Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

28 May 1970 | తెలుగు28 May 1970 | తెలుగు · హైజంప్ చేసేందుకు తేలికగా అవ్వండి

HomeSearchBKOneLibrarySettings
21 May 1970Prev29 May 1970Next

హైజంప్ చేసేందుకు తేలికగా అవ్వండి

ఎటువంటి సమారోహము? సమర్పణ సమారోహము అయితే కాదు కదా? ఈ సమారోహము పేరు ఏంటి? వీరు తమ జీవితాన్ని నిర్ణయించుకునే సమారోహము ఇది. నిర్ణయం తీసుకోలేదు, తీసుకోవాలి. ఇప్పుడు అగ్రిమెంట్ చేయనున్నారు. తరువాత ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. దాని తరువాత సమర్పణ అయ్యే సమారోహము ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదటి స్టేజ్‌కు వచ్చారు. ఇప్పుడు అగ్రిమెంటు చేయనున్నారు, కావుననే అందరూ వచ్చారు కదా! జీవితాన్ని నిర్ణయించుకునేందుకు వచ్చారా, లేదా? బాప్‌దాదా కూడా ప్రతి ఒక్కరి సాహసాన్ని చూస్తున్నారు. ఏదైనా విషయములో సాహసమును ఉంచితే సాహసముతో పాటు ఇంకా వేరేవి కూడా చెయ్యవలసి ఉంటుంది, అనేక విషయాలను ఎదుర్కోవలసి వస్తుంది. సాహసము ఉంచారంటే ఇక మాయను ఎదుర్కోవటం మొదలైపోతుంది. కావున ఎదుర్కునేందుకు కావలసిన ధైర్యమును కూడా మొదటినుండే మీలో ఉంచుకోవాలి. మీరందరూ ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏ పరీక్ష ఏ రూపములో వచ్చినాగానీ, పరీక్షను పాస్ అయ్యేందుకు ఒకవేళ హైజంప్ చేసే అభ్యాసము ఉన్నట్లయితే ఎటువంటి పరీక్షనైనా పాస్ అయిపోతారు. మరి ఇది హైజంప్ చేసేవారి గ్రూపు. మేము హైజంప్ చేసేవారము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అందరూ సాహసమును ఉంచటంలో నంబర్‌వన్‌గా ఉన్నారు. హైజంప్ అని దేనిని అంటారు, దాని మొదటి లక్షణము ఏమిటి అన్నదానిని వీరికి చెప్పవలసి ఉంటుంది. హైజంప్ చేసేవారికి లోపల బయట తేలికతనము అనుభవమవుతుంది. ఒకటేమో లోపలి తమ స్థితి యొక్క తేలికతనము, రెండవది వెలుపలి తేలికతనము. వెలుపల అందరి కనెక్షన్లోకి రావలసి ఉంటుంది. పరస్పర సంబంధ సంపర్కములోకి రావలసి ఉంటుంది, అంటే లోపల కూడా తేలికతనము, బయట కూడా తేలికతనము. తేలికతనము ఉన్నట్లయితే హైజంప్ చెయ్యగలరు. ఎక్కడకు వెళ్ళినా వారితో కలిసిపోయేంత తేలికగా ఈ గ్రూపువారు తయారవ్వాలి. అంత సాహసము ఉందా? ఒకవేళ ఇంతమంది కుమారీలు సమర్పణ అయిపోతే ఇక ఏమవుతుంది?

