Search for a command to run...
22 Jan 1970
అంతిమ కోర్సు – మనసులోని భావాలను తెలుసుకోవడము
22 January 1970 · తెలుగు
అందరూ ఎక్కడ కూర్చుని ఉన్నారు మరియు ఏమి చూస్తున్నారు? అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి అవ్యక్త రూపాన్ని చూస్తున్నారా లేక వ్యక్తంలో అవ్యక్తాన్ని చూసే ప్రయత్నాన్ని చేస్తున్నారా? ఈ ప్రపంచంలో ధ్వని ఉంది. అవ్యక్త ప్రపంచంలో ధ్వని ఉండదు. అందుకని బాబా పిల్లలందరికీ ధ్వని నుండి అతీతంగా వెళ్ళే డ్రిల్‌ను నేర్పిస్తున్నారు. ఒక్క సెకండులో ధ్వనిలోకి రావాలి, ఒక్క సెకండులో ధ్వని నుండి దూరంగా వెళ్ళాలి – ఇటువంటి అభ్యాసము ఈ వర్తమాన సమయంలో చాలా అవసరం. ఆ సమయం కూడా వస్తుంది. ఎలా ఎలా అయితే అవ్యక్త స్థితిలో స్థితి అవుతూ ఉంటారో అలా అలా నయనాల భాషతో ఇతరుల మనసులోని భావాలను తెలుసుకోగలుగుతారు. ఎవరైనా మాట్లాడాలి, వినాలి అనే అవసరం ఉండదు. ఇటువంటి సమయం ఇప్పుడు రానుంది. ఎలా అయితే బాప్‌దాదా ముందుకు వచ్చినప్పుడు వినిపించపోయినా కానీ అందరి మనసు భావాలు బాప్‌దాదాకు తెలిసిపోతాయో అలాగే పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఈ అంతిమ కోర్సునే చదవాలి. నోటి భాష జరిగినట్లుగా ఆత్మల సంభాషణ జరుగుతుంది. ఆత్మిక సంభాషణ అంటారు కదా. అంటే ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది. కానీ ఎలా? ఆత్మల మాటలు నోటితో జరుగుతాయా? ఎలా ఎలా అయితే ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారో అలా అలా ఆత్మకు ఆత్మ యొక్క విషయము అంతే సహజంగా, స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రపంచంలో నోటితో వర్ణించినప్పుడు ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు. మరి ఇందుకోసం ఏ విషయంలో ధారణ ఆవశ్యకము? సదా బుద్ధి లైను క్లియరుగా ఉండటమే ఇక్కడ ఆవశ్యకము. మనసులో లేక బుద్ధిలో ఏదైనా అలజడి ఉంటే లేక లైన్ క్లియరుగా లేకపోతే ఇతరుల సంకల్పాలను మరియు భావాలను తెలుసుకోలేరు. లైన్ క్లియరుగా లేని కారణంగా సంకల్పాల కలగలుపు జరుగుతుంది. కనుక, నా బుద్ధి లైన్ క్లియరుగా ఉందా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి. బుద్ధిలో ఎవరైనా, ఏ విధమైన విఘ్నమైనా విసిగించడం లేదు కదా? అవిచ్ఛిన్నము, అచంచలము, అలసటలేనితనము – ఈ మూడూ జీవితంలో ఉండాలి. ఒకవేళ ఈ మూడింటిలో ఏ ఒక్క విషయమైనా తక్కువగా ఉంటే బుద్ధి లైన్ క్లియరుగా లేదని అర్థం చేసుకోవాలి. బుద్ధి లైన్ క్లియరుగా అయినప్పుడు వారి స్థితి, స్మృతి ఎలా ఉంటాయి? ఎంతెంతగా బుద్ధి లైన్ అనగా పురుషార్థపు లైన్ క్లియరుగా ఉంటుందో అంతంతగా ఏది స్మృతిలో ఉంటుంది? ఏ విషయంలోనైనా, వర్తమానం స్పష్టంగా ఉన్నంతగా వారి ముందు భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజుల్లో వైజ్ఞానికులు ఎక్కడెక్కడి వాటినో ఎంత స్పష్టంగా చూపిస్తున్నారంటే దూరంగా ఉన్న వస్తువు కూడా దగ్గరగా కనిపిస్తుంది. అలాగే ఎవరి పురుషార్థమైతే క్లియరుగా ఉంటుందో వారికి భవిష్యత్తులోని ప్రతి విషయము దూరంగా ఉన్నప్పటికీ దగ్గరగా కనిపిస్తుంది. ఈరోజుల్లో టి.