Search for a command to run...
15 Sept 1969
స్మృతి ఆధారంగా స్మృతిచిహ్నము
15 September 1969 · తెలుగు
ధ్వనికి అతీతంగా వెళ్ళాలా లేక బాబాను కూడా ధ్వనిలోకి తీసుకురావాలా? మీరందరూ ధ్వనికి అతీతంగా వెళ్తున్నారు. మళ్ళీ బాప్‌దాదాను ధ్వనిలోకి తీసుకువస్తున్నారు. ధ్వనిలోకి వస్తూ కూడా అతీంద్రియ సుఖంలో ఉండగలిగినప్పుడు ధ్వని నుండి అతీతంగా వెళ్ళే ప్రయత్నం ఎందుకు? ఒకవేళ ధ్వని నుండి అతీతంగా నిరాకార స్థితిలో స్థితి అయ్యాక సాకారంలోకి వస్తే ఇతరులను కూడా ఆ అవస్థలోకి తీసుకురాగలరు. ఒక్క సెకండులో నిరాకారము, ఒక్క సెకండులో సాకారము. ఇటువంటి డ్రిల్‌ను నేర్చుకోండి. ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే సాకారి, ఇటువంటి స్థితి తయారైనప్పుడు సాకార రూపంలో ప్రతి ఒక్కరికీ నిరాకార రూపము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. తమను తాము సాక్షాత్కారం చేసుకున్నారా? బ్రాహ్మణ రూపంలో అయితే ఉండనే ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని మీరు సాక్షాత్కారం చేసుకున్నట్లయితే మరి మీ నంబరును కూడా సాక్షాత్కారం చేసుకున్నారా? మీరు మరింకేదైనా రూపాన్ని సాక్షాత్కారం చేసుకున్నారా? మీ అసలైన రూపాన్ని మర్చిపోయారా? వర్తమాన సమయంలో మీరు ఏ రూపంతో యుక్తీయుక్త సేవను చేయగలరు? జగన్మాత.
ఈరోజు విశేషంగా మాతల ప్రోగ్రాము ఉంది కదా. ఉండేది మాత రూపంలోనే కానీ జగన్మాతగా ఉండాలి. మాతగా అవ్వనంత వరకు పాలనను ఇవ్వలేరు. ఈరోజు మాతలను ఎందుకు పిలిచాము? వారసత్వానికి అధికారులుగా అయ్యారా లేక అవ్వడానికి వచ్చారా? వారసులుగా అయ్యారా లేక అవ్వడానికి వచ్చారా? వారసులకు వారసత్వము ఉండనే ఉంటుంది, అంతేనా లేక వారసులుగా అయ్యారుగానీ వారసత్వము లభించలేదా? వారసత్వానికి హక్కుదారులుగా అయితే అయ్యారు. ఇప్పుడు ఏ కార్యం కోసం వచ్చారు? బాప్‌దాదా తప్పకుండా ఏదైనా విశేష కార్యం కోసమే పిలిపించి ఉంటారు. స్టడీ (అధ్యయనం) అయితే మీ మీ సేవాకేంద్రాలలో కూడా చేస్తూ ఉంటారు. కోర్సు కూడా పూర్తి చేసారు. ముఖ్యమైన జ్ఞానము యొక్క చదువు కూడా తెలిసిపోయింది. ఇక ఏమి మిగిలి ఉంది? ఇప్పుడు నష్టోమోహులుగా అవ్వాలి. సత్యమైన స్నేహిగా అయినప్పుడే నష్టోమోహులుగా అవ్వగలరు. ఏదైనా వస్తువును అగ్నిలో వేసినప్పుడు దాని రంగు, రూపము అన్నీ మారిపోతాయి. అలాగే మిగిలి ఉన్న కొద్ది అసుర గుణాలు, లోక మర్యాదలు, కర్మ బంధన త్రాళ్ళు, మమకారము అను దారాలు, ఇలా ఏవేవైతే కట్టివేసాయో వాటన్నిటినీ కాల్చేయాలి. ఈ స్నేహము అనే అగ్నిలో పడినప్పుడు ఇవన్నీ దూరమవుతాయి. ఇలా మీ రంగును, రూపాన్ని అన్నిటినీ మార్చాలి. ఈ ప్రేమ అను అగ్నిలో పడి పరివర్తనను తీసుకురావడానికి తయారుగా ఉన్నారా? ఏ వస్తువైతే కాలిపోతుందో అది సమాప్తమైపోతుంది. కనిపించదు. ఈ విధంగా స్వయాన్ని పరివర్తన చేసుకునే ధైర్యం ఉందా? మీ అందరి స్మృతిచిహ్నము ఇప్పటివరకు స్థిరంగా ఉంది. మీ స్మృతిచిహ్నము యొక్క ఆధారము ఏ విషయంపై ఉంది? ఎంతెంత స్మృతి ఉంటుందో అంతంతగా అందరి స్మృతిచిహ్నాలు తయారవుతాయి. ఇప్పటివరకు కూడా ఉన్నాయి. మీ స్మృతి ఆధారంగా అందరి స్మృతిచిహ్నాలు తయారయ్యాయి. ఒకవేళ స్మృతి తక్కువ ఉంటే స్మృతిచిహ్నము కూడా అలాగే తయారవుతుంది. స్మృతిచిహ్నాన్ని స్థిరంగా నిలుపుకునే ప్రయత్నం చేయాలంటే ముందుగా స్మృతిని స్థిరపర్చుకోండి. తర్వాత దీని ఆధారంగా స్మృతిచిహ్నము తయారవుతుంది.
ప్రతి ఒక్కరిలో ఉన్న విశేష గుణంపై ప్రతి ఒక్కరి దృష్టి వెళ్ళాలి. ఒక్కొక్కరిలో ఉన్న ప్రతి విశేష గుణాన్ని ప్రతి ఒక్కరూ ఒకవేళ తమలో ధారణ చేసుకుంటే ఎలా అయిపోతారు? సర్వగుణ సంపన్నులు. ఎలా అయితే ఆత్మ రూపాన్ని చూస్తారు కదా, అలాగే కర్మ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి విశేష గుణాల వైపు చూడండి. అప్పుడు ఇతర విషయాలు మర్చిపోతారు. గుణాలనే తమలో నింపుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మాతలకు చంద్రుని తిలకాన్ని పెట్టడం జరిగింది. చంద్రునిలో ఉన్న గుణాలను స్వయంలో ధారణ చేసుకోవలసిందే, అయితే చంద్రునికి సూర్యునితో లోతైన సంబంధం ఉంది. కనుక చంద్రునికి ఉన్న సంబంధము, గుణాలను ధారణ చేసుకోండి. చంద్రుని కర్తవ్యము ఏమిటి? శీతలతతో పాటు ప్రకాశాన్ని కూడా ఇస్తుంది. అచ్ఛా. ఇక వీడ్కోలు.
ఓంశాంతి