Search for a command to run...
27 Aug 1969
సహాయం తీసుకునేందుకు సాధనము – ధైర్యము
27 August 1969 · తెలుగు
(సంతరీ దాదీ తనువు ద్వారా)
ఈరోజు చిన్న పూలతోటలో విహరించడానికి వచ్చాము. ఆత్మిక పిల్లలను సమ్ముఖంలో కలవడానికి వచ్చాము. వీరు మా కంటి రత్నాలు అని బాబా భావిస్తారు. కనుపాపలు ఈ పిల్లలు, సదా ఆత్మిక గులాబీల వలె సుగంధాన్ని ఇస్తూ ఉంటారు. బాబాకు పిల్లలపై ఎంత విశ్వాసం ఉందో పిల్లలకు అంత ధైర్యము ఉందా? ఈరోజు పిల్లలు పిలవలేదు. పిలవకుండానే బాబా వచ్చారు. ఇది అనాదిగా తయరై ఉన్న నియమము. సంగమంలో అలంకరించడానికి పిలవకుండానే బాబా రావలసి ఉంటుంది. ఈరోజు పిల్లలను ఒక ప్రశ్న అడుగుతాము, ఈరోజు పూలతోటలో ఎవరైతే కూర్చుని ఉన్నారో, వారు పుష్ఫగుచ్ఛం అందాన్ని పెంచడంలో స్వయాన్ని యోగ్యులుగా ఎవరెవరు భావిస్తున్నారు? రాఖీ అందరికీ కట్టబడి ఉందా? రాఖీ బంధన రహస్యము ఏమిటి?
మరి ఈరోజు బాబా పిల్లలను కలవడానికి వచ్చారు. చాలా పెద్ద బాధ్యతను తీసుకున్నారు. చిన్న చిన్న బాధ్యతలు తీసుకుంటేనే ఎంత అలసిపోతారు? పూర్తి సృష్టి యొక్క భారము ఎవరిపై ఉంది? బరువును తలపైకి ఎత్తుకోవాలి కూడా మరియు దించాలి కూడా. కానీ అలసిపోవద్దు. పిల్లలకు ఎందుకు అలసట అనిపిస్తుంది? ఎందుకంటే స్వయాన్ని ఆత్మిక గులాబిగా, రూహ్గా(ఆత్మగా) భావించడం లేదు. ఆత్మగా భావిస్తే దేహం నుండి అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. ఎలాంటి తండ్రియో అలాంటి పిల్లలు. ఎంత ధైర్యము ఉంచుతారో అంతే సహాయాన్ని బాబా కూడా ఇస్తున్నారు. ధైర్యంతో సహాయం లభిస్తుంది, సహాయంతోటే పర్వతం కూడా లేస్తుంది. కలియుగ మట్టి పర్వతాన్ని లేపి సత్యయుగ బంగారు పర్వతంలా చేయాలి. ఎలా చేయాలి? ఈ ఖాళీతనమే ప్రశ్నలో కూడా నిండి ఉంది. మరి ఈరోజు కొద్ది సమయం కోసం కలవడానికి బాబాకు రావలసి వచ్చింది. బాబాకు కోరిక ఉంటుందా? వారైతే కోరికలకు అతీతుడు, ఇచ్ఛారహితుడు. అయినా కానీ కోరిక ఎందుకు? మీరందరూ కోరిక రహితంగా అయితే బాబాకు కోరిక కలిగింది. బాబా ఎవరినైనా ఎలా సంభాళించేవారో మీకెవరికీ తెలియదు. ఇప్పుడు కూడా సంభాళిస్తున్నారు. ఇంతటి బాధ్యతను ఎంతో యుక్తిగా సంభాళించి బాబా కోరికను కూడా పూర్తి చేసారు మరియు ఇప్పుడు కూడా పిల్లల కోరికను పూర్తి చేస్తున్నారు. అందుకే వారిని యుక్తిపరుడు (రాంఝూ రమజ్బాజ్) అంటారు. బాబాకైతే పిల్లలందరి కోరికలను తీర్చవలసి ఉంటుంది. పిల్లల కోరికను ఎందుకు తీరుస్తారు? పిల్లలందరూ కనుపాపలు. అందుకే ముందు పిల్లలు తర్వాత తండ్రి. తలమానికాలను తల మీదనే కూర్చోబెట్టుకోవాలి. పిల్లలకు సంతోషాన్ని ఇవ్వాలి. పురుషార్థం చేస్తూ చేస్తూ చల్లబడిపోతే పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నం చేయండి. కంకణము పూర్తిగా కట్టుకున్నారా అని ప్రశ్న అడుగుతున్నాము? ధరిత్రిని విడిచిపెట్టినా కానీ ధర్మాన్ని విడిచి పెట్టకండి. ఈరోజైతే విరోధులు కూడా శత్రువుల నుండి మిత్రులుగా అవుతారు.
