Search for a command to run...
9 Dec 1970
పురుషార్థానికి ముఖ్య ఆధారము క్యాచింగ్ పవర్
9 December 1970 · తెలుగు
ఈరోజు ప్రతి ఒక్కరిలో రెండు విషయాలను చూస్తున్నాము - ప్రతి ఒక్కరూ ఎంత నాలెడ్జ్ఫుల్గా మరియు ఎంత పవర్ఫుల్గా అయ్యారు. అందులో కూడా ముఖ్యంగా క్యాచింగ్ పవర్ (అందుకొనే శక్తి) ప్రతి ఒక్కరికీ ఎంత పవర్ఫుల్గా ఉంది అన్నదానిని చూస్తున్నాము. పురుషార్థానికి ముఖ్య ఆధారము క్యాచింగ్ పవర్ పైనే ఉంటుంది. ఈ రోజుల్లో సైన్స్ వారు శబ్దమును క్యాచ్ చేసేందుకు కూడా ప్రయత్నము చేస్తున్నారు కానీ, సైలెన్స్ శక్తి ద్వారా మీరు ఏమి క్యాచ్ చేస్తున్నారు? ఎలా అయితే వారు పూర్వకాలపు శబ్దాలను క్యాచ్ చేస్తారో, అలా మీరు ఏమి క్యాచ్ చేస్తారు? 5 వేల సంవత్సరాల పూర్వపు మీ దైవీ సంస్కారాలను క్యాచ్ చెయ్యగలరా? అంతటి క్యాచింగ్ పవర్ వచ్చిందా? వారైతే ఇతరుల శబ్దాలను క్యాచ్ చెయ్యగలరు, కానీ మీరు మీ అసలైన సంస్కారాలను కేవలము క్యాచ్ చెయ్యటమే కాకుండా వాటిని మీ ప్రాక్టికల్ స్వరూపంగా తయారు చేసుకుంటారు. నేను ఒకప్పుడు ఇక్కడే ఉన్నాను, మళ్ళీ అలా తయారవుతున్నాను అన్నది ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. ఎంతెంతగా ఆ సంస్కారాలను క్యాచ్ చెయ్యగలరో అంతగా ఆ స్వరూపంగా అవ్వగలరు. మీ స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకోండి అనగా శ్రేష్ఠముగా మరియు స్పష్టముగా తయారు చేసుకోండి. ఎలా అయితే మీ వర్తమాన స్వరూపము, వర్తమాన సంస్కారాల స్పష్టమైన అనుభవము ఉంటుందో అలా మీ ఆది స్వరూపము మరియు సంస్కారాలు కూడా అంతే స్పష్టంగా అనుభవము అవ్వాలి. అర్థమైందా! అంతగా క్యాచింగ్ పవర్ కావాలి. ఎలా అయితే వర్తమాన సమయములో మీ నడవడిక మరియు కర్తవ్యము స్పష్టముగా మరియు సహజంగా స్మృతిలో ఉంటుందో అలాగే మీ అసలైన నడవడిక సహజంగా మరియు స్పష్టంగా సృతిలో ఉండాలి. ఒకప్పుడు నేనే ఈ విధంగా ఉన్నాను అన్న దృఢ సంకల్పమే ఎల్లప్పుడూ ఉండాలి. 5 వేల సంవత్సరాల క్రితపు విషయము కూడా నిన్నటి విషయంలా స్పష్టంగా అనుభవమవ్వాలి. దీనినే క్యాచింగ్ పవర్ అని అంటాము. మీ స్మృతిని ఇంత శ్రేష్ఠంగా మరియు స్పష్టంగా తయారుచేసుకొని వెళ్ళాలి. భట్టీలో వచ్చారు కదా! ఎల్లప్పుడూ మీ ఆది స్వరూపము మరియు ఆది సంస్కారము ఎదురుగా కనిపించాలి. మీ స్మృతిని పవర్ఫుల్గా తయారు చేసుకోవటం ద్వారా వృత్తి మరియు దృష్టి స్వతహాగనే పవర్ఫుల్గా అయిపోతాయి. అప్పుడిక ఈ కుమారుల గ్రూపు ఎటువంటివారిగా అయిపోతారు? అనుకుమారులుగా అనగా అద్భుతమైనవారిగా(అనోఖా) అయిపోతారు. ప్రతి ఒక్కరి రెండు నయనాల ద్వారా రెండు స్వరూపాల సాక్షాత్కారము జరుగుతుంది. అవి ఏ రెండు స్వరూపాలు? నిరాకారి మరియు దివ్యగుణధారి అని వినిపించి ఉన్నాము కదా! ఫరిస్తా రూపము మరియు దైవీ రూపము. ప్రతి ఒక్కరూ ఎలా అనుభవము చేసుకుంటారంటే లేక ప్రతి ఒక్కరి నుండి నడుస్తూ-తిరుగుతూ ఉన్న లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అన్న అనుభవము కలుగుతుంది. ఇలా మీ స్వరూపము నుండి సాక్షాత్కారము జరుగుతుందా? 