Search for a command to run...
18 May 1969
ఆత్మిక జ్ఞాన యోగాల జ్యోతిష్యుడు
18 May 1969 · తెలుగు
మీ అందరూ పిలిచారా లేక బాప్దాదా మీ అందరినీ పిలిచారా? ఎవరు ఎవరిని పిలిచారు? మేము ప్రతి క్షణము ప్రతి పరిస్థితిలో ఎవరెడీగా మరియు ఆల్రౌండ్గా ఉండాలి అన్న విషయాన్ని బాబా కర్తవ్యంలో నిమిత్తంగా ఉన్నవారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ రెండు విషయాలు అందరిలో వచ్చేస్తే సేవలో శ్రేష్ఠమైన రుజువు రాగలదు. కానీ ఈ విషయాలు నంబరువారీ పురుషార్థం అనుసారంగా ఉన్నాయి. మేము ఏ కర్మను చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అన్న స్లోగన్ను నిమిత్తంగా ఉన్న పిల్లలు గుర్తుంచుకోవాలి. ప్రతి క్షణము స్వయం గురించి ఇలా భావించాలి. డ్రామా స్టేజీపై అందరి ముందు పాత్రను పోషిస్తున్నాము అని భావించండి. ఒకటి ఉంటుంది స్వయంతో రిహార్సల్, ఇంకొకటి ఉంటుంది స్టేజీపై అందరి ముందు పాత్రను పోషించడము. స్టేజీపై నటించేవారికి స్వయంపై ఎంతో అటెన్షన్ ఉంటుంది. ఒక్కొక్క నటనపై ప్రతి సమయము అటెన్షన్ ఉంటుంది. చేతుల మీద, కాళ్ళ మీద, కళ్ళమీద అన్నింటిపై ధ్యాస ఉంటుంది. ఒకవేళ ఏదైనా విషయం తేడాగా ఉంటే నటుడి నటనకు అది శోభించదు. మరి స్వయాన్ని అలా భావించి నడుచుకోండి.
మూడు నిమిషాల రికార్డును నింపేటప్పుడు ఎంతో శ్రద్ధను పెడ్తారు. మీరందరూ కూడా 21 జన్మలకు మీ రికార్డును నింపుకుంటున్నారు కనుక ఎంతో శ్రద్ధను ఉంచాలి. రికార్డులో కొంచెం తేడా వచ్చినా కానీ ఆ రికార్డు ఎప్పటికీ వృధా అయిపోతుంది. మీది కూడా, 21 జన్మల కోసం సత్యయుగ రాజధాని కోసం ఏ రికార్డును అయితే నింపుతున్నారో అది రద్దు కాకూడదు. రద్దు అయితే దూరమైపోతారు. మా ప్రతి కర్మపై అందరి కళ్ళు ఉన్నాయి అని అందరూ ఆలోచించండి. తనను అందరూ చూస్తున్నారు అంటే నటుడికి తనపై మరింత శ్రద్ధ పెరుగుతుంది, చూసేవారు ఎవ్వరూ లేరంటే నిర్లక్ష్యం ఉంటుంది. మేము ఒంటరిగా ఉండి ఏదైనా చేస్తున్నాగానీ సృష్టి ముందున్నాము, నలువైపుల నుండి సృష్టిలోని ఆత్మలందరూ మమ్మల్ని చూస్తున్నారు అని ఎప్పుడూ భావించండి.
ఒకవేళ ఒక్కొక్క పుష్పము ఇంతటి సంపూర్ణంగా మరియు సుందరంగా ఉన్నట్లయితే ఈ తోట యొక్క సుగంధం ఎంతగానో వ్యాపిస్తుంది! కానీ ఎందుకు వ్యాపించడం లేదు? అందుకు మూల కారణము ఏమిటి? సుగంధంతో పాటు అక్కడక్కడ మధ్యలో మిగతా విషయాలు కూడా వచ్చేస్తున్నాయి. సుగంధం ఎంత ఉన్నాకానీ సుగంధంకన్నా త్వరగా దుర్గంధం వ్యాపిస్తుంది. ఒక చిన్న విషయము పూర్తి సుగంధాన్ని సమాప్తం చేసేస్తుంది. అవినాశి సుగంధం ఉన్నవారిని సదా గులాబీలు అని అంటాము. ఒకరు, సదా గులాబీలు, రెండవ వారు గులాబి, మూడవ వారు ఆత్మిక గులాబీలు. మొదటి నంబరులో ఉన్నది ఆత్మిక గులాబీలు. వారు ఆత్మిక స్థితిలో ఉంటారు మరియు ఆధ్యాత్మిక ఆత్మకు సమీపంగా ఉంటారు. ఆత్మిక గులాబీలు ఇలా ఉంటారు. రెండవ క్వాలిటీ వారు సేవలో చాలా బాగా ఉంటారు కానీ ఆత్మిక స్థితిలో తక్కువగా ఉంటారు. సేవలో, ధారణలో మంచిగా ఉంటారు, సంస్కారాలు శీతలంగా ఉంటాయి. స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? ఏ నంబరు పుష్పం మీరు? ఇక్కడ ముల్లు అయితే లేరు. ఉన్నది అందరూ గులాబీలే. కానీ గులాబీలలో కూడా తేడా ఉంది. ఆత్మిక గులాబీల లక్షణాలు ఏమిటి?
