Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

29 June 1970 | తెలుగు29 June 1970 | తెలుగు · సమర్పణ యొక్క విశాల రూపము

HomeSearchBKOneLibrarySettings
26 Jun 1970Prev2 Jul 1970Next

సమర్పణ యొక్క విశాల రూపము

మీ అందరికీ మీ నాలుగు మూర్తుల గురించి తెలుసా? ఈరోజు బాప్‌దాదా ప్రతి ఒక్కరి ఇప్పటి (భవిష్యత్తువి కావు) సంగమయుగపు నాలుగు మూర్తులను ఒక్కొక్కరిలో చూస్తున్నారు. ఆ నాలుగు మూర్తులు ఏవి? మీ మూర్తిని గురించి తెలుసా? (కొందరు కొందరు చెప్పారు) ఇప్పుడు ఏదైతే వర్ణన చేసారో అటువంటి మూర్తిగా ఇప్పుడు తయారువుతున్నారా లేక తయారైపోయారా? ఎప్పుడు తయారవుతారు? లాస్ట్ లో ఫాస్ట్‌గా వెళ్తాము అని ఆలోచిస్తున్నారా? కానీ లాస్ట్ సమయంలో ఫాస్ట్‌గా వెళ్ళగలరా? ఎంతగా చాలా కాలము నుండి స్వయమును సఫలతామూర్తిగా తయారుచేసుకుంటారో అంతగా చాలా సమయము అక్కడ సంపూర్ణ రాజ్య అధికారులుగా అవుతారు. ఒకవేళ ఎవరైనా చాలా కాలము నుండి సఫలతాముర్తిగా అవ్వలేదనుకోండి, అప్పుడు దాని అనుసారంగా రాజ్య అధికారము కూడా కొద్ది సమయమే లభిస్తుంది, సంపూర్ణ సమయము లభించదు. ఎవరైతే చాలా సమయము నుండి సంపూర్ణంగా అయ్యే పురుషార్థములో మగ్నమై ఉంటారో వారే సంపూర్ణ సమయము రాజ్య అధికారిగా అవుతారు. ఏ నాలుగు మూర్తులను చూస్తున్నారు? ఇది కూడా సంపూర్ణంగా అయ్యేందుకు లక్ష్యము. 1. జ్ఞాన మూర్తులు, 2. గుణ మూర్తులు, 3. దాన మూర్తులు మరియు 4. సంపూర్ణ సఫలతా మూర్తులు. వీటిని చూస్తున్నాము. సేవ చెయ్యటము అనగా మహాదానిగా అవ్వటము అని వినిపించాము కదా! కావున ప్రతి ఒక్కరి ఈ నాలుగు మూర్తులను చూస్తున్నాము. నాలుగు ముఖాల గాయనము కూడా ఉంది కదా. ఒక్క మూర్తిలో నాలుగు మూర్తుల సాక్షాత్కారమును అందరికీ చేయించాలి. ఒకవేళ ఒక్క మూర్తి అయినా తక్కువగా ఉన్నట్లయితే అక్కడ కూడా అంతగా తక్కువ అవుతుంది. ఏవిధముగా ఇక్కడ తమతో తీసుకువెళ్ళే సామానును బుక్ చేసుకుంటే అక్కడ లభిస్తుందో అలాగే ఇది కూడా బుకింగ్ ఆఫీసు. ఎంతగా ఇక్కడ బుక్ చేసుకుంటారో అంతగా అక్కడ ప్రాప్తి ఉంటుంది. నాలుగు మూర్తులూ తయారయ్యాయా అన్నదానినే ఆలోచించండి. చతుర్ముఖులుగా అయ్యామా? ఎంతగా ఇక్కడ తమ మూర్తిలో సర్వ విషయాలను ధారణ చేస్తారో అంతగానే భవిష్య రాజ్యమైతే లభిస్తుంది, కానీ ద్వాపరములో  మీ జడమూర్తులనేవైతే తయారు చేస్తారో వాటిని కూడా ఈ సంగమయుగపు మూర్తి ప్రకారంగానే తయారవుతాయి. అర్థమైందా! ఇప్పుడు సంపూర్ణ మూర్తిగా అయ్యేందుకు ఏ లక్ష్యమును మీ ముందు ఉంచుతారు? భక్తులకు చిత్రాలను చూపించి, వారు ఏ పురుషార్థముతో ఇలా తయారయ్యారు అన్నదానిని ఆలోచించండి అని వారికి అర్థం చేయిస్తారు కదా. మరి మీరు సంపూర్ణ మూర్తిగా అయ్యేందుకు ఏ లక్ష్యమును ఎదురుగా ఉంచుకుంటారు? వారు ఏ లక్ష్యమును ఉంచారు? సాకారములో సంపూర్ణ లక్ష్యమైతే ఒక్కటే కదా! వారు కర్మాతీతముగా అయ్యేందుకు ఏ లక్ష్యమును ఉంచారు? ఏ విషయాలలో సంపూర్ణులుగా అయ్యారు? సంపూర్ణత అన్న పదమును ఎంత విశాలతతో ధారణ చేసారో తెలుసా? సంపూర్ణము అన్నదైతే ఒక్కటే పదము. కానీ ఎంత విశాల రూపములో ధారణ చేసి అలా తయారయ్యారు! సర్వ సమర్పణ లక్ష్యముతోనే సంపూర్ణులుగా అయ్యారు.