పిల్లలు ఎప్పుడూ అడుగును ముందుకే వేయాలి. మీకు లభించబోయే కిరీటము, సింహాసము పైనే దృష్టి ఉండాలి. మేము ఇలా అవుతాము అని కేవలం చెప్పడం వరకే కాదు, ఇప్పుడు చేతలలోకి వచ్చేలా ధారణ చేయాలి. లక్ష్మీనారాయణులు ఎలా నడుస్తారు, ఎలా అడుగు వేస్తారు, ఎలా నయనాలు పైకి కిందకు కదుపుతారు, అటువంటి నడవడిక ఉండాలి, అప్పుడే లక్ష్మీనారాయణులు అవుతున్నారు అని అంటాము. ఇప్పుడు కళ్ళు పైకి వచ్చేస్తాయి అంటే దేహ అభిమానము వచ్చేస్తుంది, నావంటి వారు ఎవ్వరూ లేరు అంటారు. నాద- నీది అనేది వచ్చేస్తుంది. నమ్రత మనుష్యుల నయనాలను క్రిందకు చేస్తుంది అని భక్తి మార్గంలో కూడా అంటారు కదా. ప్రతి ఒక్కరూ స్వయాన్ని అలంకరించుకోవాలి. సదా సుగంధాన్ని ఇస్తూ ఉండండి. లక్ష్యము ఏదైతే లభించిందో అలాగే లక్ష్మీనారాయణులుగా కావాలి. సరైన దారిలో నడవాలి. అడుగులు మున్ముందుకు వేస్తూ ఉండండి. బాబా వద్దకు ఈరోజు సందేశి భోగ్ తీసుకువచ్చినప్పుడు బాబా అన్నారు, పిల్లలైతే ఇక్కడ కూర్చునే రాకుమారులుగా అయిపోయారు. బాబా యొక్క బెగ్గరీ టోలి మర్చిపోయారు. వైభవాలు అక్కడ లభిస్తాయి. సంగమంలో బెగ్గరీ టోలి గుర్తుకువస్తుంది. అదే బాబాకు నచ్చుతుంది. సుదాముడి(కుచేలుడి) పిడికెడు అటుకులకే విలువ ఉంది. ఈ టోలిలో ప్రేమ నిండి ఉంది. తయారు చేసినవారు ప్రేమను నింపి చేసారు, మరింత ప్రేమను నింపి పిల్లలకు తినిపిస్తారు. (సింధి హల్వా తినిపించారు) దీదీ సేవ పూర్తి చేసుకుని వచ్చారు. అందరూ మంచిగా ఉన్నారు కదా, అంతా పద్ధతి ప్రకారంగా నడుస్తుందా? భయపడే అవసరం లేదు. సమయము యొక్క బలిహారము. పిల్లలైతే ప్రతి విషయంలోనూ పురుషార్థం చేయాలి. సమయాన్ని చూస్తూ అవినాశి యజ్ఞాన్ని, కుండము అని కూడా అంటాము కదా, దానిని నింపాలి. స్వాహా చేయాలి. ఇదైతే సదా నడుస్తూ ఉండాలి. వారైతే 10-12 రోజులు చేసి ఆ తర్వాత ఎక్కడిదక్కడే ఉంచేస్తారు. ఇదైతే అవినాశి కదా. శివబాబా భండారా నిండుగా, కాలకంటకుడు దూరంగా. క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడే దూరమవుతుంది. అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది. కేవలం పిల్లల బుద్ధి చురుకుగా, దూరదర్శిగా కావాలి. దూరదర్శిగా చేసుకోవడానికి కిరీటము మరియు సింహాసనాన్ని ఇచ్చాము. అచ్ఛా.
ఓంశాంతి