వీలో చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా వారి బుద్ధి మరియు వారి దృష్టి టి.వీ వలె అన్ని విషయాలను స్పష్టంగా చూపిస్తుంది, తెలుసుకుంటుంది. ఏ విషయంలోనూ పురుషార్థం వారికి కష్టంగా అనిపించదు. మరి ఆ అనుభవం, ఆ అంతిమ స్థితి యొక్క గుర్తులను స్వయంలో చూసుకోండి. నేను ఎంతవరకు అంతిమ స్థితికి సమీపంగా ఉన్నాను? సూర్యుడు తన పూర్తి ప్రకాశంలోకి వచ్చినప్పుడు ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది, చీకటి, మసక అన్నీ సమాప్తమైపోతాయి. ఇదే విధంగా సర్వశక్తిమంతునితో, జ్ఞాన సూర్యునితో ఎడతెగని సంబంధం ఉన్నప్పుడు స్వయంలోని ప్రతి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ పురుషార్థంలో మాయ యొక్క చీకటి లేక మసక వస్తుంటాయి, అవి సత్యమైన విషయాలను దాచి పెడ్తాయి, అవి వెళ్ళిపోతాయి. ఇందుకోసం సదా రెండు విషయాలను గుర్తుంచుకోండి. ఈనాటి ఈ అలౌకిక మేళాలో పిల్లలు వచ్చారు. లౌకిక తండ్రి తన పిల్లలను మేళాను తీసుకు వెళ్ళినప్పుడు స్నేహి పిల్లలకు ఏదో ఒక వస్తువును కొనిస్తాడు. అలాగే బాప్‌దాదా కూడా ఈనాటి ఈ సాటిలేని మేళాలో పిల్లలైన మీ అందరికీ ఎటువంటి అద్భుతమైన వస్తువును ఇస్తున్నారు?
ఈనాటి ఈ మధురమైన మిలన మేళాకు గుర్తుగా బాప్‌దాదా ఏమి ఇస్తున్నారు – సదా శుభ చింతకులుగా అయ్యి శుభ చింతనతో ఉండండి. శుభ చింతన మరియు శుభ చింతకులు. ఈ రెండు విషయాలను సదా గుర్తుంచుకోండి. శుభ చింతనతో మీ స్థితిని తయారు చేసుకోగలరు, శుభ చింతకులుగా అవ్వడం వలన అనేక ఆత్మల సేవను చేస్తారు. వచ్చిన పిల్లలందరికీ ఈ రోజు వతనం నుండి ఇస్తున్న అవినాశి బహుమతి ఇది. బాప్‌దాదా స్నేహము అధికమా లేక పిల్లల స్నేహము అధికమా? బాప్‌దాదా స్నేహముకన్నా మా అందరి స్నేహము అధికమైనది అని కొందరు పిల్లలు అనుకుంటుండవచ్చు. కొందరు ఉన్నారు కూడా కానీ మెజారిటీ కాదు. స్నేహము ఉంది కానీ ఎడతెగని, ఏకరస స్నేహము లేదు. పిల్లల స్నేహము రూపం మారుతూ ఉంటుంది. బాప్‌దాదా స్నేహము ఎడతెగనిది, ఏకరసంగా ఉండేది. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి స్నేహము ఎక్కువ? బాప్‌దాదా పిల్లలను చూసినప్పుడు, వారు త్రినేత్రి కాబట్టి మూడు రూపాలలో పిల్లలను చూస్తారు. ఆ మూడు రూపాలు ఏమిటి? పిల్లలైన మీరు బాబాను 3 రూపాలతో చూస్తారు కదా, అవేమిటో అందరికీ తెలుసు. బాబా కూడా పిల్లలను మూడు రూపాలలో చూస్తున్నారు – ఒకటి పురుషార్థ రూపము, రెండు సంగమ యుగం యొక్క భవిష్యత్తు అయిన ఫరిశ్తా రూపము, మూడు – భవిష్య దేవతా