Search for a command to run...
7 Jun 1970
దివ్యమూర్తిగా అయ్యేందుకు విధి
7 June 1970 · తెలుగు
నయనాల ద్వారా ఏమి చూస్తున్నారు? మీరందరూ నయనాల ద్వారా చూస్తున్నారు. బాప్దాదా కూడా నయనాల ఆధారమును తీసుకొని చూస్తున్నారు. బాప్దాదా ఏమి చూస్తారు? మీరందరూ ఏం చూస్తున్నారు? చూస్తున్నారా లేక చూస్తూ కూడా చూడటం లేదా? ఎటువంటి స్థితి ఉంది? బాప్దాదాఏం చూస్తున్నారో దానినే మీరూ చూస్తున్నారా? సంకల్పాలను క్యాచ్(గ్రహించే) చేసే అభ్యాసము ఉన్నట్లయితే సంకల్పరహితంగా ఉండటము కూడా సహజమవ్వగలదు. ఇతరుల సంకల్పాలను పరిశీలించలేనప్పుడే ఎక్కువ సంకల్పాలను నడిపించవలసి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరి సంకల్పాలను గుర్తించగలిగే అభ్యాసము ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా రావు. ఇంకా చాలా సహజంగానే ఒక్క సంకల్పములో ఏకరస స్థితిలో క్షణములో స్థితులైపోతారు. కావున సంకల్పాలను చదవటము కూడా సంపూర్ణత యొక్క ఒక లక్షణము. ఎంతెంతగా అవ్యక్త భావములో స్థితులవుతారో అంతంతగా ప్రతి ఒక్కరి భావమునూ సహజముగానే అర్థం చేసుకోగలుగుతారు. పరస్పర భావములను అర్థం చేసుకోలేకపోవడానికి కారణం - అవ్యక్త భావములో లోపము. అవ్యక్త స్థితి ఒక దర్పణము వంటిది. ఎప్పుడైతే మీరు అవ్యక్త స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఏ వ్యక్తి భావమైనా అవ్యక్త స్థితి రూపి దర్పణములో చాలా స్పష్టముగా కనిపిస్తుంది. అప్పుడిక కష్టపడవలసిన అవసరము ఉండదు. ఎవరి భావమునైనా అర్థం చేసుకొనేందుకు దర్పణమునకు కష్టపడవలసిన అవసరము ఉండదు. ఎంతెంతగా అవ్యక్త స్థితి ఉంటుందో అంతగానే దర్పణము కూడా శుభ్రముగా మరియు శక్తిశాలిగా ఉంటుంది. ఇంత సహజాతిసహజంగా ఇతరుల భావములను స్పష్టముగా అర్థం చేసుకుంటారు. అవ్యక్త స్థితిరూపి దర్పణమును శుభ్రముగా, స్పష్టముగా చేసుకొనేందుకు మూడు విషయముల అవసరము ఉంది. ఆ మూడు విషయాలలో ఏదైనా ఒక విషయాన్ని వినిపించండి (ప్రతిఒక్కరూ వినిపించారు). ఈ రోజు ప్రతి ఒక్కరిలోని సరళత, శ్రేష్ఠత మరియు సహనశీలత - ఈ మూడు విషయాలను ఒక్కొక్కరిలో చూస్తున్నాము. ఈ మూడు విషయాలలో ఏ ఒక్కటైనా మంచిరీతిలో ధారణ జరిగినట్లయితే దర్పణము స్పష్టముగా ఉంటుంది. ఒకవేళ ఒక్క విషయములో లోపమున్నాగానీ దర్పణముపై కూడా లోపమనే మచ్చ కనిపిస్తుంది. కావున ఏ కార్యము చేసినా, ప్రతి కార్యములో మూడు విషయాలను పరిశీలించుకోండి. అన్ని విధాలుగానూ సరళత కూడా ఉండాలి, సహనశీలత కూడా ఉండాలి మరియు శ్రేష్ఠత కూడా ఉండాలి. సాధారణత కూడా ఉండకూడదు. ఇప్పుడు అక్కడక్కడా శ్రేష్ఠతకు బదులుగా సాధారణత కనిపిస్తుంది. సాధారణతను శ్రేష్ఠతలోకి బదిలీ చెయ్యండి, ప్రతి కార్యములో సహనశీలతను మీ ముందు ఉంచుకోండి మరియు మీ ముఖములో, వాణిలో సరళతను ధారణ చెయ్యండి. అప్పుడిక సేవలో మరియు కర్తవ్యములో సఫలత ఎంత శ్రేష్ఠముగా ఉంటుందో చూడండి. ఇప్పటివరకు కర్తవ్యపు రిజల్టు ఎలా కనిపిస్తుంది? ప్లాను మరియు ప్రాక్టికల్లో ఎంత అంతరము ఉంది?
