Search for a command to run...
1 Nov 1970
బాబా సమానంగా అయ్యేందుకు యుక్తులు
1 November 1970 · తెలుగు
ఈరోజు పిల్లల ధైర్యము తండ్రి సహాయమునకు ప్రత్యక్ష ప్రమాణమును చూస్తున్నాము. ఏ గాయనమైతే ఉందో దానిని సాకార రూపంలో చూస్తున్నాము. పిల్లలు ఒక్క అడుగు ముందుకు వస్తే వెయ్యి రెట్లు తండ్రి కూడా ఎంతో దూరము నుండి సమ్ముఖమునకు వస్తారు. మీరు ఎన్ని మైళ్ళ నుండి వచ్చారు? బాప్దాదా ఎంత దూరము నుండి వచ్చారు? ఎవరు ఎక్కువ స్నేహులు? పిల్లలా లేక తండ్రా? ఇందులో కూడా తండ్రి పిల్లలను ముందుంచుతారు. ఇప్పుడు కూడా ఈ పాత ప్రపంచములో తండ్రి కంటే అధికంగా ఆకర్షితము చేసే వస్తువేంటి? ఇది పాత ప్రపంచము, సర్వ సంబంధాలు, సర్వ సంపదలు, సర్వ పదార్థాలు అన్నీ అల్పకాలికమైనవి మరియు ఆడంబరానికి మాత్రమే అని తెలిసినాగానీ ఇంకా ఎందుకు మోసపోతున్నారు? ఎందుకు వాటిలో లిప్తమైపోతున్నారు(మునిగిపోతున్నారు)? మీ గుప్త స్వరూపమును మరియు తండ్రి గుప్త స్వరూపమును ప్రత్యక్షము చెయ్యండి, అప్పుడే తండ్రి గుప్త కర్తవ్యమును ప్రత్యక్షము చెయ్యగలరు. మీ శక్తి స్వరూపము ప్రఖ్యాతమైపోతుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది. కేవలం ఒక్క పదమును గుర్తుంచుకుంటే మీ గుప్త రూపమును ప్రాక్టికల్లోకి తీసుకురాగలరు. అది ఏ పదము? కేవలం ‘అంతరము’ అన్న పదము. అంతరము అన్నమాటలో రెండు రహస్యాలూ వచ్చేస్తాయి. అంతరము అని కాంట్రాస్ట్ (తేడా)ను కూడా అంటారు, అలాగే అంతరము అని లోపల అన్న అర్థానికి కూడా వాడతారు. అంతర్ముఖి, అంతర్యామి అని అంటుంటారు కదా! కావున అంతరము అన్న పదము ద్వారా రెండు అర్థాలు నిరూపణ అవుతాయి. అంతరము అన్న పదము గుర్తుకురాగానే ఒకటేమో, ఇది శ్రేష్ఠమైనదా కాదా అని ప్రతి విషయములో కాంట్రాస్ట్ చేస్తారు. రెండవది, అంతర స్థితిలో ఉండటం ద్వారా లేక అంతర స్వరూపములో స్థితులవ్వటం ద్వారా మీ గుప్త స్వరూపము ప్రత్యక్షమైపోతుంది. ఒక్క మాటను గుర్తుంచుకోవటం ద్వారా జీవితమును మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా సమయము తీవ్రగతితో నడుస్తూ ఉందో దాని ప్రమాణంగా చూస్తే ఇప్పుడు ఈ పాదము పృథ్విపై ఉండకూడదు. ఏ పాదము? దానితో స్మృతియాత్రను చేస్తారు. ఫరిశ్తాల పాదములు పృథ్విపై ఉండవు అని నానుడి ఉంది కదా! ఇప్పుడు ఈ బుద్ధి అనే పాదము పృథ్విపై అనగా ప్రకృతి ఆకర్షణ నుండి దూరంగా అయిపోవాలి, ఇక ఏ వస్తువు కూడా కిందకు తీసుకొని రాజాలదు. అప్పుడిక ప్రకృతికి అధీనులయ్యేవారిగా