ఎంతగా  సమర్పణమో అంతగా సంపూర్ణత. కానీ సమర్పణకు కూడా విశాల రూపము ఏది? ఎంత విశాల రూపముతో దీనిని ధారణ చేస్తారో అంతగానే విశాలబుద్ధి కూడా తయారవుతుంది మరియు విశ్వ అధికారిగా కూడా అవుతారు. ఆ విశాలత ఏమిటి? ఇందులో కూడా నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటేమో తమ ప్రతి సంకల్పము సమర్పణ, రెండవది ప్రతి క్షణము సమర్పణ అనగా సమయము సమర్పణ, మూడవది కర్మ కూడా సమర్పణ మరియు నాలుగవది సంబంధము, సంపద ఏవైతే ఉన్నాయో అవి కూడా సమర్పణ. సర్వ సంబంధాల సమర్పణ కూడా అవసరము. ఆ సంబంధములో లౌకిక సంబంధము అయితే రానే వస్తుంది. కానీ ఈ ఆత్మ మరియు శరీర సంబంధమేదైతే ఉందో దానిని కూడా సమర్పణ చేయాలి. ఇంతగా సంబంధమును సమర్పణ చేసారా? వినాశీ సంపద అయితే పెద్ద విషయమేమీ కాదు. కానీ అవినాశీ సంపద అయిన సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, ఆనందముల ప్రాప్తి ఏదైతే ఉందో జన్మసిద్ధ అధికారపు సంబంధము ఏదైతే ఉందో, దానిని కూడా ఇతర ఆత్మల సేవలో సమర్పణ చేసేసారు. పిల్లల శాంతిలో స్వయం శాంతిగా భావించారు. కావున ఆత్మలకు శాంతిని ఇవ్వటమే తమ శాంతిగా భావించారు. ఇదే లౌకిక సంపద మరియు దీనితో పాటు ఈశ్వరీయ సంపదను కూడా సమర్పణ చేసి తమ సాక్షి  స్థితిలో ఉండాలి. కావున సమర్పణ పదానికి ఇంత పెద్ద విశాల రహస్యము ఉంది. అర్థమైందా! అటువంటి విశాల రూపముతో ధారణ చేసేవారే సంపూర్ణ మూర్తిగా మరియు సఫలతామూర్తిగా అవుతారు. కావున సమర్పణ అన్న పదాన్ని ఏదో సాధారణ అర్థముగా భావించకండి. లౌకికమును సమర్పణ చెయ్యటము సహజమే కానీ ఈశ్వరీయ ప్రాప్తి ఏదైతే ఉందో దానిని కూడా సమర్పణ చెయ్యటము అనగా మహాదానిగా అవ్వటము మరియు ఇతరుల శుభ చింతకులుగా అవ్వటము, ఇది నెంబరువారీగా, యథాయోగ్యముగా, యథాశక్తిగా ఉంటుంది. ఇంతగా సమర్పణ అయ్యేవారినే సంపూర్ణ సమర్పణులు అని అంటారు. అటువంటి సంపూర్ణమూర్తులుగా, సమర్పణ మూర్తులుగా అయ్యారా? నాది అన్నది పూర్తిగా ఇమిడిపోవాలి. ఏదైనా వస్తువు ఎందులోనైనా కలసిపోతే సమానమైపోతుంది. ఇమిడిపోవటము అనగా సమానమవ్వటము. కావున నాది అన్నది ఎంతగా ఇమిడిపోతుందో అంతగానే సమానతా మూర్తిగా అవుతారు. మీరు ఇతర ఆత్మల సేవ చేసేటప్పుడు ఏ  లక్ష్యమును ఉంచి చేస్తారు? (తమ సమానంగా చేయాలి) మీ సమానంగా కూడా కాదు, తండ్రి సమానంగా తయారుచెయ్యాలి. మీ సమానంగా చేస్తే మీలో ఏ లోపాలు అయితే ఉన్నాయో అవి వారిలోకి కూడా వచ్చేస్తాయి. కావున ఒకవేళ సంపూర్ణంగా అవ్వాలంటే మీ సమానంగా కూడా కాకుండా తండ్రి సమానంగా తయారుచెయ్యాలి. తండ్రి ఏ విధంగా అయితే తమకన్నా ఉన్నతమైన వారిగా చేసారో అలా మీకంటే కూడా ఉన్నతంగా తండ్రి సమానంగా తయారు చేసినట్లయితే ఫాలో ఫాదర్‌గా అయిపోతారు.