రూపము. మూడింటి సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. వర్తమానంలో ఈ దేహం ఈ కళ్ళకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంతే స్పష్టంగా దివ్య నేత్రం ద్వారా ఈ మూడు రూపాలు కనిపిస్తాయి. ఈ కళ్ళతో చూసిన వస్తువును వర్ణించడం సహజం కదా. విన్న విషయాలను వర్ణించడం కొద్దిగా కష్టమనిపిస్తుంది కానీ చూసిన వస్తువును వర్ణించడం సహజంగా అనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ దివ్య నేత్రాల ద్వారా లేక అవ్యక్త నేత్రాల ద్వారా ప్రతి ఒక్కరి మూడు రూపాలు అంతే సహజంగా వర్ణించాలి. అలాగే మీరు ఇతరుల యొక్క ఈ మూడు రూపాలను కూడా చూడగలరు. ఇప్పుడు యథాయోగ్యంగా, యథా శక్తితో ఉన్నారు. కానీ కొంత సమయం తర్వాత యథా శక్తి అనే మాట కూడా సమాప్తమైపోయి అందరూ తమ తమ నంబరు ప్రమాణంగా సంపూర్ణతను పొందుతారు. మరి బాప్‌దాదా మీ అందరి సంపూర్ణ ముఖాలను చూస్తున్నారు. సంపూర్ణత నంబరువారీగా ఉంటుంది. మాలలోని 108 పూసలు ఏవైతే ఉన్నాయో, నంబరు వన్ పూసను 108వ పూసను ఇరువురినీ సంపూర్ణమనే చెప్తామా లేదా? విజయ రత్నములు అంటాము కదా? విజయ రత్నము అంటే తమ నంబరు అనుసారంగా సంపూర్ణతను పొందడము. వారికి మొత్తం డ్రామాలో అందే సంపూర్ణత యొక్క మొదటి దశ. ఎలా అయితే సత్యయుగంలో విశ్వ మహారాజు అని 8వ వారిని అనడం జరుగుతుంది కానీ మొదటి విశ్వ మహారాజు యొక్క సృష్టిలోని సంపూర్ణ సుఖము మరియు 8వ వారి సంపూర్ణ సుఖంలో తేడా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ నంబరు అనుసారంగా సంపూర్ణతను పొందుతున్నారు. కావున బాప్‌దాదా సంపూర్ణ స్థితిని చూస్తున్నారు మరియు వర్తమాన పురుషార్థాన్ని కూడా చూస్తున్నారు. ఎలా ఉన్నారు, ఎలా అవ్వబోతున్నారని చూస్తున్నారు.
వతనంలో కూర్చుని ఏమి చేస్తున్నారని మీరు అడిగారు కదా! ఇదే చూస్తూ ఉంటాము మరియు అవ్యక్త సహయోగాన్ని అందించే సేవను చేస్తూ ఉన్నాము. బాప్‌దాదా వతనంలో ఏమి చేస్తున్నారో ఏమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ సేవ స్పీడు సాకార వతనంకన్నా అక్కడ వేగంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడైతే సాకార తనువు యొక్క లెక్కాచారము కూడా ఉండినది. ఇప్పుడైతే ఈ బంధనం నుండి కూడా ముక్తులయ్యాము, స్వయం గురించి లేము, సర్వాత్మల కోసం ఉన్నాము. శరీరాన్ని విడిచిపెట్టడము మరియు తీసుకోవడము అనే అభ్యాసము అందరికీ ఉంది, అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర భానాన్ని పూర్తిగా విడిచిపెట్టి అశరీరులుగా అవ్వండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీర ఆధారాన్ని తీసుకుని కర్మను చేయడం అనుభవం ఉందా? ఈ అనుభవాన్ని ఇప్పుడు పెంచండి. ఈ స్థూల వస్త్రం వేరు, ఈ వస్త్రాన్ని ధరించిన ఆత్మ వేరు అని స్పష్టంగా అనుభవమవుతుంది, ఈ అనుభవం