆ అనుసారంగా రిజల్టు బాగుంది అనే చెప్తాము. అయితే బాప్‌దాదా ఇద్దరూ ఒక విషయంలో చాలా సంతోషిస్తున్నారు. ఏ విషయంలో? పిల్లలు సంగఠన మరియు స్నేహము రెండింటికీ రుజువును ఇచ్చారు. ఎవరు ఎలా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏ అభిమానంలో వస్తున్నారు, ఏ స్థితిలో కలుస్తున్నారు, ఇవన్నీ బ్రహ్మా బాబా వతనం నుండి చూసారు. ఈ రిజల్టును కూడా బాప్‌దాదా ఇద్దరూ కలిసి చూసారు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోండి మరియు స్వయంలో ఉన్న లోపాలను నింపుకోండి. ఇకపోతే అందరికీ ఈరోజు నుండి నిమిత్తం ఎవరు? అదైతే మీకు తెలుసు – దీదీ అయితే ఉన్నారు, వీరితో పాటు కుమారకా సహయోగిగా ఉంటారు. ఇప్పటివరకు ఎలా అయితే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయో అలాగే హెడ్ క్వార్టర్ నుండి జరుగుతూ ఉంటాయి. వీరిద్దరూ మీ అందరి యోగ క్షేమాలు చూసుకుంటారు. అవసరమైతే మీ అందరి సేవాకేంద్రాలకు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఉన్న . పరీక్ష ఏమిటి? ఇదైతే అకస్మాత్తుగా . పరీక్ష వచ్చింది కానీ రాబోయే . పరీక్ష గురించి చెప్తాము. ఇప్పుడు ఏకమతము, అంతర్ముఖత మరియు అవ్యక్త స్థితిలో స్థితులై సంబంధాలలోకి రండి. ఈ . పరీక్ష గురించే బాప్‌దాదా చెప్తున్నారు, దీని రిజల్టును చూస్తాము. చివరి సమయంలో బ్రహ్మా తనువు ద్వారా లభించిన శిక్షణను అందరూ విని ఉండవచ్చు, గుర్తుండి ఉండవచ్చు.
ఈరోజు ఈ సంగఠనలో కొంత ఇవ్వడానికి కూడా వచ్చారు, కొంత తీసుకోవడానికి కూడా వచ్చారు. ఎవరైతే తీసుకుంటున్నారో వారు ఇవ్వడానికి కూడా తయారుగా ఉన్నారా? ఏమి జరగబోతుందో, అలాంటిదేమీ ఉండదు – ఇటువంటి సంకల్పాలు ఎవరికైతే వస్తున్నాయో వారు చేతులెత్తండి. ఒకవేళ అందరూ సంతుష్టంగా ఉంటే, ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఇవ్వడంలో కూడా సంతుష్టత ఉంటుంది. రెండు విషయాలను ఈరోజు ఈ సంగఠన మధ్యన అందరూ దానమివ్వాలి. ఏ రెండు విషయాలు? ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు నుండి పరస్పరం ఇతరులలోని అవగుణాలను చూడకండి, వినకండి, మనసులో పెట్టుకోకండి. ఒకవేళ ఎవరైనా సోదరి లేక సోదరునిలో ఇలాంటివి కనిపిస్తే ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారి ద్వారా వారికి సూచనను ఇప్పించవచ్చు.
మరో విషయము, కొంతమంది మీ నిశ్చయాన్ని కదిలించడానికి అనేక మాటలు చెప్పవచ్చు, ఇప్పుడు ఈ సంస్థ ఎలా నడుస్తుందో చూస్తాము అనే మాటలు వ్యాప్తి చేయవచ్చు. కానీ వీరి ఆధారము అవినాశి అన్న విషయము వారికి తెలియదు. మరో విషయంపై కూడా శ్రద్ధ పెట్టండి - ఎవరు ఎంత కదిలించాలని ప్రయత్నించినా కానీ, కల్పక్రితపు మీ గాయనం వలె అనగా అంగదుని వలె మీ పాదాన్ని కూడా కదిలించకూడదు. ఇటువంటి నిశ్చయబుద్ధితో, అచలంగా, ఏకరసంగా ఉండాలి. ఇలా ఉండేవారే రాబోయే చివరి పరీక్షలో పాస్ అవుతారు. బ్రహ్మా ద్వారా ఇంతమంది బ్రాహ్మణులు రచింపబడ్డారు, పిల్లలు పెద్దయితే తండ్రి రిటైర్ అవ్వరా? తండ్రి ఇప్పుడు తమ రిటైర్ అవస్థలో కూడా మీతో ఉన్నారు అని భావించండి. పిల్లలైన మీకు కార్యాన్ని ఇచ్చి చూస్తూ ఉంటారు. శరీరం వీడింది కానీ చేయి మరియు తోడు వీడలేదు. బుద్ధి రూపి చేయి మరియు తోడు వీడలేదు. అదైతే అవినాశిగా, స్థిరంగా ఉంటుంది. ఈ రెండు విషయాలు ఏవైతే వినిపించామో – (1) అలజడిలోకి రాకుండా ఉంటాము అన్న దానమును ఇవ్వండి. (2) అవగుణాలను చూడము అనే దానమును ఇవ్వండి. పిల్లలందరూ ఈ విషయంపై శ్రద్ధ వహించండి, సంకల్పం చేయడం అంటేనే ఇచ్చేసినట్లు. సంకల్పం చేసిన వస్తువును తిరిగి తీసుకోరు. ఒకవేళ మాయ తిరిగి తీసుకునేలా ప్రయత్నం చేసినా కానీ ఒకవేళ స్వయంపై పరిశీలన ఉంటే పాస్ అయిపోతారు.
