Search for a command to run...
23 Oct 1970
మహారథిగా అయ్యే పురుషార్థము
23 October 1970 · తెలుగు
ఆత్మిక డ్రిల్ చేయడం వచ్చా, డ్రిల్‌లో ఏమి చెయ్యవలసి ఉంటుంది? డ్రిల్ అనగా శరీరమును ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వంచగలగడము. ఆత్మిక డ్రిల్ అనగా ఆత్మను ఎక్కడ, ఎలా మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, అక్కడ స్థితి చెయ్యగలగడము అనగా మీ స్థితిని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేసుకోగలగడము, దీనినే ఆత్మిక డ్రిల్ అని అంటాము. ఎలా అయితే సైన్యానికి మార్షల్ (సైన్యము యొక్క ఉన్నత పదాధికిరి) లేక డ్రిల్ మాస్టర్ ఎలా సూచనలను ఇస్తుంటే అలాగే చేస్తారో అలాగే స్వయము కూడా మాస్టర్ లేక మార్షల్‌గా తయారై ఎక్కడ మిమ్మల్ని స్థితి చేసుకోవాలనుకుంటే అక్కడ స్థితి చేసుకోగలగాలి. ఇలా మీకు మీరు డ్రిల్ మాస్టర్లుగా అయ్యారా? మాస్టర్ చేతులు కిందకు దించండి అంటే పిల్లలు చేతులు పైకి ఎత్తటము, మార్షల్ కుడివైపుకు తిరగండి అంటే సైన్యము ఎడమవైపుకు తిరగటము, ఇలా అయితే లేరు కదా! ఇటువంటి సైనికులు లేక స్టూడెంట్లను ఏమి చేస్తారు? డిస్మిస్(బర్తరఫ్). మరి ఇక్కడ కూడా తమకు తామే తమ అధికారము నుండి డిస్మిస్ అయిపోతారు. ఒక్క క్షణములో మీ స్థితిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నిలపగలిగేంతటి అభ్యాసము ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధ స్థలములో ఉన్నారు. యుద్ధ స్థలములో సైన్యము ఒకవేళ ఒక్క క్షణములో డైరెక్షన్‌ను అమలులోకి తీసుకురానట్లయితే వారిని ఏమంటారు? ఈ ఆత్మిక యుద్ధములో కూడా స్థితిని స్థితి చేసుకోవడంలో సమయము పడితే అటువంటి సైనికులను ఏమంటాము? ఈరోజు బాప్‌దాదా పురుషార్థి, మహారథి పిల్లలను చూస్తున్నారు. స్వయాన్ని ఎవరైతే మహారథులుగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. (కొద్దిమంది చేతులెత్తారు) ఎవరైతే మహారథులు కారో వారు స్వయాన్ని ఏమని భావిస్తున్నారు? ఎవరైతే స్వయాన్ని గుర్రపు సవారీగా భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎవరైతే మహారథులలో చేతులెత్తలేదో వారిని బాప్‌దాదా ఒక ప్రశ్న అడుగుతున్నారు. స్వయాన్ని బాప్‌దాదా వారసుడిగా భావిస్తున్నారా? ఎవరైతే తమను గుర్రపుసవారీగా భావిస్తున్నారో వారు తమను వారసులుగా భావిస్తున్నారా? వారసత్వపు సంపూర్ణ అధికారమును తీసుకోవాలా వద్దా? పూర్తి వారసత్వమును తీసుకోవాలన్న లక్ష్యము ఉన్నప్పుడు గుర్రపుసవారీగా ఎందుకు ఉన్నారు? ఒకవేళ గుర్రపుసవారీగా ఉంటే నంబరు ఎక్కడకు పోతుందో తెలుసా? సెకండు గ్రేడు వాళ్ళు ఎక్కడకు వెళతారు, ఇంతటి పాలనను తీసుకొన్న తరువాత కూడా సెకండ్ గ్రేడా! ఒకవేళ చాలా సమయము సెకండ్ గ్రేడ్ పురుషార్థమే ఉన్నట్లయితే వారసత్వమ కూడా చాలా సమయము సెకండ్ గ్రేడ్దే లభిస్తుంది. కొద్ది సమయమే ఫస్ట్ గ్రేడ్‌లో అనుభవము చేస్తారు. సర్వశక్తిమంతుడైన తండ్రి పిల్లలుగా పిలిపించుకునేవారు మరియు వ్యక్తము, అవ్యక్తము ద్వారా పాలనను తీసుకొనేవారిగా ఉంటూ కూడా సెకండ్ గ్రేడా! నోటితో ఇలా అనటము కూడా శోభించం లేదు. లేదంటే ఈ రోజు నుండి తమను సర్వశక్తిమంతుని పిల్లలు అని పిలుచుకోకండి.
