Brahma Kumaris
Brahma KumarisMurli
  • Home
  • Murli Search
  • Murli Topics
  • Murli Chintan
  • AI Murli Chintan (ChatGPT)
Languages
  • EEnglish
  • हहिंदी
  • ગગુજરાતી
  • తతెలుగు
Library
  • Overview
    • Favorites
    • Notes & Highlights
    • Collections
    • Tracker
  • Settings
  • BKOne

19 June 1970 | తెలుగు19 June 1970 | తెలుగు · త్రిమూర్తి లైట్ల సాక్షాత్కారము

HomeSearchBKOneLibrarySettings
18 Jun 1970Prev25 Jun 1970Next

త్రిమూర్తి లైట్ల సాక్షాత్కారము

బ్రాహ్మణులను త్రిమూర్తి శివ వంశీయులు అని అంటారు కదా! త్రిమూర్తి తండ్రి పిల్లలు కూడా త్రిమూర్తులే. తండ్రి కూడా త్రిమూర్తి. తండ్రి ఏవిధంగా త్రిమూర్తియో అలా మీరు కూడా త్రిమూర్తులేనా? మూడు రకాల లైట్లు సాక్షాత్కారమవుతున్నాయా? బ్రాహ్మణులకున్న మూడు రకాల లైట్లు ఏవైతే సాక్షాత్కారమవుతాయో అవి ఏమిటో తెలుసా? మీ నుండి లైట్ సాక్షాత్కారమవుతుంది, అది మీకు తెలుసా? త్రిమూర్తి వంశీయులైన త్రిమూర్తి పిల్లల నుండి మూడు రకాల లైట్లు సాక్షాత్కారమవుతాయి, అవి ఏ లైట్లు ? ఒకటేమో-నయనాల ద్వారా లైటు సాక్షాత్కారము. కంటి జ్యోతి అని అంటారు కదా! నయనాలు ఎలా కనిపిస్తాయంటే రెండు నయనాలలో రెండు పెద్ద బల్బులు వెలుగుతున్నట్లుగా ఉంటాయి. రెండవది-మస్తకములోని లైటు. మూడవది-తలపై ప్రకాశ కిరీటము. ఈ మూడు లైట్లూ సాక్షాత్కారమయ్యేందుకు ఇప్పుడు ప్రయత్నము చెయ్యాలి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి ఈ నయనాలు బల్బుల్లా కనిపించాలి. జ్యోతియే జ్యోతి కనిపించాలి. అంధకారములో నిజమైన వజ్రము మెరిసినట్లుగా ఉండాలి. సెర్చిలైటు ఉంటుంది కదా, చాలా ఫోర్సుతో ఇంకా మంచిగా వ్యాపింపచేస్తుంది. ఈ విధముగా మస్తకములోని లైటు సాక్షాత్కారముంటుంది. తలపై ఉన్న లైటు కిరీటము గురించైతే తెలుసు కదా! ఈ విధంగా ప్రతి ఒక్కరి నుండి లైటు ఒక్కొక్కరి నుండి సాక్షాత్కారమవ్వాలి, అప్పుడే వీరు ఫరిశ్తాలుగా ఉన్నారు అని అంటారు. సాకారములో నయనాలు, మస్తకము మరియు తలపై కిరీటముల సాక్షాత్కారము స్పష్టమవుతుంది.