ఎలా అయితే బాబా తమకన్నా ఉన్నతంగా తయారు చేసారో అలాగే మీరు కూడా మీకన్నా ఉన్నతంగా బాబా సమానంగా తయారు చేస్తే ఫాలో ఫాదర్ చేసినట్లే అవుతుంది. కావున ఇప్పుడు మీ సమానంగా కాకుండా తండ్రి సమానంగా తయారు చెయ్యాలి. ఒకవేళ మీరు మీ సమానంగా తయారుచేసే లక్ష్యమునే ఉంచినట్లయితే వారిలో చాలా లోపాలు ఉండిపోతాయి. ఎందుకంటే మీరు లక్ష్యమునే అటువంటిది ఉంచారు. కావున లక్ష్యమును ఎల్లప్పుడూ సంపూర్ణతదే ఉంచాలి. ఎవరైతే సంపూర్ణ మూర్తులుగా ప్రత్యక్షముగా ప్రఖ్యాతమైపొయ్యారో వారి లక్ష్యమును ఉంచవద్దు. ఎవరైతే ఇప్పుడు గుప్తంగా ఉన్నారో, ప్రత్యక్షతలోకి రాలేదో వారి లక్ష్యమును కూడా ఉంచకూడదు. ఎందుకంటే ఎటువంటి లక్ష్యము(ఎయిమ్) ఉంటుందో అటువంటి ప్రాప్తి (ఆబ్జెక్ట్) ఉంటుంది. కావున ఒకవేళ లక్ష్యమును శ్రేష్ఠంగా ఉంచినట్లయితే ప్రాప్తి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. ఇప్పుడు మూడవ నేత్రము ఎల్లప్పుడూ పైన ఉన్న లక్ష్యము వైపు స్థిరముగా ఉండాలి. ఏవిధంగా ఎవరైనా మగ్న అవస్థలో ఉన్నట్లయితే వారి నయనాలు ఒక్కచోటే స్థిరమైపోతాయి కదా, అలాగే ఈ మూడవ నేత్రము, దివ్యబుద్ధితో కూడిన ఈ నేత్రము కూడా ఎల్లప్పుడూ ఒకటే చోట, ఏక రసముగా ఉండిపోవాలి. స్థిరముగా అనగా ఒక్కరిలోనే నిమగ్నమైన మగ్నరూపము కనిపించాలి. మూడవ నేత్రపు సాక్షాత్కారము ఎలా జరగుతుంది? మస్తకము ద్వారా! మస్తకములో ప్రకాశము, నయనాలలో నషా కనిపిస్తుంది. వీరి మూడవ నేత్రము మగ్నమై ఉందా లేక యుద్ధ స్థలములో ఉందా అన్నది దీని ద్వారా తెలిసిపోతుంది. కళ్ళు కొంచెము బాగా లేనప్పుడు కనురెప్పలు మాటిమాటికీ కిందకు పైకీ అవుతూ ఉంటాయి. ఈ మూడవ నేత్రము కూడా ఒకవేళ యథార్థ రీతిలో సరిగ్గా ఉన్నట్లయితే దివ్య బుద్ధి యథార్థ రీతిలో స్వచ్ఛమైనట్లయితే ఒక్క చోటనే దృష్టి ఉంటుంది. కంట్లో ఏదైనా చెత్త పడినట్లయితే ఏమవుతుంది? కనురెప్పలు అల్లల్లాడుతాయి. చెత్తకు గుర్తు కదలటము. యథార్థమైన ఆరోగ్యమునకు గుర్తు - స్థిరముగా అవ్వటము. అలాగే ఈ మూడవ నేత్రము ఎల్లప్పుడూ స్థిరమై ఉండాలి. ఈ సాక్షాత్కారము మీ మస్తకము ద్వారా జరుగుతుంది, మీ నయనాల ద్వారా జరుగుతుంది. మా మూడవ నేత్రము త్వరత్వరగా మూసుకుంటూ-తెరుచుకుంటూ ఉంటుందా లేక ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటుందా అని పరిశీలించుకోండి.

