Search for a command to run...
18 Jun 1969
పాత శూద్ర సంస్కారాలను ముట్టనివారే మరుజీవులు
18 June 1969 · తెలుగు
(పార్టీలతో మిలనము)
1. మీరందరూ పాఠశాలకు వెళ్తున్నారు. పాఠశాలలోని మొదటి పాఠము ఏమిటి? స్వయాన్ని మరుజీవిగా చేసుకోవడము అనగా తమ దేహముతో, బంధుమిత్రులతో, పాత ప్రపంచంతో మరుజీవిగా అవ్వడము. ఈ మొదటి పాఠాన్ని పక్కాగా చేసుకున్నారా? (సంస్కారాలతో మరుజీవులుగా అవ్వలేదు) ఎవరైనా మరణిస్తే గత సంస్కారాలు కూడా సమాప్తమైపోతాయి. మరి ఇక్కడ కూడా గత సంస్కారాలు ఎందుకు గుర్తుకు రావాలి? జన్మయే మరో జన్మ అయినప్పుడు గత విషయాలు కూడా సమాప్తమైపోవాలి. మరుజీవులుగా అవ్వడమే మొదటి పాఠము. అది పక్కా చేసుకోవాలి. గత పాత సంస్కారాలు వేరే ఎవరివో, నావి కావు అన్నట్లుగా అనిపించాలి. మునుపు శూద్రులుగా ఉన్నాము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. మరి పాత శూద్ర సంస్కారాలు ఉండకూడదు. పరాయి సంస్కారాలను మీవిగా ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరైతే పరాయి వస్తువులను తమవిగా చేసుకుంటారో వారిని ఏమంటారు? దొంగ. మరి ఈ దొంగతనం కూడా ఎందుకు చేస్తున్నారు? ఇవైతే శూద్రుల సంస్కారాలు, బ్రాహ్మణులవి కావు. శూద్రుల వస్తువును బ్రాహ్మణులు ఎందుకు స్వీకరిస్తున్నారు? అంటరానివారి బట్టలు అంటుకున్నా వెళ్ళి స్నానం చేస్తారు. మరి శూద్ర సంస్కారాలు బ్రాహ్మణులకు తగిలితే ఏమి చేయాలి? అందుకోసం పురుషార్థం చేయాలి. చెడు వస్తువును ముట్టుకోనట్లుగా పాత సంస్కారాలనుండి జాగ్రత్తగా ఉండాలి. ఇంతగా ఎప్పుడైతే శ్రద్ధ పెడతారో అప్పుడే ఇతరులకు కూడా శ్రద్ధను ఇప్పించగలరు.
2. సేవలో సఫలతకు కావలసిన ముఖ్య గుణము ఏమిటి? నమ్రత. ఎంత నమ్రత ఉంటుందో అంత సఫలత. నిమిత్తంగా అయితేనే నమ్రత వస్తుంది. నిమిత్తంగా భావించి సేవను చేయండి. నమ్రత గుణంతో అందరూ మీ ముందు నమస్కారం చేస్తారు. ఎవరైతే స్వయం వంగుతారో వారి ముందు అందరూ వంగుతారు. నిమిత్తంగా భావించి కార్యము చేయండి. ఎలా అయితే బాబా నిమిత్తమాత్రంగా అయ్యి శరీర ఆధారాన్ని తీసుకుంటారో అలా మీరు కూడా నిమిత్తమాత్రంగా శరీర ఆధారాన్ని తీసుకున్నామని భావించండి. ఒకటి శరీరాన్ని నిమిత్తమాత్రంగా భావించాలి, రెండు సేవలో స్వయాన్ని నిమిత్తంగా భావించాలి, అప్పుడే నమ్రత వస్తుంది. అప్పుడు చూడండి, సఫలత మీ ముందే నడుస్తుంది. ఎలా అయితే బాప్‌దాదా టెంపరరీగా దేహంలోకి వస్తారో అలాగే దేహాన్ని నిమిత్త ఆధారంగా భావించండి. బాప్‌దాదాకు దేహంపై మోహము (అటాచ్మెంటు) ఉంటుందా? ఆధారము అనుకుంటే అధీనులు అవ్వరు. ఇప్పుడు దేహానికి అధీనులుగా ఉంటున్నారు, తర్వాత దేహాన్ని అధీనం చేసుకుంటారు.
3. దృష్టితో సృష్టి అన్న గాయనము ఉంది. ఎటువంటి సృష్టి తయారవుతుంది, ఎప్పుడు తయారవుతుంది? దృష్టి మరియు సృష్టి యొక్క గాయనమే ఎందుకు ఉంది, నోటి గాయనము ఎందుకు లేదు? సంగమంలో ముందుగా దేనిని పరివర్తన చేస్తున్నారు? మొదటి పాఠము ఏమి చదివించాము? సోదర దృష్టి అనగా ముందుగా దృష్టిని మార్చుకుంటే అన్ని విషయాలు మారిపోతాయి. అందుకే దృష్టితో సృష్టి తయారవుతుంది అన్న గాయనము ఉంది. ఆత్మను చూసినప్పుడు ఈ సృష్టి పాతదిగా కనిపిస్తుంది. దృష్టి మార్చుకోవడమే ఇక్కడ చేయవలసిన ముఖ్యమైన పురుషార్థము. దృష్టి మారితే గుణాలు మరియు కర్మలు వాటంతటవే మారిపోతాయి. ఈ ఆత్మిక దృష్టి నేచురల్‌గా అవ్వాలి.
4. ఎవరైతే సంగమయుగంలో తమపై రాజుగా అవుతారో వారు ప్రజలకు కూడా రాజుగా అవ్వగలరు. ఎవరైతే తమపై రాజుగా అవ్వరో వారు అక్కడ ప్రజలకు రాజుగా అవ్వలేరు. సంగమయుగంలోనే అన్ని సంస్కారాలకు బీజము పడుతుంది. ఇక్కడి బీజము లేకుండా భవిష్య వృక్షము పెరగదు. ఇక్కడ బీజము వేయకపోతే పుష్పాలు ఎలా వస్తాయి? ఇక్కడ తమపై రాజుగా అవ్వడం వలన ఏమి జరుగుతుంది? స్వయాన్ని అధికారిగా భావిస్తారు. అధికారిగా అవ్వడానికి ఉదారచిత్తము అనే విశేష గుణము కావాలి. ఎంతగా ఉదారచిత్తము ఉంటుందో అంతగా అధికారిగా అవుతారు.
5. బ్రాహ్మణుల ముఖ్య కర్తవ్యము – చదవడము మరియు చదివించడము. ఇందులో బిజీగా ఉంటే మిగతా విషయాల వైపుకు బుద్ధి వెళ్ళదు. కనుక, చదవడము మరియు చదివించడములో స్వయాన్ని బిజీగా పెట్టుకోండి. మనసా వృత్తి మరియు అవ్యక్త దృష్టితో సేవ చేయవచ్చు అని బాప్‌దాదా వినిపించారు. మీ వృత్తి-దృష్టితో సేవ చేయడంలో ఎటువంటి బంధనము లేదు. ఏ విషయంలో స్వతంత్రులుగా ఉన్నారో ఆ సేవను చేయాలి.
ఓంశాంతి