బాప్‌దాదా ఇటువంటి పురుషార్థీలను బచ్చే (పిల్లలు) అని అనకుండా ఏమంటారు? తెలుసా? బచ్చే కాదు కచ్చే (పిల్లలు కాదు అపరిపక్వులు). ఇప్పటివరకు కూడా ఇటువంటి పురుషార్థము చెయ్యటము పిల్లల స్వమాన యోగ్యముగా కనిపించడం లేదు. అయినా కూడా బాప్‌దాదా జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇప్పటినుండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని అంటారు. మహారథిగా అవ్వడానికి కేవలము రెండు విషయాలను గుర్తుంచుకోండి. అవి ఏవి? ఒకటి - స్వయమును ఎల్లప్పుడూ సహచరుని తోడుగా ఉంచుకోండి. సాథీ (సహచరుడు) మరియు సారథి, వారే మహారథి. పురుషార్థములో బలహీనతకు రెండు కారణాలు ఉన్నాయి. తండ్రికి స్నేహీగా అయితే అయ్యారు కానీ తండ్రిని సహచరునిగా తయారు చేసుకోలేదు. ఒకవేళ బాప్‌దాదాను ఎల్లప్పుడూ సహచరునిగా చేసుకున్నట్లయితే, ఎక్కడైతే బాప్‌దాదా తోడుగా ఉంటారో అక్కడ మాయ దూరము నుండే మూర్ఛితమైపోతుంది. బాప్‌దాదాను అల్ప సమయము కొరకు సహచరునిగా చేసుకుంటారు, కనుకనే అంతటి శక్తి ప్రాప్తించడం లేదు. ఎల్లప్పుడూ బాప్‌దాదాను తోడు పెట్టుకుంటే, బాప్‌దాదాతో మిలనము చేసుకోవడంలో మగ్నమై ఉంటారు. ఎవరైతే మగ్నమై ఉంటారో వారి లగనము ఇతర వైపులకు ఉండదు. మొదట్లో తండ్రితో పిల్లలు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము, మీతోనే ఆత్మకు సంతోషపరుచుకుంటాము. ఈ మీ ప్రతిజ్ఞను మర్చిపోయారా? ఒకవేళ మొత్తము దినచర్యలో ప్రతి కార్యమును తండ్రితో కలిసి చేసినట్లయితే మాయ డిస్టర్బ్ చెయ్యగలదా? బాబాతో ఉన్నట్లయితే మాయ డిస్టర్బ్ చెయ్యదు. మాయ యొక్క డిస్ట్రక్షన్ (నశించిపోతుంది) జరుగుతుంది. కావున తండ్రికి స్నేహీలుగా అయితే అయ్యారు కానీ తండ్రిని సహచరుడిగా చేసుకోలేదు. చేతిని పట్టుకున్నారు కానీ తోడును తీసుకోలేదు, కనుకనే మాయ ద్వారా గాయమవుతుంది. పొరపాట్లకు కారణము అజాగ్రత్త. అజాగ్రత్త పొరపాటును చేయిస్తుంది.
ఒకవేళ రూహ్(ఆత్మ)ను చూడకుండా రూపము వైపుకు ఆకర్షితమైతే శవముతో ప్రీతిని పెట్టుకుంటున్నామని భావించండి. శవముతో ప్రీతిని పెట్టుకునేవారు మా భవిష్యత్తు శ్మశానములో పని చేసేందుకు నిశ్చితమవుతోందని భావించండి. ఎప్పుడైతే అటువంటి సంకల్పము వస్తుందో అప్పుడు శ్మశానంలోని పాత్రగా భావించండి. లక్ష్యమును మరియు ఉద్దేశ్యమును ఎదురుగా ఉంచుకోండి అని అందరికీ చెప్తారు కదా! కావున ఏ కార్యము చేసినా, ఏ సంకల్పము చేసినా అందుకొరకు కూడా లక్ష్యము మరియు ప్రాప్తిని మీ ఎదురుగా ఉంచుకోండి. సర్వశక్తిమంతుడైన తండ్రి, వరదాత ద్వారా మీ కల్పకల్పపు ఈ పాత్ర యొక్క వారసత్వమును తీసుకొనేందుకు వచ్చారు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేవారు శ్మశానములో పాత్రను స్థిరం చేసుకొనేందుకు వచ్చారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పిల్లలెవరైతే తమ పొరపాట్లను ఒకసారి తండ్రి ముందు ఉంచుతారో వారు తండ్రి ముందు తమ లోపాలను పెట్టిన తరువాత కూడా ఒకవేళ మళ్ళీ చేసినట్లయితే క్షమాసాగరునితో పాటు 100రెట్ల శిక్ష కూడా డ్రామా అనుసారంగా స్వతహాగనే లభిస్తుందని భావించండి. స్వయాన్ని 100 రెట్ల దండన నుండి రక్షించుకునేందుకు ఎల్లప్పుడూ బాప్‌దాదాను మీ ముందు ఉంచుకోండి. ప్రతి అడుగు బాప్‌దాదాను ఫాలో చేస్తూ వెళ్ళాలి. ప్రతి సంకల్పమును, ప్రతి కార్యమును అవ్యక్త బలముతో అవ్యక్త రూపము ద్వారా వెరిఫై చేయించుకోండి. ఎలా అయితే సాకారములో తోడుగా ఉన్నప్పుడు వెరిఫై చేయించుకున్న తరువాత ప్రాక్టికల్లోకి వచ్చేవారో, అలాగే బాప్‌దాదాను అవ్యక్త రూపములో ఎల్లప్పుడూ సమ్ముఖముగా లేక తోడుగా ఉంచుకోవటం ద్వారా ప్రతి సంకల్పము మరియు ప్రతి కార్యము వెరిఫై చేయించుకుని తర్వాత చేయటం ద్వారా ఎటువంటి వ్యర్థ వికర్మ జరగదు. ఎవరిద్వారా అయినా ఏ విషయమైనా వింటే, విషయాల రాగములోకి వెళ్ళకుండా అందులోని రహస్యాన్ని తెలుసుకోండి. రాజ్ (రహస్యము)ను వదిలి సాజ్ (రాగము)ను వినటం ద్వారా నాజూకుతనము వస్తుంది. ఫలానా వారు అలా అన్నారు, అందుకే అలా జరిగింది అని ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. ఎవరు చేస్తారో వారే పొందుతారు, దీనిని మీ ముందు ఉంచుకోండి. ఇతరుల సంపాదనను ఆధారము చేసుకోవద్దు. ఇతరుల సంపాదనపై మీ కళ్ళు పోకూడదు, ఆ కారణంగానే ఈర్ష్య కలుగుతుంది. ఇందుకొరకు ‘తమలోని విశేషతల్ని ఎంత తల్చుకుంటారో అంత నషా పెరుగుతుంది’ అన్న తండ్రి స్లోగన్‌ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇతరుల నషాను మీ నిషానా(లక్ష్యము)గా చేసుకోవద్దు. బాప్‌దాదా గుణాలు మరియు కర్తవ్యాలను మీ లక్ష్యముగా చేసుకోండి. బాప్‌దాదాతో పాటు నేను కూడా అధర్మ వినాశనము మరియు సత్ధర్మ స్థాపనా కర్తవ్యమునకు నిమిత్తముగా అయి ఉన్నాను అని ఎల్లప్పుడూ బాప్‌దాదా కర్తవ్యమును స్మృతిలో ఉంచుకోండి. ఎవరైతే అధర్మ వినాశనము కొరకు నిమిత్తమై ఉన్నారో వారు స్వయం అధర్మ కార్యము లేక దైవీ మర్యాదలను అతిక్రమించే కర్తవ్యమును ఎలా చెయ్యగలరు? నేను మాస్టర్ మర్యాదా పురుషోత్తముడను, కావున మర్యాదలను అతిక్రమించలేను. ఇటువంటి స్మృతిని ఉంచటం ద్వారా సమానమైన మరియు సంపూర్ణ స్థితి తయారవుతుంది. అర్థమైందా! తక్కువ ఆలోచించండి, కర్తవ్యము అధికంగా చెయ్యండి. కేవలం ఆలోచించటములోనే సమయాన్ని వృధా చేసుకోవద్దు. సృష్టి వినాశనమునకు ముందే బలహీనతలు మరియు లోపాల వినాశనమును చెయ్యండి.
