Search for a command to run...
18 Jan 1970
అవ్యక్త బాప్ దాదా
18 January 1970 · తెలుగు
సంపూర్ణ సమర్పణ ద్వారా సంకల్ప బలం యొక్క ప్రాప్తి
ఈరోజు ఎందుకని పిలిచారు? ఈరోజు బాప్‌దాదా ఏమి చూస్తున్నారు? ఒక్కొక్క సితారను ఏ రూపంలో చూస్తున్నారు? సితారలలో కూడా ఏ విశేషతను చూస్తున్నారు? ప్రతి సితారలో సంపూర్ణత యొక్క సమీపతను చూస్తున్నారు. మీరందరూ సంపూర్ణతకు ఎంత సమీపంగా చేరుకున్నారో మీ గురించి మీకు తెలుసా? సంపూర్ణతకు సమీపంగా చేరుకున్న దానికి గుర్తు ఏమిటి? సంపూర్ణతకు గుర్తు – వారు అన్ని విషయాలను అన్ని రీతులలో, అన్ని రూపాలలో పరిశీలించగలరు. ఈరోజు రోజంతా ఏమేమి గుర్తుకు వచ్చాయి? చిత్రము గుర్తుకు వచ్చిందా లేక చరిత్ర గుర్తుకు వచ్చిందా? చిత్రముతో పాటు మరింకేదైనా గుర్తుకు వచ్చిందా? (శిక్షణలు గుర్తుకు వచ్చాయి, డ్రామా గుర్తుకు వచ్చింది). చిత్రముతో పాటు విచిత్రుడు కూడా గుర్తుకు వచ్చారా? ఎంత సమయం చిత్రమును (బ్రహ్మా బాబా) గుర్తు చేసుకున్నారు, ఎంత సమయం విచిత్రుడిని (శివ బాబా) గుర్తు చేసుకున్నారు లేక ఇరువురి స్మృతి కలిపి ఉన్నదా? విచిత్రుడితో పాటు చిత్రమును గుర్తు చేసుకున్నట్లయితే స్వయం కూడా చరిత్రవంతులుగా అవుతారు. కేవలం చిత్రము మరియు చరిత్రను గుర్తు చేసుకుంటే చరిత్ర మాత్రమే గుర్తుంటుంది. కనుక విచిత్రుడితో పాటు చిత్రము మరియు చరిత్ర గుర్తుకు రావాలి. ఈరోజు ఇంకేదైనా విశేష కార్యమును చేసారా? కేవలం స్మృతిలోనే మునిగి ఉన్నారా లేక స్మృతితోపాటు ఇంకేదైనా చేసారా? (వికర్మల వినాశనం) – ఇదైతే స్మృతి వలన కలిగే పరిణామము. ఇంకే విశేష కర్తవ్యాన్ని చేసారు? మొత్తం ఒక సంవత్సరం యొక్క మీ చార్టును చూసుకోండి. ఈ అవ్యక్త చదువు, ఈ అవ్యక్త స్నేహము మరియు సహయోగము యొక్క రిజల్టును పరిశీలించుకున్నారా? ఈ అవ్యక్త స్నేహము మరియు సహయోగము యొక్క 12 నెలల . పరీక్ష ఏమిటి, చెకింగ్ చేసుకున్నారా? చెకింగ్ చేసుకున్న తర్వాతనే స్వయంపై ఎక్కువ అటెన్షన్‌ను పెట్టగలరు. మరి ఈరోజు మీరే మీ పేపరును చేక్ చేసుకోండి. వ్యక్త భావము నుండి అవ్యక్త భావము వైపుకు ఎంత ముందుకు వెళ్ళాను – ఇది చెకింగ్ చేసుకోండి. ఒకవేళ అవ్యక్త స్థితి పెరిగితే మీ నడవడికలో కూడా అలౌకికంగా ఉంటారు. అవ్యక్త స్థితికి ప్రాక్టికల్ గుర్తు ఏమిటి? అలౌకిక నడవడిక. ఈ లోకంలో ఉంటూ అలౌకికంగా ఎంతవరకు అయ్యారు? ఇది పరిశీలించుకోండి. ఈ సంవత్సరంలో మొదటి పరీక్ష ఏమి వచ్చింది? ఈ నిశ్చయము యొక్క పరీక్షలో ప్రతి ఒక్కరికీ ఎన్ని మార్కులు వచ్చాయి? ఇదైతే మీ గురించి మీకు తెలుసు. నిశ్చయము యొక్క పరీక్ష అయితే అయిపోయింది. ఇప్పుడిక ఏ పరీక్ష రానుంది? పరీక్ష గురించి తెలిసి కూడా ఫెయిల్ అవుతున్నారు. కొందరికి ఇది చాలా పెద్ద పరీక్ష