మీకు మస్తక రేఖను పరిశీలించడం వచ్చా? జ్యోతిష్యులుగా అయ్యారా లేదా? బాప్దాదా ఏదైతే జ్ఞాన యోగాల జ్యోతిష్యం చూపిస్తున్నారో అందులో ఏమి చూస్తున్నారు? ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నయనాల ద్వారా, మస్తకం ద్వారా తెలుస్తుంది. అందులో కూడా విశేషంగా మస్తకము మరియు నయనాల ద్వారా తెలుస్తుంది. మీరు జ్యోతిష్కులుగా అయ్యి ప్రతి ఒక్కరినీ పరిశీలించగలరా? నయనాలలో మరియు మస్తకంలో ఆ రేఖలు తప్పకుండా ఉంటాయి. ఎవరినైనా పరిశీలించడం కూడా జ్యోతిష్య విద్యయే అవుతుంది. మరి పరిశీలించే ఈ విద్య అనేకులలో తక్కువగా ఉంది. జ్ఞానము మరియు యోగాన్ని నేర్చుకుంటున్నారు కానీ పరిశీలించగలిగే ఈ జ్యోతిష్య విద్యను కూడా తెలుసుకోవాలి. ఎవరైనా వ్యక్తి మీ ముందుకు రాగానే ఆ వ్యక్తి యొక్క మూడు కాలాలను మీరు పసిగట్టగలగాలి. ఒకటి, గతంలో వారి జీవితం ఎలా ఉండినది, వర్తమానంలో వారికున్న వృత్తి, దృష్టి మరియు భవిష్యత్తులో ఎంత వరకు వీరు తమ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోగలరు. ఇది తెలుసుకునే అభ్యాసం చేయండి. పరిశీలించగలిగే ఈ విద్య చాలా తక్కువగా ఉంది. ఈ లోటును ఇప్పుడు నింపండి.
వర్తమాన సమయములో, రాబోయే సమయానికి అవసరమైన ఈ గుణము లేకపోతే, లోటు ఉంటే మోసపోతారు. మీ ముందుకు వచ్చే అనేక ఆత్మలు లోపల ఒకలా, బయటకు మరోలా ఉంటారు. పరీక్షించడానికి వస్తారు. ఎందుకంటే, వీరు కేవలం కంఠస్థము చేసారు అని మీ గురించి అనుకుంటారు. మరి కొందరు ఆర్టిఫిషల్ రూపంలో కూడా పరీక్షించడానికి, భిన్న భిన్న రూపాలలో వస్తారు. కనుక, వీరు ఎందుకు వచ్చారు అని గమనించండి. వారి వృత్తి ఏమిటి? అశుద్ధ ఆత్మలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి కేసులు కూడా వస్తూ ఉంటాయి, రోజురోజుకీ పాపాత్మలైతే చాలా పెరుగుతుంటారు. ఆపదలు, అకాల మరణాలు, పాప కర్మలు పెరుగుతూ ఉంటాయి, వారి కోరికలు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో దాని కారణంగా వారు అశుద్ధ ఆత్మల రూపంలో తిరుగుతూ ఉంటారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిలోనైనా అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తే దానిని పారద్రోలడానికి ఒకటి, ధూపాన్ని వేస్తారు, రెండు నిప్పులో వేడి చేసిన వస్తువును వారికి అంటిస్తారు, ఇంకా, ఎర్రని మిరపకాయను తినిపిస్తారు. మీరందరూ అయితే యోగ అగ్నితో పని చేయాలి. ప్రతి కర్మేంద్రియాన్ని యోగ అగ్నిలో కరిగించాలి అప్పుడు ఏదీ దాడి చేయలేదు. ఎక్కడైనా