అంతరమునకు గల కారణము ఏమిటి? మూడు రూపాలలోనూ ఇప్పుడు పూర్తి ప్లెయినుగా అవ్వలేదు. స్మృతిలో కూడా ప్లెయిన్(స్వచ్ఛత), వాణిలో కూడా ప్లెయిన్గా ఉండాలి. పాత సంస్కారానికి చెందిన ఎటువంటి మచ్చ ఉండకూడదు మరియు కర్మలలో కూడా ప్లెయిన్ అనగా శ్రేష్ఠత. ఒకవేళ ప్లెయిన్గా అయిపోయినట్లయితే అప్పుడు ఇక ప్లాను మరియు ప్రాక్టికల్ ఒక్కటైపోతాయి. అప్పుడు సఫలత ప్లెయిన్ (విమానము)లాగా పైకెగురుతుంది. కావున ప్రతి విషయములో మనసా-వాచ-కర్మణ మరియు చిన్న విషయములో కూడా అప్రమత్తత అవసరము. మనస్సు, వాణి, కర్మలలో అయితే ఉండవలసిందే, కానీ దానితో పాటుగా ఈ అలౌకిక సంబంధమేదైతే ఉందో అందులో కూడా ప్లెయిన్గా ఉన్నట్లయితే సేవా సఫలత మీ అందరి మస్తకముపై సితార రూపంలో మెరుస్తూ ఉంటుంది. అప్పుడు మీ ప్రతి ఒక్కరి సఫలతా సితారను ప్రతి ఒక్కరూ చూస్తారు. ఏ స్లోగన్ను గుర్తు పెట్టుకోవాలో వినిపించాము కదా - సఫలత మా జన్మసిద్ధ అధికారము. అప్పుడిక మిమ్మల్ని ఎవరు చూసినా వారికి దూరము నుండే దివ్యమూర్తి కనిపిస్తుంది. సాధారణమూర్తి కాదు, దివ్యమూర్తి. ఈ రోజుల్లో సేవలో చాలా బిజీగా ఉన్నారు. ఏదైతే చేసారో అది చాలా మంచిగా చేసారు. ఇక సఫలతను సమీపంగా తీసుకురండి. ఎంతెంతగా ఒకరికొకరు సమీపంగా వస్తారో అంతగా సఫలత సమీపంగా వస్తుంది. ఒకరికొకరు సమీపంగా అనగా సంస్కారాలకు సమీపముగా రావడం, అప్పుడే ఏ సమ్మేళనమైనా సఫలమవుతుంది. సమయము ఎలా సమీపంగా వస్తూ ఉందో, అలా అందరూ సమీపంగా వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇటువంటి సమీపతలో ఏమి నింపాలి? సమీపత ఎంతగా ఉంటుందో అంతగా ఒకరికొకరు గౌరవమును ఇచ్చుకోవాలి. ఎంతగా ఒకరికొకరు గౌరవాన్ని ఇస్తారో అంతగానే మొత్తము విశ్వము మీ అందరికీ గౌరవమునిస్తుంది, గౌరవమును ఇవ్వటం ద్వారా గౌరవము లభిస్తుంది. ఇవ్వటం ద్వారానే లభిస్తుంది కానీ, తీసుకోవటం ద్వారా లభించదు. కొన్ని వస్తువులు తీసుకుంటే లభిస్తాయి, కొన్ని వస్తువులు ఇస్తే లభిస్తాయి. కావున ఎవరికైనా గౌరవమును ఇవ్వటము అనగా సర్వుల నుండి గౌరవమును తీసుకోవటము. భాషలో కూడా పరివర్తన అవసరము. ఈ రోజు అందరూ సేవాధారులు కూర్చుని ఉన్నారు కదా, అందుకని భవిష్యత్తు గురించిన సూచనను ఇస్తున్నాము. ఎప్పుడైనా ఎవరి ఆలోచనైనా స్పష్టంగా లేకపోయినాకానీ ఎప్పుడూ ‘కాదు’ అని చెప్పకూడదు. ఎల్లప్పుడూ ‘సరే’ అన్న మాటే వెలువడాలి. ఎప్పుడైతే ఇక్కడ హాజీ (సరేనండీ) అంటారో అప్పుడు అక్కడ సత్యయుగములో కూడా మీ ప్రజలు అంతగానే హాజీ, హాజీ అని అంటారు. ఒకవేళ ఇక్కడే కాదు, కాదు అని అంటుంటే అక్కడ కూడా ప్రజలు దూరము నుండే నమస్కారము చేస్తారు. కావున కాదు అన్న శబ్దమును తొలగించివేయాలి.
