Search for a command to run...
29 Oct 1970
దీపమాల యొక్క సత్యమైన రహస్యము
29 October 1970 · తెలుగు
ఈరోజు బాప్దాదా దీపమాలను చూస్తున్నారు. ఇది దీపాల మాల కదా! ప్రజలు దీపావళి జరుపుకుంటారు, బాప్దాదా దీపమాలను చూస్తున్నారు. ఎటువంటి దీపం మంచిగా అనిపిస్తుంది? ఏ దీపమైతే అఖండంగా, స్థిరంగా ఉంటుందో అది మంచిగా అనిపిస్తుంది. ఘృతం (నెయ్యి) తరిగిపోకుండా ఉన్న దీపమే అఖండంగా వెలుగుతుంది. స్వయాన్ని అటువంటి దీపంగా భావిస్తున్నారా? అలాంటి దీపాల స్మృతి చిహ్నమే మాల. మిమ్మల్ని మీరు మాల మధ్యలో మెరిసే దీపంగా భావిస్తున్నారా? మా స్మృతిచిహ్నమునే ఈరోజు జరుపుకుంటున్నాము అని భావిస్తున్నారా! దీపమాల రోజున విశేషంగా రెండు విషయాలపై ధ్యాస పెడతారు! దీపావళి నాడు వేటిపై శ్రద్ధ పెడతారు? (స్వచ్ఛంగా ఉంచుతారు, కొత్త ఖాతా పెడ్తారు). కానీ ఏమి లక్ష్యం పెట్టుకుంటారు? సంపాదన. సంపాదన యొక్క లక్ష్యంతోనే శుభ్రం కూడా చేస్తారు. శుభ్రత కూడా అన్ని రకాలుగా ఉండాలి మరియు సంపాదన యొక్క లక్ష్యాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ స్వచ్ఛత మరియు సంపాదన అనే రెండు కార్యాలు మీరందరూ చేసారా? మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా? సంపాదన ఉంటే స్వచ్ఛత తప్పకుండా ఉంటుంది కదా! ఈ రెండు విషయాలలో సంతుష్టత ఉండటం అవసరం. కానీ ఎవరైతే సదా దివ్యగుణాలను ఆహ్వానిస్తారో వారికే ఈ సంతుష్టత వస్తుంది. ఎవరు ఎంత ఆహ్వానిస్తారో అంత ఈ రెండు విషయాలలో సదా సంతుష్టంగా ఉంటారు. ఎంతగా దివ్యగుణాలను ఆహ్వానిస్తారో అంతగా అవగుణాలు ఆహుతి రూపంలో సమాప్తి అయిపోతాయి. తర్వాత ఏమవుతుంది? నూతన సంస్కారాలు అనే నూతన వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు ఆత్మ కొత్త సంస్కారాల రూపి కొత్త వస్త్రం ధారణ చేసిందా లేక అప్పుడప్పుడు పాత వస్త్రాలపై ప్రీతి ఉన్న కారణంగా వాటిని కూడా ధారణ చేస్తుందా! మరుజీవిగా అయ్యారు, కొత్త జన్మ యొక్క కొత్త సంస్కారాలు ధారణ చేసారు, మరలా పాత సంస్కారాల రూపి వస్త్రాలను అప్పుడప్పుడు ఎందుకు ధరిస్తున్నారు? పాత వస్త్రాలు అంత ప్రియంగా అనిపిస్తున్నాయా? బాబాకు నచ్చని వస్తువు పిల్లలకు ఎందుకు నచ్చుతుంది? ఈరోజు వరకు ఏవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత ఉండిపోయాయో ఆ పాత ఖాతానంతా ఈరోజు సమాప్తి చేయాలి, దీపావళి జరుపుకోవటం అంటే ఇదే. అల్పకాలికంగా కాదు, సదాకాలికంగా మరియు అన్ని రూపాలలో సమాప్తం చేయాలి. ఇదే దీపావళిని జరుపుకోవడము. దీపావళిని పట్టాభిషేకం యొక్క రోజు అంటారు. ఈరోజు మీరందరూ ఏ పట్టాభిషేకాన్ని జరుపుకున్నారు? పట్టాభిషేకం రోజు ఏమి చేస్తారు? రాజ్య సింహానస సమారోహాన్ని ఎప్పుడైనా చూసారా? గుర్తుకు వస్తుందా, ఎన్నిసార్లు చూసి ఉంటారు? అనేకసార్లు చూసారు. రోజురోజుకు ఇలా అనుభవం చేసుకుంటారు - ఎలా అయితే ఈ జన్మలో ప్రత్యక్షంగా చూసిన విషయం స్పష్టంగా ఎలా ఉంటుందో అలాగే భవిష్య రాజరికం యొక్క సంస్కారాలు ఏ ఆత్మలో