కానీ కొందరికి ఇప్పుడు పెద్ద పరీక్ష రానుంది. ఎలా అయితే ఈ పరీక్షలో నిశ్చయం గురించి పరీక్ష వచ్చిందో అలాగే ఇప్పుడు ఏ . పరీక్ష రానుంది? ఇప్పటికీ వ్యక్తంగా కూడా ఆధారాన్ని ఇస్తున్నారు. ముందు కూడా నిమిత్తమైన సాకార తనువు ఆధారంగా నిలిచింది, అలాగే ఇప్పుడు కూడా డ్రామాలో నిమిత్తంగా ఉన్నవారు సాకారంలో ఆధారంగా ఉంటారు. మునుపు కూడా నిమిత్తమే, ఇప్పుడు కూడా నిమిత్తమే. ఈ పూర్తి పరివారం యొక్క సాకార ఆధారము చాలా శ్రేష్ఠమైనది. అవ్యక్తంలో అయితే తోడుగా ఉండనే ఉన్నారు. ఎంత స్నేహము ఉంటుందో అంతగా సహయోగము లభిస్తుంది. స్నేహము తక్కువగా ఉన్న కారణంగా సహయోగము కూడా తక్కువ లభిస్తుంది. సాకారం నుండి స్నేహము అంటే పూర్తి వంశము నుండి స్నేహము. సాకారము ఒంటరిగా లేరు. ప్రజాపిత బ్రహ్మాతో పాటు పూర్తి పరివారం ఉంది. మాలలోని పూసలు కదా. మాలలో పూస ఒంటరిగా ఉండదు. మాలలో స్మృతి అనే సూత్రం (దారం)తో, స్నేహంతో పరివారం కలిసి ఉంది. అంటే ఈ మాల స్నేహ సూత్రంతో బంధింపబడి ఉంది. దైవీ కులమైతే భవిష్యత్తులో ఉంటుంది, ఈ బ్రాహ్మణ కులం యొక్క మహత్వం చాలా ఉంటుంది. ఎంతెంతగా బ్రాహ్మణ కులంతో స్నేహం మరియు సమీపత ఉంటుందో అంతగా దైవీ రాజ్యంలో సమీపత ఉంటుంది. సాకారంలో ఏ రుజువును చూసారు? బాప్‌దాదా ఎవరిని ముందుంచేవారు? పిల్లలను. ఎందుకంటే పిల్లలు లేనిదే తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతి అవ్వలేదు. మరి సాకారంలో ఏ కర్మనైతే చేసి చూపించారో అదే ఫాలో చేయాలి. ఇక్కడ పేపరును ముందుగానే వినిపించడం జరుగుతుంది. నిశ్చయం యొక్క . పరీక్ష అయితే అయిపోయింది. ఇప్పుడు రాబోయే . పరీక్ష – స్నేహము, సహయోగము మరియు శక్తి గురించి. మీ అందరి కల్పక్రితపు చిత్రము ప్రత్యక్షమయ్యే సమయం ఆసన్నమవుతుంది. అనేక రకాల సమస్యలను పరివర్తన చేయడానికి మీ సహకారాన్ని అందించాలి. కలియుగ పర్వతాన్నయితే దాటాలి కదా. కానీ ఈ సంవత్సరంలో మనసు సమస్యలు, తనువు సమస్యలు, వాయుమండల సమస్యలు, ఇటువంటి అన్ని సమస్యల పర్వతానికి మీ స్నేహము మరియు సహయోగము యొక్క సహకారాన్ని అందించండి. తనువు సమస్యలు కూడా వస్తాయి. లౌకిక సంబంధాలలో అయితే పాస్ అయ్యారు. కానీ ఈ అలౌకిక సంబంధాల ద్వారా కూడా చిన్న-పెద్ద సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నింటినీ . పరీక్ష గా భావించండి, వీటిని ప్రాక్టికల్‌గా అనుకోకండి. ఇది పేపరు అనుకోండి. పేపరుగా భావించి పాస్ అయితే (దాటితే) పాసవుతారు. పేపరు ఔట్ అయిన తర్వాత కూడా ఎంతమంది పాస్ అవుతారో చూద్దాం. తర్వాత ఈ . పరీక్ష యొక్క రిజల్టును వినిపిస్తాము. ఈ సమయంలో స్వయంలో విల్ పవర్ (ఆత్మ విశ్వాసం)ను ధారణ చేసుకోండి. ఇప్పుడింకా విల్ పవర్ రాలేదు. యథా యోగ్యంగా యథా శక్తిగా పవర్ ఉంది.