ఏ విషయమైనాగానీ మొదట సరే అని అనాలి. హాజీ, హాజీ అని అనటమే ఇతరుల సంస్కారములను సరళముగా చేసే సాధనము. అర్థమైందా! వర్తమాన సమయములో ఏ కర్మనైతే చేస్తున్నారో అది భవిష్యత్తులో లా(చట్టాలు)గా తయారవుతున్నాయి అని ఇంతకుముందు వినిపించి ఉన్నాము కదా. మీ అందరి కర్మలు భవిష్యత్తులో చట్టాలు. లా మేకర్స్ (న్యాయ రచయితలు) ఎవరైతే ఉంటారో వారు బాగా ఆలోచించి మాటలను మాట్లాడుతారు ఎందుకంటే వారి ఒక్కొక్క మాట భవిష్యత్తు కొరకు చట్టాలుగా తయారవుతాయి. అందరి ప్రతి సంకల్పము భవిష్యత్తులో చట్టాలుగా తయారవుతాయంటే ఎంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది! ఇప్పటివరకూ ఒక విషయాన్ని పట్టుకుంటారు, మరొక విషయాన్ని వదల్తుంటారు. కానీ రెండు విషయాలూ గుర్తు ఉండాలి. ఒక్కోసారి విధిని పట్టుకొని విధానాన్ని వదిలేస్తారు. ఒక్కోసారి విధానాన్ని పట్టుకుంటే విధిని వదిలేస్తారు. కానీ విధి మరియు విధానము రెండింటి ద్వారానే విధాత స్మృతి కలుగుతుంది. ఒకవేళ విధాతయే స్మృతిలో ఉన్నట్లయితే విధి మరియు విధానము రెండు కూడా స్మృతిలో ఉంటాయి. కానీ విధాతను మర్చిపోతే ఒకదానిని వదిలివేస్తారు. విధాత స్మృతిలో ఉన్నట్లయితే విధి మరియు విధానము రెండూ కలిసి ఉంటాయి. కానీ విధాతను మర్చిపోవటం ద్వారా ఒక్కోసారి విధానము తొలగిపోతే, ఒక్కోసారి విధి తొలగిపోతుంది. ఈ రెండూ కలిసి ఉన్నప్పుడే సఫలత మెడలోని హారంగా అయిపోతుంది. అచ్ఛా! ఈరోజు చాలా శిక్షణలను ఇచ్చాము, ఇది స్నేహము ఎందుకంటే బాప్దాదా సమానంగా చేయాలనుకుంటాము. సమానంగా అయ్యేందుకు సాధనము - స్నేహమే కదా.
ఇప్పుడు కుమారీల పరీక్షను తీసుకోవలసి ఉంది. సాహసమును ప్రత్యక్ష రూపములోకి తీసుకువచ్చేందుకు సాహసములో చాలా చాలా శక్తిని నింపాలి. ఇప్పుడు ఎంత శక్తి నిండి ఉంది అన్న పరీక్షను తీసుకుంటాము. అచ్ఛా!
పార్టీలతో: -
• ఎంతెంతగా మిమ్మల్ని మీరు సేవా బంధనంలో బంధించుకుంటూ ఉంటారో అంతగానే ఇతర బంధనాలు తొలగిపోతూ ఉంటాయి. ఈ ఫలానా బంధనము తొలగిపోతే సేవలో నిమగ్నులమైపోతామని అలా ఆలోచించకండి. అలా కాదు. సేవ చేస్తూ ఉండండి. బంధనము ఉన్నాకూడా స్వయమును సేవాబంధనంలో జోడిస్తూ ఉండండి. ఇలా జోడించటమే వదిలించుకోవటము. వదిలించుకున్న తరువాత జోడించటము జరుగదు. ఎంతగా జోడిస్తారో అంతగానే తెగుతుంది. స్వయమును ఎంతగా సేవలో సహయోగిగా తయారుచేసుకుంటారో అంతగానే ప్రజలు మీకు సహయోగులుగా అవుతారు. ఏదైనా కారణము ఉన్నాగానీ దానిని తేలికగా వదిలేసి, మొదట సేవా అవకాశమును ముందు ఉంచండి. కర్తవ్యమును ముందు ఉంచటము జరుగుతుంది. కారణాలు ఉంటూనే ఉంటాయి, కానీ కర్తవ్యబలము ద్వారా కారణము ఢీలాగా అయిపోతుంది.
