Search for a command to run...
23 Jan 1969
అస్థికలు స్థితిని గుర్తుకు తెప్పించేవి
23 January 1969 · తెలుగు
ఈరోజు మేము పిల్లలైన మీ అందరితో అవ్యక్త రూపంలో కలిసేందుకు వచ్చాము. నా పిల్లలు ఎవరైతే అవ్యక్త రూపంలో స్థితులై ఉంటారో వారే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీరందరూ అవ్యక్త రూపంలో స్థితులై ఎవరిని చూస్తున్నారు? వ్యక్త రూపాన్నా లేక అవ్యక్త రూపాన్నా? మీరు వ్యక్తంగా ఉన్నారా లేక అవ్యక్తంగా ఉన్నారా? వ్యక్తంగా చూసినట్లయితే బాబాను చూడలేరు. ఈరోజు అవ్యక్త వతనం నుండి కలవడానికి వచ్చాము. అవ్యక్త వతనంలో ధ్వని ఉండదు, కానీ ఇక్కడ ధ్వనిలోకి వస్తున్నాము. పిల్లలైన మీ అందరి మనసులలో ఏ సంకల్పం వస్తుంది? ఇప్పుడు ఇది అవ్యక్త మిలనము. కల్ప క్రితం పిల్లలతో ఆత్మిక సంభాషణ జరిగినట్లుగానే జరుగుతుంది. ఆత్మిక సంభాషణ చేయడానికి మధురాతి మధురమైన బాబా పిల్లలైన మీ అందరినీ కలవమని పంపించారు. ఎవరైతే ఉండినారో వారు ఇప్పుడు కూడా ఉన్నారు. రెండు మూడు రోజుల క్రితం మధురాతి మధురమైన బాబాతో ఆత్మిక సంభాషణ జరిగింది. ఆత్మిక సంభాషణ ఏమి జరిగిందో తెలుసా? బాబా అన్నారు, వతనం యొక్క అనుభవం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమని జవాబు చెప్పి ఉండవచ్చు? బాబా ఆజ్ఞ అని అన్నాము. ఎలా నడిపించినా, ఎక్కడ కూర్చోబెట్టినా, ఏ రూపంలో కూర్చోబెట్టినా సమ్మతమే.
బాప్దాదా ఎందుకు చెప్పి వెళ్ళలేదు అని పిల్లల మనసులలో సంకల్పం ఉంది. బాబాకు కూడా ఇదే చెప్పాము. ఒకవేళ పిల్లలందరినీ కూర్చోబెట్టి అనుమతి అడిగితే పిల్లలు సెలవు ఇచ్చేవారా అని బాబా (శివ బాబా) అడిగారు. మీరు కూడా పిల్లలను చూసి, సేవలను చూసి పిల్లల స్నేహంలోకి వచ్చేసేవారు. కనుక ఏదైతే బాబా చేయించారో దానినే డ్రామా విధి అంటాము. వ్యక్త రూపంలో కాకపోయినా కానీ అవ్యక్త రూపంలో అయితే మిలనం జరుగుతూనే ఉంది కదా. సేవా వృద్ధి అలాగే జరుగుతుంది, పిల్లల స్మృతి అలాగే ఉంది కానీ వారు (సాకార బాబా) వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంలో ఉండేవారు, వీరు అవ్యక్తంలోనే ఉన్నారు, ఇదొక్కటే తేడా. ఎవరికైతే నయనాలతో మిలనం చేసుకోవడం వచ్చో వారు ఈ చిన్నని మిలనంలోనే శిక్షణలను, డైరెక్షన్లను తీసుకుంటారు. మీరందరూ కూడా వతనానికి రావలసిందే కదా. పిల్లలను కలుసుకోవడానికి ప్రతి సమయము, ప్రతి క్షణం తయారుగానే ఉంటాము. ఇప్పుడిక పిల్లల బుద్ధి ఎంత స్పష్టంగా ఉంటుందో, ఆ అనుసారంగానే అవ్యక్త మిలనపు అనుభూతిని చేసుకోగలరు. శక్తి స్వరూపంలో స్థితులై ఉన్నారా? (దీదీతో) ఇప్పటివరకు ఎలా తోడుగా ఉన్నామో అలాగే ఉంటాము. వీడలేదు. ఇప్పుడు శక్తి రూపం యొక్క పాత్రను ప్రత్యక్షంగా చూపించాలి. ఏవైతే బాబా శిక్షణలు లభించాయో వాటిని ప్రాక్టికల్లో చూపించండి. శక్తి సైన్యం చాలా ఉంది, ఇప్పుడు పూర్తిగా శక్తి స్వరూపులుగా అవ్వాలి. ఇప్పటివరకు పిల్లలు బాబా యొక్క స్నేహంతో నడిచారు. ఇప్పుడు బాబా నుండి లభించిన శక్తిని ఇతరులకు ఇచ్చి వారిని కూడా శక్తిశాలిగా చేయాలి. వారే బాబాకు స్నేహితులు, బాబాతోటి చివరి వరకు ఉంటారు.
