Search for a command to run...
24 July 1969 · తెలుగు
మధురాతి మధురమైన పిల్లలు ఎవరి ముందు కూర్చున్నారు? ఎలా కూర్చున్నారు? బాబా అయితే పిల్లలైన మిమ్మల్ని బిందు రూపంగా మార్చడానికి వచ్చారు. నేను ఆత్మను బిందు రూపాన్ని. బిందువు ఎంత చిన్నగా ఉంటుంది, అలాగే బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా మీ బుద్ధిలో నిలవడం లేదా? బాబా అయితే పిల్లల ఎదురుగానే ఉన్నారు. దూరంగా లేరు. దూరంగా ఉన్న వస్తువును మర్చిపోతారు. ఎదురుగా ఉన్న వస్తువును మర్చిపోవడం పిల్లలైన మీకు శోభించడం లేదు. ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక ఏ ఆధారంతో నడుస్తారో చెప్పండి? ఆత్మ ఆధారంతోటే కదా శరీరం నడుస్తుంది. నేను ఆత్మను, నేను బిందువును, బిందువు సంతానమును అన్న నషా ఉండాలి. సంతానము అనగానే స్నేహంలోకి వచ్చేస్తారు. మరి ఈరోజు పిల్లలకు బిందు రూపంలో స్థితి చేసే అభ్యాసము చేయించమంటారా? నేను ఆత్మను, ఇందులో అయితే మర్చిపోయే ఆవశ్యకతయే ఉండదు. తండ్రినైన నన్ను మర్చిపోయే ఆవశ్యకత వస్తుందా? పరిచయం ఇచ్చే సమయంలో నా నామము, రూపము, గుణము, కర్తవ్యము తప్పకుండా చెప్పవలసి ఉంటుంది. నేను ఎప్పుడు వస్తాను? ఎవరి శరీరంలోకి వస్తాను? పిల్లలైన మీకే నా పరిచయాన్ని ఇస్తాను. మరి తండ్రి తమ పరిచయాన్ని మర్చిపోతారా? పిల్లలు ఆ స్థితిలో ఒక్క సెకండు కూడా ఉండలేరా? మీ నామరూపదేశాలను కూడా మర్చిపోతున్నారా? నేను ఆత్మను శరీరము కాదు అన్నది మీరు చెప్పే మొట్టమొదటి విషయము. ఆత్మగా చేసి కూర్చోబెట్టినప్పుడే కదా వారు తమ శరీరాన్ని మర్చిపోతారు. ఆత్మ స్థితిలో కూర్చోబెట్టకపోతే దేహ సహితంగా దైహిక అన్ని బంధాలను మర్చిపోగలరా! వారిని మర్చిపోతే, శరీరం నుండి అతీతమైతే, అతీతమైన తండ్రి స్మృతిలో కూర్చోలేరా?
ఇప్పుడు పిల్లలందరూ స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి, ఎదురుగా ఎవరిని చూడండి? ఆత్మల తండ్రిని. ఈ స్థితిలో ఉండటం వలన వ్యక్తం నుండి అతీతంగా అయి అవ్యక్త స్థితిలో ఉండగలరు. నేను ఆత్మను బిందు రూపమును, ఇది గుర్తుండటం లేదా? బిందు రూపంలో కూర్చోవడం రాదా? ఇలాగే అభ్యాసాన్ని పెంచుతూ వెళితే ఒక్క సెకండు ఏమిటి, ఎన్ని గంటలైనా ఇదే అవస్థలో స్థితులై ఈ అవస్థ యొక్క రసాన్ని ఆస్వాదించగలరు. ఈ అవస్థలో స్థితి అవ్వడం వలన మాట్లాడే అవసరం కూడా ఉండదు. బిందువుగా అయి కూర్చోవడము జడ అవస్థ కాదు. బీజములో పూర్తి చెట్టు ఇమిడి ఉన్నట్లుగా ఆత్మనైన నాలో బాబా స్మృతి ఇమిడి ఉంది. ఇలా కూర్చున్నప్పుడు అన్ని రసాలు అనుభవం అవుతాయి. మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము అన్న నషా కూడా ఉంటుంది. బాబా మమ్మల్ని కూడా తమతోపాటు తీసుకువెళ్తున్నారు. బాబా పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టరు. తండ్రి మరియు పిల్లల ఇల్లు ఏదైతే ఉందో, అక్కడకు తోడుగా ఉండి తీసుకు వెళ్తారు. అందరమూ కలిసి వెళ్ళవలసిందే. ఆత్మగా భావించి తర్వాత శరీరంలోకి వచ్చి కర్మను చేయాలి. కానీ కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు ప్రియంగా అవ్వాలి. బాబా కూడా పిల్లలను చూస్తారు. చూస్తూ కూడా బాబా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు కదా. అచ్ఛా.
ఓంశాంతి