Search for a command to run...
25 Dec 1969
అనాసక్తంగా అవ్వడానికి తనువు మరియు మనసును అమానతుగా భావించండి
25 December 1969 · తెలుగు
బాప్దాదాను ఎక్కడకు పిలిచారు మరియు ఎందుకని? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? మధువన్లో ఉన్నారు కానీ మధువన్లో బాబా ఎక్కడకు వచ్చారు? పూలతోటలో కూర్చున్నారా లేక సభలోనా? బాప్దాదా ఆత్మిక ఆత్మలను చూస్తున్నారు అలాగే ప్రతి పుష్పం నుండి వస్తున్న ఆత్మిక సుగంధాలను కూడా తీసుకుంటున్నారు. వారు పూల నుండి ఇసెన్సును(సారమును) తయారు చేస్తారు, దానిని అత్తరు అంటారు. దాని సుగంధము చాలా చక్కగా, మధురంగా ఉంటుంది. ఇక్కడ మధువనంలో ఉన్నాకూడా ఈరోజు ఆత్మిక ప్రపంచంలో షికారు చేస్తున్నాము. మీరందరూ కూడా ఆత్మిక రూపంలో ఉంటూ ప్రతి కర్మను చేయాలి, అప్పుడే సేవలో మరియు కర్మలో శోభ వస్తుంది. ఇప్పుడు నవీనతను కోరుకుంటున్నారు కదా. లేక ఎలా నడుస్తుందో అలా చాలు అని సంతుష్టపడ్డారా? ప్రతి కర్మలో, ప్రతి సంకల్పంలో, వాణిలో ఆత్మికత వచ్చినప్పుడే కొత్త శోభ వస్తుంది. ఆత్మికత ఎలా వస్తుంది? ఆత్మికత సదా నిలిచి ఉండటానికి ఏమి చేయాలి? ఏమి మారాలి? (అందరూ భిన్న భిన్న విషయాలను వినిపించారు) ఇవైతే ముఖ్యమైన విషయాలు, ఇవి అందరికీ పక్కా అయిపోయాయి. కానీ ఆత్మికత ఉండకపోవడానికి కారణము ఏమిటి? విశ్వసనీయంగా, ఆజ్ఞాకారిగా ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఇందుకు (సంబంధాలలో లోపము) సంబంధంలో కూడా ఎందుకు లోపము వస్తుంది? నిశ్చయబుద్ధి తిలకము అయితే అందరికీ పెట్టబడి ఉంది. ఆత్మికత ఎందుకు ఎప్పటికీ నిలిచి ఉండటం లేదు అన్నది ప్రశ్న. ఆత్మికత స్థాయిగా నిలవకపోవడానికి కారణము – స్వయాన్ని మరియు ఇతరులను, ఎవరి సేవకైతే మనం నిమిత్తమయ్యామో, వారిని బాప్దాదా తాకట్టుగా భావించి నడుచుకోవాలి, ఎంతగా స్వయాన్ని మరియు ఇతరులను అమానతుగా భావిస్తారో అంతగా ఆత్మికత వస్తుంది. అమానతుగా భావించని కారణంగా లోటు వస్తుంది. మనసుతో సంకల్పాలు చేసినా కానీ, ఈ మనసు కూడా నాకు తాకట్టులో లభించింది అని భావించి సంకల్పాలు చేయండి. ఈ అమానతులో నమ్మకద్రోహం చేయకండి. మరో మాటలో చెప్పాలంటే దీనినే మీరు ట్రస్టీ అని చెప్తుంటారు. వారిని ట్రస్టీ అంటారు కానీ మనసు మరియు తనువును, అలాగే నిమిత్తంగా లభించిన వాటిని, జిజ్ఞాసువులు కావచ్చు, సెంటరు కావచ్చు, స్థూల వస్తువేదైనా కావచ్చు అన్నీ అమానత్తుగానే లభించినవి. అమానతు అనుకుంటే అంతే అనాసక్తంగా ఉంటారు. బుద్ధి అటువైపు వెళ్ళదు. అనాసక్తంగా అయితేనే ఆత్మికత వస్తుంది. ఇంతగా స్వయాన్ని దీపంపై బలిహారం చేయాలి. బలిహారం చేయాలి కానీ ఎంతవరకు? ఇవి నా సంస్కారాలు, నా సంస్కారాలు అన్న