Search for a command to run...
29 May 1970
సమీపరత్నాల గుర్తులు
29 May 1970 · తెలుగు
సమయము ఎంత సమీపానికి చేరుకుందో కనిపిస్తోందా, లెక్క వేయగలరా? భవిష్య లక్షణములతో పాటు సంపూర్ణ స్వరూప లక్ష్యము కూడా ఎదురుగా ఉందా? సమీప లక్షణము ఏమిటి? శరీరాన్ని వదిలేటప్పుడు కొంతమందికి ముందే తెలిసిపోతుంది. అలాగే మీరు కూడా ఈ శరీరము వేరు, దీనిని మేము ధరించి నడిపిస్తున్నాము అన్న అనుభవము చేసుకుంటారు. సమీపంగా వచ్చే సమీప రత్నాల లక్షణము ఇదే ఉంటుంది. ఎల్లప్పుడూ తమ ఆకారీ రూపము మరియు భవిష్య రూపమును ఎదురుగా చూస్తూ ఉంటారు. ప్రాక్టికల్లో అనుభవమవుతుంది. ఇలా తయారవ్వాలి అని లైట్ యొక్క ఫరిస్తా స్వరూపము ఎదురుగా కనిపిస్తుంది మరియు భవిష్య రూపము కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిని వదులుతాము, దానిని తీసుకుంటాము - ఎప్పుడైతే ఇటువంటి అనుభవము ఉంటుందో అప్పుడు సంపూర్ణతకు సమీపంగా వచ్చినట్లు భావించండి. ఒక కంట్లో సంపూర్ణ స్వరూపము, మరొక కంట్లో భవిష్య స్వరూపము ఈ విధముగా ప్రత్యక్షముగా కనిపిస్తుంది. ఏవిధంగా మీ ఈ స్వరూపము ప్రత్యక్షముగా అనుభవమవుతుందో అలా, ఇక్కడ లేము కానీ ఆ సంపూర్ణ స్వరూపములో కూర్చున్నాము అని కూర్చొని, కూర్చొనే అటువంటి అనుభవం చేసుకుంటారు. ఈ పురుషార్థీ శరీరము పూర్తిగా మర్జ్ అయిపోతుంది. ఒకవైపు అవ్యక్తము మరొకవైపు భవిష్యత్తు, ఈ రెండూ ఇమర్జ్ అవుతాయి. ఇటువంటి అనుభవమును మొదట మీరు చేసుకున్నట్లయితే అప్పుడు ఇతరులకు కూడా అనుభవమవుతుంది. ఏవిధంగా ఒక వస్త్రాన్ని వదిలి మరొకదానిని ధరించినట్లుగా అంత సహజముగా అనుభవము చేసుకుంటారు. ఇది మర్జ్ అవుతుంది అది ఇమర్జ్ అవుతుంది, దీనిని మర్చిపోతూ ఉంటారు. ఇటువంటి స్థితిలో విల్ పవర్ కూడా ఉంటుంది. విల్లును వ్రాస్తారు కదా, విల్లు చేసిన తరువాత నాది అన్న భావమంతా సమాప్తమైపోయినట్లుగా, బాధ్యత దిగిపోయినట్లుగా అనుభవమవుతుంది. విల్ పవర్ కూడా వస్తుంది మరియు సర్వస్వమును విల్లు చేసేసినట్లుగా కూడా అనుభవమవుతుంది. సంకల్ప సహితంగా అన్నీ విల్లు అయిపోయాయి. శరీర భానమును వదలటము మరియు సంకల్పాలతో సహా పూర్తిగా విల్లు చేయటము ఇదే మైట్(శక్తి). అప్పుడిక సమానత స్థితి కలుగుతుంది. సమానత అన్నా సంపూర్ణత అన్నా విషయమైతే ఒక్కటే. ఇప్పుడు ఈ చార్టును పెట్టాలి. ఆ చార్ట్ అయితే మామూలే. పంచతత్వాల శరీరము ఉన్నాగానీ లైట్ స్వరూపమును అనుభవము చేసుకుంటారు. లైటు అన్న మాటకు గల అర్థములో కూడా అంతరము ఉందని వినిపించి ఉన్నాము కదా! లైట్ అనగా తేలికతనము అని మరియు లైట్ అనగా జ్యోతి అని కూడా అంటారు. పూర్తిగా తేలికతనము అనగా లైట్ స్వరూపులై నడుస్తున్నాము, మేమైతే నిమిత్తులము! అవ్యక్తరూపములో అయితే ప్రతి విషయములోనూ సహాయము లభిస్తుంది. అచ్ఛా!