ఈ భట్టీ నుండి ఎలా తయారై వెళ్ళాలంటే ఎవరు ఎటువంటివారైనాగానీ, ఎక్కడ ఉన్నాగానీ, ఎటువంటి పరిస్థితి అయినాగానీ వాటన్నింటినీ ఎదుర్కోగలగాలి! ఎందుకంటే సమస్యలను అంతం చేసేవారిగా అయ్యి వెళ్ళాలి, అంతేగానీ స్వయమే సమస్యగా అవ్వకూడదు. కొందరు సమస్యను తొలగించేవారిగా ఉంటే కొందరు స్వయమే సమస్యగా తయారవుతారు. కావున, స్వయం సమస్యగా అవ్వకుండా సమస్యను తొలగించేవారిగా అవ్వాలి. బాప్‌దాదా ఈ గ్రూపుకు ఏ పేరు పెడ్తారు? కర్మ చేసేందుకు ముందే పేరు పెడ్తారు కావున ఎటువంటి పేరు ఉంటుందో అటువంటి పనిని చేసి చూపిస్తారు. అంతటి ఆశావాదులే కదా? పెద్దవారు పెద్దవారే, కానీ చిన్నవారు కూడా తండ్రి సమానులే అని అంటారు కదా. ఇది చాలా గారాల గ్రూపు, ఆశావాదులు. సాహసము కారణంగానే బాప్‌దాదా ఈ గ్రూపుకు శూర-వీరగ్రూపు అని పేరు పెడ్తున్నారు. పేరుకు తగినట్లుగా ప్రతి కార్యమును శూర-వీరుల సమానంగా చెయ్యాలి. ఎప్పుడూ పిరికివారిగా అవ్వవద్దు, బలహీనతను చూపించకండి. కాళీ పూజను చూసారా? ఆ కాళీ దళములాగా ఈ మొత్తము గ్రూపు కూడా కాళీ దళంగా అవ్వాలి. ప్రతి ఒక్కరూ కాళీ రూపులుగా అయినప్పుడు సమస్యలను ఎదుర్కోగలరు. విశేషంగా కుమారీలు శీతలాదేవిగా అవ్వకూడదు, కాళీగా అవ్వాలి. శీతలాదేవిగా కూడా ఏ రూపములో అవ్వాలి అన్నదానినైతే అర్ధం చేసుకున్నారు. కానీ సేవలో ఉన్నప్పుడు, కర్తవ్యములో ఉన్నప్పుడు కాళీ రూపము అవసరము. కాళీ రూపము ఉన్నట్లయితే ఎప్పుడూ ఎవరిపైనా బలి అవ్వరు, అనేకులను తమపై బలిహారము చేసుకుంటారు. ఎవ్వరిపైనా స్వయం బలి అవ్వకూడదు, కానీ వారిని తమపై అనగా ఎవరిపైనైతే మీరందరూ బలి అయ్యారో వారిపైనే అందరినీ బలి చెయ్యాలి. ఇటువంటి కాళికలుగా అయినట్లయితే అనేకుల సమస్యలను పరిష్కరించగలరు. చాలా కఠిన రూపము అవసరము. మాయ యొక్క ఎటువంటి విఘ్నమైనా మీ ముందుకు వచ్చేందుకు కూడా సాహసించకూడదు. కుమారీలు కాళీ రూపులుగా అయినప్పుడు సేవ యొక్క సఫలత జరుగుతుంది. కావున వీరందరికీ కాళిక రూపంలోని లక్షణాలను వినిపించండి. ఎల్లప్పుడూ ఏకరస స్థితిలో ఉండాలి, విఘ్నాలను కూడా తొలగించగలగాలి, ఇందుకొరకు ఎల్లప్పుడూ రెండు విషయాలను మీ ముందు ఉంచుకోవాలి. ఏవిధంగా ఒక కంట్లో ముక్తి, మరొక కంట్లో జీవన్ముక్తిని ఉంచుకుంటారో అలాగే ఒకవైపు వినాశన నగాడాను ఎదురుగా ఉంచుకోండి, మరొకవైపు మీ రాజ్యపు నజారా(దృశ్యము)ను ఎదురుగా ఉంచుకోండి, రెండింటినీ బుద్దిలో ఉంచండి. వినాశనము కూడా, స్థాపన కూడా, నగాడా కూడా, నజారా కూడా ఎదురుగా ఉండాలి.... అప్పుడు ఎటువంటి విఘ్నమునైనా సహజంగానే దాటగలుగుతారు.