కొద్దిగా అయినా ఢీలాతనము వస్తే, ఏ కర్మేంద్రియమైనా ఢీలాగా అయితే ప్రవేశత జరగవచ్చు. ఆ అశుద్ధ ఆత్మలు కూడా చాలా శక్తిశాలిగా ఉంటాయి. మాయ పవర్ కూడా తక్కువేమీ కాదు. ఈ విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. అనేక ప్రాకృతిక ఆపదలు కూడా తమ కర్తవ్యాన్ని చేస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి స్వయంలో ఈశ్వరీయ శక్తిని ధారణ చేసుకోవాలి. ఆ సమయంలో స్నేహాన్ని పెట్టుకోకండి. ఆ సమయంలో శక్తి రూపాన్ని ధరించండి. ఏ సమయంలో స్నేహమూర్తిగా అవ్వాలి, ఏ సమయంలో శక్తిరూపాలుగా అవ్వాలి అన్నది కూడా ఆలోచించాలి. ఈ విషయాలన్నింటిలో శక్తి రూపము అవసరము. ఒకవేళ ఇలా ఏదైనా ప్రవేశిస్తే, వాటికి ఎక్కువ స్నేహాన్ని చూపిస్తే నష్టం కూడా జరుగుతుంది. స్నేహము బాప్దాదాతో మరియు దైవీ పరివారంతో ఉండాలి. మిగతా అందరినీ శక్తిరూపంతో ఎదుర్కోవాలి. కొంతమంది పిల్లలు నిర్లక్ష్యం చేసి వారితో కూడా స్నేహంలోకి వచ్చేస్తారు. ఆ స్నేహము పెరిగి బలహీనంగా చేస్తుంది, కనుక, ఇప్పుడు శక్తిరూపాలుగా అవ్వవలసిన ఆవశ్యకత ఉంది.
‘భారత మాత శక్తి అవతారము’ అన్నదే అంతిమ నినాదము. గోపీ మాత అనలేదు. ఇప్పుడు శక్తి రూపము యొక్క పాత్ర. గోపికల పాత్ర సాకారంలో ఉండినది. ఇప్పుడు అవ్యక్త రూపంలో శక్తి యొక్క పాత్ర ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే తమ శక్తి రూపంలో స్థితి అవుతారో ఇంతమంది యొక్క శక్తి కలిసి అద్భుతాన్ని చేయగలదు. స్మృతిచిహ్నానికి గుర్తుగా అంతిమ చిత్రంలో ఏమి చూపించారు? పర్వతాన్ని వ్రేలుతో ఎత్తడము. వ్రేలు, ఇది శక్తిని ఇచ్చేది. దీనితోటే కలియుగ పర్వతము సమాప్తమవుతుంది. ఇందులో ప్రతి ఒక్కరి వ్రేలు అవసరము. ఇప్పుడు ఆ వ్రేలు పూర్తిగా ఇవ్వడం లేదు. తప్పకుండా వేలు లేపుతున్నారు, కానీ కొందరిది ఒకసారి వేలు నేరుగా ఉంటుంది, మరోసారి మరొకరిది వంకరగా ఉంటుంది. పూర్తి వ్రేలు వచ్చినప్పుడు ప్రభావము పడుతుంది. అందరూ ఒకేలా తమ వ్రేలును అందించాలి. ఈ కలియుగ పర్వతానికి త్వరగా తమ వ్రేలును అందించి సత్యయుగ ప్రపంచాన్ని తీసుకురావాలి. సాకారుడిపై ప్రేమ ఉన్నట్లయితే త్వరత్వరగా ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయండి. ఇప్పుడు సేవ ఇంకా అవ్వలేదు కదా అని మీరంటారు. కానీ సేవ కూడా ఎందుకు ఆగి ఉంది? ఒకవేళ మీరందరూ శక్తిరూపంలో స్థితి అయితే దారి తప్పి తిరుగుతున్న మీ భక్తులు, అనాయాసంగానే అయస్కాంతం వద్దకు వచ్చేస్తారు, ఆలస్యం జరగదు. అచ్ఛా!
ఓంశాంతి