పార్టీలతో: -
• అందరి పురుషార్థము సరిగ్గా నడుస్తుందా? ఏ నంబరును లక్ష్యంగా పెట్టుకున్నారు? (ఫస్ట్ నంబరు) ఫస్ట్ నంబరు కోసం ఏమి చేయాల్సి ఉంటుందో తెలుసా? ఫస్ట్ నంబరు తీసుకోవడానికి విశేషంగా ఫాస్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఫాస్ట్ అంటే వ్రతం అన్న అర్థం ఒకటి ఉంది. మరి విశేషంగా ఏ వ్రతాన్ని పెట్టుకోవాలి? (పవిత్రత) ఈ వ్రతమైతే కామన్ అయిపోయింది. ఈ వ్రతాన్ని అందరూ తీసుకుంటారు. ఫస్ట్ రావాలంటే విశేష వ్రతం – ఒక్క బాబా మరెవ్వరూ లేరు. ప్రతి విషయంలో ఒక్కరే గుర్తుకు రావాలి. ఈ విధమైన ఫాస్టును పెట్టుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేస్తారు. రెండవ ఫాస్ట్ – వేగంగా నడవడాన్ని కూడా అంటారు అనగా తీవ్ర పురుషార్థము.
మహారధి అంటే సదా మాయపై విజయాన్ని పొందేవారు. మాయకు సదా కోసం వీడ్కోలు చెప్పేయండి. విఘ్నాలను తొలగించే పూర్తి జ్ఞానం ఉందా? సర్వశక్తిమంతుని పిల్లలు మాస్టర్ సర్వశక్తిమంతులు మీరు. నాలెజ్ ఆధారంగా విఘ్నాన్ని తొలగించి సదా మగ్న అవస్థలో ఉండండి. ఒకవేళ విఘ్నాలు తొలగడం లేదంటే తప్పకుండా శక్తిని పొందడంలో లోటు ఉందని అర్థం. నాలెజ్ తీసుకున్నారు కానీ దానిని మీలో ఇముడ్చుకోలేదు. నాలెజ్ను ఇముడ్చుకోవడం అంటే స్వరూపంగా అవ్వడము. అవగాహనతో కర్మ జరిగినప్పుడు దాని ఫలితంగా సఫలత తప్పకుండా లభిస్తుంది.
• తీవ్ర పురుషార్థీల లక్షణము ఏమిటి? ఆజ్ఞాకారి అని ఎవరిని అంటారో తెలియజేసాము కదా! ఎవరి సంకల్పం కూడా ఆజ్ఞ లేనిదే నడవదో వారే ఆజ్ఞాకారులు. ఇటువంటి ఆజ్ఞాకారులనే తీవ్ర పురుషార్థీలు అని అనడం జరుగుతుంది. సర్వశక్తిమంతుడైన తండ్రి పిల్లలు ఎవరైతే శక్తిశాలి పిల్లలు ఉన్నారో వారి ఎదుట మాయ కూడా దూరంనుండే సలామ్ చేసి వీడ్కోలు తీసుకుంటుంది. వల్లభాచారులు తమ శిష్యులను తాకనివ్వరు కూడా. అంటరానివారు ముట్టుకుంటే స్నానం చేస్తారు కదా. ఇక్కడ కూడా జ్ఞాన స్నానం చేసి ఎంతటి శక్తిని ధారణ చేయాలంటే అంటరానివారు సమీపంగా కూడా రాకూడదు. మాయ కూడా ఏమిటి? అంటరానిది. అచ్ఛా.