విల్ పవర్ ఎలా వస్తుంది? విల్ పవర్ రావడానికి సాధనము ఏమిటి? సంకల్ప బలం ఎందుకు లోపిస్తుంది? అందుకు కారణం తెలుసా? స్మృతి కూడా ఎందుకు తగ్గుతుంది? సంకల్ప బలం ఎలా వస్తుంది అనడానికి బాబా సాకరంలో కర్మలను చేసి చూపించారు. మొట్టమొదటగా వేసిన అడుగు ఏమిటి? అంతటినీ విల్ (సమర్పణ) చేసారు. సమర్పించడంలో ఆలస్యం చేయలేదు కదా! లోపల బయట ఉన్న అన్ని చెడులను సంపూర్ణంగా అర్పించారు. వాటిని సంపూర్ణంగా విల్ చేయనంత వరకు విల్ పవర్ రాదు. సాకారుడు ఏమైనా ఆలోచించారా? ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒకవేళ ఆలోచిస్తూ విల్ చేస్తే అందుకు అంతగా ఫలితం లభించదు. ఝాట్కూ (ఒక్క దెబ్బకు మరణించడము), ఝాట్కూ లేకపోవడానికి తేడా ఉంటుంది. ముందుగా ఎవరిని స్వీకరించడం జరుగుతుంది? ముందుగా ఎవరినైతే స్వీకరించడం జరుగుతుందో వారికి నంబర్ వన్ శక్తి లభిస్తుంది. ముందుగా ఎవరినైతే స్వీకరించడం జరగదో వారికి శక్తి కూడా ఎక్కువ లభించదు. దీనిని గురించి ఆలోచించండి. బాప్‌దాదాకు వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా తెలుసు. భవిష్య కర్మ బంధన త్రాళ్ళను చూసి వేగంగా పరిగెట్టమని చెప్పరు. కర్మ బంధనము అనే తాళ్ళను తెంచడము మీ పని. ఏదైనా తాడు తెగకపోతే అది మనసును లాగుతూ ఉంటుంది. అందుకని తాళ్ళను తెంచడానికి ఉన్నాము. తాళ్ళు తెగిపోతే ఎవరైనా ఆగుతారా? బంధనాల నుండి విముక్తి పొందిన వారు ఎటువంటి బంధనంలో బంధింపబడలేరు.
ఈ రోజు ఏమి చేయాలి మరియు రాబోయే సంవత్సరానికి ఏమి తయారీలు చేసుకోవాలి – ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. విదేహిని మీ యుగళ్గా చేసుకుంటే మీరు విదేహిగా అవ్వడంలో సహయోగం లభిస్తుంది. విదేహిగా అవ్వడంలో సహయోగం తక్కువగా లభిస్తుంది, సఫలత తక్కువగా లభిస్తుంది అంటే విదేహి అయిన బాబాను యుగళ్గా చేసుకోలేదని అర్థం. కష్టమైన విషయాన్ని సహజంగా చేయడాన్ని అద్భుతం అంటారు. సహజమైన విషయాలను దాటడం అద్భుతమేమీ కాదు. కష్టాలను దాటడమే అద్భుతం. కష్టాలను కష్టాలుగా భావించకుండా నడుచుకోవడమే అద్భుతము. కష్టాలలో ఒకవేళ కొద్దిగా అయినా వాడిపోయినట్లుగా అయితే ఏమి జరుగుతుంది? ఒక్క సెకండులో వ్యాపారం చేసేవారు ఎక్కడా ఇరుక్కోరు. ఇప్పటికీ వేగంగా వెళ్ళేందుకు అవకాశం ఉంది. కేవలం ఒక్క హై జంప్ వేస్తే చాలు. లాస్టులో ఫాస్టుగా వెళ్ళలేరు. అచ్ఛా.
ఓంశాంతి