Search for a command to run...
5 Dec 1970
ప్రతిజ్ఞ చేసేవారితో మాయ చేసే ఛాలెంజ్
5 December 1970 · తెలుగు
శబ్దము నుండి దూరంగా వెళ్ళటము మరియు తీసుకు వెళ్ళటము వచ్చా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శబ్దములోకి రావటము మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శబ్దము నుండి దూరంగా వెళ్ళటము, ఇటువంటి సహజ అభ్యాసకులుగా అయ్యారా? ఈ పాఠమును పక్కా (దృఢం) చేసుకున్నారా? విజయిరత్నాలుగా అయ్యారా? దేనిపై విజయిలుగా అయ్యారు? అందరి హృదయాలపై విజయాన్ని పొందగలరా? ఏవిధంగా బాప్‌దాదా యొక్క ఈ కర్తవ్య గుణమునకు స్మృతి చిహ్నము ఇక్కడ ఉందో అలా తండ్రి సమానంగా విజయులుగా అయ్యారా? సర్వులపై విజయాన్ని పొందారా? ఇతరులెవరైనా మీపై విజయులుగా అవ్వగలరా? ఇటువంటి స్థితిని భట్టీలో తయారు చేసుకున్నారా? భట్టీ నుండి వెళ్ళిన తరువాత ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. పాస్ విత్ హానర్ అంటే సంకల్పములో కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండటము, అలా తయారయ్యారా? ‘జీ,హాఁ (సరే, అలాగేనండి)’ అన్న నినాదాన్ని చాలా బాగా చేసారని నిన్న సమాచారమును విన్నాము. ఇటువంటి ప్రతిజ్ఞ చేసేవారు పాస్ విత్ హానర్‌గా అవ్వాలి. ప్రతిజ్ఞ చేసేవారికి బాగా ఎక్కువగా ప్రాక్టికల్ పరీక్షను పెట్టాలి అన్నది మాయ చేసే ఛాలెంజ్. ఎదుర్కొనే శక్తిని ఎల్లప్పుడూ మీలో స్థిరంగా ఉంచుకోవాలి. అష్ట శక్తుల గురించి ఏదైతే వినిపించామో, వాటిని ధారణ చేసారా? జ్ఞానమూర్తులుగా, గుణమూర్తులుగా ఇరువురిగా అయ్యారా? మాయకు మంచిగా సదాకాలానికి వీడ్కోలు ఇచ్చేసారా? మీరిచ్చే స్థూల వీడ్కోలుకు ముందే మాయకు వీడ్కోలు ఇవ్వాలి. మాయ కూడా చాలా తెలివైనది. ఎవరైనా శరీరము విడిచిపెట్టినప్పుడు ఒక్కోసారి శ్వాస లోపల దాగి ఉంటుంది, వీరు మరణించారని మిగిలిన వారు కూడా భావించేస్తారు కానీ దాగి ఉన్న ఆ శ్వాస మళ్ళీ ఒక్కోసారి పని చెయ్యటం మొదలుపెడ్తుంది. అలాగే మాయ కూడా తన అతి సూక్ష్మరూపాన్ని ధారణ చేస్తుంది. కనుక, ఎలా అయితే డాక్టర్లు శ్వాస ఎక్కడైనా ఉందా అని బాగా పరిశీలిస్తారో అలాగే మూడవ నేత్రంతో మీ పరిశీలనను చాలా బాగా చేసుకోవాలి. అప్పుడిక, ఈ విషయము గురించి అయితే మాకు ఇప్పుడే తెలిసింది అన్న మాటలు ఎప్పుడూ వెలువడవు. కావుననే బాప్‌దాదా ముందు నుండే జాగ్రత్తపరులుగా, తెలివైనవారిగా తయారుచేస్తున్నారు, ఎందుకంటే ప్రతిజ్ఞ చేసారు, ఏ స్థానములో ప్రతిజ్ఞ చేసారు? ఎవరి ముందు చేసారు? ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. ప్రాప్తినైతే చేసారు కానీ ప్రాప్తితో పాటు ఇంకేమి చెయ్యవలసి ఉంటుంది? ప్రాప్తిని పొందారు, కానీ అందరూ తృప్తి అయ్యేంతగా ప్రాప్తిని పొందారా? ఎంత తృప్తిగా అవుతారో అంతగా ఇచ్ఛామాత్రమ్ అవిద్య (కోరిక అంటేనే తెలియనివారు)గా అవుతారు. కామన (కోరిక) కు బదులుగా సామనా (ఎదుర్కొనే) శక్తి వస్తుంది. పాత వృత్తుల నుండి నివృత్తులయ్యారా - ఇది అన్ని పరీక్షలలో ఉండే ప్రశ్న, ఈ పరీక్షలు ప్రాక్టికల్‌గా రానున్నాయి. మిమ్మల్ని పూర్తి క్లియర్‌గా చేసుకున్నారా, డోంట్ కేర్ (మాయను పట్టించుకోని శక్తి) శక్తిని మీలో ధారణ చేసారా? స్వయము మరియు సమయము, రెండింటి అవగాహనను మంచిగా స్పష్టముగా తెలుసుకున్నారా? వీటన్నింటినీ చేసారా లేక చెయ్యవలసి ఉందా? అన్ని విషయాలలో ప్రాప్తిని పొంది తృప్త ఆత్మగా అయ్యి పరీక్ష హాలులోకి వెళ్ళేందుకు ధైర్యవంతులుగా, శక్తివంతులుగా అయ్యాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అన్ని విషయాలలో పరీక్షను ఇచ్చేందుకు మరియు పాస్ విత్ హానర్‌గా అయ్యే ధైర్యము కలిగినవారిగా, శక్తిమంతులుగా ఎవరైతే తయారయ్యారో వారు చేతులెత్తండి. అచ్ఛా, ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్ష యొక్క రిజల్టును చూస్తాము, ఎవరైతే ఈ నెలలో పాస్ విత్ హానర్ రిజల్టును చూపిస్తారో వారికి బాప్‌దాదా విశేషంగా స్మృతి బహుమతిని ఇస్తారు. కానీ కేవలం పాస్ కాదు, పాస్ విత్ హానర్‌గా అవ్వాలి. మీ మీ రిజల్టును వ్రాసి పంపండి. ఇంత పెద్ద గ్రూపులో ఎంతమంది పాస్ విత్ హానర్‌గా అవుతారో చూద్దాము. కానీ మీ టీచరు మరియు మీ తోటివారు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా సర్టిఫికేటును తీసుకోవాలి, అప్పుడే స్మృతి బహుమతి లభిస్తుంది. సహజమే కదా! ఉన్నదే ధైర్యవంతులుగా అయినప్పుడు ఇదేమంత కష్టము? నేను విజయమాలలోని విజయి రత్నమును అన్న స్మృతిని ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. ఈ స్మృతిలో ఉంటే ఇక ఎప్పుడూ ఓటమి ఉండదు. అచ్ఛా! సమాప్తిలో పూర్తిగా బలి అవుతామని అందరూ అన్నారు, మరి సంపూర్ణముగా బలి అయ్యారా? మహాబలిగా అయి వెళుతున్నారా లేక ఇంకా మరణించవలసి ఉందా? మాహాబలి ముందు మాయ బలము పని చెయ్యదు. ఇటువంటి నిశ్చయమును మీలో ధారణ చేసుకుని వెళ్తున్నారు కదా. రిజల్టును చూస్తాము, తర్వాత బాప్‌దాదా ఇటువంటి విజయి రత్నాలకు ఒక అలౌకిక మాలను వేస్తారు. అచ్ఛా.
ఓంశాంతి