ఇప్పుడు ఎక్కువ కావాలి. ఇప్పుడిక వెళ్ళిపోతున్నాము అన్న విషయమే ఎప్పుడూ గుర్తుంచుకోండి. కేవలం సేవ కోసం శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాము, సేవ సమాప్తమవ్వగానే స్వయాన్ని తేలికగా అనుభూతి చేసుకోవాలి. ఎలా అయితే మీరు ఎక్కడికైనా డ్యూటీకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తేలికగా అనుభవం అవుతుంది కదా. డ్యూటీ డ్రెస్సును మార్చుకుని ఇంటి డ్రెస్సును వెసుకుంటారు అలాగే సేవ కోసం ఈ శరీరమనే వస్త్రాన్ని ఆధారం చేసుకున్నారు, సేవ పూర్తయ్యాక ఈ వస్త్రాల భారం నుండి తేలికగా మరియు అతీతంగా అయ్యే ప్రయత్నం చేయండి. ఒక్క సెకండులో ఈ వస్త్రం నుండి ఎవరు వేరుగా అవ్వగలరు? టైట్‌గా ఉంటే వేరు చేయలేరు. ఏదైనా వస్తువు అంటుకుని ఉంటే దానిని విడదీయడం కష్టంగా ఉంటుంది, వదులుగా ఉంటే సహజంగానే వేరు చేయవచ్చు. అలాగే ఒకవేళ మీ సంస్కారాలు వదులుగా, ఈజీగా లేకపోతే అశరీరి స్థితిని అనుభవం చేసుకోలేరు. ఏమి అవ్వాలి అన్న విషయాన్ని వినిపించాము కదా. ఈజీ మరియు అలర్ట్. మాయ కూడా మీ వద్దకు ఈజీగా వచ్చేంతటి ఈజీ స్థితిలో ఉండకండి. ఒకసారి ఈజీగా ఉండాలి, మరోసారి అలర్టుగా ఉండాలి. ఈజీ మరియు అలర్టు, ఇలా ఉండేవారే ఈ అభ్యాసంలో ఉండగలరు. బాప్‌దాదా పిల్లలనేమీ క్రొత్తగా చూడటం లేదు. మూడు కాలాలు తెలిసిన వారికి కొత్త విషయం ఏముంటుంది! కనుక అందరూ అతి పాతవారే. ఎంత పాతవారు అన్న లెక్క వేయలేము. కనుక స్వయాన్ని కొత్తగా భావించకండి. అతి పాతవారు, ఆ పాతవారే మళ్ళీ తమ హక్కును పొందడానికి వచ్చారు. ఈ నషా సదా స్థిరంగా ఉండాలి. పురుషార్థం చేస్తాము, చూస్తాము అని ఎప్పుడూ అనకండి. వద్దు. లాస్టు వచ్చినా గానీ మేము ఫాస్టుగా వెళ్తాము అనే అనుకోండి. ఫాస్టుగా వెళ్ళాలన్న లక్ష్యం పెట్టుకుంటే పురుషార్థం కూడా అలాగే చేస్తారు. మేమైతే ఆలస్యంగా వచ్చాము, కాబట్టి ప్రజలుగా అవుతాము అని ఎప్పుడూ అనుకోకండి. అలా కాదు. ఆలస్యంగా వచ్చినాగానీ రాజ్య అధికారం పొందే అధికారం ఉంది. అచ్ఛా.
అవ్యక్త మిలనం కూడా మిలనమే. మేము రాజ్య పదవిని తీసుకుంటాము అని అందరికీ ఈ నిశ్చయము ఉండాలి. మేము కాకపోతే ఇంకెవరు అవుతారు! కోట్లలో కూడా ఎటువంటి ఆత్మలను లెక్కించడం జరుగుతుంది? అటువంటి కోట్లలో కొద్దిమంది ఆత్మలమైన మనం డ్రామాలో ఉన్నాము. ఈ నిశ్చయాన్ని మరవకండి. బాప్‌దాదా పిల్లలందరి భవిష్యత్తును చూసి హర్షిస్తున్నారు. ఒక్కొక్కరినీ కలవాలన్నది మనసులోని మాట. కానీ. బాప్‌దాదాకు ఇప్పుడిది వ్యక్త ప్రపంచం కాదు. మీ ప్రపంచం అనుసారంగా సమయాన్ని కూడా చూడాల్సివస్తుంది. వతనంలో సమయం ఉండదు. గడియారం ఉండదు. కానీ ఈ వ్యక్త ప్రపంచంలో ఇవన్నీ చూడాల్సి వస్తుంది. అక్కడ సూర్యచంద్రులే లేనప్పుడు ఇక రాత్రిపగలు అనే లెక్క ఎందుకుంటుంది? కనుక అక్కడ సమయం యొక్క బంధనం ఉండదు.