దేని జ్ఞాపకంలో అయినా మునిగిపోయి ఉన్నప్పుడు కూడా కళ్ళు స్థిరమైపోతాయి. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే ఒక్కరి స్మృతిలోనే నిమగ్నమై ఉంటారో వారే సంపూర్ణ స్థితిలో స్థిరమైపోతారు. లేదంటే నయనాలలాగా మూస్తూ, తెరుస్తూ ఉంటారు. స్థిరంగా ఉండలేరు. ఒకవేళ ఏదైనా చెత్త ఉన్నట్లయితే దానిని త్వరగా తొలగించుకోండి. లేదంటే... నవ్వు వచ్చే విషయము వినిపించమంటారా? ఎవరైనా మీ సాక్షాత్కారము చేసుకుంటున్నారనుకోండి, ఆ సమయములో మీ మూర్తి కిందకు,  పైకి అవుతూ ఉన్నట్లయితే ఏమి సాక్షాత్కారము చేసుకుంటారు? ఫోటో తీసే సమయములో కూడా కదలటాన్ని ఆపుతారు కదా. ఒకవేళ కదిలారంటే ఫోటో పాడైపోతుంది. అలాగే మీ స్థితి కదులుతూ ఉన్నట్లయితే ఏమి సాక్షాత్కారమవుతుంది? ఫోటో తీసే సమయములో మిమ్మల్ని ఎంత స్థిరంగా ఉంచుకుంటారో అలాగే మా భక్తులు ప్రతి సమయము మా సాక్షాత్కారమును చేసుకుంటున్నారు అని ఎల్లప్పుడూ భావించండి. అప్పుడు సాక్షాత్కారమూర్తులుగా అనగా స్థిరమూర్తులుగా అవుతారు. లేకపోతే భక్తులకు స్పష్టమైన సాక్షాత్కారమవ్వదు. స్పష్టమైన సాక్షాత్కారము చేయించేందుకు స్థిర బుద్ధి, స్థిరమైన స్థితి అవసరము. అర్థమైందా? ఇప్పటినుండే భక్తులు ఒక్కొక్కరిని సాక్షాత్కారము చేసుకుంటారు. ఆ బీజము అనగా సంస్కారము ఆ భక్తుల ఆత్మలలో నిండుతుంది, ఆ సంస్కారముతో మర్జ్ అవుతారు. మళ్ళీ ద్వాపరములో అదే సంస్కారము ఇమర్జ్ అవుతుంది. ధర్మ స్థాపకులు ఇక్కడినుండే సందేశమును తీసుకొని, సంస్కారమును నింపుకొని వెళ్తారు, అవే మళ్ళీ ఇమర్జ్ అవుతాయి  అని మీరు అర్థం చేయిస్తారు కదా! అలాగే మీ అందరి భక్తులు మరియు ప్రజలు సంస్కారమును తీసుకొని వెళ్తారు, మళ్ళీ దాని అనుసారముగానే ఇమర్జ్ అవుతుంది.  