Search for a command to run...
16 Jun 1969
అతి పెద్ద త్యాగము – అవగుణాల త్యాగము
16 June 1969 · తెలుగు
అందరూ ఏ స్వరూపంలో కూర్చున్నారు? స్నేహ రూపంలో కూర్చున్నారా లేక శక్తి రూపంలో కూర్చున్నారా? ఈ సమయంలో ఏ రూపము ఉంది? స్నేహంలో శక్తి ఉంటుంది. రెండూ కలిసి ఉండగలవా? రెండు రూపాలు ఉన్నాయి అని ఎందుకు చెప్పడం లేదు? బాప్దాదాపై స్నేహము ఎందుకు ఉంది? బాప్దాదాపై స్నేహము ఎందుకని ఉందంటే బాప్దాదా యొక్క ముఖ్య టైటిల్ ప్రకారంగా మీరు ఆ సమానంగా అవ్వాలి. ముఖ్య టైటిల్ ఏమిటి? (సర్వశక్తిమంతుడు). మరి కేవలం స్నేహం ఉంటే అది ఎప్పుడైనా తగ్గవచ్చు కానీ స్నేహంతో పాటు శక్తి కూడా కలిసి ఉంటే, ఎక్కడ రెండింటి సంగమము ఉంటుందో అక్కడ ఆత్మ పరమాత్మల సంగమము కూడా అవినాశిగా, అమరంగా ఉంటుంది. మీ ఈ మిలనాన్ని అవినాశిగా చేసుకోవడానికి ఏ సాధన చేయవలసి ఉంటుంది? స్నేహము మరియు శక్తి రెండింటి సంగమము మీ లోపల ఉండాలి – అప్పుడే ఆత్మ పరమాత్మల మిలనము అని చెప్పగలము. మేళలో అయితే కూర్చున్నారు, కానీ కొందరు మేళాలో కూర్చున్నప్పటికీ రెండింటి సంగమాన్ని మర్చిపోతున్నారు. అచ్ఛా – ఈరోజు ప్రత్యేకంగా కుమారీల కోసమే వచ్చాము. ఈరోజు కుమారీలకు ఏ దివసము? (మిలన దివసము). మీ అందరి రిజల్టు కూడా వచ్చింది. మీ రిజల్టును మీరే స్వయంగా తెలుసుకోగలరా? త్రికాలదర్శిగా అయ్యారా? ఈ గ్రూపులో నంబరువన్ కుమారిగా ఎవరు వచ్చారు? (చంద్రిక) నంబరువన్ వచ్చిన వారి కర్తవ్యము – తమ సమానంగా నంబరువన్గా తయారు చేయడము. కుమారీలు ఇప్పుడు మరో పేపరును వ్రాయవలసి ఉంది. అది ప్రాక్టికల్ పేపరు, వ్రాసేది కాదు. ఇప్పుడైతే ఒక నెల ట్రైనింగులో నంబరువన్ వచ్చారు. కానీ ఫైనల్ రిజల్టులో కూడా నంబరువన్ రాగలరు. అయితే అందుకోసం ఏ ముఖ్య విషయాన్ని బుద్ధిలో పెట్టుకోవాలి? త్యాగము మరియు సేవ అయితే ఉన్నాయి, మరో ముఖ్యమైన విషయము ఉంది. అన్నిటికన్నా పెద్ద బలిదానము ఏమిటి మరియు అన్నిటికన్నా పెద్ద త్యాగము ఏమిటి? ఇతరుల అవగుణాలను త్యాగము చేయడము – ఇదే పెద్ద త్యాగము. అన్నిటికన్నా పెద్ద సేవ ఏమిటి? ఎవరైతే శ్రేష్ఠ సేవాధారిగా ఉన్నారో వారు ముఖ్యంగా ఏ సేవను చేస్తారు? ఎవరైతే తీవ్ర పురుషార్థీలు ఉన్నారో, వారు తీవ్ర పురుషార్థానికి ఏ రుజువును చూపిస్తారు? ఎవరు ఎదురుగా వచ్చినా కానీ ఒక్క సెకండులో వారిని మరుజీవులుగా చేయాలి. ఒక్క దెబ్బతో మరుజీవిగా అయ్యారు అంటారు కదా, దీనినే ఒక్క దెబ్బకు మరణించారు (ఝట్కూ) అంటారు. అసంపూర్ణంగా విడిచిపెట్టకండి. వారిని వెంటనే ఝాట్కూ చేయడమే శ్రేష్ఠమైన సేవ. ఇప్పుడైతే మీరు బాణం వేస్తున్నారు, బయటకు వెళ్ళాక మళ్ళీ బ్రతుకుతున్నారు. కానీ, ఒక్క సెకండులో దృష్టితో ప్రసన్నం చేసే రోజు కూడా వస్తుంది అప్పుడు సేవ యొక్క సఫలత మరియు ప్రభావము వస్తాయి. ఇప్పుడు మరుజీవులుగా చేస్తున్నప్పటికీ, ఝాట్కూగా చేయడం లేదు. రెండు విషయాల లోపం ఉంది. పరిస్థితులు వస్తే మీ రంగును ఇతరులకు వేయగలరా? మీరు ఝాట్కూగా అయ్యారా? (పురుషార్థీలము) అక్కడక్కడ పొరపాట్లు జరుగుతుంటే వారిని పురుషార్థీలు అని అంటామా? ఈరోజు నుండి, మేము ఝాట్కూగా అయిపోయాము, మళ్ళీ పాత ప్రపంచంలో బ్రతకము అని ప్రతిజ్ఞ చేయండి. ధైర్యవంతులకు సహాయం కూడా లభిస్తుంది. ధైర్యం కారణంగా బాప్దాదా స్నేహము కూడా ఉంటుంది. రెండు విషయాల లోపం గురించి చెప్తున్నాము కదా, ఒక ముఖ్యమైన విషయం – ఏకాంతవాసిగా తక్కువగా ఉంటున్నారు. రెండవ లోపము – ఏకత(ఐకమత్యము)లో తక్కువగా ఉంటున్నారు. ఏకత మరియు ఏకాంతములో చాలా కొద్ది తేడానే ఉంది. ఏకాంతము స్థూలంగా కూడా ఉంటుంది, సూక్ష్మంగా కూడా ఉంటుంది. ఇక్కడ రెండూ అవసరము. ఏకాంతములోని ఆనందాన్ని అనుభవం చేస్తే ఇక బాహ్యముఖత మంచిగా అనిపించదు. ఇప్పుడు బాహ్యముఖతపై అందరికీ ఎక్కువ ఆసక్తి ఉంది. మెజారిటీలో ఈ రెండు విషయాల లోటు ఉంది. అవ్యక్త స్థితిని పెంచుకోవడానికి వీటి ఆవశ్యకత చాలా ఉంది. కనుక ఏకాంతంలో ఉండటంపై ఎక్కువ అభిరుచి పెట్టుకోండి. ప్రాక్టికల్ కోర్సును ఇవ్వడానికి ఇప్పుడు కుమారీలు వెళ్ళాలి.