ఇప్పుడు మరో విషయమును మీ అందరి దృష్టికి తెస్తున్నాము. బాప్‌దాదా తమ చివరి మురళిలో ఏదైతే శిక్షణ ఇచ్చారో, ఈ సాక్షాత్కారాలు ఇవన్నీ ఎక్కువగా జరగడం కూడా సమయం వృధాయే, అందుకే ఇవి ఉండకూడదు అన్నారు. సందేశీల ద్వారా సెంటర్లలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అది మీరు పరిశీలించే వీలు లేకుండా ఉండకూడదు. కనుక నిమిత్తమైన దీదీ మరియు కుమారకా ఏ సందేశిని అయితే నిర్ధారిస్తారో వారి ద్వారానే డైరెక్షన్లు లభిస్తాయి, ఈ పాత్ర కోసం కూడా వీరు ఎవరిని నిమిత్తంగా చేస్తారో వారి ద్వారానే రహస్యాలు స్పష్టమవుతాయి. భోగ్ సమయంలో వైకుంఠం మొదలైన స్థానాలకు వెళ్ళడం కూడా సమయాన్ని వృధాగా పోగొట్టుకోవడమే అని కూడా చివరి మురళిలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇలా తిరగడం ఇదంతా శోభించదు. ఇప్పుడిక నిరంతర స్మృతి మరియు లభించిన శిక్షణను ప్రాక్టికల్ లైఫ్‌లోకి ధారణ చేసిన రుజువును ఇవ్వాలి.
బ్రహ్మా బాబాపై స్నేహము ఉన్నట్లయితే, స్నేహితునికి ఏది ఇష్టమో అదే వీరికి కూడా ఇష్టము అంటారు. వారికి సేవ అంటే ఇష్టము. చివరలో కూడా సేవకు రుజువును ఇచ్చారు కదా. మరి స్నేహము అంటే వారి వలె సేవపై స్నేహము, వారి శిక్షణలపై స్నేహము. అంతేకానీ, మాకు చెప్పకుండా బాబాను వతనానికి అలా ఎలా పిలిపించుకున్నారు అని ఎవ్వరూ ఆలోచించకండి. అనుమతి అడిగితే మీరు ఇస్తారా? అందుకే, డ్రామాలో ఇప్పటివరకు ఎవరు వెళ్ళినా కానీ సెలవు తీసుకుని వెళ్ళలేదు. బ్రాహ్మణ కులంలోని పద్ధతి ఇదే అని అర్థం చేసుకోండి. డ్రామాలో ఏది నిర్ధారితమై ఉందో ఆ పద్ధతే జరుగుతుంది. మా అందరి ప్రేమ సాకార బాబాతో ఉండింది అంటారు, ఉండినది కాదు, ఇప్పుడు కూడా ఉంది. ప్రేమ లేకపోతే ఈ సభకు ఎలా వస్తారు! సాకారంలో ఫాలో చేయడానికి వీరి తనువే ఉంది, అలాంటప్పుడు ప్రేమ ఎందుకు ఉండదు? స్నేహము ఉండినది, ఉంటుంది కూడా. ఇదే తండ్రి పిల్లలకు గుర్తు. ఇది విని సాకారుడు కూడా వతనం నుండి నవ్వుతున్నారు. పిల్లలకు స్నేహము ఉన్నప్పుడు నాకు ఎందుకు ఉండదు అంటున్నారు. కానీ డ్రామాలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అది కళ్యాణకారి అని వారికి తెలుసు. వారు విచలితమవ్వలేదు. వారైతే సమర్పణ బుద్ధితో, అచలంగా, నిశ్చలంగా, స్థిరంగా ఉండినారు, ఉన్నారు కూడా. పిల్లలైన మీకన్నా వేయి రెట్ల స్నేహము వారిలో ఉంది. ఇప్పుడు స్నేహానికి రుజువును ఇవ్వండి. ఇది కూడా ఒక రకంగా దాగుడుమూతల ఆట. కనుక విచార సాగర మథనం చేయండి, అలజడి మథనం కాదు. ఇప్పటి వరకు ఏ శక్తినైతే తీసుకున్నారో దానిని ప్రత్యక్షంగా చూపించండి. భారత మాత శక్తి అవతారము – ఇదే అంతిమ నినాదము. సన్ షోస్ ఫాదర్. డ్రామా విధి చేయిస్తుంది. నేను పిల్లలను కలుసుకోవడానికి వస్తాను అని సాకార బాబా అన్నారు. ఒకవేళ ఈరోజు వచ్చి ఉంటే పిల్లలు కన్నీళ్ళు పెట్టుకునేవారు. అచ్ఛా
ఓంశాంతి