భట్టీ వారు భట్టీలో తమ రూపము, రంగు మరియు ప్రకాశమును మార్చుకున్నారు. అనేక రూపాలను మార్చటమును అంతం చేసుకున్నారా? సదా కొరకు ఆత్మిక రూపము కనిపించాలి, అలా మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నారా? చిక్కుల నామరూపాలు కూడా ఉండనంతగా మిమ్మల్ని మీరు ఉజ్వలంగా తయారు చేసుకున్నారా? అల్పకాలము కొరకు ప్రతిజ్ఞ చేసారా లేక అంతిమకాలము వరకు ప్రతిజ్ఞ చేసారా? మీ పాత విషయాలను, పాత సంస్కారాలను అలా పరివర్తన చేయాలి. ఎలా అయితే జన్మ పరివర్తన తరువాత పాత జన్మ విషయాలు మర్చిపోతారో అలా పాత సంస్కారాలను భస్మము చేసారా లేక అస్థికలను(ఎముకలను) ఉంచారా? అస్థికలలో మళ్ళీ భూతము ప్రవేశిస్తుంది. కావున అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరములో కలిపేసి వెళ్ళాలి. దాచి ఉంచుకొని మీతో తీసుకు వెళ్ళవద్దు. లేకపోతే మీ అస్థికలు స్థితిని కదిలిస్తూ ఉంటాయి. సంకల్పాల సమాప్తిని చెయ్యాలి. అచ్ఛా!
పిల్లలైన మీరందరూ సింహాసనాధికారులుగా అయ్యేందుకు పురుషార్థము చెయ్యాలి, అంతేకానీ సింహాసనాధికారుల ముందు ఉండేందుకు కాదు. ఇప్పుడు సమీపంగా ఉన్నప్పుడే అప్పుడు సింహాసనాధికారులుగా అవుతారు. ఎవరు ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా సమానతతో ఉంటారు. పిల్లలైన మీ నయనాలను ఎవరైనా చూస్తే వారికి ముక్తి-జీవన్ముక్తుల దారి కనిపించాలి. అలా నయనాలలో ఇంద్రజాలము ఉండాలి. మరి మీ నయనాలు ఎంతో సేవ చేస్తాయి. నయనాలు కూడా సేవ చేస్తాయి మరియు మస్తకము కూడా సేవ చేస్తుంది. మస్తకము ఏమి చూపిస్తుంది, ఆత్మలనా? తండ్రిని. మీ మస్తకముతో తండ్రి పరిచయము ప్రాప్తించాలి, అటువంటి సేవను చెయ్యాలి. అప్పుడే సమీప సితారలుగా అవుతారు. సాకారములో తండ్రిని చూసారు కదా, మస్తకము మరియు నయనాలు సేవ చేసేవి. మస్తకములో జ్యోతి బిందువు ఉండేది, నయనాలలో ప్రకాశవంతమైన త్రిమూర్తి స్మృతి ఉండేది. ఇలా సమానంగా అవ్వాలి. సమానంగా అయితేనే సమీపంగా అవుతారు. ఎప్పుడైతే మీరు స్వయం అటువంటి స్థితిలో ఉంటారో అప్పుడు మాయ ఏమి చేస్తుంది, మాయ స్వయమే అంతమైపోతుంది. పిల్లలైన మీరు రెగ్యులర్‌గా అవ్వాలి. రెగ్యులర్ అని బాప్‌దాదా ఎవరిని అంటారు? ఎవరైతే ఉదయము నుండి రాత్రి వరకు ఏ కర్తవ్యమును చేసినా దానిని శ్రీమతం ప్రమాణంగా చేస్తారో వారినే రెగ్యులర్ అని అంటాము. అన్నింటిలో రెగ్యులర్. సంకల్పములో, వాణిలో, కర్మలో, నడవడికలో, నిద్రించుటలో, అన్నింటిలో రెగ్యులర్. రెగ్యులర్ వస్తువు మంచిగా అనిపిస్తుంది. ఎవరు ఎంతగా రెగ్యులర్‌గా ఉంటారో అంతగా ఇతరుల సేవను మంచిగా చెయ్యగలరు. సర్వీసబుల్ అనగా ఒక్క సంకల్పము కూడా సేవ లేకుండా నడవకూడదు. ఇటువంటి సర్వీసబుల్ ఇతర ఋజువును తయారు చెయ్యగలరు. సేవ కేవలము నోటిదే కాదు, సర్వ కర్మేంద్రియాలు సేవ చెయ్యటంలో తత్పరమై ఉండాలి. ఏ విధంగా నోరు బిజీగా ఉంటుందో అలా మస్తకము, నయనాలు సేవలో బిజీగా ఉండాలి. అన్నిరకాల సేవలను చేసి సేవా రుజువును ఇవ్వాలి. ఒకే విధమైన సేవతో ప్రమాణము వెలువడదు, కేవలము ప్రశంసిస్తారు. కావలసింది ప్రమాణము, కావున ప్రమాణమును ఇచ్చేందుకు అన్ని రకాల సేవలలో సదా తత్పరులై ఉండాలి. ఎంతగా సర్వీసబుల్గా ఉంటారో అంతగా తమ సమానంగా తయారుచేస్తారు. తర్వాత తండ్రి సమానంగా తయారు చేస్తారు. అచ్ఛా!
ఓంశాంతి