Search for a command to run...
26 June 1970 · తెలుగు
మిమ్మల్ని మీరు సాక్షాత్కారమూర్తులుగా భావిస్తున్నారా? మూర్తి దగ్గరకు దేనికోసం వెళ్తారు? తమ మనోకామనలను పూర్తి చేసుకునేందుకు వెళ్తారు. ఏ ఆత్మకి ఏ రకమైన కోరిక ఉంటే ఆ కోరికను పూర్తి చేసే సాక్షాత్కారమూర్తులుగా అయ్యారా? అల్పకాలిక కోరికలు కాదు, సదాకాలిక కోరికలను పూర్తి చేయగలరా? కామధేనువు అని మాతలను అంటారు కదా! కామధేనువు అంటే సర్వుల కోరికలను పూర్తి చేసేవారు అని అర్థము. ఎవరికైతే తమ సర్వ కోరికలు పూర్తి అవుతాయో వారే ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు. సర్వుల కోరికలను తీర్చే మూర్తి అవ్వాలని సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి. సర్వుల కోరికలను తీర్చేవారు స్వయం కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా(ఇచ్ఛా మాత్రమ్ అవిద్య) ఉంటారు. ఇలాంటి అభ్యాసం చేయాలి. ప్రాప్తి స్వరూపంగా అవ్వటం ద్వారా ఇతరులకు ప్రాప్తినివ్వగలరు. సదా మిమ్మల్ని మీరు దాతగా లేదా మహాదానిగా భావించాలి. మహాజ్ఞాని తర్వాత మహాదాని యొక్క కర్తవ్యం నడుస్తుంది. మహాజ్ఞాని యొక్క గుర్తు మహాదాని అవ్వటం ద్వారా తెలుస్తుంది. షికారు చేయటం మంచిగా అనిపిస్తుంది. ఎవరికైతే విహరించే అలవాటు ఉంటుందో వారు సదా షికారు చేస్తారు. ఇది కూడా అంతే. ఎంతగా స్వయం విహరిస్తారో అంతగా ఇతరులను కూడా బుద్దియోగం ద్వారా విహరింప చేయగలరు. మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలి. ఎలా అయితే సాకార బాబా ఎదురుగా రావటంతోనే ప్రతి ఒక్కరికీ భావన ప్రకారం సాక్షాత్కారం లేక అనుభవం అయ్యేదో, అలాగే మీ ద్వారా కూడా సెకను, సెకను అనేక అనుభవాలు లేక సాక్షాత్కారాలు అవుతాయి. అవ్యక్త ఆకృతి రూపాన్ని చూపించినప్పుడే ఇలా దర్శనీయమూర్తి లేక సాక్షాత్కారమూర్తిగా అవుతారు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి శరీరం కనిపించకూడదు, సూక్ష్మవతనంలోని ప్రకాశమయ రూపం కనిపించాలి. కేవలం మస్తకమే ప్రకాశంగా కాదు, మొత్తం శరీరం కూడా ప్రకాశమయంగా సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే ప్రకాశమే ప్రకాశం చూస్తారో అప్పుడు స్వయం కూడా ప్రకాశ రూపం అయిపోతారు. అచ్ఛా!
ఓంశాంతి