ఏ కార్యమునైతే ఏ గ్రూపూ చెయ్యలేదో అటువంటి కార్యమును ఈ గ్రూపు చేసి చూపించాలి, అద్భుతమును చేసి చూపించాలి. ఎల్లప్పుడూ పరస్పరం స్నేహులుగా మరియు సహయోగులుగా కూడా అయి నడిచినట్లయితే సఫలతా సితార మీ అందరి మస్తకముపై మెరుస్తూ కనిపిస్తుంది. ఎప్పుడూ స్నేహము, సహయోగమునివ్వటములో తక్కువ చెయ్యకండి. స్నేహము మరియు సహయోగము రెండూ పరస్పరము కలిసినట్లయితే శక్తి ప్రాప్తిస్తుంది. ఈ శక్తి ద్వారానే సఫలత ప్రాప్తిస్తుంది. కావున ఈ రెండు విషయాలపై శ్రద్ధ ఉంచాలి. దేవతలు ఒక్క చూపుతో అసురులను సంహరిస్తారు అన్నది మీ జడ చిత్రాల గాయనము. అలా ఒక్క క్షణంలో ఎటువంటి అసుర సంస్కారమునైనా సంహరించే సంహారిణి మూర్తులుగా అవ్వాలి. ఎక్కడ సంహారము చెయ్యవలసి ఉంటుందో అక్కడ రచనను రచించకూడదు, ఎక్కడ రచనను రచించవలసి ఉంటుందో అక్కడ సంహారము చెయ్యకూడదు, ఇప్పుడు ఈ విషయమును గమనించాలి. మాస్టర్ బ్రహ్మాగా అవ్వవలసినప్పుడు మాస్టర్ శంకరులుగా అవ్వకూడదు. మాస్టర్ బ్రహ్మాగా ఎక్కడ అవ్వాలి, మాస్టర్ శంకరులుగా ఎక్కడ అవ్వాలి అన్న ఈ జ్ఞానము బుద్ధిలో ఉండటం అవసరము. రచనను రచించవలసినప్పుడు వినాశనము చెయ్యటమూ తప్పే, వినాశనమునకు బదులు రచన చెయ్యటమూ తప్పే. అటుదిటు చేసినప్పుడు తేళ్ళు, జెర్రీలు పుట్టుకొచ్చాయి అన్న కథను విన్నారు కదా! కావున ఇక్కడ కూడా ఒకవేళ సంహారము చేసేందుకు బదులుగా చెడు రచనను రచించినట్లయితే వ్యర్థ సంకల్పాలు తేళ్ళు, జెర్రిలలా అయిపోతాయి. కావున, స్వయమును మరియు ఇతరులను కూడా కాటు వేసే అటువంటి రచనను రచించవద్దు. అటువంటి రచనను రచించటము నుండి జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయములో ఏ కర్తవ్యం అవసరము ఉంటుందో ఆ సమయములో ఆ కర్తవ్యమును చెయ్యాలి. సమయము గడిచిపోతే సంపూర్ణంగా అవ్వజాలరు. కావున ఈ గ్రూపు చాలా త్వరత్వరగా అగ్రిమెంటు చేసి తరువాత ఎంగేంజ్‌మెంటు చేసుకోవాలి. సేవాకేంద్రాలలో సేవలో నిమగ్నులవ్వటమే ఎంగేజ్‌మెంట్, అప్పుడు సేవలో సఫలత పొందాక, ఇక మూడవది సంపూర్ణ సంపన్నంగా అయ్యే సమారోహము. మూడు సమారోహాలను త్వరగా చేసి చూపించాలి. చిన్నవారు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళగలరు. ప్రియమైనవారు, గారాల పిల్లలు చిన్నవారే అవుతారు కదా! కావున ఈ గ్రూపు ప్రాక్టికల్‌గా చూపించాలి. ధైర్యము ఉంది కదా! ధైర్యముతో పాటు ఉల్లాసమును కూడా ఉంచాలి. ఎప్పుడూ హార్(ఓటమి) పొందకూడదు కానీ స్వయమును హారముగా చేసుకొని మెడలో అలంకృతులవ్వాలి. ఒకవేళ మెడలో హారముగా అయినట్లయితే ఎప్పుడూ ఓడిపోరు. ఎప్పుడైనా ఓడిపోయే పరిస్థితి వస్తే, మేము ఓడిపోయేవారము కాదు, బాప్‌దాదా మెడలోని హారాలము అన్నదానిని గుర్తు తెచ్చుకోండి. చిన్న చిన్న కోమలమైన చిగురుటాకులను పక్షులు చాలా తినేస్తుంటాయి ఎందుకంటే లేతగా ఉంటాయి కాబట్టి తినటంలో చాలా మజా వస్తుంది, కావున సంభాళించుకోవలసి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక్కరి ముందు అర్పణ చేసేసారో అప్పుడిక ఇతరుల ముందు సంకల్పము ద్వారా కూడా అర్పణ కాకూడదు. సంకల్పము కూడా చాలా మోసగిస్తుంది. చాలా ప్రియమైన, ముద్దు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఏం పెడ్తారు? నల్ల బొట్టు (దిష్టి చుక్క) పెడ్తారు. కావున ఈ గ్రూపుకు కూడా ఎవరి దిష్టి పడకుండా తిలకాన్ని పెట్టాలి. తిలకమునకు అర్థమునైతే తెలుసుకున్నారు, ఏ విధంగా తిలకము మస్తకముపై ఉంటుందో అలాగే ఏ విషయాలు వచ్చినాగానీ అవన్నీ స్వరూపములోకి రావాలి మరియు ఎల్లప్పుడూ ఆ స్థితిలో స్థితులై ఉండాలి, దాని కొరకు ఈ తిలకము. ఈ అన్ని విషయాలు స్థితిలో ఉండిపోయినట్లయితే అప్పుడు రాజ్య తిలకము లభిస్తుంది. ఎటువంటి స్థితి అవసరము? ఇదైతే తెలుసు కదా. ‘సఫలత మా జన్మ సిద్ధ అధికారము, అసఫలత కాదు’ అన్న స్లోగన్‌ను ఈ గ్రూపు గుర్తుంచుకోవాలి. నయనాలలో కూడా, ముఖములో కూడా, మస్తకములో కూడా సఫలతా స్వరూపము కనిపించాలి. సంకల్పము కూడా సఫలత కలిగినదిగా ఉండాలి. ఇతర కార్యాలలో కూడా సఫలత ఉండాలి. సఫలతయే జన్మ సిద్ధ అధికారము, ఇదే ఈ గ్రూపు స్లోగన్. భట్టీలో పడితే అంతా మారిపోతుంది. అందరికంటే చిన్నవారు ఇంకా ఎక్కువ షో చేస్తారు. (పూనమ్ బాప్‌దాదా ఎదురుగా కూర్చుని ఉంది). ఎవరిలో అయితే అస్సలు ఆశనే ఉండదో వారు ఇంకా ఎక్కువ ఆశావాదులుగా అయ్యి చూపెడ్తారు. తాను అద్భుతము చేసి చూపిస్తుంది. బాల భవన్‌కు గుర్తుగా ఒక్కరే ఉన్నారు. స్మృతి చిహ్నమును ఎల్లప్పుడూ షోకేసులో ఉంచటం జరుగుతుంది. కావున మిమ్మల్ని ఎల్లప్పుడూ షోకేసులో ఉంచుకోవాలి. ఒకవేళ చిన్నవారు ఒక్కరైనా అద్భుతమును చేసినట్లయితే ఈ మొత్తము గ్రూపు పేరు ప్రసిద్ధమైపోతుంది.