మాట కూడా తొలగిపోవాలి. నా సంస్కారాలు ఎక్కడినుండి వచ్చాయి? నా సంస్కారాలు అన్న కారణంగానే ఈ మాటలన్నీ వస్తున్నాయి. నేచర్ మారిపోయేంతగా బలిహారం కావాలి. ప్రతి ఒక్కరి నేచర్ మారినప్పుడు మీ యొక్క అవ్యక్త ఫీచర్స్ (రూపురేఖలు) తయారవుతాయి. సంగమయుగ సంపూర్ణ స్థితికి పిక్చర్ ఏమిటి? ఫరిశ్తాలో ఏ విశేషత ఉంటుంది? ఒకటి, పూర్తిగా తేలికతనము ఉంటుంది. తేలికతనము ఉన్న కారణంగా ఎలాంటి పరిస్థితి ఉన్నాకానీ అటువంటి స్థితిని తయారు చేసుకోగలరు. ఎవరైతే భారీగా ఉంటారో, వారు ఎటువంటి పరిస్థితిలోనూ స్వయాన్ని సెట్ చేసుకోలేరు. కనుక, ఫరిశ్తా స్థితి యొక్క ముఖ్య విశేషత, వారు అన్ని విషయాలలో తేలికగా ఉంటారు. సంకల్పాలలో కూడా తేలికగా, వాణిలో కూడా తేలికగా, కర్మ చేయడంలో కూడా తేలికగా మరియు సంబంధాలలో కూడా తేలికగా ఉంటారు. ఈ నాలుగు విషయాలలో తేలికతనము ఉంటే ఫరిశ్తా స్థితి ఉన్నట్లు అర్థము. ఈ నాలుగు విషయాలలో ఎంత వరకు తేలికతనము ఉందని ఇప్పుడు చూసుకోండి. ఎవరైతే తేలికగా ఉంటారో వారు ఒక్క సెకండులో ఏ ఆత్మ యొక్క సంస్కారాలనైనా పరిశీలించగలరు. ఏ పరిస్థితి ఎదురుగా వచ్చినా కానీ వారు ఒక్క సెకండులో నిర్ణయం తీసుకోగలరు. ఇదే ఫరిశ్తాల గుర్తు. ఎప్పుడైతే ఈ అన్ని గుణాలు ప్రతి కర్మలో ప్రత్యక్షంగా కనిపిస్తాయో అప్పుడు సంపూర్ణ స్థితి సమీపిస్తుంది అని భావించండి. సాకార రూపం యొక్క సంపూర్ణ స్థితి ఏ విషయాలలో కనిపించేది? తమ సంపూర్ణ స్థితిని ఈ విషయాలలో తామే పరిశీలించగలగాలి. ఈ గ్రూపు యొక్క ముఖ్య గుణము ఏమిటి? ఆ గ్రూపు యజ్ఞ స్నేహి ఉన్నారు. ఈ గ్రూపు యజ్ఞ సహయోగి ఉన్నారు.
యజ్ఞ సహయోగంలో అయితే అందరూ పాస్ అయ్యారు. ఇక ఏమి చేయాలి? ఎవరి మనసులోనైనా ఏదైనా సంకల్పం వస్తే అది మీకు ముందే చేరిపోయేటువంటి స్థితి కూడా వస్తుంది. చెప్పే, వినే అవసరము ఉండదు. ఇతరుల సంస్కారాలను చదివేందుకు మీ సంకల్పాలపై ఫుల్ బ్రేక్ ఉన్నప్పుడే ఇది వీలవుతుంది. బ్రేక్ పవర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మీ సంకల్పాలనే సర్దుకోలేకపోతే ఇతరుల సంకల్పాలను అర్థం చేసుకోలేరు. అందుకే, సంకల్పాల పెట్టెను సర్దండి అని చెప్పాము. ఎంతెంతగా సంకల్పాలను సర్దుకునే శక్తి ఉంటుందో అంతంతగా ఇతరుల సంకల్పాలను అర్థం చేసుకునే శక్తి వస్తుంది. మీ సంకల్పాల విస్తారంలోకి వెళ్ళిపోతున్న కారణంగా మిమ్మల్ని మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు, ఇక ఇతరులను ఎలా అర్థం చేసుకోగలరు! కనుక, ఈ స్థితి కూడా నంబరువారీ పురుషార్థం అనుసారంగా వస్తుంది, ఇది కూడా సంపూర్ణ స్థితికి గుర్తు. ఎంత వరకు సంపూర్ణ స్థితికి సమీపంగా వచ్చాము అన్న పరిశీలన ఈ విషయాల ద్వారా స్వయమే చేసుకోండి.