నయనాలను చూస్తూ చూస్తూ లైటును చూస్తారు. మీ లైటును చూసి ఇతరులు కూడా లైటులా అయిపోతారు. వారు మనసుతో, స్థితితో ఎంత భారంగా ఉన్నాగానీ, రావటంతోనే తేలికగా అయిపోవాలి. అటువంటి స్థితిని ఇప్పుడు పట్టుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని చూసిన ఇతరులందరూ కూడా వారి స్థితిని ఇలా తయారుచేసుకుంటారు. ఇప్పటినుండే మీ గాయనము వింటారు. ద్వాపరములోని గాయనము పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇటువంటి సాక్షాత్కారమూర్తులుగా, సాక్షాత్ మూర్తులుగా తయారవటం ద్వారా ఇప్పటి మీ గాయనమును వింటారు. మీ ఎదురుగా రావటంతోనే కేవలం లైటే కనిపించాలి, అలా అవ్వాలి. మధువనమే ప్రకాశ ధామముగా అయిపోతుంది. ఈ దీపాలు మొదలైనవి చూస్తూ కూడా చూడరు. వతనములో ఏవిధంగా మొత్తము లైటే కనిపిస్తుందో అలా ఈ స్థూల వతనము లైట్ హౌస్‌గా అయిపోతుంది. మీరు చైతన్య లైట్ హౌస్‌గా అయినప్పుడు ఈ మధువనము కూడా లైట్ హౌస్‌గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాక్టికల్‌లో చివరి చదువు యొక్క చివరి సబ్జెక్టు ఇదే. థియరీ కోర్సు సమాప్తమైపోయింది. ఇది ప్రాక్టికల్ కోర్సులోని చివరి సబ్జెక్టు. ఈ లాస్ట్ సబ్జెక్టులో చాలా వేగవంతమైన పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది. ఇటువంటి స్థితికే గాయనము ఉంది.

బాప్‌దాదాతో ఎప్పుడూ వీడ్కోలు తీసుకోవడం ఉండదు. మాయతో వీడ్కోలు ఉంటుంది. బాప్‌దాదాతో అయితే మిలనము ఉంటుంది. ఈ కొద్ది సమయపు మిలనము సదా మిలనము చేసుకోవటానికి సదా నిమిత్తముగా అవుతుంది. తండ్రితో గుణములు మరియు కర్తవ్యములు కలవటమే మిలనము. ఈ ప్రయత్నమునే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అచ్ఛా!

సంకల్పాలకు బ్రేకు వేసేందుకు ముఖ్యమైన సాధనము ఏమిటి? తెలుసా? ఏ కార్యము చేస్తున్నా, చేసేముందు ఆలోచించి తర్వాత కార్యమును ప్రారంభించండి. నేను ఏ కార్యమునైతే చెయ్యటానికి వెళ్తున్నానో అది బాప్‌దాదా కార్యమేనా? నేను నిమిత్తమాత్రుడిని. కార్యము సమాప్తము చేసినప్పుడు, ఏవిధంగా యజ్ఞమును రచించినప్పుడు సమాప్తి సమయములో ఆహుతిని ఇవ్వటం జరుగుతుందో, అదేవిధంగా, ఏ కర్తవ్యమునైతే చేసారో, ఏ పరిణామమైతే వెలువడిందో దానిని తండ్రికి సమర్పణ, స్వాహా చేసెయ్యాలి, ఇక వేరే సంకల్పములేవీ ఉండకూడదు. నిమిత్తంగా అయ్యి కార్యమును చేసారు. కార్యము సమాప్తమైనప్పుడు స్వాహా చేసేసారు, ఇంక ఏం సంకల్పాలు కలుగుతాయి? ఏవిధంగా అగ్నిలో ఏదైనా వస్తువు వేసినప్పుడు ఇక దాని నామరూపాల అంశము కూడా ఉండదో అలా ప్రతి విషయంలోనూ, సమాప్తి సమయంలో సమర్పణ, స్వాహా చెయ్యాలి, అప్పుడు ఇంక మీ బాధ్యత ఏమీ ఉండదు. ఎవరికైతే అర్పణ చేసారో ఇక బాధ్యులు కూడా వారే అవుతారు. మరిక సంకల్పాలెందుకు? ఏవిధంగా ఇంటి పెద్దలకు ఏ కార్యము చేసినా దానిని పెద్దవారికి వినిపించి ఖాళీ అయిపోతారో అలాగే ఏదైనా కార్యము చేసారు, సమాచారము ఇచ్చారు. అయిపోయింది. ఇక అవ్యక్తరూపుని ఎదురుగా ఉంచుకొని దీనిని చేసి చూడండి. ఎవరు ఎంతగా సహయోగిగా అవుతారో వారికి అదనపు సహయోగమును ఇవ్వవలసి ఉంటుంది. ఏవిధంగా మీ ఆత్మ ఉన్నతి గురించి ఆలోచిస్తారో, అదేవిధంగా శుభ భావన, శుభ చింతక మరియు శుభ చింతన రూపములో అదనపు సహాయమును రెండు రూపాలతో  ఏ ఆత్మకైనా విశేష సహయోగముగా ఇవ్వవచ్చు. ఇవ్వాలి. దీని ద్వారా చాలా సహాయము లభిస్తుంది. పేదవారికి అనుకోకుండా కష్టపడకుండానే ప్రాప్తి లభిస్తే ఎలా ఉంటుందో, అలా ఏ ఆత్మకైనా అదనంగా సహయోగము ఇచ్చినట్లయితే ఆ ఆత్మకు కూడా మాకు విశేషమైన సహయోగము లభించింది అని అనుభవమవుతుంది. సాకార రూపములో కూడా ఏ ఆత్మకైనా అదనపు సహయోగమును ఇచ్చే ఋజువును చేసి చూపించారు కదా! ఆ ఆత్మకు స్వయము కూడా అనుభవమయ్యేది. ఈ సేవను చేసి చూపించాలి. మీరు ఎంతెంతగా మీరు సూక్ష్మమవుతూ ఉంటారో అంతంతగా ఈ సూక్ష్మ సేవ కూడా పెరుగుతూ ఉంటుంది. స్థూలముతో పాటు సూక్ష్మ ప్రభావము త్వరగా పడుతుంది, అది కూడా సదాకాలము కొరకు. బాప్‌దాదా కూడా విశేష సహయోగమును ఇస్తారు. అదనపు సహాయము అనుభవమవుతుంది. శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ. అచ్ఛా!