ఇప్పుడు మధురాతి మధురమైన బాబా పిల్లలైన మీ అందరి దృశ్యాన్ని చూపిస్తున్నారు. మీరు అస్థికలు ఎత్తుతున్నారు. అస్థికలను చూడకండి, స్థితిని చూడండి. ఈ అస్థికలు స్థితికి స్వరూపము. నరనరాలలో స్థితి నిండి ఉంది. బాహ్యంగా అయితే ఆ అస్థికలను పెట్టారు. కానీ దీనికి భక్తి మార్గపు అర్థాన్ని తీసుకోకండి. ఈ అస్థికలలో ఏ స్థితి అయితే నిండి ఉందో సదా అదే చూడండి. సాధారణ మనుషులకు ఈ విషయాలు అంతగా అర్థం కావు. పిల్లల స్నేహము ఉంది, సదా ఉంటుంది, 21 జన్మల వరకు ఉంటుంది. సత్యయుగ ప్రపంచానికి అందరమూ కలిసి వెళ్ళమా? కలిసి రాజ్యాన్ని తీసుకోమా? కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము – జన్మజన్మల వరకు. ఇప్పుడు కూడా, బాబా ఉన్నారు కానీ దాదా లేరు అని, లేక దాదా ఉన్నారు బాబా లేరు అని అనుకోకండి. మేమిద్దరమూ ఒక్క క్షణం కూడా విడిగా ఉండలేము. అలాగే మీరు కూడా స్వయాన్ని త్రిమూర్తిగా భావించండి. అందుకే త్రిమూర్తి బ్యాడ్జిని ఎప్పటికీ మీ వద్ద పెట్టుకోమని చెప్పాము. బ్రహ్మ, విష్ణువు మరియు శంకరులు ముగ్గురినీ చూస్తున్నప్పుడు మీ యొక్క త్రిమూర్తి స్మృతిని కూడా పెట్టుకోండి అనగా మీ స్వరూపము, బాప్దాదా స్మృతి, త్రిమూర్తి స్థితి ప్రసిద్ధమైనది. ఇందులోనే పిల్లలందరి కళ్యాణము ఉంది. కళ్యాణకారి బాబా ఏది చెప్తారో, ఏది చేయిస్తారో, అందులోనే కళ్యాణము ఉంది. ఇందులోని ఒక్కొక్క మహా వాక్యములో, ఒక్కొక్క దృష్టిలో ఎంతో కళ్యాణము ఉంది. కానీ స్థూలాన్ని గుర్తించే కొద్దిమంది అనన్యమైన మరియు మహారథి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇంత వేగంగానే కర్మాతీత స్థితిలో ఉండే పురుషార్థం చేయండి. ఎలా అయితే ఇక్కడ ప్రతి సమయము బాప్దాదాతో గడిపేవారో అలాగే ప్రతి కర్మలో, ప్రతి సమయము ఇప్పుడు కూడా మీకు తోడుగా పెట్టుకోండి. పిల్లలూ, ఈ శిక్షణను గుర్తుంచుకోండి, ఎప్పుడూ మర్చిపోవద్దు. సంబంధము, స్నేహము, స్మృతి స్వరూపము, దానితోపాటు సరళ స్వరూపము, సమర్పణ మరియు ఒకరికొకరు సహయోగిగా అయ్యి సఫలతను పొందండి. సఫలత పిల్లలైన మీ అందరి మస్తక మధ్యలో మెరుస్తూ ఉంది. ఇప్పుడు చాలా సమయం అయింది. ఇంకేమైనా చెప్పేది ఉందా? సూక్ష్మవతనంలో కూర్చున్నా కానీ పిల్లలందరి దినచర్య, పిల్లలందరి చార్టు మా ముందు ఉంటాయి. వ్యక్త రూపంకన్నా ఇప్పుడైతే మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కనుక అందరి రిజల్టును చూస్తూ ఉంటాము.
