Search for a command to run...
25 Jan 1969
సమర్పణ యొక్క ఉన్నత దశ – ప్రతి శ్వాసలో స్మృతి
25 January 1969 · తెలుగు
అవ్యక్త స్థితిలో స్థితులై అవ్యక్తాన్ని వ్యక్తంలో చూడండి. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాము. సర్వ సమర్పణ అయ్యారా? (సర్వ సమర్పణ అయ్యే ఉన్నాము). ఇది అందరి ఆలోచనా లేక కొందరి ఆలోచన మరోలా ఉందా? సర్వ సమర్పణ అని దేనిని అంటారు? సర్వములో ఈ దేహ భానము కూడా వస్తుంది. దేహము తీసుకుంటే ఇవ్వవలసి కూడా ఉంటుంది. కానీ దేహ భానాన్ని తొలగించి సమర్పణ కావాలి. మీరు ఏమని భావిస్తున్నారు? దేహ అభిమానంతో కూడా సంపూర్ణ సమర్పణ అయ్యారా? మరణించారా లేక మరణిస్తూ ఉంటారా? దైహిక సంబంధాలు మరియు మానసిక సంకల్పాలకన్నా మీరు ఒక దేహి. ఈ దేహ అభిమానము పూర్తిగా తొలగాలి అప్పుడే సర్వ సమర్పణమయ జీవితము అంటారు. ఎవరైతే సర్వస్వ త్యాగి, సర్వ సమర్పణ జీవితాన్ని గడిపేవారు ఉన్నారో వారి సంపూర్ణ అవస్థ యొక్క గాయనమే జరుగుతుంది. సంపూర్ణంగా అయినప్పుడు కలిసి వెళ్తాము. బాబా వెళితే మేము కూడా బాబాతో కలిసి వెళ్తాము అని మీరు ఆరంభంలో సంకల్పం చేసారు కదా! మరి అలా ఎందుకు చేయలేదు? ఇది కూడా ఒక స్నేహము. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించడం ఒక గొలుసు వంటిది, ఇది అంతిమ సమయానికి గుర్తు. అలా చెప్పినప్పుడు ఎందుకు శరీరం విడిచిపెట్టలేదు? విడిచి పెట్టగలరా? ఇప్పుడు అనుకున్నా శరీరం వీడదు. ఎందుకంటే మీ శరీరంతో లెక్కాచారాలు ఉన్నంత వరకు మీ శరీరం వీడదు. యోగంతోనైనా లేక భోగంతోనైనా లెక్కాచారాలను తప్పకుండా తీర్చుకోవలసిందే. ఏదైనా కఠిన లెక్కాచారము ఉంటే ఈ శరీరము ఉంటుంది. వీడలేదు.
అసలైతే సమర్పణ అయ్యే ఉన్నారు కానీ ఇప్పుడు సమర్పణ స్థితి మరింత ఉన్నతంగా అయింది. ప్రతి శ్వాసలో స్మృతి ఉండటాన్ని సమర్పణ అంటాము. ఒక్క శ్వాస కూడా విస్మృతితో ఉండకూడదు. ప్రతి శ్వాసలో స్మృతి ఉండాలి, అలా ఉండేవారి గుర్తులు ఏమిటి? వారి ముఖంలో ఏమి కనిపిస్తుంది? వారి ముఖంలో ఏమి ఉంటుంది, తెలుసా? (హర్షితముఖము) హర్షితముఖమే కాకుండా ఇంకా కూడా ఒకటి ఉంటుంది. ఎవరు ఎంత సహనశీలురై ఉంటారో వారిలో అంత శక్తి పెరుగుతుంది. ఎవరైతే ప్రతి శ్వాసలో స్మృతిలో ఉంటారో వారిలో సహనశీలత గుణము తప్పకుండా ఉంటుంది. సహనశీలురుగా ఉన్న కారణంగా ఒకటి హర్షితంగా ఉంటారు, రెండు, వారిలో శక్తి కనిపిస్తుంది. వారి ముఖంలో నిర్బలత ఉండదు. ఎలా చేయాలి, ఏమవుతుంది అన్న మాటలు ఒక్కోసారి నోటి నుండి వచ్చేస్తుంటాయి, ఇవి నిర్బలతతో మాట్లాడే మాటలు, ఇవి రాకూడదు. మనసులో వస్తేనే నోటి నుండి వస్తాయి. మనసులోనే అసలు రాకూడదు. మన్మనాభవ మధ్యాజీభవ. మన్మనాభవ అర్థం చాలా గుహ్యమైనది. మనసు, పూర్తిగా డ్రామా ఎలా అయితే ప్రతి సెకండు జరుగుతుందో సరిగ్గా అదే విధంగా, ఎలా నడుస్తుందో దానితో పాటుగానే మనసు స్థతి కూడా అలాగే డ్రామాతో పాటుగా పట్టాలపై నేరుగా నడుస్తూ ఉండాలి. కొద్దిగా కూడా కదలకూడదు, సంకల్పంలోనైనా కావచ్చు, వాచలోనైనా కావచ్చు. డ్రామా పట్టాలపై నడుస్తున్నట్లుగా స్థితి ఉండాలి. కానీ ఒక్కోసారి ఆగిపోతుంటారు. నోరు ఒక్కోసారి చలిస్తుంది. మనసు స్థితి కదులుతుంది – తర్వాత మీరు పట్టుకుంటారు. అప్పుడు అది ఒక మచ్చలా మిగిలిపోతుంది.