బాప్‌దాదా పిల్లలపై ఎంతగా అవినాశీ స్నేహమును ఉంచుతారో అంతగా పిల్లలు అవినాశీ స్నేహమును ఉంచుతున్నారా? ఈ అవినాశీ స్నేహము ఒక దారము వంటిది, ఇదే 21 జన్మల బంధనమును జోడిస్తుంది. అదీ తెగిపోని స్నేహము. ఎంతగా దారము పక్కాగా ఉంటుందో అంత ఎక్కువకాలం అది ఉంటుంది. ఈ సంగమయుగములోని సమయము 21 జన్మలను జోడిస్తుంది. ఈ సంగమయుగములోని ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క కర్మ 21 జన్మల బ్యాంకులో జమ అవుతాయి. సంకల్పమును కూడా ఇంతటి అటెన్షన్‌ను ఉంచి చెయ్యాలి. ఏదైతే చేస్తానో అదే జమ అవుతుంది. మరి ఎంత జమ అవుతుంది! ఒక్క సంకల్పము కూడా వ్యర్థముగా పోకూడదు. ఒక్క సంకల్పమైనా వ్యర్థముగా పోయిందంటే జమలో కట్ అవుతుంది. కావున జమ చేసుకోవాలంటే ఒక్కటి కూడా వ్యర్థముగా ఉండకూడదు. ఎంతగా పురుషార్థము చెయ్యవలసి ఉంటుంది! సమయము సంగతి వదలండి, సంకల్పము కూడా వ్యర్థముగా పోకూడదు. ఇప్పుడు పురుషార్థము ఈ సరిహద్దు వరకు చేరుకుంటూ ఉంది. ఏవిధంగా చదువు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటుందో, ఇది కూడా అలాంటిదే. పెద్ద క్లాసులో చదువుకుంటున్నారు కదా. అచ్ఛా!

Read in Other Languages

EEnglishहहिंदीગગુજરાતી

Murli Topics

दिव्य नेत्र - Divine Eyeमन /संकल्प /चित्त सुभ संकल्प ढृढ़ संकल्प - Determined,Thoughts,Consciousness,positive Thoughtsफरिस्ता स्वरुप - Angelरूहानी पढ़ाई - Spiritual study / Marksबापसामान सामान - Like Fatherमन्सा सेवा (Service through mind)साकार वतन और _Corporeal World Avyakt Worldजमा का खाता - Account of balanceदो बाते - Two thingतीन बात - Three thing