ఒకవేళ భక్తుల ముందు స్పష్టమైన మూర్తి కనిపించనప్పుడు వారిలో ఆ సంస్కారము ఎలా  నిండుతుంది? ఈ కర్తవ్యమును కూడా చెయ్యాలి. కేవలము ప్రజలను తయారు చెయ్యటము కాదు, దానితోపాటు భక్తులలో ఆ సంస్కారమును కూడా నింపాలి. ఎంతమంది ప్రజలు తయారయ్యారు, ఎంతమంది భక్తులు తయారయ్యారన్నది కూడా తెలిసిపోతుంది. భక్తుల  మాల మరియు ప్రజల మాల రెండూ ప్రత్యక్షమవుతాయి. ప్రతి ఒక్కరికీ తమ రెండు మాలల  సాక్షాత్కారము జరుగుతుంది. నేను మాలలో ఎక్కడ ఉన్నాను అని తమ విషయము కూడా సాక్షాత్కారమవుతుంది. కొందరికి భక్తులు ఎక్కువగా ఉంటే, కొందరికి ప్రజలు ఎక్కువగా తయారవుతారు, ఇది కూడా ఒక గుప్త రహస్యము. కొందరి రాజధాని పెద్దదిగా ఉన్నాకూడా సంపద తక్కువగా ఉంటుంది, కొందరి రాజధాని చిన్నదైనాగానీ సంపద ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా గుప్త రహస్యము, దీనిని ఎప్పుడో ఒకసారి తెరవడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజలను తయారుచేసుకొనే లక్ష్యమును ఉంచండి. భక్తులైతే చివర్లో, క్షణాలలో తయారైపోతారు. ఇక్కడ కూడా భక్తులు వందనము చేస్తారు. పూజ చెయ్యరు. గాయనము చేస్తారు, పూజను అక్కడ చేస్తారు. ఇవన్నీ తరువాత  తెలుస్తాయి. అచ్ఛా!

ఓంశాంతి

Read in Other Languages

EEnglishहहिंदीગગુજરાતી

Murli Topics

बुद्धि (दिव्य बुद्धि ) - Divine Intellectदिव्य नेत्र - Divine Eyeसंस्कार - Resolves /Personality Traitsलक्ष्य और लक्ष्यन - Aim and featuresस्वयं पुरुषार्थ - Self Effortsबापसामान सामान - Like FatherTime-समयसेवा /सर्विस (Service)वर्तमान और भविष्य -Present &Futureरूहानी गीत / गायन - spiritual songsस्लोगन - slogans
चार बाते - Four thing
महादानी - Pholanthropist