ఒక విషయము, ఇప్పటివరకు కొన్ని వాణి వరకు వచ్చాయి, ప్రాక్టికల్లోకి రాలేదు. ఏ మాటలు వాణి వరకు వచ్చాయి, ప్రాక్టికల్లోకి రాలేదు? డ్రామా ఢాలు గురించి ఏదైతే వినిపించామో అదే. కానీ మరో విషయం కూడా వినిపిస్తున్నాము. ఎలా అయితే ఇప్పుడు సమయం సమీపంగా ఉన్నదో, అలాగే సమయానుసారంగా ఏ అంతర్ముఖత స్థితి అయితే ఉండాలో, వాణికి అతీతంగా, అంతర్ముఖులై, కర్మణలో అవ్యక్త స్థితిలో స్థితులై ధారణ చేసే స్థితి కనిపించాలి, ఇది ఇప్పటికీ తక్కువగా ఉంది. కార్య వ్యవహారాలు కూడా జరుగుతూ ఉండాలి మరియు ఈ స్థితి కూడా ఉండాలి. ఈ రెండూ కలిసి సమానంగా జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో లోటు ఉంది. ఇప్పుడు సాకారమైతే అవ్యక్త స్థితి స్వరూపంలో స్థితులై ఉన్నారు. కానీ పిల్లలైన మీరు కూడా అవ్యక్త స్థితిలో స్థితులైనప్పుడు అవ్యక్త మిలనపు అలౌకిక అనుభూతిని చేసుకోగలరు. మరో ముఖ్య విషయము, వర్తమాన సమయం కోసం మీ గమనికకు తెస్తున్నాము, ఇది మీలో ఉండాలి. అది ఏమిటి? ఎవరికైనా తడుతుందా? ముఖ్యమైనది, సాకార రూపంలో కూడా చెప్తూ ఉండేవారు, అమృతవేళ లేవడము. అమృతవేళ వాయుమండలం అలాగే ఉంటుంది. సాకారంలో అమృతవేళ పిల్లలు దూరంగా ఉన్నప్పటికీ కలిసేవారు. ఇప్పుడు అమృతవేళలో బాబా మీ వద్దకు వచ్చినప్పడు ఆ వాయుమండలం కనిపించలేదు. ఏమయింది, అలసిపోయారా? ఈ అమృతవేళపు అలౌకిక అనుభూతిలో అలసట దూరమవుతుంది. కానీ లోటు కనిపించింది. పిల్లలు ప్రతి ఒక్కరూ త్వరత్వరగా ఈ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోవాలన్నది బాప్దాదా కోరిక. మీరు సాకారుడిని సాకారంలో కలుసుకునేటప్పుడు మీది కూడా ఆకారీ స్థితి అయిపోతుంది. ఇప్పుడు ఎంతెంతగా అవ్యక్త ఆకారీ స్థితిలో స్థితులై ఉంటారో అంతగా అలౌకిక అనుభూతిని చేసుకోగలరు.
ఓంశాంతి