5 వేల సంవత్సరాల క్రితం విషయాన్ని క్యాచ్ చెయ్యగలిగినప్పుడు, అనుభవము చెయ్యగలిగినప్పుడు ఈ అంతిమ స్వరూపము అనుభవము ఉండదా? ఇప్పుడు ఏ ఏ లోపాలైతే ఉండిపోయాయో వాటిని తొలగించుకొని అటువంటి అనుభవీమూర్తులుగా అయ్యి వెళ్ళాలి. ఎప్పుడూ ఏ లోపమూ ఉండిపోలేదు కదా అని చూసుకోవాలి. భట్టీ నుండి ఎటువంటి పరివర్తన చేసుకొని వెళ్ళాలంటే, ఒకవేళ సత్యయుగి ఆత్మలు ఇప్పుడు ప్రవేశిస్తే వారికి ఈ పురుషార్థి జీవితం యొక్క జ్ఞానం అస్సలు ఏవిధంగా ఉండనే ఉండదో అలా మీలో కూడా ఈ బలహీనతలు మరియు లోపాల నాలెడ్జ్ మర్జ్ అయిపోవాలి. ఇందుకొరకు ఈ గ్రూపు విశేషంగా రెండు విషయాలను గుర్తంచుకోవాలి. రెండు విషయాలు రెండు పదాలలోనే ఉన్నాయి – ఒకటి గెస్ట్ హౌస్, రెండు గెట్ అవుట్ అనగా బయటకు పంపించెయ్యాలి, ఇకముందు లోపలికి రానివ్వకూడదు. ఈ పాత ప్రపంచాన్ని ఎప్పుడూ గెస్ట్ హౌస్(అతిథి గృహం)గానే భావించాలి. అప్పుడిక ఎప్పుడూ బలహీనతను, లోటును అనుభవము చెయ్యరు. సహజ పురుషార్థము కదా! ఈ గ్రూపు అద్భుతమును చేసి చూపించాలి, కావున ఇప్పుడు ఒక్క క్షణము కూడా మనసా, వాచ, కర్మణ సేవలో రెస్టు తీసుకోము, అప్పుడే బెస్ట్ అవుతాము, తర్వాత 21 జన్మలు రెస్టు తీసుకుంటాము అన్న లక్ష్యమును ఎల్లప్పుడూ ఉంచాలి. అర్థమైందా! ఎందుకంటే ఇది హార్డ్ వర్కర్ల గ్రూపు. హార్డ్ వర్కర్ల గ్రూపులో రెస్టు ఉండదు. వారు ఎప్పుడూ రెస్టు తీసుకోరు, కొంచెము కూడా వేస్ట్ (వ్యర్థము) చెయ్యరు, కావున ఈ హార్డ్ వర్కర్ల గ్రూపుకు లేక ఆత్మిక సేవాధారుల సంగఠనకు సేవ తప్ప మరేదీ తోచనే తోచకూడదు. దీనినే పేరుకు తగ్గట్లు పని చేయడము అని అంటారు. సేవ చేస్తామని స్వయమే ఆఫర్ చేసుకోవాలి, అప్పుడు బాప్దాదా నుండి ఆఫరీన్ (అభినందనలు) లభిస్తుంది అని కూడా గుర్తుంచుకోవాలి. హార్డ్ వర్కర్లు లేక ఆత్మిక సేవాధారీ గ్రూపు ఈ స్లోగన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి – ఇముడ్చుకోవటము(సమానా) మరియు ఎదుర్కోవటము(సామనా) మా లక్ష్యము. ఇదే ఈ గ్రూపు స్లోగన్. ఎదుర్కోవటమును మాయతో చెయ్యాలి కానీ దైవీ పరివారముతో కాదు. దేనిని ఇముడ్చుకోవాలి? మీ పాత సంస్కారాలను ఇముడ్చుకోవాలి. నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా కూడా అవ్వాలి, అప్పుడే సర్వీసబుల్గా అవుతారు. అచ్చా!
తిలక సమారోహమును చూసి రాజ్య తిలక సమారోహము గుర్తుకు వస్తుందా? ఇప్పుడు ఈ తిలకము సంపూర్ణ స్థితిలో ఉండేందుకు తిలకము. తరువాత రాజ్య తిలకము లభిస్తుంది. ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షతల తిలకము ఇది. అంతటి శక్తి ఉందా? ఆత్మిక సేవాధారీ గ్రూపు కొరకు ముఖ్యంగా ఈ శిక్షణను ఇస్తున్నాము. మిమ్మల్ని ఎంత అధికారిగా భావిస్తారో అంతగానే సత్కారిగా అవ్వండి. మొదట సత్కారమును ఇవ్వాలి, తరువాత అధికారమును తీసుకోవాలి. సత్కారము మరియు అధికారము రెండూ కలిపి ఉండాలి. ఒకవేళ సత్కారమును వదిలి కేవలం అధికారమును తీసుకున్నట్లయితే ఏమవుతుంది? చేసినదంతా వృధా అవుతుంది. కావున రెండు విషయాలనూ కలిపి ఉంచాలి. అచ్ఛా!
ఓంశాంతి