ఇప్పుడు కుమారీలకు మూడు బహుమతులను ఇవ్వాలి. బహుమతి స్నేహానికి గుర్తు. మరి మూడు సంబంధాలకు మూడు బహుమతులను ఇస్తాము. వీటిని ఎప్పుడూ మర్చిపోవద్దు. బాప్దాదా ఇచ్చే కానుకను సదా మీతోటే పెట్టుకోండి. బహుమతిని భద్రంగా దాచిపెట్టుకోవలసి ఉంటుంది కదా. మరి తండ్రి రూపంలో ఒక శిక్షణ యొక్క కానుకను గుర్తుంచుకోండి. ఏ శిక్షణ ఇస్తున్నారు – సదా బాప్దాదా మరియు నిమిత్తమైన సోదరీలు, దైవీ పరివారము అందరితో ఆజ్ఞాకారిగా, నమ్మకంగా నడుచుకోవాలి, ఇది తండ్రి రూపంలో ఇచ్చే శిక్షణ యొక్క కానుక. తర్వాత టీచరు రూపంలో ఎటువంటి శిక్షణ యొక్క కానుకను ఇస్తాము? శిక్షణను గ్రహించవలసి ఉంటుంది కదా. ఎక్కడకు వెళ్ళినా కానీ టీచరు రూపంలో, ఒకటి జ్ఞానాన్ని గ్రహించాలి, రెండు గుణగ్రాహకులు, ఈ శిక్షణను ఎప్పటికీ గుర్తుంచుకోండి. గురువు రూపంలో ఇచ్చే శిక్షణ – సదా ఏకమతంతో ఉండండి, ఏకరసము మరియు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. విష్ణువుకు చూపించిన అలంకారాలను ఇప్పుడు శక్తి రూపంగా ధారణ చేయాలి. ఈ అలంకారాలను సదా మీ ముందుంచుకోండి. ఇవే తండ్రి, టీచరు మరియు గురువు మూడు సంబంధాలలో ఇచ్చే శిక్షణ యొక్క బహుమతులు – ప్రత్యేకంగా కుమారీల కోసం. ఈ బహుమతులను ఎవరెవరు తమతో పెట్టుకుంటారో చూస్తాము.
వారు కూడా రిఫైన్ బాంబులను తయారు చేస్తున్నారు కదా. మీరు కూడా ఇప్పుడు రిఫైన్ బాంబులను వేయాలి. చీమ మార్గపు సేవను చాలా చేసారు. బాంబు వేస్తే వెంటనే శుభ్రమైపోతుంది. కనుక విశేషంగా సందేశాన్ని వ్యాప్తి చేసే సేవను బాంబు వేయడము అంటాము. ఎవరు ఎంతగా రిఫైన్గా ఉంటారో అంతగా రిఫైన్ బాంబును వేస్తారు-ఇతరులపై. ఎంతెంతగా రిఫైన్ అవుతారో అంతంతగా సత్యయుగ పరివారానికి సమీపంగా వస్తారు. ఆల్రౌండ్ చక్రాన్ని చుట్టి తమ షో చేయాలి – అప్పుడే ట్రైనింగు రిజల్టు వచ్చింది అంటాము. ప్రాక్టికల్ కోర్సు తర్వాత రిజల్టును చూస్తాము. ఇప్పుడు మళ్ళీ ఒక నెల తర్వాత మధుబనానికి వస్తే ఒంటరిగా రాకండి. ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి కాలేదు. ఇంకా ప్రాక్టికల్ ఉంది. ఒంటరిగా ఎవ్వరూ తిరిగి వచ్చేది లేదు. ఎవరో ఒకరికి పండాగా(మార్గదర్శిగా) అయ్యి రావాలి, యాత్రికులను తీసుకురావాలి. బాప్దాదాకు ఈ కుమారీలపై ఎంతో ఆశ ఉంది. ఆశాజనక రత్నాలను బాప్దాదా నయనాలలో పెట్టుకుంటారు. అచ్ఛా!
ఓంశాంతి