Search for a command to run...
21 May 1970
భిన్నత్వాన్ని తొలగించేందుకు యుక్తి
21 May 1970 · తెలుగు
ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరిలో రెండు విషయాలను చూస్తున్నాము, ఏ రెండు విషయాలను చూస్తున్నాము? బాప్‌దాదా చూస్తున్నది కూడా చూస్తున్నారా? ఇటువంటి స్థితి ఇప్పుడు రానుంది. ఏ విషయమునైనా వాణి ద్వారా విన్న తరువాత తెలునుకున్నంత స్పష్టంగా ఇతరుల సంకల్పాలను తెలుసుకుంటారు. మాస్టర్ జానీ జానన్‌హార్(సర్వమూ తెలిసినవారు) అన్న ఈ డిగ్రీ కూడా యథా యోగ్యంగా యథా శక్తిగా తప్పక ప్రాప్తిస్తుంది. మరి ఈ రోజు ఏమి చూస్తున్నాము? పురుషార్థులైన ప్రతి ఒక్కరి పురుషార్థములో ఇంతవరకు ఏ మార్జిన్ ఉండిపోయింది! ఒకటేమో ఆ మార్జిన్‌ను చూస్తున్నాము, రెండవది - ప్రతి ఒక్కరి మైట్‌ను (శక్తిని) చూస్తున్నాము. మార్జిన్ ఎంత ఉంది, మైట్ ఎంత ఉంది? రెండింటికీ పరస్పర సంబంధము ఉంది. ఎంత మైట్ ఉందో అంత మార్జిన్ ఉంది. కావున, ప్రతి పురుషార్థి యొక్క మైట్ మరియు మార్జిన్‌ను చూస్తున్నాము. కొందరు చాలా సమీపము వరకు చేరుకున్నారు, కొందరు చాలా దూరములో ఉండిపోయి గమ్యమును చూస్తున్నారు. మరి భిన్న భిన్న పురుషార్థుల భిన్న భిన్న స్థితులను చూసి ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు? భిన్నత్వాన్ని చూసి ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు?
బాప్‌దాదా పిల్లలందరినీ మాస్టర్ నాలెజ్ఫుల్గా తయారు చేసే చదువును చదివిస్తున్నారు. ప్రాక్టికల్‌గా, భగవంతునికి ఎంతగా సాకార సంబంధములో సమీపంగా వస్తారో అంతగా పురుషార్థములో కూడా సమీపంగా వస్తారు. మీ పురుషార్థము మరియు ఇతరుల పురుషార్థమును చూసి ఏమి ఆలోచిస్తున్నారు? బీజమైతే అవినాశి. అవినాశి బీజానికి సాంగత్యమనే జలాన్ని ఇవ్వాలి, అప్పుడే ఫలాలు వస్తాయి. కావున ఇప్పుడు ఫల స్వరూపమును చూపించాలి. ఫలాల కోసమే వృక్షము గురించి శ్రమ పడతారు కదా! కావున ఎవరైతే జ్ఞాన పాలనను తీసుకున్నారో దానికి ఫలితంగా ఫల స్వరూపులుగా అవ్వాలి. మరి ఈ భిన్నత్వం ఏదైతే ఉందో అది ఎలా తొలగుతుంది? భిన్నత్వాన్ని తొలగించేందుకు సహజ ఉపాయము ఏది? ఇప్పటి ఈ భిన్నత్వం అంతిమం వరకు ఉంటుందా లేక తేడా వస్తుందా? సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకున్న తరువాత ఇప్పటి పురుషార్థి జీవితములోని భిన్నత్వము ఉంటుందా? ఇప్పుడున్న ఈ భిన్నత్వాన్ని ఐక్యతలోకి తీసుకురావాలి. ఐక్యత కొరకు వర్తమానములోని భిన్నత్వాన్ని తొలగించవలసి ఉంటుంది. బాప్‌దాదా ఈ భిన్నత్వాన్ని చూస్తూ కూడా ఐక్యతనే చూస్తారు. ఐక్యతకు సాధనము - రెండు విషయాలను తీసుకురావలసి ఉంటుంది. ఒకటి ఏకనాములుగా అయ్యి ఎల్లప్పుడూ ప్రతి విషయములో ఒక్కరి నామాన్నే ఉచ్ఛరిస్తూ ఉండండి, రెండవది ఎకానమీ గలవారిగా (పొదుపు కలవారిగా) అవ్వండి. ఎందులో ఎకానమీ? సంకల్పాలలో కూడా ఎకానమీ కావాలి, సమయము మరియు జ్ఞాన ఖజానాల విషయములో కూడా ఎకానమీ అవసరము. అన్ని రకాల పొదుపును నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడిక నేను అన్నది తొలగిపోయి అన్ని భిన్నత్వాలు ఒక్క తండ్రిలో కలిసిపోతాయి. ఒక్కదానిలో ఇమిడే శక్తి కావాలి. అర్థమైందా? ఈ పురుషార్థము ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే అంతగానే దానిని ఎక్కువ చెయ్యాలి. ఏ కార్యములోనూ ఏవిధమైన నాది అనేది ఉండకూడదు, ఒక్కరి పేరే ఉండాలి. అప్పుడేమవుతుంది? బాబా, బాబా అని అనటం ద్వారా మాయ పారిపోతుంది. నేను - నేను అని అంటే మాయ హతమార్చేస్తుంది. కావున ప్రతి విషయంలో భాషను మార్చండి అని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. బాబా- బాబా అనే ఢాలును ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంచుకోండి. ఈ ఢాలు ద్వారా ఏ విఘ్నాలైనా సమాప్తమైపోతాయి. దీనితో పాటు ఎకానమీ చెయ్యటం వలన వ్యర్థ సంకల్పాలు రావు, అలాగే వ్యర్థ సంకల్పాల ఘర్షణ కూడా ఉండదు - ఇది స్పష్టీకరణ. అచ్ఛా! ఎవరెవరైతే వెళ్ళనున్నారో, వారు ఏమి చేసి వెళతారు? ఎవరైనా ఎక్కడినుండైనా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడినుండైతే వెళ్తున్నారో అక్కడ తమకు గుర్తుగా ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళవలసి ఉంటుంది. కావున వెళ్ళేవారందరూ ఏదో ఒక విశేషమైన స్మృతి చిహ్నమును ఇచ్చి వెళ్ళాలి.
సరళమైన స్మృతి ఎవరికి ఉంటుంది? తెలుసా? స్వయము ఎవరు ఎంత సరళంగా ఉంటారో వారి స్మృతి కూడా అంతగానే సరళంగా ఉంటుంది. స్వయములోని సరళతా లోపము కారణంగా స్మృతి కూడా సరళంగా ఉండదు. సరళచిత్తులుగా ఎవరు ఉండగలరు? ప్రతి విషయములో ఎవరు ఎంతగా స్పష్టంగా ఉంటారో అనగా స్వచ్ఛంగా ఉంటారో వారు అంత సరళంగా ఉంటారు. ఎంత సరళంగా ఉంటారో అంతే సరళ స్మృతి కూడా ఉంటుంది. అంతేగాక ఇతరులను కూడా సరళ పురుషార్థులుగా తయారు చెయ్యగలరు. స్వయం ఎలా ఉంటారో, వారి రచనలో కూడా అదే సంస్కారము ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వారి విశేష స్మృతి చిహ్నమును ఇచ్చి వెళ్ళాలి. అచ్ఛా!