Search for a command to run...
13 Nov 1969
బాప్దాదా ఆశలు – క్వాంటిటీకి బదులు క్వాలిటీవారిగా అవ్వండి మరియు తయారు చేయండి
13 November 1969 · తెలుగు
అశరీరిగా అయ్యి మళ్ళీ శరీరంలోకి వచ్చే అభ్యాసము పక్కాగా అవుతూ ఉంటుంది. ఎలా అయితే బాప్దాదా అశరీరి నుండి శరీరంలోకి వస్తారో అలాగే పిల్లలైన మీరందరూ కూడా అశరీరిగా అయి శరీరంలోకి రావాలి. అవ్యక్త స్థితిలో స్థితి అయి, తర్వాత వ్యక్తంలోకి రావాలి. ఇటువంటి అభ్యాసాన్ని రోజురోజుకీ పెంచుతూ ఉన్నారా? బాప్దాదా వచ్చినప్పుడు ఎవరిని కలవడానికి వస్తారు? (ఆత్మలను) ఎటువంటి ఆత్మలు? పూర్తి విశ్వంలోనే శ్రేష్ఠ ఆత్మలు, ఆ శ్రేష్ఠ ఆత్మలను కలవడానికి బాప్దాదా వస్తారు. మేము పూర్తి విశ్వంలోనే శ్రేష్ఠ ఆత్మలము అన్న నషా ఉంటుందా? శ్రేష్ఠ ఆత్మలకే సర్వ శక్తిమంతుడిని కలుసుకునే సౌభాగ్యము ప్రాప్తిస్తుంది. మరి బాప్దాదా భృకుటి మధ్యలో మెరుస్తున్న సితారనే చూస్తున్నారు. సితారలైన మిమ్మల్ని ఏ ఏ పేర్లతో పిలుస్తాము? ఒకటైతే లక్కీ సితారలు, కంటి సితారలు కూడా, ఇంకా ఏ సితారలు మీరు? ఇప్పుడు ఏ కర్తవ్యము అయితే మిగిలి ఉందో ఆ పేరు మీదున్న సితారలను మర్చిపోయారు. కష్టమైన పనిని మర్చిపోయారు. మీ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. బాప్దాదా యొక్క ఆశా సితారలు. బాప్దాదా ఏదైతే చెప్పారో ఆ కార్యము ఇప్పుడు ఇంకా మిగిలి ఉంది. బాప్దాదా పిల్లలపై ఏ ఆశలనైతే ఉంచారో ఆ కార్యం పూర్తయిందా? ఒక్కొక్కరు అనేకులకు పరిచయాన్ని ఇచ్చి వారిని యోగ్యులుగా చేయాలన్నది బాప్దాదాకు ఉన్న ఆశ. ఒక్కరి నుండే అనేకులు తయారవుతారు. నేను ఇలా అయ్యానా అని స్వయాన్ని పరిశీలించుకోండి. అనేకులను తయారు చేసారా? అందులో కూడా క్వాంటిటీ (సంఖ్య) అయితే తయారువుతున్నారు, క్వాలిటీ (నాణ్యత) తయారు చేయాలి, క్వాంటిటీ తయారవ్వడం సహజము కానీ క్వాలిటీవారిని తయారు చేయడము – ఈ ఆశ బాప్దాదా సితారలపై పెట్టుకున్నారు. ఇప్పుడు కార్యము మిగిలి ఉంది, క్వాలిటీని తయారు చేయాలి. క్వాంటిటీ తయారు చేయడమైతే జరుగుతూనే ఉంది. క్వాలిటీతో ఉన్న ఒక్క ఆత్మ క్వాంటిటీని స్వతహాగానే తెస్తుంది. క్వాలిటీ ఉన్న ఒక్కరు అనేకులను తీసుకురాగలరు. క్వాలిటీ, క్వాంటిటీని తీసుకువస్తుంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఈ కార్యమునే పూర్తి చేయాలి. మీరు చేసే సేవా క్వాలిటీతో మీరు సంతుష్టంగా ఉన్నారా? క్వాంటిటీని చూసి సంతోషపడతారు, కానీ క్వాలిటీని ఎలా తీసుకువస్తారు? ఎంతెంతగా ఇందులో డివైన్ క్వాలిటీ ఉంటుందో అంతగా క్వాలిటీవారిని తెస్తారు. కొంతమంది పిల్లలకు అన్ని రకాల శ్రమలను చేయవలసి వస్తుంది. తమ పురుషార్థంలో కూడా, సేవలో కూడా. కొందరు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది, కొందరు తక్కువ. ఇందుకు కారణము ఏమిటి? వారికే ఒకసారి కష్టంగా అనిపిస్తుంది మరోసారి వారికే సహజమనిపిస్తుంది. ఇలా ఎందుకు? ధారణలో లోపం ఉన్న కారణంగా కష్టమనిపిస్తుందా? కొన్ని పనులలో అయితే, వీరి భాగ్యంలో లేనే లేదు అని లోకులు అంటారు కదా, కానీ ఇక్కడ అటువంటి విషయము లేదు. విశేషంగా ఏ లోటు ఉన్న కారణంగా కష్టంగా అనిపిస్తుంది? శ్రీమతంపై నడవాలి. అయినాగానీ ఎందుకు నడవలేకపోతున్నారు? ఏ పనిలోనైనా - పురుషార్థం కావచ్చు, సేవ కావచ్చు, కష్టంగా అనిపిస్తుంది అంటే అందుకు కారణము, విషయాలైతే అన్నీ బుద్ధిలో ఉన్నాయి కానీ వీటి మహీనతలోకి వెళ్ళడం లేదు. మహీన్ బుద్ధి ఉన్నవారికి ఎప్పుడూ మెహనత్ (కష్టము) అనిపించదు. మంద బుద్ధి ఉన్న కారణంగా చాలా కష్టం అనిపిస్తుంది. శ్రీమతంపై నడవడానికి కూడా మహీన్ బుద్ధి కావాలి. మహీనతలోకి వెళ్ళే అభ్యాసము చేయాలి. అంటే, మరో విధంగా చెప్పాలంటే, ఏది విన్నారో అది చేయాలి అనగా దాని మహీనతలోకి వెళ్ళాలి అని చెప్తాము. పెరుగును బాగా చిలికి పల్చగా చేసినప్పుడే అందులోనుండి వెన్న వస్తుంది కదా, అలాగే ఇక్కడ కూడా మహీనతలోకి వెళ్ళే విషయము ఉంది. మహీనత లోపించిన కారణంగా మెహనత్ అనిపిస్తుంది. మహీనతలో వెళ్ళేందుకు బదులు ఆ విషయాన్ని మంద రూపంలో చూస్తున్నారు. సేవ సమయంలో కూడా మహీన్ బుద్ధి ఉండాలి, జ్ఞాన మహీనతలోకి వెళ్ళి వారికి వినిపించండి మరియు ఆ జ్ఞాన లోతులలోకి వారిని తీసుకువెళ్ళండి, అప్పుడు వారికి కూడా కష్టం తక్కువగా అనిపిస్తుంది. మీకు కూడా తక్కువ కష్టంగా అనిపిస్తుంది. ఈ మహీనతయే లోపిస్తుంది. ఇప్పుడు ఇదే పురుషార్థాన్ని చేయండి.
శారీరక శక్తి కూడా ఎప్పుడు వస్తుంది? భోజనాన్ని మహీనంగా, సూక్ష్మంగా చేసి తిన్నప్పుడు భోజనము శక్తిగా మారుతుంది. భోజనము సూక్ష్మంగా తయారైతే ఏ రూపంలో ఉంటుంది? రక్తము. రక్తము తయారైనప్పుడు శక్తి వస్తుంది. కనుక ఇప్పుడు కేవలం బాహ్య, పైపై రూపాన్ని చూడకుండా లోపలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎంతగా ప్రతి విషయంలో లోపలకు వెళ్తారో, అంతగా రత్నాలను చూస్తారు మరియు ప్రతి విషయము యొక్క విలువ అర్థమవుతుంది. ఎంతగా జ్ఞాన విలువ, సేవ విలువ తెలుస్తుందో అంతగా మీరు విలువైన రత్నంగా అవుతారు. జ్ఞాన రత్నాల విలువను తగ్గించినప్పుడు స్వయం కూడా విలువైనవారిగా అవ్వలేరు. ఒక్కొక్క రత్నం యొక్క విలువను పరిశీలించే ప్రయత్నం చేయండి. మీరు బాప్దాదాకు విలువైన రత్నం కదా! విలువైన రత్నాన్ని ఏమి చేస్తారు? (దాచి పెడ్తాము) మరి బాప్దాదాకు విలువైన రత్నాలను బాప్దాదా దాచిపెడ్తారు. మాయ నుండి దాచిపెడ్తారు. మాయ నుండి దాచిపెట్టి ఎక్కడ పెడతారు? ఎంతెంతగా విలువైన రత్నంగా అవుతారో అంతంతగా బాప్దాదా హృదయ సింహాసనంపై నివసిస్తారు. హృదయ సింహాసనాధికారులుగా అయినప్పుడు రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. మరి సంగమయుగంలో ఉన్న సింహాసనం ఏమిటి? సింహాసనం ఉందా లేక పేదవారా? సంగమయుగంలో ఏ సింహాసనం లభించింది? బాప్దాదా హృదయ సింహాసనము. ఇది ప్రపంచంలోని అన్ని సింహాసనాలలోకెల్లా శ్రేష్ఠమైనది. సత్యయుగంలో ఎంత పెద్ద సింహాసనం లభించినా కానీ ఈ సింహాసనం ముందు అది ఏమిటి? ఈ సింహాసనంపై ఉంటే మాయ ఏమీ చేయలేదు. దీనినుండి ఎక్కడము దిగడము చేయకండి. దీనిపై ఉంటే మాయ యొక్క సర్వ బంధనాల నుండి ముక్తులవుతారు. అచ్ఛా.
ఓంశాంతి