• మాతల సంగఠనలు ఏవైతే తయారై ఉన్నాయో వాటిలోకి దూరిపోండి. మెంబరుగా అవ్వటం ద్వారా చాలామందిని తమ సమానంగా తయారుచేసే అవకాశము లభిస్తుంది. సంపర్కములోకి రావటం ద్వారానే అవకాశము లభిస్తుంది. ఇప్పుడు మాతల సంస్థలలో మీ పేరు ప్రసిద్ధమవ్వలేదు. మొదట గుప్త వేషములో కాలు మోపండి, తరువాత వారు మీవారిగా అయిపోతారు. భ్రమిస్తున్న మాతలకు దారి చూపించాలి. అప్పుడు, పాపం అత్యాచారాలను సహించే మాతలను కూడా మీరు రక్షించగలుగుతారు. చాలామంది మాతలు ఆధారాన్ని కోరుకుంటారు, వారికి ఆధారము లభించేస్తుంది. కావున ఈ సేవ చేసి అద్భుతమును చేసి చూపించినట్లయితే ఎన్ని హాండ్స్ లభిస్తాయో చూడండి! చాలా సమయం నుండి చేయకుండా ఉన్న ఈ విషయాన్ని ఇప్పుడు ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. వారు శరణమును ఇస్తారు కదా, అది అనాథ ఆశ్రమము, ఇదైతే సనాథ ఆశ్రమము. అచ్ఛా!
• అవ్యక్త స్థితి యొక్క అనుభవం జరుగుతుందా? ఒక్క సెకండైనా అవ్యక్త స్థితి అనుభవమైతే దాని ప్రభావం చాలా సమయం వరకు ఉంటుంది. అవ్యక్త స్థితి యొక్క అనుభవం పావర్ఫుల్గా ఉంటుంది. ఎంత వీలైతే అంత సమయం వ్యక్త భావాన్ని తొలగించి అవ్యక్త స్థితిలో ఉండండి. అవ్యక్త స్థితితో సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఇందులో శ్రమ తక్కువ మరియు ప్రాప్తి అధికంగా ఉంటుంది. వ్యక్త స్థితిలో స్థితులై చేసే పురుషార్థంలో శ్రమ అధికం, ప్రాప్తి తక్కువగా ఉంటుంది. అప్పుడు నడుస్తూ నడుస్తూ గందరగోళంగా, నిరాశగా అనిపిస్తుంది. కనుక అవ్యక్త స్థితితో సర్వ ప్రాప్తుల అనుభవాన్ని పెంచుకోండి. అవ్యక్తమూర్తిని ఎదురుగా చూస్తూ సమానంగా అయ్యే ప్రయత్నం చేయండి. ఎలా బాబానో అలా పిల్లలు. ఈ స్లోగన్ గుర్తుంచుకోండి. అంతరం (తేడా) ఉండకూడదు. అంతరాన్ని అంతర్ముఖులై తొలగించండి. బాబా ఎప్పుడైనా నిరాశ చెందుతారా? పరిస్థితులను చూసి గాభరా పడతారా? మరి పిల్లలు ఎందుకు గాభరా పడతారు? ఎక్కువ పరిస్థితులను ఎదుర్కున్న రుజువును సాకారుడు ఇచ్చారు. ఎప్పుడైనా వారి గాభరా రూపాన్ని చూసారా? స్నేహంలో సంపూర్ణంగా అవ్వాలి అని వినిపించాము కదా. ఏమీ కష్టం కాదు. స్నేహితుడికి స్పృహ ఉంటుందా? స్వయాన్నే మాయం చేసినప్పుడు ఇక కష్టమేమి ఉంటుంది? తొలగించేసారు కదా. తొలగించబడినది కాలిపోతుంది. ఎంతగా స్వయాన్ని తొలగిస్తారో అంతగా అవ్యక్త రూపంతో కలవడము. తొలగించడము తక్కువైతే కలవడము కూడా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మేళాలో కూడా ఎవరైనా మిలనం చేసుకోకపోతే మేళా సమాప్తమైన తర్వాత మళ్ళీ ఎప్పుడు మిలనం జరుగుతుంది? స్నేహాన్ని సమానతలోకి మార్చండి. స్నేహాన్ని గుప్తంగా, సమానతను ప్రత్యక్షంగా చేయండి. మళ్ళీ ఎప్పుడు మిలనం జరుగుతుంది? అన్నీ ఇమడి ఉన్నాయి, కేవలం ప్రత్యక్షం చేయండి. మీ కల్ప క్రితపు సంస్కారాలను ప్రత్యక్షం చేయండి. కల్ప క్రితపు మీ సఫలత స్వరూపం గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు కేవలం మీలో ఇమిడి ఉన్న దానిని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురండి. సదా మీ సంపూర్ణత స్వరూపాన్ని మరియు భవిష్య 21 జన్మల రూపాన్ని మీ ముందుకు తీసుకురండి. కొందరు తమ ఇంటిని అలంకరించుకోవడానికి తమ బాల్యం నుండి ఉన్న భిన్న భిన్న రూపాల చిత్రాలను గుర్తుగా పెట్టుకుంటారు. అలాగే మీరు మీ మనసు అనే మందిరంలో మీ సంపూర్ణ స్వరూప మూర్తిని, భవిష్యత్తులోని అనేక జన్మల మూర్తులను స్పష్ట రూపంలో మీ ఎదురుగా తీసుకురండి. అప్పుడు ఇతర ఏ వైపులకు సంకల్పాలు వెళ్ళవు.