అయితే నిండి ఉన్నాయో అవి నిన్న చూసిన విషయంలా అనుభవం అవుతాయి. ఇలా ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు, అంటే మేము మా సంపూర్ణ స్థితికి మరియు మా రాజ్యానికి సమీపంగా చేరుకుంటున్నాము అని దీనితో అర్థం చేసుకోండి. సత్యయుగ సంస్కారాలను ఆలోచించడం లేదా గుర్తుకు తెచ్చుకోవడం కాదు, స్వతహాగానే స్పష్టంగా జీవితంలోకి వస్తాయి. ఈ ప్రపంచంలో ఉంటూ కూడా నయనాలలో సత్యయుగ దృశ్యాలు కనిపిస్తాయి, అంతే కాదు మీ భవిష్య స్వరూపం ఏదైతే ధారణ చేయబోతున్నారో అది కూడా కళ్ళ ముందు పదేపదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇది వదిలి అలంకరించబడిన శరీరాన్ని ధారణ చేయాలి అని అనుభవం చేసుకుంటారు. ఇలా అనుభవం చేసుకుంటారు. ఈ సంగమ యుగంలోనే సత్యయుగ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. ప్రతి ఒక్కరినీ పురుషార్థము మరియు ప్రారబ్ధము రెండు రూపాలలోనూ ప్రత్యక్షంగా చూస్తారు. కనుక ఈ దీపావళి రోజున దివ్యగుణాలను ఆహ్వానించాలి. అవును, కల్ప క్రితం ఇది చేసి ఉండవచ్చు అని ఇప్పుడు మీరు నోటి నుండి అంటుండవచ్చు, కానీ ఇక ముందు ఈ మాట మారిపోతుంది. ఈ కల్పం యొక్క విషయంగా అయిపోతుంది. ఐదు వేల సంవత్సరాల క్రితం విషయం కూడా నిన్నటి విషయంలా స్మృతిలోకి వస్తుంది. విజ్ఞాన సాధనం ద్వారా దూరంగా ఉన్న వస్తువులు కూడా సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని దుర్బిణి అంటారు. అలాగే మీ మూడవనేత్రం కల్పపూర్వపు విషయాలను సమీపంగా మరియు స్పష్టంగా చూస్తుంది మరియు అనుభవం చేసుకుంటుంది. పాత సంస్కారాల ఖాతాను మళ్ళీ పొరపాటున కూడా చూడకూడదు. పాత సంస్కారాల వస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ ధారణ చేయకండి, నవీనతను ధారణ చేయండి. ఇదే ఈరోజు యొక్క మంత్రం. రత్నజడిత శరీరాన్ని వదలి శిథిలావస్థలో ఉన్న శరీరంతో ప్రేమను పెట్టుకోకండి. సదా బుద్ధిలో బాప్దాదా యొక్క స్మృతి లేదా గమ్యం మరియు రాబోయే రాజ్య దృశ్యాలు ఉండాలి. నయనాలలో, నోటిలో సదా బాప్దాదా పేరు ఉండాలి. అటువంటి వారినే బాప్దాదాకు అతి స్నేహి మరియు సమీప రత్నాలు అని అంటాము. అందరూ శ్రేష్ఠ మరియు సమీప రత్నాలుగా అయ్యే లక్ష్యం పెట్టుకున్నారా లేక ఏది లభించినా మంచిదేనా? ఒకవేళ ఈ విషయంలో సంతుష్టం అయిపోతే సంపూర్ణం కాలేరు. అందువలన మేము విజయీ మరియు సంపూర్ణంగా అయ్యే చూపిస్తాము అనే లక్ష్యం పెట్టుకోండి. బలహీన మాటలు సమాప్తం అయిపోవాలి. చేస్తాములే, అయిపోతుందిలే, పురుషార్థం చేస్తున్నాము కదా, ఈ మాటలు కూడా రాకూడదు. చేసి చూపిస్తాము, తయారయ్యి చూపిస్తాము - ఇవి నిశ్చయబుద్ది విజయీ రత్నాల మాటలు. అవి ధనుర్ధారి పిల్లల మాటలు. అవ్వాల్సినది స్వదర్శన చక్రధారులుగా అయితే ధనుర్ధారిగా అవుతున్నారు. ఎవరో ఒకరు అలా కూడా అవ్వాలి కదా అని కొందరు అనుకుంటున్నారు. ఈ విషయంలో దయాళువుగా అవ్వకండి. ఎవరో అవ్వాలి కాబట్టి మేమే అవుతాము అంటారు, అలా అయ్యేవారు చాలా మందే ఉన్నారు. అచ్ఛా!
ఓంశాంతి