కాకుండా ప్రకృతిని అధీనము చేసుకునేవారిగా అయిపోతారు. భూమి నుండి దూరంగా వెళ్ళేందుకు ఏ విధంగా సైన్సు వారు ప్రయత్నము చేస్తున్నారో, అలాగే సైలెన్సు శక్తి ద్వారా ఈ ప్రకృతి ఆకర్షణ నుండి దూరంగా వెళ్ళి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆధారమును తీసుకోవటము ఉండాలి. అంతేగానీ ప్రకృతి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అధీనము చేసుకోవటము కాదు. మరి ఇటువంటి స్థితి ఎంతవరకు తయారైంది? ఇప్పుడైతే బాప్దాదా పిల్లలతో కలిసి వెళ్ళేందుకు సూక్ష్మవతనములో తమ కర్తవ్యమును చేస్తున్నారు, కానీ ఇది కూడా ఎప్పటి వరకు? వెళ్ళటమైతే మన ఇంటికే కదా! కావున ఇప్పుడు త్వరత్వరగా స్వయమును ఉన్నతమైన స్థితిలో స్థిరం చేసుకునేందుకు ప్రయత్నము చెయ్యండి. కలిసి వెళ్ళాలి, కలిసి ఉండాలి మరియు కలిసి రాజ్యము చేయాలి కదా! కలిసి ఎలా ఉంటారు? సమానంగా అవ్వటం ద్వారా. సమానంగా అవ్వకపోతే కలిసి ఎలా ఉండగలరు? ఇప్పుడు కలిసి ఎగరాలి, కలిసి ఉండాలి. దీనిని స్మృతిలో ఉంచుకున్నప్పుడే స్వయమును త్వరగా సమానంగా తయారుచేసుకోగలరు, లేదంటే కొంత దూరం ఉండిపోతుంది. కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము మరియు కలిసి రాజ్యము చేస్తాము అన్నది మీ ప్రతిజ్ఞ కదా! కేవలం రాజ్యము చేసే సమయములో తండ్రి గుప్తమైపోతారు, మరి కలిసి ఎలా ఉంటారు? సమానంగా అవ్వటం ద్వారా, సమానతను ఎలా తీసుకువస్తారు? సాకార తండ్రి సమానంగా అవ్వటం ద్వారా. ఇప్పుడు బాప్దాదా అని అంటున్నారు కదా, వారిద్దరిలో సమానత ఎలా వచ్చింది? సమర్పణత ద్వారా సమానత క్షణములో వచ్చింది. ఇలా సమర్పణ అయ్యే శక్తి కావాలి. ఎప్పుడైతే సమర్పణ చేసేసారో అప్పుడిక తమదిగానీ లేక అన్యుల అధికారముగానీ సమాప్తమైపోతుంది. ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తే ఇక దానిపై మీ అధికారముగానీ ఇతరుల అధికారముగానీ సమాప్తమైపోతుంది. ఒకవేళ ఇతరులెవరైనా అధికారమును చూపిస్తే ఏమంటారు? దీనిని నేను సమర్పణ చేసాను అని అంటారు. అలా ప్రతి వస్తువునూ మొత్తము సమర్పణ చేసిన తరువాత తమ లేక ఇతరుల అధికారము ఎలా ఉండగలదు? ఎప్పటివరకైతే తమ లేక ఇతరుల అధికారము ఉంటుందో అప్పటి వరకు సర్వ సమర్పణలో లోటు ఉంది అని నిరూపణ అవుతుంది. అందువలన సమానత రాదు. ఎవరైతే ఆలోచించి ఆలోచించి సమర్పణ అవుతారో దాని రిజల్టుగా ఇప్పుడు కూడా పురుషార్థములో ఆ ఆలోచనే అనగా వ్యర్థ సంకల్పము విఘ్న రూపంగా అవుతుంది. అర్థమైందా? అచ్ఛా!
ఓంశాంతి