సమీప రత్నాల లక్షణాలు ఏమిటి? ఎవరు ఎంతగా ఎవరి సమీపంగా ఉంటారో అంతగా సంస్కారాలలో కూడా వారి సమానంగా ఉంటారు. మరి బాప్దాదాకు సమీపము అంటే లక్షణాలకు సమీపంగా రండి. ఎంతగా చెక్ చేసుకుంటారో అంత త్వరగా ఛేంజ్ అవుతారు. ఆది స్వరూపాన్ని స్మృతిలో పెట్టుకోండి. సత్యయుగ ఆది మరియు మరుజీవ జీవిత ఆది రూపాన్ని స్మృతిలో పెట్టుకుంటే మధ్యమము ఇమిడిపోతుంది.
స్నేహియా లేక సహయోగి కూడానా మీరు? ఎవరిపై స్నేహము ఉంటుందో వారికి రిటర్నులో ఏమి ఇస్తారు? స్నేహానికి రిటర్ను సహయోగము. అది ఎప్పుడు ఇస్తారు? ఎలా అయితే బాబా సర్వ సమర్థుడో అలాగే పిల్లల కూడా మాస్టర్ సర్వ సమర్థులుగా అవ్వాలి. వినాశనంకన్నా ముందే స్నేహంతో పాటు సహయోగిగా అయితే వారసత్వానికి అధికారులుగా అవుతారు. వినాశన సమయంలో సర్వాత్మలు గుర్తించినప్పటికీ వారసత్వాన్ని పొందలేరు ఎందుకంటే సహయోగిగా అవ్వలేకపోయారు.
• కర్మ బంధనం శక్తిశాలియా లేక ఈ ఈశ్వరీయ బంధనమా? ఈశ్వరీయ బంధనాలను ఎక్కువ చేసుకుంటే కర్మ బంధనాలు వాటంతటవే ఢీలా పడిపోతాయి. బంధనంతో బంధనం తొలగుతుంది. ఎంతగా ఈశ్వరీయ బంధనంలో బంధింపబడతారో అంతగా కర్మ బంధనాలు తొలగుతాయి. ఎంతగా ఆ కర్మ బంధనం పక్కాగా ఉంటుందో అంతే పక్కాగా ఈశ్వరీయ బంధనం ఉండాలి, అప్పుడు ఆ బంధనం త్వరగా తొలగుతుంది.
• బిందు రూపంలో ఒకవేళ ఎక్కువగా స్థితి అవ్వలేకపోతే దాని వెనుక సమయాన్ని వృధా చేసుకోకండి. ముందుగా శుద్ధ సంకల్పాల అభ్యాసం ఉన్నప్పుడు బిందు రూపంలో స్థితి కాగలరు. అశుద్ధ సంకల్పాలను శుద్ధ సంకల్పాలతో తొలగించండి. ఎప్పుడైనా ప్రమాదం జరగబోయే సమయంలో బ్రేకు పడకపోతే బండిని తిప్పవలసి ఉంటుంది. బిందు రూపము బ్రేకు వంటిది. ఒకవేళ బిందు రూపము అనే బ్రేకు పడకపోతే వ్యర్థ సంకల్పాల నుండి బుద్ధిని తిప్పి శుద్ధ సంకల్పాలలో పెట్టండి. ఒక్కోసారి రక్షణ కోసం బ్రేకు వేయని సందర్భాలు కూడా ఉంటాయి. బండిని తిప్పవలసి వస్తుంది. రోజంతా శుద్ధ సంకల్పాలు తప్ప ఎటువంటి వ్యర్థ సకంల్పాలు రాకుండా ఉండేలా చూసుకోండి. ఈ సబ్జెక్టులో పాస్ అయితే బిందు రూప స్థితి సహజంగా ఉంటుంది.