ఇది ఆల్రౌండర్ గ్రూపు. ఆల్రౌండర్ లక్ష్యము ఏమిటి? లక్షణాలు ఉన్నాయి కానీ ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానిని ఇంకాస్త ముందు పెట్టుకోండి. ఇప్పటివరకు ప్రాక్టికల్లో జరిగిన ప్రకారంగా ఎవరు రాజులుగా లెక్కింపబడతారు? ఇప్పటివరకు జరిగిన సేవ యొక్క సాక్షాత్కారం అనుసారంగా ఎటువంటి రాజులుగా అవుతారు? పురుషార్థంతో పదవి స్పష్టమవుతుంది. సూర్యవంశీయులే కానీ ఒకటి ఉంటుంది విశ్వానికి రాజులు, వారు విశ్వ మహారాజులే కాక తమ రాజ్యానికి కూడా రాజుగా ఉంటారు. మీరు ఎటువంటి రాజు, ఇప్పుడు చెప్పండి. ఆరంభంలో ఎవరు వస్తారు? విశ్వ మహారాజుగా కావడము మరియు విశ్వ మహారాజుకు దగ్గరి బంధువుగా అవ్వడము, ఇందుకోసం ఏ సాధన ఉంటుంది? విశ్వ కళ్యాణమైతే జరుగుతుంది. కానీ విశ్వ మహారాజుగా అయ్యేవారి గుర్తులు ఏమిటి? ఇది కూడా బ్రాహ్మణుల విశ్వము అనగా చిన్నని ప్రపంచము, కనుక ఎవరైతే విశ్వ మహారాజుగా అవుతారో వారికి విశ్వము అనగా బ్రాహ్మణ కులములోని ప్రతి ఆత్మతో సంబంధం ఉంటుంది. ఎవరైతే ఇక్కడ ఈ చిన్న పరివారంలో, సర్వుల సంబంధంలోకి వస్తారో వారు అక్కడ విశ్వ మహారాజుగా అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఏ రాజుగా అవుతారు? ఒకటి, స్వయం సింహాసనంపై కూర్చోవడము, ఇంకొకటి, సింహాసనాధికారులకు సమీప సహయోగులుగా అవ్వడము. సమీప సహయోగులుగా ఉండాలన్నా కూడా ఏమి చేయాల్సి ఉంటుంది? పూర్తి దైవీ పరివారంలోని సర్వ ఆత్మలకు ఏదో ఒక విధంగా సహయోగిగా కావాలి. ఒకటి ఉంటుంది, పూర్తి కుల సేవకు నిమిత్తంగా అవ్వడము. రెండు, కేవలం నిమిత్తంగా అవ్వడము. కానీ ఏదో ఒక విధంగా సేవలో సహయోగిగా కావాలి. అలాగే అక్కడ వారికి సమీప సహయోగులుగా అవుతారు. మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి. విశ్వ మహారాజుగా అవుతారు కదా? నంబరువారీగా విశ్వ మహారాజుగా ఎవరు అవుతారు అన్నది కూడా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అవ్వలేము అని కాదు. ఇప్పుడు కూడా జంప్ చేయవచ్చు. మేకప్ చేసుకోవడానికి ఇప్పుడు కూడా సమయం ఉంది, కానీ కొద్ది సమయం ఉంది. సమయం కొద్దిగానే ఉంది, కానీ శ్రమ విశేషంగా చేయాల్సి ఉంటుంది. కానీ మేకప్ చేయవచ్చు. విశ్వ మహారాజు సంస్కారాలు ఎలా ఉంటాయి? ఈరోజు బాప్దాదా విశ్వ మహారాజుగా తయారు చేసే చదువును చదివిస్తున్నారు. వారి సంస్కారాలు ఎలా ఉంటాయి? ఎలా అయితే బాబా సర్వుల స్నేహి మరియు సర్వులు వారికి స్నేహితులు, ఇదైతే ప్రాక్టికల్లో చూసారు కదా. అలా విశ్వ మహారాజుగా అయ్యే వారి కోసం ఒక్కొక్కరి నుండి స్నేహ పుష్పాలు వర్షిస్తాయి. స్నేహ పుష్పాలు ఇక్కడ కురిసినప్పుడు ఇన్ని జడ చిత్రాలపై కూడా పూలు వర్షిస్తాయి. ఇక్కడ కూడా స్వయాన్ని చూసుకోండి, ఆత్మనైన నాపై స్నేహ పుష్పాల వర్షం నాపై ఎంత కురుస్తుంది అని చూసుకోండి. వారు దాగరు. ఎంతగా స్నేహ పుష్పాలో అంతగా ద్వాపరంలోని పూజలో పూజా పుష్పాలు వేస్తారు. అక్కడక్కడ పుష్పాలను వేయడానికి అప్పుడుప్పుడు వెళ్తుంటారు, మరికొన్ని చోట్ల ప్రతిరోజూ చాలా పుష్పాల వర్షము కురుస్తుంది. తెలుసా? ఇందుకు కారణము ఏమిటి? సర్వుల స్నేహ పుష్పానికి పాత్రునిగా కావాలి అన్న లక్ష్యమే పెట్టుకోండి. ఒక్కొక్కరికి మీ సహయోగాన్ని ఇస్తే సహయోగము లభిస్తుంది. ఇక్కడ ఎంతమందికి సహయోగిగా అవుతారో అంతగా స్నేహానికి పాత్రులుగా అవుతారు. అలాగే తర్వాత విశ్వ మహారాజుగా అవుతారు. కనుక లక్ష్యాన్ని పెద్దగా పెట్టుకోండి.