ఎంతగా అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటారో అంతగా ఆ అవ్యక్త స్థితితో, శ్రీమతమే సలహా ఇచ్చి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ అనుభవాన్ని పిల్లలు పొందుతారు. ఇప్పుడు మీ అవ్యక్త స్థితి యొక్క ఆధారంతో ఎటువంటి కర్మలు చేయండంటే, శ్రీమతం ఆధారంగా ప్రతి కర్మ జరుగుతున్నట్లుగా ఉండాలి. బాబాకు దేనిపై స్నేహము ఉందో దానిపై అంతే స్నేహాన్ని పిల్లలు ఉంచడమే స్వయాన్ని సౌభాగ్యశాలిగా తయారు చేసుకోవడము. నరనరాలలో దేనిపై స్నేహము ఉండినది? 5 తత్వాలతో కాదు. స్నేహము గుణాలతోటే ఉంటుంది. స్నేహము ఉండేది అని కాదు. ఇప్పుడూ ఉంది మరియు ఉంటుంది. భవిష్య క్రొత్త ప్రపంచం తయారవ్వనంత వరకు ఈ ఎడతెగని స్నేహము ఉంటుంది. స్నేహము ఆత్మతో మరియు కర్తవ్యంతోటే ఉంది, అలాంటప్పుడు ఈ శరీరం ఏముంది! చివరి వరకు తోడుగా ఉంటాము. ఎవరికైతే బాబాపై స్నేహము ఉంటుందో వారే అంతిమం వరకు స్థాపనా కార్యంలో సహయోగిగా అవుతారు. కనుక స్నేహిగా అయ్యే ప్రయత్నం చేయండి. మాయ ఎలా వచ్చినా కానీ, మాయాజీతులుగా అవ్వాలి. ఎలా అయితే బ్యాడ్జి పెట్టుకుంటారో అలా మస్తకంపై ఈ విజయ తిలకం అనే బ్యాడ్జి ఉండాలి. మధుబన పటము పూర్తి ప్రపంచం ముందు ఒక మ్యూజియంగా ఉండాలి. అవినాశి భండారా ఇది, దీని ప్రత్యక్షత మరింత జరగాలి. పిల్లలు ఎలా అయితే ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవారో అలాగే వ్రాస్తూ ఉండండి. ఎలా అయితే డైరెక్షన్లు తీసుకునేవారో అలాగే తీసుకుంటూ ఉండండి. శరీరం విషయం వేరు. సేవ అయితే అదే. కనుక ఏ విషయం ఉన్నా కానీ మధుబనానికి వ్రాస్తూ ఉండండి. మీ పూర్తి కనెక్షన్ను పెట్టుకోండి. ఇతరులకు కూడా మీ స్థితి యొక్క రుజువును ఇవ్వండి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అలా చేస్తారు.
(వీడ్కోలు సమయంలో)
బాబా అన్నారు, డ్రామాలో ఏ పాత్ర జరిగినా కానీ అందులో గుప్తమైన రహస్యము దాగి ఉందని మీ అందరికీ తెలుసు. అది ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాము. ఇప్పుడు మీ యొక్క అదే స్మృతి చిహ్నము ఏదైతే ఆకాశంలో ఉందో, ప్రపంచంవారు ఈ కళ్ళతో ధరిత్రి యొక్క సితారలను చూస్తూ వీరు ఎవరి శ్రీమతంపై నడుస్తున్నారు అనుకుంటారు. ఎక్కువ సమయం అక్కడ కూర్చోవద్దు అని బాబా అన్నారు.
ఓంశాంతి