ఇప్పుడు ఏ స్లోగన్ అయితే చెప్పామో దానిని చేసి చూపించాలి. చిన్నవారు పెద్ద కర్తవ్యమును చేసి చూపించాలి. వీరందరి చేత అగ్రిమెంటును వ్రాయించాలి. ఏ కారణము వచ్చినాగానీ, ఎటువంటి సమస్య వచ్చినాగానీ ఇతరులెవ్వరిపైనా బలిహారము అవ్వము. సత్యమైన, దృఢమైన ప్రతిజ్ఞనే కదా! ఏవిధంగా బీజమును నాటిన తరువాత నీటిని పోసినప్పుడే అది వృక్షరూపములో ఫలీభూతమవుతుందో, అదేవిధంగా ఇప్పుడు చేసిన ఈ ప్రతిజ్ఞకు ఏ జలమును పోస్తారు? ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు సాంగత్యము కూడా అవసరము మరియు దీనితో పాటు మీ ధైర్యము కూడా అవసరము. సాంగత్యము మరియు ధైర్యము - ఈ రెండింటి ఆధారముతో తీరానికి చేరుతారు. వయా పరంధామము ద్వారా వైకుంఠమునకు తప్ప మరెక్కడకూ వెళ్ళము అన్నదానిని దృఢమైన ముద్రగా వేసుకోవాలి. ఏవిధంగా గవర్నమెంటువారు సీలు వేసినదానిని ఇతరులెవ్వరూ తియ్యలేరో అలా సర్వశక్తివంతమైన గవర్నమెంటు సీలును ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ఈ గ్రూపులో ఎవరైనా బలహీనమయినట్లయితే వీరందరి నుండి ఉత్తరాలు వస్తాయి, అర్థమైందా? అచ్ఛా.

Read in Other Languages

हहिंदीગગુજરાતી

Murli Topics

सामना करने की शक्ति - Power to faceबुद्धि (दिव्य बुद्धि ) - Divine Intellectमन /संकल्प /चित्त सुभ संकल्प ढृढ़ संकल्प - Determined,Thoughts,Consciousness,positive Thoughtsस्मृति और विस्मृतिबापदादा की प्रेरणा - Inspirations of Bapdada for selfसदा याद रखो - Always Rememberस्वयं पुरुषार्थ - Self Effortsफेल - Failपेपर - Paperपास - PassSituation/Problem-परिस्थिति/समस्या
Waste Thoughts-व्यर्थ संकल्प
Time-समय
सेवा में सफमता का आधार / प्रत्यक्ष फल - Basis of success in service / immediate fruit
कुमारियाँ - kumaris
रूहानी गीत / गायन - spiritual songs
स्लोगन - slogans
अलौकिक वृक्ष - spiritual tree
ताज तख्त तिलक - Crown , Throne ,Tilak
दो बाते - Two thing
शिवशक्ति - Shivshakti