ఈరోజు భక్తి మార్గంలోని ఒక చిత్రం గుర్తుకు వస్తుంది. ఈరోజు చూస్తున్నాము కూడా మరియు నవ్వుతున్నాము కూడా. వ్రేలును ఇచ్చేవారే కదా (సహయోగం చేసేవారు)అని చూస్తున్నాము. వ్రేలును ఇచ్చారా లేక ఇవ్వాలా? వ్రేలు ఎంతవరకు చేరుకుంది? ఇంకా వ్రేలును ఇవ్వాలి అంటే అర్థము ఎంతవరకు వ్రేలు వెళ్ళాలో అంతవరకు వెళ్ళలేదు అని అర్థము. పర్వతము లేవలేదు. ఎందుకని, అంత బరువుగా ఉందా? ఇంతమంది వ్రేలు కలిసినా కానీ పర్వతం ఎందుకు లేవడం లేదు? అందరిదీ సంగఠిత రూపంలో బలం లభించినప్పుడే కల్ప క్రితపు స్మృతిచిహ్నము సఫలమవుతుంది. అందుకే కొంత లేస్తుంది, కొంత లేవడం లేదు. అందరూ తమ తమ వ్రేలును వేస్తున్నారు కానీ ఇప్పుడు సంగఠిత రూపం యొక్క ఆవశ్యకత ఉంది. స్వయం యొక్క వ్రేలును ఇచ్చారు కానీ ఆ బలం నిండినప్పుడే సంగఠనలో శక్తి నిండుతుంది. ఇప్పుడు శక్తి దళం యొక్క ప్రత్యక్షత జరగాలి. అందరూ పుష్పాలుగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు పుష్పగుచ్ఛం సంగఠిత రూపంలో రావాలి. ఇప్పుడు కొన్ని పుష్పాలు తమ తమ రంగును చూపిస్తున్నాయి, కొన్ని తమ సుగంధాన్ని ఇస్తున్నాయి, కొన్ని తమ రూపాన్ని చూపిస్తున్నాయి. కానీ, రంగు, రూపము, సుగంధము అన్నిరకాలు పుష్పగుచ్ఛం రూపంలో వచ్చినప్పుడు ప్రపంచం ముందు ప్రత్యక్షం అవుతారు. సంగఠిత రూపంలో ఏదైనా నవీనతను ప్రపంచం ముందు కనిపించేలా ఇప్పుడు ప్లాను ఆలోచించండి. ఒక్కొక్కరు వేరుగా ఉన్న కారణంగా శ్రమ ఎక్కువ అవుతుంది. కానీ సంగఠనలో శ్రమ తక్కువ సఫలత ఎక్కువ లభిస్తుంది. సంగమయుగ సంగఠనను సఫలం చేసినప్పుడు సేవలో కూడా సఫలత లభిస్తుంది. అన్ని యోగ్యతలు ఉన్నాయి కానీ యోజన వరకే ఉండిపోతుంది. ఇప్పుడు మీ యోగ్యతలతో ఇతరులను కూడా బాబా సమీపంగా వచ్చే యోగ్యులుగా చేయండి.
ఈ గ్రూపు, ఆత్మల సంబంధాలను కలిపే పునాదిని వేసే గ్రూపు. పునాదిని వేసినట్లుగా వారి భవిష్య జీవితము తయారవుతుంది. అన్ని విషయాలలో స్వయం ఎంత గట్టిగా ఉంటారో అంతగా అనేకుల పునాది గట్టిగా వేయగలరు. ఎంతగా స్వయంలో సర్వ క్వాలిఫికేషన్లు ఉంటాయో అంతగా క్వాలిటీ వస్తుంది. ఒకవేళ స్వయంలో క్వాలిఫికేషను తక్కువగా ఉంటే క్వాలిటీ కూడా తక్కువగా వస్తుంది, అందుకని మేమంతా పునాది వేసేవారిమి అని భావించండి. మీ క్వాలిఫికేషనుతో కూడా క్వాలిటీ వస్తుంది. బాప్దాదా గుణాలలో స్వయం సమానంగా అయినప్పుడు ఇతరులను తమ సమానంగా చేయగలరు. అచ్ఛా!
ఓంశాంతి